Prof Sai Baba
-
26 నుంచి ఎంసెట్ దరఖాస్తుల స్వీకరణ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ఇంజనీరింగ్, అగ్రికల్చర్ తదితర వృత్తివిద్యా కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించి నిర్వహించే ఎంసెట్–2019కు ఈ నెల 26వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. శుక్రవారం జరిగిన ఎంసెట్ నిర్వహణ కమిటీ సమావేశంలో షెడ్యూల్ తేదీలను నిర్ణయించారు. ఆలస్య రుసుము లేకుండా ఎంసెట్ దరఖాస్తుల స్వీకరణ గడువు మార్చి 27 వరకు ఉందని, ఏప్రిల్ 20 నుంచి పరీక్షలను ఆన్లైన్లో నిర్వహించి ఫలితాలను మే 5న ప్రకటించనున్నామని ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ సీహెచ్ సాయిబాబు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంసెట్ షెడ్యూల్ వివరాలివీ.. ఎంసెట్–2019 నోటిఫికేషన్ జారీ:(ఫిబ్రవరి 20),ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం(ఫిబ్రవరి26), ఆలస్యరుసుము లేకుండా దరఖాస్తుల స్వీకరణ గడువు(మార్చి27), రూ.500 ఆలస్య రుసుముతో గడువు(ఏప్రిల్04),రూ.1,000 ఆలస్యరుసుముతో గడువు (ఏప్రిల్ 09),రూ.5,000 ఆలస్యరుసుముతో గడువు(ఏప్రిల్ 14), వెబ్సైట్నుంచి హాల్‌టికెట్ల డౌన్లోడ్(ఏప్రిల్ 16 నుంచి), రూ.10,000 ఆలస్య రుసుముతో గడువు(ఏప్రిల్ 19), ఇంజనీరింగ్ కేటగిరీ పరీక్షల తేదీలు(ఏప్రిల్ 20, 21, 22, 23), అగ్రికల్చర్ కేటగిరీ పరీక్షల తేదీలు(ఏప్రిల్ 23, 24),ఇంజనీరింగ్, అగ్రికల్చర్ రెండు కలిపి(ఏప్రిల్ 22, 23),పరీక్ష సమయం(ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు),(మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు),(మే 05),ఫలితాల విడుదల అని వెల్లడించారు. -
నగరాల్లో మావోయిస్టు పార్టీ నెట్‌వర్క్‌కు చెక్!
సాక్షి, హైదరాబాద్: పోలీసుల వేట దిశ మారింది. అర్బన్ మావోయిజాన్ని అణచివేసే చర్యలు చేపట్టారు. అడవుల్లో మావోయిస్టుల కోసం వేట సాగించే పోలీస్ శాఖ ఇప్పుడు నగరాలు, పట్టణాల్లో అనుబంధ సంఘాలపై దృష్టి పెట్టింది. బీమా కోరేగావ్ ఉదంతం మొదలు తాజాగా అరెస్టయిన మావోయిస్టు మహిళా సానుభూతిపరుల వ్యవహారం వరకు అర్బన్ హంటింగ్‌ను స్పష్టం చేస్తోంది. మావోయిస్టు పార్టీకి తోడ్పాటు... మావోయిస్టు పార్టీ తను చెప్పాలనుకున్న అంశాలు, జనాల్లోకి వ్యాప్తి చేయించాల్సిన కార్యకలాపాలను ఫ్రాక్షన్ కమిటీల ద్వారా పంపిస్తుంది. అయితే, అనుబంధ సంఘాలు వివిధ రూపాల్లో మావోయిస్టు పార్టీకి మద్దతుగా పనిచేస్తు న్నాయని ముందునుంచి పోలీస్ శాఖ ఆరోపిస్తూ వస్తోంది. కానీ, నేరుగా ఆ సంఘాల సభ్యులనుగానీ, బాధ్యులను గానీ మావోయిస్టులుగా గుర్తించి అరెస్ట్ చేయలేదు. బీమా కోరేగావ్ వ్యవహారంలో మావోయిస్టు అనుబంధ సం«ఘ సభ్యులుగా ఉన్న తెలంగాణకు చెందిన వరవరరావు, ఫరీదాబాద్‌కు చెందిన సుధా భరద్వాజ్, ముంబైకి చెందిన అరుణ్ ఫెరారియా, గన్సల్వేస్, న్యూఢిల్లీ జర్నలిస్టు నవలఖను పుణే పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. వీరంతా మావోయిస్టు పార్టీకి తోడ్పాటు అందిస్తూ నగరాల్లో, పట్టణాల్లో మావోయిస్టు కార్యకలాపాలను విస్తృతం చేస్తున్నారని ఆరోపించారు. ప్రొఫెసర్ సాయిబాబా ఎపిసోడ్... ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ సాయిబాబా పౌర హక్కుల సంస్థలో క్రియాశీలకంగా వ్యవహరించారు. ఆయనతోపాటు జేఎన్‌యూ విద్యార్థి హేమా మిశ్రా, మాజీ జర్నలిస్టు ప్రశాంత్ రాహీలను పోలీసులు అరెస్టు చేయగా.. వీరంతా నాగ్‌పూర్ కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తున్నారు. వెంకట్రావ్, భవానీ, అన్నపూర్ణ, అనూష... రాడికల్ స్టూడెంట్ యూనియన్ విధానాలకు ఆకర్షితుడైన ఎన్జీఆర్ఐ ఉద్యోగి నక్కా వెంకట్రావ్ 33 ఏళ్లుగా మావో యిస్టు పార్టీ కోసం పనిచేస్తున్నారని ఛత్తీస్‌గఢ్ పోలీస్ శాఖ ఆరోపించింది. ఏపీలోని పాడేరు పోలీసులు అరెస్ట్ చేసిన ముగ్గురు మహిళలు(అక్కాచెల్లెళ్లు) ఆత్మకూరు భవానీ, అన్నపూర్ణ, అనూషలు మావోయిస్టు పార్టీ సానుభూతిపరులుగా ఉండటంతోపాటు చైతన్య మహిళా సంఘం(సీఎంఎస్)లో పనిచేస్తున్నారు. అనూష మావోయిస్టు పార్టీ దళసభ్యురాలిగా పనిచేస్తోందని తెలిపారు. వీళ్ల తండ్రి రమణయ్య కుల నిర్మూలన పోరాట సమితి, తెలంగాణ ప్రజాఫ్రంట్ నేతగా పనిచేస్తున్నారు. ఈ ముగ్గురి అరెస్ట్ రెండు రాష్ట్రాల పౌర హక్కుల నేతలను ఉక్కిరిబిక్కిరిచేస్తోంది. అనూష చేసిన నేరాలు... మావోయిస్టు పార్టీ దళ సభ్యురాలిగా ఉన్న అనూష ఈ ఏడాది ఫిబ్రవరిలో తిక్కరపాడు వద్ద మాటువేసి పోలీసులపై కాల్పులు జరిపింది. ఈ ఏడాది మేలో పాన్పోదార్, జుడంబో గ్రామంలో పోలీసు వాహనాలపై దాడులు, నవంబర్‌లో ఒడిశా సుర్మతి ఏవోబీ సరిహద్దులో రెక్కీ చేసి పోలీసులపై మందుపాతరలతో దాడి చేసింది. రిక్రూట్మెంట్ వెనుక అనుబంధ సంఘాలు? రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీస్థాయిలో నిరుద్యోగ యువతను ఉద్యమాల పేరుతో మావోయిస్టుపార్టీ వైపు మళ్లించేందుకు అనుబంధ సంఘాలు ప్రయత్నిస్తున్నా యని తెలంగాణ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఆరోపిస్తోంది. ఇందులో భాగంగా గతంలో మావోయిస్టు పార్టీలో చేరేందుకు యత్నించిన 32 మందిని తెలంగాణ ఎస్ఐబీ గుర్తించి వెనక్కి తీసుకువచ్చింది. వీరికి ఆంధ్రా ఒడిశా బార్డర్(ఏవోబీ) కమిటీ కారద్యర్శి హరగోపాల్ అలియాస్ రామకృష్ణ ప్రోత్సాహం ఉందని బయటపడింది. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేను హతమార్చిన వ్యవహారంలో రామకృష్ణ యాక్షన్ ప్లానే అమలు చేశారని ని ఘా వ్యవస్థ గుర్తించింది. ఇలా 2 రాష్ట్రాల్లో ఎంతమందిని రిక్రూట్ చేశారు? వారిప్పుడు ఎక్కడ ఉన్నారన్న దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. అనుబంధ సంఘాలను నియంత్రిస్తే గానీ రిక్రూట్‌మెంట్‌ను ఆపలేమని ఇరు రాష్ట్రాల పోలీసులు భావిస్తున్నట్టు తెలుస్తోంది. అక్రమ అరెస్టులకు పాల్పడుతోంది అర్బన్ నక్సల్స్ పేరుతో ప్రభుత్వం అక్రమ అరెస్టులకు పాల్పడుతోందని పౌర హక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్ మంగళవారం ఆరోపించారు. ఎప్పుడు ఎవరిని అరెస్టు చేస్తారో తెలియని అనిశ్చితి నెలకొందన్నారు. చట్టబద్ధమైన, ప్రజాస్వామిక పాలనకు విరుద్ధంగా నిర్బంధాన్ని తీవ్రతరం చేస్తున్నారని విమర్శించారు. ఈ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు. బీజేపీ పదవీ కాలం ముగియనున్న తరుణంలో ప్రజలపై నిర్బంధాన్ని తీవ్రతరం చేస్తోందన్నారు. రాష్ట్రంలో మరోసారి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ గత ఐదేళ్లుగా అనుసరించిన నిర్బంధాన్ని తిరిగి కొనసాగిస్తోందని మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొనసాగిస్తున్న ఈ నిర్బంధం వల్ల సమాజంలో హింస పెరిగే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. చట్టబద్ధమైన పాలనకు విరుద్దంగా రాజ్యాంగాన్ని అగౌరవపరిచే విధంగా పరిపాలన ఉందని విమర్శించారు. ‘మా పిల్లలకు సంబంధం లేదు’ తమ పిల్లలకు మావోయిస్టులతో ఎలాంటి సంబంధం లేదని విశాఖ పోలీసులు అరెస్టు చేసిన భవానీ, అన్నపూర్ణ, అనూషల తల్లిదండ్రులు రమణయ్య, లక్ష్మీనర్సమ్మలు అన్నారు. మంగళవారం ఇక్కడ మీడియాతో మాట్లాడారు. పెద్ద కూతురు భవానీ టైలరింగ్ చేస్తుండగా, మిగతా ఇద్దరు అన్నపూర్ణ, అనూషలు మహిళా సంఘాల్లో పనిచేస్తున్నట్లు తెలిపారు. అక్రమంగా అరెస్టు చేసిన తమ పిల్లలను విడుదల చేయాలని వేడుకుంటున్నారు. -
ఆ జీవితఖైదు రాజ్యాంగ విరుద్ధం
ప్రొఫెసర్ హరగోపాల్ హైదరాబాద్: ప్రొఫెసర్ సాయిబాబాకు జీవిత ఖైదు విధించడం రాజ్యాంగ విరుద్ధమని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. బుధవారం హైదర్‌గూడ ఎన్ఎస్ఎస్లో తెలంగాణ ప్రజాస్వామిక వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వరవరరావుతో కలసి ఆయ న మాట్లాడారు. ప్రభుత్వం ఏడుగురిని అరెస్ట్ చేసి బెయిల్ ఇవ్వకుండా 70 నుంచి 80 రోజులు జైల్లో పెట్టడం అప్రజాస్వామికమన్నారు. తెలం గాణ సీఎం కేసీఆర్ కార్యాలయానికి ప్రజా సంఘాల నేతలు వెళితే కలిసే పరిస్థితి లేదని.. ఇదెక్కడి ప్రజాస్వామ్యమని ఆయన ప్రశ్నించారు. ప్రొఫెసర్ సాయిబాబాకు జీవితఖైదు విధించడంతో షాక్‌కు గురయ్యామని.. దీనిపై న్యాయస్థానంలోనే కాక బయట సైతం పోరాటం చేస్తామన్నారు. ఈ జడ్జిమెంట్‌ను పునః పరిశీలించాలని ఆయన డిమాండ్ చేశారు. విరసం నేత వరవరరావు మాట్లాడుతూ.. దుర్గప్రసాద్ లాంటి జర్నలిస్ట్, ప్రశాంత్‌రాహి లాంటి వారు ప్రజా ఉద్యమంలో పాల్గొంటే తప్పా అని ప్రశ్నించారు.సాయిబాబాకు క్రిమినల్ అఫెన్స్ లేదన్నారు. సాయిబాబా తీర్పు న్యాయమూర్తి రాసింది కాదని, ఎన్ఐఏ రాసిందని ఆరోపించారు. దీనిపై హైకోర్టులో అప్పీల్æ చేస్తామన్నారు. ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజాస్వామ్యవాదులను తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వాలు నిర్బంధించి 75 రోజులుగా సుక్మాజైల్లో రాజ్య నిర్బంధం చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై అంతా పోరాటాలు చేయాలన్నారు. -
ప్రొ.సాయిబాబాను విడుదల చేయాలి
విరసం నేత వరవరరావు డిమాండ్ న్యూశాయంపేట: ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాను విడుదల చేయూలని విరసం నేత వరవరరావు డిమాండ్ చేశారు. బెయిల్ రద్దు చేయడం న్యాయసూత్రాల ఉల్లంఘనే అని అన్నారు. శనివారం హన్మకొండలో ఆయన విలేకరులతో మాట్లాడారు. సాయిబాబా బెయిల్‌ను నాగపూర్ హైకోర్టు బెంచ్ రద్దు చేసిందని.. శుక్రవారం రాత్రి ఆయనను తిరిగి నాగపూర్ సెంట్రల్ జైలుకు పంపించారన్నారు. జైలుకు పంపడం రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమేనని, సాయిబాబాను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో కూడిన డివిజన్ బెంచి ఈనెల 31 వరకు ఇచ్చిన మధ్యంతర బెయిల్‌ను నాగపూర్ హైకోర్టు సింగిల్ బెంచి జడ్జి రద్దు చేయడం.. తనకన్నా పైన ఉండే ప్రధాన న్యాయమూర్తి నిర్ణయాన్ని బేఖాతరు చేయడమేనని ధ్వజమెత్తారు. ఇంతటితో ఊరుకోకుండా ప్రభుత్వం ఓ పత్రికలో సాయిబాబాను యుద్ధఖైదీగా పేర్కొంటూ ఆయనను విడుదల చేయాలని రాసిన రచయిత్రి అరుంధతిరాయ్ రచనపై కంటెంప్ట్ ఆఫ్ కోర్టు నోటీసు ఇవ్వడం అవాంచనీయమే కాకుండా.. భావప్రకటనా స్వేచ్ఛకు ప్రభుత్వం సంకెళ్ళు వేయడమేనని అన్నారు. ఈ రెండు చర్యలపై ప్రజలు ప్రజాస్వామికవాదులు ఉద్యమించాలని విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ చండీయూగం రాజ్యాంగ ఉల్లంఘన సీఎం కేసీఆర్ వ్యక్తిగత చండీయాగం ఒక ప్రభుత్వ కార్యక్రమంగా మారడం రాజ్యాంగ ఉల్లంఘన అని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు విరసం నేత వరవరరావు అన్నారు. ప్రజల సొమ్ముతో అధికార దుర్వినియోగం చేయడాన్ని లౌకిక ప్రజాస్వామిక వాదులందరూ వ్యతిరేకించాలని విజ్ఞప్తి చేశారు. విలేకరుల సమావేశంలో టీపీఎఫ్ నాయకులు రమాదేవి, వీరబ్రహ్మచారి, అభినవ్, నల్లెల రాజయ్య, పి.రమేష్‌చందర్, బదావత్ రాజు పాల్గొన్నారు.