జగదీష్ ఆత్మహత్య చేసుకున్న చోట గుమికూడిన ప్రజలు, ఆశా కావేరమ్మ (ఫైల్)
బొమ్మనహళ్లి : ఉదయం 8.15 గంటలు..ఓ ప్రైవేటు టీచర్ బస్సు కోసం వేచి ఉంది. పక్కనే విద్యార్థులు కూడా నిలబడి ఉన్నా రు. ఇంతలో ఓ వ్యక్తి అక్కడకు చేరుకొని టీచర్‌పై ఐదురౌండ్లు కాల్పులు జరిపాడు. దీంతో ఆమె కుప్పకూలి అక్కడికక్కడే మృ తి చెందగా కాపాడేందుకు అడ్డుగా వెళ్లిన విద్యార్థి గాయపడ్డాడు. కాల్పులు జరిపిన వ్యక్తి సమీపంలోని తోటలోకి వెళ్లి రివాల్వర్‌తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘోరం కోడుగు జిల్లా విరాజ్ పేట తాలూకాలోని బాళలే గ్రామంలో శుక్రవారం చో టు చేసుకుంది. గుణికొప్పలు గ్రామంలో ఉన్న లయన్స్ హైస్కూల్‌లో ఆశా కావేరమ్మ(50) టీచర్‌గా పనిచేస్తోంది. ఆమెకు భర్త లేడు. భార్య లేని పొన్నంపేట ప్రాంతానికి చెందిన జగదీష్ (60) ఆశా కావేరమ్మపై కన్నేశాడు.
తనను ప్రేమించాలని ఐదేళ్లుగా వెంటబడుతున్నాడు. తనకు ఇలాంటివి ఇష్టం లేదని ఆశా కావేరమ్మ చెప్పినప్పటికీ జగదీష్ వినిపించుకోలేదు. రెండు సంవత్సరాల క్రితం జగదీష్ ఆశా ఇంటికి వెళ్లి అత్యాచార యత్నం చేశాడు. పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. బెయిల్‌పై బయటకి వచ్చిన జగదీష్..మళ్లీ ఆశా వెంటబడ్డాడు. ఆమె తిరస్కరించడంతో అంతమొందించాలని నిర్ణయించాడు. శుక్రవారం ఉదయం ఆశా కావేరమ్మ పాఠశాలకు వెళ్లేందుకు బాళలె పోలిసు స్టేషన్‌కు ఎదరుగానే ఉన్న బస్టాండు వద్ద నిలబడి ఉంది. విద్యార్థులు సైతం అక్కడే బస్సు కోసం వేచి ఉన్నారు. ఇంతలో జగదీష్ అక్కడ ప్రత్యక్షమై రివల్వార్‌తో ఆశాకావేరమ్మపై ఐదు రౌండ్లు కాల్పులు జురిపాడు. పక్కనే ఉన్న ఒక విద్యార్థి అడ్డుకునేందుకు వెళ్లగా బాలుడికి కూడా గాయాలయ్యాయి. ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆశాకావేరమ్మ కుప్పకూలి మృతి చెందింది. నిందితుడు కాల్పులు జరిపిన అనంతరం సమీపంలోని ఓ తోటలోకి వెళ్లి రివాల్వార్‌తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అక్కడే ఉన్న కార్మికుడు అడ్డుకునేందుకు వెళ్లి కాల్పుల్లో గాయపడ్డాడు. పోలీసులు ఇద్దరి మృతదేహాలను ఆస్పత్రికి తరలించి గాయపడిన విద్యార్థి, కార్మికుడిని ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment