Projects pending
-
జలయజ్ఞానికి టీడీపీ విఘ్నాలు..
ఇది నీటి కథ.. కన్నీటి కథ. ప్రజల కన్నీళ్లు తుడవడానికి నడుం బిగించిన మహా నాయకుడు కన్ను మూశాక, కసాయి పాలకుల ఏలుబడిలో అటకెక్కిన ఆనకట్టలు కథ. 5 ఏళ్ల నుంచి నియోజకవర్గ ప్రజలు పడుతున్న వ్యథ. పొట్ట చేతబట్టుకుని ప్రజలు వలసపోకూడదని సాగునీటి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు రైతు బాంధవుడు రాజశేఖరరెడ్డి. ఆయన మరణం రైతులకు తీరని శాపమే అయ్యింది. తర్వాత వచ్చిన పాలకులే ‘‘పచ్చ’’పాతం చూపిస్తుంటే కాలువల్లో పారాల్సిన నీళ్లు రైతుల కళ్లల్లో పారుతున్నాయి. జలదాత రాజశేఖరరెడ్డి ప్రారంభించిన జలయజ్ఞాన్ని టీడీపీ నాయకులు విఘ్నాలు కలిగిస్తు ప్రజలకు సాగు, తాగు నీరు అందకుండా అడ్డుపడుతున్నారు. నీటి కష్టాలు తీరాలంటే ఆ పెద్దాయన బిడ్డ పాలన రావాలని ప్రజలు ఎదురుచూస్తున్నారు. జగనన్నతో రాజన్న పాలన చూడాలని ఆశ పడుతున్నారు. సాక్షి, అద్దంకి (ప్రకాశం): వర్షాధార భూములను ఆరుతడి, మాగాణి భూములుగా మార్చడం కోసం అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జలయజ్ఞం చేపట్టారు. జలయజ్ఞంలో భాగంగా నియోజకవర్గంలోని అద్దంకి, కొరిశపాడు మండలాల్లో భవనాశి మినీ రిజర్వాయర్, యర్రం చిన్నపోలిరెడ్డి పథకాన్ని చేపట్టారు. మిగిలిన మండలాల్లో ఎత్తిపోతల పథకాల ఏర్పాటుతో 25వేల ఎకరాల మెట్ట భూములను మాగాణి, ఆరుతడి పంట పండే భూములుగా చేయాలనేదే రాజశేఖర్‌రెడ్డి సంకల్పం. ఆయన అకాలం మరణం తరువాత గద్దెనెక్కిన అధికార టీడీపీ ఆ ప్రాజెక్టులను, ఎత్తిపోతల పథకాలను పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. ప్రాజెక్టులు పూర్తి చేస్తే ఎక్కడ రాజశేఖర్‌రెడ్డికి పేరు వస్తుందని భయంతో ప్రాజెక్టులను వదిలేసింది. పాదయాత్ర సమయంలో అద్దంకి వచ్చిన వైఎస్సార్ సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి తమ పార్టీ అధికారంలోకి వస్తే పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తామని ఇచ్చిన హామీని గట్టిగా నమ్ముతున్నారు. రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్ సీపీని తమ ఓటుతో గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ముందుకు సాగని భవనాశి.. శింగరకొండ క్షేత్ర సమీపంలోని భవనాశి చెరువును విస్తరింపజేసి, బల్లికురవ మండలంలోని వెలమావారిపాలెం వద్ద గుండ్లకమ్మ నదికి అడ్డంగా చెక్ డ్యాం ఏర్పాటుతో, నీటిని కాలువ ద్వారా చెరువులకు నీరు మళ్లించి మినీ రిజర్వాయర్ చేయాలనుకున్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే ప్రస్తుతం ఉన్న 1797 ఎకరాల సాగు భూమితో పాటు, మరో 5 వేల ఎకరాల భూములను మాగాణి భూమూలుగా మారి రైతులు ఆర్థికంగా బలపడతారని సంకల్పించారు. రూ.27 కోట్ల నిధుల కేటాయింపుతో 2009లో మినీ రిజర్వాయరు పనులకు శంకుస్థాపన చేశారు. 2013లో పనులు ప్రారంభయమ్యాయి. ఆయన హఠన్మరణం తరువాత పరిణామాలు, 2014లో టీడీపీ ప్రభుత్వం అధికారం చేపట్టడంతో, ప్రాజెక్టుల పనులు పూర్తికాలేదు.ఏడాదికేడాది పనులు పూర్తి కాకపోవడంతో, ఇదే చెరువును సోర్స్‌గా చేసుకుని నిర్మించిన తారకరామ ఎత్తిపోతల పథకం మూలనపడింది. రాజశేఖరరెడ్డి తనయుడు జగన్మోహన్రెడ్డి పార్టీ అధికారంలోకి వస్తేనే ప్రాజక్టులు పూర్తి చేస్తారని ప్రజలు పూర్తిగా విశ్వసిస్తున్నారు. ఎత్తిపోతల పథకాలు వదిలేశారు.. బల్లికురవ: మండల పరిధిలోని నక్కబొక్కలపాడు గ్రామం పేరుకు సాగరు ఆయకట్టులో ఉన్న చివర భూములు కావడంతో ఆరుతడి పంటలకు సైతం నీరందడం లేదు. 2008లో డిసెంబరులో అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి కృషితో నక్కబొక్కలపాడు వాగు నుంచి ఎత్తిపోతల పథకం ఏర్పాటుకు రూ.7 కోట్లు నిధులు మంజూరు చేశారు. అప్పట్లోనే 90శాతం పనులు మాత్రమే పూర్తి చేశారు. తదనంతరం వచ్చిన టీడీపీ 10 శాతం పూర్తిచేకుండా ఐదేళ్లు పాలన పూర్తి చేసింది. ఈర్ల చెరువును 2009లో రిజర్వాయరుగా మార్చేందుకు రూ.50లక్షలు మంజూరు చేశారు. పనులు మాత్రం ముందుకు సాగలేదు. చినపోలిరెడ్డి పథకంలో నిర్లక్ష్యం.. మేదరమెట్ల: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా పదవిలోకి రాగానే కొరిశపాడు మండలంలోని రైతులు పడుతున్న ఇబ్బందులను తెలుసుకొని రూ.177 కోట్ల వ్యయంతో 2004వ సంవత్సరంలో యర్రం చినపోలిరెడ్డి ఎత్తిపోతల పథకాన్ని నిర్మించేందుకు శ్రీకారం చుట్టారు.ఈ రిజర్వాయర్ 2008వ సంవత్సరాలనికి పూర్తి చేయాలని సంకల్పించారు. ఈ పథకం పూర్తి చేసుకుంటే మండలంలోని పలు గ్రామాలకు సుమారు 20 వేల ఎకరాలకు పైగా సాగు నీరు అందిచే అవకాశం ఉంది. ఆయన అకాల మరణంతో పనులు నిలిపేశారు. వైఎస్సార్సీపీ గుర్తుతో గెలిచిన స్థానిక శాసనసభ్యుడు అధికార పార్టీలోకి వెళ్లడంతో యర్రం చినపోలిరెడ్డి ఎత్తిపోతల పథకం నిర్మాణం పనులు పూర్తిగా నిలిచిపోయాయి. ముంపుకు గురవుతున్న తూర్పుపాలెం గ్రామానికి గానీముంపుకు గురైన వ్యవసాయ భూములకు గానీ ఇప్పటి వరకు ఎలాంటి నష్టపరిహారం అందించలేదు.ఈ గ్రామంలో కేవలం రెడ్డి సామాజిక వర్గం వారు అధికంగా ఉండటంతో ఇక్కడ ఎలాంటి పరిహారం అందించలేదనే విమర్శలు ఉన్నాయి. కేవలం ఒంగోలు మాజీ ఎంపీ వైవీసుబ్బారెడ్డి తండ్రి పేరుతో పథకం నిర్మాణం ఉండటం వల్లనే అధికార పార్టీ నేతలు నిర్లక్ష్యం వహిస్తున్నారనే విమర్శలు రైతుల నుంచి వినిపిస్తున్నాయి. రావమ్మకుంట పూర్తయితే పచ్చని పొలాలు జే పంగులూరు: మండల పరిధిలోని 21 గ్రామాల్లో భూమి వర్షాధారంతో పండే మెట్ట భూమి. అలవలపాడులోని రావమ్మకుంటకు, కొండమూరు చెరువుకు పమిడిపాడు మేజరు నుంచి నీరు వచ్చేది. ఐదు సంవత్సరాలుగా మేజరుకు నీరు సక్రమంగా అందకపోవడంతో, చెరువులు వట్టిబోయాయి. చెరువులను రిజర్వాయర్లుగా మారిస్తే తిరిగి పూర్వ వైభవంతో మాగాణి పంట పండించుకుంటామని ప్రజా ప్రతినిధులను వేడుకున్నా ఫలితం లేకుండా పోతుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంగులూరు మండలం మాగాణి, మెట్ట పంటలతో భూములు పచ్చాగా కళకళలాడాలంటే వైఎస్సార్ సీపీ అధికారంలోకి వస్తేనే సాధ్యమవుతుందని నమ్ముతున్నారు. భవనాశి పూర్తయితే భూములు సస్యశ్యామలం భవనాశి మినీ రిజర్వాయరు పూర్తయితే వేలాది ఎకరాల భూములకు సాగు నీరు, ప్రజలకు తాగు నీరు అందుతుంది. ప్రాజెక్ట్ పూర్తయితే రాజశేఖరరెడ్డికి పేరొస్తుందని టీడీపీ నాయకులే నిర్లక్ష్యం వహిస్తున్నారు. ప్రజలు ఉపయోగపడే పథకాలపై ఇలా నిర్లక్ష్యం వహించడం టీడీపీ తగదు. ప్రాజెక్ట్ పూర్తి కావాలంటే వైఎస్సార్ సీపీ అధికారంలోకి రావాల్సిందే. - యర్రా అంజయ్య, గోవాడ జగనన్నను సీఎం చేస్తాం, జలాన్ని తెచ్చుకుంటాం రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్ సీపీని గెలిపించుకుని జగనన్నను సీఎం చేసుకుంటాం. ఎత్తిపోతల పథకాలు పూర్తి చేసుకుని సాగుకు, తాగుకు నీటిని తెప్పించుకుంటాం. జలదాత రాజశేఖర రెడ్డి ప్రారంభించిన పథకాలు పూర్తి కావాలంటే వైఎస్సార్ సీపీ గెలవాల్సిందే. - చల్లగుండ్ల శ్రీనివాసరావు, నక్కబొక్కలపాడు పథకాన్ని నిర్వీర్యం చేశారు మూడేళ్లలో పూర్తి చేయాల్సిన ఎత్తిపోతల పథకాన్ని ఐదేళ్లైనా పూర్తి చేయలేదు.వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రారంభించిన పథకం కాబట్టి పథకం పూర్తి చేస్తే ఆయనకు పేరు వస్తుందని పట్టించుకోలేదు. ప్రజల సమస్యలు పట్టించుకోని ప్రభుత్వాలకు ఏలా బుద్ధి చెప్పాలో మాకు తెలుసు. ఇంత వరకు ముంపు గ్రామాలకు నష్టపరిహారం చెల్లించలేదు. - లేళ్ల సుబ్బారెడ్డి, తూర్పుపాలెం, మేదరమెట్ల రావమ్మ కుంట పూర్తయితే వెయ్యి ఎకరాలకు నీరు పంగులూరు పరిధిలో మెట్ట భూములు ఎక్కువ, రావమ్మ కుంట చెరువును రిజర్వాయర్‌గా మారిస్తే వెయ్యి ఎకరాలు సాగు భూమిగా మారుతుంది. తాగునీటికి కూడా ఇబ్బందులు తొలుగుతాయి. పాదయాత్ర సమయంలో జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. వైఎస్‌స్రాŠ సీపీ అధికారంలోకి వస్తే మా సమస్య తీరుతుందని నమ్ముతున్నాం. - శేఖర్‌బాబు, పంగులూరు -
నాలుగేళ్లలో ఏం చేశారు?
మిర్యాలగూడ : టీఆర్ఎస్ అధికారంలో ఉన్న నాలుగేళ్లలో ఏం అభివృద్ధి చేశారో ప్రజలకు తెలియజేయాలని సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆదివారం మిర్యాలగూడలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ హయాంలోనే అభివృద్ధి జరిగిందన్నారు. నాలుగేళ్ల కాలంలో ఒక్క ప్రాజెక్టు నిర్మించారా? ఒక్క పరిశ్రమ కట్టారా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయలేదని టీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారని, ఆ పార్టీ నాయకులకు అభివృద్ధి చేయడం చేతకాదని, వారికి ఇతర పార్టీల నాయకుల గురించి అపహాస్యంగా మాట్లాడటమే తెలుసని అన్నారు. నాగార్జునసాగర్ సాగర్ ప్రాజెక్టు కాంగ్రెస్ పార్టీ హయాంలో నిర్మిస్తే కాలువకు నీళ్లిచ్చి గతంలో ఎన్నడూ నీళ్లు రానట్లుగా తామే ఇచ్చామనేవిధంగా గొప్పలు చెప్పుకుంటున్నారని అన్నారు. నాలుగేళ్లలో ఏం చేశారో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. మిర్యాలగూడ పట్టణంలో తమ హయాంలో నిధులు మంజూరు చేసి నిర్మించిన ఫ్లైఓవర్ బ్రిడ్జిని టీఆర్ఎస్ నాయకులు ప్రారంభించి తాము నిర్మించినట్లు చెబుతున్నారని అన్నారు. మిర్యాలగూడ నియోజకవర్గంలో ఏ ఒక్క గ్రామానికైనా కొత్తగా మంచినీటి సదుపాయం కల్పించారా? పట్టణంలోని ఆడిటోరియం నిర్మించారా? అని జానారెడ్డి ప్రశ్నించారు. టీఆర్ఎస్కు ప్రజలు సరైన సమయంలో గుణపాఠం చెబుతారని అన్నారు. సమావేశంలో దామరచర్ల జెడ్పీటీసీ శంకర్‌నాయక్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పొదిల శ్రీనివాస్, పీసీసీ సభ్యులు పగిడి రామలింగయ్య, చిరుమర్రి కృష్ణయ్య, స్కైలాబ్‌నాయక్, పట్టణ అధ్యక్షుడు కరీం, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కర్నాటి రమేష్, కార్యదర్శి బండారు కుశలయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు ముజ్జు రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. -
అందుబాటులోకి విజ్ఞాన గని
సైన్స్‌సెంటర్, ఇండోర్ స్టేడియూన్ని ప్రారంభించనున్న ముఖ్యమంత్రి రాష్ర్టంలోనే ఏకైక సైన్స సెంటర్ ఇదే.. పూర్తయిన నిర్మాణ పనులు శిల్పారామం, మ్యూజియంపైనా దృష్టి ప్లానెటోరియం పునరుద్ధరణపై చర్చ ఆ మూడూ పూర్తయితే సాంస్కృతిక వైభవం వచ్చినట్టే.. సాక్షి, హన్మకొండ : నగరానికి మణిపూసలుగా పేర్కొనదగిన ప్రాజెక్టులు ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్నాయి. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కాళోజీ కళాక్షేత్రానికి శంకుస్థాపన చేసేందుకు ఈ నెల 9న వరంగల్ నగరానికి వస్తున్నారు. దీంతో పాటు హంటర్‌రోడ్డులో ఉన్న స్టేట్ సైన్స్ సెంటర్, కార్పొరేషన్ ఆవరణలో ఉన్న ఇండోర్ స్టేడియంను ముఖ్యమంత్రి చేతులమీదుగా ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ రెండు ప్రాంతాల్లో హడావుడిగా పనులు చేపట్టారు. అంతేకాకుండా.. ఏళ్లతరబడి పెండింగ్‌లో ఉన్న శిల్పారామం, పురావస్తుశాఖ మ్యూజియం నిర్మాణంతో పాటు మూడేళ్లుగా మూతపడి ఉన్న ప్లానెటోరియం స్థితిగతులపై సైతం సీఎం దృష్టి సారించే అవకాశం ఉండటంతో వాటికి సంబంధించి కూడా అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఏకైక సైన్స్ సెంటర్.. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1986లో ఏకకాలంలో తిరుపతి, విజయవాడ, వరంగల్‌లో మూ డు రీజినల్ సైన్స్‌సెంటర్లను మంజూరు చేశారు. అయితే 1999 వరకు ఎవరూ ఈ సెంటర్ గురించి పట్టించుకోలేదు. ఎట్టకేలకు 1999లో అప్పటి సీఎం చంద్రబాబునాయుడు శిలాఫలం వేశారు తప్పితే నిధులు కేటాయించలేదు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయూంలో 2008లో ఈ సెంట ర్ నిర్మాణం కోసం రూ.5.87 కోట్లు కేటాయించారు. ఆయన అకాల మరణం తర్వాత మళ్లీ వేగం మందగించింది. నెమ్మది నెమ్మదిగా పనులు జరుగుతూ 2012లో భవనం నిర్మాణం పూర్తుంది. ఆ ఏడాదిలోనే కోటి రూపాయల వ్యయం చేసే సైన్సు ఎగ్జిబిట్లు అమర్చారు. ఆ తర్వాత ఏడాది పాటు పనుల్లో ప్రతిష్టంభన ఏర్పడింది. సైన్స్ సెంటర్ ప్రారంభోత్సవంలో జరుగుతున్న జాప్యంపై ‘సాక్షి’ వరుసగా కథనాలు ప్రచురించింది. అయితే ఇటీవల పనులు వేగం పుంజుకున్నాయి. ఇప్పటికే లిఫ్టును బిగించడం పూర్తికాగా వాహనాల పార్కింగ్, లాన్, ల్యాండ్‌స్కేప్, టాయిలెట్స్, ఆర్చ్, సెక్యూరిటీ సెల్ వంటి పనులు పూర్తికావొచ్చాయి. ప్రస్తుతం ఈ సైన్స్ సెంటర్ ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది. మూడు అంతస్తుల భవనం గల గల సైన్స్ సెంటర్ ప్రాంగణంలో పార్కింగ్ మొదలు భవనంలో ప్రతీ అంతస్తులో వివిధ శాస్త్ర సాంకేతిక రంగాలకు సంబంధించిన ఎగ్జిబిట్లు బిగించారు. ఏడు విశాలమైన హాళ్లలో కూడి ప్రధాన భవనంలో మొదటి రెండు హాళ్లలో ఫిజికల్ సైన్స్ ఎగ్జిబిషన్లు ఉన్నాయి. మిగతా వాటిలో వరుసగా స్పేస్‌సైన్స్, సోలార్ పవర్, 5డి థియేటర్, ఎన్విరాన్మెంటల్ పొల్యుషన్లతో పాటు మానవ శరీర నిర్మాణ శాస్త్రానికి సంబంధించిన నమూనాలు ఉన్నాయి. చివరగా ఎడ్యుకేషన్ త్రూ సాటిలైట్ హాల్ కూడా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఏకైక సైన్స్ సెంటర్ ఇదే. ఇక ఆడుకోవచ్చు.. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంగణంలో రూ.3.5 కోట్ల వ్యయంతో ఇండోర్ స్టేడియాన్ని నిర్మించేందుకు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి 2010 సెప్టెంబర్‌లో శంకుస్థాపన చేశారు. భవన నిర్మాణం పూర్తరుు ఏడాదిన్నర గడుస్తున్నా ఇంత వరకు స్టేడియాన్ని క్రీడాకారులకు అందుబాటులోకి తేలేదు. కార్పొరేషన్ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ భవనం నేటికీ ప్రారంభానికి నోచుకోవడం లేదు. ఈ భవనం నిర్మాణం పూర్తరున కొత్తలో నగరంలో సేకరించిన పొడి చెత్తను నిల్వ చేసేందుకు వినియోగించారు. ఈ అంశంపై ‘సాక్షి’లో వరుస కథనాలు వెలువడటంతో చెత్తను తొలిగించారు. ఆ వెంటనే కోటి రూపాయల వ్యయంతో మలేషియా నుంచి తెప్పించిన ఉడెన్‌తో మల్టిపర్పర్స్ గేమ్స్ ఆడుకునేలా ఫ్లోరింగ్ రూపొందించారు. ఈ ఇండోర్ స్టేడియంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్, షటిల్, బ్యాడ్మింటన్ కోర్టులు అందుబాటులోకి రానున్నాయి. సెప్టెంబరు 9న ముఖ్యమంత్రి కేసీఆర్ నగరానికి వస్తున్న నేపథ్యంలో ఈ స్టేడియం ప్రారంభించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. శిల్పారామం... శిలాఫలకం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో 2008లో విజయవాడ, వరంగల్, నెల్లూరుతో పాటు అనంతపురంలో కొత్త శిల్పారామాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఈ పనులు జరగాల్సి ఉంది. కానీ ఆరేళ్ల్ల నుంచి ఈ ప్రాజెక్టు కాగితాలకే పరిమితమైంది. అదే సమయంలో విజయవాడ, నెల్లూరు శిల్పారామాల ప్రారంభమయ్యాయి. పాలకుల వివక్ష, స్థానిక నాయకుల నిర్లక్ష్యం వల్ల వరంగల్ శిల్పారామం నిర్మాణంలో తీవ్ర జాప్యం చోటు చేసుకుంది. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గోపాలపురంలో రూ.5 కోట్లతో ఈ శిల్పారామం నిర్మించాలని నిర్ణయించారు. సర్వేనంబరు 89లో ఉన్న 15 ఎకరాల ప్రభుత్వ భూమిని ఇప్పటికే శిల్పారామం నిర్మాణం కోసం కేటాయించారు. మొదట ఈ శిల్పారామాన్ని ఖిలావరంగల్‌లో నిర్మించాలనుకున్నప్పటికీ పురవాస్తుశాఖ నుంచి అభ్యంతరం వ్యక్తం చేయడంతో బాలసముద్రాన్ని ఎంపిక చేశారు. అయితే ఇక్కడ అనువైన స్థలం లభించకపోవడంతో అక్కడి నుంచి హసన్పర్తికి మార్చారు. కానీ చివరికి యూనివర్సిటీ సమీపంలో ఉన్న గోపాలపురాన్ని ఎంపిక చేశారు. హస్తకళలను, కళాకృతులను ప్రదర్శించేందుకు ఇరవైకి పైగా స్టాళ్లు, ఆడిటోరియంలతో పాటు ఓపెన్‌ఎయిర్ థియేటర్‌తో ఈ శిల్పారామం ఏర్పాటు చేయాల్సి ఉంది. రాష్ట్రంలోనే పేరెన్నికగల హస్తకళాకారులు జిల్లాలో ఉన్నప్పటికీ వారి కళలను ప్రదర్శించేందుకు ఇంత కాలం అనువైన వేదిక కరువైంది. ఈ శిల్పారామం పూర్తయితే పెంబర్తి కళాకారులకు మంచి ఊతం లభిస్తుంది. మూడుసార్లు వాయిదా.. ఖిలావరంగల్‌లో రెండు కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించాల్సిన పురావస్తు మ్యూజియం ఏర్పాటు అంశం ఏళ్ల తరబడి ఫైళ్లలోనే మగ్గుతోంది. చింతల్ నుంచి కీర్తితోరణాలకు వచ్చే దారిలో రాతికోట దాటిన తర్వాత ఎకరం స్థలంలో నిర్మిస్తామంటూ 2012లో శంకుస్థాపన చేశారు. అప్పటి నుంచి ఇదిగో.. అదిగో నిర్మాణం అంటూ అధికారులు మాటలు చెప్పడం తప్పితే ఇంత వరకు అడుగులు వేయడం లేదు. స్థల వివాదం సాకుగా చూపుతూ ఏళ్లు గడిపేస్తున్నారు. అదేవిధంగా 90 సీట్ల సామర్థ్యమున్న ప్రతాపరుద్ర నక్షత్ర శాలలో ప్రొజెక్టర్ పనిచేయకపోవడంతో మూడేళ్లుగా మూతపడి ఉంది. ప్రస్తుతం మార్కెట్లో కొత్త ప్రొజెక్టర్ ధర రూ.50 లక్షల నుంచి రూ. 70 లక్షల వరకు ఉంది. గత ప్రభుత్వం ఈ ప్రదర్శన నిర్వహణ పట్ల నిర్లక్ష్యం వహించడంతో క్రమంగా ఈ ప్లానెటోరియం ఉన్నదన్న సంగతే అంతా మర్చిపోయారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్తే సత్వర పరిష్కారం లభిస్తుందని అంతా భావిస్తున్నారు. ప్రస్తుతతం వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ ఈ ప్లానెటోరియం నిర్వహణ బాధ్యతలు నిర్వహిస్తోంది.