probationary IPS
-
నాలుగో సింహం.. విమెన్ ఇన్ ఖాకీ
ఎన్ని ప్రయత్నాలు చేశామన్నది కాదు... లక్ష్యం చేరామా? లేదా? అన్నదే ముఖ్యం’ అన్నట్లుగా పట్టుదలతో ఐపీఎస్ సాధించారు ఈ ఆఫీసర్లు. ఒక్కొక్కరిదీ ఒక్కో నేపథ్యం అయినా అందరి టార్గెట్ విమెన్ ఇన్ ఖాకీనే. హైదరాబాద్‌లో జరిగిన 76వ బ్యాచ్ రెగ్యులర్ రిక్రూట్స్ ΄ాసింగ్ ఔట్ పరేడ్‌లో ఈ ఐపీఎస్ ్ర΄÷బేషనరీ అధికారులు ‘సాక్షి ఫ్యామిలీ’తో మాట్లాడిన విశేషాలు...సైబర్ నేరాలునియంత్రిస్తానునేను ఢిల్లీలో పుట్టి పెరిగాను. విద్యాభ్యాసం అంతా అక్కడే కొనసాగింది. మా అమ్మ ప్రభుత్వ కళాశాలలో ్ర΄÷ఫెసర్‌గా పని చేస్తున్నారు. నాన్న ఢిల్లీలో జిల్లా విద్యాశాఖ అధికారి. నేను ఢిల్లీ యూనివర్సిటీలో జాగ్రఫీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాను. జేఎన్‌యూలో మాస్టర్స్ చేశాను. తొలి మహిళా ఐపీఎస్ అధికారి కిరణ్‌బేడీ గురించి తెలుసుకుంటూ పెరిగాను. ఆమె స్ఫూర్తితోనే ఐపీఎస్ కావాలని కలలు కన్నాను. సమాజ సేవలో విమెన్ ఇన్ ఖాకీగా ఉండాలి అన్నదే నా లక్ష్యం. నా భర్త, మా అత్తమామలు, నా కుటుంబ సహకారంతోనే ఐదో ప్రయత్నంలో నా లక్ష్యాన్ని ఛేదించాను. ఐపీఎస్‌గా సెలెక్ట్ కాకముందు ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్‌లో నాలుగేళ్లు ఢిల్లీలో పని చేశాను. 2018లో నాకు వివాహం అయ్యింది. నా భర్త ఐఆర్ఎస్ అధికారి. ఐపీఎస్ కావాలన్నది నా కల. నా భర్త సహకారంతో నా ప్రయత్నాలు కొనసాగిస్తూనే వచ్చాను. ఐదో ప్రయత్నంలో సాధించాను. నాలుగు ప్రయత్నాల్లోనూ ప్రిలిమ్స్, మెయిన్స్‌ను క్లియర్ చేసినా నేను అనుకున్న ఐపీఎస్ రాలేదు. అందుకే ప్రయత్నం కొనసాగించాను. ఐపీఎస్ శిక్షణ అనేది నన్ను మానసికంగా, శారీరకంగా దృఢంగా మార్చింది. ఏపీ కేడర్‌కు వెళుతున్నాను. మహిళల భద్రతకు, సైబర్ నేరాల నియంత్రణకు ్ర΄ాధాన్యత ఇస్తాను. – దీక్ష, ఢిల్లీకిరణ్ బేడి స్ఫూర్తి.నేను పెద్ద ΄ోలీస్ ఆఫీసర్ కావాలన్నది మా అమ్మానాన్నల కల. అది నెరవేర్చినందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఆరో ప్రయత్నంలో ఐపీఎస్ సాధించాను. నా స్వస్థలం ఉత్తరప్రదేశ్‌లోని ఆజంగఢ్. బీటెక్ కంప్యూటర్ సైన్స్‌లో పూర్తి చేశాను. తర్వాత నుంచి సివిల్ సర్వీసెస్ కోసం ప్రిపరేషన్ మొదలు పెట్టాను. నాన్న వ్యా΄ారం చేస్తుంటారు. మా కుటుంబం నుంచి మొదటి ΄ోలీస్ అధికారిని నేనే. మొదటి ఐదు ప్రయత్నాలు విఫలమైనా ఆరో ప్రయత్నంలో సక్సెస్ సాధించాను. సివిల్స్ క్లియర్ చేయాలంటే ఒక మెంటార్ తప్పనిసరి అని నా అభి్ర΄ాయం. లేదంటే మార్కెట్లో ఉన్న మెటీరియల్ అంతా చదువుకుంటూ కూర్చుంటే మన శక్తి, సమయం సరి΄ోదు. అది వృథా ప్రయత్నమే అవుతుంది. ఇప్పటికే సివిల్స్ క్లియర్ చేసిన వారి సూచనలతో ముందుకు వెళ్లడం ముఖ్యం. నేను ఐదుసార్లు విఫలం అయినా కూడా నా ప్రయత్నాన్ని వదలలేదు. కిరణ్‌బేడీ నాకు స్ఫూర్తి. నేను ఇప్పుడు తెలంగాణ కేడర్‌కు అలాట్ అయ్యాను. – వసుంధర యాదవ్, ఉత్తరప్రదేశ్నా శక్తిని తెలుసుకున్నానుచదువుకునే సమయంలో మా నాన్నే నీకో లక్ష్యం ఉండాలమ్మా అన్నారు. ΄ోలీస్ ఆఫీసర్ కావాలనుకున్నాను. మాది నంద్యాల. వ్యవసాయ కుటుంబం. అమ్మా నాన్నలు పెద్దగా చదవక΄ోయినా మా చదువుల విషయంలో ఎంతో శ్రద్ధ తీసుకున్నారు. కెరీర్ విషయంలోనూ పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. సమాజ సేవలో ప్రజలకు దగ్గరగా ఉండాలని నా లక్ష్యం. 2020లో మొదటి అటెంప్ట్ చేశాను. 2022 రెండో ప్రయత్నంలో ఐపీఎస్ సాధించాను. సివిల్స్ కోసం ప్రిపేర్ అయ్యేప్పుడు ఒక స్ట్రాటజీ ఉండాలి. ఎక్కడ మనం బలంగా ఉన్నాం, ఎక్కడ మెరుగు పర్చుకోవాలన్నది గుర్తించి దానికి తగ్గట్టుగా ప్రిపేర్ కావాలి. సీనియర్ల సూచనలు తీసుకోవడం ఉపయోగపడుతుంది. మొదటిసారి నేషనల్ ΄ోలీస్ అకాడమీలో అడుగుపెట్టినప్పుడు ఇంత కఠినమైన శిక్షణ చేయగలనా అనుకున్నాను. కానీ అకాడెమీ ట్రైనింగ్ నాలో శక్తిని తెలుసుకునేలా చేసింది. క్రమంగా మనల్ని శిక్షణలో భాగం చేస్తారు. ఏపీ కేడర్‌కు అలాట్ కావడం సంతోషంగా ఉంది. మహిళా భద్రత అనేది నా ప్రధాన లక్ష్యం. – మనీశా రెడ్డి, నంద్యాలఆత్మవిశ్వాసం పెరిగిందినీపై నీకు విశ్వాసం ఉంటే ప్రయత్న లోపం లేకుండా సాధన చేస్తే కాలం కూడా కలిసి వస్తుందని నమ్ముతాను. అపజయాలనేవి మనల్ని నిర్వచించలేవు. కొన్నిసార్లు మీ ప్రయత్నంలో లోపం లేకున్నా ఏదో ఒక చిన్న తప్పుతో విజయం రాక΄ోవచ్చు. అంత మాత్రాన నిరాశ చెందాల్సిన పని లేదు. మాది ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ జిల్లా. నా విజయంలో కుటుంబ సహకారం ఉంది. నేను రైల్వే ట్రాఫిక్ సర్వీస్‌లో 2019లో సెలక్ట్ అయ్యాను. కానీ నా లక్ష్యం మాత్రం సివిల్ సర్వీసెస్. నాలుగు ప్రయత్నాల్లో విఫలమైనా నిరాశ చెందలేదు. ఐదోసారి ఐపీఎస్ సాధించాను. నా కుటుంబంలో నేనే మొదటి ఐపీఎస్ అధికారిని. ఔట్‌డోర్ శిక్షణలో 15 కిలోల బరువుతో 40 కిలోమీటర్లు నడవడం వంటి ఎన్నో కఠిన శిక్షణల తర్వాత ఆత్మవిశ్వాసం పెరిగింది. నేను యూపీ కేడర్‌కు అలాట్ అయ్యాను. – సోనాలి మిశ్రాఉత్తరప్రదేశ్ం -
శాస్త్రీయతకు పెద్దపీట.. యువ ఐపీఎస్‌లకు మోదీ దిశానిర్దేశం
►ప్రస్తుతం వెలుగు చూస్తున్న కొత్త తరహా మోసాలు, సరిహద్దులు దాటి విస్తరించి, పోలీసుశాఖకు సవాళ్లు విసురుతున్న సైబర్ నేరాలు, ఆర్థిక నేరాల దర్యాప్తులో శాస్త్రీయ విధానాలను అవలంబించాలి. ►ఐకమత్యం, సున్నితత్వంతో విధులు నిర్వహించి పోలీసు బాధ్యతలను మరింత ప్రభావవంతంగా నిర్వహించాలి. ►జాతీయ ప్రయోజనాలే లక్ష్యంగా విధులు నిర్వహించాలి. ఈ క్రమంలో అధికారులు సాంకేతికతకు పెద్దపీట వేయాలి సాక్షి, హైదరాబాద్: యువ ఐపీఎస్ అధికారులు సురాజ్యం కోసం కదలాలని, పోలీసు శాఖకు సవాళ్లు విసురుతున్న కొత్త తరహా నేరాలను శాస్త్రీయ కోణంలో దర్యాప్తు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. సమాజంపై సానుభూతితో వ్యవహరిస్తూ రాజ్యాంగ విలువలను కాపాడేలా, పోలీసు డిపార్ట్‌మెంట్‌పై సమాజంలో సానుకూల భావన కలిగేలా విధులు నిర్వహించా లని ఆకాంక్షించారు. యువ ఐపీఎస్ అధికారులం తా ఒకే శ్రేష్ట భారత్ అనే ప్రతిష్టాత్మక పతకాన్ని చేతబూని దేశాన్ని ముందుండి నడిపించాలని హితవు పలికారు. శనివారం హైదరాబాద్ శివరాంపల్లిలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో శిక్షణ పూర్తిచేసుకున్న 71, 72వ బ్యాచ్ ప్రొబేషనరీ ఐపీఎస్‌లతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ‘రాబోయే 25 ఏళ్లలో దేశానికి స్వాతంత్య్రం వచ్చి 100 ఏళ్లు పూర్తవుతాయి. ఆ సమయానికి మన దేశ పోలీసు బలగాలు ఆధునిక, దృఢమైన, సవాళ్లను ఎదుర్కొనే స్థాయికి ఎదగాలి. అమృతోత్సవ్‌లో మీరు బాధ్యతలు తీసుకుంటూ వందేళ్ల స్వాతంత్య్ర భారతంలో కీలకభూమిక పోషించాలి’అని ఆశాభావం వ్యక్తంచేశారు. సమరయోధుల స్ఫూర్తిని గుర్తుంచుకోండి ‘గడిచిన 75 ఏళ్లలో మెరుగైన పోలీసు సేవలందించేందుకు అనేక ప్రయత్నాలు జరిగాయి. స్వాతంత్య్ర సమరయోధుల స్ఫూర్తిని దృష్టిలో ఉంచుకోండి. 1930 నుంచి 1947 మధ్యకాలంలోని యువత గొప్ప లక్ష్యాలను చేరుకుంది. వారు స్వరాజ్యం కోసం ఉద్యమించారు. నేటి యువత అయిన మీరు సురాజ్యం కోసం ముందుకు సాగాలి. జిల్లా పోలీసు అధికారిగా పరిపూర్ణ జ్ఞానం, హుందాతనంతో విధులు నిర్వహించాలి. పోలీసు డిపార్ట్మెంటులో మహిళా భాగస్వామ్యం పెరగాల్సిన అవసరముంది. జాతి బిడ్డలైన మీరు పోలీసు సేవల్లో అత్యున్నత ప్రమాణాలు, జవాబుదారీతీనం, గౌరవం, సున్నితత్వాన్ని పెంపొదించాలి’అని మోదీ చెప్పారు. కరోనా కాలంలో విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసులకు ప్రధాని శ్రద్ధాంజలి ఘటించారు. వారి త్యాగాలు వెలకట్టలేనివని కొనియాడారు. మనమంతా ఆప్తులం.. మిత్రులం ‘ఇక్కడ శిక్షణ పూర్తి చేసుకుని వెళ్తున్న పొరుగు, విదేశీ అధికారులు మన దేశాల మధ్య ఉన్న సంబంధాలను, సఖ్యతను దృష్టిలో ఉంచుకోవాలి. నేపాల్, భూటాన్, మాల్దీవులు, మారిషస్ ఏ దేశమైనా మనం కేవలం భౌగోళిక సాన్నిహిత్యమే కాకుండా.. ఆలోచన దృక్పథం, సామాజిక విధానాల్లో అనేక సారూప్యతలు కలిగి ఉన్నాం. ఎప్పుడు ఎక్కడ ఎలాంటి విపత్తు, ఆపద వచ్చినా మనమంతా మిత్రులుగా, ఆప్తులుగా ఒకరికొకరం సహకరించుకుంటాం. ఇదే స్ఫూర్తిని కరోనా సమయంలోనూ కొనసాగించాం’అని ప్రధాని చెప్పారు. మొత్తం 178 మంది సర్దార్ వల్లభాయ్ నేషనల్ పోలీస్ అకాడమీలో ఈసారి పాసింగ్ఔట్ పరేడ్‌లో పాల్గొంటున్న 71, 72వ బ్యాచ్‌ల్లో మొత్తం 178 మంది ప్రొబేషనరీ ఐపీఎస్‌లు ఉన్నారు. వీరిలో 33 మంది మహిళలు కాగా, 34 మంది విదేశీ (నేపాల్, భూటాన్, మారిషస్, మాల్దీవులకు చెందిన) అధికారులు ఉన్నారు. వీరికి ఈనెల 6న పాసింగ్ ఔట్ పరేడ్ జరగనుంది. ఈ కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ పాల్గొన్నారు. -
పటేల్ ఆశయాలను సాకారం చేయండి: ప్రణబ్ ముఖర్జీ
శిక్షణ పూర్తిచేసుకున్న ఐపీఎస్‌లకు రాష్ర్టపతి ప్రణబ్ ఉద్బోధ సాక్షి, హైదరాబాద్: సర్దార్ వల్లభాయ్‌పటేల్ ఆశయాల సాధన కోసం ప్రొబెషనరీ ఐపీఎస్‌లు కృషి చేయాలని, ఆయన ఆశయాలు ఇప్పటికీ ఆచరణీయాలేనని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. పటేల్ చెప్పినట్లుగా పోలీసులు, సివిల్ సర్వీసు అధికారులు రాజకీయాలు, మతతత్వ కార్యకలాపాలకు దూరంగా ఉండాలన్నారు. అవినీతి, పక్షపాతంగా వ్యవహరించకుండా విధులను నిర్వర్తించాలని సూచించారు. మంగళవారమిక్కడ సర్దార్ వల్లభాయ్‌పటేల్ జాతీయ పోలీసు అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకున్న 65వ బ్యాచ్‌కి చెందిన 136 మంది ఐపీఎస్ ప్రొబెషనరీ అధికారులను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించారు. ఐపీఎస్ ప్రొబెషనరీల పాసింగ్ అవుట్ పరేడ్‌లో గౌరవ వందనం స్వీకరించారు. ఉగ్రవాదం, వామపక్ష తీవ్రవాదాన్ని అణిచివేసేందుకు పోలీసులు మరింత సమర్థంగా పనిచేయాలన్నారు. దేశ సమగ్రతకు భంగం కలిగించే శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ‘‘భారత పోలీసులకు గర్వించదగ్గ చరిత్ర ఉంది. పోలీసులంటే చట్టాలను అమలుపరిచేవారు మాత్రమే కాదు. దేశ భవిష్యత్తు వారి చేతుల్లోనే ఉంది. దేశంలో అభివృద్ధి, శాంతియుత వాతావరణం కల్పించడంలో పోలీసుల పాత్రే కీలకం. పోలీసుల పనితీరు దేశ ప్రతిష్టను పెంచేలా ఉండాలి’’ అని అన్నారు. మహిళలు, బాలలపై జరుగుతున్న అత్యాచారాలు, నేరాలను అరికట్టేందుకు కేంద్రం కొత్త చట్టాలను రూపొందించిందని వివరించారు. పని ప్రదేశాలలో మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడేవారికి కఠిన శిక్షలుపడేలా చట్టాలను సవరించినట్లు తెలిపారు. పాసింగ్ అవుట్ పరేడ్‌లో రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, మంత్రి జె.గీతారెడ్డి, డీజీపీ బి.ప్రసాదరావు, పోలీసు అకాడమీ డెరైక్టర్ సుభాష్ గోస్వామి తదితరులు పాల్గొన్నారు. ఆల్ రౌండర్‌గా షాలినీ అగ్నిహోత్రి పాసింగ్ అవుట్ పరేడ్‌కు కమాండర్‌గా వ్యవహరించిన షాలినీ అగ్నిహోత్రి అంతర్గత శిక్షణ సమయంలో అనేక అవార్డులు పొంది ఆల్ రౌండర్‌గా నిలిచారు. హిమాచల్‌ప్రదేశ్ క్యాడర్‌కు చెందిన షాలినీ ఏకంగా ఏడు అవార్డులను రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న మొత్తం 136 మంది ఐపీఎస్ ప్రొబెషనరీలలో 114 మంది పురుషులు, 22 మంది మహిళలు ఉన్నారు. 25 ఏళ్లులోపు వారు 8 మంది ఉన్నారు. 25-28 వయస్సు మధ్యలో 52 మంది ఉన్నారు. గతంలో వివిధ ఉద్యోగాల్లో ఉండి ఐపీఎస్‌కు ఎంపికైనవారు 104 మంది ఉన్నారు. వీరితోపాటు రాయల్ భూటాన్ ప్రొబెషనరీలు 04, మాల్దీవులకు చెందినవారు 03, నేపాల్‌కు చెందిన ఐదుగురు కూడా శిక్షణ పూర్తిచేసుకున్నారు. రాష్ట్రపతికి వీడ్కోలు.. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రెండ్రోజుల రాష్ట్ర పర్యటన ముగిసింది. నేషనల్ పోలీస్ అకాడమీలో ఐపీఎస్ అధికారుల పరేడ్‌లో పాల్గొన్న అనంతరం ఆయన నేరుగా బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. భారత వాయుసేనకు చెందిన ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లారు. గవర్నర్ నరసింహన్, సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, మంత్రులు జానారెడ్డి, శ్రీధర్‌బాబు, గీతారెడ్డి, ఎంపీలు వి.హనుమంతరావు, పొన్నం ప్రభాకర్, మధుయాష్కీ, వివేక్ తదితరులు రాష్ట్రపతికి వీడ్కోలు పలికారు. రాష్ట్ర పర్యటనను ముగించుకుని వెళుతున్న రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీకి వీడ్కోలు చేప్పే కార్యక్రమానికి సీమాంధ్ర మంత్రులు, నేతలు ముఖం చాటేయడం చర్చనీయాంశమైంది.