psycho killer
-
చెట్ల మందు తాగించి..బండరాళ్లతో చంపుతాడు
సాక్షి, నాగర్‌కర్నూల్: మాయలు, మంత్రాలు తెలుసునని నమ్మిస్తూ, మంత్ర శక్తితో గుప్తనిధులు వెలికితీస్తానంటూ ఆస్తులు కాజేసి, ప్రాణాలు తీస్తున్న సైకో కిల్లర్ రామెట్టి సత్యనారాయణను నాగర్‌కర్నూల్ పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో జోగుళాంబ గద్వాల జోన్ డీఐజీ ఎల్ఎస్ చౌహాన్, ఎస్పీ వైభవ్ గైక్వాడ్ నిందితుడిని అరెస్ట్ చూపుతూ, మీడియాకు వివరాలను వెల్లడించారు. నాగర్‌కర్నూల్ జిల్లాకేంద్రానికి చెందిన రామెట్టి సత్యనారాయణ ఇప్పటివరకు 11 మందిని హత్యచేసినట్టు వెల్లడించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లోనూ హత్యలకు పాల్పడ్డాడని వెల్లడించారు. నిర్మానుష్య ప్రాంతాల్లో హత్యలు.. ‘‘నిందితుడు సత్యనారాయణ యాదవ్ తన మంత్రశక్తితో గుప్తనిధులను వెలికితీస్తానని అమాయకులను నమ్మిస్తూ వారి పేరిట ఉన్న ప్లాట్లు, వ్యవసాయ భూములను తన పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు గుర్తించాం. గుప్తనిధులు వెలికితీస్తానని ఒంటరిగా నిర్మానుష్య ప్రాంతాలకు రప్పించి వారికి జిల్లేడు పాలు, ఇతర చెట్ల మందులను తాగిస్తాడు. వారు అపస్మారక స్థితిలోకి చేరుకోగానే బండ రాళ్లతో మోది హత్యకు పాల్పడ్డాడ’’ని డీఐజీ చౌహాన్ వివరించారు. మొత్తం 11 మందిని హత్య చేయగా, ముగ్గురి మృతదేహాలు ఇప్పటివరకు దొరకలేదని చెప్పారు. 11 మంది అమాయకులు బలి.. 2020 ఆగస్టు 14న వనపర్తి జిల్లా నాగాపూర్‌లో గుప్తనిధు ల కోసం పూజల పేరుతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని హత్య చేశాడు. వీరిలో హజిరాబీ(60), ఆష్మాబేగం(32), ఖాజా(35), ఆశ్రీన్(10) ఉన్నారు. 2021లో నాగర్‌కర్నూల్ జిల్లా ఎండబెట్లకు చెందిన సలీం పాషా(38), కొల్లాపూర్ మండలం ముక్కిడిగుండం గ్రామానికి చెందిన ఆరెపల్లి శ్రీనివాసులు(52), 2022లో నాగర్‌కర్నూల్ మండలం గన్యాగులకు చెందిన వాసర్ల లింగస్వామి(50), 2023లో కల్వకుర్తి మండలం తిమ్మరాసిపల్లికి చెందిన సంపతి శ్రీధర్‌రెడ్డి(43), కోడేరు మండలం తీగలపల్లికి చెందిన రాంరెడ్డి(70), తిరుపతమ్మ(42), వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం బొల్లారం గ్రామానికి చెందిన గోవుల వెంకటేశ్(32)ను హత్య చేసినట్లుగా పోలీసులు తెలిపారు. నిందితుడు సత్యనారాయణకు పోలీస్ అధికారులతో సంబంధాలు? మూడేళ్ల నుంచి తరచుగా హత్యలు, మోసాలకు పాల్పడుతూ ఇప్పటివరకు 11 మంది అమాయకులను పొట్టనబెట్టుకున్న మాంత్రికుడు సత్యనారాయణ యాదవ్.. కొంతమంది ప్రజాప్రతినిధులు, పోలీస్ అధికారుల అండదండలతోనే ఇన్నాళ్లు తప్పించుకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా హైదరాబాద్‌లో నివసిస్తున్న ఓ మహిళ తమ కుటుంబ సమస్య పరిష్కారం కోసం సత్య నారాయణను ఆశ్రయించగా, ఆమె భూమిని కూడా తన అనుచరుల పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. దీనిపై సదరు మహిళ ఈ ఏడాది ఏప్రిల్‌లోనే నాగర్‌కర్నూల్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. అయితే అప్పటి దర్యాప్తు అధికారి నిందితుడు సత్యనారాయణ యాద వ్ నుంచి రెండు ప్లాట్లను.. తన మామ పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకుని కేసును నీరుగార్చేందుకు ప్రయత్నించినట్లు తెలిసింది. తాజాగా వీపనగండ్ల మండలం బొల్లారానికి చెందిన వెంకటేశ్ భార్య ఫిర్యాదు మేరకు ఉన్నతాధికారులు విచారణ చేపట్టడంతో విషయం బయటపడింది. అప్పుడే పట్టుకుంటే నలుగురు బతికేవారు.. వనపర్తి జిల్లా రేవల్లి మండలం నాగాపూర్‌లో 2020 ఆగస్టు 14న ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దారుణహత్యకు గురికాగా, మూడేళ్లుగా పోలీసులు నిందితుడిని గుర్తించలేదన్న విమర్శలు ఉన్నాయి. మాయలు, మంత్రాల పేరుతో భూ రిజిస్ట్రేషన్లు, ఆ తర్వాత హత్యలకు పాల్పడుతున్న సత్యనారాయణ బాగోతాలను వెలుగులోకి తెస్తూ గత ఏప్రిల్ 5న ‘మాయగాళ్లు’శీర్షికన ‘సాక్షి’కథనాన్ని ప్రచురించింది. ఆ సమయంలోనూ పోలీసులు సత్యనారాయణ కేసులో నిర్లక్ష్యం ప్రదర్శించారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆ తర్వాత 2023 జూలైలో నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం తిమ్మరాసిపల్లికి చెందిన సంపతి శ్రీధర్‌రెడ్డి, కోడేరు మండలం తీగలపల్లికి చెందిన తండ్రీకూతుళ్లు బీంరెడ్డి రాంరెడ్డి, తిరుపతమ్మ, వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం బొల్లారం గ్రామానికి చెందిన గోవుల వెంకటేశ్ హత్యకు గురయ్యారు. ఆరు నెలల ముందే పోలీసులు సత్యనారాయణను అదుపులోకి తీసుకుని ఉంటే ఆ నలుగురు ప్రాణాలతో బయటపడేవారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
సైకో కిల్లర్.. మహిళలే టార్గెట్.. పోలీసులే విస్తుపోయే నిజాలు
సాక్షి, తాండూరు: చిల్లర ఖర్చుల కోసం అతను ఎంతకైనా తెగిస్తాడు. చివరికి సైకోగా మారిపోయాడు. మర్డర్స్ చేయడం హబీగా మార్చుకున్నారు. అందుకు అడ్డా మీద కూలీలనే టార్గెట్ చేసుకున్నాడు. హత్య చేయడం అంటే అతనికి నీళ్లు తాగినంత ఈజీ.. ఇప్పటికే ఆరు హత్యలు చేసి జైలుకు వెళ్లి వచ్చినా తీరు మారలేదు. ఏడో హత్య చేసి పోలీసులకు మళ్లీ చిక్కిపోయాడు. వికారాబాద్ జిల్లాను వణికించిన సైకో కిల్లర్ కిష్లయ్య స్టోరీ ఏంటో ఇప్పుడు చూద్దాం... అదృశ్యమైన మహిళ గురించి తాండూరు పోలీసులు చేసిన దర్యాప్తు చేస్తుండగా...ఈ సైకో కిల్లర్ దారుణాలు వెలుగులోకి వచ్చాయి. సర్వబీ.. ఊరు వికారాబాద్ జిల్లా తాండూరు.. నవంబర్ 29న ఉదయం 9 గంటల ప్రాంతం.. కూలీ పనుల కోసం సర్వబీ అడ్డా మీదికి వెళ్లింది. అప్పటి నుంచి కనిపించకుండా పోయింది. డిసెంబర్ ఒకటిన ఆమె భర్త మహమూద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు విచారణ ప్రారంభించారు. స్వరాబీ అదృశ్యమైన రోజున ధారూర్ మండలం అల్లీపూర్ గ్రామానికి చెందిన మాల కిష్టప్ప వెంట వెల్లినట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులకు చిన్ని క్లూ దొరికింది. కిష్టప్పపై ఫోకస్ పెట్టారు. సైకో కిల్లర్ కిష్టప్ప బ్యాక్ గ్రౌండ్ అంతా చెక్ చేస్తే పోలీసులే విస్తుపోయారు. కిష్టప్పను అదుపులో తీసుకుని పోలీసులు తమ స్టైల్లో విచారణ మొదలుపెట్టారు. తాండూరులోని కూలీల అడ్డా మీద సర్వాబీని గ్రామంలో పని ఉందని చెప్పి వెంట తీసుకువెళ్లాడు. తాండూరు నుంచి జహీరాబాద్ వెళ్లే బస్సులో ఎక్కారు. మధ్యలో తట్టెపల్లి అటవీ ప్రాంతంలో బస్సు దిగి... లోపలికి తీసుకువెళ్లాడు. ఆమెను చీర కొంగుతోనే గొంతు నులిమి హత్య చేశాడు. ఆమె వద్ద నుంచి బంగారు గొలుసు, మోబైల్ ఫోన్, వెయ్యి రూపాయల నగదును తీసుకుని కిష్టప్ప సొంత ఊరు అల్లీపూర్ వెళ్లిపోయాడు. పోలీసులు అతన్ని అదుపులో తీసుకుని విచారించగా.. డిసెంబర్ 7న అదృశ్యమైన మహిళ సర్వాబీ మృతదేహం పోలీసులు గుర్తించారు. వికారాబాద్ జిల్లాలో కిష్టప్పపై ఆరు హత్య కేసులుండగా... ఐదు కేసుల్లో ఆధారాలు దొరకనివ్వలేదంటే అతని క్రిమినల్ మెంటాలిటీ ఎంటో అర్థం చేసుకోవచ్చు. మరో కేసు విచారణలో రెండేళ్ల పాటు జైల్లోనే ఉన్నారు. ఇటీవలే బెయిల్ పై బయటకు వచ్చిన సైకో కిల్లర్ కిష్టప్ప ఏడో హత్యకు తెగబడ్డాడు. పని ఇప్పిస్తానని చెప్పి ప్రాణాలు తీసే ఇలాంటి క్రిమినల్స్‌తో బీ కేర్ ఫుల్.. బీ అలర్ట్. ఇదీ చదవండి: చికెన్ ముక్క లేకుండా బిర్యానీ వడ్డించిన హోటల్.. రూ.30 వేలు పరిహారం! -
సైకో కిల్లర్ అరెస్టు
తాండూరు టౌన్: ఏడు హత్య కేసుల్లో నిందితుడిగా ఉన్న ఓ సైకో కిల్లర్‌ను తాండూరు పోలీసులు అరెస్టు చేశారు. మహిళా అడ్డా కూలీలే అతని టార్గెట్. వారిని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి హత్య చేసి, ఒంటిపై ఉన్న నగలు, నగదుతో పరారయ్యేవాడు. తాజాగా తాండూరు పట్టణంలో ఓ మహిళా కూలీ అదృశ్యం కేసులో పోలీసులకు పట్టుబడ్డాడు. తాండూరు డీఎస్పీ శేఖర్ గౌడ్, పట్టణ సీఐ రాజేందర్‌రెడ్డి శుక్రవారం ఆ వివరాలు వెల్లడించారు. కర్ణాటక రాష్ట్రం గుల్బర్గా జిల్లా మడ్కల్ గ్రామానికి చెందిన సర్వాబి(42) తన భర్తతో కలిసి తాండూరు పట్టణంలోని ధన్గర్ గల్లీలో నివాసం ఉంటూ కూలి పనిచేస్తుండేది. గత నెల 29న పని నిమిత్తం వెళ్లిన ఆమె తిరిగి రాలేదు. దీంతో భర్త మహ్మద్ ఈ నెల 1న పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీసీ కెమెరాల ఆధారంగా స్థానిక శాంత్‌మహల్ చౌరస్తా నుంచి సర్వాబి, ఓ వ్యక్తితో కలిసి ఇందిరాచౌక్ వెళ్తున్నట్లు గుర్తించారు. ఆ వ్యక్తి వికారాబాద్ జిల్లా ధారూరు మండలం అల్లీపూర్ గ్రామానికి చెందిన కూలి పనిచేసే మాల కిష్టప్పగా(50) పోలీసులు గుర్తించారు. గురువారం అదుపులోకి తీసుకుని కిష్టప్పను విచారించగా తానే హత్య చేశానని చెప్పడంతో, ఘటనా స్థలానికి నిందితున్ని తీసుకెళ్లి కుళ్లిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని పరిశీలించారు. రెండు నెలల క్రితమే జైలు నుంచి బయటికొచ్చి.. గత నెల 29న సర్వాబికి మాయమాటలు చెప్పి తట్టేపల్లి సమీపంలోని అడవిలోకి తీసుకెళ్లి ఆమె కొంగుతోనే మెడకు బిగించి దారుణంగా హత్య చేశాడు. అనంతరం ఆమె వద్ద ఉన్న సెల్‌ఫోన్, రూ.1000 నగదు, కాళ్ల పట్టీలు తీసుకుని అక్కడి నుంచి పరారయ్యాడు. నిందితునిపై వికారాబాద్ పీఎస్‌లో 4 కేసులు, ధారూరులో ఒకటి, యాలాలలో ఒక హత్య కేసు నమోదైంది. తాజాగా పట్టణంలో మరో కేసు నమోదు చేశారు. ఓ కేసులో 2021 నుంచి జైలులో ఉన్న కిష్టప్ప రెండు నెలల క్రితమే బయటకు వచ్చి సర్వాబిని హత్య చేశాడు. -
18 హత్యలు: భర్తలుండి తప్పుచేసే ఆడవారినే..
సాక్షి, హైదరాబాద్: రాజధానితోపాటు చుట్టుపక్కల జిల్లాల్లో వరుసపెట్టి చోరీలు చేస్తున్న ఘరానా దొంగ మంత్రి శంకర్... మూడు కమిషనరేట్లు, ఇతర జిల్లాల్లోనూ మహిళల్ని హత్య చేస్తున్న సైకోకిల్లర్ మైన రాములు... వీరిలో ఒకరు 40 ఏళ్లుగా 256 చోరీలు చేస్తే, మరొకరు 17 ఏళ్లలో 18 హత్యలు చేశాడు. గత ఏడాది జైల్లో కలుసుకున్నప్పుడు వారి మధ్య ఆసక్తికరమైన సంభాషణ జరిగిందని పోలీసులు చెప్తున్నారు. నరహంతకుడిని విచారించిన నేపథ్యంలోనే ఇది బయటపడిందని అంటున్నారు. హత్యలు చేయడం మానమంటూ శంకర్ ‘హితబోధ’చేశాడని.. దీన్ని విభేదించిన రాములు తన ‘లక్ష్యం’వేరంటూ చెప్పాడని పేర్కొంటున్నారు. నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు మంగళవారం అరెస్టు చేసిన రాములును ఘట్కేసర్ పోలీసులు బుధవారం జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. చదవండి: (భార్యలు మోసం చేయడంతో సైకోగా మారి 18 హత్యలు) జైల్లో సంభాషించుకున్న ఈ ద్వయం... రాములును పటాన్చెరు, శామీర్పేటల్లో జరిగిన రెండు హత్య కేసుల్లో పోలీసులు 2019లో అరెస్టు చేశారు. అప్పటికే కొన్ని పాత కేసులు కూడా ఉండటంతో గత ఏడాది జూలై 31 వరకు ఇతడు జైల్లోనే ఉన్నాడు. నగరంలోని వివిధ పోలీస్స్టేషన్ల పరిధిలో 12 చోరీలకు సంబంధించిన కేసుల్లో మంత్రి శంకర్‌ను హైదరాబాద్ పోలీసులు 2019, సెప్టెంబర్ 11న అరెస్టు చేశారు. ఇతడిపై పీడీ యాక్ట్ ప్రయోగించారు. ఈ నేపథ్యంలోనే శంకర్ గత ఏడాది డిసెంబర్ 4 వరకు జైల్లోనే గడిపాడు. ఇలా వీళ్లిద్దరూ జైల్లో ఉండటంతో అక్కడే కలుసుకున్నారు. రాములు వ్యవహారం తెలిసిన శంకర్ ‘హితబోధ’చేయడానికి ప్రయత్నించాడు. మహిళల ఒంటిపై ఉన్న సొత్తు కోసమే రాములు నేరాలు చేస్తున్నాడని భావించి అలా హత్యలు ఎందుకని, జైలు నుంచి బయటకు వచ్చాక తనతో వస్తే చోరీలు చేద్దామంటూ ‘ఆఫర్’ఇచ్చాడు. తాను చోరీలు చేయనంటూ చెప్పిన రాములు... కేవలం భర్తలు ఉండి పెడదారిలో నడుస్తున్న వారినే తాను చంపుతున్నానని, భర్తల్ని కోల్పోయి ఆ వృత్తిలోకి దిగిన వారిని ఏమీ చేయకుండా విడిచిపెట్టేస్తానని చెప్పుకొచ్చాడు. ఓ కోణంలో భిన్న ధ్రువాలు... ఓ కోణంలో మాత్రం శంకర్, రాములు భిన్న ధ్రువాలని పోలీసులు చెప్తున్నారు. ముగ్గురు భార్యలు ఉండగా... మరో ముగ్గురు మహిళలతో సహజీవనం చేస్తున్న గజదొంగ శంకర్ అయితే... మొదటి భార్య వివాహమైన పక్షం రోజులకే మరొకరితో వెళ్లిపోవడం, మూడేళ్లు కాపురం చేసిన రెండో భార్య విభేదాలతో వేరుకావడం, సహజీవనం చేసిన మూడో ఆమె మరొకరితో సన్నిహితంగా ఉండి కంటపడటంతో రాములు సైకోగా మారాడని వివరిస్తున్నారు. ఘట్కేసర్లో హతమైన వెంకటమ్మ కేసులో పోలీసులు రాములు అరెస్టును ప్రకటించారు. బుధవారం కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. తదుపరి విచారణ నిమిత్తం కస్టడీలోకి తీసుకోవాలని నిర్ణయించారు. -
భార్యలు మోసం చేయడంతో సైకోగా మారి 18 హత్యలు
సాక్షి, హైదరాబాద్: మొదటి భార్య వివాహమైన పక్షం రోజులకే మరొకరితో వెళ్లిపోయింది.. మూడేళ్లు కాపురం చేసిన రెండో భార్య విభేదాలు రావడంతో ఇద్దరు పిల్లల్ని తీసుకుని విడిపోయింది.. సహజీవనం చేసిన మూడో ఆమె మరొకరితో సన్నిహితంగా ఉంటూ కంటపడింది... దీంతో 2003లో తూప్రాన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ‘మూడో’ఆమెను హత్య చేశాడు. అప్పటి నుంచి భర్తలు ఉండి పెడదారిలో వెళ్తున్న మహిళల్ని ఎంపిక చేసుకుంటున్నమైన రాములు 18 మందిని చంపాడు. తాజాగా ఘట్కేసర్, ములుగు పోలీస్స్టేషన్ల పరిధిలో ఇద్దరిని చంపిన ఈ సైకో సీరియల్ కిల్లర్‌ని ఉత్తర మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారని కొత్వాల్ అంజనీకుమార్ వెల్లడించారు. ఓఎస్డీ పి.రాధా కిషన్‌రావుతో కలసి మంగళవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పూర్తి వివరాలు వెల్లడించారు. సైకో కిల్లర్‌గా మారి హత్యలు.. సంగారెడ్డి జిల్లా ఆరుట్ల గ్రామానికి చెందిన రాములుకు తలారీ, సాయిలు అనే పేర్లూ ఉన్నాయి. వృత్తిరీత్యా స్టోర్ కటర్ అయిన ఇతను ప్రస్తుతం బోరబండలో నివసిస్తున్నాడు. ఇద్దరు భార్యలతో పాటు సహజీవనం చేసిన మహిళ ద్వారా ఎదురైన అనుభవాలతో సైకో కిల్లర్‌గా మారాడు. ఇటీవల మరో మహిళను వివాహం చేసుకుని ఆమెతో కలసి బోరబండలో నివసిస్తున్న రాములు.. భర్తలు ఉండి వారిని మోసం చేస్తూ వ్యభిచారం చేసే వారిని, డబ్బు కోసం పరాయి మగవాడికి లొంగిపోయిన వారిని ఎంచుకుని చంపుతుంటాడు. చదవండి: (మదనపల్లి జంటహత్యల కేసులో కొత్త ట్విస్ట్) ప్రధానంగా కల్లు కాంపౌండ్లలో ఉన్న ఈ తరహా మహిళలతో పరిచయం పెంచుకుంటాడు. వారితో కలసి కల్లు తాగే రాములు ఆపై డబ్బు ఆశ చూపి తన వెంట నిర్మానుష్య ప్రాంతాలకు తీసుకువెళ్తాడు. అక్కడికి వెళ్లిన తర్వాత వారి పూర్వాపరాలు అడుగుతాడు. వారిలో ఎవరికైనా భర్తలున్నట్లు తేలితే... సైకోగా మారిపోయే రాములు వారిపై అత్యాచారం చేస్తాడు. ఆపై చీరతో ఉరి బిగించి లేదా బండ రాయితో మోది చంపేస్తాడు. కొన్నిసార్లు మృతదేహాన్ని ఎవరూ గుర్తుపట్టకుండా ముఖం తదితర భాగాలపై పెట్రోల్ పోసి కాల్చేస్తాడు. దీనికి ముందు మృతదేహంపై నుంచి చెవి కమ్మలు, కాళ్ల పట్టీలను తదితరాలు తస్కరిస్తాడు. ఏ ఆధారం వదలకుండా అక్కడ నుంచి జారుకుంటాడు. పిచ్చిపట్టినట్లు నాటకం... ఎనిమిది హత్యలు చేసిన ఇతడిని 2009, అక్టోబర్ 12న సైబరాబాద్ పోలీసులు తొలిసారిగా పట్టుకున్నారు. అప్పట్లో నార్సింగిలో జరిగిన హత్య కేసులో రంగారెడ్డి జిల్లా కోర్టు జీవితఖైదు విధించింది. 2011లో మరో కేసులోనూ ఇలాంటి శిక్షే పడింది. దీంతో చర్లపల్లి కేంద్ర కారాగారంలో కొన్నాళ్లు శిక్ష అనుభవించాడు. అక్కడ నుంచి తప్పించుకునే అవకాశం లేకపోవడంతో తనకు పిచ్చిపట్టినట్లు నాటకమాడాడు. దీంతో జైలు అధికారులు ఎర్రగడ్డలోని మానసిక చికిత్సాలయంలో చేర్చారు. 2011, డిసెంబర్ 29 రాత్రి రాములు అక్కడున్న ఇతర ఖైదీలు నర్సయ్య, అఫ్రోజ్ ఖాన్, గిరిజ సింగ్ వాఘేలా, యాదగిరి, లచ్చయ్యలతో కలసి పథకం వేసి తప్పించుకున్నాడు. దీనిపై ఎస్సార్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ముగ్గురిని పోలీసులు అప్పట్లోనే పట్టుకోగా... రాములుతో పాటు లచ్చయ్య, అఫ్రోజ్ ఖాన్ కొన్నాళ్ల వరకు చిక్కలేదు. చదవండి: ('ఒకరోజు ఆగండి, మా పిల్లలు లేచి వస్తారు') చోరీ కేసులు కూడా.. పారిపోయిన రాములు నగర శివారుల్లో ఉంటూ స్టోన్ క్రషర్స్‌లో కార్మికుడిగా పని చేశాడు. మళ్లీ సైకోగా మారి చందానగర్ ఠాణా పరిధిలో ఇద్దరు మహిళలను హత్యచేశాడు. రాములు పని చేస్తున్న క్రషర్లోనే మేతారీ బాలనర్సింహ్మ పరిచయమైంది. వీరిద్దరు దుండిగల్, బోయిన్పల్లి పరిధుల్లో మరో ముగ్గురు మహిళల్ని చంపేశారు. ఈ ఐదు హత్య కేసుల్లో రాములు, బాలనర్సింహ్మను పోలీసులు 2013, మే 13న అరెస్టు చేశారు. జీవితఖైదు పడిన కేసుల్ని హైకోర్టులో సవాల్ చేసి, మిగిలిన కేసుల్లో బెయిల్ పొందిన రాములు 2018 అక్టోబర్ 3న బయటకొచ్చి శామీర్‌పేట, పటాన్చెరు పరిధుల్లో ఇద్దరు మహిళలను హత్య చేశాడు. పటాన్చెరు పోలీసులు అరెస్టు చేయగా.. గతేడాది జూలై 31న జైలు నుంచి విడుదలయ్యాడు. ఇతడిపై శామీర్‌పేట, మేడ్చల్, రాయదుర్గం, ఐడీఏ బొల్లారం ఠాణాల్లో చోరీ కేసులు కూడా ఉన్నాయి. సీసీ కెమెరాల ఆధారంగా.. గత ఏడాది డిసెంబర్ 10న బాలానగర్ కల్లు కాంపౌండ్ నుంచి ఓ మహిళను ములుగు ప్రాంతానికి తీసుకువెళ్లాడు. అక్కడ ఆమెతో కలసి మద్యం తాగి హత్య చేశాడు. డిసెంబర్ 30న యూసుఫ్‌గూడ కల్లు కాంపౌండ్ నుంచి వెంకటమ్మను తీసుకువెళ్లి ఘట్కేసర్ వద్ద హత్య చేశాడు. వెంకటమ్మ హత్య కేసును ఛేదించడానికి నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ కె.నాగేశ్వరరావు నేతృత్వంలోని బృందం రంగంలోకి దిగింది. ఎస్సైలు కె.శ్రీకాంత్, జి.రాజశేఖర్‌రెడ్డి, బి.పరమేశ్వర్ తదితరులు సీసీ కెమెరాల ఫీడ్‌లో చిక్కిన ఫీడ్ ఆధారంగా రాములును పట్టుకున్నారు. ములుగులో హత్యకు గురైన మహిళను గుర్తించాల్సి ఉంది. -
16 హత్యలు: సీరియల్ కిల్లర్ అరెస్ట్..
సాక్షి, హైదరాబాద్: ఒంటరిగా ఉన్న మహిళలను టార్గెట్ చేసుకొని హతమారుస్తున్న సీరియల్ కిల్లర్ రాములును రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సైకో కిల్లర్ 16 హత్యలు చేసినట్లు పోలీసులు నిర్థారించారు. 2011లో ఎర్రగడ్డ మెంటల్ ఆసుపత్రి నుంచి పరారైన రాములు స్వగ్రామం సంగారెడ్డి జిల్లా కంది మండలం అరుట్ల కాగా, గతంలో రాములపై పలు పోలీస్‌స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి. జైలు నుంచి పారిపోయి మళ్లీ హత్యలు చేస్తున్న సైకో కిల్లర్‌ను రాచకొండ పోలీసులు నిర్వహించిన జాయింట్ ఆపరేషన్‌లో పట్టుకున్నారు. నిందితుడిపై 16 హత్యలు, నాలుగు దోపిడీ, ఒక పోలీస్ కస్టడీ నుండి తప్పించుకున్న కేసులు ఉన్నాయి. చదవండి: ఈ దొంగ బాగా రిచ్, ఓ విల్లా.. 4 హైఎండ్ కార్లు హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ వివరాలను మంగళవారం మీడియాకు వెల్లడించారు. ‘‘చిన్న వయసులో పెళ్లి చేసుకున్న రాములు.. తన భార్య విడిపోవడంతో అప్పటి నుండి మహిళలపై కక్ష పెంచుకున్నాడు. మానసికంగా దెబ్బ తిన్న రాములు.. అప్పటి నుండి హత్యలకు పాల్పడుతున్నాడు. మొదట ములుగు పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళను హత్య చేశాడు. అతని చేతిలో హత్యకు గురైన వారందరు కూడా మహిళలే. మెదక్ జిల్లా తూప్రాన్, సంగారెడ్డి, నరసాపూర్, బోయినపల్లిలో ఇద్దరిని, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 11 మంది మహిళలను హత్య చేశాడు. చదవండి: కిడ్నాప్ కలకలం.. ఆడ వేషంలో వచ్చి మరీ.. నార్సింగ్ మహిళ హత్య కేసులో అతనికి జీవిత కాలం శిక్ష పడింది. అతని మానసిక స్థితి సరిగ్గా లేకపోవడంతో ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రికి పోలీసులు తరలించగా, 2011లో అక్కడ నుంచి రాములు తప్పించుకున్నాడు. ఆ తర్వాత కూడా తీరు మార్చుకోని రాములు.. ఐదు దోపిడీలకు పాల్పడ్డాడు. 2013 లో అతనిని బోయినపల్లి పోలీసులు అరెస్ట్ చేయగా, 2018 లో జైలు నుండి విడుదలయ్యాడు. జైలు నుండి విడుదలై వచ్చిన తరువాత వరుసగా రెండు హత్యలకు రాములు పాల్పడ్డాడని’’ సీపీ వెల్లడించారు. -
హాజీపూర్ సైకో కిల్లర్ మరో వారం కస్టడీ కొరుతూ పిటిషన్
-
సైకో కిల్లర్ శ్రీనివాస్‌రెడ్డిను ఉరి తీయాలి
-
ఔను.. చంపింది నేనే
చిత్తూరు అర్బన్: ‘ఔను.. జిల్లాలో రెండు హత్యలు, తమిళనాడులో ఆరు మర్డర్లు, ఎనిమిది హత్యాయత్నాలు చేశాను. పాలసముద్రంలో వళ్లియమ్మను ఇంటి వద్ద బండరాయితో చంపాను. దానికి ముందే నగరిలో రత్నమ్మను చంపేశాను’’ అని పోలీసుల అదుపులో ఉన్న సీరియల్ సైకో కిల్లర్ మునస్వామి పూస గుచ్చినట్లు వివరించాడు. చిత్తూరు పోలీసులు అతన్ని మూడు రోజుల క్రితం అదుపులోకి తీసుకున్నారు. సోమవారం పాలసముద్రం, నగరి ప్రాంతాలకు తీసుకెళ్లారు. అతడు హత్య చేసిన తీరును కళ్లకుకట్టినట్లు పోలీసులకు వివరించాడు. ఇక తమిళనాడులోని షోలింగర్, బానావరం పోలీస్ స్టేషన్ల నుంచి సీఐలు చిత్తూరు చేరుకుని మునస్వామి నేర చరిత్రపై వివరాలను సేకరించారు. తమిళనాడులో ఎక్కడెక్కడ ఎప్పుడు ఎవర్ని చంపాడనే వివరాలను మునస్వామి వివరించాడు. అలాగే పదుల సంఖ్యలో చోరీలు, దొమ్మీల కేసుల్లో సైతం ఈ నరరూప రాక్షసుడి పాత్రను పోలీసులు గుర్తించారు. రూ.50ల కోసం హత్యలు చేయడం, అన్ని హత్యల్లోనూ 60కు పైబడ్డ వయస్సున్న వృద్ధుల్ని ఎంచుకోవడం, తలపై బండరాయి వేసి చంపడం, మృతుల శరీరంపై ఉన్న నగలు ముట్టుకోకపోవడం, చంపిన తరువాత మృతదేహాల లైంగిక అవయవాలను పళ్లతో కొరికి గాట్లు పెట్టడం ఈ సైకో కిల్లర్ నైజంగా పోలీసులు గుర్తించారు. మునస్వామి వాంగ్మూలాన్ని రికార్డుల్లో నమోదు చేశారు. మంగళవారం నిందితుడ్ని మీడియా ఎదుట ప్రవేశపెట్టనున్నారు. -
అతడు సైకో కిల్లర్
చిత్తూరు అర్బన్ : ఫిబ్రవరి 25.. నగరి మండలంలోని వికెఆర్.పురం వద్ద ఇంట్లో ఒంటరిగా నిద్రిస్తు న్న రత్నమ్మ (62) దారుణ హత్యకు గురైం ది. తలపై బండరాయి వేసి హత్య చేశారు. వివస్త్రను చేయడమేగాక ఆమె శరీరంపై పలుచోట్ల పంటిగాట్లు ఉండడాన్ని పోలీసులు గుర్తించారు. ఈ నెల 9వ తేదీ అర్ధరాత్రి పాలసముద్రం మండలం గంగమాంబపురం పంచాయతీ అభిరాజుకండ్రిగ గ్రామ శివారుల్లో ఉన్న ఇంట్లో వళ్లియమ్మ (65) నిద్రించింది. ఉదయం కూతురు వచ్చి చూసేసరికి వళ్లియమ్మ రక్తపు మడుగులో ఉంది. ఆమె శరీరంపై కూడా అదే ఆనవాళ్లు. హత్యలు చేస్తున్నది ఒక్కరేనని పోలీసులు నిర్ధారిం చుకున్నారు. అది కూడా సైకో కిల్లర్‌గా ఉన్నాడని అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ రెండు హత్యల్లో నిందితుడిని చిత్తూరు పోలీసులు పట్టుకున్నారు. గ్రామాల శివారులో ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని ఒంటరిగా ఉన్న వృద్ధురాళ్లను హత్య చేసి లైంగిక దాడి చేస్తున్న సీరియల్ సైకో కిల్లర్‌ను మన పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. శనివారం తమిళనాడులోని షోలింగర్ వద్ద ఉన్న నిందితుడు మునస్వామి (40)ని అదుపులోకి తీసుకుని చిత్తూరుకు తరలించారు. ప్రాథమిక సమాచారం ఎస్పీ రాజశేఖర్‌బాబుకు తెలియడంతో అధికారులను అభినందించారు. నిందితుడు ఇదే తరహాలో తమిళనాడులోని పలు ప్రాంతాల్లో ఆరు హత్యలు చేసినట్లు ప్రాథమిక విచారణలో సమాచారం రాబట్టిన అధికారులు నిర్ఘాంతపోయారు. ఇలా చిక్కాడు.. నగరిలో రత్నమ్మను హత్య చేసిన తరువాత మునస్వామి బస్సుల్లో తిరుగుతూ ఈ నెల 8న పాలసముద్రం చేరుకున్నాడు. ఇతనిది షోలింగర్ కావడంతో ఊరికి వెళ్లే దారిలో ఒంటరిగా ఉన్న వళ్లియమ్మను బండరాయితో హత్య చేశాడు. అనంతరం నడుచుకుంటూ తమిళనాడు వెళ్లిపోయాడు. ఆంధ్ర–తమిళనాడు సరిహద్దులో ఉన్న ఓ పెట్రోలు బంకు వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరా పుటేజీలో మునస్వామి అర్ధరాత్రి వెళ్లడాన్ని పోలీసులు గుర్తించారు. వారం రోజులుగా వేలూరు, షోలింగర్, ఆర్కాడు ప్రాంతాల్లో గాలింపు చేపట్టారు. ఆయా పోలీస్ స్టేషన్లలో వేలిముద్రల ఆధారంగా పాత నేరస్తుడి వివరాలను మన పోలీసులు సేకరించారు. ఇందులో మునస్వామి ఉన్నట్లు గుర్తించి షోలింగర్ వద్ద ఉన్న అతన్ని అదుపులోకి తీసుకున్నారు. పూర్తి స్థాయిలో విచారించిన తరువాత అరెస్టు చూపే అవకాశం ఉంది. మరెన్నో కేసులు.. మునస్వామిపై తమిళనాడులోని తిరువళ్లూరు, వేలూరు తదితర ప్రాంతాల్లో చోరీలతోపాటు హత్యాయత్నం కేసులు నమోదయ్యాయి. వీటిల్లో కొన్ని కేసులు న్యాయస్థానంలో రుజువుకాకపోగా.. మరికొన్నింటిలో బెయిల్‌పై బయటకొచ్చి కోర్టు వాయిదాలకు హాజరుకాకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. మరోవైపు తిరువళ్లూరు, షోలింగర్, అరక్కోణం, వేలూరు ప్రాంతాల్లో దాదాపు ఆరు హత్యలకు పాల్పడినట్టు నిందితుడు అంగీకరించినట్లు సమాచారం. పట్టుకోకుంటే మరిన్ని హత్యలు... చిత్తూరు జిల్లాలో జరిగిన రెండు హత్య కేసుల్ని పరిశీలించిన పోలీసులు ఒకే వ్యక్తి దారుణానికి ఒడిగట్టినట్టు నిర్ధారణకు వచ్చారు. పైగా హత్యానంతరం వృద్దుల ఛాతీపై పళ్లగాట్లు ఉండటంతో అతను సైకో అని తెలుసుకుని విస్తుపోయారు. ఈ వ్యవహారాన్ని జాగ్రత్తగా డీల్ చేయాలని ఎస్పీ రాజశేఖర్‌బాబు ఆదేశించడంతో ఓ ప్రత్యేక బృందం రంగంలోకి దిగింది. వారం రోజుల పాటు విచారించి మాటువేసి నిందితుడ్ని పట్టుకున్నారు. మునస్వామిని పట్టుకోకుంటే మరిన్ని హత్యలు జరిగి ఉండేవని పోలీసులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న తమిళనాడు పోలీసులు చిత్తూరుకు వచ్చి కేసుపై మన పోలీసులతో విచారిస్తున్నారు. -
సైకో కిల్లర్‌కు ఉరిశిక్ష
► నెల్లూరు అదనపు సెషన్స్ కోర్టు తీర్పు నెల్లూరు (లీగల్): అతి కిరాతకంగా నలుగురిని హత్య చేసి.. మరో నలుగురిని హతమార్చేందుకు ప్రయత్నించిన ఉన్మాది కుక్కపల్లి వెంకటేశ్వర్లు అలియాస్ వెంకటేష్‌కు ఓ కేసులో ఉరి శిక్ష విధిస్తూ నెల్లూరు 4వ అదనపు సెషన్స్ కోర్టు గురువారం సంచలన తీర్పునిచ్చింది. నిందితుడు ప్రస్తుతం జంట హత్యల కేసులో జీవిత ఖైదు అనుభవిస్తుండగా.. మహిళను హత్య చేసిన మరో కేసులో అతడికి ప్రాణం పోయేవరకు ఉరి తీయాలంటూ సెషన్స్ కోర్టు జిల్లా జడ్జి బి.శ్రీనివాసరావు తీర్పు వెలువరించారు. టీచర్‌గా పనిచేస్తూ నెల్లూరు శ్రీసాయి నగర్లో నివాసముండే రావిప్రోలు ప్రభావతిని గత ఏడాది జూలై 9న వెంకటేష్ దారుణంగా హతమార్చాడు. ఆమె ఇంట్లో ఉండగా.. వెంకటేష్ ఇంట్లో జొరబడి ప్రభావతి తలపై సుత్తితో విచక్షణా రహితంగా కొట్టాడు. అడ్డుకునేందుకు వెళ్లిన ఆమె సోదరి కుమారుడు అనంతకృష్ణ, సోదరి కుమార్తె మాధురిపైనా దాడి చేసి వారి తలలు పగులగొట్టాడు. వారి బంగారు ఆభరణాలు, సెల్ఫోన్లను అపహరించుకుపోతుండగా.. ప్రభావతి భర్త నాగేశ్వరరావు అటకాయించారు. స్థానికులు వచ్చి వెంకటేష్‌ను పట్టుకుని బాలాజీ నగర్ పోలీసులకు అప్పగించారు. తీవ్రంగా గాయపడిన ప్రభావతి మృతి చెందారు. అనంతకృష్ణ, మాధురి ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. వెంకటేష్ చేసిన నేరం రుజువు కావడంతో అతనికి ఉరిశిక్ష ఖరారు చేస్తూ న్యాయమూర్తి బి.శ్రీనివాసరావు ఉత్తర్వులు జారీ చేశారు. కాగా నిందితుడు వెంకటేష్ పెద్దచెరుకూరు శివాలయం పూజారి దంపతులు నూతలపాటి చంద్రమౌళీశ్వరరావు, పుష్పవేణిలను హత్య చేసిన కేసులో ప్రస్తుతం జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. కావలి వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళ హత్య కేసులోనూ అతను నిందితుడు. వెంకటేష్ మొత్తం నాలుగు హత్యలు, నాలుగు హత్యాయత్నాలకు పాల్పడ్డాడు. ఇతడిపై పలు దోపిడీ కేసులు ఉన్నాయి. ఉరిశిక్ష పడ్డ ఉన్మాది.. చంద్రబాబుకు వీరాభిమాని సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నాలుగు హత్యలు.. నాలుగు హత్యాయత్నాలు.. అనేక దోపిడీ, చోరీ కేసుల్లో దోషి అయిన కుక్కపల్లి వెంకటేశ్వర్లు అలియాస్ సైకో సుత్తి అలియాస్ వెంకటేష్ సీఎం చంద్రబాబుకు వీరాభిమాని. అతడు టీడీపీలో క్రియాశీలక కార్యకర్తగా ఉండేవాడు. 2014 ఎన్నికల ముందు చంద్రబాబు చేసిన పాదయాత్రలో ఆయనతో కలసి నడిచాడు. ఇందుకు గుర్తుగా చంద్రబాబుతో కలసి తీసుకున్న ఫొటోలను ఫేస్‌బుక్‌లోనూ ఆప్‌లోడ్ చేశాడు. హిందూపురంలోని బంధువుల ఇంట్లో ఉన్న వెంకటేష్ అక్కడ టీడీపీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవాడు. తన మోటార్‌సైకిల్‌పై చంద్రబాబు, బాలకృష్ణ ఫొటోలు ఉంచుకుని తిరిగేవాడు. -
సైకో కిల్లర్‌కు ఉరిశిక్ష
నెల్లూరు అదనపు సెషన్స్ కోర్టు తీర్పు నెల్లూరు (లీగల్): అతి కిరాతకంగా నలుగురిని హత్య చేసి.. మరో నలుగురిని హతమార్చేందుకు ప్రయత్నించిన ఉన్మాది కుక్కపల్లి వెంకటేశ్వర్లు అలియాస్ వెంకటే‹ష్కు ఓ కేసులో ఉరి శిక్ష విధిస్తూ నెల్లూరు 4వ అదనపు సెషన్స్ కోర్టు గురువారం సంచలన తీర్పునిచ్చింది. నిందితుడు ప్రస్తుతం జంట హత్యల కేసులో జీవిత ఖైదు అనుభవిస్తుండగా.. మహిళను హత్య చేసిన మరో కేసులో అతడికి ప్రాణం పోయేవరకు ఉరి తీయాలంటూ సెషన్స్ కోర్టు జిల్లా జడ్జి బి.శ్రీనివాసరావు తీర్పు వెలువరించారు. టీచర్‌గా పనిచేస్తూ నెల్లూరు శ్రీసాయి నగర్లో నివాసముండే రావిప్రోలు ప్రభావతిని గత ఏడాది జూలై 9న వెంకటేష్ దారుణంగా హతమార్చాడు. ఆమె ఇంట్లో ఉండగా.. వెంకటేష్ ఇంట్లో జొరబడి ప్రభావతి తలపై సుత్తితో విచక్షణా రహితంగా కొట్టాడు. అడ్డుకునేందుకు వెళ్లిన ఆమె సోదరి కుమారుడు అనంతకృష్ణ, సోదరి కుమార్తె మాధురిపైనా దాడి చేసి వారి తలలు పగులగొట్టాడు. వారి బంగారు ఆభరణాలు, సెల్ఫోన్లను అపహరించుకుపోతుండగా.. ప్రభావతి భర్త నాగేశ్వరరావు అటకాయించారు. స్థానికులు వచ్చి వెంకటేష్‌ను పట్టుకుని బాలాజీ నగర్ పోలీసులకు అప్పగించారు. తీవ్రంగా గాయపడిన ప్రభావతి మృతి చెందారు. అనంతకృష్ణ, మాధురి ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. వెంకటేష్ చేసిన నేరం రుజువు కావడంతో అతనికి ఉరిశిక్ష ఖరారు చేస్తూ న్యాయమూర్తి బి.శ్రీనివాసరావు ఉత్తర్వులు జారీ చేశారు. కాగా నిందితుడు వెంకటేష్ పెద్దచెరుకూరు శివాలయం పూజారి దంపతులు నూతలపాటి చంద్రమౌళీశ్వరరావు, పుష్పవేణిలను హత్య చేసిన కేసులో ప్రస్తుతం జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. కావలి వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళ హత్య కేసులోనూ అతను నిందితుడు. వెంకటేష్ మొత్తం నాలుగు హత్యలు, నాలుగు హత్యాయత్నాలకు పాల్పడ్డాడు. ఇతడిపై పలు దోపిడీ కేసులు ఉన్నాయి. -
ఆగని అన్వేషణ.. చిక్కని అదృశ్య హంతకుడు
చిక్కడు.. దొరకుడు..లాగా ఏటీఎం సైకో కిల్లర్ 18 కర్ణాటక, 12 ఆంధ్రా పోలీసు బృందాల గాలింపు అనంతపురం క్రైం:దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన బెంగళూరు ఏటీఎం కేసులో నిందితుడు దాదాపు ఎనిమిది నెలలుగా రెండు రాష్ట్రాల పోలీసులను ముప్పుతిప్పలు పెడుతున్నాడు. ఈ అదృశ్య హంతకుడి కోసం కర్ణాటకకు చెందిన 18, ఆంధ్రాకు చెందిన 12 పోలీసు బృందాల్లోని మొత్తం 500 మంది పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఇప్పటి వరకు రూ.15 లక్షలకు పైగా ఖర్చు చేశారని తెలుస్తోంది. గత ఏడాది నవంబర్ 19న బెంగళూరు నగరం నడిబొడ్డున పట్టపగలు ఓ ఏటీఎం కేంద్రంలో బ్యాంకు ఉద్యోగి జ్యోతి ఉదయ్‌పై కత్తితో కిరాతకంగా దాడి చేశాడు. ఆమె వద్ద ఏటీఎం కార్డుతో పాటు సెల్‌ఫోన్‌ను అపహరించాడు. తర్వాత సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా హిందూపురంలో అబుజర్ అనే యువకుడితో పాటు అతని సోదరుడిని అదుపులోకి తీసుకున్నారు. కాగా సైకో తమకు రూ.800కు సెల్‌ఫోన్‌ను విక్ర యించినట్లు వారు పోలీసులకు చెప్పారని తెలుస్తోంది. బెంగళూరు ఘటనకు మునుపే ‘అనంత’లోని ధర్మవరంలోని చంద్రబాబునగర్‌లో నవంబర్ 10న ప్రమీలమ్మ అనే వృద్ధురాలిని ఏటీఎం నిందితుడు హతమార్చి ఆమె ఏటీఎం కార్డును తీసుకుని ఉడాయించినట్లు కర్ణాటక పోలీసుల దర్యాప్తుల్లో వెల్లడైంది. ఆమె హత్యానంతరం నవంబర్ 12న కదిరి ఆర్టీసీ బస్టాండు వద్ద ఉన్న ఎస్బీఐ ఏటీఎంలో ఉదయం 10.36కు రూ.3.400 డ్రా చేశాడు. తర్వాత సుమారు 20 నిమిషాల పాటు ఆ ఏటీఎంలోనే గడిపాడు. అక్కడి నుంచి నవంబర్ 19న బెంగళూరు వెళ్లి.. అక్కడ బ్యాంకు ఉద్యోగినిపై దాడి చేశాడు. అక్కడి సీసీ పుటేజీల్లో ఉన్న నిందితుడి ఫొటోలను ప్రింట్స్ వేసి ఆంధ్రలోని అన్ని పోలీసు స్టేషన్లు, ఏటీఎం కేంద్రాల వద్ద అతికించారు. అనంతరం దాదాపు 100 నుంచి 150 మంది అనుమానితుల్ని ప్రత్యేక పోలీసు బృందాలు విచారణ జరిపాయి. పట్టిస్తే రూ. 6 లక్షల నజరానా : ఏటీఎం నిందితుడిని పట్టిచ్చిన వారికి ఆంధ్రా పోలీసులు రూ.లక్ష, బెంగళూరు పోలీసులు రూ.2 లక్షలు అప్పట్లో ప్రకటించారు. అయినా ఆచూకీ దొరక్క పోవడంతో కర్ణాటక పోలీసులు బహుమతిని రూ.5 లక్షలకు పెంచారు. ఈ క్రమంలో ఆంధ్ర-కర్ణాటక పోలీసులు వైఎస్సార్ జిల్లా, అనంతపురంతో పాటు జిల్లాలోని పెనుకొండ, హిందూపురం, ధర్మవరం, కదిరి పట్టణాలు, బెంగళూరు, తుంకూర్, ఆంధ్రా సరిహద్దు ప్రాంతాల్లో శోధించారు. దీంతో జిల్లాలోని నల్లచెరువు మండలం చెరువువాండ్లపల్లిలో పాత నేరస్తుడు నారాయణరెడ్డి కోసం వందల సంఖ్యలో ఇరు రాష్ట్రాల పోలీసులు వెళ్లి హంగామా చేశారు. 2008లో జరిగిన ఓ మహిళ హత్య, పలు దొంగతనాల కేసుల్లో అతను నిందితుడని పోలీసు రికార్డుల్లో నమోదైంది. కాగా అతను మానసిక వ్యాధిగ్రస్తుడని, మహిళలు కనిపిస్తే దాడులు చేస్తుంటాడని గ్రామస్తులు తెలిపారు. ఖమ్మం జిల్లా జరిగిన ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఇతని ఫొటోలను అక్కడి పోలీసులు అనంతపురానికి పంపారు. దీంతో వాటితో బెంగళూరు ఏటీఎం సీసీ కెమెరాల పుటేజీని పోలుస్తూ పోలీసులు నిశితంగా పరిశీలిస్తున్నారు. అయితే అతన్ని అదుపులోకి తీసుకునే ప్రయత్నాలేవీ చేయలేదు. పోలీసుల అన్వేషణ కొనసాగుతూనే ఉంది. -
ఉదాసీనతే అసలు.. ఉన్మాదం
అక్కడి నుంచి నిత్యం లక్షలాది మంది రాకపోకలు సాగిస్తారు.. కానీ నిఘా, భద్రత మచ్చుకైనా కానరావు.. హిజ్రాలు, వ్యభిచారిణులు యథేచ్ఛగా తిరుగుతుంటారు.. కొందరు మత్తులో జోగుతూ మతితప్పి ప్రవర్తిస్తుంటారు.. ఆగి ఉన్న రైలు బోగీల్లో అసాంఘిక కార్యకలాపాలు.. జేబుదొంగల చేతివాటం సరేసరి.. అడపాదడపా రైలు బోగీలకు నిప్పంటుకుంటుంటుంది.. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ముఖచిత్రమిది. పోలీసులది షరా మామూలుగా ఉదాసీన వైఖరి. ఇవన్నీ అక్కడ చాలా సర్వసాధారణ దృశ్యాలు. సాక్షి, సిటీబ్యూరో: ఓ ఉన్మాది రెండు చేతుల్లో కత్తులతో వీరంగమాడుతూ పట్టపగలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆరేళ్ల చిన్నారి ప్రియదర్శినిని కర్కశంగా పొడిచి చంపేశాడు. మెటల్ డిటెక్టర్లు, ప్రవేశద్వారాల వద్ద తనిఖీలు దాటుకుని అతను స్టేషన్ ప్రాంగణంలోకి నేరుగా వచ్చేయగలిగాడంటే నిఘా, భద్రత పర్యవేక్షణ ఎంత అధ్వానంగా ఉన్నాయో ఊహించవచ్చు. మరికాసేపట్లో రెలైక్కి నాన్న, నాన్నమ్మతో సరదాగా ప్రయాణించాల్సిన చిన్నారి ఉన్మాది చేతుల్లో దారుణంగా బలైపోయింది. మంగళవారం చోటుచేసుకున్న ఈ ఘటన కలకలం సృష్టించింది. అసాంఘికశక్తులపై కఠినంగా వ్యవహరించి వారిని స్టేషన్‌కు ఆమడదూరంలో ఉంచే పద్ధతి తొలి నుంచీ ఉండి ఉంటే ఇంతటి దారుణోదంతం జరిగేది కాదని ప్రయాణికులు అంటున్నారు. ‘టై’ జోన్‌గా స్టేషన్ పరిసరాలు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పరిసరాలతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ నిత్యం హిజ్రాలు, వ్యభిచారిణుల సంచారం ఉంటుంది. అనేక సందర్భాల్లో వీరు ప్రయాణికుల్ని ఆకర్షించడం ద్వారా నిర్జన ప్రదేశాలకు తీసుకెళ్లి దాడులకు పాల్పడిన ఉదంతాలూ ఉన్నాయి. ఇక, వీరి మధ్య గ్యాంగ్‌వార్స్ కూడా తరచూ జరుగుతుంటాయి. ఇక మేజర్లు, మైనర్లు అనే తేడా లేకుండా వైట్నర్, మద్యం తాగే వాళ్లు, ఆ మత్తులో తిరిగే వాళ్లకు ఇక్కడ కొదవే లేదు. వీరి కారణంగా ప్రయాణికులు నిత్యం ఇబ్బందుల పాలవుతున్నారు. ఇక్కడిలా ఉంటే, రైల్వే యార్డుల్లో నిలిపి ఉంచిన రైళ్లు సైతం బుగ్గైన ఉదంతాలున్నాయి. ఇన్ని జరుగుతున్నా అటు గవర్నమెంట్ రైల్వే పోలీసులు (జీఆర్పీ), ఇటు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) అధికారులు గట్టి చర్యలు తీసుకుంటున్న దాఖలాల్లేవు. దీంతో రైల్వేస్టేషన్ ప్రాంతం టై జోన్ గా మారి ప్రయాణికులను ఉలిక్కిపడేలా చేస్తోంది. సీసీ కెమెరాలు ఉన్నదెందుకు? లష్కర్ రైల్వేస్టేషన్లో సీసీ కెమెరాలకు లెక్కే లేదు. గత ఆగస్టులో గాంధీ ఆస్పత్రి నుంచి అపహరణకు గురైన ఒకరోజు వయసున్న చిన్నారి కేసు మిస్టరీ గంటల్లో వీడిందంటే ఇక్కడి సీసీ కెమెరాలు ఇచ్చిన క్లూ వల్లే సాధ్యమైంది. ఇప్పటి వరకు సీసీ కెమెరాలు ఓ ఉదంతం జరిగినప్పుడు దాన్ని కొలిక్కి తేవడానికి మాత్రమే ఉపకరిస్తాయనే భావన అధికారులు, వ్యవస్థల్లో వేళ్లూనుకుపోయింది. వీటివల్ల ఉదంతం జరగకుండా నిరోధించడం కూడా సాధ్యమనే భావన పెరగాలి. నిజానికి సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యే దృశ్యాలను నిరంతరం పరిశీలించి, పర్యవేక్షించడానికి ఒక వ్యవస్థ ఉండాలి. అయితే అటువంటిదేమీ జరగడం లేదు. వాటిని పరిశీలించే సిబ్బందికి ఆ కోణంలో శిక్షణా ఇవ్వడం లేదు. దీంతో ఉదంతాలు జరగకుండా నిరోధించే వ్యవస్థ కరువై దారుణాలు చోటుచేసుకుంటున్నాయి. అనుమానిత వస్తువులు, వ్యక్తుల్ని ఎలా గుర్తించాలి? విపరీత స్వభావం కలిగిన వారి, అసాంఘికశక్తుల కదలికలెలా ఉంటాయనే అంశాలపై శిక్షణ ఇవ్వాలన్న ఆలోచన ఉన్నతాధికారులకు రాకపోవడం గమనార్హం. టిక్కెట్టు లేకుండానే చిత్తూరు టు హైదరాబాద్ బాలికను పాశవికంగా హత్య చేసిన కరణ్కుమార్ది చిత్తూరు జిల్లా పుత్తూరు. అక్కడ నుంచి టిక్కెట్టు లేకుండా పలు రైళ్లు మారుతూ సికింద్రాబాద్ వచ్చేశాడు. ఇటీవలే పుత్తూరులో తమిళనాడుకు చెందిన అల్ఉమా సంస్థ ఉగ్రవాదులు చిక్కారు. కరణ్ అదే ప్రాంతం నుంచి పలు స్టేషన్లు దాటుకుని ఇక్కడి వరకు వచ్చేసినా మార్గమధ్యంలో ఉన్న ఏ పోలీసులకూ అనుమానం రాలేదు. టిక్కెట్టు లేని ఈ ప్రయాణికుడిని టీటీఈ, టీసీలు గుర్తించి అవసరమైన చర్యలు తీసుకున్నా అతను అక్కడే ఆగిపోయేవాడు. ఇలా పలు కోణాల్లో అధికారులు విఫలమవ్వడం వల్లే ఉన్మాది చిన్నారిని చిదిమేశాడు. లష్కర్ స్టేషన్లో మిస్టరీ ఘటనలుసికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో చోటుచేసుకున్న పలు అగ్ని‘ప్రమాదాలు’ మిస్టరీగానే ఉండిపోయాయి. ఈ ఉదంతాల సందర్భంలో సంబంధిత అధికారులు సరైన రీతిలో స్పందించి ఉంటే గట్టి భద్రత చర్యలకు వీలుండేది. 2006 ఆగస్టు: సికింద్రాబాద్-చెన్నై ఎక్స్‌ప్రెస్ రైలు మూడు బోగీలు దగ్ధమయ్యాయి 2007 డిసెంబర్: బోయగూడ యార్డ్‌లో నిలిపి ఉంచిన రైలు బోగీలో మహిళ అనుమానాస్పదస్థితిలో కాలిబూడిదైంది 2009 సెప్టెంబర్: యార్డ్‌లో నిలిచి ఉన్న రైలులో మంటలు చెలరేగాయి. గంగపుత్ర కాలనీలో విషాదఛాయలు భోలక్‌పూర్, న్యూస్‌లైన్: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో చిన్నారి ప్రియదర్శిని దారుణంగా హత్యకు గురైన ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. ముషీరాబాద్ గంగపుత్రకాలనీకి చెందిన శ్రీనివాస్, సోనూ దంపతుల పెద్ద కుమార్తె ప్రియదర్శిని.వీరు ముషీరాబాద్ గంగపుత్ర కాలనీలో ఉంటున్నారు. చిన్నారి మరణవార్త విని ఇరుగుపొరుగు వారు కంటతడిపెట్టారు. మెదక్ జిల్లా కోనైపల్లికి చెందిన టి.శ్రీనివాస్, సోనూ దంపతులు రెండేళ్ల క్రితమే ఈ ప్రాంతంలో అద్దెకు దిగారు. ప్రియదర్శిని ముషీరాబాద్ పార్శిగుట్ట వద్ద గల మార్టినెట్ హై స్కూల్లో 1వ తరగతి చదువుతోంది. శ్రీనివాస్ ప్రైవేటు ఉద్యోగి. భార్య సోనూ దుర్గాభాయ్ దేశ్‌ముఖ్ స్కూల్లో టీచర్. ప్రియదర్శిని మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు. -
పసిగుండెల్లో ‘సైకో’ కత్తి
సికింద్రాబాద్, న్యూస్‌లైన్: ఆ చిన్నారి కళ్లల్లో మామయ్య పెళ్లికి వెళ్తున్నానన్న ఆనందం.. కాసేపట్లో రైలెక్కుతానన్న ఉత్సాహం.. మాటల్లో చెప్పలేనంత సంతోషం.. హాయిగా ఆడుతోంది.. లేడి పిల్లలా పరుగులు పెడుతోంది.. అంతలోనే ఎక్కడ్నుంచి వచ్చాడో ఆ కర్కశుడు.. అన్నెంపున్నెం తెలియని ఆ పసిపాపను అమాంతంగా ఎత్తుకుపోయాడు.. వెంట తెచ్చుకున్న రెండు కత్తులతో దారుణంగా పొడిచి ఫ్లాట్‌ఫామ్‌పై పడేశాడు..! అమ్మ చేతిలో అందంగా ముస్తాబైన ఆ గారాలపట్టి కొద్ది గంటలకే నాన్న ఒడిలో ప్రాణాలు విడిచింది!! అప్పటివరకు తమ కళ్లముందే ఆడిపాడిన చిన్నారిని రక్తపు మడుగులో విగత జీవిగా చూసిన వారి గుండెలు తరుక్కుపోయాయి. మంగళవారం మధ్యాహ్నం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అందరూ చూస్తుండగానే ఈ హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. మెదక్ జిల్లా సిద్దిపేటకు చెందిన తేలు శ్రీనివాస్, సోనూ దంపతులకు ఇద్దరు కూతుళ్లు. ప్రియదర్శిని (07), సింథియా (02). ప్రేమ వివాహం చేసుకున్న ఈ దంపతులు ఉపాధి కోసం కొద్ది సంవత్సరాల క్రితమే హైదరాబాద్ వచ్చి ముషీరాబాద్ గంగపుత్ర కాలనీలో స్థిరపడ్డారు. శ్రీనివాస్ ప్రైవేటు ఉద్యోగం చేస్తుండగా.. సోను ఆంధ్ర మహిళా సభలో స్పీచ్ థెరపిస్ట్‌గా ఉద్యోగం చేస్తోంది. ప్రియదర్శిని స్థానిక సెయింట్ మార్టిన్స్ పాఠశాలలో ఫస్ట్‌క్లాస్ చదువుకుంటోంది. షోలాపూర్‌లో మేనమామ కుమారుడి వివాహం కోసం శ్రీనివాస్ తన కూతురు ప్రియదర్శిని, తల్లి సత్తెమ్మతో మంగళవారం మధ్యాహ్నం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వచ్చాడు. తల్లి, కూతురును పదో నంబర్ ప్లాట్‌ఫామ్ వద్ద ఉంచి తాను బుకింగ్ కౌంటర్ వద్దకు వెళ్లాడు. 2.54 గంటలకు బయలుదేరాల్సిన రాజ్‌కోట్ ఎక్స్‌ప్రెస్ టికెట్ కొనుగోలు చేస్తున్నాడు. అప్పటి వరకు నాయనమ్మ సత్తెమ్మ వద్దే కూర్చున్న ప్రియదర్శిని ఆడుకుంటూ అటుఇటూ తిరుగుతోంది. వచ్చిపోయే రైళ్లను చూస్తూ కేరింతలు కొడుతోంది. ఇంతలోనే ఉన్మాది అక్కడకు వచ్చి ప్రియదర్శినిని ఎత్తుకొని కొంతదూరం పరుగెత్తాడు. రెండు కత్తులతో చిన్నారిపై ఎనిమిది సార్లు పొడిచి కింద పడేశాడు. చిన్నారికి తలపై రెండుచోట్ల, మెడ వెనుక భాగంలో బలమైన గాయాలయ్యాయి. రక్తపు మడుగులో ప్లాట్‌ఫామ్‌పై విలవిల్లాడుతున్న ప్రియదర్శిని చుట్టూ రెండు చేతుల్లో రెండు కత్తులు పట్టుకుని ఉన్మాది గెంతులు వేశాడు. ఆ సైకోను ఆపడం ఎవరివల్లా కాలేదు. అక్కడే విధులు నిర్వహిస్తున్న ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ హరిప్రసాద్ అడ్డుకునే ప్రయత్నం చేసినా.. ఆయనపైనా కత్తులతో దాడి చేసేందుకు యత్నించాడు. చివరికి ప్రియదర్శిని నానమ్మ సత్తెమ్మ కేకలు విని.. ఇద్దరు రైల్వే కూలీలు, మరికొందరు ప్రయాణికులు సైకోను బంధించి చితకబాది పట్టుకున్నారు. టికెట్ కౌంటర్ నుంచి వచ్చిన శ్రీనివాస్.. బిడ్డ రక్తపు మడుగులో పడి ఉండడం చూసి గుండెలు పగిలాయి. వెంటనే కూతురుని ఆటోలో గాంధీ ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశాడు. కానీ ఆ చిన్నారి మార్గం మధ్యలోనే నాన్న ఒడిలో కన్నుమూసింది. ప్రేమ వివాహం చేసుకుని ఎనిమిదేళ్లుగా సరదాగా సాగిపోతున్న శ్రీనివాస్, సోను జీవితంలో ఈ ఘటన తీరని విషాదాన్ని నింపింది. తమ పాప ఇక లేదన్న విషయాన్ని దంపతులు జీర్ణించుకోలేకపోతున్నారు. పొంతన లేని సైకో మాటలు.. రైల్వే పోలీసులు సైకోను గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ విచారణలో ఒక్కోసారి ఒక్కో మాట చెప్పాడు. తన ది చిత్తూరు జిల్లా పుత్తూరు అని, పేరు కోల కరణ్‌కుమార్ (26) అని చెప్పాడు. తనకు ఎయిడ్స్ సోకిందని, కుటుంబీకులు వెలివేసిన కారణంగానే ఏం చేయాలో అర్థం కాక చిన్నారిని గాయపరిచానని ఒకసారి, తమ ఇంటిపక్కన ఇలాంటి అమ్మాయే ఉండేదని అలాంటి అమ్మాయి నాకెందుకులేదన్న నెపంతో చంపేశానని మరోసారి చెప్పాడు. ఇతడు ఉదయం 11 గంటలకు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు చేరుకున్నట్టు సమాచారం. పుత్తూరు నుంచి సోమవారం అరకొణ ప్యాసింజర్ రైల్లో విజయవాడకు చేరిన కరణ్‌కుమార్ మంగళవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో హైదరాబాద్ చేరినట్టు తెలుస్తుంది. కరణ్కుమార్కు హెచ్ఐవీ సోకిన విషయం తన స్నేహితులకు తెలిసి హేళన చేస్తున్న క్రమంలోనే.. నగరానికి చేరుకుని ఈ దారుణానికి ఒడిగట్టినట్టు పోలీసులు వివరాలు సేకరించారు. చంపుతాననడం అతడి అలవాటు.. విజయపురం, న్యూస్‌లైన్: సైకో కరణ్‌కుమార్ చిత్తూరు జిల్లా వాసి. విజయపురం మండలం పన్నూరుకు చెందిన వ్యవసాయ కూలీ గోవిందస్వామి కుమారుడు. అతనికి చాలా కాలంగా మతిస్థిమితం లేదు. ఒకప్పుడు తెలివైన విద్యార్థి. ప్రేమించిన అమ్మాయికి ప్రాణాంతకమైన వ్యాధి ఉందని తెలియడంతో ఉన్మాదిలా మారాడు. కత్తి చేతిలో పట్టుకుని చంపుతానంటూ ఊళ్లో వాళ్లను బెదిరించేవాడు. బంధువులు అతనికి ఆరు నెలలు చెన్నైలో చికిత్స చేయించారు. తర్వాత ఇంట్లోనే బంధించి ఉంచేవారు. ఆరోగ్యం కుదుటపడడంతో పుత్తూరులోని ఎస్ఆర్ఎస్ డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరంలో చేరాడు. గతంలో అతని వెంట ఎప్పుడూ ఇద్దరు వ్యక్తులు కాపలా ఉండేవారు. అయితే ఈ మధ్య అతని ప్రవర్తన బాగానే ఉండడంతో వాళ్లు అతన్ని ఒంటరిగా వదిలేశారు. రెండు రోజుల క్రితం కాలేజీకి వెళ్లిన కుమార్ తర్వాత కనిపించలేదు.