proofs
-
రెజ్లర్లకు పోలీసుల నోటీసులు.. వీడియోలు ఫోటోలు ఉన్నాయా?
న్యూఢిల్లీ: భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై లైంగిక అఆరోపణలు చేస్తూ కన్నాట్ పోలీస్ స్టేషన్లో కేసును నమోదు చేసిన ఇద్దరు మహిళా రెజ్లర్లకు సమన్లు పంపించారు పోలీసులు. సీఆర్పీసీ సెక్షన్ 91 ప్రకారం ఆరోపణలు చేసినదాని ప్రకారం వీడియోలు, ఆడియోలు, వాట్సాప్ చాటింగ్‌లు, ఫోటోలు, బెదిరింపు సందేశాలు వంటి సాక్ష్యాధారాలు ఏమైనా ఉంటే స్టేషన్లో పొందుపరచాలని కోరింది. ఫిర్యాదు ప్రకారమే సమన్లు.. ఏప్రిల్ 21న భారత మహిళా రెజ్లర్లు ఇద్దరు భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ తమను లైంగికంగా వేధిస్తున్నారని, ఊపిరి చెక్ చేస్తానంటూ ఇష్టానుసారంగా మీద చేతులు వేస్తున్నారని, అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని కన్నాట్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అటు తర్వాత ఈ కేసులో సత్వర విచారణ చేసి బ్రిజ్ భూషణ్ పై చర్యలు తీసుకోవాలని భారత్ ప్రఖ్యాత రెజ్లర్లు నిరసన తెలుపుతోన్న విషయం అందరికీ తెలిసిందే. కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ హామీనివ్వడంతో వివాదం సద్దుమణిగింది. సాక్ష్యాలున్నాయా? తాజాగా కన్నాట్ పోలీసులు కంప్లైంట్లో వారు తెలిపిన వివరాల ప్రకారం నిందితుడు తమపై చేతులు వేసినట్టుగా కానీ, తమను ముట్టుకుంటున్నట్టుగా కానీ ఫోటోలు, వీడియోలు, వాట్సాప్ సందేశాలు ఏమైనా ఉంటే తమకివ్వాలంటూ సీఆర్పీసీ సెక్షన్ 91 ప్రకారం ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ సంతకాలు చేసిన నోటీసులను పంపించారు. ఇది కూడా చదవండి: ఆ రెజ్లర్ అసలు మైనరే కాదు.. బ్రిజ్ భూషణ్ కేసులో కొత్త ట్విస్ట్ -
తల్లివని నిరూపించుకో...
న్యూయార్క్ : అప్పుడప్పుడు ఎయిర్ పోర్టు అధికారులు కాస్తా విచిత్రంగా ప్రవర్తిస్తారు. తమ తెలివి తక్కువ పనులతో ప్రయాణికులను ఇబ్బంది పెట్టి...ఆనక క్షమించమని కోరతారు. సరిగా ఇలాంటి పనే చేశారు సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్ అధికారులు. ఓ ప్రయాణికురాలితో పాటు ప్రయాణిస్తున్న ఆమె సంవత్సరం కొడుకుకు తానే కన్నతల్లని నిరూపించుకోవాలని కోరారు. పాస్‌పోర్టు చూపించనా నమ్మని వాళ్లు చివరకూ ఫేస్బుక్ పోస్టు చూసి సమాధాన పడ్డారు. ఇందుకు సంబంధించిన విషయాలను సదరు ప్రయాణికురాలు తన ట్విటర్లో పోస్టు చేసింది. వివరాల ప్రకారం.. బెర్కిలీస్లోని కాలిఫోర్నియా యూనివర్సిటీలో మహిళా బాస్కెట్ బాల్ కోచ్‌గా పనిచేస్తున్న లిండ్సే గోట్లీబ్ తన ఏడాది వయసున్న కొడుకుతో కలిసి ప్రయాణిస్తుంది. ఈ సందర్భంగా సౌత్‌వెస్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు వచ్చింది. భద్రతా తనిఖీల్లో భాగంగా ఎయిర్‌పోర్టు అధికారులు లిండ్సే పాస్ పోర్టుతో పాటు, ఆమె కొడుకు పాస్‌పోర్టును కూడా తనిఖీ చేశారు. అన్ని సరిగానే ఉన్నప్పటికి కూడా లిండ్సేనే ఆమెతో పాటు ఉన్న బాబుకు కన్నతల్లని నిరూపించుకోవాల్సిందిగా కోరారు. చివరకూ ఆమె ఫేస్బుక్ పోస్టు చూసిన తర్వాతే ఆమెను ప్రయాణించడానికి అనుమతించారని లిండ్సే తన ట్విటర్లో పోస్టు చేశారు. అంతేకాక ఈ విషయం గురించి లిండ్సే ‘నా కొడుకు వయసు, గుర్తింపుకు సంబంధించి అన్ని విషయాలు పాస్‌పోర్టులో ఉన్నాయి. పైగా ఆ సమయంలో తల్లిదండ్రులిద్దరమూ అక్కడే ఉన్నాం. అయినా అధికారులు నేనే నా బిడ్డకు కన్నతల్లినని నిరూపించుకోమని కోరారు. ఒక తల్లికి ఇది ఎంత బాధకరమైన విషయమో వారికి తెలియదనుకుంటా. బహుశా నా కొడుకు శరీర రంగు, నా రంగుకు భిన్నంగా ఉండటం వల్ల వారు ఇలా అడిగి ఉంటారు’ అని అన్నారు. ఈ పోస్టు చూసిన నెటిజన్లు ఎయిర్‌పోర్టు అధికారులను విమర్శించడంతో వెంటనే దిద్దుబాటు చర్యలకు దిగారు. కేవలం తనఖీల్లో భాగంగానే తమ సిబ్బంది అలా ప్రశ్నించారే తప్ప ఆమెను బాధపెట్టాలనే ఉద్దేశం తమకు ఏ మాత్రం లేదని చెప్పారు. మిమ్మల్ని బాధ పెట్టేలా ప్రవర్తించినందుకు క్షమించమని లిండ్సేను కోరారు. అందుకు లిండ్సే ‘ఇక మీదట ప్రయాణికులతో ఎలా ప్రవర్తించాలనే అంశం గురించి మీ సిబ్బందికి మరింత మెరుగైన శిక్షణ ఇస్తే మంచిద’ని చురకంటిచారు. -
అంగట్లో ఐడెంటిటీ..
ఓటరు గుర్తింపు కార్డు కావాలా? ఎవరైనా పర్లేదు.. ఆధారాలతో పనే లేదు.. ఏ దేశమైనా పట్టింపులేదు.. జస్ట్ ఓ రూ.500 ఇస్తే చాలు.. రెండ్రోజుల్లో రెడీ! ఇంకాస్త ఎక్కువిస్తే గంటల్లో ఓటరు కార్డు మీ ముందు ప్రత్యక్షం! ఇక దాన్ని చూపి ఆధార్ కార్డే తీసుకోండి.. డ్రైవింగ్ లైసెన్స్‌కు అప్లై చేసుకోండి.. అడ్రస్ ప్రూఫ్‌గా వాడుకోండి.. ఎంచక్కా పాస్‌పోర్టు కూడా పొందండి!! నిజమేనా.. అని ఆశ్చర్యపోకండి. సాక్షాత్తూ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో జరుగుతున్న అతి ప్రమాదకర దందా ఇదీ. నగరంలో విచ్చలవిడిగా సాగుతున్న ఈ వ్యవహారాన్ని బట్టబయలు చేసేందుకు ‘సాక్షి’ బృందం రంగంలోకి దిగింది. కరుడుగట్టిన ఉగ్రవాది యాసిన్ భత్కల్, ముంబై వరుస పేలుళ్ల నిందితుడు, అండర్ వరల్డ్ డాన్ అబూసలేం, అతని ప్రియురాలు, సినీనటి మోనికా బేడీ, ప్రధాని సతీమణి జశోదాబెన్ ఫొటోలతో (పై చిత్రాలు) ఓటరు గుర్తింపు కార్డులను కేవలం 48 గంటల్లోనే సంపాదించింది. ఎలాంటి సంఘ విద్రోహశక్తులకైనా ఇట్టే గుర్తింపు కార్డులు ఇచ్చేస్తుండటం విస్మయానికి గురిచేస్తోంది. శ్రీగిరి విజయ్ కుమార్‌రెడ్డి హైదరాబాద్ భారీ అక్రమ రాకెట్‌కు అడ్డగా మారుతోంది. ఊరు, పేరు, వయసు, చిరునామా ఇలా ఏ ధ్రువీకరణ కావాలన్నా.. ఎలాంటి క్రాస్ చెక్ లేకుండా కేవలం రూ.500 నుంచి రూ.1,200 తీసుకుని గంటల్లో ఓటరు గుర్తింపు కార్డులు ఇచ్చేస్తున్నారు. ఈ కార్డును ఆధారంగా చూపుతూ.. ఆధార్ కార్డు నుంచి పాస్‌పోర్టు దాకా యథేచ్ఛగా పొందుతున్నారు. భాగ్యనగరంలో తలదాచుకుంటున్న విదేశీయులు సైతం సులువుగా ఇలా ఓటరు కార్డులు తీసుకుంటున్నారు. ఆపై ఆధార్, ఇతర పత్రాలతో ‘ఇండియన్ సిటిజన్’గా గుర్తింపు పొందుతున్న వ్యవహారం అంతర్గత భద్రతకు సవాల్‌గా మారుతోంది. మీ–సేవా కేంద్రాలు, వాటి చుట్టూ అల్లుకున్న బ్రోకర్ల సాయంతో ఈ దందా విచ్చలవిడిగా సాగుతోంది. ఎలాంటి ప్రూఫ్‌లు లేకుండా ఓటరు కార్డులు పొందేందుకు ‘సాక్షి’ చేపట్టిన ఆపరేషన్ ఎలా సాగిందో మీరే చదవండి.. ఎంత ఈజీగా ఇచ్చేశారో.. ఇంటర్నెట్లో ఫొటోలు డౌన్లోడ్ చేసుకుని చార్మినార్ సమీప పరిసరాల్లో తిరిగి ఇష్టం వచ్చిన ఇంటి నంబర్లను రాసుకుని ఛత్తాబజార్, గౌలిపురా, నూర్ఖాన్ బజార్లలోని మీ–సేవ కేంద్రాల్లోకి ‘సాక్షి’బృందం వెళ్లింది. అర్జంట్‌గా ఓటరు గుర్తింపు కార్డులు కావాలని కోరగా, ఒకొక్కరు తొలుత వేలల్లో రేటు చెప్పారు. కాసేపు బేరమాడగా.. రూ.1,200కు ఒక కార్డు జారీ చేసేందుకు ఒప్పుకున్నారు. పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్‌లో భాగంగా ఫాం–6 నింపే క్రమంలో వ్యక్తిగత గుర్తింపు, నివాస ధ్రువీకకరణ పత్రాలతోపాటు సంబంధిత వ్యక్తి తప్పనిసరిగా ఉండాలి. కానీ అవేవీ పట్టించుకోకుండానే.. మీ–సేవా నిర్వాహకులు వాటన్నింటిని మేనేజ్ చేశారు. 48 గంటల్లోనే ఉగ్రవాది యాసిన్ భత్కల్, అండర్ వరల్డ్ డాన్ అబూసలేం, ఆయన ప్రియురాలు మోనికాబేడీలతోపాటు ప్రధాని మోదీ సతీమణి జశోదాబెన్‌ల ఫొటోలతో కూడిన ఓటరు కార్డులు ‘సాక్షి’బృందం చేతికి వచ్చాయి. ఈ కార్డుల ఆధారంగా అన్ని రకాల కార్డులు సంపాదించే అవకాశాలను సైతం ‘మీ–సేవ’లోనే వివరించటం విశేషం. నగరానికి వివిధ రూపాల్లో వస్తున్న విదేశీయులు కూడా తొలుత ఇలా ఓటరు గుర్తింపు కార్డులు పొంది, దాని ఆధారంగా ఆధార్, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్‌లు ఈజీగా తీసేసుకుంటున్నారు. భత్కల్ కార్డు వచ్చిందిలా.. యాసిన్ భత్కల్ ఫొటోతో ఓటరు గుర్తింపు కార్డు కోసం జీహెచ్ఎంసీ దక్షిణ మండలం కార్యాలయంలోకి వెళ్లి బ్రోకర్‌గా వ్యవహరించే ఓ ఆశా వర్కర్ సిఫారసుతో ‘సాక్షి’ప్రతినిధి దరఖాస్తు చేశారు. అక్కడ కాంట్రాక్ట్ పద్ధతిన పనిచేసే ఓ ఉద్యోగి కొంత మొత్తాన్ని తీసుకుని వివరాలను అప్లోడ్ చేసింది. మూడ్రోజుల్లో యాసిన్ భత్కల్ ఫొటో, బహుదూర్‌పురా చిరునామాతో మహ్మద్ యాసిన్ పేరుతో ఓటరు గుర్తింపు కార్డును అందజేసింది. యాసిన్ భత్కల్ ఇండియన్ ముజాహిదీన్ తీవ్రవాద సంస్థను ఏర్పాటు చేసి హైదరాబాద్‌లోని లుంబినీ, గోకుల్‌చాట్, దిల్సుఖ్నగర్ సహా సూరత్, అహ్మదాబాద్, బెంగళూరు, ఢిల్లీలలో పేలుళ్ల కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఎన్ఐఏ నిర్ధారించిన సంగతి తెలిసిందే. 1,200తో ‘అబూసలేం’కార్డు.. దావూద్ ఇబ్రహీం ముఖ్య అనుచరుడిగా ఉంటూ 1993లో ముంబై వరుస పేలుళ్లు, ఆపై పలు హత్య కేసులతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని చిరునామాలతో నకిలీ పాస్‌పోర్ట్ పొందిన అబూసలేం, ఆయన ప్రియురాలు మోనికాబేడీల ఫొటోలతో ‘సాక్షి’ప్రతినిధులు ఓటరు కార్డు సంపాదించారు. ఇందుకు ముందుగా వారి ఫొటోలతో ఛత్తాబజార్‌లోని ఓ మీ–సేవ కేంద్రంలోకి వెళ్లి కార్డుకు రూ.1,200 చొప్పున రేటు కుదుర్చుకున్నాం. ఏ ఆధారాలు లేవని చెప్పి ఫాం–6 కోసం వివరాలిచ్చాం. రెండ్రోజుల్లో మహ్మద్ అబ్దుల్ సలీం, మౌనికాదేవి పేర్లతో రెండు ఓటరు కార్డులు ఇచ్చారు. జశోదాబెన్‌కు సైతం.. నగరంలోని నూర్ఖాన్ బజార్‌లోని ఓ మీ–సేవ కేంద్రానికి వెళ్లి ఫాం–6 నింపి, వివరాలేవీ లేవని, ఎలాగైనా మేనేజ్ చేయాలంటూ కొంత మొత్తాన్ని చేతుల్లో పెట్టాం. తొలుత సాధ్యం కాదంటూనే ఆ తర్వాత మీ–సేవ నిర్వాహకుడు బేరమాడి రేటు పెంచాడు. ఆ మొత్తం ఇవ్వగానే మూడ్రోజుల్లో జశోదాబెన్ ఫొటో, నూర్ఖాన్ బజార్ చిరునామాతో జశోదాబాయి పేరిట ఓటరు కార్డును చేతుల్లో పెట్టాడు. ఆ ఒక్క కార్డు ఉంటే చాలు.. ఓటరు గుర్తింపు కార్డు ఆధారంగా ఎన్నో కార్డులు పొందే వీలుంది. అందులోని అడ్రస్ ప్రూఫ్ చూపి.. ఆధార్‌కార్డు, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, వెపన్ లైసెన్స్ ఇలా ఏది కావాలన్నా సులువుగా పొందొచ్చు. దీన్నే వ్యక్తిగత గుర్తింపు పత్రంగా చూపి ఎయిర్‌పోర్టులోకి ప్రవేశించవచ్చు. విమాన ప్రయాణాలు చేయటంతోపాటు పోలీసులు నగరంలో చేస్తున్న కార్డన్ సెర్చ్‌ల్లో ఈ కార్డు చూపి బయటపడొచ్చు. దీన్నే కార్డునే వయసు ధ్రువీకరణ పత్రంగా చూపి వివాహాలు రిజిస్టర్ చేసుకోవచ్చు. నగరంలో మైనర్లను మేజర్లుగా చూపుతూ పెద్దఎత్తున ఓటరు గుర్తింపు కార్డులు జారీ అవుతున్నాయి. ఆ కార్డు ఆమె జీవితాన్నే ముంచింది ఈ చిత్రంలో కనిపిస్తున్న మైనర్ అమ్మాయి పేరు రుక్సార్. ప్రస్తుతం ఒమన్ దేశంలో నిత్యం నరకం అనుభవిస్తోంది. పాతబíస్తీలోని వట్టిపల్లిలో నివాసముండే పదహారేళ్ల రుక్సార్‌ను మేజర్‌గా చూపింది పాతబస్తీ కేంద్రంగా పొందిన ఓటరు గుర్తింపు కార్డే. ఆ కార్డు ఆధారంగా 72 ఏళ్ల వృద్ధ షేక్‌తో ఆమె పెళ్లి, పాస్‌పోర్టు జారీ చకచకా జరిగిపోయాయి. తల్లిదండ్రులు నిరుపేదలు కావటంతో మేనత్త గౌసియా వద్ద ఈమె చదువుకునేది. ఓ బ్రోకర్ చెప్పిన మాటలు నమ్మి గౌసియా.. ఒమన్ దేశానికి చెందిన 72 ఏళ్ల వృద్ధుడితో ఆమె తల్లిదండ్రులకు తెలియకుండానే పెళ్లి చేసేసింది. తర్వాత ఒమన్ వెళ్లింది. అక్కడకు వెళ్లాక వృద్ధ షేక్ ఆచూకీ లేదు. అతడి కొడుకులు, మనవళ్లు రుక్సార్పై లైంగిక దాడులకు దిగారు. తిండి, నిద్ర కరువయ్యాయి. ఫోన్ చేసినా అత్త స్పందించలేదు. దీంతో తల్లికి ఫోన్ చేసి తనను నరకం నుంచి విడిపించాలని, లేదంటే విషం తాగి చస్తానని విలపించింది. తల్లిదండ్రుల పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. తమ బిడ్డను అప్పగించాలని తల్లిదండ్రులు విదేశాంగ శాఖను వేడుకుంటున్నారు. అఫ్గాన్ మహిళకు కార్డులు.. బిత్తరపోయిన భర్త విజిట్ వీసాపై భర్త, పిల్లలతో కలసి తొలుత ఢిల్లీకి వచ్చింది అఫ్గాన్‌కు చెందిన నిలోఫర్. 2015 సెప్టెంబర్ 8న భర్తకు చెప్పకుండానే ముగ్గురు పిల్లలు, మరో వ్యక్తితో హైదరాదాబాద్కు వచ్చింది. ఇక్కడ ఓటర్ కార్డు, ఆధార్ కార్డు సంపాదించింది. ఆమెకు ముందుగా టోలిచౌకీ, తర్వాత రాజేంద్రనగర్ చిరునామాలతో కార్డులు జారీ అయ్యాయి. భార్య, పిల్లల్ని వెతుక్కుంటూ వచ్చిన భర్త మసూద్ అహ్మద్.. తన భార్య అఫ్గాన్ జాతీయురాలని, ఇక్కడ కార్డులు ఎలా ఇచ్చారంటూ ఆశ్చర్యపోయాడు. ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. -
‘బాస్’ఆధారాలు లభ్యం!
- సండ్ర రెండో రోజు ఏసీబీ కస్టడీలో కీలక అంశాలు వెల్లడి - సెబాస్టియన్‌తో కలిపి గంటన్నర పాటు విచారణ - ఎమ్మెల్యేల కొనుగోళ్లపై ప్రశ్నల వర్షం - ముగిసిన సండ్ర కస్టడీ.. చర్లపల్లి జైలుకు తరలింపు సాక్షి, హైదరాబాద్: ‘ఓటుకు కోట్లు’ కేసులో సూత్రధారికి సంబంధించి ఏసీబీ అధికారులకు కీలక ఆధారాలు లభించినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించినవారి సంభాషణల్లోని ‘బాస్’, ‘సార్’ ఎవరు, వారి లక్ష్యం ఏమిటనేదానిని దాదాపు నిర్ధారించుకున్నట్లు సమాచారం. రెండు రోజుల కస్టడీలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యను విచారించిన ఏసీబీ అధికారులు.. ఆయన నుంచి దీనికి సంబంధించిన వివరాలు సేకరించారని తెలిసింది. ఈ కేసులో రెండో నిందితుడు సెబాస్టియన్‌ను శుక్రవారం ఏసీబీ కార్యాలయానికి పిలిచిన అధికారులు ఆయనను సండ్రతో పాటు ఎదురెదురుగా కూర్చోబెట్టి ప్రశ్నించినట్లు సమాచారం. ఈ సందర్భంగా ఈ కేసులో కీలకమైన ‘మిస్సింగ్ లింకు’లను రాబట్టినట్లు తెలుస్తోంది. ఇక సండ్ర రెండు రోజుల ఏసీబీ కస్టడీ ముగియడంతో.. ఆయనను అధికారులు కోర్టులో హాజరుపరిచి, జైలుకు తరలించారు. ఎదురెదురుగా కూర్చోబెట్టి.. కస్టడీలో తొలిరోజు సండ్ర వ్యవహార శైలిని దృష్టిలో ఉంచుకుని రెండో రోజు ఏసీబీ అధికారులు రూట్ మార్చారు. బాగా ‘తర్ఫీదు’ పొందిన సండ్ర నుంచి ఎలాగైనా సమాచారం రాబట్టేందుకు.. ఈ కేసులో రెండో నిందితుడిగా ఉన్న సెబాస్టియన్‌ను ఎదురుగా కూర్చోబెట్టి ప్రశ్నించినట్లు తెలిసింది. తద్వారా రెండో రోజు విచారణ కాస్త సఫలీకృతమైనట్లు సమాచారం. సండ్రను శుక్రవారం ఉదయం సిట్ కార్యాలయం నుంచి తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఏసీబీ ప్రధాన కార్యాలయానికి తరలించారు. తొలుత సండ్ర గన్‌మ్యాన్ లచ్చు గతంలో ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఏసీబీ అధికారులు ప్రశ్నించినట్లు తెలిసింది. సండ్ర మే 29న మహానాడు ముగిసిన తర్వాత 30వ తేదీన తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నివాసానికి వెళ్లడం, తర్వాత ఎన్టీఆర్ ట్రస్టుభవన్కు, అట్నుంచి లేక్‌వ్యూ అతిథి గృహానికి వెళ్లడం వంటి అంశాలను లచ్చు తన వాంగ్మూలంలో వివరించారు. ఇలా ఎందుకు వెళ్లాల్సి వచ్చిందని ఏసీబీ అధికారులు సండ్రను సూటిగా ప్రశ్నించినట్లు తెలిసింది. అయితే సండ్ర వీటికి కూడా పార్టీ పనులు, ఇతర వ్యవహారాలు అంటూ అస్పష్టమైన సమాధానాలే ఇవ్వడానికి ప్రయత్నించారని అధికారవర్గాల ద్వారా తెలుస్తోంది. మే 31న రేవంత్‌రెడ్డి నేరుగా రూ.50 లక్షలు తీసుకుని స్టీఫెన్సన్ నివాసానికి వెళ్లడం పట్ల సండ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు ఏసీబీ వద్ద సమాచారం ఉంది. అందుకు అనుగుణంగా ‘ఎమ్మెల్యేలను ఎవరు కొనుగోలు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, తదితర అంశాలు మీకు ముందే తెలుసా?..’ అని సండ్రను ప్రశ్నించినట్లు సమాచారం. కేసులో ఏ2 నిందితుడిగా ఉన్న సెబాస్టియన్‌ను పిలిపించి ఇద్దరినీ ఎదురెదురుగా కూర్చోబెట్టి గంటన్నర పాటు ప్రశ్నించగా... ఈ కేసుకు సంబంధించిన అనేక మిస్సింగ్ లింకులు బయటకు వచ్చినట్లు తెలిసింది. జైలుకు తరలింపు శుక్రవారం సండ్ర కస్టడీ గడువు ముగియడంతో ఏసీబీ అధికారులు ఆయనను ప్రత్యేక కోర్టులో హాజరుపర్చగా.. ఈనెల 21 వరకు రిమాండ్‌కు తరలించాలని న్యాయమూర్తి లక్ష్మీపతి ఆదేశించారు. కస్టడీ సమయంలో ఏసీబీ అధికారులు ఏమైనా ఇబ్బంది పెట్టారా, మంచి ఆహారం ఇచ్చారా? అని న్యాయమూర్తి ప్రశ్నించగా.. అన్నీ మంచిగానే చూశారని సండ్ర చెప్పారు. అనంతరం పోలీసులు ఆయనను చర్లపల్లి జైలుకు తరలించారు. జనార్దన్ పాత్రపై ఆరా.. సండ్ర, సెబాస్టియన్ మధ్య సాగిన ఫోన్ సంభాషణల్లో తెరపైకి వచ్చిన జనార్దన్ ఈ వ్యవహారంలో పోషించిన పాత్ర పట్ల ఏసీబీ ప్రత్యేకంగా ఆరా తీసింది. మే 30న ఉదయం బాబు నివాసం నుంచి నేరుగా ఎన్టీఆర్‌భవన్‌కు వెళ్లినది జనార్దన్‌ను కలవడానికేనా, ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం జనార్దన్ నేతృత్వంలోనే జరిగిందా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించినట్లు సమాచారం. ఇలా వీరిని కలిపి, వేర్వేరుగా విచారించిన అధికారులు... ‘బాస్’తో పాటు జనార్దన్‌కు సంబంధించిన కీలక అంశాలను సేకరించారని తెలిసింది. వీటి ఆధారంగా దర్యాప్తును కొనసాగిస్తూ కేసుతో సంబంధమున్న వారిపై చర్యలు తీసుకోవడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. సోమవారం నుంచి ‘ఓటుకు కోట్లు’ కేసులో ‘పెద్దలకు’ సంబంధించిన కీలక ఘట్టం ప్రారంభం కానున్నట్లు సమాచారం.