private teacher
-
బుద్ది తెలుసుకొని ఉన్న ఉద్యోగం పీకేశారు.. మళ్లీ నగ్నఫొటోలు, వీడియోలు..
సాక్షి, హైదరాబాద్: ఓ మైనర్ బాలికకు అసభ్యకరంగా మెసేజ్‌లు పంపించిన ఓ ప్రైవేటు ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదైంది. రాచకొండ సైబర్ క్రైమ్ ఏసీపీ ఎస్ హరినాథ్ వివరాల ప్రకారం.. జగిత్యాల్‌కు చెందిన రేగొండ వెంకట సాయి (31) ప్రైవేట్ స్కూల్ టీచర్. విద్యార్థినుల ఫోన్ నంబర్లను సేకరించి ప్రతి రోజూ వాళ్లతో చాటింగ్ చేసేవాడు. అతని అసభ్య ప్రవర్తన యాజమాన్యం దృష్టికి రావటంతో అతన్ని ఉద్యోగంలో నుంచి తొలగించారు. ఈ క్రమంలో వెంకట సాయి తన ఫోన్లో మొబైల్ యాప్‌లను డౌన్లోడ్ చేసుకొని వర్చువల్ నంబర్లను తీసుకున్నాడు. వాట్సాప్ ద్వారా ఓ గుర్తు తెలియని వ్యక్తిగా మైనర్ బాలికకు మెసేజ్‌లు చేయడం మొదలు పెట్టాడు. అంతటితో ఆగకుండా తనను ప్రేమిస్తున్నాని చెప్పడంతో అప్పటి నుంచి సదరు బాలిక రిప్లై ఇవ్వటం మానేసింది. దీంతో కక్ష గట్టిన వెంకటసాయి సదరు బాలికతో పాటు ఆమె తల్లికి నగ్న ఫొటోలు, వీడియోలను పంపించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు మంగళవారం వెంకటసాయిని అరెస్ట్ చేశారు. చదవండి: (కీచక హెచ్ఎం.. విద్యార్థినితో రాసలీలలు.. వీడియోలు వైరల్) -
భర్త పాఠశాలకు వెళ్లొద్దాన్నాడని.. భార్య ఎంత పనిచేసిందంటే..
పరవాడ(విశాఖ జిల్లా): భర్త పాఠశాలకు వెళ్లొద్దాన్నాడని మనస్తాపంతో ఓ ప్రైవేట్ స్కూల్ టీచర్ ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పరవాడ మండలం కన్నూరు గ్రామంలో సోమవారం ఉదయం చోటు చేసుకుంది. పరవాడ ఎస్ఐ సిరపరపు సురేష్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సబ్బవరం మండలం ఆదిరెడ్డిపాలేనికి చెందిన చింతల అప్పారావుకు మల్కాపురానికి చెందిన పెంబులి లక్ష్మి కుమార్తె రాజేశ్వరితో 2012లో వివాహమైంది. దంపతులిద్దరూ కన్నూరు రామాలయం వెనక వీధిలో ఓ అద్దె ఇంట్లో ఆరేళ్లుగా నివాసం ఉంటున్నారు. వీరికి వంశీ(5), వివేక్(3) పిల్లలున్నారు. చదవండి: కట్టుకున్న భర్తను హతమార్చి.. నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి.. అప్పారావు కశింకోట మండలంలోని ఓ పాఠశాలలో కాంట్రాక్టు టీచర్‌గా పని చేస్తున్నాడు. డిగ్రీ వరకు చదువుకున్న రాజేశ్వరి నాలుగు నెలల నుంచి తోటాడలో ఓ ప్రైవేటు పాఠశాలలో టీచరుగా పని చేస్తోంది. భార్యభర్తలు అన్యోన్యంగా జీవనం సాగిస్తున్నారు. ఇదిలా ఉండగా రాజేశ్వరిని స్కూల్‌కు వెళ్లడం మానేసి ఇంటి దగ్గర ఉంటూ పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని అప్పారావు కొంత కాలం నుంచి చెబుతున్నాడు. సోమవారం ఉదయం అప్పారావు స్కూల్‌కు వెళ్లేటప్పుడు భార్యకు మళ్లీ అదే విషయాన్ని చెప్పాడు. దీంతో మనస్తాపం చెందిన రాజేశ్వరి లుంగీతో ఇంట్లో ఫ్యాన్ హుక్కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. అక్కడే ఉన్న చిన్న కుమారుడు ఏడుపుతో చుట్టు పక్కల వారు వచ్చి రాజేశ్వరిని కిందకు దించారు. అప్పటికే రాజేశ్వరి మృతి చెందింది. తన కుమార్తె మృతిపై తమకు ఎటువంటి అనుమానం లేదని మృతిరాలి తల్లి లక్ష్మి పరవాడ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కేజీహెచ్‌కు తరలించి, పరవాడ సీఐ పెదిరెడ్ల ఈశ్వరరావు పర్యవేక్షణలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ సురేష్ తెలిపారు. -
బాలికలపై అకృత్యాలకు తెగబడ్డ ప్రైవేట్ టీచర్
-
ఫేస్బుక్ పరిచయం.. బాలికపై ప్రైవేటు టీచర్ లైంగికదాడి
సాక్షి, మదనపల్లె(చిత్తూరు): బాలికకు ఫేస్బుక్ ద్వారా పరిచయమైన ఓ ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయుడు ప్రేమిస్తున్నట్లు నమ్మించి, పలుసార్లు లైంగిక దాడికి పాల్పడిన సంఘటన మదనపల్లె పట్టణంలో బుధవారం వెలుగు చూసింది. వన్‌టౌన్ పోలీసుల కథనం మేరకు వివరాలు. పట్టణానికి చెందిన బాలిక(17)తో ఎన్వీఆర్ లే అవుట్‌కు చెందిన ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయుడు దినేష్(26), ఫేస్బుక్ ద్వారా పరిచయం పెంచుకున్నాడు. గత 9 నెలలుగా వీరు ఫేస్బుక్లో చాటింగ్‌లు చేసుకునేవారు. ఈ నేపథ్యంలో తాను ప్రేమిస్తున్నానని పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. బాలికపై పలుసార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే తాను ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. కొన్ని రోజులుగా ఈ విషయం గోప్యంగా ఉంచిన బాలిక, దినేష్ వేధింపులు ఎక్కువ కావడంతో ఈ విషయం తన చిన్నమ్మకు చెప్పింది. వారిద్దరి ఫిర్యాదు మేరకు దినేష్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు ఎస్ఐ లోకేష్ తెలిపారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. చదవండి: హైదరాబాద్‌లో హిజ్రాల హల్చల్.. డబ్బులు డిమాండ్.. ఆపై! ప్రియుడితో గొడవ.. ఆ నీళ్లు తాగితే బాధ మర్చిపోతావ్! -
‘ఆ నలుగురూ’.. స్నేహితులే
కొమరోలు: కరోనా దెబ్బకు బంధాలన్నీ బలహీనమైపోతున్నాయి. కొన్ని రోజుల కిందట వరకు నవ్వుతూ పలకరించిన వారే.. ఇప్పుడు ముఖం చాటేస్తున్నారు. చుట్టుపక్కల ఎవరైనా అనారోగ్యంతో చనిపోతే చాలు.. ఇళ్లకు తాళాలు వేసుకొని వెళ్లిపోతున్నారు. అంత్యక్రియలు చేసేందుకు సైతం ముందుకు రాలేనంతగా హడలిపోతున్నారు. ఈ పరిస్థితుల్లో కూడా కొందరు ముందుకు వచ్చి సాయం చేస్తూ ‘ఆ నలుగురు’గా నిలుస్తున్నారు. మానవత్వం ఇంకా బతికే ఉందని చాటిచెబుతున్నారు. ప్రకాశం జిల్లా కొమరోలుకు చెందిన ప్రైవేటు ఉపాధ్యాయుడు గాదంశెట్టి గుప్తా(40) వారం రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. 4 రోజుల కిందట రక్త పరీక్ష చేయించగా టైఫాయిడ్ అని తేలింది. దీంతో మందులు వాడుతూ ఇంటి వద్దే ఉంటున్నాడు. సోమవారం తెల్లవారుజామున జ్వరం అధికమై.. పరిస్థితి విషమించి మృతి చెందాడు. వైద్య సిబ్బంది వచ్చి కరోనా పరీక్షలు నిర్వహించగా నెగెటివ్ అని తేలింది. అయినా కూడా అంత్యక్రియలు నిర్వహించేందుకు బంధువులెవరూ ముందుకురాలేదు. ఆయన కరోనాతోనే చనిపోయి ఉంటాడని బంధువులు, చుట్టుపక్కల వాళ్లు ఎవరూ దరిదాపుల్లోకి కూడా వెళ్లలేదు. ఇరుగు పొరుగు వాళ్లు ఇళ్లకు తాళాలు వేసుకుని వెళ్లిపోయారు. వృద్ధులైన తల్లిదండ్రులేమో కుమారుడికి అంతిమ సంస్కారాలు నిర్వహించే స్థితిలో లేరు. బిడ్డలు కూడా లేరు. భార్య ఏమీ చేయలేక సాయం కోసం రోజంతా ఎదురుచూసింది. చివరకు స్నేహితులే మానవత్వంతో ముందుకు వచ్చి.. అంతిమ సంస్కారాలు నిర్వహించారు. వైఎస్సార్సీపీ నాయకుడు షేక్ మౌలాలి, కొమరోలు, దద్దవాడ గ్రామ పంచాయతీ కార్యదర్శులు రమణయ్య, సుబ్బారావు, మాజీ పోస్టల్ ఉద్యోగి థామ్సన్, ‘సాక్షి’ రిపోర్టర్ కృష్ణారెడ్డి... సోమవారం సాయంత్రం గాదంశెట్టి గుప్తా మృతదేహాన్ని శ్మశాన వాటికకు తీసుకెళ్లి దహన సంస్కారాలు నిర్వహించారు. అంతేకాకుండా ఆర్థికంగా చితికిపోయిన ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు.. కొంత నగదు సేకరించి అండగా నిలిచారు. చదవండి: కరోనా విషాదం: వలంటీర్లే ఆ నలుగురై -
పెళ్లి కాకుండానే గర్భం.. టీచర్ మృతి.. చెత్తకుండీలో బిడ్డ!
సాక్షి, చెన్నై: పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన కుమార్తెకు కుటుంబీకులు ఇంట్లోనే ప్రసవం చేశారు. ఆమె మృతిచెందడం, బిడ్డ చెత్త కుండీలోకి వెళ్లడం వెరసి ఈ వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఆమె ప్రియుడు, కుటుంబసభ్యుల్ని గురువారం పోలీసులు అరెస్టు చేశారు. దిండుగల్ జిల్లా పళని సమీపంలోని ఆరుకుడికి చెందిన మణియన్ కుమార్తె మంగయకరసి(29) ప్రైవేటు స్కూల్ టీచర్. 2019లో కోవిడ్ రూపంలో ఎదురైన లాక్‌డౌన్‌తో ఇంట్లోనే ఉంటూ ఆన్లైన్ క్లాసులు తీసుకుంటూ వచ్చింది. ఈ సమయంలో వారి ఇంట్లో ఉన్న సమీప బంధువు యువకుడికి మంగయ కరసి దగ్గరైంది. ఇద్దరు చనువుగా ఉన్నా, కుటుంబీకులు ఏ మాత్రం పట్టించుకోలేదు. ఇందుకు కారణం, ఆ యువకుడు మంగయకరసికి తమ్ముడి వరుస కావడమే. అయితే, వీరి చనువు హద్దులు దాటినట్టుంది. మంగయ కరసి గర్భం దాల్చడం, అబార్షన్ కూడా చేయలేని పరిస్థితి నెలకొనడంతో ఆ కుటుంబం తీవ్ర మనో వేదనలో పడింది. వరసకు తమ్ముడి రూపంలో ఆమె గర్భం దాల్చిన సమాచారం బయటకు పొక్కితే కుటుంబ పరువు పోతుందని జాగ్రత్త పడ్డారు. ఆమెను ఇంట్లోనే ఉంచారు. చదవండి: మహిళ మెడకు చున్నీ బిగించి.. 23 రోజుల తర్వాత! ఇంట్లోనే ప్రసవం.. కొద్ది రోజుల క్రితం పురుటినొప్పులు రావడంతో ఇంట్లోనే కుటుంబీకులు ప్రసవం చేశారు. మగబిడ్డకు ఆమె జన్మనిచ్చింది. అయితే, తీవ్ర రక్తస్త్రావంతో మంగయకరసి అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో, ఆస్పత్రికి తరలించాల్సి వచ్చింది. దీంతో ఆ బిడ్డను తీసుకెళ్లి చెత్త కుండీలో పడేశారు. ఇంత వరకు ఎవరి కంటా పడకుండా జాగ్రత్త పడ్డా, మంగయ కరసి ఆస్పత్రిలో మృతిచెందడం, ఆగమేఘాలపై మృతదేహానికి అంత్యక్రియలు జరగడం ఇరుగుపొరుగు వారిలో అనుమానాల్ని రేకెత్తించాయి. వ్యవహారం పోలీసుల దృష్టికి చేరడంతో బండారం బయటపడింది. దీంతో ఇంట్లో ప్రసవం చేసిన విషయం తెలిసి ఆమె తల్లి తంగం, సోదరి గణేషప్రియ, తమ్ముడు కాళిదాసులను పోలీసులు అరెస్టు చేశారు. అలాగే, ఆమె గర్భానికి కారుకుడైన ప్రియుడు అదిష్కుమార్ను కూడా అరెస్టు చేశారు. అయితే, చెత్తకుండీలో బిడ్డను పడేసిన సమయంలో ప్రాణాలతో ఉన్నట్టుగా కాళిదాసు పేర్కొనడంతో ఆ బిడ్డ జాడ కోసం పోలీసులు అన్వేషణ మొదలెట్టారు. ఎవరికైనా ఆ బిడ్డ దొరికిందా లేదా మరణించిందా అని ఆరా తీస్తున్నారు. చదవండి: యువకుల సాహసం.. వెంటనే చెరువులో దూకి.. -
నాగార్జున సాగర్: ప్రైవేట్ టీచర్ రవి భార్య ఆత్మహత్య
సాక్షి, నల్లగొండ: లోకం తెలియని చిన్నారులు.. అమ్మ చేతి గోరు ముద్దలు తింటూ.. నాన్నతో కలిసి ఆడుతూ పాడుతూ పెరగాల్సిన వారు. పట్టుమని పదేళ్లు కూడా నిండని ఆ చిన్నారులపై విధి పగబట్టింది. కరోనా రూపంలో వారిని కాటేసింది. కోవిడ్ వల్ల ఏడాదిగా ఉద్యోగం లేక.. ఆర్థిక సమస్యలు పెరగడంతో తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. రెండు రోజులుగా ఇంట్లో ఒకటే ఏడుపు. ఏమైందో ఆ చిన్న బుర్రలకు అర్థం కావడం లేదు. ఒక్కటి మాత్రం తెలిసింది. నాన్న ఇక ఎన్నిటికి రాడని. ఈ బాధ నుంచి కోలుకోక ముందే వారి ఇంటి మరో విషాదం చోటు చేసుకుంది. చిన్నారుల తల్లి కూడా ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకుంది. తల్లిదండ్రులిద్దరిని కోల్పోయిన ఆ చిన్నారులను చూస్తే ప్రతి ఒక్కరి హృదయం ద్రవిస్తోంది. బిడ్డల ముఖం చూసైన బతుకకపాయే అంటూ విలపిస్తున్నారు బంధువులు. నాగార్జున సాగర్‌లో చోటు చేసుకుంది ఈ విషాద ఘటన. రెండు రోజుల క్రితం ఆర్థిక సమస్యలు తట్టుకోలేక సాగర్ హిల్ కాలనీకి చెందిన ప్రైవేట్ టీచర్ రవి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా నేడు వారి ఇంట్లో మరో విషాదం చోటు చేసుకుంది. రవి కుమార్ భార్య అక్కమ్మ కూడా ఆత్మహత్య చేసుకుని మరణించింది. భర్త మరణాన్ని జీర్ణించుకోలేని అక్కమ్మ గురువారం నాగార్జున సాగర్ కుడి కాలువలో దూకి ఆత్మహత్య చేసుకుంది. దంపతులిద్దరి మరణంతో వారి పిల్లలు అనాథలుగా మారారు. పసి బిడ్డలను చూసిన ప్రతి ఒక్కరు కంటతడి పెడుతున్నారు. బిడ్డల ముఖం చూసైనా బతుకకపాయే అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చదవండి: ప్రైవేట్ టీచర్ ఆవేదన: సీఎం సారూ.. పస్తులుంటున్నం -
ప్రైవేట్ టీచర్ ఆవేదన: సీఎం సారూ.. పస్తులుంటున్నం
సాక్షి, జగిత్యాల: ‘ఉపాధి కోల్పోయి పస్తులుంటున్నం. మా కుటుంబం ఆత్మహత్య చేసుకోకముందే మమ్మల్ని కాపాడండి, మాకు బతుకునివ్వండి’అంటూ జగిత్యాల జిల్లా కేంద్రంలోని పోచమ్మవాడకు చెందిన ప్రైవేట్ టీచర్ సీఎం కేసీఆర్‌ను ప్రాధేయపడ్డాడు. సోమవారం తన భార్య, ఇద్దరు పిల్లలతో మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన గడప చంద్రశేఖర్ తమ కుటుంబాన్ని ఆదుకోవాలంటూ సీఎం కేసీఆర్‌ను వీడియో ద్వారా కోరారు. ‘సీఎం కేసీఆర్ సార్‌కు నమస్కారం. నేను 20 ఏళ్లుగా ప్రైవేటు టీచర్‌గా పనిచేస్తున్నా. అరకొర వేతనాలతో కుటుంబాన్ని నెట్టుకొచ్చాను. కరోనాతో ఉపాధి పోయి తిప్పలు పడుతున్నం. బతకలేని స్థితిలో ఉన్నాం. అద్దె ఇంట్లో ఉంటున్నాం. 12 నెలలుగా అద్దె కూడా చెల్లించలేదు. బతకడం కోసం అప్పులు చేశాం. అప్పు ఇచ్చిన వారి నుంచి వేధింపులు మొదలయ్యాయి. నా కొడుక్కి వారంరోజులుగా ఆరోగ్యం బాగాలేదు.. వైద్యం అందించలేకపోతున్న. భార్యాపిల్లలకు రెండుపూటలా తిం డిపెట్టే పరిస్థితి కూడా లేదు. పస్తులుంటున్నాం. మా కుటుంబం ఆత్మహత్య చేసుకోకముందే కాపా డే బాధ్యత మీదే సార్’అంటూ విన్నవించారు. -
ప్రైవేటు ఉపాధ్యాయురాలిపై ఉన్మాది కాల్పులు
బొమ్మనహళ్లి : ఉదయం 8.15 గంటలు..ఓ ప్రైవేటు టీచర్ బస్సు కోసం వేచి ఉంది. పక్కనే విద్యార్థులు కూడా నిలబడి ఉన్నా రు. ఇంతలో ఓ వ్యక్తి అక్కడకు చేరుకొని టీచర్‌పై ఐదురౌండ్లు కాల్పులు జరిపాడు. దీంతో ఆమె కుప్పకూలి అక్కడికక్కడే మృ తి చెందగా కాపాడేందుకు అడ్డుగా వెళ్లిన విద్యార్థి గాయపడ్డాడు. కాల్పులు జరిపిన వ్యక్తి సమీపంలోని తోటలోకి వెళ్లి రివాల్వర్‌తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘోరం కోడుగు జిల్లా విరాజ్ పేట తాలూకాలోని బాళలే గ్రామంలో శుక్రవారం చో టు చేసుకుంది. గుణికొప్పలు గ్రామంలో ఉన్న లయన్స్ హైస్కూల్లో ఆశా కావేరమ్మ(50) టీచర్‌గా పనిచేస్తోంది. ఆమెకు భర్త లేడు. భార్య లేని పొన్నంపేట ప్రాంతానికి చెందిన జగదీష్ (60) ఆశా కావేరమ్మపై కన్నేశాడు. తనను ప్రేమించాలని ఐదేళ్లుగా వెంటబడుతున్నాడు. తనకు ఇలాంటివి ఇష్టం లేదని ఆశా కావేరమ్మ చెప్పినప్పటికీ జగదీష్ వినిపించుకోలేదు. రెండు సంవత్సరాల క్రితం జగదీష్ ఆశా ఇంటికి వెళ్లి అత్యాచార యత్నం చేశాడు. పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. బెయిల్‌పై బయటకి వచ్చిన జగదీష్..మళ్లీ ఆశా వెంటబడ్డాడు. ఆమె తిరస్కరించడంతో అంతమొందించాలని నిర్ణయించాడు. శుక్రవారం ఉదయం ఆశా కావేరమ్మ పాఠశాలకు వెళ్లేందుకు బాళలె పోలిసు స్టేషన్‌కు ఎదరుగానే ఉన్న బస్టాండు వద్ద నిలబడి ఉంది. విద్యార్థులు సైతం అక్కడే బస్సు కోసం వేచి ఉన్నారు. ఇంతలో జగదీష్ అక్కడ ప్రత్యక్షమై రివల్వార్తో ఆశాకావేరమ్మపై ఐదు రౌండ్లు కాల్పులు జురిపాడు. పక్కనే ఉన్న ఒక విద్యార్థి అడ్డుకునేందుకు వెళ్లగా బాలుడికి కూడా గాయాలయ్యాయి. ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆశాకావేరమ్మ కుప్పకూలి మృతి చెందింది. నిందితుడు కాల్పులు జరిపిన అనంతరం సమీపంలోని ఓ తోటలోకి వెళ్లి రివాల్వార్‌తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అక్కడే ఉన్న కార్మికుడు అడ్డుకునేందుకు వెళ్లి కాల్పుల్లో గాయపడ్డాడు. పోలీసులు ఇద్దరి మృతదేహాలను ఆస్పత్రికి తరలించి గాయపడిన విద్యార్థి, కార్మికుడిని ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు. -
నగరంలో మరో హత్య..
♦ వడ్డేపల్లి ఇందిరానగర్ వద్ద ఘటన ♦ మృతుడు ప్రైవేట్ ఉపాధ్యాయుడు ♦ భయాందోళనకు గురైన ప్రజలు ♦ తల్లి చనిపోయిన నెలకే దారుణం వరంగల్ క్రైం : వరంగల్ నగరంలోని వడ్డేపల్లి, ఇందిరానగర్ వద్ద శుక్రవారం రాత్రి 10 గం టలకు హత్య జరిగింది. గత నాలుగురో జుల క్రితం వరంగల్ రంగంపేట వద్ద ఇరువర్గాల నడుమ జరిగిన ఘర్షణలో ఒక యువకుడు కత్తిపోట్లకు గురై మృతిచెందాడు. ఈ క్రమంలో తాజాగా మరో హత్య జరగడం సంచల నం కలిగిస్తోంది. పోలీసులు, బంధువుల కథ నం ప్రకారం.. హన్మకొండ వడ్డేపల్లికి చెందిన రిటైర్డ్ ఎస్సై వరికోటి రాజమౌళి కుమారుడు శ్రీనివాస్ (40) హైదరబాద్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నా డు. ఆయనకు భార్య రేణుక, కుమారులు రో హిత్, రాహుల్ ఉన్నారు. అయితే శ్రీనివాస్ తల్లి లక్ష్మీ గత నెల 8వ తేదీన చనిపోగా, ఆమె అస్తికలు కాళేశ్వరంలోని గోదావరిలో కలిపేం దుకు కుటుంబం తోపాటు హన్మకొండుకు ఇటీవల వచ్చాడు. గురువారం కాళేశ్వరం వె ళ్లాల్సి ఉండగా.. ఇంటి పక్కన ఓ వృద్ధురాలు చనిపోవడంతో ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నారు. అయి తే శుక్రవారం రాత్రి 7.30 గంటల ప్రాంతంలో పెరుగు కోసం వడ్డేపల్లి క్రాస్‌వద్దకు పిల్లలతో కలిసివెళ్లిన శ్రీనివాస్‌ను గుర్తు తెలియని వ్యక్తులు అడ్డగించారు. తర్వా త పిల్లలను బైక్‌పై నుంచి దింపి శ్రీనివాస్‌ను వారి వెంట తీసుకుపోయారు.కాగా, శ్రీనివాస్ ఎంతకు ఇంటికి రాకపోవడంతో అతడి తమ్ముడు మోహన్‌రాజు సుబేదారి పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లాడు. అయితే అప్పటికే పోలీసులకు హత్య సమాచారం తెలియడంతో వారు మోహన్‌రాజ్‌ను సంఘటనా స్థలానికి తీసుకెళ్లగా చనిపోయిన వ్యక్తి శ్రీనివాస్‌గా గుర్తించారు. కాలుకు రక్తం.. అనుమానాస్పదంగా మృతి చెందిన వరికోటి శ్రీనివాస్‌ను ఎక్కడో చంపి ఇందిరానగర్ వద ్దకు తీసుకువచ్చి బండిపై పడుకోబెట్టి ఉంటా రని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటన స్థలం వద్ద చేసిన పరిశీలనలో దేహంపై ఎక్క డా కత్తిపోట్లు లేనట్లు తెలిసింది. ముఖంపై గాయాలు, నుదిటిపై భాగంపగిలి, కింది పెదవు పెద్దగా ఉబ్బి ఉంది. వేసుకున్న దుస్తులు కూడా తడిసి ఉన్నాయి. కళ్లపై పిడిగుద్దులు గుద్దినట్లు ఉంది. ఎడమ కాలి వేళ్ల దగ్గర నుంచి రక్తం కారి మడుగుగా తయారైంది. కుడి కాలు నుంచి కూడా రక్తం కారుతోంది. వివాహేతర సంబంధమే కారణమా.? మృతుడికి మరో మహిళతో ఉన్న వివాహేతర సంబంధమే హత్యకు కారణం కావచ్చు అనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. మృతుడి తమ్ముడు మోహన్ రాజ్, అతని బావమరిదిల నుంచి పోలీ సులు వివరాలు సేకరిస్తున్నారు. మృతదేహాన్ని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థలానికి హన్మకొండ ఏసీపీ మురళీధర్, సుబేదారి సీఐ శ్రీనివాస్, కేయూసీ సీఐ సతీష్ బా బులు ,ఎస్సైలు పెద్ద సంఖ్యలో పోలీసలు వచ్చారు. -
ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయుడిపై దాడి
హిందూపురం అర్బన్ : ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయుడిపై బుధవారం నలుగురు వ్యక్తులు దాడిచేశారు. బాధితుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయుడు దినకర్(30) ఇదే పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న యువతితో ప్రేమ వ్యవహారం కొనసాగించాడు. ఇటీవల ఆమెకు పెళ్లి నిశ్చయమైంది. అయినా దినకర్ వెంట పడుతున్నాడని అమ్మాయి కుటుంబ సభ్యులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో బుధవారం దినకర్ బైపాస్‌రోడ్డులో ఉండగా నలుగురు వ్యక్తులు కారులో వచ్చి బలవంతంగా వాహనంలోకి ఎక్కించుకుని పట్టణ శివారుల్లోకి తీసుకెళ్లి దాడి చేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. -
మాలకాకి
బోయి భీమన్న రాసిన ‘కూలీరాజు’ నాటకం పుస్తకం పక్కనపెట్టి, ఈజీచెయిర్లో కాళ్లు జాపుకొని ఆంధ్రపత్రిక తెరిచాడు డాక్టర్ దాస్. ముందు పేజీలో ‘రామరాజ్యం’ అనే శీర్షికతో కాశీనాథుని నాగేశ్వరరావు రాసిన సంపాదకీయం చదువసాగాడు. హరిజనుల్లో వస్తున్న కాస్తోకూస్తో అభివృద్ధి పట్టణాలకే పరిమితమైందనీ, గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి ఎక్కడ వేసిన గొంగడి అక్కడేలా ఉందని, అసలైన రామరాజ్యం రావాలంటే గ్రామాల్లోని పీడితప్రజల ఉద్ధరణకి గాంధీజీ ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ నడుం కట్టాలని దాని సారాంశం. అది చదివాక దాస్‌కు తన ఊరు గుర్తుకొచ్చింది. దానిని విడిచివచ్చి పాతికేళ్లు. అమ్మా, అయ్యా, తమ్ముళ్లూ... గూడెంలో చుట్టాలూ, ఊర్లో జనాలూ... ఏమయ్యారో? ఎలా వున్నారో? నిశ్చయానికి వచ్చి గోడకి తగిలించిన టెలిఫోన్ అందుకొని తన అసిస్టెంటుతో ‘మిస్టర్ పిళ్లే.. దిసీజ్ డాక్టర్ దాస్.. అర్జంట్ పని మీద ఊరెళ్లాలి. వారం రోజులు హాస్పిటల్‌కి రానని సూపర్నెంట్‌కి కబురు చేయండి. తరువాత- ఇవాళ జీటీలో పలాసకి ఒక ఫస్ట్ క్లాస్ సీటు రిజర్వ్ చేస్తారా. థాంక్యూ’ అని ఫోను పెట్టేసి బట్టలూ, షేవింగ్ సెట్టూ ఒక చిన్న బ్యాగులో సర్ది, గబగబా తయారై, బీరువాలోంచి కొన్ని పచ్చనోట్లు జేబులో పెట్టుకొని భార్యకి విషయం చెప్పి స్టేషన్‌కి బయల్దేరాడు. రైలుపెట్టె కిటికీలో టెలిగ్రాఫ్ స్తంభాల్లా తాను ఊరువిడిచి వచ్చిన నాటి సంఘటనలు అతడి కళ్లముందు పరుగెత్తసాగాయి.. ఆ రోజు... ఊళ్లో పెద్దోళ్ల పిల్లలంతా నాయుడుగారి దేవిడీలో చేరి ‘అంటాడు’ ఆడుతున్నారు. అంగడి శెట్టి కొడుకు దొంగపడితే ‘నన్నంటుకోకే నామాలకాకీ’ అని పాడుతూ అందరూ పరుగులు పెడుతున్నారు. అప్పట్లో బడిని ఊరి గుడి నుంచి కొత్త భవంతికి మార్చాక మాలల పిల్లల్ని కూడా బళ్ళో చేర్చుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయినా మాలలతో కలిసి చదివేందుకు ఇష్టంలేని పెద్దలు తమ పిల్లలని బడి మాన్పించడంతో ఆ బడి నాలుగు రోజుల్లోనే మూతబడింది. బడి మూసేశాక ఊరి పిల్లలకి నాయుడుగారి దివాణమే బడి. రంగారావ్ మేస్టారు గన్నేరుచెట్టు నీడలో సైకిల్ స్టాండేసి వసారాలోకి వచ్చేసరికి అందరూ బుద్ధిమంతుల్లా పలకా బలపాల్తో బాసినపట్లేసుకొని కూర్చున్నారు. ఆయన పట్నం నుంచి వచ్చిన ప్రైవేట్ మాస్టారు. ఆ రోజు ఇంగ్లిషు పాఠం. కొట్టంలో గొడ్లకి కుడితిపెట్టి, గడ్డేసి, చాటుగా గన్నేరు చెట్టు నీడలో కూర్చొని ఎండుపుల్లతో మాస్టారి ప్రశ్నలకి సమాధానాలు పాదులోని తడిమట్టిలో రాస్తూ పాఠం వినసాగాడు కన్నదాసు. అప్పుడప్పుడు అతడి వంక చూసినా చూడనట్లే ఉండే మాస్టారు ఆ రోజుపాఠం ముగిశాక ‘ఒరేయ్.. సైకిల్లో గాలి తగ్గినట్లుంది. సెట్టిగారి అంగళ్లో గాలి పంపుంది. అక్కడి దాకా తోసుకురా’ అని బయలుదేరాడు. మాస్టారు అతడితో మాట్లాడడం అదే మొదటిసారి. గుడి మలుపు తిరగగానే ‘చదువు కోవాలనుంటే నాతో పట్నం రారా. బళ్లో చేర్పిస్తాను’ కలకండ పలుకుల్లా తీయని మాస్టారి పలుకులు అతడి భవిష్యత్తును మార్చేస్తాయి. కానీ అయ్య ఒప్పుకోడు. తండ్రి పడిన బాకీ తీర్చాలంటే తనకు దివాణంలో చిన్న పాలేరు పని తప్పదు. అదేమాట మాస్టారికి చెప్పాడు. ‘నీ ఇష్టం. నాకు వాల్తేరు కాలేజీలో ఉద్యోగం వచ్చింది. రేపు మధ్యాహ్నం బండిలో వెళ్లిపోతున్నాను. వీలైతే బండెక్కు’ అని సమాధానం కోసం ఎదురు చూడకుండా సైకిలెక్కి కాశీబుగ్గవైపు సాగిపోయాడు. ఆ రోజు కట్టకింద మోస్తున్న పశువుల్ని అలాగే వదిలేసి, ఎవరికీ చెప్పకుండా బండెక్కాడు కన్నదాసు. వాల్తేరులో ఎఫ్ఏ వరకూ, రాయవెల్లూరులో వైద్యం, లండన్‌లో ఎఫ్ఆర్సీఎస్ చేసి గత ఐదేళ్లుగా మద్రాస్ రైల్వే హాస్పిటల్లో సర్జన్‌గా ఎంతో పేరు గడించాడు. పలాస స్టేషన్లో బండి దిగాడు డాక్టర్ దాస్. ఐదు మైళ్ల బండిబాటలో ఒంటెద్దు బండి ముసలయ్య నోట ఊళ్లో విషయాలు కొన్ని తెలిశాయి. గూడెంలో తల్లిదండ్రులని, సొంత వాళ్లని చూడాలని అతడి మనసు తొందర పెట్టసాగింది. గూడేనికి పోవాలంటే ఊరి మెరకదార్లోనే పోవాలి. ఊరి మొదల్లో బండి దిగి నడిపించసాగాడు ముసలయ్య. నాయుడుగారి దివాణం ముందు పోతూ ఉంటే ‘ఎవర్రా.. బండిలో?’ అనే కేకేశాడు నాయుడు. ముసలయ్య తడబడుతూ ‘మ మ్ మ్ మాలోళ్ల సంగడి కొడుకయ్యా! పట్నంలో డాకటేరు’ అన్నాడు. ‘హుమ్.. మధ్యాహ్నం జీడితోటకెళ్లాలి. బండి ఇక్కడే ఉంచి వాడ్ని నడిచిపొమ్మను’ అని ‘కాస్త అక్షరాలు వస్తే చాలు. ఈ నాయాళ్ల కళ్లు నెత్తికెక్కుతాయ్’ అని పైకి వినిపించేలా అంటూ లోపలికెళ్లాడు నాయుడు. దీనంగా అర్థించే ముసలాడి మొహం చూసి, రెండు నాణాలు వాడి చేతిలో పెట్టి, బ్యాగ్ భుజాన్నేసుకొని మౌనంగా గూడెం వైపు నడిచిపోయాడు డాక్టర్ ఎం.కెదాస్- ఎం.డి ఎఫ్ఆర్సీఎస్. గూడెం ఏమీ మారలేదు. గుడిసెల మీద కాంగ్రెస్, కమ్యూనిస్ట్ జెండాలు చూస్తూ బురదలో కాలేశాడు దాస్. మిలమిలా మెరిసే అంబాసిడర్ బూటు బురదలో కూరుకుపోయింది. వాటిని అక్కడే విడిచి ఉత్తికాళ్లతో ఇల్లుచేరాడు. పాతికేళ్ల తరువాత అంత పెద్దోడై తిరిగొచ్చిన సంగడి కొడుకుని చూసి గూడెంలో సంబరం అంతింత కాదు. పాటలు పాడారు. ఆటలు ఆడారు. దాసు ఇచ్చిన పది రూపాయలతో ఆ సాయంత్రం అమ్మోరికి వేట తెగింది. ఇంట్లో డైనింగ్ టేబుల్, పింగాణీ ప్లేట్లకి అలవాటు పడ్డ దాసుకి మట్టి కంచంలో సంకటికూరలు రుచించలేదు. ఎట్టాగూ ఎక్కూవ బ్యామ్మర్లు మాకంటె ఎట్టాగూ ఎక్కూవ ఏదైనా మాకంటె!! అందారు పుట్టిరి హిందమ్మ తల్లీకి అందారు ఒక్కటై ఉందారి సక్కంగ!! అంటూ యువకులూ పిల్లలూ పాడిన ‘మాలోండ్ర పాట’తో తాను కూడా గొంతు కలిపాడు. తనవాళ్ల కోసం ఏదో చేయాలనే తహతహ! సేవా సంస్థల ద్వారా ఆర్థిక సహాయం చెయ్యొచ్చు. కానీ అవి సక్రమంగా ఉపయోగపడతాయనే నమ్మకం లేదు. ఏదైనా హాస్పిటలో, స్కూలో కట్టించి దగ్గరుండి చూసుకుంటేనే ఏదైనా ప్రయోజనం. కానీ పట్నంలో ఉద్యోగం, హోదా, సంపాదన వదిలి రావడం సాధ్యమా? అందుకు తన భార్యాబిడ్డలు సహకరిస్తారా? అలాగే ఆలోచిస్తూ తమ్ముడు తనకై ప్రత్యేకంగా తెప్పించిన నులక మంచంపై బ్యాగ్ తలగడగా పెట్టుకొని చుక్కలవంక చూస్తూ పడుకున్నాడు. ఎంత ప్రయత్నించినా నిద్రపట్టలేదు. మురుగు కంపు, కుక్కల గోల, ముసిరే దోమలు! గొంగళి కప్పుకుంటే ఉక్కపోత. రాత్రంతా ఎటూ తెమలని ఆలోచనలు. ఏమేమో చేద్దామనే తపన. సాధ్యమా కాదా అనే సందేహం. తెల్లవారకముందే లేచి చొక్కా తొడుక్కొని మొహం కడుక్కునేందుకు బావి వద్దకు చేరాడు. సేవా సమాజం హరిజనులకై ‘ప్రత్యేకంగా’ తవ్వించిన ఆ బావి ఎప్పుడో పూడిపోయింది. వీధి మధ్య తొట్టిలో నీళ్లు రేకుడొక్కులో పట్టుకొని కాలకృత్యాలకై రైలుకట్ట చేరుకున్నాడు దాస్. రైలుకట్ట మీద మద్రాస్ మెయిల్ ఆగింది. రెడ్ సిగ్నల్! ఆలోచనలతో ప్రమేయం లేకుండా అతడి కాళ్లు అటువైపు ఈడ్చుకెళ్లాయి. రేకుడొక్కు విసిరేసి బండెక్కేశాడు డాక్టర్ దాస్. - సాయి పాపినేని ఫోన్: +91 9845034442 -
సోషల్ మాస్టర్
మాది పెద్దపల్లి మండలం కాసులపల్లి. వ్యవసాయ కుటుంబం. వారసత్వంగా మా తాత నుంచి వందలాది ఎకరాల స్థిరాస్తి వచ్చింది. మా ఊళ్లోనే అయిదో తరగతి వరకు చదువుకున్నా. తర్వాత అమ్మమ్మ వాళ్ల ఊరు గర్రెపల్లిలో హైస్కూల్ చదివినా. రోజు నాలుగు కిలోమీటర్లు నడిచి బడికెళ్లినా. సుల్తానాబాద్‌లో ఇంటర్, మంచిర్యాలలో డిగ్రీ, నాగ్‌పూర్ యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్‌లో పీజీ. ఉత్కల్ యూనివర్సిటీలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో పీజీ. నాగార్జున యూనివర్సిటీలో బీఈడీ చదువుకున్నా. మేం ఆరుగురం సంతానం. ముగ్గురు అన్నాదమ్ముళ్లం.. ముగ్గురు అక్కాచెల్లెళ్లు. సోదరుల్లో ఒకరు లాయర్... మరొకరు వ్యవసాయం చేస్తున్నారు. గాల్లో ఎగరలేదు.. డిగ్రీ పూర్తయ్యాక ఎయిర్మేన్ ఉద్యోగం వచ్చింది. అప్పుడు వెళ్లాలని అనిపించలేదు. ప్రైవేటు పాఠశాల పెట్టిన కొత్తలోనే గవర్నమెంట్ టీచర్ జాబ్ కూడా వచ్చింది. అప్పటికే నా దగ్గర వందమంది పిల్లలు చదువుకుంటున్నారు... ఆ ఉద్యోగం ఎందుకులే అనుకున్నా... వెళ్లలేదు. ఇతరత్రా వ్యాపకాలు.. ఉద్యోగాల కంటే చదువు నేర్పటమే నాకు నచ్చింది. పదిమందికి పాఠాలు చెప్పటం.. పిల్లలకు విద్య నేర్పించటమే ఎంతో సంతృప్తినిస్తుంది. అంతకుమించిన ఆనందమేదీ లేదు. అప్పటి కాలం వేరు.. నేను ఉన్నత చదువులు పూర్తిచేసిన కాలంలో చదువుకున్నవారి సంఖ్య తక్కువే. ఈ ప్రాంతంలో నక్సలైట్ల ప్రభావం ఎక్కువగా ఉండేది. తెలిసీ తెలియని తనంతో ఎందరో జనజీవనం వీడిపోయారు. విచక్షణ, వివేచన ఉంటే.. వాళ్లంతట వాళ్లే ఆలోచించే శక్తి ఉంటే ప్రజలు తమంతట తాముగా బాగుపడుతారు. సమాజం కూడా బాగుపడుతుందని నమ్మినవాణ్ని. అందుకే అందరు చదువుకోవాలి. అందరికీ చదువు రావాలి. చదువు నేర్పితేనే నా వంతుగా సమాజానికి సేవ చేసినట్లు అవుతుంది. నాకు జీవనోపాధి దొరుకుతుంది. అందుకే విద్యారంగంలో అడుగుపెట్టాను. ప్రైవేటు బడిలో టీచర్.. మొదట్లో పెద్దపల్లిలోనే ఓ ప్రైవేటు బడిలో టీచర్‌గా పనిచేసినా. రెండేళ్ల తర్వాత నేనే పాఠశాల పెట్టాలని అనుకున్నా. ఓ పూరిపాకలో ఇరవై మంది పిల్లలతో ట్రినిటీ స్కూల్ స్థాపించాను. అదే వరుసలో ఉన్నత పాఠశాల, జూనియర్ కాలేజీ. అదీ మొదలు ఇప్పుడు ఎల్కేజీ నుంచి పీజీ, ఫార్మసీ, ఇంజనీరింగ్, బీఈడీ, డీఈడీ, ఎంఈడీ.. దాదాపు ఇరవై కాలేజీలున్నాయి. ఏటేటా మా విద్యాసంస్థల్లో 23వేల మంది విద్యార్థులు చదువు నేర్చుకుంటున్నారు. సమకాలికులతో పోలిస్తే విద్యారంగంలో నేనే ఆలస్యంగా అభివృద్ధిలోకి వచ్చాను. ఇంచుమించు నేను స్కూల్ ప్రారంభించినప్పుడు విజ్ఞాన్ రత్తయ్య స్కూల్ పెట్టాడు. ఇప్పుడు విజ్ఞాన్ డీమ్డ్ యూనివర్సిటీగా ఏర్పడింది. దాంతో పోలిస్తే.. నేను వెనుకే ఉన్నాను కదా. దాదాపు ఇరవై ఏళ్లు నేనే పిల్లలకు సోషల్ స్టడీస్, ఇంగ్లీష్ పాఠాలు చెప్పాను. ఇప్పటికీ తీరిక దొరికితే మా స్కూళ్లలోనే ఎక్కువ సమయం గడుపుతా. అన్నింటినీ నేనే ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తా. ఎమ్మెల్యే అయ్యాక విద్యాసంస్థల బాధ్యతలను నా కుమారుడు ప్రశాంత్‌రెడ్డికి అప్పగించినా. ఇప్పుడు ఆయనే ట్రినిటీ విద్యాసంస్థల ఛైర్మన్. రాజకీయాలంటే.. పుట్టి పెరిగిన ప్రాంతం కావటం, ఒక స్కూల్ కరస్పాండెంట్‌గా దాదాపు ఇరవై అయిదు ఏళ్లుగా ఇక్కడే ఉండటంతో ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో సంబంధాలు ఏర్పడ్డాయి. చాలాసార్లు వాళ్లను కలవటం, మాట్లాడటం, వీలైనన్ని పద్ధతుల్లో వారిని తీర్చిదిద్దటం జరిగింది. మారుతున్న సమాజంలో ప్రజలకు సేవచేసే రంగాలెన్నో ఉన్నాయి. కానీ.. రాజకీయాల్లో ఉంటే ప్రజలను మరింత చైతన్యవంతులను చేయవచ్చు. అధికారం గుప్పిట్లో ఉంటే ప్రజలకు మరింత సేవ చేసేందుకు అవకాశముంటుంది. మనకున్న ఆలోచనను, విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లటంతో పాటు అభివృద్ధిలో పాలుపంచుకునే అవకాశం లభిస్తుంది. అందుకే రాజకీయాల్లోకి రావాలనుకున్నా. ఉద్యమంతోనే ఎంట్రీ తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో ఉడతాభక్తిగా నావంతు సహాయ సహకారాలు అందించాలని అనుకున్నా. మూడేళ్ల కిందటే రాజకీయాల్లోకి వచ్చినా. టీఆర్ఎస్లో చేరినా. పార్టీలో చేరేటప్పుడే ఏదో ఒక పదవి, ఏదో ఒక అవకాశం వస్తుందని అనుకున్నా. మా బాస్ కేసీఆర్‌పైనే నమ్మకం పెట్టుకున్నా. అదే నిజమైంది. పార్టీ టిక్కెట్టు ఇచ్చి నన్ను పోటీ చేయమన్నారు. కష్టపడ్డాను.. నిర్విరామంగా ప్రజల్లో ఉండటంతోనే విజయం నన్ను వరించింది. విజయం తనంతట తానుగా ఎవరి దరి చేరదని నమ్మే వ్యక్తిని నేను. చిన్నప్పటి నుంచీ కష్టపడటం నేర్చుకున్నా. అదే నన్ను ముందుకు నడిపిస్తోంది. డ్రీమ్ ప్రాజెక్టు తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచాను. ప్రజలకు ఎన్నో ఆశలు ఆకాంక్షలు ఉంటాయి. అన్నింటినీ నెరవేర్చటం ఎవరివల్లా కాదు. నియోజకవర్గ స్థాయిలో అధికారుల సహకారంలో ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలన్నీ పక్కాగా ప్రజలకు చేరేందుకు ప్రయత్నిస్తాను. పత్తి పంట వేసి నష్టపోయినా.. వరిపొలం దెబ్బతింది.. అని రైతులు బాధ పడకూడదు. ప్రత్యామ్నాయంగా వ్యవసాయ అనుబంధ రంగాలను వృద్ధి చేయాలి. డెయిరీ, హార్టికల్చర్.. ఏదో ఒక తీరుగా రైతుకు అదనపు ఆదాయ వనరులు ఉండేలా ఒక ప్రాజెక్టు ఉండాలనేది నా డ్రీమ్. -
‘చితి’కిపోతున్నారు
సిరిసిల్ల, న్యూస్‌లైన్ : డిగ్రీ చదువుకున్న వెంగల చక్రధర్‌కు ఉద్యోగం కరువైంది. కులవృత్తిని నమ్ముకుని కుటుంబాన్ని పోషించుకుందామని ఆశపడితే వస్త్ర పరిశ్రమ సంక్షోభం ఆ చేతులకు పనిలేకుండా చేసింది. అప్పుల బాధతో పచ్చని సంసారంలో చిచ్చు రేగగా, మానసిక సమస్యలూ చుట్టుముట్టడంతో ఆవేదనకు లోనైన చక్రధర్ బుధవారం రాత్రి బలవన్మరణానికి పాల్పడ్డాడు. చక్రధర్ ఇంట్లో అందరూ శ్రమించేవారే. తల్లి లక్ష్మీదేవి బీడీ కార్మికురాలు. తండ్రి భూపతి మరమగ్గాల కార్మికుడు. చెల్లెలు వీణ డిగ్రీ పూర్తి చేసి ప్రైవేటు టీచర్‌గా పనిచేస్తోంది. ఇంట్లో అందరూ పనిచేస్తున్నా ఇల్లు గడ వడం కష్టంగానే ఉంది. పద్మనగర్‌లో చిన్న పెంకుటిం ట్లో ఉంటున్న చక్రధర్ వారం రోజులుగా పని సరిగా లేక.. సాంచాలు నడవక ఆర్థిక ఇబ్బందులకు గురయ్యాడు. ఏడాదిన్నర కిందట శాంతినగర్‌కు చెందిన కవితతో అతడికి పెళ్లయింది. పెళ్లికి రూ.లక్షన్నర వరకు అప్పులయ్యాయి. ఆ అప్పుల బాధలు.. చెల్లెలు పెళ్లికి ఎదగడం... వచ్చే ఆదాయం పొట్టపోసుకోవడానికే సరిపోతుండడంతో మానసిక వేదనకు గురయ్యాడు. బుధవారం సాయంత్రం ఇంట్లోనే సెల్ఫోన్లో పాటలు వింటూ పరదా చాటున కూర్చున్నాడు. ఇంట్లో ఎవరి పనుల్లో వారుండగా ఉరేసుకున్నాడు. చేనేత దినోత్సవం వేళ.. ప్రపంచ చేనేత దినోత్సవం సంబరాలను సిరిసిల్లలో నేతన్నలు బుధవారం నిర్వహించగా.. ఆ సంబరాల మాటునే విషాదం చోటుచేసుకుంది. చక్రధర్ ఆత్మహత్య సంఘటన కార్మిక క్షేత్రంలో విషాదం నింపింది. సిరిసిల్ల పాలిస్టర్ పరిశ్రమకు దిగుమతయ్యే యారన్ (నూలు) రేట్లు భారీగా పెరగడం, ఉత్పత్తవుతున్న పాలిస్టర్ గుడ్డకు మార్కెట్లో గిట్టుబాటు ధర లేకపోవడంతో ఉత్పత్తి వ్యయం పెరిగి ఆదాయం రాకపోవడంతో సిరిసిల్లలోని వస్త్రోత్పత్తిదారులు రెండు వారాలుగా పూర్తిస్థాయిలో వస్త్రోత్పత్తి చేయడం లేదు. దీంతో సిరిసిల్లలో పద్నాలుగు వేల మరమగ్గాలు మూతపడ్డాయి. ఎనిమిది వేల మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు. ఈ సంక్షోభమే ఓ యువకుడి నిండుప్రాణాన్ని బలితీసుకుంది. భరోసా ఇవ్వని సర్కారు రాష్ట్రంలోనే అత్యధికంగా 38 వేల మరమగ్గాలు జిల్లాలో ఉండగా... ఒక్క సిరిసిల్లలోనే 34 వేల మరమగ్గాలు ఉన్నాయి. వీటిపై ఆధారపడి పాతికవేల మంది కార్మికులు పొట్టపోసుకుంటున్నారు. సిరిసిల్లలో వస్త్ర పరిశ్రమ సంక్షోభానికి గురై ఇబ్బందులు పడుతుంటే భరోసా ఇవ్వాల్సిన సర్కారు నివేదికల పేరిట కాలయాపన చేస్తోంది. దివంగత నేత రాజశేఖరరెడ్డి హయాంలో సిరిసిల్ల నేతన్నలకు భరోసా ఇచ్చేందుకు 35 కిలోల బియ్యం, ఇంటింటికీ పావలా వడ్డీ రుణాలను సంపూర్ణ ఆర్థిక చేకూర్పు ద్వారా అందించారు. జాబ్‌మేళాలు నిర్వహించి నేత కుటుంబాల యువకులకు ఉద్యోగాలిచ్చారు. ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబాలకు రూ.లక్షన్నర ప్యాకేజీ అందించి ఆదుకున్నారు. ప్రస్తుత పాలకులు నేతన్న సమస్యలను ఏ మాత్రం పట్టించుకోకుండా బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సంక్షోభంపై బుధవారం సాయంత్రం చేనేత జౌళిశాఖ అధికారులు ఆర్డీవో సమక్షంలో సమావేశమయ్యారు. పరిశ్రమను నడపాలని వస్త్రోత్పత్తిదారులను కోరారు. పెరిగిన నూలు రేట్లతో పరిశ్రమను నడపలేమని యజమానులు తేల్చిచెప్పారు. ప్రభుత్వం మాత్రం నేతన్నలను ఆదుకోవడానికి ఎలాంటి ప్యాకేజీలు ప్రకటించకపోవడం శోచనీయం. ఈ కన్నీళ్లకు బాధ్యులెవరు? ఒక్కగానొక్క కొడుకు కళ్లెదుటే ఉరేసుకుని తనువు చాలిస్తే ఆ కన్నతల్లి గుండె చెరువైంది. గుండెలు బాదుకుంటూ ‘కొడుకా ఎంత పని చేసినావంటూ..’ లక్ష్మీదేవి చేస్తున్న రోదనలు అందరినీ కదిలించాయి. ‘అన్నయ్యా... ఎందుకీ పని చేశావని’ చెల్లెలు వేదనకు అంతేలేదు. ‘అయ్యో కొడుకా.. నేను సాంచాల్ పనికి పొయ్యేసరికి పాణం తీసుకుంటివి..’ అంటూ కన్న తండ్రి భూపతి కుమిలిపోతున్నాడు. అందరికి ఆ‘ధారమై’న చక్రధర్ ఇక సెలవంటూ.. ఈ లోకాన్ని వీడడంతో ఆ కన్నీళ్లకు బాధ్యలెవరు?. సిరిసిల్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.