public figures
-
అంచనా ప్రకారమే మొక్కల పంపిణీ
డ్వామా పీడీ హరిత యాలాల: హరితహారంలో భాగంగా మొక్కలు నాటే ప్రజాప్రతినిధులు, అధికారులు ఇచ్చిన నివేదిక ఆధారంగానే మొక్కలు పంపిణీ చేస్తామని డ్వామా పీడీ హరిత స్పష్టం చేశారు. మండల పరిషత్ కార్యాలయంలో సర్పంచ్‌లు, ఎంపీటీసీ, మండలస్థారుు అధికారుల తో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. హరితహారంలో భాగంగా నాటే ప్రతి మొక్క వివరాలను నమోదు చేస్తున్నామన్నారు. ఉపాధి హామీలో భాగంగా నాటే ప్రతి మొక్క ఎదుగుదల వరకు నిర్వాహణ ఖర్చులు ఇస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా మొక్కల పంపిణీ కార్యక్రమం దుర్వినియోగం కాకుండా ఇకపై తగిన చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. గ్రామాల ప్రజాప్రతినిధులు, అధికారులు ఇచ్చిన నివేదికతోపాటు సంబం దిత శాఖ ఏఈ ధ్రువీకరణపత్రాన్ని పరిశీలించి మొక్కల పంపిణీతోపాటు నిర్వాహణ ఖర్చులు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ విషయమై స్థానిక ప్రజాప్రతినిధులు అభ్యంతరం వ్యక్తం చేశారు. మొక్కలు నాటే కార్యక్రమానికి ఖర్చులు ఇవ్వకపోవడం అన్యాయమన్నారు. దీనిపై స్పందించిన పీడీ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం తాము ముందుకు వెళుతున్నామని తెలిపారు. ఎంపీపీ సాయన్నగౌడ్, తహసీల్దార్ అబిద్ అలీ, ఏపీడీ అప్పారావు, ఇన్ చారర్జి ఎంపీడీఓ ఉమాదేవి ఉన్నారు. సంరక్షణ బాధ్యత అధికారులదే... తాండూరు రూరల్: హరితహారంలో నాటిన మొక్కలను సంరక్షించాల్సిన బాధ్యత కూడా స్థానిక అధికారులదేనని డ్వామా పీడీ హరిత అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామాల్లో, పట్టణాల్లో హరితహారం కింద పెద్దఎత్తున మొక్క లు నాటడం సంతోషకరమన్నారు. నాటి న మొక్కలను కూడా సంరక్షించాల్సిన బాధ్యత అధికారులదేనన్నారు. గ్రామా ల్లో పండ్ల మొక్కలు నాటాలని సూచించారు. సిమెంట్ ఫ్యాక్టరీతోపాటు, పాలిషింగ్ యూనిట్లు, నాపరాతి గనుల్లో మొక్కలు నాటిన తర్వాత వాటి సంరక్షించాల్సిన బాధ్యత యాజమానులదేన న్నారు. తూతూ మంత్రంగా చేపడితే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. సెక్టోరియల్ అధికారులు గ్రామాల్లో విసృ్తతంగా తిరిగి మొక్కల సంరక్షణకు సంబంధించి క్షేత్రస్థారుులో తెలుసుకోవాలన్నారు. ఎంపీపీ లక్ష్మమ్మ, ఎంపీడీఓ జగన్మోహన్రావు, తహసీల్దార్ రవీందర్, ఏఓ రజిత, ఏపీఏం వెంకన్న, సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు. ఖాంజాపూర్‌లో మొక్కలు నాటిన పీడీ హరిత మండలంలోని ఖాంజాపూర్ గ్రామ శివారులోని ప్రభుత్వ భూముల్లో డ్వామా పీడీ హరిత మొక్కలు నాటారు. ఏపీడీ అప్పారావు, ఏపీఓ శారద, ఈసీ పాండుచ ఉపాధి సిబ్బంది పాల్గొన్నారు. -
దసరా నుంచే కొత్త జిల్లాలు..
♦ ప్రజాప్రతినిధులకు సీఎం కేసీఆర్ స్పష్టీకరణ ♦ మార్పులు, చేర్పులపై సూచనలు అడిగిన సీఎం ♦ ప్రజల మనోభావాలకు అనుగుణంగా ఉండాలని సూచన ♦ ఇక పక్కాగా నిజామాబాద్, కామారెడ్డి రెండు జిల్లాలు ♦ కొత్త మండలాలు పదే.. బాన్సువాడ రెవెన్యూ డివిజన్.. ♦ కలెక్టర్ ప్రతిపాదనలకు ఓకే అన్న ప్రజాప్రతినిధులు సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : కొత్త జిల్లాల ఏర్పాటుపై సీఎం చంద్రశేఖర్‌రావు ఆ పార్టీ ప్రజాప్రతినిధులకు స్పష్టతనిచ్చారు. బుధవారం హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో సమావేశమైన సీఎం కేసీఆర్ కొత్త జిల్లాల ఏర్పాటుపై పలు అంశాలను సమీక్షించారు. నిజామాబాద్ జిల్లాకు సంబంధించి కొత్తగా ఏర్పడే బాన్సువాడ రెవెన్యూ డివిజన్, 10 మండలాలు, కామారెడ్డి జిల్లాపై చర్చ జరిగింది. కొద్దిపాటి మార్పులు, చేర్పులను ప్రజాప్రతినిధులు సూచించినా.. మొత్తంగా కలెక్టర్ డాక్టర్ యోగితారాణా అధికార యంత్రాంగంతో కసరత్తు చేసి ఇచ్చిన నివేదికకు ప్రజాప్రతినిధులు ఆమోదం తెలిపినట్లు తెలిసింది. దసరా నుంచే కొత్త జిల్లాల ఏర్పాటు, పరిపాలన ప్రారంభం అవుతుందని ఉద్ఘాటించారు. జిల్లాల పునర్విభజన స్పష్టంగా ఉండాలని, పేర్కొన్న సీఎం కేసీఆర్ ప్రజాప్రతినిధుల నుంచి సూచనలు, సలహాలను స్వీకరించినట్లు తెలిసింది. అధికారులకు సహకరించాలని సూచన టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులతో సీఎం కేసీఆర్ సమావేశం నిర్వహించిన అనంతరం దసరా నుంచి కొత్త జిల్లాల్లో పరిపాలన ప్రారంభం అవుతుందని సూచించినట్లు ప్రజాప్రతినిధులు కొందరు ‘సాక్షి’కి తెలిపారు. కొత్త జిల్లాల ఏర్పాటు, పునర్విభజన ప్రక్రియపై జరుగుతున్న కసరత్తు, మార్పులు, చేర్పులకు సంబంధించిన తుది నిర్ణయాలను సీఎం ప్రకటించారు. ఈ మేరకు నిజామాబాద్ జిల్లాలో కామారెడ్డి జిల్లా ఏర్పాటు జరుగనుంది. దీనికి సంబంధించి కలెక్టర్ యోగితారాణా అందించిన ప్రతిపాదనలను సీఎం కేసీఆర్ వెల్లడించగా, దాదాపుగా ప్రజాప్రతినిధులు అంగీకారం తెలిపినట్లు తెలిసింది. అంతే కాకుండా రెండు జిల్లాలకు సంబంధించి మెదక్ జిల్లా మంత్రులు, నిజామాబాద్ జిల్లా మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డిలు పరస్పరం అంగీకారం తెలిపారు. దీంతో జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ఎలాంటి వినతులు, పరిశీలనలు లేకుండా పోయాయి. రాష్ట్రంలో 14 కొత్త జిల్లాలు, 74 మండలాలు ఏర్పాటు అయ్యే అవకాశం ఉండగా, ఒక్కో జిల్లాకు సగటున 20 మండలాలు ఏర్పాటు కానున్నాయి. దీని పరంగా నిజామాబాద్ జిల్లాలో కొత్తగా పది మండలాలు ఏర్పాటు అయ్యే అవకాశం ఉంది. దీనికి సంబంధించి కలెక్టర్ రూపొం దించిన నివేదికలు కూడా ఆమోదం పొంది నట్లు సమాచారం. దీంతో ఏలాంటి పునపరిశీలన లేకుండా మండలాలు ఏర్పాటు అయ్యే అవకాశం ఉంది. ముసాయిదా వెల్లడి, అభిప్రాయాల సేకరణ ఇక లాంఛనమే కానుంది. జిల్లాల ఏర్పాటులో జిల్లా కేంద్రానికి సంబంధించి దగ్గరగా ఉన్న మండలాలు, నియోజకవర్గాలను పాత జిల్లాలోనే కొనసాగించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఇందులో భాగంగా నిజామాబాద్ జిల్లాకు దగ్గరగా ఉన్న మండలాలు జిల్లాలోనే కొనసాగే అవకాశం ఉంది. నియోజక వర్గాలు ఇదే తీరులో కొనసాగే అవకాశం ఉంది. ఎక్కువ జనాభా కలిగిన ప్రాంతాలను పట్టణాలుగా, అర్బన్ మండలాలుగా ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి. బాన్సువాడ రెవెన్యూ డివిజన్ జిల్లాలో బాన్సువాడ రెవెన్యూ డివిజన్‌గా అవకాశం ఉంది. ఇదివరకే ప్రతిపాదనలు వెల్లగా దీనికి సీఎం అంగీకరించినట్లు తెలిసింది. బాన్సువాడ ఒక్కటే రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు కానుంది. దీంతో కొంత కాలంగా జిల్లాలో కామారెడ్డి జిల్లా ఏర్పాటు అందులో ఏఏ ప్రాంతాలు వెలుతాయోనని అందరు ఆసక్తిగా ఎదురుచూశారు. పునర్విభజనకు సీఎం అంగీకారం తెలుపడంతో కామారెడ్డి జిల్లాకు నాలుగు నియోజకవర్గాలతో పునర్ విభజన చేపట్టగా దీనికి స్పష్టమైన ఆమోదం లభించింది. నిజామాబాద్ జిల్లాలో ఐదు నియోజకవర్గాలతో కొనసాగనుంది. అయితే మండలాల్లో కొద్దిపాటి మార్పులను ప్రజాప్రతినిధులు కోరినట్లు తెలిసింది. ఈ మేరకు కొత్తగా ఏర్పడే మండలాలు నిజామాబాద్ నార్త్, నిజామాబాద్ రూరల్, మోపాల్, రుద్రూరు, కామారెడ్డి రూరల్ (దేవునిపల్లి), రామారెడ్డి, ఆలూరు, రెంజర్ల, బోధన్ రూరల్, ఇందల్వాయిలు ఉంటాయి. కాగా కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి స్థానిక ప్రజాప్రతినిధులు మండలాల ఏర్పాటు పునర్ విభజనకు సంబంధించి మార్పు చేర్పులపై సలహాలు ఇవ్వాలని సీఎం కేసీఆర్ ప్రజాప్రతినిధులను ఆదేశించారు. అభివృద్ధికి సంబంధించి ప్రాంతాలను దృష్టిలో ఉంచుకొని ప్రజాప్రతినిధులు సలహాలు, సూచనలు అందించాలని కోరినట్లు తెలిసింది. ముఖ్యంగా స్థానిక ప్రజలకు ఆ ప్రాంతం ఎక్కడ ఉండాలో గుర్తించి ఏ ప్రాంతానికి దగ్గరగా ఉంటుందో తెలుసుకొని వారికి అన్యాయం జరుగకుండా సౌకర్యవంతంగా ఉండేందుకు ప్రజాప్రతినిధులు పాటుపడాలన్నారు. చిన్న జిల్లాలతో పరిపాలన బాగుంటుందని పేద కుటుంబాలను గుర్తించి అభివృద్ధిలోకి తీసుకురావాలని జిల్లా కేంద్రాలన్ని అభివృద్ధి కేంద్రాలుగా మారాలని కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రణాళికలు రూపొందించలన్నారు. అదే విధంగా కొత్త జిల్లాల ఏర్పాటుపై వచ్చే విమర్శలను పట్టించుకోవద్దని, ఈ విషయంలో అధికారులకు సహకరించాలని సూచించినట్లు సమాచారం. -
పదవులు పదిలం!
♦ స్థానిక సంస్థల భవితవ్యంపై ప్రభుత్వం స్పష్టత ♦ జిల్లాల విభజన నేపథ్యంలో అనుమానాలు నివృత్తి ♦ పదవీకాలం ముగిసేవరకు ప్రస్తుత పాలకవర్గాలకే పీఠం ♦ జిల్లా పరిషత్ చైర్పర్సన్ సునీతకు తప్పిన పదవీగండం ♦ మండలాల వ్యవస్థలో ఆచరించిన పద్ధతికే మొగ్గు ♦ ఊపిరి పీల్చుకున్న ‘స్థానిక’ ప్రజాప్రతినిధులు 1985లో మండల వ్యవస్థ ప్రవేశపెట్టిన సమయంలో అప్పటికే కొలువుదీరిన పంచాయతీ సమితులను రద్దు చేయలేదు. వాటి పదవీ కాలం వరకు కొనసాగించారు. ఇప్పుడూ అదే పద్ధతిని అవలంబించనున్నారు. ప్రస్తుత జడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి యాలాల మండలం నుంచి ఎన్నికయ్యారు. ఈ మండలం పునర్విభజనలో వికారాబాద్ కేంద్రంగా కొనసాగే రంగారెడ్డి జిల్లాలోకి వెళ్లనుంది. స్థానిక సంస్థల ఉనికికి భంగం కలగకుండా జిల్లాల పునర్విభజన ప్రక్రియ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుత పదవీకాలం ముగిసేంతవరకు స్థానిక సంస్థల జోలికి వెళ్లకూడదనే నిర్ణయానికి వచ్చింది. ముఖ్యంగా మరో రెండున్నరే ళ్ల పదవీకాలం ఉన్న జిల్లా పరిషత్ పాలకవర్గాన్ని యథావిధిగా కొనసాగించేందుకు మొగ్గు చూపుతోంది. దసరా నుంచి కొత్త జిల్లాలు మనుగడలోకి వస్తాయని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు జిల్లాల పునర్వ్యవస్థీకరణకు తుదిరూపు ఇస్తోంది. తెలంగాణలోని హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలు మినహా ఇతర జిల్లాల విభజనపై స్పష్టత కూడా వచ్చింది. మరోవారం పది రోజుల్లో మన జిల్లా ఎన్ని ముక్కలు కానుందో తేలనుంది. సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జిల్లాల పునర్విభజన నేపథ్యంలో స్థానిక సంస్థల భవిష్యత్తు ఏమిటనేదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రాజకీయంగా ఈ అంశం ముడిపడి ఉండడంతో ప్రభుత్వం కూడా ఆచితూచి వ్యవహరిస్తోంది. న్యాయపర, రిజర్వేషన్ల సమస్య తలెత్తకుండా వీటి విభజనపై దృష్టి పెట్టకపోవడమే మంచిదనే భావనకొచ్చాయి. ఇదే విషయాన్ని ఇటీవల జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో ప్రభుత్వం స్పష్టం చేసినట్లు తెలిసింది. ప్రస్తుతం జిల్లా పరిషత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న జెడ్పీటీసీ సభ్యులు.. రేపు జిల్లాల విభజన తర్వాత మరో జిల్లా పరిధిలోకి చేరితే పరిస్థితేంటనే సందేహాన్ని పలువురు కలెక్టర్లు ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. వీరందరి అనుమానాన్ని నివృత్తి చేసిన ప్రభుత్వ పెద్దలు.. 1985లో మండల వ్యవస్థ ప్రవేశపెట్టిన సమయంలో అప్పటికే కొలువుదీరిన పంచాయతీ సమితులను రద్దు చేయలేదని, వాటి పదవీకాలం వరకు కొనసాగించారని, అదే పద్ధతిని ఇప్పుడు అవలంబిస్తామని స్పష్టం చేశారు. 1987 వరకు సమితులు కొనసాగించారని, ప్రస్తుత పాలకవర్గాలు కూడా ఐదే ళ్ల పదవీకాల ం ముగిసేవరకు ఉంటాయని స్పష్టతనిచ్చారు. ప్రస్తుత జడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి యాలాల మండలం నుంచి ఎన్నికయ్యారు. ఈ మండలం జిల్లాల పునర్విభజనలో వికారాబాద్ కేంద్రంగా కొనసాగే రంగారెడ్డి జిల్లాలో ఉండనుంది. చేవేళ్ల, వికారాబాద్, తాండూరు, పరిగి నియోజకవర్గాలు ఈ జిల్లా పరిధిలోకి రానున్నాయి. మిగతా అసెంబ్లీ సెగ్మెంట్లు ఏ జిల్లాలో చేరుతాయి? కొత్త జిల్లాలుగా మారుతాయా? అనే అంశంపై ఇంకా అస్పష్టత నెలకొంది. ఈ నేపథ్యంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ భవితవ్యంపై రాజకీయవర్గాల్లో చర్చోపచర్చలు జరిగాయి. అయితే, ఇటీవల జరిగిన సమావేశంలో ప్రభుత్వం.. జిల్లా పరిషత్‌లను యథాతథంగా కొనసాగించేందుకే మొగ్గు చూపాయి. జిల్లాల పునర్విభజనకు అనుగుణంగా పదవుల విభజన కూడా చేపడితే న్యాయపరమైన సమస్యలు తలెత్తే అవకాశముందనే అభిప్రాయానికొచ్చాయి. అదేసమయంలో అర్ధంత రంగా ఈ పదవులను అర్డినెన్స్ ద్వారా రద్దు చేసి ప్రత్యేకాధికారుల పాలనను తెచ్చినా.. రాజకీయంగా ప్రభుత్వానికి ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుందని భావించారు. ఈ అంశాలన్నింటిని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం ప్రస్తుత పాలకవర్గం పదవీకాలం ముగిసేవరకు కొనసాగిస్తే మంచిదనే నిర్ణయానికొచ్చింది. ఈ పరిణామాలను గమనిస్తే జిల్లా పరిషత్ చైర్పర్సన్ సునీతా మహేందర్ రెడ్డి పీఠానికి ఢోకాలేనట్లే! పునర్విభజనతో జిల్లా రెండు, మూడు జిల్లాలుగా ఏర్పడినా.. ఆ జిల్లాల పగ్గాలు కూడా ప్రస్తుత చైర్పర్సన్ చేతిలోనే ఉంటాయని అధికారవర్గాలు తెలిపాయి. -
సహజీవనం తప్పేమీ కాదు: సుప్రీంకోర్టు
మన సమాజంలో ఇప్పుడు సహజీవనం కూడా ఆమోదం పొందిందని, అందువల్ల దాన్ని తప్పుగా చెప్పలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ప్రస్తుత ఆధునిక సమాజంలో సహజీవనం అందరికీ ఆమోదయోగ్యం అయ్యిందని, అందువల్ల అది నేరం కాదని తెలిపింది. జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ప్రఫుల్ల సి పంత్‌లతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ప్రజాజీవితంలో ఉన్నవాళ్ల సహజీవనాన్ని బయటపెట్టడం పరువునష్టం కిందకు వస్తుందా అని ప్రభుత్వాన్ని అడిగే సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజాజీవితంలో ఉన్నవాళ్ల వ్యక్తిగత జీవితంలో ప్రజలు తొంగి చూడకూడదని, అలా చూడటం వల్ల ప్రజా ప్రయోజనం ఏమీ ఉండబోదని అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి కోర్టుకు సమాధానం ఇచ్చారు. -
రాజకీయాలకు అతీతంగా ఏజెన్సీ అభివృద్ధి
సన్మాన సభలో ఎమ్మెల్యేలు ఈశ్వరి, సర్వేశ్వరరావు పాడేరు రూరల్: విశాఖ మన్యాన్ని పార్టీలకతీతంగా అభివృద్ధి చేయటమే తమ లక్ష్యమని పాడేరు, అరకు ఎమ్మెల్యేలు గిడ్డి ఈశ్వరి, కిడారి సర్వేశ్వరరావు అన్నారు. ఇటీవల ఎన్నికైన శాసనసభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులకు పాడేరు వర్తక సంఘం ప్రతినిధులు ఆదివారం రాత్రి స్థానిక మోదకొండమ్మ కల్యాణ మండపంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తాగునీరు, రోడ్డు, రవాణా, విద్యుత్ సదుపాయల కల్పన కోసం ప్రభుత్వంతో పోరాడుతామన్నారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయబోమన్నారు. ఇద్దరం కలిసి సమన్వయంతో మన్యం అభివృద్ధికి పాటుపడతామన్నారు. గిరిజన ప్రాంతాల్లో నివాసం ఏర్పరుచుకొని తరతరాలుగా జీవిస్తున్న గిరిజనేతరుల సమస్యల పరిష్కరానికి ప్రభుత్వంతో మాట్లాడుతామన్నారు. పాడేరు, అరకు ప్రధాన కేంద్రాల్లో శ్మశాన వాటిక కోసం స్థలం కేటాయించి, అన్ని సదుపాయాలు కల్పిస్తామన్నారు. దశల వారీగా సమస్యలను పరిష్కరిస్తామన్నారు. తన మొదటి వేతనాన్ని పాడేరు శ్రీ మోదకొండమ్మ అమ్మవారి ఆలయం అభివృద్ధికి వెచ్చిస్తున్నట్లు పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి తెలిపారు. ఈ కార్యక్రమంలో పాడేరు ఎంపీపీ వర్తన ముత్యాలమ్మ, పాడేరు, అరకు, డుంబ్రిగూడ జెడ్పీటీసీ సభ్యులు పి.నూకరత్నం, కూన వనజ, మండ్యగురు చంద్రమ్మ, పాడేరు, అరకు మేజర్ పంచాయతీల సర్పంచ్‌లు కిల్లు వెంకటరత్నం, సమర్ఢి గులాబి, వర్తక సంఘం నాయకులు రొబ్బి రాము, ఇమ్మిడిశెట్టి అనీల్, అకాశపు సోమరాజు, రొబ్బి శంకర్రావు, మాజీ ఎంపీపీ ఎస్వీవీ రమణమూర్తి, మాజీ సర్పంచ్ వర్తన పిన్నయ్యదొర, వైఎస్సార్సీపీ నాయకులు పాంగి పాండురంగస్వామి, శివ, పలువురు ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్‌లు, వర్తక సంఘం ప్రతినిధులు, వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు.