అంచనా ప్రకారమే మొక్కల పంపిణీ
డ్వామా పీడీ హరిత
యాలాల: హరితహారంలో భాగంగా మొక్కలు నాటే ప్రజాప్రతినిధులు, అధికారులు ఇచ్చిన నివేదిక ఆధారంగానే మొక్కలు పంపిణీ చేస్తామని డ్వామా పీడీ హరిత స్పష్టం చేశారు. మండల పరిషత్ కార్యాలయంలో సర్పంచ్‌లు, ఎంపీటీసీ, మండలస్థారుు అధికారుల తో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. హరితహారంలో భాగంగా నాటే ప్రతి మొక్క వివరాలను నమోదు చేస్తున్నామన్నారు. ఉపాధి హామీలో భాగంగా నాటే ప్రతి మొక్క ఎదుగుదల వరకు నిర్వాహణ ఖర్చులు ఇస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా మొక్కల పంపిణీ కార్యక్రమం దుర్వినియోగం కాకుండా ఇకపై తగిన చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.
గ్రామాల ప్రజాప్రతినిధులు, అధికారులు ఇచ్చిన నివేదికతోపాటు సంబం దిత శాఖ ఏఈ ధ్రువీకరణపత్రాన్ని పరిశీలించి మొక్కల పంపిణీతోపాటు నిర్వాహణ ఖర్చులు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ విషయమై స్థానిక ప్రజాప్రతినిధులు అభ్యంతరం వ్యక్తం చేశారు. మొక్కలు నాటే కార్యక్రమానికి ఖర్చులు ఇవ్వకపోవడం అన్యాయమన్నారు. దీనిపై స్పందించిన పీడీ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం తాము ముందుకు వెళుతున్నామని తెలిపారు. ఎంపీపీ సాయన్నగౌడ్, తహసీల్దార్ అబిద్ అలీ, ఏపీడీ అప్పారావు, ఇన్ చారర్జి ఎంపీడీఓ ఉమాదేవి ఉన్నారు.
సంరక్షణ బాధ్యత అధికారులదే...
తాండూరు రూరల్: హరితహారంలో నాటిన మొక్కలను సంరక్షించాల్సిన బాధ్యత కూడా స్థానిక అధికారులదేనని డ్వామా పీడీ హరిత అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామాల్లో, పట్టణాల్లో హరితహారం కింద పెద్దఎత్తున మొక్క లు నాటడం సంతోషకరమన్నారు. నాటి న మొక్కలను కూడా సంరక్షించాల్సిన బాధ్యత అధికారులదేనన్నారు. గ్రామా ల్లో పండ్ల మొక్కలు నాటాలని సూచించారు.
సిమెంట్ ఫ్యాక్టరీతోపాటు, పాలిషింగ్ యూనిట్లు, నాపరాతి గనుల్లో మొక్కలు నాటిన తర్వాత వాటి సంరక్షించాల్సిన బాధ్యత యాజమానులదేన న్నారు. తూతూ మంత్రంగా చేపడితే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. సెక్టోరియల్ అధికారులు గ్రామాల్లో విసృ్తతంగా తిరిగి మొక్కల సంరక్షణకు సంబంధించి క్షేత్రస్థారుులో తెలుసుకోవాలన్నారు. ఎంపీపీ లక్ష్మమ్మ, ఎంపీడీఓ జగన్‌మోహన్‌రావు, తహసీల్దార్ రవీందర్, ఏఓ రజిత, ఏపీఏం వెంకన్న, సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు.
ఖాంజాపూర్‌లో మొక్కలు నాటిన పీడీ హరిత
మండలంలోని ఖాంజాపూర్ గ్రామ శివారులోని ప్రభుత్వ భూముల్లో డ్వామా పీడీ హరిత మొక్కలు నాటారు. ఏపీడీ అప్పారావు, ఏపీఓ శారద, ఈసీ పాండుచ ఉపాధి సిబ్బంది పాల్గొన్నారు.