PSU bank index
-
ప్రభుత్వరంగ బ్యాంక్ షేర్లకు భారీ డిమాండ్
మార్కెట్ పరిమిత శ్రేణిలో ట్రేడింగ్‌లో భాగంగా ప్రభుత్వ రంగ షేర్లు భారీగా లాభపడుతున్నాయి. ఫలితంగా ఎన్ఎస్ఈలో కీలకమైన బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ 5శాతానికి పైగా లాభపడింది. మార్కెట్ స్వల్పలాభాల ప్రారంభంలో భాగంగా ఈ ఇండెక్స్ 1,480.50 వద్ద మొదలైంది. మార్కెట్ ప్రారంభం నుంచి ఈ రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఇండెక్స్ ఒకదశలో 5.22శాతం లాభపడి 1555 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం గం.1:30ని.లకు ఇండెక్స్ నిన్నటి ముగింపు(1,477.80)తో పోలిస్తే 5శాతం లాభంతో 1,551.85 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇదే సమయానికి ఇండెక్స్‌లో అత్యధికంగా మహారాష్ట్ర బ్యాంక్ 9శాతం పెరిగింది. కెనరా బ్యాంక్ 8శాతం, బ్యాంక్ ఆఫ్ బరోడా 6శాతం, పీఎన్బీ, జమ్మూకాశ్మీర్ బ్యాంక్, ఐఓబీ బ్యాంక్ యూనియన్ బ్యాంక్ షేర్లు 4శాతం లాభపడ్డాయి. ఎస్బీఐ, సెంట్రల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూకో బ్యాంక్ షేర్లు 3శాతం ర్యాలీ చేశాయి. ఎస్బీఐ నుంచి మరో గుడ్ న్యూస్: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంసీఎల్ఆర్ను 5 నుంచి 10 బేసిస్ పాయింట్స్ తగ్గించింది. ఎంసీఎల్ఆర్ను తగ్గించడం వరుసగా 14వ సారి కావడం విశేషం. కొత్త వడ్డీ రేట్లు జూలై 10 నుంచి అమలులోకి వస్తాయి. మూడు నెలల కాల వ్యవధిపై ఇకపై 6.65 శాతం వడ్డీ అమలులో ఉంటుంది. ఎంసీఎల్ఆర్ ఎంత తక్కువ ఉంటే కస్టమర్లకు హోమ్ లోన్ ఈఎంఐ అంత తగ్గుతుంది అదేబాటలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర: పూణే ఆధారిత బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కూడా ఎంసీఎల్ఆర్ను 20 బేసిన్ పాయింట్లు తగ్గించింది. దీంతో ఏడాదికాల వ్యవధిపై ఎంసీఎల్ఆర్ 7.70శాతం నుంచి 7.50శాతానికి దిగిరానుంది. -
బ్యాంక్ నిఫ్టీ వీక్- ఈ చిన్న బ్యాంకులు భేష్
ఆటుపోట్ల మధ్య స్టాక్ మార్కెట్లు నేలచూపులతో కదులుతున్నాయి. అయితే తొలుత అమ్మకాల ఒత్తిడికి లోనైన ప్రభుత్వ రంగ బ్యాంక్ కౌంటర్లు టర్న్అరౌండ్ అయ్యాయి. అయినప్పటికీ ప్రయివేట్ రంగ బ్యాంక్ కౌంటర్లో అమ్మకాల కారణంగా ఎన్ఎస్ఈలో బ్యాంక్ నిఫ్టీ 2 శాతం క్షీణించింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో పలు పీఎస్‌యూ బ్యాంక్ కౌంటర్లు లాభాలతో కళకళలాడుతున్నాయి. వివరాలు చూద్దాం.. ట్రేడింగ్ పరిమాణం ప్రస్తుతం ఎన్ఎస్ఈలో పీఎస్‌యూ బ్యాంక్ కౌంటర్లు.. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, పంజాబ్ సింద్, యూనియన్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, జేఅండ్‌కే బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్ 8-1.3 శాతం మధ్య ఎగశాయి. వీటిలో కొన్ని కౌంటర్లలో భారీ ట్రేడింగ్ పరిమాణం నమోదవుతోంది. జోరు తీరిలా ఐవోబీ కౌంటర్లో గత నెల రోజుల ట్రేడింగ్ సగటు బీఎస్ఈలో 1.46 లక్షల షేర్లుగా నమోదుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా 5.01 లక్షల షేర్లు చేతులు మారాయి. ఈ బాటలో ఐడీబీఐ బ్యాంక్ కౌంటర్ సగటు 6.45 లక్షల షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా 10.06 లక్షల షేర్లు చేతులు మారాయి. ఇక యూనియన్ బ్యాంక్ కౌంటర్ సగటు 7.91 లక్షల షేర్లుకాగా.. 10.35 లక్షల షేర్లు ట్రేడయ్యాయి. కాగా.. ఇండ్‌బ్యాంక్ మర్చంట్ బ్యాంకింగ్ సర్వీసెస్ షేరు ఎన్ఎస్ఈలో దాదాపు 20 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. రూ. 7.70 వద్ద ఫ్రీజయ్యింది. బీఎస్ఈలో గత నెల రోజుల ట్రేడింగ్ సగటు పరిమాణం 11,000 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 1.2 లక్షల షేర్లు చేతులు మారాయి. -
పీఎస్‌యూ బ్యాంక్‌ల బుల్ జోరు..ఐఓబీ 19% అప్
బుధవారం పీఎస్‌యూ బ్యాంక్‌ల షేర్లు భారీ లాభాల్లో ముగిసాయి. నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ 5 శాతం లాభంతో 1,284.45 పాయింట్ల వద్ద ముగిసింది. ఉదయం సెషన్లో 1,245.80 పాయింట్ల వద్ద ప్రారంభమైన పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ ఒక దశలో 1,330.60 వద్ద గరిష్టాన్ని,1,242 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. 3,348.40 పాయింట్ల వద్ద 52 వారాల గరిష్టానికి చేరింది. ఈ ఇండెక్స్‌లో భాగమైన ఐఓబీ 19.5 శాతం లాభపడి రూ.9.50 వద్ద, బ్యాంక్ ఆఫ్ఇండియా 13.3 శాతం లాభపడి రూ.39.90 వద్ద, పీఎస్బీ 10 శాతం లాభపడి రూ.15.45 వద్ద, యూనియన్ బ్యాంక్ 9శాతం లాభంతో రూ.28 వద్ద ముగిసాయి. మహారాష్ట్ర బ్యాంక్ 7.8 శాతం లాభపడి రూ.10.35 వద్ద, సెంట్రల్ బ్యాంక్ 7.7 శాతం లాభంతో రూ.16వద్ద, యూకో బ్యాంక్ 6శాతం లాభపడి రూ.12.35 వద్ద ముగిసాయి. ఇండియన్ బ్యాంక్ 5.4శాతం లాభపడి రూ.49 వద్ద, కెనరా బ్యాంక్ 4.9 శాతం లాభపడి రూ.96.70 వద్ద, జమ్ము అండ్ కశ్మీర్ బ్యాంక్ 4.9 శాతం లాభపడి రూ.12.85 వద్ద ముగియగా... పీఎన్బీ 3శాతం లాభపడి రూ.30 వద్ద, ఎస్బీఐఎన్ 2.5శాతం లాభంతో రూ.174.65 వద్ద, బ్యాంక్ ఆఫ్ బరోడా 2.2 శాతం లాభంతో రూ.43 వద్ద ముగిసాయి. -
రికార్డులకు బ్రేక్ : నష్టాల్లో మార్కెట్లు
ముంబై : జనవరి నెల డెరివేటివ్ కాంట్రాక్ట్‌ల ముగింపు నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. ఆరు రోజులుగా రికార్డులు సృష్టిస్తూ వచ్చిన మార్కెట్లు, నేటి ట్రేడింగ్‌లో నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 111 పాయింట్ల నష్టంలో 36,050 వద్ద, నిఫ్టీ 16 పాయింట్ల నష్టంలో 11,069 వద్ద క్లోజయ్యాయి. మూలధన కేటాయింపుల ప్రకటన నేపథ్యంలో నిన్నటి ట్రేడింగ్‌లో లాభాలు కురిపించిన ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ షేర్లలో తీవ్ర అమ్మకాలు చోటుచేసుకున్నాయి. దీంతో పీఎస్‌యూ బ్యాంకింగ్ ఇండెక్స్ 5 శాతం మేర పతనమైంది. ఎస్బీఐ షేర్లు భారీగా 5 శాతం కిందకి పడిపోయాయి. అన్ని రంగాల్లో అతిపెద్ద లూజర్‌గా పీఎస్‌యూ బ్యాంకు ఇండెక్సే నిలిచింది. ఎస్బీఐతో పాటు అదానీ పోర్ట్స్, డాక్టర్ రెడ్డీస్, హీరో మోటోకార్ప్, టీసీఎస్, మారుతీ సుజుకీ, ఓఎన్జీసీ, ఎన్టీపీసీ, బజాజ్ ఆటో, సన్‌ఫార్మా, భారతీ ఎయిర్టెల్ నష్టాలు పాలయ్యాయి. ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, ఇండస్ ఇండ్ బ్యాంకు, కోల్ ఇండియాలు లాభాల్లో నడిచాయి. అటు డాలర్‌తో రూపాయి మారకం విలువ 11 పైసలు మేర పెరిగి 63.58గా ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్లో బంగారం ధరలు 131 రూపాయల లాభంలో రూ.30,380గా ఉన్నాయి. -
నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు స్పల్ప నష్టాల్లో ముగిశాయి. ఆరంభం నుంచి ప్లాట్ నోట్‌తో అప్రమత్తంగా కీలక సూచీల్లో మిడ్ సెషన్ తరువాత అమ్మకాలు మరింత పెరిగాయి. దీంతో సెన్సెక్స్ 67, నిఫ్టీ10 పాయింట్ల నష్టంతో ముగిశాయి. అయితే ప్రభుత్వ, ప్రయివేట్ రంగ బ్యాంకింగ్ షేర్ల లాభాలు మార్కెట్లను ఆదుకున్నాయి. షుగర్ షేర్లు కూడా లాభాల్లో ముగిశాయి. ఇక మెటల్, రియల్టీ , ఐటీ, ఆటో సెక్టార్లు నష్టపోయాయి. శ్రీరామ ట్రాన్స్, పెట్రోనెట్, రిలయన్స్ క్యాప్, పీఎన్బీ, ఎస్‌బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్ లాభపడగా ఎన్టీపీసీ, హీరో మోటో కార్ప్, విప్రో , అశోక్ లేలాండ్, టాటా స్టీల్, సుందరంఫైనాన్స్ తదితర షేర్లు నష్టపోయిన వాటిల్లో ఉన్నాయి. -
పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ షేర్లకు ఏమైంది?
ముంబై : గత వారం రోజుల ట్రేడింగ్ సెషన్స్ లో బ్యాంకింగ్ షేర్లు పేలవ ప్రదర్శనిచ్చాయి. చాలా పబ్లిక్ రంగ బ్యాంకు షేర్లు నష్టాలనే నమోదుచేశాయి. దీంతో నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ పీఎస్ యూ ఇండెక్స్ 8శాతం మేర పడిపోయింది. స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా, బ్యాంకు ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంకులు గత 10 ట్రేడింగ్ సెషన్స్ లో 7 సార్లు నష్టాలోనే నిలిచాయి. బ్యాంకు బరోడా అయితే పది ట్రేడింగ్ లో ఎనిమిది సార్లు నష్టాలను నమోదుచేసింది. మిగతా పబ్లిక్ రంగ బ్యాంకులు యూనియన్ బ్యాంకు, యూసీఓ బ్యాంకు, ఇండియన్ ఓవర్ సిస్ బ్యాంకు, సెంట్రల్ బ్యాంకు, అలహాబాద్ బ్యాంకు, ఓరియంటల్ బ్యాంకు, జమ్మూ అండ్ కశ్మీర్ బ్యాంకులు సైతం ఈ 10 ట్రేడింగ్ సెషన్స్ లో దాదాపు నష్టాలోనే నడిచాయని గణాంకాలు చెబుతున్నాయి. ఎస్బీఐ షేర్లు 8.8శాతం, పీఎన్ బీ షేర్లు 8.82శాతం, బీఓబీ షేర్లు 6శాతం, యూనియన్ బ్యాంకు షేర్లు 10శాతం, సెంట్రల్ బ్యాంకు 1.4శాతం, ఇండియన్ ఓవర్సిస్ బ్యాంకు 6.4శాతం, అలహాబాద్ బ్యాంకు 8.6శాతం, ఓరియంటల్ బ్యాంకు 12శాతం, జమ్మూ అండ్ కశ్మీర్ బ్యాంకు 11.5శాతం నష్టపోయాయని గణాంకాలు వెల్లడించాయి. మొండిబకాయిలు సెగ ఎక్కువగా ఉండటంతో, మార్కెట్లో బ్యాంకులు సరిగ్గా ప్రదర్శించలేకపోతున్నాయని మార్కెట్ విశ్లేషకులంటున్నారు. పెట్టుబడుల పరంగా సవాళ్లను ఎదుర్కోవడం, ఆర్థిక పనితీరు అంచనా వేసినంత లేకపోవడంతో బ్యాంకు షేర్లు నష్టాల బాట పట్టాయని గణాంకాలు చెబుతున్నాయి. వచ్చే వారంలో బ్యాంకులు త్రైమాసిక ఫలితాలను ప్రకటించబోతుండటంతో, లాభాల ఫలితాలు ఆస్తులపై ప్రభావం చూపనున్నాయని వెల్లడిస్తున్నాయి. మొండి బకాయిలు కూడా పెరగబోతున్నట్టు పేర్కొన్నాయి. అదేవిధంగా ప్రభుత్వరంగ బ్యాంకులకు సగంగా ఉంటున్న ఐసీఐసీఐ సైతం ఈ త్రైమాసికంలో పేలవ ఫలితాలనే నమోదుచేసింది.