సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు స్పల్ప నష్టాల్లో ముగిశాయి. ఆరంభం నుంచి ప్లాట్ నోట్‌తో అప్రమత్తంగా కీలక సూచీల్లో మిడ్ సెషన్ తరువాత అమ్మకాలు మరింత పెరిగాయి. దీంతో సెన్సెక్స్ 67, నిఫ్టీ10 పాయింట్ల నష్టంతో ముగిశాయి. అయితే ప్రభుత్వ, ప్రయివేట్ రంగ బ్యాంకింగ్ షేర్ల లాభాలు మార్కెట్లను ఆదుకున్నాయి. షుగర్ షేర్లు కూడా లాభాల్లో ముగిశాయి. ఇక మెటల్, రియల్టీ , ఐటీ, ఆటో సెక్టార్లు నష్టపోయాయి.
శ్రీరామ ట్రాన్స్, పెట్రోనెట్, రిలయన్స్ క్యాప్, పీఎన్‌బీ, ఎస్‌బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్ లాభపడగా ఎన్‌టీపీసీ, హీరో మోటో కార్ప్, విప్రో , అశోక్ లేలాండ్, టాటా స్టీల్, సుందరంఫైనాన్స్ తదితర షేర్లు నష్టపోయిన వాటిల్లో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment