The protesters
-
అట్టుడుకుతున్న అరుణాచల్
ఇటానగర్: అరుణాచల్‌ప్రదేశ్‌లో ఎస్టీలు కాని ఆరు సామాజికవర్గాలకు శాశ్వత నివాస పత్రాలు(పీఆర్సీ) జారీచేయాలన్న హైపర్ కమిటీ సిఫార్సుతో ఆ రాష్ట్రం అట్టుడుకుతోంది. ఈ ప్రతిపాదనలను వ్యతిరేకిస్తూ ఆందోళనకారులు ఆదివారం చేపట్టిన ర్యాలీ హింసాత్మకంగా మారింది. ఆందోళనకారులు ముఖ్యమంత్రి పెమా ఖండూ ప్రైవేటు నివాసంలోకి దూసుకెళ్లేందుకు యత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అల్లరిమూకలు అధికారులపై రాళ్లవర్షం కురిపించాయి. దీంతో పోలీసులు కాల్పులు జరపగా, ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు గాయపడ్డారు. అంతకుముందు డిప్యూటీ సీఎం చౌనా మైన్ ఇంటిపై దాడిచేసి భవనానికి నిప్పుపెట్టారు. అనంతరం డిప్యూటీ కమిషనర్ ఆఫీసుపై దాడిచేసి విలువైన వస్తువులను ఎత్తుకెళ్లారు. డిప్యూటీ కమిషనర్ ఆఫీసు ప్రాంగణంలోని వాహనాలకు నిప్పంటించారు. ఇటానగర్ పోలీస్‌స్టేషన్‌పై సైతం దాడిచేశారు. నహర్లగున్ జిల్లాలో మార్కెట్ కాంప్లెక్స్‌కు నిప్పుపెట్టడంతో పాటు ఓ షాపింగ్‌మాల్‌ను లూటీ చేశారు. రాష్ట్రంలోని నమ్సాయి, చాంగ్లాంగ్ జిల్లాల్లో ఉంటున్న ఆరు ఎస్టీయేతర సామాజికవర్గాలకు పీఆర్సీ ఇవ్వాలని ప్రభుత్వం ఏర్పాటుచేసిన కమిటీ సిఫార్సు చేసింది. కాగా, ఆందోళనల నేపథ్యంలో పీఆర్సీ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోమని సీఎస్ సత్యగోపాల్ తెలిపారు. -
జమ్మూ ఆందోళన హింసాత్మకం
శ్రీనగర్ / జమ్మూ / న్యూఢిల్లీ: దాడి నేపథ్యంలో ఉగ్రవాదులకు మద్దతు పలుకుతున్న పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా జమ్మూలో ఆందోళనలు మిన్నంటాయి. ఈ సందర్భంగా పలుచోట్ల రెచ్చిపోయిన ఆందోళనకారులు వాహనాలకు నిప్పు పెట్టారు. శాంతిభద్రతలకు విఘాతం కలగడంతో తొలుత జమ్మూ పట్టణంలో కర్ఫ్యూ విధించిన జమ్మూ అధికారులు, చివరకు ఆర్మీ సాయాన్ని అర్థించారు. దీంతో రంగంలోకి దిగిన సైన్యం.. సమస్యాత్మక ప్రాంతాల్లో ఫ్లాగ్‌మార్చ్ నిర్వహించింది. జమ్మూలోని గుజ్జర్‌నగర్ ప్రాంతంలో ఆందోళనకారులు ఆస్తుల విధ్వంసానికి దిగారు. పలు వాహనాలకు నిప్పు పెట్టడంతో పాటు కార్లను ధ్వంసం చేశారు. మరోవైపు జమ్మూ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్(జేసీసీఐ) గురువారం పిలుపునిచ్చిన బంద్ ప్రశాంతంగా ముగిసింది. పుల్వామా ఉగ్రదాడి ఘటనపై పూర్తిస్థాయి కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ(సీవోఐ)కి సీఆర్పీఎఫ్ ఆదేశించింది. ఈ విషయమై సీఆర్పీఎఫ్ ఉన్నతాధికారి ఒకరు మీడియాతో మాట్లాడుతూ.. దాడిలో చనిపోయినవారంతా సీఆర్పీఎఫ్ రోడ్ ఓపెనింగ్ పార్టీ(ఆర్వోపీ)కి చెందినవారనీ, కాన్వాయ్కి వీరు రక్షణ కల్పించేవారని చెప్పారు. -
మరాఠాల బంద్ హింసాత్మకం
ముంబై: విద్య, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ కోరుతూ మరాఠా సంఘాలు మరోసారి బంద్ నిర్వహించాయి. ఆందోళనకారులు రాష్ట్రంలోని లాతూర్, జాల్నా, సోలాపూర్, బుల్దానా, అహ్మద్‌నగర్, నాసిక్ జిల్లాల్లో ట్రాఫిక్‌ను అడ్డుకోవడంతో పాటు టైర్లను కాల్చి నిరసన తెలిపారు. పుణే కలెక్టర్ కార్యాలయం సెక్యూరిటీ గార్డు గది అద్దాలు, బల్బులు పగలగొట్టారు. దీంతో వదంతులు వ్యాపించకుండా పుణే జిల్లాలో అధికారులు ఇంటర్నెట్ సేవల్ని నిలిపివేశారు. ఔరంగాబాద్‌లో ఆందోళనకారులు ఓ పోలీస్ కారుతో పాటు 2 ప్రైవేటు వాహనాలకు నిప్పుపెట్టారు. లాఠీచార్జ్ చేసిన పోలీసులు.. అల్లరిమూకల్ని చెదరగొట్టారు. నాందేడ్‌లో మాజీ సీఎం, కాంగ్రెస్ నేత అశోక్ చవాన్ నడుపుతున్న దినపత్రిక ‘సత్యప్రభ’తో పాటు మరో మరాఠీ పత్రిక పుధారి ఆఫీసులపై రాళ్లు రువ్వారు. లాతూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే త్రిబంక్రావ్ భింసేను చుట్టుముట్టిన ఆందోళనకారులు ఆయన్ను పక్కకు నెట్టివేశారు. బారామతిలోని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఇంటిముందు మరాఠాలు ధర్నాకు దిగగా.. శరద్ బంధువు అజిత్ పవార్ వారికి సంఘీభావంగా ధర్నాలో కూర్చున్నారు. మరాఠా సంఘాల ఐక్యవేదిక ‘సకల్ మరాఠా సమాజ్’ ఈ బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో అధికారులు పలు జిల్లాల్లో పాఠశాలలు, కాలేజీలకు గురువారం సెలవు ప్రకటించారు. మరోవైపు బంద్‌కు సంఘీభావంగా రాష్ట్రంలో పలుచోట్ల పెట్రోల్ బంకులు, షాపులు, మార్కెట్లు మూతపడ్డాయి. ప్రస్తుతం మరాఠాల రిజర్వేషన్‌పై తాము పనిచేస్తున్నామని సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ చెప్పినప్పటికీ మరాఠా>లు శాంతించలేదు. మహారాష్ట్ర జనాభాలో 30 శాతంగా ఉన్న మరాఠాలు విద్య, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ కోసం ఆందోళన చేస్తుండటం తెల్సిందే. -
కశ్మీర్లో ఆర్మీ వాహనంపై రాళ్లవర్షం
పుల్వామా/శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో ఆందోళనకారులు రెచ్చిపోయారు. గస్తీకి వెళ్లివస్తున్న ఆర్మీ వాహనంపై రాళ్లవర్షం కురిపించారు. దీంతో తొలుత హెచ్చరించిన అనంతరం ఆర్మీ అధికారులు గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోగా, మరో బాలికకు తీవ్రగాయాలయ్యాయి. ఈ విషయమై ఆర్మీ అధికార ప్రతినిధి మాట్లాడుతూ..నౌపొరా ప్రాంతంలో రాంగ్ పార్కింగ్ కారణంగా ట్రాఫిక్ నిలిచిపోవడంతో ఆ వాహనాలను పక్కకు తీయాలని కోరేందుకు ఆర్మీ అధికారులు వాహనం దిగారని,ఆందోళనకారులు పెద్దసంఖ్యలో అక్కడకు చేరుకుని ఆర్మీ వాహనంపై రాళ్లదాడికి పాల్పడ్డారని వెల్లడించారు. మరోవైపు కశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి పేట్రేగిపోయారు. శ్రీనగర్‌లోని కక్ సరాయ్ ప్రాంతంలో శుక్రవారం వాహనాల తనిఖీలు చేపడుతున్న భద్రతాబలగాలు లక్ష్యంగా కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఇద్దరు పోలీసులతో పాటు ముగ్గురు పౌరులు గాయపడినట్లు పోలీస్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. -
గాజా ఆందోళనల్లో 13 మంది మృతి
గాజా సిటీ: ఇజ్రాయెల్ సరిహద్దు వైపు చొచ్చుకొచ్చేందుకు ప్రయత్నించిన వేలాది మంది పాలస్తీనా ఆందోళనకారులపై ఇజ్రాయెల్ భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ హింసలో 12 వందల మందికి పైగా గాయపడ్డారని పాలస్తీనా ఆరోగ్య శాఖ మంత్రి వెల్లడించారు. పాలస్తీనా శరణార్థుల్ని దేశంలోకి అనుమతించాలంటూ ఆందోళనకారులు గాజా ప్రాంతంలో సరిహద్దు వెంట శుక్రవారం నిరసన ప్రదర్శనలు కొనసాగించారు. కొద్దిమంది ఆందోళనకారులు ఫెన్సింగ్ వైపుగా దూసుకురావడంతో ఇజ్రాయెల్ బలగాలు టియర్ గ్యాస్ ప్రయోగించడంతో పాటు కాల్పులు జరిపాయి. డ్రోన్ సాయంతో సరిహద్దు వెంట టియర్ గ్యాస్‌తో ఆందోళనకారుల్ని చెదరగొట్టే ప్రయత్నం చేశాయి. ఆందోళనకారుల ముసుగులో ఉగ్రవాదులు సరిహద్దు వైపుగా చొచ్చుకొచ్చేందుకు ప్రయత్నించారని ఇజ్రాయెల్ ఆర్మీ ఆరోపించింది. -
భగ్గుమన్న ఇస్లామాబాద్
-
భగ్గుమన్న ఇస్లామాబాద్
పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో ఆందోళనకారులకు, భద్రతా దళాలకు మధ్య జరిగిన ఘర్షణల్లో ఒక పోలీసు మరణించగా, 150 మంది గాయపడ్డారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పారా మిలటరీ దళాలు రంగం లోకి దిగడంతో ఈ హింస చెలరేగింది. ఇస్లామాబాద్: పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో ఆందోళనకారులకు, భద్రతా బలగాలకు మధ్య ఘర్షణల్లో ఒక పోలీసు మరణించగా, 150 మంది గాయపడ్డారు. ఇస్లామాబాద్‌కు వచ్చే ప్రధాన రహదారుల్ని దిగ్బంధించిన వేలాది మందిని చెదరగొట్టేందుకు పోలీసులు, పారా మిలటరీ దళాలు రంగంలోకి దిగడంతో ఈ హింస చెలరేగింది. రోడ్లను ఖాళీ చేయించాలని ఇచ్చిన ఉత్తర్వుల అమలులో విఫలమయ్యారని పాక్ అంతర్గత వ్యవహారాల మంత్రికి ఇస్లామాబాద్ హైకోర్టు ధిక్కార నోటీసుల నేపథ్యంలో భద్రతా బలగాలు ఈ ఆపరేషన్ చేపట్టాయి. పోలీసులు ఎంత ప్రయత్నించినా ఆందోళనకారుల్ని మాత్రం ఖాళీ చేయించలేకపోయారు. పోలీసు చర్య నేపథ్యంలో అసాంఘిక శక్తులు చెలరేగకుండా.. పాకిస్తాన్ ప్రభుత్వం ప్రైవేట్ చానళ్ల ప్రసారాలతో పాటు ఫేస్బుక్, ట్వీటర్, యూట్యూబ్ తదితర సోషల్ మీడియా సైట్లను నిలిపివేసింది. ఆందోళనలు కరాచీ నగరానికి కూడా వ్యాపించాయి. ఎన్నికల చట్టంలో మార్పులకు నిరసనగా పాక్‌న్యాయ శాఖ మంత్రి రాజీనామా చేయాలని దాదాపు 2 వేల మంది ఆందోళనకారులు రెండు వారాల క్రితం ఇస్లామాబాద్ ఎక్స్‌ప్రెస్ వే, ముర్రీ రోడ్డును దిగ్బంధించారు. ఆత్మాహుతి దాడిలో నలుగురి మృతి కరాచీ: పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్సులో భద్రతా బలగాల కాన్వాయ్ లక్ష్యంగా దుండగులు శనివారం జరిపిన ఆత్మాహుతి దాడిలో నలుగురు ప్రాణాలు కోల్పోగా, ఓ చిన్నారి సహా 19 మంది గాయపడ్డారు. -
విచారణ పేరుతో మహిళకు చిత్రహింసలు
పోలీసుల వైఖరికి నిరసనగా మౌన ర్యాలీ కృష్ణరాజపుర: చోరీకి సంబంధించి దొంగల కోసం ప్రయత్నించని పోలీసులు...ఫిర్యాదు చేసిన బాధితుడి భార్యను చిత్రహింసలకు గు రి చేశారని ఆరోపిస్తూ అఖిల భా రత ఏక్తామంచ్ కార్యకర్తలు ఆది వారం భారీ మౌన ర్యాలీ నిర్వహించి పోలీసుల తీరును ఖండించారు. ఆందోళనకారులు మాట్లాడుతూ కే.ఆర్.పురలోని చిక్కదేవసంద్రలో బుందారామ్ పంచరత్న జ్యువెల్లర్స్ పేరుతో దుకాణం నిర్వహిస్తున్నాడన్నారు. ఆగస్ట్26న ముసుగులను ధరించిన దుండగులు అత ని ఇంట్లోకి చొరబడి రూ.5.35లక్ష ల నగదు, 4.750కేజీల బంగారు ఆభరణాలను దోచుకెళ్లారన్నారు. ఘటనపై బుందారామ్ పోలీసులకు ఫిర్యాదు చే యగా 30న ఆయ న భార్య లీలాబాయిని పోలీసులు మరో ప్రాంతానికి తీసుకెళ్లి విచార ణ పేరుతో థర్డ్ డిగ్రీ ప్రయోగించారన్నారు. అప్పటికే ఆమె అనారోగ్యంతో ఉందన్నారు. పోలీసుల దె బ్బలకు మరింత అనారోగ్యానికి గురైందన్నారు. దీంతో ఇందిరానగర్‌లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలి ంచారన్నారు లీలాబాయిని హిం సించిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని నిరసనకారులు డిమాండ్ చేశారు.