Public pravidend Fund
-
రిస్క్‌లేని పెట్టుబడి సాధనమేది...?
మా అమ్మగారు సీనియర్ సిటిజన్. ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయడం ఆమెకు ఇష్టం లేదు. 10-15 ఏళ్లపాటు పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారు. పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్(పీపీఎఫ్)లో ఇన్వెస్ట్ చేయమంటారా? లేక ఆల్ట్రా షార్ట్‌టర్మ్, షార్ట్ టర్మ్ డెట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయమంటారా? దేంట్లో ఇన్వెస్ట్ చేస్తే పన్ను ప్రయోజనాలు అధికంగా లభిస్తాయి. - రాధాకృష్ణ, నెల్లూరు పన్ను ప్రయోజనాలతో పాటు సురక్షితమైన రాబడులు కావాలంటే డెట్ మ్యూచువల్ ఫండ్స్ కంటే పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్(పీపీఎఫ్) ఉత్తమమైన ఇన్వెస్ట్మెంట్ మార్గమని చెప్పవచ్చు. పీపీఎఫ్ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై వచ్చే రాబడులపై ఎలాంటి పన్నులు ఉండవు. అయితే పీపీఎఫ్‌లో ఇన్వెస్ట్ చేస్తే 15 సంవత్సరాల లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది. దీనిపై వచ్చే రాబడులు ప్రభుత్వ సెక్యూరిటీలపై వచ్చే రాబడుల కన్నా కొంచెమే అధికంగా ఉంటాయి. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు సొమ్ములను వెనక్కితీసుకోవాలి అనుకుంటే డెట్ ఫండ్స్ ఉత్తమం. ఈ డెట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసిన మూడేళ్లలోపే ఈ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను వెనక్కి తీసుకుంటే స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. మీ అమ్మగారి ఆదాయపు పన్ను స్లాబ్‌ననుసరించి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఒక వేళ మూడేళ్ల త ర్వాత ఈ డెట్ ఫండ్స్ నుంచి మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఉపసంహరించుకుంటే దీర్ఘకాల మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇది ఇండెక్సేషన్ ప్రయోజనాలతో కలిపి 20 శాతంగా ఉంటుంది. ఈక్విటీ మార్కెట్లో లాగానే డెట్ మార్కెట్లో కూడా వివిధ బాండ్ల ధరలు ఒడిదుడుకులకు లోనవుతుంటాయి. అందుకని డెట్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్స్ రాబడులు, ఏడాది ఏడాదికి మారుతూ ఉంటాయి. ఇప్పుడు పీపీఎఫ్ వడ్డీరేట్లు కూడా ప్రతి మూడు నెలలకొకసారి మారుతూ ఉన్నాయి. మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై ఎలాంటి రిస్క్ వద్దనుకుంటే, పీపీఎఫ్‌లో ఇన్వెస్ట్ చేయండి. ఇది సురక్షితమైన పెట్టుబడి సాధనం. ప్రభుత్వ దన్నుతో ఇది నడుస్తుండడమే దీనికి కారణం. నేను భారత పౌరసత్వం వదులుకొని జర్మనీ పౌరసత్వం