నాణ్యమైన విద్య అందించండి
Published Wed, Sep 4 2013 4:07 AM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM
నిజామాబాద్ బిజినెస్, న్యూస్‌లైన్ : విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా చూసి, మంచి ఫలితాలు రాబట్టాలని భారీ నీటి పారుదల శాఖ మంత్రి సుదర్శన్‌రెడ్డి పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు పాఠశాలలను తనిఖీ చేస్తూ విద్యాప్రమాణాలు పెంచాలని డీఈఓ శ్రీనివాసాచారికి సూచించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో భారత్ సేవాశ్రమం, ఎస్‌బీహెచ్‌ల సహకారంతో ఖిల్లాలోని బీసీ వెల్ఫేర్ హాస్టల్ విద్యార్థులకు నోట్ పుస్తకాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మం త్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సెస్సీ ఫలితాల్లో గతంలో మన జిల్లా రాష్ట్రంలో ప్రథమ స్థానంలో ఉండేదన్నా రు. మూడేళ్లుగా జిల్లా స్థానం పడిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇది తనకు, విద్యాశాఖ అధికారులకు సిగ్గు చేటన్నా రు. ఎప్పటికప్పుడు తనిఖీలు చేసి, నెల తర్వాత నివేదిక అందించాలని డీఈఓను ఆదేశించారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు తమ విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించాల్సి న అవసరం ఉందన్నారు. ప్రైవేట్ విద్యాసంస్థల్లోనూ అర్హులైన ఉపాధ్యాయులు ఉండేలా చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులకు సూచించారు. జిల్లాలో ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు 30 వేల నోట్ పుస్తకాలు పంపిణీ చే సేం దుకు ముందుకు వచ్చిన ఎస్‌బీహెచ్, భారత సేవాశ్రమం వారిని ఆయన అభినందించారు.
కార్యక్రమంలో ఎస్‌బీహెచ్ డిప్యూటీ జనరల్ మేనేజర్ శివకుమార్, లీడ్ బ్యాంక్ మేనేజర్ రామకృష్ణారావు, భారత సేవాశ్రమ కార్యదర్శి మునీశ్వరానంద స్వామీజీ, డీసీసీ అధ్యక్షుడు తాహెర్ బిన్ హందాన్, జేవీవీ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు రామ్మోహన్‌రావు, నాయకులు అంతరెడ్డి రాజరెడ్డి, రాంరెడ్డి, పురణ్‌రెడ్డి, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.
Advertisement