Public investment
-
ముకేశ్.. మారథాన్!
న్యూఢిల్లీ: కార్పొరేట్ దిగ్గజం ముకేశ్ అంబానీ నిధుల వేటలో దూసుకుపోతున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ రిటైల్ వ్యాపార అనుబంధ సంస్థ రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ (ఆర్ఆర్వీఎల్)లోకి మరో భారీ పెట్టుబడి వచ్చిచేరింది. సౌదీ అరేబియాకు చెందిన పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (పీఐఎఫ్) తమ సంస్థలో 2.04 శాతం వాటాను కొనుగోలు చేయనుందని, దీనిద్వారా రూ.9,555 కోట్ల నిధులను సమీకరించినట్లు ఆర్ఆర్వీఎల్ గురువారం ప్రకటించింది. తాజా పెట్టుబడుల సమీకరణతో రిలయన్స్ రిటైల్ విభాగం విలువ దాదాపు రూ.4.587 లక్షల కోట్లుగా లెక్కతేలుతోంది. కాగా, గడిచిన రెండు నెలల్లో (సెప్టెంబర్ 9 నుంచి ఇప్పటివరకూ) ఆర్‌ఆర్‌వీఎల్‌లోకి మొత్తం రూ.46,265 కోట్ల నిధులు వెల్లువెత్తాయి. కంపెనీలో 10.52 శాతం వాటాను ఎనిమిది మంది ఇన్వెస్టర్లకు విక్రయించింది. జియోలోనూ పెట్టుబడి... సౌదీ పీఐఎఫ్‌కు రిలయన్స్ గ్రూప్‌పై గురి బాగానే కుదిరింది. ఇప్పటికే జియో ప్లాట్‌ఫామ్స్‌లో కూడా 2.32 శాతం వాటాను కొనుగోలు చేసింది. దీనికోసం రూ.11,367 కోట్లను కుమ్మరించింది. తాజాగా రిటైల్లోనూ అడుగుపెట్టడం ద్వారా అంబానీ కంపెనీల్లో పీఐఎఫ్‌కు ఇది రెండో పెట్టుబడి కానుంది. కాగా, జియో ప్లాట్‌ఫామ్స్‌లో కూడా ఫేస్బుక్, ఇంటెల్, గూగుల్ సహా మొత్తం 13 అంతర్జాతీయ ఇన్వెస్టర్లు, దిగ్గజ టెక్నాలజీ కంపెనీలకు వాటా విక్రయం ద్వారా రూ.1.52 లక్షల కోట్లను సమీకరించిన సంగతి తెలిసిందే. వచ్చే ఐదేళ్లలోపు ఆయా విభాగాలను పబ్లిక్ ఇష్యూతో స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ చేయాలనేది రిలయన్స్ ప్రణాళిక. రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ విలువ రూ.15 లక్షల కోట్లను మించిపోగా, ఇందులో రిటైల్, జియోల విలువ రూ.9 లక్షల కోట్లకు చేరడం గమనార్హం. ధనాధన్ రిటైల్... ఆర్ఆర్వీఎల్ అనుబంధ సంస్థ అయిన రిలయన్స్ రిటైల్‌కు వివిధ విభాగాల్లో దేశవ్యాప్తంగా 12,000 పైగా స్టోర్స్ ఉన్నాయి. కరోనా ప్రతికూల పరిస్థితులు నెలకొన్నప్పటికీ ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రూ.39,199 కోట్ల ఆదాయాన్ని రూ. 2,099 కోట్ల నిర్వహణ లాభాన్ని ఆర్జించింది. సమీకరిస్తున్న ఈ భారీ నిధులతో రిలయన్స్ రిటైల్ అటు ఆఫ్‌లైన్‌తో పాటు ఆన్లైన్లో కూడా ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి ఈ–కామర్స్ కంపెనీలతో పోటీ పడేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఉన్న పలు ఆన్లైన్ ఫార్మాట్లకు తోడు కిరాణా సరుకుల అమ్మకాలకు ప్రత్యేకంగా జియోమార్ట్‌ను ప్రారంభించడం తెలిసిందే. సౌదీ అరేబియాతో మాకు(రిలయన్స్) దీర్ఘాకాలికంగా మంచి సంబంధాలు ఉన్నాయి. సౌదీ ఆర్థిక పురోభివృద్ధిలో పీఐఎఫ్ చాలా కీలకపాత్ర పోషిస్తోంది. రిలయన్స్ రిటైల్‌లోకి ఒక విలువైన భాగస్వామిగా పీఐఎఫ్‌ను ఆహ్వానిస్తున్నాను. ఈ సంస్థ అందించే మద్దతు, మార్గదర్శకత్వాన్ని కూడా ఉపయోగించుకొని 130 కోట్ల మంది భారతీయులు, అలాగే లక్షలాది మంది చిన్న వర్తకుల జీవితాలను మెరుగుపరచడం కోసం భారత్ రిటైల్ రంగాన్ని సమూలంగా మార్చివేసేందుకు మా ప్రతిష్టాత్మక ప్రయాణాన్ని కొనసాగిస్తాం. – ముకేశ్ అంబానీ, రిలయన్స్ అధినేత -
ధనాధన్ జియో
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన జియో ప్లాట్‌ఫామ్స్‌లో పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది. జియో ప్లాట్‌ఫా మ్స్‌లో 2.32 శాతం వాటాను సౌదీ అరేబియా పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (పీఐఎఫ్) రూ.11,367 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ సంస్థ భారత్‌లో ఇప్పటివరకూ పెట్టిన పెట్టుబడుల్లో ఇదే పెద్దది కావడం గమనార్హం. ఈ ఏడాది ఏప్రిల్ 22 నుంచి ఫేస్బుక్ నుంచి మొదలైన పెట్టుబడుల వరదలో జియో ప్లాట్‌ఫామ్స్‌లో ఇది పదకొండవ పెట్టుబడి. ఇప్పటివరకూ 24.7 శాతం వాటాకు రూ.1,15,694 కోట్ల మేర నిధులు వచ్చాయి. జియో ప్లాట్‌ఫామ్స్‌లో 25 శాతం మేర వాటాను విక్రయించాలని రిలయన్స్ భావించిందని సమాచారం. కరోనా కాలంలోనూ నిధుల వరద సౌదీ అరేబియా పీఐఎఫ్ తాజా పెట్టుబడుల పరంగా చూస్తే, జియో ప్లాట్‌ఫామ్స్ ఈక్విటీ విలువ రూ.4.91 లక్షల కోట్లుగా, ఎంటర్ప్రైజ్ వేల్యూ రూ.5.16 లక్షల కోట్లుగా ఉందని రిలయన్స్ ఇండస్ట్రీస్ వెల్లడించింది. కరోనా వైరస్ కల్లోలంతో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమన పరిస్థితులు నెలకొన్నా, ప్రపంచ దిగ్గజ సంస్థల నుంచి ఈ రేంజ్లో నిధులు రాబట్టటం విశేషమే. కాగా ఈ డీల్‌కు వివిధ ప్రభుత్వ సంస్థల ఆమోదాలు లభించాల్సిఉంది. ఈ డీల్‌కు ఆర్థిక సలహాదారుగా మోర్గాన్ స్టాన్లీ సంస్థ వ్యవహరించింది. ఆల్‌టైమ్ హైకి రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ సౌదీ పీఐఎఫ్ తాజా పెట్టుబడులతో రిలయన్స్ షేర్ దూసుకెళ్లింది. ఇంట్రాడేలో జీవిత కాల గరిష్ట స్థాయి, రూ.1,665ను తాకింది. చివరకు 2% లాభంతో రూ.1,656 వద్ద ముగిసింది. మార్కెట్ విలువ రూ.11,19,930 కోట్లకు చేరింది. భారత్‌లో అత్యధిక మార్కెట్ క్యాప్ కంపెనీ ఇదే. ఫ్యూచర్ గ్రూప్‌లో రిలయన్స్‌కు వాటాలు! న్యూఢిల్లీ: ఫ్యూచర్ గ్రూప్ కంపెనీల్లో వాటాలను రిలయన్స్ ఇండస్ట్రీస్ కొనుగోలు చేయనున్నదని సమాచారం. ఫ్యూచర్ గ్రూప్‌నకు చెందిన çఫ్యూచర్ రిటైల్, ఇతర కంపెనీల్లో వాటా విక్రయ సంబంధిత చర్చలు జోరుగా జరుగుతున్నాయని పరిశ్రమ వర్గాలంటున్నాయి. కాగా ఈ వార్తలను ఇరు కంపెనీలు ధ్రువీకరించలేదు. ఫ్యూచర్ రిటైల్‌లో వాటా విక్రయం కోసం గతంలో ఫ్యూచర్ గ్రూప్ సంస్థ, విప్రో ప్రేమ్‌జీ ఇన్వెస్ట్మెంట్ సంస్థ, ప్రేమ్‌జీ ఇన్వెస్ట్‌తోనూ, ప్రైవేట్ ఈక్విటీ సంస్థ సమర క్యాపిటల్‌తోనూ చర్చలు జరిపింది. కాగా వాటా విక్రయ ఒప్పందం కుదిరితే, ఫ్యూచర్ గ్రూప్‌నకు ఒకింత ఊరట లభిస్తుంది. రుణాలు తిరిగి చెల్లించడంలో ఫ్యూచర్ గ్రూప్ చైర్మన్ కిశోర్ బియానీ విఫలమయ్యారు. దీంతో పలు రేటింగ్ సంస్థలు ఫ్యూచర్ గ్రూప్ కంపెనీల రేటింగ్లను డౌన్‌గ్రేడ్ చేశాయి. అంతే కాకుండా బియానీ తనఖా పెట్టిన షేర్లను ఆయా రుణ సంస్థలు స్వాధీనం చేసుకున్నాయి. ఈ ప్రతికూల పరిస్థితుల్లో వాటా విక్రయం ద్వారా నిధులు లభిస్తే, అది బియానీకి పెద్ద ఊరట కానున్నది. కాగా బిగ్‌బజార్, ఈజీడే క్లబ్, హెరిటేజ్ ఫ్రెష్ రిటైల్ స్టోర్స్‌ను çఫ్యూచర్ రిటైల్ నిర్వహిస్తోంది. సౌదీ అరేబియాతో రిలయన్స్‌కు దశాబ్దాలుగా సంబంధాలు ఉన్నాయి. ఇప్పటిదాకా చమురు రంగానికి పరిమితమైన ఈ బంధం పీఐఎఫ్ పెట్టుబడులతో ఇక భారత కొత్త ఇంధన రంగాన్ని (డేటా) మరింత బలోపేతం చేయనుంది. సౌదీ అరేబియా ఆర్థిక ముఖచిత్రాన్ని కొంగొత్తగా తీర్చిదిద్దడంలో పీఐఎఫ్ కీలకపాత్ర పోషించింది. జియో ప్లాట్‌ఫామ్స్‌లో విలువైన భాగస్వామిగా పీఐఎఫ్‌ను స్వాగతిస్తున్నా. 130 కోట్ల మంది ప్రజలకు సాధికారత అందించే దిశగా భారత్ తలపెట్టిన డిజిటల్ కార్యక్రమం వేగవంతం చేసేలా పీఐఎఫ్ మద్దతునిస్తుందని, మార్గదర్శకత్వం చేస్తుందని ఆశిస్తున్నాను. – ముకేశ్ అంబానీ, సీఎండీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ భారత డిజిటల్ ఎకానమీ సామర్థ్యంపై మాకు గట్టి నమ్మకం ఉంది. జియోతో భాగస్వామ్యం ద్వారా ఆ వృద్ధిలో పాలుపంచుకునే అవకాశం మాకు కూడా లభిస్తుంది. భారత్‌లో టెక్నాలజీ రంగం ముఖచిత్రాన్ని మార్చివేస్తున్న వినూత్న సంస్థలో పెట్టుబడులు పెట్టడం మాకు సంతోషకరమైన విషయం. అలాగే ఈ పెట్టుబడులతో సౌదీ ఎకానమీకి, మా దేశ ప్రజలకూ దీర్ఘకాలికంగా వ్యాపారపరమైన ప్రయోజనాలు చేకూరతాయి. – యాసిర్–అల్–రుమయ్యన్, గవర్నర్, పీఐఎఫ్ -
పెట్టుబడులు పడిపోవడం ఆందోళనకరం
ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ హాంకాంగ్: ప్రభుత్వ, ప్రైవేటు పెట్టుబడులు పడిపోతుండడం ఆందోళన కలిగిస్తోందని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ శుక్రవారం పేర్కొన్నారు. ఇది ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపే అంశంగా పేర్కొన్నారు. ‘‘వృద్ధికి సంబంధించి ఆందోళన కలిగిస్తున్న అంశం పెట్టుబడులు. ప్రైవేటు పెట్టుబడులు తగ్గుతున్నాయి. ప్రభుత్వ పెట్టుబడుల సంగతీ అంతే’’ అని ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో రాజన్ అన్నారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, మౌలిక రంగం అభివృద్ధి ఆర్థిక వ్యవస్థకు ఉత్సాహాన్ని అందిస్తున్న అంశాలుగా వివరించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ గత వారం బ్రిటన్‌లో మాట్లాడుతూ, దేశానికి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 40 శాతం పెరిగాయని, ప్రపంచానికి భారత్ పట్ల పెరిగిన విశ్వాసానికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు అంచనాను ఆర్బీఐ 7.6 శాతం నుంచి 7.4 శాతానికి తగ్గించిన సంగతి తెలిసిందే. వృద్ధికి ఊతం అందించే క్రమంలో సెప్టెంబర్‌లో ఆర్బీఐ రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీనితో బ్యాంకులకు తానిచ్చే (ఆర్బీఐ) స్వల్పకాలిక రుణాలపై వడ్డీరేటు రెపో 6.75 శాతానికి తగ్గింది.