తీసుకోవాలనుకుంటున్నాను. ఓవర్సీస్ సిటిజెన్స్ ఆఫ్ ఇండియా (ఓసీఐ) కార్డ్‌కు దరఖాస్తు చేయాలనుకుంటున్నాను. అయితే నాకు కొన్ని మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) విధానంలో కూడా కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. భారత పౌరసత్వం వదులుకొని జర్మనీ పౌరసత్వం తీసుకోవడం వల్ల ఈ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై ఏమైనా ప్రభావం ఉంటుందా? - మార్గరెట్, హైదరాబాద్ ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా(ఓసీఐ), నాన్ రెసిడెంట్ ఇండియన్(ఎన్నారై)తో దాదాపు సమానం. ఆర్థిక, విద్య తదితర రంగాల్లో ఈ హోదాలు ఉన్నవారికి ఒకే విధమైన హక్కులు లభిస్తాయి. ఒక్క వ్యవసాయ, ప్లాంటేషన్ ఆస్తుల కొనుగోళ్లలో మాత్రమే తేడా ఉంటుంది. మీరు మీ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను నిరభ్యంతరంగా కొనసాగించవచ్చు, అయితే మీ పౌరసత్వంలో మార్పులు, చేర్పులు గురించి మీ బ్యాంక్‌కు, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు సమాచారమందించడం తప్పనిసరనే విషయాన్ని మాత్రం మరచిపోకండి. నా వయస్సు 34 సంవత్సరాలు. నా కోసం ఎల్ఐసీ న్యూ ఎండోమెంట్ ప్లాన్, నా నాలుగేళ్ల కూతురి కోసం జీవన్ అంకుర్ పాలసీలను తీసుకున్నాను. రెండింటి మెచ్యురిటీ కాలం 20 ఏళ్లు. ఈ రెండింటి వార్షిక ప్రీమియమ్ రూ.59,000. ఇప్పటికి మూడేళ్ల ప్రీమియమ్‌లు చెల్లించాను. దీర్ఘకాల రాబడులకు ఇవి సరైనవి కావని మిత్రులంటున్నారు. ఈ పాలసీల నుంచి బయటపడే మార్గం చెప్పండి. - సందేశ్, వైజాగ్ ఎల్ఐసీ న్యూ ఎండోమెంట్ ప్లాన్‌కు సంబంధించి గ్యారంటీడ్ సరెండర్ వేల్యూ--మీరు చెల్లించిన మొత్తం ప్రీమియమ్‌లలో ఒక ప్రత్యేకమైన శాతంగా ఉంటుంది. అదనపు ప్రీమియమ్, రైడర్లకు చెల్లించిన ప్రీమియమ్లకు మినహాయింపు ఉంటుంది. మీరు తీసుకున్న పాలసీ కాల వ్యవధి, మీరు ఈ పాలసీని ఎప్పుడు సరెండర్ చేస్తారు అన్న విషయాలపై ఈ పర్సంటేజ్ ఆధారపడి ఉంటుంది. ఇక ఎల్ఐసీ జీవన్ అంకుర్ అనేది లాభాలతో కూడిన సంప్రదాయ ప్లాన్. ఈ ప్లాన్‌లో రిస్క్ కవర్ తండ్రి/తల్లిపై ఉంటుంది. ఈ ప్లాన్‌లో కూతురు నామినీగా ఉంటుంది. ఈ పాలసీ తీసుకొని మూడేళ్లైతేనే/ లేదా మూడు పూర్తి ప్రీమియమ్‌లు చెల్లిస్తేనే మీరు ఈ పాలసీని సరెండర్ చేయగల అవకాశముంటుంది. దీనికి సరెండర్ వేల్యూ- మీరు చెల్లించిన ప్రీమియమ్‌ల్లో 30 శాతం(మొదటి ఏడాది ప్రీమియమ్, ఆప్షనల్ రైడర్, అదనపు ప్రీమియమ్‌లను మినహాయించి)గా ఉంటుంది. మీకు నష్టాలు వచ్చినా సరే, ఈ పాలసీలను సరెండర్ చేయడమే సముచితమని భావిస్తున్నాం. ఇలాంటి బీమా, ఇన్వెస్ట్మెంట్ కలగలసిన ప్లాన్లు స్వల్ప మొత్తానికే బీమా కవర్‌ను ఇస్తాయి. అంతంత రాబడులు మాత్రమే వస్తాయి. ఇన్వెస్ట్మెంట్ కోసం ఇన్సూరెన్స్ ప్లాన్‌ను ఎంచుకోవడం సరైనది కాదు. ఇలా చేస్తే బీమా కవర్, రాబడుల్లో రాజీ పడాల్సి ఉంటుంది. జీవిత బీమా కోసమైతే టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకోవాలి. తక్కువ ప్రీమియమ్‌లు, అధిక రాబడులు వీటి ప్రత్యేకత. ఇక పాప చదువు, ఇంటి కొనుగోలు వంటి దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల కోసమైతే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలి. నేను ఒక మ్యూచువల్ ఫండ్ ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్(ఈఎల్ఎస్ఎస్) రెగ్యులర్ ప్లాన్‌లో రెండేళ్ల నుంచి ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇదే మ్యూచువల్ ఫండ్ ఈఎల్ఎస్ఎస్ స్కీమ్‌కు సంబంధించిన డెరైక్ట్ ప్లాన్‌కు మారాలనుకుంటున్నాను. అలా మారే వీలుందా? అవసరమైతే ఏమైనా పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుందా ? - అబ్దుల్లా, వరంగల్ ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్స్(ఈఎల్ఎస్ఎస్) లేదా ట్యాక్స్ సేవింగ్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌లకు తప్పనిసరిగా మూడేళ్ల లాక్-ఇన్ పీరియడ్ ఉంటుంది. ఈ లాక్ ఇన్ పీరియడ్ పూర్తయిన తర్వాతనే మీరు రెగ్యులర్ ప్లాన్ నుంచి డెరైక్ట్ ప్లాన్‌కు మారాల్సి ఉంటుంది. అంతకంటే ముందుగానే మారడానికి వీలు లేదు. జరిమానా చెల్లించి మారే వీలు ఏమీ లేదు. - ధీరేంద్ర కుమార్ సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
బీమా టర్మ్ ప్లాన్ ఎంపిక ఎలా?
నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ)లో ఒక పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్(పీపీఎఫ్) ను 1985లో ప్రారంభించాను. ఈ ఖాతా మెచ్యూర్ అయినప్పటికీ, గత ఆర్థిక సంవత్సరం చివరి వరకూ ఈ ఖాతాలో ఇన్వెస్ట్ చేస్తూ వచ్చాను. ఇప్పుడు నేను ఈ ఖాతాను క్లోజ్ చేసి. నా ఇన్వెస్ట్మెంట్స్ అన్నింటీని తీసేసుకోవచ్చా? - పారిజాత, హైదరాబాద్ ప్రజా భవిష్య నిధి(పీపీఎఫ్) ఖాతా 15 ఆర్థిక సంవత్సరాలు పూర్తయిన తర్వాత మెచ్యూర్ అవుతుంది. ఈ ఖాతా మెచ్యూర్ అయిన తర్వాత ఐదేళ్ల పాటు పొడిగించుకోవచ్చు. ఇలా ఎన్ని సార్లైనా చేసుకోవచ్చు. మీరు 1985లో ఖాతా ప్రారంభించారు కాబట్టి, మీ ఖాతా 2001లో మెచ్యూర్ అవుతుంది. మూడుసార్లు పొడిగించిన పిదప మీ ఖాతా 2016 మే తర్వాత మెచ్యూర్ అవుతుంది. మరో ఐదేళ్లు పొడిగించుకోవాలనుకుంటే పొడిగించుకోవచ్చు. లేదా ఈ ఖాతాలో ఇప్పటి వరకూ జమ చేసిన మొత్తాన్ని విత్‌డ్రా చేసుకొని మీ ఆర్థిక అవసరాలకు వినియోగించుకోండి. ఈ ఆర్థిక సంవత్సరం నుంచి ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్(ఈఎల్ఎస్ఎస్)ల్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. మంచి పనితీరు కనబరుస్తున్న ఈఎల్ఎస్ఎ్స్ ఫండ్స్‌ను సూచించండి. ఈ ఫండ్స్ లాక్-ఇన్-పీరియడ్ పూర్తయిన తర్వాత ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కొనసాగించమంటారా ? లేకుంటే వేరే కొత్త ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయమంటారా? - నిరంజన్, కరీంనగర్ ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్(ఈఎల్ఎస్ఎస్)లో లేదా పన్ను ఆదా మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే, ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80 సీ ప్రకారం ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షల వరకూ పన్ను తగ్గింపులు పొందవచ్చు. ఈఎల్ఎస్ఎస్లకు లాక్-ఇన్ పీరియడ్ మూడేళ్లుగా ఉంటుంది. లాక్-ఇన్-పీరియడ్ పూర్తయిన తర్వాత ఈఎల్ఎస్ఎస్ యూనిట్లను విక్రయించాల్సిన అవసరం లేదు. ఈ ఫండ్స్ మంచి పనితీరు కనబరుస్తున్నంత కాలం మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఈ ఫండ్స్‌లో కొనసాగించవచ్చు. మీరు ఇన్వెస్ట్ చేయడానికి... యాక్సిస్ లాంగ్‌టర్మ్ ఈక్విటీ ఫండ్, బిర్లా సన్‌లైఫ్ ట్యాక్స్ప్లాన్-డెరైక్ట్ ప్లాన్, బీఎన్పీ పారిబా లాంగ్‌టర్మ్ ఈక్విటీ, ఫ్రాంక్లిన్ ఇండియా ట్యాక్స్ షీల్డ్ ఫండ్-డెరైక్ట్ ప్లాన్, రెలిగేర్ ఇన్వెస్కో ట్యాక్స్ ప్లాన్-డెరైక్ట్ ప్లాన్ వంటి ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్‌ను పరిశీలించవచ్చు. నేనొక ప్రభుత్వ ఉద్యోగిని. నా వయస్సు 27 సంవత్సరాలు. నేను ఒక టర్మ్ ప్లాన్‌ను తీసుకోవాలనుకుంటున్నాను. సరైన టర్మ్ ప్లాన్‌ను ఎలా ఎంచుకోవాలి? - జాన్సన్, గుంటూరు బీమా కంపెనీ క్లయిమ్ సెటిల్మెంట్ నిష్పత్తిని పరిగణనలోకి తీసుకొని టర్మ్ ప్లాన్లను ఎంచుకోవాలి. చెల్లించాల్సిన ప్రీమియమ్‌లను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఈ రెండు అంశాలు ఆధారంగా మీకు కొన్ని టర్మ్ పాలసీలను సూచిస్తున్నాం. ఏగాన్ రెలిగేర్ ఐటర్మ్ ప్లాన్, హెచ్డీఎఫ్సీ లైఫ్ క్లిక్2ప్రొటెక్ట్, మ్యాక్స్ లైఫ్ ఆన్లైన్ టర్మ్ ప్లాన్, అవైవా ఐ-లైఫ్ టర్మ్ ప్లాన్.. ఈ సంస్థలన్నీ ఆన్లైన్ టర్మ్ ప్లాన్లను ఆఫర్ చేస్తున్నాయి. మామూలు బీమా పాలసీలతో పోల్చితే ఆన్లైన్ టర్మ్ పాలసీల ప్రీమియమ్‌లు 30 శాతం నుంచి 50 శాతం వరకూ తక్కువగా ఉంటుంది. ఈ పాలసీలకు మీ వయస్సును బట్టి ఎంత ప్రీమియమ్ చెల్లించాలో లెక్కేసి, మీ బడ్జెట్‌కు అనుగుణంగా తగిన పాలసీని ఎంచుకోండి. మీపై ఆర్థికంగా ఆధారపడి ఉన్న వారి అవసరాలను దృష్టిలో ఉంచుకొని తగిన జీవిత బీమా కవర్‌ను తీసుకోవాలి. ఒక బండ సూత్రం ఏమిటంటే, మీ పదేళ్ల ఆదాయానికి సమానమైన బీమా కవర్‌ను తీసుకోవడం. దీంతో పాటు కొన్ని అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. మీకు సొంత ఇల్లు ఉందా? లేక మరేదైనా ఆస్తులున్నాయా? అప్పులేమైనా ఉన్నాయా? మీ జీవిత భాగస్వామి, లేదా మీ కుటుంబంలో మరెవరైనా ఆదాయాన్ని ఆర్జిస్తున్నారా? పిల్లల విద్యావసరాలు తదితర అంశాలన్నింటీని పరిగణనలోకి తీసుకోవాలి. సింపుల్‌గా చెప్పాలంటే మీరు లేనప్పుడు మీ కుటుంబం ఆర్థిక అవసరాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేలా బీమా కవర్ తీసుకోవాలి. ఇక ప్రపోజల్ ఫార్మ్ నింపేటప్పుడు అన్ని వివరాలు సవివరంగా వెల్లడిస్తే, క్లెయిమ్ చేసుకునేటప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. నాకు ఇటీవలనే పెళ్లయింది. నెలకు రూ.5,000 చొప్పున సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) విధానంలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. పన్ను ప్రయోజనాలతో పాటు 10 శాతం రాబడులు ఆశిస్తున్నాను. నా బిడ్డ చదువు కోసం వీటిని వినియోగించుకోవాలనుకుంటున్నాను. తగిన సూచనలివ్వండి. - మహ్మద్ జాఫర్, విశాఖపట్టణం పన్ను ఆదాతో పాటు రెండంకెల రాబడి కావాలనుకుంటే ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్స్(ఈఎల్ఎస్ఎస్)లో ఇన్వెస్ట్ చేయాలి. మరే ఇతర సాధనాల్లో చేసే ఇన్వెస్ట్మెంట్స్ కన్నా వీటిపైననే అధిక రాబడులు వస్తాయి. అయితే వీటిల్లో దీర్ఘకాలం పాటు(కనీసం ఐదేళ్ల నుంచి ఏడేళ్ల వరకూ) ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ స్థాయిలో రాబడులు వస్తాయనే ఈ స్కీమ్‌లు గ్యారంటీనివ్వవు. రిస్క్ తీసుకోవడం ఇష్టం లేకపోతే, ఐదేళ్ల ట్యాక్స్ సేవింగ్ ఫిక్స్డ్ డిపాజిట్, పీపీఎఫ్, తదితర సాధనాల్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. మీరు దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు కాబట్టి ట్యాక్స్ సేవింగ్ స్కీమ్స్‌లో ఇన్వెస్ట్ చేయండి. వీటికి లాక్ ఇన్ పీరియడ్ మూడేళ్లుగా ఉంటుంది. కనీసం ఐదేళ్ల పాటు ఇన్వెస్ట్ చేయగలిగితేనే వీటిని ఎంచుకోండి. - ధీరేంద్ర కుమార్ సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
సుకన్య సమృద్ధి స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చా?
ఇటీవల బడ్జెట్లో సుకన్య సమృద్ధి పేరుతో ఒక స్కీమ్‌ను ప్రతిపాదించారు. నాకు ఒక 9 సంవత్సరాల కూతురు ఉంది. ఆమె కోసం ఈ స్కీమ్‌లో ఏడాదికి రూ. లక్షన్నర చొప్పున ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. ఇలా ఆమెకు 21 సంవత్సరాలు వచ్చే వరకూ పెట్టుబడులు పెడదామనుకుంటున్నాను. ఇది సరైన నిర్ణయమేనా? - ఉదయిని, విజయవాడ ఫైనాన్సియల్ మార్కెట్లతో పెద్దగా పరిచయం లేని వారికి ఈ సుకన్య సమృద్ధి స్కీమ్ మంచిదేనని చెప్పవచ్చు. ఈ స్కీమ్ పిల్లలకు పీపీఎఫ్ (పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్) స్కీమ్ లాంటిది. ఈ స్కీమ్ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై 9.1 శాతం రాబడి వస్తుంది. పైగా రాబడులపై ఎలాంటి పన్ను ఉండదు. మీరు మరో ఆప్షన్ కూడా ఎంచుకోవొచ్చు. స్టాక్ మార్కెట్ అంటే చాలా రిస్క్ అనే అపోహ చాలా మందిలో ఉంది. కానీ స్టాక్ మార్కెట్ ద్వారా మంచి రాబడులు పొందవచ్చు. క్రమం తప్పకుండా ఐదేళ్ల పాటు షేర్లలో ఇన్వెస్ట్ చేస్తే ఎలాంటి అధ్వాన పరిస్థితుల్లోనూ ఫిక్స్డ్ డిపాజిట్ల కంటే కూడా కనీసం ఒకటిన్నర రెట్లు అధిక ఆదాయం ఆర్జించవచ్చు. చాలా మంది స్వల్పకాలిక రాబడుల గురించే పట్టించుకుంటారు కాబట్టి ఈక్విటీ మార్కెట్ ఏమంత ఆకర్షణీయంగా వారికి కనిపించదు. ఒకేసారి పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేస్తారు. వాళ్లు ఇన్వెస్ట్ చేసిన షేర్లు తగ్గితే డీలా పడిపోతారు. అందుకే స్టాక్ మార్కెట్ అంటేనే రిస్క్ అని భావిస్తారు. ఇక మీ విషయాని కొస్తే, మీరు మీ పాప కోసం 12 ఏళ్లపాటు క్రమం తప్పకుండా ఏడాదికి రూ. లక్షన్నర ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు కాబట్టి ఏదైనా మంచి మల్టీ క్యాప్ ఫండ్‌ను ఎంచుకోండి. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) విధానంలో ఇన్వెస్ట్ చేయండి. ప్రతీ ఏడాదికొకసారి మీ రాబడులను, మార్కెట్ పరిస్థితులను సమీక్షించి తదనుగుణంగా నిర్ణయాలు తీసుకోండి. ఇలా చేస్తే మీకు మంచి రాబడులు వస్తాయి. నేనొక లిక్విడ్ మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేశాను. గ్రోత్ ఆప్షన్ తీసుకున్నాను. ఎలాంటి పన్నులు చెల్లించాల్సి ఉంటుంది? ఒక వేళ డివిడెండ్ రీ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ తీసుకుంటే అప్పుడు ఎలాంటి పన్నులు చెల్లించాల్సి ఉంటుంది ? - రవికాంత్. కరీంనగర్ లిక్విడ్ ఫండ్ గ్రోత్ ఆప్షన్ ద్వారా ఆర్జించిన రాబడులను స్వల్పకాల మూలధన లాభాలుగా పరిగణిస్తారు. అందుకే ఈ రాబడులపై స్వల్పకాల మూలధన లాభాల పన్ను విధిస్తారు. మీ ట్యాక్స్ స్లాబ్‌ననుసరించి ఈ రాబడులపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ డివిడెండ్ రీ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ తీసుకుంటే ఎలాంటి స్వల్పకాల మూలధన లాభాల పన్ను చెల్లించాల్సిన పని లేదు. కానీ డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్(డీడీటీ)28.33% చెల్లించాల్సి ఉంటుంది. ఇది మ్యూచువల్ ఫండ్ సంస్థే చెల్లిస్తుంది. మీకు వచ్చిన రాబడుల నుంచే డీడీటీనీ సదరు సంస్థ చెల్లిస్తుంది. లిక్విడ్ ఫండ్ డివిడెండ్ ఆప్షన్లో రెండు రకాలున్నాయి. ఒకటి డివిడెండ్ పే అవుట్, మరొకటి డివిడెండ్ రీ ఇన్వెస్ట్మెంట్. డివిడెండ్ పే అవుట్ ఆప్షన్లో వచ్చిన డివిడెండ్‌ను ఎప్పటికప్పుడు ఫండ్ సంస్థ ఇన్వెస్టర్‌కు చెల్లిస్తుంది. అందుకని ఇన్వెస్టర్ల దగ్గరున్న యూనిట్లు పెరగవు. ఇక డివిడెండ్ రీ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్లో డివిడెండ్‌ను అదే స్కీమ్‌లో మళ్లీ ఇన్వెస్ట్ చేస్తారు. దీంతో యూనిట్ల సంఖ్య పెరుగుతుంది. ఇక బోనస్ విషయానికొస్తే బోనస్ యూనిట్ల ద్వారా పొందిన లాభాలను స్వల్పకాల మూలధన లాభాలుగా పరిగణిస్తారు. ఈ రాబడులను ఇన్వెస్టర్ ట్యాక్స్ స్లాబ్‌ననుసరించి పన్ను విధిస్తారు. ఇలా పొందిన స్వల్పకాల మూలధన లాభాలను స్వల్పకాల మూలధన నష్టాలతో రద్దు చేసుకునే వీలు కూడా ఉంది. నేనొక యూనిట్ లింక్డ్ ప్లాన్‌లో గత మూడు నెలల నుంచి ఇన్వెస్ట్ చేస్తున్నాను. పన్ను ప్రయోజనాల కోసమే ఈ ప్లాన్‌ను ఎంచుకున్నాను. పన్ను ప్రయోజనాలతో పాటు బీమా కవర్ కూడా వస్తుందంటూ ఒక ఏజెంట్ చెప్పడంతో ఈ ప్లాన్‌లో ఇన్వెస్ట్ చేశాను. అయితే సదరు ప్లాన్‌పై ఆన్లైన్లో ప్రతికూలమైన సమీక్షలు అధికంగా చూశాను. ఈ ప్లాన్‌లో కొనసాగమంటారా? వైదొలగమంటారా? - జార్జ్, గుంటూరు సాధారణంగా యూనిట్ లింక్డ్ స్కీమ్‌లన్నీ ఖరీదైనవేనని చెప్పవచ్చు. మీరు ఇప్పటిదాకా నెలకు రూ.5,000 చొప్పున మూడు నెలల పాటు రూ.15,000 ప్రీమియం మాత్రమే చెల్లించారు. ఈ దృష్ట్యా చూస్తే ప్రీమియమ్‌లు చెల్లించడం ఆపేయండి. దీనికి బదులుగా ఏదైనా మంచి మ్యూచువల్ ఫండ్‌ను ఎంచుకొని దాంట్లో ఇన్వెస్ట్ చేయండి. అయితే ఇన్వెస్ట్మెంట్ సంబంధిత నిర్ణయాలు తీసుకోవడానికి ఆన్లైన్ అభిప్రాయాలే ప్రామాణికం కాదు. అయితే యూలిప్‌ల్లో ఇన్వెస్ట్మెంట్స్ సరైనవి కావనే మేం చెప్తుంటాం. బీమాను, పెట్టుబడులను ఎప్పుడూ మిక్స్ చేయకూడదు. బీమాకైతే టెర్మ్ ఇన్సూరెన్స్.. ఇన్వెస్ట్మెంట్స్కైతే మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలి. వ్యయాలు యూలిప్‌ల్లో ఎక్కువగానే ఉంటాయి. యూలిప్‌లకు ఐదేళ్ల లాకిన్ పీరియడ్ ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్లాగా వీటిల్లో పారదర్శకత ఉండదు. ఎన్ఏవీ, పోర్ట్‌ఫోలియోలు, ఫండ్ మేనేజర్ వ్యూహాలు, తదితర ఏ అంశాలపై కూడా యూలిప్స్ ఎలాంటి పారదర్శకతను పాటించవు. ఈ విషయాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే యూలిప్‌ల కంటే మ్యూచువల్ ఫండ్స్ ఉత్తమమని చెప్పవచ్చు. ఏదైనా మంచి బ్యాలెన్స్డ్, లేదా ఈక్విటీ ఫండ్‌ను ఎంచుకొని, దాంట్లో సిప్ విధానంలో ఇన్వెస్ట్ చేయండి.