public sector companies
-
షీలా కమిటీ సిఫార్సులే దిక్సూచి
సాక్షి, అమరావతి: రాష్ట్ర విభజన చట్టం షెడ్యూల్ 9లో పొందుపరచిన ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్ల మొత్తం ఆస్తులు, అప్పులను షీలా భిడే కమిటీ సిఫార్సుల మేరకు ఇరు రాష్ట్రాలూ విభజించుకుందామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర హోంశాఖ వద్ద ప్రతిపాదించింది. విభజన సమస్యల పరిష్కారంపై ఆంధ్రప్రదేశ్ అడుగు ముందుకు వేసినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం ఇందుకు విముఖత వ్యక్తం చేసింది. కేంద్ర హోంశాఖ మాత్రం ఏపీ ప్రతిపాదనల పట్ల సానుకూలత వ్యక్తం చేస్తూ న్యాయ శాఖ సలహా తీసుకోనున్నట్లు తెలిపింది. రాష్ట్ర విభజనకు సంబంధించి పెండింగ్ సమస్యల పరిష్కారంపై ఢిల్లీలో మంగళవారం కేంద్ర హోంశాఖ కార్యదర్శి అధ్యక్షతన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సీఎస్‌లతోపాటు వివిధ శాఖల ఉన్నతాధికారుల సమావేశం జరిగింది. ► షెడ్యూల్ 9లో పేర్కొన్న 90 ప్రభుత్వ రంగ సంస్ధలు, కార్పొరేషన్ల ఆస్తులు, అప్పులను ఇరు రాష్ట్రాలకు విభజిస్తూ షీలా భిడే నిపుణుల కమిటీ సిఫార్సులు చేసింది. అయితే 68 సంస్థలకు సంబంధించిన సిఫార్సులను తెలంగాణ ప్రభుత్వం, వీటిలో 53 సంస్ధల సిఫార్సులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇన్ని రోజులుగా అంగీకరిస్తూ వచ్చినా విభజన మాత్రం జరగలేదు. తాజాగా జరిగిన సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొత్తం 90 సంస్ధలకు సంబంధించి షీలా భిడే సిఫార్సులను యధాతథంగా అమలు చేయాలని కేంద్ర హోంశాఖను కోరింది. ఇందుకు తెలంగాణ ప్రభుత్వం విముఖత వ్యక్తం చేసింది. దీనిపై నిర్ణయం తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ కోరగా న్యాయ సలహా తీసుకుంటామని కేంద్ర హోంశాఖ కార్యదర్శి తెలిపారు. ► విభజన చట్టం షెడ్యూల్ 10లో పేర్కొన్న ఇన్స్టిట్యూట్స్ ఆస్తులు, అప్పుల పంపిణీకి సంబంధించి 2016లో కేంద్ర హోంశాఖ జారీ చేసిన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిమాండ్ చేసింది. పదో షెడ్యూల్లోని 142 ఇన్స్టిట్యూషన్ల ఆస్తులు, అప్పుల పంపిణీ జనాభా ప్రాతిపదికన జరగాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరుతూ వస్తోంది. అందుకు అనుగుణంగా ఒక సంస్థ విషయంలో సుప్రీం కోర్టు తీర్పు కూడా ఇచి్చంది. అయితే కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు సుప్రీం తీర్పునకు విరుద్ధంగా ఉన్నందున ఆ ఉత్తర్వులను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆంధ్రప్రదేశ్ డిమాండ్ చేసింది. దీనిపై సొలిసిటర్ జనరల్ అభిప్రాయాన్ని తీసుకోవాలని కేంద్ర హోంశాఖను కోరింది. ► ఢిల్లీలోని ఏపీ భవన్ ఆస్తులను ఇరు రాష్ట్రాలకు త్వరగా పంపిణీ చేయాలని ఏపీ ప్రభుత్వం కోరగా కేంద్ర హోంశాఖ కార్యదర్శి సానుకూలంగా స్పందించారు. విభజన చట్టం నిబంధనల మేరకు కేంద్రం ఉత్తర్వులు జారీ చేయాలని, జాప్యం చేయవద్దని ఏపీ ప్రభుత్వం కోరింది. సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్‌శర్మ, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్.రావత్, రాష్ట్ర పునర్విభజన ముఖ్యకార్యదర్శి ఎల్.ప్రేమచంద్రారెడ్డి ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వ్యయం భారీగా పెరుగుతోంది.. ► నూతన రాజధాని కోసం రూ.25 వేల కోట్ల వ్యయం అవుతుందని శివరామకృష్ణన్ కమిటీ నివేదికలో పేర్కొన్నారని, ఆ నివేదిక ఇచ్చి చాలా సంవత్సరాలైనందున వ్యయం భారీగా పెరుగుతుందని, ఆ మేరకు నిధులివ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిమాండ్ చేసింది. మీరిచ్చే రూ.2,500 కోట్లు ఏ మూలకూ సరిపోవని ఏపీ ప్రభుత్వం కేంద్ర హోంశాఖకు స్పష్టం చేసింది. ► నూతన రాజధానికి ర్యాపిడ్ రైల్ కనెక్టివిటీ ఏర్పాటును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రస్తావించగా వయబుల్ కాదని రైల్వే శాఖ పేర్కొంది. దీనిపై ఏపీ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టలేని కారణంగానే విభజన చట్టంలో చేర్చారని, వయబుల్ కాకపోయినప్పటికీ కేంద్రం చేపట్టాలని ఏపీ ప్రభుత్వం పేర్కొంది. ఏపీ వాదనతో కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఏకీభవిస్తూ సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని రైల్వే శాఖకు సూచించారు. -
జాతీయ ఆదాయంలో 20%.. వేతనాల్లో 40%
ముంబై: భారత్ మొత్తం జాతీయ ఆదాయంలో ప్రభుత్వ రంగ సంస్థల (పీఎస్‌యూ) వాటా 20 శాతం అయితే, మొత్తం వేతనాల్లో వాటా 40 శాతంగా ఉందని ఇండియా రేటింగ్స్ అండ్ రిసెర్చ్ (ఇండ్–రా) తన నివేదికలో పేర్కొంది. ఇక ప్రైవేటు రంగం విషయంలో ఈ రేట్లు ‘దాదాపు సమతౌల్యంగా’ వరుసగా 36.3 శాతం, 35.2 శాతాలుగా ఉన్నాయని నివేదిక వెల్లడించింది. ఉత్పత్తి స్థాయి వరకూ పరిశీలనలోకి తీసుకునే జీవీఏ (గ్రాస్ వ్యాల్యూ యాడెడ్)కు సంబంధించి 2020–21కి ముందు గడచిన పదేళ్ల కాలంలో జాతీయ గణాంకాల కార్యాలయం విడుదల చేసిన గణాంకాల ప్రాతిపదికన ఈ విశ్లేషణ చేసినట్లు ఇండియా రేటింగ్స్ తెలిపింది. ఆర్థిక వ్యవస్థలో పలు రంగాలకు సంబంధించి ప్రభుత్వం పాత్రను తగ్గించాలని ఒత్తిడి చేస్తూ, ప్రభుత్వ రంగంలోని సమర్థత లోపాన్ని తరచుగా ఎత్తి చూపే విమర్శకులకు తాజా నివేదిక మద్దతునిస్తోంది. నివేదిక ప్రకారం, 2011–2021 మధ్య వేతనాల సగటు వార్షిక వృద్ధి రేటు (సీఏజీఆర్) 10.4 శాతంగా ఉంటే, మూలధనంపై రాబడి 8.8 శాతం వృద్ధిని (సీఏజీఆర్) నమోదుచేసుకుంది. -
మూడేళ్లలో 30% మార్కెట్ గోవిందా!
ముంబై: కరోనా మహమ్మారి చూపిన ప్రభావంతో మోటారు బీమా వ్యాపారం గతేడాది కుదేలై తిరిగి కోలుకుంటుండగా.. మరోవైపు ప్రభుత్వరంగ సాధారణ బీమా కంపెనీలు మాత్రం పోటీనివ్వలేకపోతున్నాయి. క్రమక్రమంగా మార్కెట్ వాటాను ప్రైవేటు సంస్థలకు కోల్పోతున్నాయి. మోటారు బీమా మార్కెట్లో ఏడాది క్రితం ప్రభుత్వ సాధారణ బీమా సంస్థలకు 36.6 శాతం వాటా ఉంటే, ఈ ఏడాది ఆగస్ట్ నాటికి 32.6 శాతానికి తగ్గిపోయింది. ఇదే కాలంలో ప్రైవేటు రంగ సాధారణ బీమా కంపెనీలు తమ వాటాను 63.4 శాతం నుంచి 67.4 శాతానికి పెంచుకున్నాయి. కానీ, 2017–18 ఆర్థిక సంవత్సరం నుంచి చూస్తే ప్రభుత్వరంగ సాధారణ బీమా సంస్థలు 13.9 శాతం (30 శాతం క్షీణత) మార్కెట్ వాటాను మూడేళ్ల కాలంలో కోల్పోయినట్టు తెలుస్తోంది. 2018 మార్చి నాటికి మొత్తమ మోటార్ బీమా విభాగంలో ప్రభుత్వరంగ సంస్థలకు 46.5శాతం వాటా ఉంటే, ప్రైవేటు సంస్థల చేతుల్లో 53.5 శాతం వాటా ఉండేది. 2019 మార్చి నాటికి ప్రభుత్వరంగ సాధారణ బీమా సంస్థల వాటా 40.7 శాతానికి తగ్గిపోయి, ప్రైవేటు బీమా కంపెనీల వాటా 59.3 శాతానికి పెరిగింది. 2020 మార్చి నాటికి ప్రభుత్వరంగ బీమా సంస్థల వాటా 34.2 శాతానికి పడిపోయింది. ఈ ఏడాది ఆగస్ట్ నాటికి ఈ వాటా 32.6 శాతానికి దిగిపోవడం గమనార్హం. విడిగా చూస్తే.. మోటార్ ఓడీ (ఓన్ డ్యామేజ్/వాహనదారుకు వాటిల్లేనష్టం) విభాగంలో 2018 మార్చి నాటికి ప్రభుత్వరంగ సాధారణ బీమా సంస్థలు 37.5 శాతం వాటా, ప్రైవేటు బీమా సంస్థలు 62.5 శాతం వాటా చొప్పున కలిగి ఉన్నాయి. కానీ, 2021కు వచ్చే సరికి ప్రభుత్వరంగ కంపెనీల వాటా 25.5 శాతానికి పరిమితమైతే.. ప్రైవేటు కంపెనీల వాటా 74.5 శాతానికి పుంజుకున్నది. థర్డ్ పార్టీ (వాహనదారు కాకుండా ఎదుటి వారికి కలిగే నష్టం) మోటారు బీమాలో ప్రభుత్వరంగ సంస్థలకు 2018 మార్చి నాటికి 52.7 శాతం ఉంటే, అది తాజాగా 39.7 శాతానికి తగ్గిపోయింది. ఇదే కాలంలో ప్రైవేటు బీమా కంపెనీల వాటా 46.3 శాతం నుంచి 60.3 శాతానికి పుంజుకున్నది. శాఖలను క్రమబద్ధీకరించుకోండి ► ఖర్చులు తగ్గించుకోండి ► పీఎస్‌యూ సాధారణ బీమా కంపెనీలకు సూచనలు ఆర్థిక పనితీరు మెరుగుపడేందుకు వీలుగా ప్రభుత్వరంగ సాధారణ బీమా కంపెనీలకు కేంద్ర ఆర్థిక శాఖ పలు సూచనలు చేసింది. శాఖలను క్రమబదీ్ధకరించుకోవాలని, అనవసర వ్యయాలను నియంత్రించుకోవాలని కోరింది. ప్రభుత్వరంగంలో నాలుగు సాధారణ బీమా కంపెనీలు పనిచేస్తుండగా.. వీటిల్లో న్యూ ఇండియా అష్యూరెన్స్ ఒక్కటే లాభాలతో నడుస్తోంది. నేషనల్ ఇన్సూరెన్స్, ఓరియంటల్ ఇన్సూరెన్స్, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ నష్టాలతో కొనసాగుతున్నాయి. వీటి ప్రైవేటీకరణకు ఉద్దేశించిన బిల్లు ఇప్పటికే పార్లమెంటు ఆమోదం పొందడం గమనార్హం. తక్కువ వ్యయాలతో కూడిన డిజిటల్ మాధ్యమంలో వ్యాపారాన్ని విస్తరించుకోవడంపై దృష్టి పెట్టాలని కూడా బీమా కంపెనీలను కోరినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. కాకపోతే దీనిపై ఉద్యోగుల సంఘం భిన్నంగా స్పందించింది. ‘‘ప్రభుత్వరంగ సాధారణ బీమా సంస్థలు ఎన్నో ప్రభుత్వ పథకాలను అమలు చేస్తున్నాయి. శాఖల క్రమబద్ధీకరణ అన్నది పేదలకు భారంగా మారకూడదు. ఎందుకంటే చిన్నపాటి క్లెయిమ్ కోసం ఎక్కువ దూరం ప్రయాణించాల్సి రావచ్చు. ఉదాహరణకు క్యాటిల్ ఇన్సూరెన్స్ లేదా ఫసల్ బీమా’’ అని జనరల్ ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ ఆల్ ఇండియా అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కే గోవిందన్ అన్నారు. ప్రతీ జిల్లాకు ఒక శాఖ కచి్చతంగా ఉండాలని అభిప్రాయపడ్డారు. తమ డిమాండ్లను యాజమాన్యాలకు తెలియజేసినట్టు చెప్పారు. 2021–22 బడ్జెట్లో ఒక సాధారణ బీమా కంపెనీ ప్రైవేటీకరణ ప్రతిపాదనను ఆర్థిక మంత్రి ప్రస్తావించడం తెలిసిందే. -
ప్రభుత్వరంగంపై ఇంత ఏవగింపా?
సంపద ఎక్కడ అపరిమి తంగా పోగు పడుతుందో అక్కడ అంతే తీవ్రంగా అస మానతలు పెరుగుతాయి. అది సామాజిక అశాంతిని సృష్టి స్తుంది. సరళీకరణ విధానాలు సంక్షేమ రాజ్య స్ఫూర్తిని బల హీన పరుస్తూ, సమాజంలోని కొద్దిమందికే ఉపయోగపడు తున్నాయని గత ముప్పయ్యేళ్ల ‘సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ’ కాలం నిరూపిస్తున్నది. జాతీయోద్యమ ప్రజల ఆకాంక్షల వెలుగులో తక్కువ సమయంలో ఆర్థిక వ్యవస్థ వేగం పెంచడానికి, ప్రజల పేదరికం తొలగిపోవడానికి ప్రభుత్వరంగ సంస్థలు ఏర్పాటైనాయి. ప్రజాస్వామ్య సోషలిస్టు వ్యవస్థ పరంగా ప్రపంచానికే ఒక శిక్షణాలయంగా మన దేశం మారాలని నెహ్రూ అనుకున్నారు. 1955లో యు.యన్. ఢేబర్ అధ్యక్షతన జరిగిన అవద్ జాతీయ కాంగ్రెస్ సమావేశంలో సామ్యవాద ప్రాతిపదికగా నవ సమాజ నిర్మాణ లక్ష్యం ప్రకటితమైంది. ఈ క్రమంలో 444 పరిశ్రమలను ప్రభుత్వ రంగంలో స్థాపించారు. హిందూస్తాన్ మెషిన్ టూల్స్ (హెచ్ఎంటీ) స్థాపించిన తొలి రోజుల్లో ఉద్యోగులకు జపాన్‌లో శిక్షణ ఇప్పించారు. అది తర్వాత గడియా రాలు, ట్రాక్టర్ల తయారీలో రారాజుగా ఎదిగింది. రక్షణ, అణుశక్తి, అంతరిక్ష రంగంలో స్వావలంబన కోసం హెచ్ఏఎల్, బీఈఎంఎల్, బీడీఎల్, ఎన్ఎండీసీ వంటి సంస్థల స్థాపన జరిగింది. బొగ్గు గనులు, ముడి చమురు ఆధారిత ఓఎన్జీసీ, బీపీసీఎల్, ఎన్టీపీసీ, లాంటి అనేక పరిశ్రమలు ఏర్పాటైనాయి. 1991 నూతన పారిశ్రామిక తీర్మానం పరిశ్రమల్లో ప్రైవేట్ రంగాన్ని అనుమతించింది. కొన్ని ప్రభుత్వ సంస్థలు కాలానుగుణంగా వస్తున్న సాంకేతిక పద్ధతు లను అమలు చేయడంలో నిర్లక్ష్యం వల్ల, మరి కొన్ని యాజమాన్యాల అవినీతి వల్ల కుంటుపడ్డాయి. నూతన ఆర్థిక విధానాలకు తెరలేపిన ఐక్య ప్రగతిశీల కూటమి (యూపీఏ) ప్రైవేట్ రంగంపై పరిమితులు ఎత్తివేసి, లైసెన్స్ రాజ్‌ను సరళీకృతం చేసింది. ఇక ఎన్డీయే హయాంలో పెట్టుబడుల ఉపసంహ రణ కోసం ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటైంది. 2014 వరకు చక్కగా పనిచేసే 200కు పైగా ప్రభుత్వ యాజ మాన్య పరిశ్రమల సంఖ్య 2019 నాటికి వందకు తగ్గింది. ఇదే కాలంలో భారత కుబేరుల సంపద ఇబ్బడిముబ్బడిగా పెరిగింది. పవర్ గ్రిడ్, రూరల్ ఎలక్ట్రికల్ వంటి సంస్థలకు పరికరాలను సమకూర్చే బీహెచ్ఈఎల్కు ఆరేళ్ల నుండి ఎలాంటి ఆర్డర్లు రావడం లేదు. అదే సమయంలో ప్రైవేటుకు ప్రభుత్వం అపరి మిత స్వేచ్ఛను కల్పించింది. ఇవి తమకు కావాల్సిన పరికరాలను చైనా నుండి దిగుమతి చేసుకుంటు న్నాయి. రక్షణ, అంతరిక్ష రంగంలో క్షిపణులను, రాకెట్లను, తేలికపాటి హెలికాప్టర్లను తయారుచేసే హిందూస్తాన్ ఏరోనాటిక్స్ 2014 వరకు ఇరవై వేల కోట్ల టర్నోవర్ కలిగివుంది. కానీ 2019 నాటికి వెయ్యి కోట్ల అప్పుతో మిగిలింది. ప్రభుత్వం దేశీయ ప్రైవేటు సంస్థలకు రక్షణ విభాగ కాంట్రాక్టులు ఇచ్చింది. ఫ్రాన్స్, ఇజ్రాయిల్, అమెరికా వంటి ఆయుధ వ్యాపార దేశాల నుండి ఎక్కువ ధరలకు కొనుగోలు చేసి ప్రభుత్వ రంగ రక్షణ సంస్థలను బలహీనం చేసింది. లాభాదాయకంగా నడుస్తున్న ఐఓసీఎల్, హెచ్‌పీసీఎల్, జీఏఐఎల్ లాంటి వాటిల్లో పెట్టుబడుల ఉపసంహరణకు తెగబడుతున్నారు. దీనికి పరాకాష్టగా ఇటీవల ప్రధాని మోదీ ప్రభుత్వం వ్యాపారం చేయదు, అది దాని విధి కాదని విస్పష్టంగా ప్రకటించారు. వెనువెంటనే 12 ప్రభుత్వ సంస్థల ఆమ్మకానికి నీతి ఆయోగ్ సంస్థ ప్రతిపాదనలను సిద్ధం చేసింది. జాతీ యమైన 27 బ్యాంకులను విలీనం చేస్తూ 12 బ్యాంకు లుగా మార్చారు. జాతీయ బ్యాంకుల్లో మొండి బకా యిలన్నీ ప్రైవేటు సంస్థలవే. ఏ ఒక్క ప్రభుత్వ రంగ సంస్థ కూడా అప్పులు ఎగ్గొట్టిన దాఖలా లేదు. ఈ చర్యలు భారత రాజ్యాంగ సామ్యవాద స్ఫూర్తికి విరుద్ధమైనవి. నీరు, నేల, అడవి అన్నీ కార్పొ రేట్ పరం అవుతున్నాయి. ప్రజాతంత్ర వాదులు తమ బుద్ధి, సమీకరణ శక్తిని పెంచి ప్రజాస్వామ్య సోషలిజం పరిరక్షణకు పని చేయాలి. శ్రామిక వర్గాల ప్రయోజ నాల బాధ్యతను మోయాలి. సుస్థిర సమ్మిళిత అభి వృద్ధికి ప్రభుత్వ రంగమే చోదకశక్తిగా మారాలి. అవి జాతి జనులకు అందాలి. -అస్నాల శ్రీనివాస్ వ్యాసకర్త దొడ్డి కొమురయ్య ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ‘ మొబైల్ : 96522 75560 -
పెట్టుబడి కాదు.. జీవితమే ఉపసంహరణ
పబ్లిక్ రంగ సంస్థల అమ్మకం కొన్ని కార్పొరేట్ల లబ్ధి కోసమే అనుకుంటే పొరపాటే. అంతకన్నా ప్రమాదమేదంటే సామాజిక, ఆర్థిక అసమానతల పెరుగుదల. పబ్లిక్ రంగ సంస్థల విధ్వంసం వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల వాళ్ళు పెద్ద ఎత్తున ఉద్యోగాలు కోల్పోతారు. ఎందుకంటే ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు అమలులో లేవు. అక్కడ ఉద్యోగం చేసే వాళ్ళకు ఉద్యోగ భద్రత ఉండదు. అంటే 1970కి ముందు ఉన్న కాంట్రాక్టర్ల, కార్పొరేట్ల నిలువు దోపిడీకి మరింత అవకాశం దొరుకుతుంది. ప్రైవేటీకరణ అంటే పెట్టుబడుల ఉపసంహరణ మాత్రమే కాదు. అది ఉపాధి ఉపసంహరణ, జీవిత ఉప సంహరణ. అందువల్ల విశాఖ ఉక్కు కోసం సాగుతున్న ఉద్యమం భారత రైతాంగం చేస్తోన్న పోరాటంలాగా దేశ ప్రయోజనాలలో భాగంగా జరగాలి. ‘‘ప్రజాస్వామ్య దేశాలెన్నుకున్న మార్గంలో బలహీనతలు బహిరంగంగా కనిపిస్తున్నాయి. అశక్తులైన జనసమూహాలు తమ సమష్టి కృషి ద్వారా, శాసనాల ద్వారా ఆర్థికంగా శక్తివంతులైన వారి మీద నియంత్రణ సాధించడం అసా «ధ్యమే. సార్వత్రిక ఓటింగ్ అమలులో ఉన్నా కూడా, శాసన నిర్మాణ సంస్థలు, ప్రభుత్వాలు సంపన్నుల చేతుల్లోనే ఉంటాయి’’ అంటూ బాబాసాహెబ్ అంబేడ్కర్ 1947లో ‘రాష్ట్రాలు–మైనారిటీలు’ అన్న డాక్యుమెంటులో పేర్కొన్నారు. అందులోనే ‘భారీ పరిశ్రమలను, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ లాంటి ఫైనాన్స్ సంస్థలను ప్రభుత్వం మాత్రమే నిర్వహించాలి’ అంటూ పరిష్కారం కూడా సూచించారు. స్వతంత్ర భారతదేశానికి రాజ్యాంగం రూపొందించే ప్రక్రియ ప్రారం భించడానికి ముందు బాబాసాహెబ్ తనదంటూ ఒక రాజ్యాంగ ముసాయిదాను రూపొందించారు. ఆ సమయంలో తాను రాజ్యాంగ రచనా సంఘానికి అధ్యక్షుడిని అవుతానని ఆయన ఊహించలేదు. అందువల్ల ఒక నమూనా రాజ్యాంగాన్ని∙ఆయన రూపొందించి, రాజ్యాంగ సభకు సమర్పించారు. రాజ్యాంగంలో రాజకీయ హక్కు లతో పాటు, ఆర్థిక పరమైన నిబంధనలను కూడా చేర్చాలని, లేనట్ల యితే సమాజంలో ఆర్థిక అసమానతలు పెరిగిపోతాయని ఆయన భావించారు. అయితే తాను ఆశించిన నిబంధనల్లో ఆర్థికపరమైన అంశాలు చోటుచేసుకోలేదు. అయితే రాజ్యాంగంలోని నాలుగవ భాగంలోని ఆదేశిక సూత్రాల్లో కొన్ని ఆర్టికల్స్‌ను పొందుపరిచారు. అందులో ఆర్టికల్–38 ముఖ్య మైనది. ప్రజల మధ్య అవకాశాల్లో, సదుపాయాల్లో, స్థాయిల్లో అసమా నతలు పెరగకుండా ప్రభుత్వాలు శ్రద్ధ వహించాలని, ఆ విధంగా ఆర్థిక అసమానతలను నిర్మూలించాలన్నది ఈ ఆర్టికల్ ముఖ్యోద్దేశం. ఆ సందర్భంగా బాబాసాహెబ్ అంబేడ్కర్ మాట్లాడుతూ ‘ప్రజల హక్కు లను హరించి, నియంతృత్వాన్ని నెలకొల్పకుండా ఉండడానికి రాజ కీయ ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పుకుంటున్నాం. అలాగే ప్రజల్లో ఆర్థిక వనరుల సమాన పంపిణీ జరిగే విధంగా ఆర్థిక ప్రజాస్వామ్యం కోసం ప్రభుత్వాలు కృషిచేయాలి’ అంటూ తన సమానత్వ భావనను, రాజ్యా ధారిత సోషలిజాన్ని అమలు చేయాలని ఆయన సూచించారు. అందుకనుగుణంగానే 1976లో రాజ్యాంగపీఠికలో ‘సోషలిజం’ అనే పదాన్ని చేర్చి కొంత మార్గనిర్దేశనం చేశారు. కానీ ఆ పదం చేర్చిన సమయం ఎమర్జెన్సీ కావడం వల్ల దాన్ని అందరూ తప్పుగా అర్థం చేసుకున్నారు. అయితే ఇందిరాగాంధీ సమయంలోనే అంబేడ్కర్ ఆశిం చినట్టుగా బ్యాంకుల జాతీయం జరిగింది. ఎన్నో పబ్లిక్ రంగ సంస్థ లను నెలకొల్పారు. పబ్లిక్ రంగ సంస్థలను ప్రభుత్వం ఎంతో చారిత్రక అనుభవంతో, ఎందరెందరో తాత్విక వేత్తల ఆలోచనలతో నెలకొ ల్పారు. దేశంలో అప్పటి వరకు ఉన్న బొగ్గు గనులలాంటి ఎన్నో పరిశ్ర మలను జాతీయం చేశారు. దీంతో అప్పటి వరకు చాలా దుర్భరంగా ఉన్న కార్మికుల జీవితాలు చట్టపరమైన రక్షణలోకి, జీవన భద్రతలోకి, వేతనాల గ్యారంటీ వ్యవస్థలోకి మారిపోయాయి. ఈ నేపథ్యంలో మనం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ విష యాన్ని చూడాలి. తెలుగు చరిత్ర ఉన్నంత వరకు ‘విశాఖ ఉక్కు– ఆంధ్రుల హక్కు’ నినాదం ప్రతి తెలుగు వాడి మదిలో ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. ఎన్నో త్యాగాల, బలిదానాల వల్ల విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఉనికిలోకి వచ్చింది. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటు కంపెనీకి అప్పగించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని ఈ రోజు ఏపీలోని రాజకీయ పార్టీలన్నీ ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నాయి. ఏపీ బీజేపీ కూడా ఈ నిర్ణయాన్ని సమర్థించకపోవడం గమనార్హం.అయితే భారత్‌లో 1947 స్వాతంత్య్రా నికి ముందు ఉన్న పరిశ్రమలు ప్రైవేట్ చేతుల్లోనే ఉన్నాయి. స్వాతం త్య్రానంతరం ఏర్పడిన ప్రభుత్వాలు రాజ్యాంగ స్ఫూర్తితో భారీ పరి శ్రమలను ప్రభుత్వాధీనంలోనే ఉంచాయి. అంతే కాకుండా, వందలాది పరిశ్రమలను నూతనంగా నెలకొల్పాయి. కానీ 1990 తర్వాత పీవీ నరసింహారావు ప్రభుత్వం ప్రారంభిం చిన సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణవల్ల ఆర్థికరంగంలో ఎన్నో మార్పులు వచ్చాయి. అందులో ఖాయిలా పడిన పరిశ్రమలను అమ్మే యాలనే విధానం కూడా ఒకటి. కానీ దానిని మరింతగా మార్చి, ప్రభుత్వ ఖజానా ఖాళీగా ఉండడం వల్ల కొన్ని పరిశ్రమలను అమ్మి ప్రభుత్వ ఆదాయాన్ని పెంచాలని నిర్ణయించారు. అయితే పీవీ నరసిం హారావు తీసుకున్న ఈ విధాన నిర్ణయం ఆ అయిదేళ్ల కాలంలో అంత వేగంగా ముందుకు పోలేదు. కానీ 1998లో రెండవసారి అధికారం లోకి వచ్చిన వాజ్‌పేయి ప్రభుత్వం ఏకంగా పెట్టుబడి ఉపసంహరణ మంత్రిత్వ శాఖనే ఏర్పాటు చేసింది. దానికి ప్రముఖ జర్నలిస్టు అరుణ్ శౌరిని మంత్రిగా నియమించింది. ఆయన తన హయాంలో అమ్మకా నికి పెట్టిన కొన్ని సంస్థల, హోటల్స్ విషయంలో ‘కాగ్’ తప్పు పట్టింది. అయినా ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. లాభాల్లో ఉన్న బొంబా యిలోని ఒక హోటల్‌ను అమ్మిన సంఘటనను ‘కాగ్’ ఉదహరిం చింది. కనీసం టెండర్ విధానాన్ని కూడా పాటించలేదని, తమకు ఇష్ట మైన వాళ్ళకు ఇచ్చారని ‘కాగ్’ బయటపెట్టింది. అయితే మళ్ళీ 2004లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వం, పబ్లిక్ రంగ సంస్థలకు అమ్మి వేయడం, లేదా వాటాలను అమ్మడం లాంటి పనులను ఆపివేయ లేదు. కానీ అంత వేగంగా పనులు జరగ లేదు. అయితే మళ్ళీ 2014లో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ఒక ప్రత్యేక శ్రద్ధతో పబ్లిక్‌రంగ సంస్థలను నిర్వీర్యం చేయడం, లేదా తెగనమ్మడం లాంటి ప్రజా వ్యతిరేక చర్యలకు పూనుకుంది. అయితే వేగంలోనే తేడాయే తప్ప ఈ రెండు పార్టీల వైఖరికీ ఆలోచనలో తేడా లేదు. ప్రైవేట్ కంపెనీలు, ప్రత్యేకించి బడాబడా కార్పో రేట్లకు జాతి సంపదను, సహజ వనరు లను అప్పనంగా అప్పజెప్పడంలో దొందూదొందే. ఇటీవల కాంగ్రెస్ ముఖ్య నాయకుడు రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వం పబ్లిక్ రంగ సంస్థల విషయంలో తీసుకుంటున్న నిర్ణయాలను తప్పు పడుతు న్నట్టు అక్కడక్కడా మాట్లాడుతున్నారు. కానీ అది సరిపోదు. భవిష్య త్తులో కాంగ్రెస్ పార్టీ ఎటువంటి ఆర్థిక విధానాన్ని అమలు చేస్తుందో వివరించాలి. బీజేపీ అధికారంలో లేనప్పుడు వారు కూడా ఇలాంటి మాటలే మాట్లాడారు. కానీ అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్‌ను తల దన్ని చాలా కర్కశంగా పబ్లిక్ రంగ సంస్థలను ధ్వంసం చేస్తున్నారు. పబ్లిక్ రంగ సంస్థల అమ్మకం కొన్ని కార్పొరేట్లకు మేలు చేయడం కోసం మాత్రమే అనుకుంటే పొరపాటే. అంతకన్నా పెద్ద ప్రమాదం ఈ దేశానికి పొంచివున్నది. అదే సామాజిక, ఆర్థిక అసమానతల పెరుగు దల. ముఖ్యంగా పబ్లిక్ రంగ సంస్థల విధ్వంసం వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల వాళ్ళు పెద్ద ఎత్తున ఉద్యోగాలు కోల్పోతారు. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు అమలులో లేవు. అంతేకాకుండా ఉద్యోగం చేసే వాళ్ళకు ఉద్యోగ భద్రత ఉండదు. ఆ విధంగా మళ్ళీ 1970కి ముందు ఉన్న కాంట్రాక్టర్ల, కార్పొరేట్ల నిలువుదోపిడీకి మరింత అవకాశం దొరుకు తుంది. మన దేశంలో 30 ఏళ్లలో ప్రైవేట్ కంపెనీల పెరుగుదల ఊహిం చలేనిది. అందులో కూడా కొన్ని కంపెనీలే ఎక్కువ సంపదను దోచు కుంటున్నాయి. అటువంటి కంపెనీలు ఈ రోజు ప్రభుత్వాల్ని శాసిస్తు న్నాయి. వాళ్ళ ప్రయోజనాలే దేశ ప్రయోజనాలవుతున్నాయి. క్రమంగా కార్పొరేట్లే ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తాయేమో అనిపి స్తుంది. జాతి సంపదను దోచుకోవడానికి జరుగుతున్న పబ్లిక్ రంగ సంస్థల అమ్మకం, వాటాల విక్రయం, మన రాజకీయ ప్రజాస్వా మ్యాన్ని దెబ్బతీస్తుంది. అందువల్ల విశాఖ ఉక్కు కోసం సాగుతున్న ఉద్యమం భారత రైతాంగం చేస్తోన్న పోరాటంలాగా దేశ ప్రయోజ నాలలో భాగంగా జరగాలి. అటువైపుగా ఉద్యమ శక్తులు ఆలోచించా ల్సిన అవసరం ఉంది. మల్లెపల్లి లక్ష్మయ్య సామాజిక విశ్లేషకులు మొబైల్ : 81063 22077 -
అధిక డివిడెండ్లపై సర్కారు ఆశలు
న్యూఢిల్లీ: కరోనా వైరస్‌పరమైన ప్రతికూల పరిణామాలతో ఖజానా ఆదాయానికి గండి పడే అవకాశాలున్న నేపథ్యంలో ప్రభుత్వ రంగ సంస్థలు (పీఎస్‌యూ) చెల్లించే డివిడెండ్లపై కేంద్రం ఆశలు పెట్టుకుంది. వీలైనంత అధికంగా, సాధ్యమైనంత త్వరగా డివిడెండ్లు చెల్లించాలంటూ పీఎస్‌యూలకు సూచించింది. త్రైమాసికాలవారీగా చెల్లించేయాలంటూ కాస్త పటిష్టంగా ఉన్న సంస్థలను ఆదేశించింది. కనీస పరిమాణం చెల్లించాలన్న నిబంధనలను పట్టుకుని కూర్చోకుండా సాధ్యమైనంత ఎక్కువగా చెల్లించేందుకు కృషి చేయాలని పేర్కొంది. దీనివల్ల విడతలవారీగా వచ్చే డివిడెండుపై కాస్త అంచనాకు వచ్చేందుకు, తగు ప్రణాళికలు వేసుకునేందుకు వీలవుతుందని తెలిపింది. పెట్టుబడులు, ప్రభుత్వ రంగ ఆస్తుల నిర్వహణ విభాగం (దీపం) ఈ మేరకు అన్ని పీఎస్‌యూల అధిపతులకు లేఖలు పంపింది. ‘‘మిగతావాటితో పోలిస్తే కాస్త ఎక్కువగా డివిడెండ్లు చెల్లించే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు (సీపీఎస్ఈ).. త్రైమాసిక ఫలితాల తర్వాత ప్రతీ త్రైమాసికంలో మధ్యంతర డివిడెండ్ చెల్లించే అంశాలను పరిశీలించాలి. మిగతా సీపీఎస్ఈలు అర్ధ సంవత్సరానికోసారి మధ్యంతర డివిడెండ్‌ను చెల్లించవచ్చు. ఇక డివిడెండ్ చెల్లింపునకు పెద్దగా అవకాశం లేని సంస్థలు .. వార్షికంగా కట్టే అంశం పరిశీలించవచ్చు. రెండో త్రైమాసిక ఫలితాలు వెల్లడించిన తర్వాత తమ తమ అంచనాల ప్రకారం అక్టోబర్ లేదా నవంబర్‌లో కట్టవచ్చు’’ అని పేర్కొంది. అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు తమ వార్షిక అంచనాల్లో కనీసం 90 శాతం మొత్తాన్ని ఒకేసారి లేదా విడతలవారీగా మధ్యంతర డివిడెండ్ కింద కట్టడంపై దృష్టి పెట్టాలని దీపం సూచించింది. ప్రస్తుతం ఆఖర్లో చెల్లింపులు .. ప్రభుత్వ రంగ సంస్థలు ప్రస్తుత నిబంధనల ప్రకారం తమ లాభాల్లో 30 శాతం లేదా నికర విలువలో 5 శాతం మేర కనీస డివిడెండ్‌ను చెల్లిస్తున్నాయి. చాలా మటుకు కంపెనీలు సాధారణంగా జనవరి లేదా ఫిబ్రవరిలో మధ్యంతర డివిడెండ్ చెల్లిస్తుంటాయి. అయితే, ఇలా ఆర్థిక సంవత్సరం ఆఖర్లో చెల్లించేటప్పుడు ... ఇతరత్రా సరఫరాదారులకు, అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లింపులు మొదలైన వాటికి కూడా చేతిలో ఉన్న నిధులనే సర్దుబాటు చేయాల్సి వస్తుండటం .. కంపెనీలకు సమస్యాత్మకంగా మారుతోందని దీపం అభిప్రాయపడింది. చివర్లో కాకుండా ముందు నుంచీ కొంత కొంతగా చెల్లించడం వల్ల ఇలాంటి సమస్య ఉండదని పేర్కొంది. ఇక స్థిరమైన డివిడెండ్ విధానమంటూ ఉంటే ఇన్వెస్టర్లకు కూడా సీపీఎస్ఈ షేర్లపై ఆసక్తి పెరుగుతుందని పేర్కొంది. ‘‘తరచుగా లేదా మూణ్నెల్లకోసారి డివిడెండ్లు చెల్లిస్తున్న పక్షంలో నాణ్యమైన ఇన్వెస్టర్లు.. ఆయా సంస్థల స్టాక్స్‌పై ఆసక్తి చూపవచ్చు. భవిష్యత్ డివిడెండ్లపై ఆశతో వాటిని అట్టే పెట్టుకుని కూడా ఉండవచ్చు’’ అని దీపం తెలిపింది. మరోవైపు, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితుల వల్లే తాజా ఆదేశాలు తెరపైకి వచ్చి ఉంటాయని ఆర్థికవేత్తలు అభిప్రాయపడ్డారు. ‘‘ప్రధానంగా ప్రభుత్వ ఆర్థిక పరిస్థితులే దీనికి కారణం. పీఎస్‌యూలు ఒకేసారి గాకుండా రెండు లేదా నాలుగు విడతల్లో గానీ చెల్లిస్తే అవి నగదును మెరుగ్గా నిర్వహించుకోగలవు. అలాగే, ప్రభుత్వం తన రుణ అవసరాలను బేరీజు వేసుకునేందుకు వీలుంటుంది. రుణ సమీకరణ ప్రణాళికలను అర్ధాంతరంగా మార్చుకోవాల్సిన అవసరం ఉండదు. కాబట్టి బాండ్ మార్కెట్‌పైనా పెద్ద ప్రతికూల ప్రభావం ఉండదు’’ అని పేర్కొన్నారు. పీఎస్‌యూలకు ఆర్థికంగా ప్రతికూలం.. మరింత ఎక్కువగా డివిడెండ్ చెల్లించేలా ప్రభుత్వ రంగ సంస్థలపై ఒత్తిడి పెంచితే వాటి ఆర్థిక పరిస్థితి దిగజారే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అధిక డివిడెండ్ చెల్లింపుల కారణంగా అవి తమ పెట్టుబడి వ్యయాల కోసం మరింతగా రుణాలు తీసుకోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. వాస్తవానికి మరింత ఎక్కువ డివిడెండ్ చెల్లించే పరిస్థితిలో కూడా పీఎస్‌యూలు లేవని తెలిపారు. గడిచిన అయిదేళ్లలో ఓఎన్జీసీ, ఇండియన్ ఆయిల్, ఎన్టీపీసీ, వంటి దిగ్గజాలు తమ లాభదాయకత తగ్గుతూ, రుణభారం పెరుగుతూ ఉన్నప్పటికీ డివిడెండ్లను అదే స్థాయిలోనో లేదా అంతకు మించే చెల్లిస్తూ వస్తున్నాయని పేర్కొన్నారు. 2020 ఆర్థిక సంవత్సరంలో 55 లిస్టెడ్ పీఎస్‌యూలు రూ. 82,750 కోట్ల లాభాలపై రూ. 47,000 కోట్ల మేర డివిడెండ్ చెల్లించాయి. అంతక్రితం ఏడాదిలో నమోదైన 70% పోలిస్తే ఇది కాస్త తగ్గి 57 శాతానికే పరిమితమైనప్పటికీ.. మిగతా కార్పొరేట్లతో పోలిస్తే మాత్రం ఎక్కువే. నిఫ్టీ50 సూచీలోని టాప్ సంస్థలు తమ లాభాల్లో సగటున 45% మాత్రమే చెల్లించాయి. అదే అయిదేళ్ల వ్యవధిలో చూస్తే ఈ 55 సంస్థలు సుమారు రూ. 3.85 లక్షల కోట్ల లాభాలపై మొత్తం రూ. 2.75 లక్షల కోట్ల డివిడెండ్ చెల్లించాయి. అంటే రికార్డు స్థాయిలో లాభాల్లో ఏకంగా 71.5% చెల్లించాయి. నిఫ్టీ 50 సంస్థలు చెల్లించిన దానికి (32 శాతం) ఇది రెట్టింపు. ఇవి కాకుండా షేర్ల బైబ్యాక్‌ల రూపంలోనూ ప్రభుత్వానికి పీఎస్‌యూలు గణనీయంగా చెల్లించాయి. -
బొగ్గు గనుల్లో మేత!
సాక్షి, అమరావతి: ఒక పని కోసం టెండర్లు ఆహ్వానించే ఏ సంస్థ అయినా ఎక్కువమంది పోటీదారులు పాల్గొనాలని, తక్కువ మొత్తానికే బిడ్లు దాఖలవ్వాలని కోరుకుంటుంది. ఈ లక్ష్యంతోనే అత్యధికులు టెండర్లలో పాల్గొనేందుకు వీలుగా అర్హత నిబంధనలు నిర్దేశిస్తుంది. బహిరంగ (ఓపెన్) టెండర్ల నిర్వహణ ప్రాథమిక ఉద్దేశం కూడా ఇదే. అయితే బొగ్గు గనుల అభివృద్ధి, నిర్వహణ(ఎండీవో) కాంట్రాక్టర్ ఎంపిక కోసం ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ(ఏపీఎండీసీ) రూపొందించిన నిబంధనలు ఈ ప్రాథమిక సూత్రానికి విరుద్ధంగా ఉన్నాయి. పోటీని పరిమితం చేసి, ప్రభుత్వ పెద్దలకు నచ్చిన సంస్థకే కాంట్రాక్టు కట్టబెట్టాలనే రహస్య ఎజెండాతోనే ఇలాంటి షరతులు పెట్టిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దేశంలోని ఇతర ప్రభుత్వ రంగ సంస్థలు ఇదే తరహా పనుల నిర్వహణ కోసం నిర్వహించిన టెండర్లలో అనుసరించిన నిబంధనలకు భిన్నంగా ఏపీఎండీసీ టెండర్ షరతులు ఉండడం గమనార్హం. ఈ షరతుల్లో మార్పులు చేయాలని, తమకు ఈ టెండర్లలో పాల్గొనే అవకాశం కల్పించాలని పలు సంస్థలు కోరుతున్నా ఏపీఎండీసీ లెక్కచేయడం లేదు. గోల్మాల్ నిబంధనలు ఛత్తీస్‌గఢ్‌లోని మదన్‌పూర్ దక్షిణం, మధ్యప్రదేశ్‌లోని సులియారీ బొగ్గు గనుల అభివృద్ధి, నిర్వహణకు సంస్థను ఎంపిక చేసేందుకు మెటల్ స్క్రాప్ ట్రేడింగ్ కార్పొరేషన్ (ఎంఎస్టీసీ) ద్వారా ఏపీఎండీసీ ఈ–టెండర్లు(ఆసక్తి వ్యక్తీకరణ దరఖాస్తులు) ఆహ్వానించింది. మార్చి 19న టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. బొగ్గు గనుల అభివృద్ధి, తవ్వకం, నిర్వహణలో అనుభవం ఉన్న సంస్థల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు పేర్కొంది. గని అభివృద్ధి, నిర్వహణకు సొంత ఆర్థిక వనరులతో ప్రణాళిక రూపొందించుకుని అవసరమైన నిర్మాణాలు, ఇంజనీరింగ్ కార్యక్రమాలతో సహా మొత్తం వ్యవహారాలు ఎండీవో కాంట్రాక్టరే చూసుకోవాల్సి ఉంటుందని టెండర్ నోటిషికేషన్లో వివరించింది. ఈ నెల 18వ తేదీ వరకూ దరఖాస్తుల సమర్పణకు గడువు ఇచ్చింది. ఇంతవరకూ బాగానే ఉన్నా టెండర్ నిబంధనలే అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. మొత్తం