public assembly
-
మీరెందుకు మాట్లాడరు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితిలోని పలువురు ముఖ్య నేతల తీరుపై పార్టీ అధినేత కె.చంద్రశేఖర్‌రావు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారిన ముందస్తు ఎన్నికల్లో గెలుపు కోసం ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోకుండా ప్రయత్నాలు చేస్తుంటే.. కొందరు నేతలు మాత్రం పట్టనట్లు వ్యవహరిస్తున్నారని కేసీఆర్ ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. ప్రతిపక్ష పార్టీల నేతల తప్పు డు విమర్శలపై కొందరు నేతలు ఏమీ మాట్లాడటం లేదని, అలాంటి వారికి గట్టిగా సమాధానం చెప్పాలని పలుసార్లు స్పష్టమైన ఆదేశాలిచ్చినా పట్టించుకోకపోవడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. సాధారణ పరిస్థితుల్లో ఎలా ఉన్నా ఎన్నికల సమయంలో అయినా తప్పుడు విమర్శలకు సమాధానం ఇవ్వకపోతే ఎలా అని పలువురు నేతలపై కేసీఆర్ మండిపడినట్లు తెలిసింది. పదవుల పరంగా, పార్టీ పరంగా గుర్తింపు పొందిన నేతలు సైతం తమకేమీ సంబంధం లేదన్నట్లుగా ఉంటున్నారని, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు తమ వంతు పాత్ర పోషించడంలేదనే అభిప్రాయంలో కేసీఆర్ ఉన్నారు. క్షేత్రస్థాయి ప్రచారంలో కీలకంగా వ్యవహరించడంలేదని, ప్రతిపక్ష పార్టీలను తిప్పిగొట్టే విషయంలో హైదరాబాద్‌లోని పార్టీ వేదికలపైనా మాట్లాడటంలేదని అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. చర్చ అంతా ప్రతిపక్షాల విమర్శలపైనే.. ముందస్తు ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీల కంటే ముందు న్న టీఆర్ఎస్కు ఇటీవల నిర్వహించిన ఉమ్మడి జిల్లా బహిరంగ సభలతో మంచి ఊపు వచ్చింది. నాలుగేళ్ల పాలనలో చేపట్టిన అంశాలు, మళ్లీ టీఆర్ఎస్ను గెలి పించాల్సిన ఆవశ్యకతపై కేసీఆర్ చేసిన ప్రసంగాలు ప్రజల్లోకి బాగా చేరాయి. నిజామాబాద్, నల్లగొండ, మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లాల్లో నిర్వహించిన సభలతో ఆ ప్రాంతాల్లో పార్టీకి ఊపు పెరిగింది. మహబూబ్‌నగర్ బహిరంగ సభ తర్వాత ఆ ఉమ్మడి కాంగ్రెస్ నేతలు డి.కె.అరుణ, రేవంత్‌రెడ్డి టీఆర్ఎస్పై, కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఆ తర్వా త మాజీ ఎంపీ మధుయాష్కీ సైతం ఇదే తరహా విమర్శలు చేశారు. సభల తర్వాత టీఆర్ఎస్కు వచ్చిన స్పందనపై జరగాల్సిన చర్చ ప్రత్యర్థి పార్టీల నేతల విమర్శలపైకి మళ్లింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆరోపణలు ప్రతిపక్ష పార్టీల నేతలను ఎదుర్కొనే విషయంలో టీఆర్ఎస్ నేతల తీరు అసంతృప్తిగా ఉంది. టీఆర్ఎస్, కేసీఆర్‌పై ఆరోపణలు చేసిన వారి నేపథ్యం, కేసుల వంటి ఎన్నో అంశాలు ఉన్నా ముఖ్యనేతలు ఎవరూ స్పందించకపోవడం పార్టీకి ఇబ్బందికరంగా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పల్లా తీరుపై అసహనం.. ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేని ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్పొరేషన్ చైర్మన్లు సైతం ప్రత్యర్థి పార్టీల కు దీటుగా సమాధానం చెప్పే ఆలోచన చేయకపోవడాన్ని టీఆర్ఎస్ అధిష్టానం తీవ్రంగా పరిగణిస్తోంది. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక అనూహ్యంగా మం చి అవకాశాలు పొందిన నేతలు సైతం ప్రతిపక్ష పార్టీ లను ఎదుర్కొనే విషయంలో నిర్లక్ష్యంగా ఉండటంపై అధిష్టానం ముఖ్యులు అసంతృప్తితో ఉన్నారు. సాధారణ ఎన్నికల్లో ఓడినా ఎమ్మెల్సీగా, టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చిన పల్లా రాజేశ్వర్‌రెడ్డి విషయం లో కేసీఆర్ తీవ్ర అసహనంతో ఉన్నారు. పదేపదే చెప్పినా ప్రతిపక్ష పార్టీల నేతలను ఖండించే విషయంలో పల్లా నిర్లక్ష్యంగా ఉంటున్నారని టీఆర్ఎస్ అధినేత భావిస్తున్నారు. నల్లగొండ బహిరంగసభ ఏర్పాట్ల విషయంలోనూ పల్లా వైఖరిపై నల్లగొండ ఉమ్మడి జిల్లా టీఆర్ఎస్ అభ్యర్థులు, ముఖ్య నేతలు తీవ్ర అసంతృప్తితో వ్యక్తం చేశారు. కడియం వ్యవహారంపై అసంతృప్తి... గతంలో వేరే పార్టీల్లో ఉండి ఎక్కువసార్లు మీడియా సమావేశాల్లో పాల్గొన్న పలువురు ఎమ్మెల్సీలు ఎన్నికల సమయంలో సొంత పనులకు పరిమితమవుతుండటాన్ని టీఆర్ఎస్ అధిష్టానం తీవ్రంగా పరిగణిస్తోంది. కడియం శ్రీహరి తీరుపైనా ఒకింత అసంతృప్తితోనే ఉంది. స్టేషన్‌ఘన్‌పూర్ అభ్యర్థి టి.రాజయ్యకు వ్యతిరేకంగా జరుగుతున్న అసమ్మతి కార్యక్రమాల్లో కడియం అనుచరులు క్రీయాశీలకపాత్ర పోషిస్తున్నారని టీఆర్ఎస్ అధిష్టానానికి సమాచారం అందించింది. జఫర్‌గఢ్, స్టేషన్‌ఘన్‌పూర్, ధర్మసాగర్, వేలేరు మండలాల్లోని కడియం ముఖ్య అనుచరులు రాజయ్యకు వ్యతిరేకంగా కార్యక్రమాలను రూపొందిస్తున్నారని గుర్తించింది. టీఆర్ఎస్ ప్రభుత్వంలో అనూహ్య అవకాశంతో ఉప ముఖ్యమంత్రి పదవి పొందిన శ్రీహరి... స్టేషన్‌ఘన్‌పూర్‌లో అసమ్మతి వ్యవహారాలకు ఆస్కారం లేకుండా చూడాల్సిందిపోయి పట్టనట్లుగా ఉండటంపై అధిష్టానం అసంతృప్తితో ఉంది. మహబూబ్‌నగర్, ఖమ్మం, వరంగల్, రంగారెడ్డి, హైదరాబాద్‌లోని పలువురు చట్టసభల సభ్యులు, కార్పొరేషన్ల చైర్మన్ల విషయంలో టీఆర్ఎస్ అధిష్టానం ఇదే అభిప్రాయంతో ఉంది. -
వారణాసి స్వరూపాన్ని మార్చేశాం
వారణాసి: తన లోక్‌సభ నియోజకవర్గమైన వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం రూ. 550 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టుల్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీగా గత నాలుగేళ్లలో వారణాసిలో చేపట్టిన అభివృద్ధి పనుల్ని వివరించిన ప్రధాని.. నియోజకవర్గ ప్రజలే తనకు నాయకులు, అధిష్టానమని పేర్కొన్నారు. బహిరంగ సభలో ప్రసంగిస్తూ.. గత నాలుగేళ్లలో నగర స్వరూపం పూర్తిగా మారిపోయిందని, అభివృద్ధి పనులు కళ్లకు కట్టినట్లు కనిపిస్తున్నాయని చెప్పారు. ఇదివరకటి ప్రభుత్వాలు వారణాసి అభివృద్ధిని దేవుడి దయకు వదిలేశాయని విమర్శించారు. 68వ పుట్టిన రోజు వేడుకల్ని సోమవారం వారణాసిలోనే జరుపుకున్న ప్రధాని మంగళవారం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతో బిజీబిజీగా గడిపారు. పాత కాశీ కోసం ఇంటిగ్రేటెడ్ పవర్ డెవలప్మెంట్ పథకం(ఐపీడీఎస్), బనారస్ హిందూ యూనివర్సిటీ(బీహెచ్‌యూ)లో అటల్ ఇంక్యుబేషన్ కేంద్రాన్ని ప్రారంభించారు. మీరే నా అధిష్టానం: మోదీ మీరు నాకు ప్రధాని పదవి బాధ్యత ఇచ్చినప్పటికీ.. ఒక ఎంపీగా గత నాలుగేళ్లలో నేను నియోజకవర్గానికి చేసిన పనుల వివరాల్ని చెప్పడం కూడా నా బాధ్యతే. మీరే నా యజమానులు, అధిష్టానం.. అందువల్ల ఖర్చు పెట్టిన ప్రతీ రూపాయికి లెక్కచెప్పాల్సిన అవసరముంది’ అని ప్రధాని చెప్పారు. సంప్రదాయాలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా.. ప్రాచీన వారసత్వాన్ని పరిరక్షిస్తూ వారణాసిని సమూలంగా మార్చడమే తన ప్రయత్నమని ఆయన అన్నారు. ‘నాలుగేళ్ల క్రితం ఈ పుణ్యక్షేత్రంలో మార్పుల కోసం ఇక్కడి ప్రజలు నిశ్చయించుకున్నారు. ఇప్పుడు ఆ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది’ అని పేర్కొన్నారు. కేవలం వారణాసిలోనే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ అభివృద్ధి పనులు కొనసాగుతాయని హామీనిచ్చారు. ‘కాశీ విశ్వనాథుడు, గంగా మాతా ఆశీర్వాదాలతో నేను మరో ఏడాది దేశ సేవను కొనసాగించడం నాకెంతో గర్వకారణంగా ఉంది. మీ ఆప్యాయత, ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ప్రోత్సాహాన్ని ఇవ్వడంతో పాటు.. మీకు, దేశ ప్రజలకు సేవ చేసేలా నా సంకల్పాన్ని దృఢం చేస్తాయి. నేను ఎంపీ కాకముందు ఇక్కడ తరచూ పర్యటించేవాడిని. కరెంటు వైర్ల చిక్కుముడుల నుంచి ఈ నగరం ఎప్పటికి బయటపడుతుందా? అని ఆలోచించేవాడిని. ఇప్పుడు నగరంలోని చాలా భాగం ఆ సమస్య నుంచి విముక్తి పొందింది’ అని మోదీ చెప్పారు. తూర్పు భారతదేశ ముఖ ద్వారంగా.. వచ్చే జనవరిలో వారణాసిలో ప్రపంచ ప్రవాస భారతీయ దివస్ నిర్వహిస్తున్నామని, ప్రపంచం మొత్తం ఈ నగరం ఇచ్చే ఆతిథ్యం కోసం ఎదురుచూస్తోందన్నారు. తూర్పు భారతానికి గేట్వేగా ఉండేలా వారణాసిని తీర్చిదిద్దుతున్నాని, కాశీలో ప్రపంచ స్థాయి మౌలిక వసతుల కల్పనే తమ ప్రభుత్వ ప్రయత్నమని ప్రధాని పేర్కొన్నారు. ‘కాశీ ఎల్ఈడీ కాంతులతో వెలిగిపోతుంది. నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దాం. కాశీలోని ఘాట్లు ఇప్పుడు చెత్తతో కాకుండా దీపకాంతులతో అతిథులకు ఆహ్వానం పలుకుతున్నాయి’ అని అన్నారు. భారత్–బంగ్లా మధ్య పైప్‌లైన్‌కు శ్రీకారం ఢాకా/న్యూఢిల్లీ: భారత్, బంగ్లాదేశ్‌ల మధ్య సహకారం ప్రపంచానికి ఒక ఉదాహరణని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ‘భౌగోళికంగా భారత్, బంగ్లాదేశ్ పొరుగు దేశాలు. అయితే భావోద్వేగ పరంగా చూస్తే మాత్రం ఒక కుటుంబంలా కలసిమెలిసి ఉన్నాయి’ అని మోదీ అన్నారు. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇరు దేశాల మధ్య నిర్మించనున్న 130 కిలోమీటర్ల ఫ్రెండ్షిప్ పైప్‌లైన్ పనుల్ని మంగళవారం ఆయన ప్రారంభించారు. పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురిని, బంగ్లాదేశ్‌లోని దినాజ్‌పూర్ జిల్లాలోని పర్బతిపూర్‌ను ఈ పైప్‌లైన్ అనుసంధానం చేస్తుంది. రూ. 346 కోట్లతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు 30 నెలల్లో పూర్తి కానుంది. ఏడాదికి 10 లక్షల మెట్రిక్ టన్నుల ఆయిల్‌ను సరఫరా చేసే సామర్థ్యముంది. ఈ పైప్‌లైన్ ద్వారా అస్సాం గోలాఘాట్‌లోని నుమాలిగఢ్ రిఫైనరీ నుంచి బంగ్లాదేశ్‌కు చమురును సరఫరా చేస్తారు. -
ఖర్చంతా పార్టీదే: నాయిని
మహేశ్వరం: ప్రగతి నివేదన బహిరంగ సభకు అధికార దుర్వినియోగం ఎక్కడా చేయ లేదని, అన్ని ఖర్చులను పార్టీ యే భరిస్తోందని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా కొంగర కలాన్‌లో ప్రగతి నివేదన బహిరంగ సభ వేదిక వద్ద మంత్రి మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీలతో కలసి ఆయన వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. ప్రగతి నివేదన బహిరంగసభ కోసం ఒక్క అధికారినీ వినియోగించుకోలేదని, సభఖర్చును మొత్తం పార్టీనే భరి స్తోందని తెలిపారు. ప్రతిపక్షాలు అనవసర ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు. సభకు ముందస్తు ఎన్నికలకు సంబంధం లేదన్నారు. డబ్బులు పంపిణీ చేసే అలవాటు కాంగ్రెస్‌కే ఉందని ఎద్దేవా చేశారు. రేవంత్‌రెడ్డి నోట్ల కట్టలతో దొరికి జైలుకూడు తిన్నాడని గుర్తు చేశారు. కాంగ్రెస్‌కు దమ్ముంటే తమకంటే పెద్ద సభ నిర్వహించాలని సవాల్ విసిరారు. పర్యావరణాన్ని కాపాడేందుకు సభ అనంతరం భూమిని శుభ్రం చేస్తామని తెలిపారు. ఐపీఎస్‌లకు ‘ప్రగతి నివేదన’ బాధ్యతలు 10 మంది ఇన్చార్జీల నియామకం సాక్షి, హైదరాబాద్: ‘ప్రగతి నివేదన సభ’ బాధ్యతలను కొందరు ఐపీఎస్‌లకు రాష్ట్ర ప్రభుత్వం అప్ప గించింది. రాష్ట్రం నలుమూలల నుంచి వస్తున్న వాహనాలను నియంత్రించడం, ప్రజలను లోపలికి అనుమతించడం, వారిని సమన్వయం చేయడంతోపాటు సభావేదికకు ఇన్‌చార్జీలుగా ఐపీఎస్‌లను నియమిస్తూ డీజీపీ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో ప్రగతి నివేదన సభ కోఆర్డినేటర్‌గా లా అండ్ ఆర్డర్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ జితేందర్‌కు బాధ్యతలు అప్పగించారు. సభ ఇన్చార్జిగా రాచకొండ సీపీ మహేశ్ భగవత్, సెక్యూరిటీ ఇన్చార్జిగా సైబరాబాద్ సీపీ సజ్జనార్, ట్రాఫిక్ ఇన్‌చార్జీలుగా అడిషనల్ సీపీ అనిల్ కుమార్, నల్లగొండ ఎస్పీ రంగనాథ్, సీఎం సెక్యూరిటీ, రూట్ క్లియరెన్స్ ఇన్చార్జిగా ఎస్పీ కోటిరెడ్డి, సభకు వచ్చేవారిని లోనికి అనుమతించే బాధ్యత వరంగల్ సీపీ రవీందర్, సభకు వచ్చేవారిని సమన్వయపరిచే బాధ్యతలను డీసీపీ జానకీ షర్మిల, ఎస్పీ శశిధర్రాజులకు అప్పజెప్పారు. సభావేదిక ఇన్చార్జిగా విక్రమ్‌జీత్ దుగ్గల్‌ను నియమించారు. -
సభకు సర్వం సిద్ధం
ఇబ్రహీంపట్నం రూరల్: టీఆర్ఎస్ ప్రగతి నివేదన సభకు సర్వం సిద్ధమైంది. 9 రోజులుగా చేస్తున్న పనులు కొలిక్కి వచ్చాయి. సెప్టెంబర్ 2న కొంగర కలాన్‌లో నిర్వహించే సభాస్థలానికి ఒక స్వరూపం వచ్చింది. 48 గంటల్లో సభ జరగబోతున్న తరుణంలో దాదాపు 80 శాతం పనులు పూర్తిచేశారు. గురువారం ఉదయం డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, మహేందర్‌రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డిలు ఏర్పాట్లను పరిశీలించారు. మధ్యాహ్నం మంత్రి కేటీఆర్ వచ్చి పనులను పర్యవేక్షించారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు రాక కోసం ప్రత్యేక రహదారిని ఏర్పాటు చేశారు. హెలిప్యాడ్ పక్క నుంచే 60 అడుగుల వెడల్పు రోడ్డును ఆర్అండ్బీ అధికారులు సిద్ధం చేశారు. నారాయణ కళాశాల వెనకాల నుంచి వండర్ లా మీదుగా సభాస్థలికి చేరుకోవడానికి వీలుగా రోడ్డును ఏర్పాటు చేశారు. ఈ రోడ్డు సుమారు 1.5 కిలోమీటర్లు ఉంటుంది. ముఖ్యమంత్రి సెక్యూరిటీ సిబ్బంది దగ్గరుండి పనులు చూస్తున్నారు. హెలికాప్టర్ ట్రయల్ రన్ ... ముఖ్యమంత్రి రోడ్డు మార్గంతోపాటు హెలికాప్టర్లో సభాస్థలికి వచ్చే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే సభాస్థలం వెనకాల ఆర్అండ్బీ అధికారులు హెలిప్యాడ్ సిద్ధం చేశారు. గురువారం సాయంత్రం సీఎం సెక్యూరిటీ అధికారి ఎస్కే సింగ్ ట్రయల్ వేశారు. కొద్దిసేపు సభాస్థలం పరిశీలించి వెళ్లిపోయారు. సభకు వచ్చేవారికి తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్వాహకులు ముందస్తు చర్యలు చేపడుతున్నారు. సభాస్థలంలో వేసిన బారికేడ్లల్లో వాటర్ ప్యాకెట్లను ఉంచారు. రెండు డీసీఎంల నిండా ఒక్కో సంచిలో 100 ప్యాకెట్ల చొప్పున తరలించారు. టీఆర్ఎస్ కార్యకర్తల కోసం తాగునీరు సిద్ధంగా ఉంచారు. గ్రీన్‌కార్పెట్.. 10 వేల కుర్చీలు ప్రగతి సభకు హాజరయ్యే జనం కూర్చోవడానికి 10 వేల కుర్చీలను ఏర్పాటు చేశారు. మిగతా ప్రదేశాల్లో 50 వేల చదరపు మీటర్ల గ్రీన్ కార్పెట్ ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే దానిని కింద పరిచే పనిలో ఉన్నారు. వేదిక మీద నుంచి ప్రతినిధుల ప్రసంగాలను సభికులు వినడానికి అత్యాధునిక సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. సభా ప్రాంగణంలో 30 ఫ్లైయింగ్ సిస్టమ్స్, 500 మైక్సెట్లు ఏర్పాటు చేస్తున్నారు. 300 ప్రాంతాల్లో పెద్ద స్క్రీన్లు ఏర్పాటు చేసి వాటి ద్వారా సభను వీక్షించడానికి వెసులుబాటు కల్పించనున్నారు. -
దారులన్నీ కొంగర కలాన్ వైపే..
సాక్షి, హైదరాబాద్: సెప్టెంబర్ 2 ఆదివారం. వీకెండ్‌కు కుటుంబ సభ్యులతో సరదాగా బయటకు వెళ్లాలనుకుంటున్నారా.. సిటీ బస్సులోనో, క్యాబ్‌లోనో ఎక్కడికైనా ప్రయాణించాలనుకుంటున్నారా... వచ్చే ఆదివారం కోసం ఇప్పటి నుంచే ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నారా.. అయితే, మీ వీకెండ్ టూర్‌ను తప్పకుండా వాయిదా వేసుకోవలసిందే! సొంత వాహనం ఉంటే తప్ప ఆ రోజు ఇంటి నుంచి బయటకు వెళ్లకపోవడమే మంచిది. ఎందుకంటే ఆ రోజు ఎంఎంటీఎస్, మెట్రో రైళ్లు మినహా చాలా వరకు రోడ్డు రవాణా సదుపాయాలు స్తంభించే అవకాశం ఉంది. అత్యధిక వాహనాలు కొంగరకలాన్ వైపు దారులకు బారులు తీరనున్నాయి. సెప్టెంబర్ 2న కొంగర కలాన్‌లో టీఆర్ఎస్ నిర్వహించే ‘ప్రగతి నివేదన’ బహిరంగ సభకు జనసమీకరణ కోసం వాహనాల సేకరణలో పార్టీనేతలు , ఆర్టీఏ అధికారులు తలమునకలై ఉన్నారు. హైదరాబాద్ నుంచే 50 వేలకుపైగా వాహనాలను ఈ సభకు తరలించనున్నారు. ఈ దిశగా ఆర్టీఏ, తదితర విభాగాల అధికారయంత్రాంగం సీరియస్‌గా దృష్టి సారించింది. ఆర్టీసీ బస్సులతోపాటు, స్కూల్ బస్సులు, వ్యాన్లు, డీసీఎంలు, మెటడోర్లు, క్యాబ్‌లు, ట్రావెల్ బస్సులు, కార్లు, ఆటోలు తదితర అన్ని రకాల వాహనాలను సభ కోసం ముందస్తుగా బుక్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఆదివారం అత్యవరమైతే తప్ప బయటకు వెళ్లకపోవడమే మంచిదనే అభిప్రాయం వినిపిస్తోంది. రూటు మారనున్న సిటీ బస్సులు.... గ్రేటర్ హైదరాబాద్‌లో రోజూ 3,550 బస్సులు ప్రయాణికులకు రవాణా సదుపాయాన్ని అందజేస్తున్నాయి. 1,050 రూట్లలో, 42 వేల ట్రిప్పులు తిరిగే సిటీ బస్సుల్లో రోజుకు 32లక్షల మంది ప్రయాణికు లు రాకపోకలు సాగిస్తారు. నగరంలోని అన్ని మారుమూల కాలనీలకు, శివారు ప్రాంతాలకు సిటీ బస్సు రవాణా ఉంది. సభ దృష్ట్యా 2,500కు పైగా బస్సులను తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. దీంతో సిటీ బస్సుల్లో తిరిగే సుమారు 20లక్షల మందికి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. మరోవైపు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి రైల్వేస్టేషన్లు, ప్రధాన బస్స్టేషన్లు, ఆస్పత్రులకు వెళ్లే మార్గాల్లో కూడా బస్సు లు, క్యాబ్‌ల కొరత వల్ల ప్రయాణికులు సకాలంలో గమ్యస్థానాలకు చేరుకోవడం కష్టంగానే ఉంటుంది. స్కూల్ బస్సులన్నీ అటు వైపే... సాధారణంగా మోటారు వాహన నిబంధనల మేరకు స్కూళ్లు, కళాశాలలు తదితర విద్యాసంస్థలకు నడిపే బస్సులను ఇతర అవసరాలకు వినియోగించేందుకు అవకాశం లేదు. స్కూల్ బస్సులను పెళ్లిళ్లు, వేడుకలు, టూర్ల కోసం వినియోగించిన అనేక సందర్భాల్లో రవాణా అధికారులు కేసులు నమోదు చేస్తారు. పిల్లల భద్రత దృష్ట్యా వాటిని ఇతర అవసరాల కోసం వినియోగించవద్దనే నిబంధన ఉంది. కానీ, రవాణా అధికారులే ఆ నిబంధనలను పక్కన పెట్టి స్కూల్ బస్సులను పెద్ద ఎత్తున సమీకరిస్తున్నారు. స్కూళ్లు, కళాశాలలు, తదితర విద్యాసంస్థలకు చెందిన సుమారు 10 వేల బస్సులను తరలించేందుకు అధికారులు కార్యాచరణ చేపట్టారు. ప్రైవేట్ బస్సులను కూడా ఈ సభ కోసం తరలించనున్నారు. దూరప్రాంతాలకు కూడా ఆటంకమే... తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి హైదరాబాద్‌కు వచ్చే బస్సులన్నీ ఆదివారం కొంగరకలాన్‌కే దారితీయనున్నాయి. దీంతో ఎంజీబీఎస్, జేబీఎస్, దిల్సుఖ్నగర్ తదితర బస్స్టేషన్ల నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే మరో 2000లకు పైగా ఆర్టీసీ బస్సులు కూడా స్తంభించనున్నాయి. దీంతో ఆదివారం పూట దూరప్రాంతాల ప్రయాణాలను కూడా ఉపసంహరించుకోవడం మంచిదని అధికారవర్గాలు సూచిస్తున్నాయి. ఎంఎంటీఎస్, మెట్రో రైళ్లే దిక్కు రోడ్డు రవాణా సదుపాయాలకు ఆటంకం ఏర్పడే అవకాశం ఉండడంతో నగరవాసులకు అందుబాటులో ఉన్న రవాణా సదుపాయం ఎంఎంటీఎస్, మెట్రో రైళ్లు మాత్రమే. కానీ, వాటి సేవలు పరిమితం. ఫలక్‌నుమా–సికింద్రాబాద్–లింగంపల్లి మార్గంలో, నాంపల్లి– లింగంపల్లి–ఫలక్‌నుమా మార్గంలో మాత్రమే ఎంఎంటీఎస్ రైళ్లు తిరుగుతున్నాయి. రోజుకు లక్షా 60 వేల మంది రాకపోకలు సాగిస్తున్నారు. ఉప్పల్–అమీర్‌పేట్–మియాపూర్ రూట్లో తిరుగుతున్న మెట్రో రైళ్లలో రోజుకు 80 వేల మంది తిరుగుతున్నారు. ఈ రెండు రకాల రైలు సదుపాయాలు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఆ రోజు ప్రయాణికుల రద్దీ మేరకు సర్వీసులను పెంచే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. -
ప్రగతి నివేదన సభకు అనుమతి రాజ్యాంగ విరుద్ధం
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీ ప్రగతి నివేదన సభ పేరు తో సెప్టెంబర్ 2న రంగారెడ్డి జిల్లా, కొంగర కలాన్ వద్ద నిర్వహించతలపెట్టిన భారీ బహిరంగ సభకు పోలీసులు అనుమతినివ్వడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. సభకిచ్చిన అనుమతులను చట్ట విరుద్ధంగా, రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలని కోరుతూ జోగుళాంబ గద్వాల్ జిల్లాకు చెందిన నడిగడ్డ పర్యావరణ పరిరక్షణ సమితి అధ్యక్షుడు పూజారి శ్రీధర్ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, రంగారెడ్డి జిల్లా కలెక్టర్, టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శిని ప్రతివాదులుగా చేర్చారు. సభ పేరిట 25లక్షల మందిని ఒకచోట చేర్చే బదులు తమ పార్టీ పాలనలో సాధించిన ఘన విజయాలను తెలియచేసేందుకు ప్రత్యామ్నాయాలను చూసుకునేలా టీఆర్ఎస్ను ఆదేశించాలని, ఆ మేరకు తగిన చర్యలు తీసుకునేలా ప్రభుత్వ సీఎస్, డీజీపీ, రంగారెడ్డి జిల్లా కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు. ఈ వ్యాజ్యం గురించి గురువారం ఉదయం న్యాయమూర్తులు జస్టిస్ రామ సుబ్రమణియన్, జస్టిస్ జె.ఉమాదేవిల ధర్మాసనం ముందు పిటిషనర్ తరఫు న్యాయవాది శశికిరణ్ ప్రస్తావించారు. కేసు ను అత్యవసరంగా విచారించాల్సిన అవసరం ఉందని నివేదించారు. దీంతో ధర్మాసనం వ్యాజ్యంపై శుక్రవారం విచారణ జరిపేందుకు అంగీకరించింది. ప్రగతి నివేదన సభ కోసం 1600 ఎకరాలను చదును చేస్తున్నారని, ఇందులో ఉన్న చెట్లన్నింటినీ నరికేస్తున్నారని పేర్కొన్నారు. అంతేకాక ఈ సభకు 25 లక్షల జనాన్ని సమీకరించాలని అధికార పార్టీ నేతలు లక్ష్యంగా పెట్టుకున్నారని, దాదాపు లక్ష వాహనాలను వినియోగించనున్నారన్నా రు. ఈ సభ వల్ల సామాన్య ప్రజానీకం రోడ్లపై తిరిగే పరిస్థితి ఉండదని, ప్రజా రవాణా వ్యవస్థ స్తంభించిపోయే అవకాశం ఉందన్నారు. దాదాపు రూ.200 కోట్లను ఖర్చు చేస్తూ నిర్వహిస్తున్న సభ లక్ష్యం ప్రభుత్వం ఘన విజయాలను ప్రజలకు తెలియచేయడమేనన్నారు. ప్రచార, ప్రసార మాధ్యమాలతో పాటు సోషల్ మీడియా వంటి సాధానాలు ఎన్నో ఉన్నాయని తెలిపారు. ఈ సభ వల్ల పంటలకు, ప్రభుత్వ ఆస్తులకు ఏదైనా నష్టం వాటిల్లితే దానిని టీఆర్ఎస్ నుంచి వసూలు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోర్టును కోరారు. -
అందరికీ సొంతిళ్లు నా స్వప్నం
జుజ్వా (గుజరాత్): దేశం 75వ స్వాతంత్య్ర వేడుకలు జరుపుకునే 2022 నాటికి ప్రతి కుటుంబం సొంత ఇళ్లు కలిగి ఉండేలా చూడటమే తన స్వప్నమని ప్రధాని మోదీ అన్నారు. దళారుల పాత్ర లేకపోవడం వల్ల ప్రభుత్వం విడుదలచేస్తున్న ప్రతి పైసా లక్షిత లబ్ధిదారులకే చేరుతోందన్నారు. గుజరాత్ వల్సాద్ జిల్లాలోని జుజ్వాలో గురువారం నిర్వహించిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన లబ్ధిదారుల సామూహిక ఆన్లైన్ గృహ ప్రవేశ కార్యక్రమంలో మోదీ పాల్గొన్నారు. తర్వాత బహిరంగ సభలో మాట్లాడారు. ప్రభుత్వం విడుదల చేసిన ప్రతి రూపాయిలో కేవలం 15 పైసలే లబ్ధిదారులకు వెళ్తోందన్న మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వ్యాఖ్యల్ని పరోక్షంగా ప్రస్తావించారు. ఇప్పుడు తమ ప్రభుత్వం విడుదలచేస్తున్న ప్రతి పైసా లబ్ధిదారులకు చేరుతోందని అన్నారు. కేంద్ర పథకాల ప్రయోజనాలు పొందడానికి లబ్ధిదారులు లంచాలు చెల్లించనక్కర్లేదని నొక్కిచెప్పారు. వల్సాద్ జిల్లా కొండ ప్రాంతాల్లోని సుమారు 175 గ్రామాలకు తాగునీరు అందించే రూ.586 కోట్ల ప్రాజెక్టుకు భూమిపూజ చేశారు. కాంట్రాక్టర్లు కాదు.. లబ్ధిదారులపైనే నమ్మకం: ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద నాణ్యమైన ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు శాయశక్తులా కృషిచేస్తున్నామని మోదీ అన్నారు. ‘ఇళ్లు పొందేందుకు లంచాలు ఇచ్చారా? అని దేశం మొత్తం చూస్తుండగా, మీడియా సమక్షంలోనే లబ్ధిదారులను ప్రశ్నించే ధైర్యం మా ప్రభుత్వానికి ఉంది. నిబంధనల ప్రకారమే ఇళ్లు వచ్చాయని, లంచం చెల్లించే అవసరం రాలేదని తల్లులు, సోదరీమణులు సంతృప్తికర సమాధానమిస్తారని పూర్తిగా విశ్వసిస్తున్నా. ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తున్నా, ఇంటిని ఎలా నిర్మించాలి? ఏయే సామగ్రి వినియోగించాలి? లాంటి వాటిని కుటుంబమే నిర్ణయిస్తుంది. కాంట్రాక్టర్లు కాకుండా లబ్ధిదారులపైనే నమ్మకం ఉంచుతాం’ అని మోదీ అన్నారు. సొంతిళ్లు పొందటంపై లబ్ధిదారుల అనుభవాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. పారిశుధ్యం, బాలికల విద్య, నీటి సరఫరా, విద్యుత్, గ్యాస్ కనెక్షన్ తదితరాల గురించి వాకబు చేశారు. వచ్చే ఏడాదిన్నర కాలంలో దేశంలో విద్యుత్ సౌకర్యంలేని ఇళ్లు ఉండబోదని ధీమా వ్యక్తం చేశారు. ‘స్వచ్ఛ్భారత్’ అప్పుడే చేపట్టి ఉంటే.. స్వచ్ఛ్భారత్ లాంటి పారిశుధ్య కార్యక్రమాలను 70 ఏళ్ల క్రితమే ప్రవేశపెట్టి ఉంటే దేశం ఇప్పటికే వ్యాధిరహితంగా మారేదన్నారు. పారిశుధ్యానికి చేపట్టిన చర్యల వల్లే 3 లక్షల మంది చిన్నా రులను కాపాడుకోగలిగామని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికను ఉటంకించారు. జునాగఢ్‌లో గుజరాత్ మెడికల్ అండ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ సొసైటీ ఆసుపత్రిని ప్రారంభించారు. ‘టాయిలెట్లు నిర్మించడం, చెత్త ఏరడం... ఇవి ప్రధాని పనులా? అని విపక్షాలు హేళనచేశాయి. ఈ పనులన్నీ 70 ఏళ్ల క్రితమే చేసి ఉంటే నేడు దేశంలో ఒక్క వ్యాధి కూడా ఉండేది కాదు’ అని అన్నారు. తర్వాత గాంధీ నగర్లో గుజరాత్ ఫోరెన్సిక్ సైన్స్ వర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొన్నారు. -
పోరాటాలతోనే ప్రభుత్వ సంస్థల రక్షణ
► మోదీ, బాబులకు ప్రైవేటుపైనే ప్రేమ ► రైల్వే, రక్షణ, ఓడరేవుల భూములను కారుచౌకగా కట్టబెట్టే పన్నాగం ► సీపీఎం నేత బీవీ రాఘవులు ధ్వజం ► ‘సేవ్ పబ్లిక్ సెక్టార్.. సేవ్ విశాఖ పేరుతో ’ భారీ ర్యాలీ, బహిరంగ సభ ద్వారకానగర్ (విశాఖ దక్షిణం): ప్రభుత్వ సంస్థలను, ఆస్తులను ప్రైవేటుకు కట్టబెట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉత్సాహం చూపుతున్నాయని, ఇందులో భాగంగా విశాఖలో కూడా అనేక ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరించేందుకు పూనుకున్నాయని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బి.వి.రాఘవులు ధ్వజ మెత్తారు. విశాఖకు రైల్వేజోన్ ఇవ్వకపోగా రైల్వేస్టేషన్‌ను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. ‘సేవ్ పబ్లిక్ సెక్టార్.. సేవ్ విశాఖ పేరుతో ’ రైల్వేస్టేషన్ నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు సీపీఎం ఆధ్వర్యంలో శనివారం భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం గాంధీ విగ్రహం వద్ద నిర్వహించిన బహిరంగ సభలో రాఘవులు మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షించేందుకు పోరాటాలే శరణ్యమని పేర్కొన్నారు. ఒకప్పుడు కుగ్రామంగా ఉన్న విశాఖ నేడు మహా నగరంగా మారడానికి స్టీల్‌ప్లాంట్, ఓడరేవు, (పోర్టు), భెల్, రైల్వే, డ్రెడ్జింగ్ కార్పొరేషన్ వంటి సంస్థలే కారణమని గుర్తుచేశారు. అయితే ప్రభుత్వ రంగాన్ని విధ్వంసం చేసేందుకు ప్రధాని నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు ఏకమయ్యారని విమర్శించారు. ప్రభుత్వ ఆస్తులను కొల్లగొట్టడానికి, ప్రభుత్వ రంగ పరిశ్రమలను ధారాదత్తం చేయాడానికి ప్రయత్నాలు చేస్తున్నారని, ప్రజాపోరాటాలతోనే వీటిని అడ్డుకోవాలని పిలుపిచ్చారు. విశాఖతో సహా దేశంలో 42 ప్రధాన రైల్వేస్టేషన్లను ప్రైవేటుకు అప్పగించేందుకు రంగం సిద్ధం చేశారని, రైల్వేస్టేషన్ల ఆధునీకరణ పేరుతో చుట్టూ ఉండే భూములు, ఆస్తులను అమ్మేస్తున్నారని ఆరోపించారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సిహెచ్.నర్సింగరావు మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్తులను ఇప్పటికే కొన్ని ప్రైవేట్‌పరం చేశారని, మరికొన్ని మూసివేశారని చెప్పారు. ప్రభుత్వ రంగ పరిశ్రమల్లో కార్మికులు పనిచేయడం లేదనే దుష్ప్రచారాన్ని ప్రభుత్వ అనుకూల మీడియాతో చేయిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోని స్టీల్ప్లాంట్లు, హెచ్‌పీసీఎల్, ఇన్సూరెన్స్ వంటి రంగాలు ఎంతో ప్రగతి సాధించాయంటే కార్మికులు కృషి కారణం కాదా అని ప్రశ్నించారు. సత్యం జంక్షన్ వద్ద టెక్ మహేంద్ర ఐటీ సంస్థలు నెలకొల్పి ఏళ్లు గడుస్తున్నా ఇంతవరకు ఒక్క ఉద్యోగం కూడా కల్పించలేదని విమర్శించారు. సీపీఎం నగర కార్యదర్శి డాక్టర్ గంగారావు మాట్లాడుతూ విశాఖ నగరంలో అభివృద్ధి పేరిట అధికంగా పన్నుల భారం మోపుతున్నారన్నారు. విశాఖలో భెల్, హెచ్‌పీసీఎల్, మిలిటరీ ఇంజినీరింగ్ సర్వీసెస్ (ఎంఈఎస్) ఎన్ఏడీ, నేవల్ డాక్‌యార్డు, డీఆర్డీవో, రైల్వే వంటి సంస్థల్లో లక్షా 10 వేల మంది వరకు పర్మినెంట్ ఉద్యోగులు, వేలాది మంది కాంట్రాక్టు ఉద్యోగులు, ఇంకో 60 వేల మంది పదవీవిరమణ చేసిన వారు ఉన్నారని, వీటిపై ఆధారపడి లక్షాలాది మంది జనం జీవిస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ విధానాలతో ఇలాంటి సంస్థల మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని ఆందోళన వ్యక్తంచేశారు. అనంతరం బహిరంగ సభ వేదికపై పలు సాంస్కృతిక కార్యక్రమాలను కళాకారులు ప్రదర్శించారు. సీపీఎం నగర నాయకులు ఆర్.కె.ఎస్.వి.కుమార్, ఎం.జగ్గునాయుడు, పి.జగన్, పి.ప్రభావతి. పి.కోటేశ్వరరావు, కె.ఎన్. శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
టీఆర్ఎస్ ‘రైతు’ సభ!
♦ ఆవిర్భావ సభను వినూత్నంగా నిర్వహించాలని పార్టీ నిర్ణయం ♦ రైతులను భారీ సంఖ్యలో సమీకరించే ప్రయత్నం ♦ ఒక్కో పూర్వపు జిల్లా నుంచి వెయ్యి ట్రాక్టర్లు ♦ 20 లక్షల మందితో సభకు ప్రణాళిక ♦ నియోజకవర్గాల్లో మంత్రుల సమీక్ష.. విజయవంతానికి కసరత్తు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) 16వ ఆవిర్భావ సభను వినూత్నంగా నిర్వహించాలని ఆ పార్టీ అగ్ర నాయకత్వం నిర్ణయించింది. బహిరంగ సభకు భారీ సంఖ్యలో రైతులను సమీకరించే పనిలో పడింది. ఇందుకోసం మంత్రులు ఆయా జిల్లాల్లో ఇప్పటికే క్షేత్రస్థాయిలో సమీక్షలు జరుపుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో రైతాంగ సంక్షేమం కోసం చేపట్టిన పథకాలు, కార్యక్రమాల కంటే మూడేళ్ల తమ ప్రభుత్వ హయాంలో చేపట్టిన కార్యక్రమాలు ఎక్కువని పార్టీ నాయకత్వం అభిప్రాయపడుతోంది. దీంతో వరంగల్‌లో ఈనెల 27న నిర్వహించనున్న టీఆర్ఎస్ 16వ ఆవిర్భావ సభకు రైతులను ట్రాక్టర్లలో తరలించాలని నిర్ణయించింది. హైదరాబాద్ మినహా ఒక్కో జిల్లా (పాత) నుంచి కనీసం వెయ్యి ట్రాక్టర్లలో రైతులను సభకు తరలించే ప్రయత్నాలు మొదలు పెట్టింది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి రైతులకు ఒక్కో పంటకు ఎకరాకు రూ.4 వేల చొప్పున రెండు పంటలకు సాయం చేస్తామని పార్టీ అధినేత, సీఎం కె.చంద్రశేఖర్‌రావు కీలక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. 21న జరిగిన పార్టీ ప్లీనరీ వేదికపై నుంచి కూడా కేసీఆర్ మరోమారు ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో రైతాంగం కోసం తీసుకుంటున్న ఈ పథకం దేశానికే మార్గదర్శిగా నిలుస్తుందని పార్టీ నాయకత్వం విశ్వాసం వ్యక్తం చేస్తోంది. దీంతో ఈ అంశానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తూ అన్ని వర్గాల్లోకి తీసుకుపోవాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పార్టీ ఆవిర్భావ సభను కనీసం 20 లక్షల మందితో ‘రైతు సభ ’గా జరపాలని నిర్ణయించారు. రెండు రోజుల ముందే పయనం దేశ చరిత్రలోనే ఒక సభకు వేలాది ట్రాక్టర్లలో రైతులు తరలివెళ్లడం మొదటిసారి కానుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పాత వరంగల్ జిల్లా, దాని సమీప జిల్లాల సరిహద్దు గ్రామాల నుంచి ఎడ్లబండ్లలో రైతులను సభకు తరలించనున్నారు. వరంగల్‌కు దూరంగా ఉన్న జిల్లాలు, నియోజకవర్గాల నుంచి సభ జరగడానికి రెండు రోజుల ముందే రైతులు బయలుదేరేలా ప్లాన్ చేశారు. కొన్ని జిల్లాల నుంచి మంగళవారమే (25వ తేదీ) పయనం కానున్నారు. ఎండలు తీవ్రంగా ఉన్నందు ఉదయం 11 గంటల వరకు, తిరిగి సాయంత్రం 5 తర్వా త ట్రాక్టర్లు ప్రయాణం చేసేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు తమ సొంత నియోజకవర్గ ట్రాక్టర్లలోనే ప్రయాణించనున్నారని చెబుతున్నారు. జిల్లాల్లో సమీక్షలు షురూ! బహిరంగ సభకు పార్టీ కార్యకర్తలను మాత్రమే కాకుండా రైతులను కూడా తరలించాలని నిర్ణయించిన క్రమంలో జిల్లాల్లో మంత్రులు సమీక్షలు మొదలుపెట్టారు. ఈటల రాజేందర్, జి.జగదీశ్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, చందూలాల్ తదితరులు తమ సొంత నియోజకవర్గాల్లోకార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాలను సోమవారం నిర్వహించారు. ప్రధానంగా రైతులను ట్రాక్టర్లలో తరలించే అంశంపై సమీక్షించా రు. సాగునీటి ప్రాజెక్టుల రీ డిజైన్, కొత్త ప్రాజెక్టుల రూపకల్పన, పాలమూరు వంటి జిల్లాల్లో ఎత్తిపోతల పథకాల పూర్తి, ఉచిత విద్యుత్, రుణమాఫీ, ఇన్‌ఫుట్ సబ్సిడీ బకాయిల చెల్లింపు తదితర రైతు సంబంధ నిర్ణయాలకు విస్తృతమైన ప్రచా రం కల్పించాలన్న వ్యూహంతోనే సభకు రైతులను సమీకరిస్తున్నట్లు సమాచారం.