Pujakumar
-
ఆస్తులు అమ్ముకున్నా! – రాజశేఖర్
‘‘గరుడవేగ’కి కోటేశ్వర్ రాజు, జీవిత, ప్రవీణ్ సత్తారు, మా నాన్నగారు నాలుగు పిల్లర్లు. నా పిల్లలు శివాని, శివాత్మికలు సూపర్ పవర్స్‌లా మరో రెండు పిల్లర్స్‌లా సహకారం అందించారు’’ అన్నారు రాజశేఖర్. ఆయన హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో జ్యో స్టార్ ఎంటర్ప్రైజెస్ పతాకంపై కోటేశ్వర్ రాజు నిర్మించిన సినిమా ‘పీఎస్వీ గరుడవేగ 126.18ఎం’. పూజా కుమార్, శ్రద్ధా దాస్, కిషోర్ ముఖ్య తారలు. నవంబర్ 3న సినిమా విడులవుతున్న సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీ–రిలీజ్ వేడుక నిర్వహించారు. రాజశేఖర్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా టీజర్ చూసిన మా అమ్మగారు హ్యాపీ ఫీలయ్యారు. తను చనిపోవడంతో నేను కింద పడిపోయినట్లు అనిపించింది. మేం సినిమాల్లో ఉండటం కారణంగా చాలా ఆస్తులు అమ్మేశా. దాంతో నష్టపోయాను. ఆ విషయంలో అమ్మగారు బాధపడుతుండేవారు. ఈ సినిమా సక్సెస్‌తో నేను బాగానే ఉన్నానని పై లోకంలో ఉన్న మా అమ్మ తెలియాలి. ఇందుకు ప్రేక్షకుల ఆశీర్వాదం కావాలి’’ అన్నారు. జీవితా రాజశేఖర్ మాట్లాడుతూ– ‘‘మా అమ్మాయి పేరు మీదనే జ్యో స్టార్ బేనర్ స్టార్ట్ చేశాం. మా మావయ్యగారి ద్వారా కోటేశ్వర్ రాజుగారు పరిచయం. రాజశేఖర్‌గారికి మంచి హిట్ ఇవ్వాలనే తపనతో ఖర్చుకు వెనకాడకుండా 30 కోట్లతో సినిమా నిర్మించారు. సినిమాకి ఫైనాన్షియల్ సమస్యలున్నాయని, నవంబర్ 3న రాదని కొందరు అంటున్నారు. అవన్నీ పుకార్లే. 3నే విడుదలవుతుంది’’ అన్నారు. ‘‘సినిమా బాగా వచ్చింది. జీవితగారు అందించిన సహకారం మరచిపోలేను. నిర్మాత రాజీ పడలేదు’’ అన్నారు ప్రవీణ్ సత్తారు. ‘‘ప్యాషన్‌తో చేసిన సినిమా ఇది. అందరికీ నచ్చేలా ఉంటుంది’’ అన్నారు కోటేశ్వర్ రాజు. నటీనటులు పూజా కుమార్, శ్రద్ధా దాస్, సన్నీ లియోన్, ఆదిత్ అరుణ్ తదితర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. -
ఇది... ఎన్ఐఎ ఏజెంట్ కథ
తెలుగులో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఎ)పై ఇప్పటి వరకూ సినిమా రాలేదు. దేశం కోసం ఎన్ఐఎ అధికారులు ఎలా కష్టపడతారు? అనేది మా సిన్మాలో చూపించామని దర్శకుడు ప్రవీణ్ సత్తారు అన్నారు. ఆయన దర్శకత్వంలో రాజశేఖర్ హీరోగా జ్యో స్టార్ ఎంటర్ప్రైజెస్ సంస్థ నిర్మించిన ‘పీఎస్వీ గరుడవేగ 126.18ఎం’ను నవంబర్ 3న రిలీజ్ చేస్తున్నారు. నిర్మాత కోటేశ్వర్ రాజు మాట్లాడుతూ– ‘‘ఓ సిన్సియర్ ఎన్ఐఎ ఆఫీసర్ దేశం కోసం, కుటుంబం కోసం ఏం చేశాడనే కథతో రూపొందిన చిత్రం ఇది. పవర్ఫుల్ హీరోయిజమ్, హృదయాన్ని తాకే ఎమోషన్స్, ఉత్కంఠ రేపే సన్నివేశాలతో దర్శకుడు చిత్రాన్ని తీశారు. రాజశేఖర్‌కి జోడీగా పూజాకూమార్, జర్నలిస్ట్‌గా శ్రద్ధాదాస్, స్పెషల్ సాంగులో సన్నీ లియోన్ కనిపిస్తారు’’ అన్నారు. -
ఇప్పుడు 25 కోట్లు... తర్వాత 2 కోట్లైనా ఓకే!
‘‘కథను బట్టే బడ్జెట్ ఉంటుంది. ఈ సిన్మాను పాతిక కోట్లతో తీశామని... నా తర్వాతి సినిమాను అంత కంటే ఎక్కువ బడ్జెట్‌తో తీయాలనుకోను. కథకు రెండు కోట్లు చాలనుకుంటే... రెండు కోట్లలోనే తీస్తా’’ అన్నారు ప్రవీణ్ సత్తారు. రేపు ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా రాజశేఖర్ హీరోగా ఆయన దర్శకత్వంలో ఎం. కోటేశ్వరరాజు నిర్మించిన ‘పీఎస్వీ గరుడవేగ 126.18ఎం’ సినిమా గురించి ప్రవీణ్ చెప్పిన విశేషాలు... ⇒ జీవితాగారు ఓ రోజు ఫోన్ చేసి రాజశేఖర్‌గారికి ఏదైనా కథ ఉంటే చెప్పమన్నారు. హాలీవుడ్ హిట్ ‘డై హార్డ్’ టైప్ కథ చెప్పా. నేను తీసిన గత రెండు సినిమాలు ‘చందమామ కథలు, గుంటూరు టాకీస్’ కంటే డిఫరెంట్ జానర్ సిన్మా. భారీ స్కేల్ ఉన్న సిన్మా, భారీ బడ్జెట్ కావాలి. బహుశా... వేరే నిర్మాతలైతే అంతకు ముందు ఏం తీశావమ్మా? అనడిగేవారేమో! ఎం. కోటేశ్వరరాజుగారు, హీరోగారు కథను, నన్ను నమ్మారు. ⇒ రాజశేఖర్‌గారి ‘మగాడు’ సినిమాకు, అందులో ఆయన యాక్టింగ్‌కి నేను పెద్ద ఫ్యాన్. ఇందులో ఆయనది అలాంటి క్యారెక్టరైజేషన్ ఉన్న పాత్రే. ‘నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ’ (ఎన్ఐఏ) ఆఫీసర్‌గా చేశారు. షూటింగ్ ఫినిష్ చేశాం. తాను తప్ప వేరేవాళ్లు చేయలేరన్నంతగా రాజశేఖర్‌గారు నటించారు. సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ సిన్మా ఇది. స్టోరీ, యాక్షన్ సీక్వెన్లు చాలా కొత్తగా ఉంటాయి. ⇒ ఈ సినిమాకు ముందు రాజశేఖర్‌గారి మార్కెట్ ఎంతని ఆలోచించలేదు. ఈ రెండేళ్లలో వచ్చిన సినిమాలు పరిశీలిస్తే... కొత్తవాళ్లతో రెండు కోట్లలో తీసిన సినిమా 20 కోట్లు వసూలు చేసింది. పదేళ్లుగా ఇల్లు–టీవీలకు అతుక్కుపోయిన ప్రేక్షకులను ‘బాహుబలి’ థియేటర్లకు రప్పించింది. సినిమాలో కంటెంట్ ఉంటే ఆకాశమే హద్దుగా వసూళ్లు వస్తున్నాయి. హీరో స్లంపులో ఉన్నాడనేది మేటర్ కాదు. అదే... ఎంత పెద్ద హీరో సినిమా అయినా.. బాగోకపోతే రెండో రోజు కలెక్షన్స్ ఉండవు. ⇒ సన్నీ లియోన్‌తో ఐటమ్ సాంగ్ చేయించాలనేది నిర్మాత ఐడియా. భీమ్స్ మంచి బీటున్న సాంగ్ చేశారు. ఆడియన్స్‌ను సన్నీ సాంగ్ బాగా ఎట్రాక్ట్ చేస్తుంది. బట్, రిలీజైన తర్వాత సిన్మాలో కంటెంట్ ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తుందనే నమ్మకముంది. పూజాకుమార్, శ్రద్ధా దాస్, కిశోర్.. అద్భుతంగా నటించారు. తెలుగులో యాక్షన్ బేస్డ్ ఎంటర్టైనర్స్కు ‘పీఎస్వీ గరుడవేగ’ కొత్త టెంప్లేట్ అవుతుందనుకుంటున్నా.