గడ్డుకాలం... అద్దె భారం! | Private hostels closing with lockdown effect | Sakshi
Sakshi News home page

గడ్డుకాలం... అద్దె భారం!

Published Thu, Jun 4 2020 5:20 AM | Last Updated on Thu, Jun 4 2020 5:20 AM

Private hostels closing with lockdown effect - Sakshi

ఇంజనీరింగ్‌ కాలేజీ విద్యార్థుల కోసం వెంకట్‌రెడ్డి అనే వ్యక్తి బీఎన్‌రెడ్డి నగర్‌లో ఓ హాస్టల్‌ ఏర్పాటు చేశాడు. మంచి భోజనం, వసతి ఉండటంతో విద్యార్థుల సంఖ్య  పెరిగింది. దీంతో సమీపంలోని మరో రెండుచోట్ల హాస్టళ్లను తెరిచాడు. మూడు హాస్టళ్లలో 320 మంది విద్యార్థులున్నారు. బోర్డర్స్‌ను ఆకర్షించేందుకు హైస్పీడ్‌ బ్రా డ్‌బ్యాండ్‌తో ఉచిత వైఫై, ఎమర్జెన్సీ రైడ్‌ కోసం 12 మోపెడ్‌లను ఉచిత సర్వీసు కిం ద ఇస్తున్నాడు. మూడుచోట్ల భవనాలు అద్దెకు తీసుకోగా ప్రతి నెలా రూ. 1.80 లక్షలు చెల్లిస్తున్నాడు. కరోనా దెబ్బకు ప్రస్తుతం ఈ మూడు హాస్టళ్లు మూతబడ్డా యి. ఫలితంగా భవనాల అద్దె భారం కాగా... ఇంటర్నెట్‌ బిల్, మోపెడ్‌ల నెలవా రీ ఇన్‌స్టాల్‌మెంట్‌ తడిసిమోపెడవుతోంది. దీంతో రెండుచోట్ల హాస్టల్‌ భవనాలను ఖాళీ చేశాడు. ఒక హాస్టల్‌ భవనానికి మాత్రం అప్పు చేసి అద్దె భరిస్తున్నాడు.

సాక్షి, హైదరాబాద్‌: దూర ప్రాంతంలో కొలువొచ్చినా... మంచి విద్యా సంస్థలో సీటొచ్చినా... కొత్త కోర్సును అభ్యసిం చేందుకు నగరంలోని కోచింగ్‌ సెంటర్‌ను ఎంచుకుని వెంటనే జాయిన్‌ అయినా... వెంటనే మదిలో మెదిలే ప్రశ్న ‘వసతి ఎలా’ అని. గతంలో రూమ్‌ అద్దెకు తీసుకోవడమో లేక బ్యాచ్‌లర్స్‌ రూమ్‌లో చేరడమో చేసేవారు. కానీ మారిన పరిస్థితుల్లో వెంటనే చక్కని హాస్టల్‌ను చూసి చేరిపోతున్నారు. ఇలాంటి హాస్టళ్లు రాష్ట్రవ్యాప్తంగా నాలుగు వేలకు పైగా ఉన్నట్లు ఓ అంచనా. ప్రస్తుతం లాక్‌డౌన్‌ కారణంగా ఈ హాస్టళ్లు మూతబడ్డాయి. సకల సౌకర్యాలతో వసతి ఇచ్చే హాస్టళ్లకు ఇప్పుడు గడ్డుకాలం నెలకొంది. కరోనా వైరస్‌ వ్యాప్తిని నిలువరించే క్రమంలో భౌతిక దూరానికి ప్రాధాన్యత ఇవ్వాల ని నిర్ణయించిన నేపథ్యంలో ఈ హాస్టళ్లను ప్రభుత్వం మూసివేసింది. రోజురోజుకూ వైరస్‌ ప్రభావం తీవ్రమవు తుండడంతో ఈ హాస్టళ్లు మరి కొంతకాలం మూసివేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఈ నిర్ణయంతో హాస్టల్‌ నిర్వాహకులు నష్టాల్లో మునిగిపోయారు. హాస్టళ్లు మూతపడి రెండున్నర నెలలు పూర్తయింది. నిర్వహణ నిలిచిపోయి నప్పటికీ హాస్టల్‌ కోసం తీసుకున్న భవనానికి అద్దె చెల్లించాలి. నిర్వహణ కోసం తీసుకున్న రుణానికి వా యిదాల చెల్లింపులు, పని మనుషుల వేతనాలు... ఇలా ఆర్థిక భారంతో నిర్వాహకులు లబోదిబోమంటున్నారు.

అద్దె... గుదిబండ...
వసతి రంగానికి మంచి డిమాండే ఉంది. ప్రైవేటు రంగంలో పనిచేసే యువత మొదలు విద్యార్థులంతా హాస్టల్‌లో ఉండటానికే మొగ్గు చూపుతున్నారు. ఖాళీ సమయంలో ఇతర వ్యాపకాలు చేసుకు నేందుకు అవకాశం ఉండటంతో ప్రైవేటు హాస్టళ్లు ఇబ్బడిముబ్బడిగా పెరిగి పోయాయి. హైదరాబాద్‌ నగరంలో రెండున్నర వేలకు పైగా లగ్జరీ, డీలక్స్‌ హాస్టళ్లున్నాయి. ఇందులో వసతి పొందేం దుకు నెలకు రూ.3,500 నుంచి రూ.6 వేల వరకు సౌకర్యాలకు తగినట్లు నెలవారీ ఫీజులుంటాయి. కొన్ని హాస్టళ్లు విద్యా సంస్థలు, వాణిజ్య సముదాయా లతో అనుసంధానంగా కూడా నడుస్తున్నాయి. మెజార్టీ హాస్టళ్లు 50 మంది నుంచి 150 మందితో నిర్వహిస్తున్నారు. సక్సెస్‌ఫుల్‌గా నడుస్తున్న ఈ యూనిట్లు ఇప్పుడు తీవ్ర కష్టాల్లో చిక్కుకున్నాయి.

లాక్‌డౌన్‌ కారణంగా వీటిని మూసివే యడంతో బోర్డర్లు ఖాళీ చేశారు. ఫలితంగా హాస్టల్‌ మూతబడినప్పటికీ అద్దె భవనంలో ఉండడంతో యజమానికి నెలవారీ కిరాయి చెల్లించాల్సిందే. మార్చి, ఏప్రిల్‌ నెలలో కొంత భారమనుకున్నా చాలా మంది హాస్టల్‌ నిర్వాహకులు అద్దె చెల్లించగా... మే నెలలో మాత్రం చేతులె త్తేశారు. మరో మూడు నెలలు ఇదే పరిస్థితి ఉండటంతో యజమానిని బతిమాలుకుం టున్నారు. కొందరు అద్దెలో సగం ఇచ్చేం దుకు ప్రతిపాదిస్తుండగా... మరికొందరు నిర్వహణ భారం తో భవనాన్ని ఖాళీ చేసేందుకే మొగ్గు చూపుతున్నారు.

ఎల్‌బీ నగర్, బీఎన్‌రెడ్డి నగర్, ఇబ్రహీం పట్నం, సైదాబాద్, ఐఎస్‌సదన్‌ ప్రాంతాల్లో దాదాపు 37 హాస్టల్‌ భవనాలు ఖాళీ అయినట్లు సమాచారం. మరోవైపు హాస్టల్‌ సిబ్బందికి వేతనాలు భారమవుతున్నాయి. ఇతర సిబ్బందిని పని నుంచి తొలగించినప్పటికీ వంట మాస్టర్లకు మాత్రం నెలవారీ వేతనాలు చెల్లిస్తున్నట్లు ఎల్‌బీనగర్‌లోని ఓ హాస్టల్‌ నిర్వాహకుడు తెలిపారు. పరిస్థితి అనుకూలించేందుకు మరో మూడు నెలలుపట్టే అవకాశంఉందని, ఈలోపు చాలా మంది నిర్వాహకులు తప్పుకునే అవకాశం ఉందని ఇబ్రహీంపట్నంకు చెందిన నిర్వాహకుడు రవీందర్‌ అంటున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement