PROVIDING
-
మానవత్వపు పరిమళాలు
సాక్షి, హైదరాబాద్: ఇవీ.. డీజీపీ కార్యాలయంలో ‘గుడ్ సమారిటన్, పోలీస్ గ్రూప్’నకు వస్తున్న వినతులు. రాష్ట్రంలోని నిత్యావసరాల సరఫరాకు ఎక్కడా ఆటంకం కాకూడదని డీజీపీ మహేందర్‌రెడ్డి ఇచ్చిన ఆదేశాల మేరకు ‘కమోడిటీస్ కంట్రోల్ రూము’ను అధికారులు ఏర్పాటు చేశారు అందులో ‘గుడ్ సమారిటన్, పోలీస్’పేరిట వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేశారు. పౌరసరఫరాల శాఖ, మెప్మా, విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, పలు ఎన్జీవోలు, యువ వలంటీర్లు, వ్యాపారులు, అధికారులు ఈ విపత్కర సమ యంలో చిక్కుకున్న పలువురి ఆకలి తీర్చేందుకు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. ఈ గ్రూపులో అనాథాశ్రమాలు, వృద్ధజనాశ్రమాల నిర్వాహకులను కూడా సభ్యులుగా చేర్చారు. ఫలితంగా ఎలాంటి వినతి వచ్చినా.. వెంటనే వారికి కావాల్సిన ఆహారం, ఇతర నిత్యావసరాలను అప్పటికప్పుడు దాతలతో మాట్లాడి వారికి చేరవేసేలా చూస్తున్నారు. సాధారణ వ్యాపారుల నుంచి బహుళజాతీయ కంపెనీల సీఈఓల వరకు అన్నార్తులకు సాయం చేసేందుకు ముందుకు వస్తున్న తీరును చూసి పోలీసులే ఆశ్చర్య పోతున్నారు. విపత్కర పరిస్థితుల్లో తోటి మానవుడిని ఆదుకునేందుకు ముందుకు వస్తోన్న వారినిచూసి గర్వంగా ఉందని పోలీసు ఉన్నతాధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ విరాళాలను చూసి తాము పడుతున్న శ్రమను మర్చిపోతున్నామన్నారు. ► సార్.. నేను ఆసిఫాబాద్ నుంచి మాట్లాడుతున్నా.. నేనో చిరువ్యాపారిని. ఈరోజు మా ప్రాంతంలో కనీసం ఐదుగురికి భోజనం పంపాలనుకుంటున్నా. ► సార్..! నేనో బహుళజాతి కంపెనీకి సీఈఓను.. నిరాశ్రయులు, యాచకులకూ కడుపు నింపేందుకు రెండు క్వింటాళ్ల బియ్యం పంపాలనుకుంటున్నా. విరాళాల వెల్లువ.. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 230కి పైగా వృద్ధజనాశ్రమాలు, అనాథాశ్రమాలకు ఆహారం, బియ్యం, ఉప్పు, పప్పు, నూనె కావాలని ‘గుడ్ సమారిటన్ , పోలీస్’గ్రూపును ఆశ్రయిస్తున్నారు. ఈ సమాచారాన్ని వెంటనే విమెన్ అండ్ చైల్డ్ విభాగం, సివిల్ సప్లై విభాగం, ఇతర దాతలు, ఎన్జీవోలకు చేరవేసి కావాల్సిన నిత్యావసరాలు సరఫరా చేయిస్తున్నారు. అలాగే ఇటుక బట్టీ కార్మికులు, యాచకులు, ఇతర రాష్ట్రాల కూలీలు, నిరాశ్రయులకు చాలామంది క్వింటాళ్ల కొద్దీ బియ్యాన్ని, ఇతర పప్పులు, నూనె, మాస్కులు, శానిటైజర్లు, సబ్బులు తదితర నిత్యావసరాలను విరాళంగా ఇస్తున్నారు. ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇచ్చిన నిత్యావసరాలను ఆయా పోలీసుల ద్వారా సజావుగా పంపిణీ చేయిస్తున్నారు. కొందరు స్వచ్ఛంద సంస్థలు దూరమైనా శ్రమకోర్చి అన్నార్తులకు నిత్యావసరాలను చేరవేస్తున్నాయి. -
పల్లెలు... రెడీ టు ఈట్!!
న్యూఢిల్లీ: కోరుకున్న వెంటనే, అప్పటికప్పుడు పది నిమిషాల్లో ఆహారాన్ని సిద్ధం చేసుకునే అవకాశం కల్పించేవి రెడీ టు ఈట్ ఉత్పత్తులు. అంత సమయం కూడా లేదనుకుంటే ప్యాకేజ్డ్ ఫుడ్స్ ఉండనే ఉన్నాయి. ఇప్పటిదాకా పట్టణాల్లోని మధ్యతరగతి వినియోగదారులే లక్ష్యంగా కంపెనీలు ఈ ఉత్పత్తులను గురిపెట్టేవి. అయితే, ఈ మధ్య కాలంలో పల్లెల్లోనూ వీటి అమ్మకాలు క్రమంగా పెరుగుతున్నాయి. గ్రామీణ ప్రజలు సైతం వీటి వినియోగం పట్ల ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో పెద్ద కంపెనీలు గ్రామీణ ప్రాంతాలకు అనుకూలంగా ప్రత్యేక ప్రణాళికలను అమలు చేస్తున్నాయి. ఎమ్టీఆర్ ఫుడ్స్, బాగ్రిస్, ఐడీ ఫ్రెష్, మేయాస్, గిట్స్ ఫుడ్ అమ్మకాలు గ్రామీణ ప్రాంతాల్లో పెరుగుతున్నాయి. దీంతో ఈ కంపెనీలు గ్రామీణ ప్రాంతాలకు అనుకూలమైన ప్యాక్ సైజులు, ధరలతో ఉత్పత్తులను విడుదల చేస్తున్నాయి. సాధారణంగా గ్రామీణ మార్కెట్లలో లూజ్ మసాలాలు, సుగంధ ద్రవ్యాల వంటి అమ్మకాలు ఎక్కువ. వీటి స్థానంలో బ్రాండెడ్ కంపెనీల ఇన్స్టంట్ మిక్స్ ఉత్పత్తులైన బాదం మిల్క్, ఉప్మా, రవ్వ ఇడ్లీ మిక్స్, ఓట్స్, ముస్లి వంటివీ ఇటీవల అమ్ముడుపోతున్నాయి. ఈ కామర్స్ సంస్థలైన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, పేటీఎం మాల్ అన్ని ప్రాంతాల్లోకీ చొచ్చుకుపోవటం... స్మార్ట్ఫోన్ల వినియోగం విస్తరణ... పోషకాలపై అవగాహన పెరగడం గ్రామీణ ప్రాంతాల్లోనూ అమ్మకాలు పెరిగేందుకు దోహదపడుతున్నట్టు బ్యాగ్రిస్ డైరెక్టర్ ఆదిత్య బాగ్రి తెలిపారు. దేశీ ఉత్పత్తులకు ప్రాధాన్యం బ్రేక్‌ఫాస్ట్ (అల్పాహారం) ఉత్పత్తుల మార్కెట్ 2,500 కోట్లుగా ఉంటుందని అంచనా. ఇందులోనూ వినియోగదారులు పాశ్చాత్య ఉత్పత్తుల కంటే దేశీయ సంప్రదాయ పదార్థాలు లేదా పోషకాలతో కూడిన ఉత్పత్తుల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ విషయంలో గ్రామీణ మార్కెట్ కూడా భిన్నంగా ఏమీ లేదు. అందుకే కంపెనీలు పల్లె మార్కెట్లకు తక్కువ ధరలతో ఉత్పత్తులను తీసుకెళుతున్నాయి. ఎంటీఆర్ ఫుడ్స్ బాదం మిక్స్ పౌడర్, ఇన్స్టంట్ రవ్వ ఇడ్లి మిక్స్ ఉత్పత్తులను రూ.5, రూ.10కే అందుబాటులోకి తీసుకొచ్చింది. అదే విధంగా గిట్స్ ఫుడ్ కంపెనీ రూ.10కే గులాబ్ జామూన్ మిక్స్ ప్యాకెట్‌ను విడుదల చేసింది. గ్రామీణ, చిన్న పట్టణాల్లో ఎక్కువగా అమ్ముడయ్యే ఈ కంపెనీ ఉత్పత్తుల్లో ఇదీ ఒకటి. ‘‘మా గులాబ్ జామూన్, ఖమాన్ దోక్లా మిక్స్ మొత్తం అమ్మకాల్లో సగం మేర పెళ్లిళ్ల సీజన్లో గ్రామీణ ప్రాంతాల నుంచే ఉంటున్నాయి. టైర్–1, టైర్–2 మార్కెట్లలో సూపర్ మార్కెట్లు ఉన్నాయి. పంపిణీ పరంగా ఇవి కీలక చోదకాలు’’ అని గిట్స్ ఫుడ్ డైరెక్టర్ సాహిల్ గిలానీ తెలిపారు. విస్తరణకు బోలెడు అవకాశాలు మన దేశంలో ప్యాకేజ్డ్ ఫుడ్స్ ఎన్నో ఉత్పత్తుల రూపంలో అందుబాటులోకి వచ్చినా కానీ, బిస్కట్లు, స్నాక్స్ మినహా వేరే ఉత్పత్తుల మార్కెట్ అంతగా విస్తరించలేదు. దీనికి కారణం స్వతహాగా సంప్రదాయ ఆరోగ్య, రుచికరమైన స్థానిక పదార్థాలకే వినియోగదారులు పెద్ద పీట వేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు కంపెనీలు పట్టణ మార్కెట్లపైనే పెద్దగా దృష్టి సారించాయి. ఖర్చు చేసే శక్తి ఎక్కువగా ఉండడం, సమయం ఆదా చేయడం, సౌకర్యం, ఆరోగ్యం పట్ల శ్రద్ధ వంటివి పట్టణ వినియోగదారులు వీటి వైపు మొగ్గుచూపించే పరిస్థితి నెలకొంది. అయినప్పటికీ పట్టణ ప్రాంతాల్లో వీటి వినియోగం కూడా పరిమితంగానే ఉంది. ఎంటీఆర్కు చెందిన ఓక్లా గ్రూపు గ్రామీణ మార్కెట్లలో మసాలా ఉత్పత్తులను ఎక్కువగా విక్రయిస్తోంది. క్రమంగా రెడీ టు ఈట్ ఉత్పత్తులను కూడా ప్రవేశపెడుతోంది. ‘‘గ్రామీణ విభాగం అమ్మకాల్లో 16–18 శాతం వృద్ధి కనిపిస్తోంది. కానీ, పట్టణాల్లో వృద్ధి 8 శాతంగానే ఉంది. జూన్ నాటికి గ్రామీణ మార్కెట్లకే ఉద్దేశించిన వ్యూహాన్ని అమలు చేయనున్నాం’’ అని ఎంటీఆర్ ఫుడ్స్ సీఈవో సంజయ్ శర్మ తెలిపారు. బెంగళూరుకు చెందిన మేయాస్ కంపెనీ కూడా గ్రామీణ అమ్మకాల్లో ఏటా 15–17 శాతం వృద్ధి సాధిస్తోంది. ‘‘బ్లెండెడ్ మసాలా ఉత్పత్తుల అమ్మకాలు గ్రామీణ ప్రాంతాల్లో 6–8 ఏళ్ల క్రితం నుంచి పెరుగుతున్నాయి. కానీ, ఇన్స్టంట్ మిక్స్ ఉత్పత్తుల అమ్మకాల ప్రాచుర్యం మాత్రం గత రెండు, మూడేళ్లుగా పెరుగుతోంది’’అని మేయాస్ డైరెక్టర్ సుదర్శన్ మేయా తెలిపారు. దేశ బ్రేక్‌ఫాస్ట్ మార్కెట్ సైజు: రూ.2,580 కోట్లు. 2015 నాటికి ఈ మార్కెట్: 1,760 కోట్లు. 2016–18 మధ్య ఏటా 14.3 శాతం చొప్పున వృద్ధి 2023 వరకు ఏటా 10.7 శాతం వృద్ధి అంచనా -
ఉత్తమ విద్య అందించడమే లక్ష్యం
–రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి జడ్చర్ల : రాష్ట్రంలో ఉత్తమ విద్యను అందించేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తుందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. శనివారం బాదేపల్లి జెడ్పీహెచ్ఎస్లో జరిగిన నియోజకవర్గ స్థాయి విద్యా సమీక్ష సమావేశంలో మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వం విద్యావిధానంలో సమూల మార్పులు చేస్తుందని, కేజీ నుంచి పీజీ వరకు అమలు చేసే ఉచిత విద్య విధానంపై చర్చిస్తుందన్నారు. నేటి పరిస్థితులకు అనుగునంగా, ఉపాధి కల్పించే విధంగా వృత్తి విద్యను అందించేందుకు చర్యలు తీసుకుంటుందన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను కొన్ని విద్యాసంస్థలు దుర్వినియోగం చేసి అవకతవకలకు పాల్పడ్డాయని గుర్తు చేశారు. అలాంటి విద్యాసంస్థలపై చర్యలు తీసుకున్నామని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు అదనపు గదులు, మరుగుదొడ్లు, మూత్రశాలలు,తాగునీరు, తదితర సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. సీఎస్ఆర్ ఫండ్ ద్వారా 50 పాఠశాలల్లో డిజిటల్ తరగతి గదుల ఏర్పాటుకు నిధులు కేటాయిస్తామన్నారు. కంప్యూటర్ వలంటీర్లను నియమించేందుకు కృషి చేస్తామన్నారు. వైద్య శాఖ ఆద్వర్యంలో ఆర్బీఎస్కే కింద విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తామన్నారు. కళాశాల, జెడ్పీహెచ్ఎస్ స్థాయిలో బాలికలకు శానిటరీ న్యాప్కిన్స్ అందజేసేందుకు ప్రభుత్వం ఆలోచిస్తుందన్నారు. అభివృద్ధికి రూ. 2కోట్లు కేటాయింపు జడ్చర్ల నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి రూ.2కోట్లు కేటాయించనున్నట్లు మంత్రి లక్ష్మారెడ్డి ప్రకటించారు. ఇటీవల జిల్లాలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఆధ్వర్యంలో తాము సమీక్షించిన సందర్భంగా ప్రతి నియోజకవర్గం ఎమ్మెల్యే రూ.కోటి కేటాయిస్తే ఇందుకు ప్రభుత్వం రూ. 3కోట్లు కేటాయించడంతో పాటు మరో కోటి నిధులను కంట్రిబ్యూషన్ కింద జమచేస్తుందని తెలిపారు. మొత్తం రూ. 5కోట్లతో నియోజకవర్గంలోని పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన చేస్తుందన్నారు. అందులో భాగంగా తాము రూ. 2కోట్లు కేటాయిస్తామని తెలిపారు. సమావేశంలో ఆర్వీఎం పీఓ గోవిందరాజులు, డిప్యూటీ ఈఓ పాపయ్య, జెడ్పీటీసీ జయప్రద, ఎంపీపీ లక్ష్మి, ఆర్వీఎం డీఈఈ మధుసూదన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నాణ్యమైన విద్య అందించండి
నిజామాబాద్ బిజినెస్, న్యూస్‌లైన్ : విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా చూసి, మంచి ఫలితాలు రాబట్టాలని భారీ నీటి పారుదల శాఖ మంత్రి సుదర్శన్‌రెడ్డి పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు పాఠశాలలను తనిఖీ చేస్తూ విద్యాప్రమాణాలు పెంచాలని డీఈఓ శ్రీనివాసాచారికి సూచించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఆర్అండ్బీ అతిథి గృహంలో భారత్ సేవాశ్రమం, ఎస్‌బీహెచ్‌ల సహకారంతో ఖిల్లాలోని బీసీ వెల్ఫేర్ హాస్టల్ విద్యార్థులకు నోట్ పుస్తకాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మం త్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సెస్సీ ఫలితాల్లో గతంలో మన జిల్లా రాష్ట్రంలో ప్రథమ స్థానంలో ఉండేదన్నా రు. మూడేళ్లుగా జిల్లా స్థానం పడిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది తనకు, విద్యాశాఖ అధికారులకు సిగ్గు చేటన్నా రు. ఎప్పటికప్పుడు తనిఖీలు చేసి, నెల తర్వాత నివేదిక అందించాలని డీఈఓను ఆదేశించారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు తమ విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించాల్సి న అవసరం ఉందన్నారు. ప్రైవేట్ విద్యాసంస్థల్లోనూ అర్హులైన ఉపాధ్యాయులు ఉండేలా చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులకు సూచించారు. జిల్లాలో ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు 30 వేల నోట్ పుస్తకాలు పంపిణీ చే సేం దుకు ముందుకు వచ్చిన ఎస్బీహెచ్, భారత సేవాశ్రమం వారిని ఆయన అభినందించారు. కార్యక్రమంలో ఎస్బీహెచ్ డిప్యూటీ జనరల్ మేనేజర్ శివకుమార్, లీడ్ బ్యాంక్ మేనేజర్ రామకృష్ణారావు, భారత సేవాశ్రమ కార్యదర్శి మునీశ్వరానంద స్వామీజీ, డీసీసీ అధ్యక్షుడు తాహెర్ బిన్ హందాన్, జేవీవీ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు రామ్మోహన్రావు, నాయకులు అంతరెడ్డి రాజరెడ్డి, రాంరెడ్డి, పురణ్‌రెడ్డి, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.