సుకన్య సమృద్ధి స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చా? | Sukanya Samriddhi Scheme the best investment | Sakshi
Sakshi News home page

సుకన్య సమృద్ధి స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చా?

Published Mon, Mar 30 2015 1:09 AM | Last Updated on Sat, Sep 2 2017 11:33 PM

సుకన్య సమృద్ధి స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చా?

సుకన్య సమృద్ధి స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చా?

 ఇటీవల బడ్జెట్‌లో సుకన్య సమృద్ధి పేరుతో ఒక స్కీమ్‌ను ప్రతిపాదించారు. నాకు ఒక 9 సంవత్సరాల కూతురు ఉంది. ఆమె కోసం ఈ స్కీమ్‌లో ఏడాదికి రూ. లక్షన్నర చొప్పున ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. ఇలా ఆమెకు 21 సంవత్సరాలు వచ్చే వరకూ పెట్టుబడులు పెడదామనుకుంటున్నాను. ఇది సరైన నిర్ణయమేనా?     - ఉదయిని, విజయవాడ
 
 ఫైనాన్సియల్ మార్కెట్లతో పెద్దగా పరిచయం లేని వారికి ఈ సుకన్య సమృద్ధి స్కీమ్ మంచిదేనని చెప్పవచ్చు. ఈ స్కీమ్ పిల్లలకు పీపీఎఫ్ (పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్) స్కీమ్ లాంటిది. ఈ స్కీమ్ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై 9.1 శాతం రాబడి వస్తుంది. పైగా రాబడులపై ఎలాంటి పన్ను ఉండదు. మీరు మరో ఆప్షన్ కూడా ఎంచుకోవొచ్చు. స్టాక్ మార్కెట్ అంటే చాలా రిస్క్ అనే అపోహ చాలా మందిలో ఉంది. కానీ స్టాక్ మార్కెట్ ద్వారా మంచి రాబడులు పొందవచ్చు. క్రమం తప్పకుండా ఐదేళ్ల పాటు షేర్లలో ఇన్వెస్ట్ చేస్తే ఎలాంటి అధ్వాన పరిస్థితుల్లోనూ ఫిక్స్‌డ్ డిపాజిట్ల కంటే కూడా కనీసం ఒకటిన్నర రెట్లు అధిక ఆదాయం ఆర్జించవచ్చు. చాలా మంది స్వల్పకాలిక రాబడుల గురించే పట్టించుకుంటారు కాబట్టి ఈక్విటీ మార్కెట్ ఏమంత ఆకర్షణీయంగా వారికి కనిపించదు. ఒకేసారి పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేస్తారు. వాళ్లు ఇన్వెస్ట్ చేసిన షేర్లు తగ్గితే డీలా పడిపోతారు. అందుకే స్టాక్ మార్కెట్ అంటేనే రిస్క్ అని భావిస్తారు. ఇక మీ విషయాని కొస్తే, మీరు మీ పాప కోసం 12 ఏళ్లపాటు క్రమం తప్పకుండా ఏడాదికి రూ. లక్షన్నర ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు కాబట్టి ఏదైనా మంచి మల్టీ క్యాప్ ఫండ్‌ను ఎంచుకోండి. సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్(సిప్) విధానంలో ఇన్వెస్ట్ చేయండి. ప్రతీ ఏడాదికొకసారి మీ రాబడులను, మార్కెట్ పరిస్థితులను సమీక్షించి తదనుగుణంగా నిర్ణయాలు తీసుకోండి. ఇలా చేస్తే మీకు మంచి రాబడులు వస్తాయి.
 
 నేనొక లిక్విడ్ మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేశాను. గ్రోత్ ఆప్షన్ తీసుకున్నాను. ఎలాంటి పన్నులు చెల్లించాల్సి ఉంటుంది? ఒక వేళ  డివిడెండ్ రీ ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్ తీసుకుంటే అప్పుడు ఎలాంటి పన్నులు చెల్లించాల్సి ఉంటుంది ?     - రవికాంత్. కరీంనగర్

 లిక్విడ్ ఫండ్ గ్రోత్ ఆప్షన్ ద్వారా ఆర్జించిన రాబడులను స్వల్పకాల మూలధన లాభాలుగా పరిగణిస్తారు. అందుకే ఈ రాబడులపై స్వల్పకాల మూలధన లాభాల పన్ను విధిస్తారు. మీ ట్యాక్స్ స్లాబ్‌ననుసరించి ఈ రాబడులపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ డివిడెండ్ రీ ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్ తీసుకుంటే ఎలాంటి స్వల్పకాల మూలధన లాభాల పన్ను చెల్లించాల్సిన పని లేదు. కానీ డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్(డీడీటీ)28.33% చెల్లించాల్సి ఉంటుంది. ఇది మ్యూచువల్ ఫండ్ సంస్థే చెల్లిస్తుంది. మీకు వచ్చిన రాబడుల నుంచే డీడీటీనీ సదరు సంస్థ చెల్లిస్తుంది. లిక్విడ్ ఫండ్ డివిడెండ్ ఆప్షన్‌లో రెండు రకాలున్నాయి. ఒకటి డివిడెండ్ పే అవుట్, మరొకటి డివిడెండ్ రీ ఇన్వెస్ట్‌మెంట్. డివిడెండ్ పే అవుట్ ఆప్షన్‌లో వచ్చిన డివిడెండ్‌ను ఎప్పటికప్పుడు  ఫండ్ సంస్థ ఇన్వెస్టర్‌కు చెల్లిస్తుంది. అందుకని ఇన్వెస్టర్ల దగ్గరున్న యూనిట్లు పెరగవు. ఇక డివిడెండ్ రీ ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్‌లో డివిడెండ్‌ను అదే స్కీమ్‌లో మళ్లీ ఇన్వెస్ట్ చేస్తారు. దీంతో యూనిట్ల సంఖ్య పెరుగుతుంది. ఇక బోనస్ విషయానికొస్తే బోనస్ యూనిట్ల ద్వారా పొందిన లాభాలను స్వల్పకాల మూలధన లాభాలుగా పరిగణిస్తారు. ఈ రాబడులను ఇన్వెస్టర్ ట్యాక్స్ స్లాబ్‌ననుసరించి పన్ను విధిస్తారు. ఇలా పొందిన స్వల్పకాల మూలధన లాభాలను స్వల్పకాల మూలధన నష్టాలతో రద్దు చేసుకునే వీలు కూడా ఉంది.
 
 నేనొక యూనిట్ లింక్డ్ ప్లాన్‌లో గత మూడు నెలల నుంచి ఇన్వెస్ట్ చేస్తున్నాను. పన్ను ప్రయోజనాల కోసమే ఈ ప్లాన్‌ను ఎంచుకున్నాను. పన్ను ప్రయోజనాలతో పాటు బీమా కవర్ కూడా వస్తుందంటూ ఒక ఏజెంట్ చెప్పడంతో ఈ ప్లాన్‌లో ఇన్వెస్ట్ చేశాను. అయితే సదరు ప్లాన్‌పై ఆన్‌లైన్‌లో ప్రతికూలమైన సమీక్షలు అధికంగా చూశాను. ఈ ప్లాన్‌లో కొనసాగమంటారా? వైదొలగమంటారా? - జార్జ్, గుంటూరు

 సాధారణంగా యూనిట్ లింక్డ్ స్కీమ్‌లన్నీ ఖరీదైనవేనని చెప్పవచ్చు. మీరు ఇప్పటిదాకా నెలకు రూ.5,000 చొప్పున మూడు నెలల పాటు రూ.15,000 ప్రీమియం మాత్రమే చెల్లించారు. ఈ దృష్ట్యా చూస్తే ప్రీమియమ్‌లు చెల్లించడం ఆపేయండి. దీనికి బదులుగా ఏదైనా మంచి మ్యూచువల్ ఫండ్‌ను ఎంచుకొని దాంట్లో ఇన్వెస్ట్ చేయండి. అయితే ఇన్వెస్ట్‌మెంట్ సంబంధిత నిర్ణయాలు తీసుకోవడానికి ఆన్‌లైన్ అభిప్రాయాలే ప్రామాణికం కాదు. అయితే యూలిప్‌ల్లో ఇన్వెస్ట్‌మెంట్స్ సరైనవి కావనే మేం చెప్తుంటాం. బీమాను, పెట్టుబడులను ఎప్పుడూ మిక్స్ చేయకూడదు. బీమాకైతే టెర్మ్ ఇన్సూరెన్స్.. ఇన్వెస్ట్‌మెంట్స్‌కైతే మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలి. వ్యయాలు యూలిప్‌ల్లో ఎక్కువగానే ఉంటాయి. యూలిప్‌లకు ఐదేళ్ల లాకిన్ పీరియడ్ ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్‌లాగా వీటిల్లో పారదర్శకత ఉండదు. ఎన్‌ఏవీ, పోర్ట్‌ఫోలియోలు, ఫండ్ మేనేజర్  వ్యూహాలు, తదితర ఏ అంశాలపై కూడా యూలిప్స్ ఎలాంటి పారదర్శకతను పాటించవు. ఈ విషయాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే యూలిప్‌ల కంటే మ్యూచువల్ ఫండ్స్  ఉత్తమమని చెప్పవచ్చు. ఏదైనా మంచి బ్యాలెన్స్‌డ్, లేదా ఈక్విటీ ఫండ్‌ను ఎంచుకొని, దాంట్లో సిప్ విధానంలో ఇన్వెస్ట్ చేయండి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement