బుధవారం పీఎస్‌యూ బ్యాంక్‌ల షేర్లు భారీ లాభాల్లో ముగిసాయి. నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ 5 శాతం లాభంతో 1,284.45 పాయింట్ల వద్ద ముగిసింది. ఉదయం సెషన్‌లో 1,245.80 పాయింట్ల వద్ద ప్రారంభమైన పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ ఒక దశలో 1,330.60 వద్ద గరిష్టాన్ని,1,242 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. 3,348.40 పాయింట్ల వద్ద 52 వారాల గరిష్టానికి చేరింది. ఈ ఇండెక్స్‌లో భాగమైన ఐఓబీ 19.5 శాతం లాభపడి రూ.9.50 వద్ద, బ్యాంక్ ఆఫ్‌ఇండియా 13.3 శాతం లాభపడి రూ.39.90 వద్ద, పీఎస్‌బీ 10 శాతం లాభపడి రూ.15.45 వద్ద, యూనియన్ బ్యాంక్ 9శాతం లాభంతో రూ.28 వద్ద ముగిసాయి. మహారాష్ట్ర బ్యాంక్ 7.8 శాతం లాభపడి రూ.10.35 వద్ద, సెంట్రల్ బ్యాంక్ 7.7 శాతం లాభంతో రూ.16వద్ద, యూకో బ్యాంక్ 6శాతం లాభపడి రూ.12.35 వద్ద ముగిసాయి. ఇండియన్ బ్యాంక్ 5.4శాతం లాభపడి రూ.49 వద్ద, కెనరా బ్యాంక్ 4.9 శాతం లాభపడి రూ.96.70 వద్ద, జమ్ము అండ్ కశ్మీర్ బ్యాంక్ 4.9 శాతం లాభపడి రూ.12.85 వద్ద ముగియగా... పీఎన్‌బీ 3శాతం లాభపడి రూ.30 వద్ద, ఎస్‌బీఐఎన్ 2.5శాతం లాభంతో రూ.174.65 వద్ద, బ్యాంక్ ఆఫ్ బరోడా 2.2 శాతం లాభంతో రూ.43 వద్ద ముగిసాయి.
Comments
Please login to add a commentAdd a comment