ద్విచక్ర వాహనంపై మృతదేహం
♦ వడ్డేపల్లి ఇందిరానగర్ వద్ద ఘటన
♦ మృతుడు ప్రైవేట్ ఉపాధ్యాయుడు
♦ భయాందోళనకు గురైన ప్రజలు
♦ తల్లి చనిపోయిన నెలకే దారుణం
వరంగల్ క్రైం : వరంగల్ నగరంలోని వడ్డేపల్లి, ఇందిరానగర్ వద్ద శుక్రవారం రాత్రి 10 గం టలకు హత్య జరిగింది. గత నాలుగురో జుల క్రితం వరంగల్ రంగంపేట వద్ద ఇరువర్గాల నడుమ జరిగిన ఘర్షణలో ఒక యువకుడు కత్తిపోట్లకు గురై మృతిచెందాడు. ఈ క్రమంలో తాజాగా మరో హత్య జరగడం సంచల నం కలిగిస్తోంది. పోలీసులు, బంధువుల కథ నం ప్రకారం.. హన్మకొండ వడ్డేపల్లికి చెందిన రిటైర్డ్ ఎస్సై వరికోటి రాజమౌళి కుమారుడు శ్రీనివాస్ (40) హైదరబాద్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నా డు. ఆయనకు భార్య రేణుక, కుమారులు రో హిత్, రాహుల్ ఉన్నారు. అయితే శ్రీనివాస్ తల్లి లక్ష్మీ గత నెల 8వ తేదీన చనిపోగా, ఆమె అస్తికలు కాళేశ్వరంలోని గోదావరిలో కలిపేం దుకు కుటుంబం తోపాటు హన్మకొండుకు ఇటీవల వచ్చాడు.
గురువారం కాళేశ్వరం వె ళ్లాల్సి ఉండగా.. ఇంటి పక్కన ఓ వృద్ధురాలు చనిపోవడంతో ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నారు. అయి తే శుక్రవారం రాత్రి 7.30 గంటల ప్రాంతంలో పెరుగు కోసం వడ్డేపల్లి క్రాస్‌వద్దకు పిల్లలతో కలిసివెళ్లిన శ్రీనివాస్‌ను గుర్తు తెలియని వ్యక్తులు అడ్డగించారు. తర్వా త పిల్లలను బైక్‌పై నుంచి దింపి శ్రీనివాస్‌ను వారి వెంట తీసుకుపోయారు.కాగా, శ్రీనివాస్ ఎంతకు ఇంటికి రాకపోవడంతో అతడి తమ్ముడు మోహన్‌రాజు సుబేదారి పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లాడు. అయితే అప్పటికే పోలీసులకు హత్య సమాచారం తెలియడంతో వారు మోహన్‌రాజ్‌ను సంఘటనా స్థలానికి తీసుకెళ్లగా చనిపోయిన వ్యక్తి శ్రీనివాస్‌గా గుర్తించారు.
కాలుకు రక్తం..
అనుమానాస్పదంగా మృతి చెందిన వరికోటి శ్రీనివాస్‌ను ఎక్కడో చంపి ఇందిరానగర్ వద ్దకు తీసుకువచ్చి బండిపై పడుకోబెట్టి ఉంటా రని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటన స్థలం వద్ద చేసిన పరిశీలనలో దేహంపై ఎక్క డా కత్తిపోట్లు లేనట్లు తెలిసింది. ముఖంపై గాయాలు, నుదిటిపై భాగంపగిలి, కింది పెదవు పెద్దగా ఉబ్బి ఉంది. వేసుకున్న దుస్తులు కూడా తడిసి ఉన్నాయి. కళ్లపై పిడిగుద్దులు గుద్దినట్లు ఉంది. ఎడమ కాలి వేళ్ల దగ్గర నుంచి రక్తం కారి మడుగుగా తయారైంది. కుడి కాలు నుంచి కూడా రక్తం కారుతోంది.
వివాహేతర సంబంధమే కారణమా.?
మృతుడికి మరో మహిళతో ఉన్న వివాహేతర సంబంధమే హత్యకు కారణం కావచ్చు అనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. మృతుడి తమ్ముడు మోహన్ రాజ్, అతని బావమరిదిల నుంచి పోలీ సులు వివరాలు సేకరిస్తున్నారు. మృతదేహాన్ని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థలానికి హన్మకొండ ఏసీపీ మురళీధర్, సుబేదారి సీఐ శ్రీనివాస్, కేయూసీ సీఐ సతీష్ బా బులు ,ఎస్సైలు పెద్ద సంఖ్యలో పోలీసలు వచ్చారు.