ఖనిజాన్ని వెలికితీసే వరకూ ఈ గనులు ఎండీవో కాంట్రాక్టర్ నిర్వహణలోనే ఉంటాయి. ఏపీఎండీకి చెందిన మదన్‌పూర్ గనిలో దాదాపు 187 మిలియన్ టన్నుల బొగ్గు ఉంది. ఇందులో 137 మిలియన్ టన్నుల బొగ్గును తవ్వొచ్చని అంచనా. సులియారీలోని గనిలో 147 మిలియన్ టన్నుల ఖనిజం ఉండగా, ఇందులో 109 మిలియన్ టన్నుల బొగ్గు తవ్వొచ్చని అంచనా. గని నిర్వహణతోపాటు తవ్వకాలు జరిపి ఓవర్ బర్డెన్(వృథా మట్టి)ని తొలగించి, అమ్మకానికి పనికొచ్చే బొగ్గును ఏపీఎండీసీకి అప్పగించాల్సి ఉంటుంది. ఆసక్తి వ్యక్తీకరణ దరఖాస్తులట! ఏ సంస్థ అయినా టెండర్ నోటిషికేషన్ జారీ చేస్తే దాన్ని ఎవరైనా ఉచితంగా డౌన్లోడ్ చేసుకుని అందులో పాల్గొనేందుకు అర్హతలు, నిబంధనలు, చేయాల్సిన పనులు లాంటి వివరాలన్నీ తెలుసుకోవచ్చు. అయితే, ఏపీఎండీసీ ఈ బొగ్గు గనుల ఎండీవో కాంట్రాక్టర్ ఎంపిక టెండర్ల విషయంలో ఈ నిబంధనలను గాలికొదిలేసింది. సంస్థ వెబ్సైట్లో పెట్టిన టెండర్ ప్రకటనలో కేవలం ఎండీవో కాంట్రాక్టర్ ఎంపిక కోసం ఆసక్తి వ్యక్తీకరణ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మాత్రమే ఉంది. ఇతర అంశాలేమీ లేవు. ఆసక్తిగల వారు ఎంఎస్టీసీలో పేర్లు నమోదు చేసుకుని, దరఖాస్తు రుసుం రూ.50 వేలు చెల్లించి, నిబంధనలు తెలుసుకోవచ్చని పేర్కొంది. నిబంధనలు, పని వివరాలు తెలుసుకోవడానికే రూ.50 వేలు చెల్లించాలనడం గమనార్హం. ఏపీఎండీసీ గతంలో బెరైటీస్ ఖనిజం తవ్వకాలకు ఎంఎస్టీసీ ద్వారానే ఈ–టెండర్లు పిలిచింది. అప్పుడు టెండర్ నోటిఫికేషన్లోనే అన్ని నిబంధనలను పేర్కొంది. బొగ్గు గనుల ఎండీవో కాంట్రాక్టర్ ఎంపిక టెండర్ల విషయంలో మాత్రం దీనికి భిన్నంగా వ్యవహరించింది. ప్రభుత్వ పెద్దలకు వాటాలు ఒక ఆర్థిక సంవత్సరంలో 20 మిలియన్ టన్నుల బొగ్గు తవ్విన అనుభవం ఉన్న సంస్థలకే ఈ టెండర్లలో పొల్గొనేందుకు అర్హత ఉంటుందని ఏపీఎండీసీ స్పష్టం చేసింది. ఎక్కువ సంస్థలు పోటీకి రాకుండా నివారించడంతోపాటు నచ్చిన వారికి కాంట్రాక్టు కట్టబెట్టడం కోసమే ఇలాంటి షరతులు పెట్టినట్లు స్పష్టమవుతోంది. ‘‘టైలర్ మేడ్ నిబంధనలు పెడితే తక్కువ సంస్థలు పోటీలో ఉంటాయి. వాటి మధ్య రాజీ కుదిర్చి నచ్చిన సంస్థకు బొగ్గు గనులను కట్టబెట్టవచ్చు. తద్వారా ప్రభుత్వ పెద్దలు భారీగా వాటాలు పంచుకోవచ్చు. ఈ ఉద్దేశంతోనే ఏపీఎండీసీతో ఈ తరహా షరతులు విధించింది’’ అని ప్రముఖ కాంట్రాక్టర్ ఒకరు చెప్పారు. గతంలో ఏపీఎండీసీ మంగంపేటలోని గనుల్లో బెరైటీస్ తవ్వకం కాంట్రాక్టును కూడా ఇలాగే టైలర్ మేడ్ నిబంధనల ద్వారా చెన్నైకి చెందిన సంస్థకు కట్టబెట్టింది. ఈ వ్యవహారంలో ప్రభుత్వ పెద్దలు భారీగా లబ్ధి పొందిన వైనాన్ని ‘సాక్షి’ బయటపెట్టింది. - మదన్‌పూర్ దక్షిణ బ్లాకులో ఏటా 38.12 మిలియన్ టన్నుల (బొగ్గు, ఓవర్ బర్డెన్) తవ్వకం కోసం ఎండీవో కాంట్రాక్టర్ ఎంపికకు ఏపీఎండీసీ ప్రస్తుతం టెండర్లు స్వీకరిస్తోంది. ఇందులో పాల్గొనాలంటే ఒక ఆర్థిక సంవత్సరంలో సింగల్ ఓపెన్‌కాస్ట్ మైన్‌లో 20 మిలియన్ టన్నుల బీసీఎం తవ్వి ఉండాలని, ఇందులో 2.70 మిలియన్ టన్నుల బొగ్గు/ లిగ్నైట్ ఉండాలని పేర్కొంది. - సులియారీ బ్లాక్‌లో ఏటా 41.8 టన్నుల బొగ్గు, ఓవర్ బర్డెన్ తవ్వకం కోసం ఎండీవో కాంట్రాక్టర్ ఎంపికకు ఏపీఎండీసీ బిడ్లు స్వీకరిస్తోంది. ఇందులో పాల్గొనాలంటే ఒక ఆర్థిక సంవత్సరంలో ఏదైనా ఓపెన్‌కాస్ట్ మైన్‌లో 20 మిలియన్ టన్నుల బీసీఎం తవ్వి ఉండాలని, ఇందులో 2.70 టన్నుల బొగ్గు, లిగ్నైట్ ఉండాలని షరతు విధించింది. - తలైపల్లి బొగ్గు బ్లాకులో ఏటా 104 మిలియన్ టన్నుల తవ్వకానికి గతంలో ఎన్టీపీసీ టెండర్లు ఆహ్వానించింది. ఒక ఆర్థిక సంవత్సరంలో 15 మిలియన్ బీసీఎం తవ్విన సంస్థకు టెండర్లలో పాల్గొనేందుకు అర్హత కల్పించింది. ఏపీఎండీసీ మాత్రం ఏటా కేవలం 38.12 టన్నుల తవ్వకం కోసం 20 బీసీఎంను అర్హతగా నిర్దేశించడం గమనార్హం. రివర్స్ వేలం ద్వారా తుది నిర్ణయం బొగ్గు గనుల తవ్వకం విషయంలో ఇలాంటి షరతులు పెట్టడానికి కారణం ఏమిటని ఏపీఎండీసీ అధికారులను ప్రశ్నించగా... తమ బొగ్గు గనుల్లో స్ట్రైకింగ్ రేషియో ఎక్కువగా ఉన్నందున ఇలా పెట్టాల్సి వచ్చిందని చెప్పారు. స్ట్రైకింగ్ రేషియోను గతంలో టెండర్లు నిర్వహించిన సంస్థలు కూడా పరిగణనలోకి తీసుకున్నాయి. ‘‘రెండు గనులకు ఎండీవో కాంట్రాక్టర్ల ఎంపిక కోసం మొదట ఈ నెల 18న ఈ–వేలం నిర్వహిస్తాం. ఇందులో తక్కువ మొత్తానికి వచ్చిన బిడ్ ఆధారంగా రివర్స్ వేలం నిర్వహిస్తాం. ఈ–టెండర్లలో వచ్చిన బిడ్ కంటే తక్కువ మొత్తానికే రివర్స్ వేలంలో కోట్ చేయాల్సి ఉంటుంది. అయితే, ఈ–టెండర్లలో పాల్గొన్న సంస్థలకే రివర్స్ వేలంలో పాల్గొనడానికి అర్హత ఉంటుంది’’ అని అధికార వర్గాలు తెలిపాయి. -
రూపాయి మరింత కిందకి
31 పైసలు పతనం 65.31 వద్ద ముగింపు ముంబై: దిగుమతిదారులు, ప్రభుత్వ రంగ సంస్థల నుంచి డాలర్లకు డిమాండ్ నెలకొనడంతో రూపాయి పతనం కొనసాగుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ సోమవారం మరో 31 పైసలు క్షీణించి 65.31 వద్ద ముగిసింది. చైనా కరెన్సీ యువాన్ డీవేల్యుయేషన్ అనంతరం అంతర్జాతీయ కరెన్సీ మార్కెట్లు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతుండటం, బలహీన వాణిజ్య గణాంకాలు మొదలైనవి దేశీ కరెన్సీ క్షీణించడానికి కారణాలని మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. సోమవారం ఫారెక్స్ మార్కెట్లో క్రితం ముగింపు 65తో పోలిస్తే బలహీనంగా 65.12 వద్ద రూపాయి ట్రేడింగ్ ప్రారంభమైంది. ఒక దశలో 65.36 స్థాయికి కూడా పడిపోయింది. గడిచిన రెండేళ్లలో రూపాయికి ఇది మరో కొత్త కనిష్ట స్థాయి కావడం గమనార్హం. ఆ తర్వాత క్లోజింగ్ సమయానికి 0.48 శాతం నష్టంతో దేశీ కరెన్సీ 65.31 వద్ద ముగిసింది. స్పాట్ మార్కెట్లో ఇక డాలరుతో రూపాయి మారకం విలువ 64.80-65.80 మధ్య తిరుగాడగలదని వెరాసిటీ గ్రూప్ సీఈవో ప్రమీత్ బ్రహ్మభట్ తెలిపారు. -
డిజిన్వెస్ట్‌మెంట్‌పై వెనక్కి తగ్గం
ఆర్థిక వ్యవస్థ క్రమంగా మెరుగుపడుతోంది... స్టాక్ మార్కెట్లో స్థిరత్వం వస్తుంది కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ న్యూఢిల్లీ : స్టాక్ మార్కెట్ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల విక్రయం (డిజిన్వెస్ట్‌మెంట్) ముందుగా నిర్ణయించినట్లు యథాప్రకారం జరుగుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. ఆర్థిక వ్యవస్థ కోలుకుంటున్న నేపథ్యంలో మార్కెట్లలో మరింత స్థిరత్వం వస్తుందని భావిస్తున్నట్లు తెలిపారు. స్టాక్ మార్కెట్ రోజువారీ కదలికల గురించి తాను పెద్దగా పట్టించుకోనన్నారు. ఏదైతేనేం.. ఎకానమీ రికవర్ అవుతుండటంతో డిజిన్వెస్ట్‌మెంట్‌పై ప్రభుత్వం ప్రణాళిక ప్రకారం ముందుకెడుతుందని తెలియజేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా దాదాపు రూ. 69,500 కోట్లు సమీకరించాలని కేంద్రం నిర్దేశించుకుంది. ప్రభుత్వ రంగ సంస్థల్లో (పీఎస్‌యూ) మైనారిటీ వాటాల విక్రయం ద్వారా రూ. 41,000 కోట్లు, వ్యూహాత్మక వాటాల విక్రయం ద్వారా రూ. 28,500 కోట్లు సమీకరించాలని యోచిస్తోంది. అయితే, స్టాక్ మార్కెట్లు పతనమవుతుండటం , వర్షాభావ పరిస్థితులు ఉండొచ్చన్న అంచనాలతో ఈ లక్ష్యం కష్టసాధ్యమని ప్రభుత్వ వర్గాలు సైతం భావిస్తున్న నేపథ్యంలో జైట్లీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. వర్షాభావంపై ఆందోళనలొద్దు.. వర్షాభావంపై గానీ, దాని ప్రభావంతో ద్రవ్యోల్బణం ఎగియవచ్చని గానీ ఆందోళన పడాల్సిన అవసరం లేదని జైట్లీ చెప్పారు. వాస్తవ పరిస్థితిని మరీ అతిగా చేసి చూపిస్తున్నారని, ఇవన్నీ అపోహలేనని చెప్పారు. వర్షాభావం వల్ల ఆహారధాన్యాల దిగుబడిపై పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చన్నారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు తగి నన్ని ఆహార ధాన్యాల నిల్వలు ఉన్నాయని చెప్పారు. ఈసారి వర్షపాతం సాధారణ స్థాయికన్నా తక్కువగా 88% మాత్రమే ఉండొచ్చని వాతావరణ శాఖ అంచనాలు వేసిన సంగతి తెలిసిందే. ‘‘ఎకానమీ మెరుగుపడుతోందనడానికి సానుకూల సంకేతాలున్నాయి. ఇటీవలి వృద్ధి రేటు గణాంకాలూ వాటిలో భాగమే. ప్రభుత్వ వ్యయాలు పెరుగుతున్నాయి. రాబోయే నెలల్లో మరింత పెరుగుదల ఉంటుంది. పరోక్ష పన్నుల వసూళ్లు గణనీయంగా పెరిగాయి. నిల్చిపోయిన ప్రాజెక్టులు మళ్లీ మొదలవుతున్నాయి. బ్యాంకుల మొండి బకాయిలు కూడా తగ్గుతున్నాయి’’ అని వివరించారు. స్టాక్‌మార్కెట్ 2-3 రోజుల పాటు క్షీణించడాన్ని ట్రెండ్‌గా భావించనక్కర్లేదన్నారు. వ్యవసాయోత్పత్తులకు కనీస మద్దతు ధరను పెంచే అంశంపై చర్చల ప్రక్రియ కొనసాగుతోందన్నారు. త్వరలో అత్యవసర ప్రణాళిక.. న్యూఢిల్లీ: వర్షాభావానికి సంబంధించి ప్రతి కూల ప్రభావాన్ని ఎదుర్కొనడానికి అత్యవసర ప్రణాళికను ప్రకటించనున్నట్లు ఆర్థిక శాఖ అత్యున్నత స్థాయి అధికారి ఒకరు తెలిపారు. కరవు ఏర్పడే ప్రాంతాల్లో సహాయక చర్యలు తీసుకోవడంలో భాగంగా చేపట్టే కొన్ని పనులకు ఎంఎన్ఆర్ఈజీఏ (మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం) నిధులను వినియోగించుకోవడం జరుగుతుందని వెల్లడించారు. అత్యవరసర ప్రణాళిక కింద రూ.500 కోట్ల ధరల స్థిరీకరణ నిధి వినియోగ ప్రతిపాదన ఉంది. తగిన ధరలకు నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉంచడం దీని ప్రధాన ధ్యేయం. -
ఓఎన్జీసీ చైర్మన్ వాసుదేవకు స్కోప్ అవార్డు
న్యూఢిల్లీ: ఓఎన్జీసీ చైర్మన్ సుధీర్ వాసుదేవకు స్కోప్ ఇండివిడ్యువల్ లీడర్షిప్ అవార్డు లభించింది. ప్రభుత్వరంగ సంస్థల పనితీరు ఆధారంగా స్కోప్ సంస్థ అవార్డులనందిస్తోంది. మహారత్న/నవరత్న పీఎస్‌యూల కేటగిరిలో వ్యక్తిగత నాయకత్వం కింద స్కోప్ ఎక్స్‌లెన్స్ అవార్డు సుధీర్ వాసుదేవకు లభించింది. మినీరత్న కేటగిరిలో ఈ అవార్డు ఇంజినీర్స్ ఇండియా హెడ్ ఏ.కె. పుర్వహ ఎంపికయ్యారు. లాభాలార్జిస్తున్న ఇతర పీఎస్‌యూల కేటగిరిలో ఈ అవార్డు జాతీయ బలహీనవర్గాల ఆర్థిక, అభివృద్ధి కార్పొరేషన్ ఎండీ ఏ.ఏ. నఖ్వీకి లభించింది. పీఎస్‌యూల్లో అద్వితీయ ప్రతిభ కనబరిచిన మహిళా మేనేజర్ అవార్డ్ కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో గ్రూప్ జనరల్ మేనేజర్‌గా పనిచేస్తున్న నీరుకు లభించింది.