Public money waste
-
ప్రజాధనం కాదు ప్రజలపై భారం..!
ప్రజాధనంతో ప్రజా రాజధాని అనే పేరిట 3.5. 2018 నాడు నేను రాసిన వ్యాసానికి 8.5.2018 నాడు సాక్షి దినపత్రికలో సీఆర్డీఏ జాయింట్ డైరెక్టర్ శ్రీని వాస్ వివరణ ఇచ్చారు. దానిపైన నాస్పందన ఇక్కడ పొందుపరుస్తున్నాను. గ్రీన్ ఫీల్డ్ మహా నగర నిర్మాణం వ్యాపారపరంగా లాభసాటికరమైన కార్యక్రమం కాదని అందుచేత దీనికోసం అప్పులు చేస్తే అప్పులను తీర్చే భారం ప్రజల మీద పడుతుందనేది నా వ్యాసంలోని ప్రధాన అంశం. సీఆర్డీఏ వారు పేర్కొన్న ఉదాహరణలు పూర్తిగా పోల్చడానికి వీలులేనివి. ఈ సందర్భంగా బొంబాయి నగరానికి దగ్గరగా ఉన్న బాంద్రా కుర్ల కాంప్లెక్స్ నిర్మాణానికి ప్రజల నుంచి బాండ్ల రూపంలో వనరులు సేకరించడాన్ని ఉదాహరిం చారు. ముంబై చాలా అభివృద్ధి చెందిన నగరం. దాని పరిసర ప్రాంతాలైన బాంద్రా కుర్ల ప్రాంతాల్లోని భూమి ధరలు సహజంగానే ఎక్కువ ఉంటాయి. అటువంటి ప్రాంతాల్లో కొత్త నిర్మాణాలకు టౌన్‌షిప్‌లు నిర్మించటానికి బాండ్ల రూపంలో ధనాన్ని సేకరిస్తే దానిని తిరిగి అక్కడ జరిగే వాణిజ్య కార్యక్రమాల ద్వారా తిరిగి చెల్లించే అవకాశం ఉంటుంది. కానీ అమరావతి ఒక గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టుగా మనం రూపొందిస్తున్నాం. కృత్రిమంగా ఈనాడు నెలకొన్న భూమి ధరలు శాశ్వతంగా ఉండే అవకాశం లేదు. అటువంటి ధరలను ఆధారం చేసుకుని ప్రణాళిక రూపొందించుకోవడం భవిష్యత్తులో సమస్యలకు దారితీసే ప్రమాదం ఉంది. ఆ చుట్టుపక్కల జరిగే వాణిజ్య కార్యక్రమాలను అనుసరించి కానీ అమరావతిలో ఈనాడు జరుగుతున్న కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకుని కానీ అటువంటి ధరలు దీర్ఘకాలంలో కొనసాగే అవకాశాలు కనిపిం చటం లేదు. ఈ స్థితిలో ఈ ప్రణాళిక లాభసాటిగా లేనప్పుడు దీని ద్వారా వచ్చే లాభాలతో అప్పులు అవకాశం చాలా తక్కువ. అప్పుడు ఈ భారం పన్నుల రూపంలో ప్రజల మీద పడే పడుతుంది. ఈ విధంగా గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టులుగా మహానగర నిర్మాణాలు చేసిన దేశాలలో ఆర్థికపరమైన ఒడుదుడుకులు సంభవించాయి. ఉదాహరణకు బ్రెజిల్ దేశంలోని రాజధాని నిర్మాణ కార్యక్రమం ఆ దేశ ఆర్థిక వ్యవస్థ దివాలాకు కారణమైంది. ఆ దేశంలో సైనిక పరిపాలనకు దారి తీసింది. ఊహించని ఆర్థిక వనరులు ఉన్న ఉన్న నైజీరియా, మలేషియా లాంటి దేశాలు మాత్రమే పెట్రోల్ ఆదాయాన్ని మహా నగర నిర్మాణానికి ఉపయోగించి ఆర్థిక ఒడుదుడుకులను తట్టుకోగలిగాయి. కాబట్టి బాంద్రా కుర్ల కాంప్లెక్స్ ఉదాహరణలు చూపించి అమరావతి నగర నిర్మాణానికి ప్రజల నుంచి బాండ్ల ద్వారా వనరుల సేకరణను సమర్థించుకోవటం పొరపాటు. ఇక రెండో ఉదాహరణ ఎన్టీపీసీ లాంటి వాణిజ్య సంస్థలు. ఈ వాణిజ్య సంస్థలలో వాణిజ్య పరమైన లావాదేవీలు నిరంతరం జరుగుతూనే ఉంటాయి. అటువంటి కార్యక్రమాలకు వారు వనరుల సేకరణ బ్యాంకుల ద్వారా సేకరించవచ్చు బాండ్ల రూపంలో ప్రజల నుంచి కూడా తీసుకోవచ్చు. ఇలా తీసుకున్న రుణాలను వాణిజ్యపరమైన కార్యక్రమాల ద్వారా వచ్చే లాభాల నుంచి మాత్రమే తిరిగి చెల్లిస్తారు. రుణాల సేకరణకు వెళ్ళకుండా ప్రజల ద్వారా బాండ్లను స్వీకరించటంలో ఆర్థిక సంస్థలకు కొంత వెసులుబాటు ఉన్నది అనేది వాస్తవం. కేంద్ర ప్రభుత్వ అనుమతితో కొన్ని పన్ను రాయితీలు ప్రకటించటం ద్వారా మౌలిక సదుపాయాల బాండ్ల ద్వారా వనరులు సేకరించవచ్చు. కానీ ఏదైనా వాణిజ్యపరంగా లాభసాటి అయిన కార్యక్రమానికి మాత్రమే ఈ వనరుల సేకరణ జరిగినప్పుడు తిరిగి చెల్లించే బాధ్యత కూడా ఆ సంస్థ పైనే ఉంటుంది. వాణిజ్యపరంగా లాభసాటి కానప్పుడు తప్పకుండా ఈ భారం పన్నుల రూపంలో ప్రజల మీద పడుతుంది. అమరావతి నిర్మాణానికి ఇటువంటి బాండ్ల రూపంలో ప్రజల నుంచి వనరులు సేకరించిన తిరిగి వాటిని తీర్చే బాధ్యత పన్నుల రూపంలో ప్రజల మీద పడే అవకాశం ఉన్నది. ఒక గ్రీన్‌ఫీల్డ్ నగరం వాణిజ్యపరంగా లాభదాయకంగా నిర్మించిన దాఖలాలు ఎక్కడా లేవు. అలాంటి ప్రయత్నాలు జరిగిన చోట అనూహ్యమైన వనరులు ఉంటే తప్పితే ఆర్థిక సంక్షోభాలు చోటుచేసుకున్న దాఖలాలే కనిపిస్తాయి. ఐవైఆర్ కృష్ణారావు వ్యాసకర్త, ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి iyrk45@gmail.com -
దుబారా ఖర్చులు..బీద అరుపులు
రాష్ట్రంలో పాలకుల తీరిదీ పుష్కరాలకు ఎక్కువ ఖర్చు చేశామన్న మంత్రి యనమల లక్షల వాటర్, మజ్జిగ ప్యాకెట్లు వృథా రూపురేఖలు కోల్పోయిన రోడ్లు నిరుపయోగంగా సీసీ కెమెరాలు ‘ఆదాయం లేదు. ఖర్చులు పెరిగిపోయాయి. జీతాలు ఇవ్వడం కూడా కష్టమవుతోంది.. ఏరోజుకు ఆరోజు నెట్టుకొస్తున్నాం’ అంటూ బీద అరుపులు అరుస్తున్న పాలకులు విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారు. ఎవరైనా ఆదాయం తగ్గినప్పుడు దుబారా ఖర్చులు తగ్గించుకుంటారు. కానీ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు సొంత జిల్లా అయిన తూర్పుగోదావరిలో గతేడాది నిర్వహించిన గోదావరి పుష్కరాలు. పుష్కరాలకు ప్రచారం, ఆహ్వానాలు, పనులు, సౌకర్యాల పేరిట వందల కోట్ల రూపాయల దుబారా జరిగింది. సాక్షి, రాజమహేంద్రవరం: గతేడాది గోదావరి పుష్కరాలకు రూ. 1600 కోట్లు ఖర్చు పెట్టినట్టు పాలకులు ఘనంగా చెప్పుకున్నారు. కానీ అందులో అధిక భాగం దుబారా జరిగిందనడానికి ప్రత్యక్ష సాక్ష్యాలెన్నో ఉన్నాయి. గోదావరి మహాపుష్కరాలు అంటూ ప్రచారానికి వందల కోట్ల రూపాయలు వెచ్చించారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు పట్టణాల్లో హోర్డింగ్‌లు పెట్టారు. వార్త చానెళ్లలో ప్రకటనలిచ్చారు. ప్రముఖులకు ఆహ్వానాల పేరిట ఖరీదైన ఆహ్వాన పత్రికలు వేయించారు. ప్రధాని, ఇతర ముఖ్య నాయకులను ఆహ్వానించేందుకు ప్రత్యేక విమానాల్లో ఢిల్లీ వెళ్లారు. అయితే వారెవరూ రాకపోవడం గమనార్హం. పుష్కరాలను డాక్యుమెంటరీ ఫిల్్మ గా తీసేందుకు నేషనల్ జియోగ్రఫి చానల్‌కు కోట్లాది రూపాయలు చెల్లించారు. పుష్కరాలు ముగిసి ఏడాది గడచినా ఆ డాక్యుమెంటరీ ఇప్పటికీ బయటకు రాలేదు. కానరాని సుందరీకరణ ఆనవాళు పుష్కరాలకు ముఖ్య కేంద్రమైన రాజమహేంద్రవరం నగరాన్ని సుందరంగా తీర్చిద్దేందుకు లక్షలాది రూపాయలు వెచ్చించారు. విమానాశ్రయం రోడ్దు, 216 నంబర్ జాతీయ రహదారి వెంబడి మొక్కలు నాటించారు. అయితే ఇప్పుడవి మచ్చుకు కూడా కనపించడం లేదు. ఎందుకూ పనికి రాని సీసీ కెమెరాలు... పుష్కరాల సందర్భంగా రాజమహేద్రవరం నగరం, ఘాట్ల వద్ద 171 సీసీ కెమెరాలు అమర్చారు. పుష్కరాలు ముగిసిన వెంటనే అవి ఎందుకూ పనికి రాకుండా పోయాయి. మొదటి రోజు జరిగిన తొక్కిసలాటతోపాటు అనేక దొంగతనాలు జరిగాయి. సీసీ కెమెరాల నిఘాతో దొంగలను గుర్తించవచ్చు. అయితే గోదావరి పుష్కరాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు దృశ్యాలను రికార్డ్ చేసేవి కావని, కేవలం పర్యవేక్షణ కోసమేనని అధికారులు చెప్పడం విశేషం. లక్షలాది మజ్జిగ, వాటర్ ప్యాకెట్లు వృథా పుష్కర భక్తులకు అందజేసేందుకు వాటర్ ప్యాకెట్లు, బాటిల్స్ లక్షలాది రూపాయలతో కొనుగోలు చేశారు. ముఖ్యమంత్రి కంపెనీ అయిన హెరిటేజ్ నుంచి మజ్జిగ ప్యాకెట్లు బస్తాల కొద్దీ తెప్పించారు. అవసరానికి మించి కొనడం, వాటిని సరిగా పంపిణీ చేయకపోవడంతో లక్షలాది ప్యాకెట్లు మిగిలిపోయాయి. లాలా చెరువు ఎఫ్‌సీఐ గోదాముల్లో నిల్వ చేసిన ఈ ప్యాకెట్లను పుష్కరాలు ముగిన ఐదు రోజుల తర్వాత రోడ్డు రోలర్‌తో తొక్కించారు. తాత్కాలికం పేరుతో వృథాపుష్కరాలకు ప్రతి పని తాత్కాలిక పద్ధతిలో చేశారు. అద్దె ప్రాతిపదికన ప్రతి ఘాట్ వద్ద మొబైల్ టాయిలెట్స్ ఏర్పాటు చేశారు. 12 రోజుల పాటు వాటికి చెల్లించిన అద్దెతో కొత్తవి కొనుగోలు చేయవచ్చని అధికారులే వ్యాఖ్యానించడం గమనార్హం. -
అసెంబ్లీ సాగక కోటిన్నర వృథా
సాక్షి, హైదరాబాద్: శాసనసభ సమావేశాల ఒకరోజు నిర్వహణ ఖర్చు అక్షరాలా రూ.30 లక్షలు. అదీ.. రోజూ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ జరిగి.. వాయిదా పడినపుడే. ఆ గడువునే సభకు ఒక రోజుగా పరిగణిస్తారు. ఒకరోజులో సభ జరిగేది సగటున అయిదు గంటలే. ఈ లెక్కన శాసనసభ సమావేశాల ఖర్చు నిమిషానికి రూ. 10 వేలు. ఈ నెల 12 నుంచి 19 వరకూ తొలివిడత సమావేశాల ఖర్చు అక్షరాలా కోటీ 80 లక్షల రూపాయలు. తొలి విడత ఆరు రోజులూ రోజూ సగటున ఐదు గంటల చొప్పున సభ జరగాల్సి ఉంది. తొలిరోజు మండేలాకు సంతాపం తెలిపి సభ వాయిదా పడింది. మిగిలిన 5 రోజుల సభ వ్యవధి పూర్తిగా వృధా అయినట్టు రికార్డులు చెబుతున్నాయి. సంతాప తీర్మానంపై సభ గంటా 51 నిమిషాలు జరిగింది. మిగిలిన 5 రోజులు గందరగోళంతో వాయిదా పడడంతో గంటకు రూ. 30 లక్షల చొప్పున మొత్తం రూ. కోటిన్నర ప్రజాధనం వృధా అయినట్టేనని అసెంబ్లీ వర్గాలు అంచనా వేశాయి.