Pune Municipal Corporation
-
సీజేఐ వద్దకు భూ పంచాయితీ
న్యూఢిల్లీ: భూసేకరణకు సంబంధించిన కేసుల విచారణకు తగిన ధర్మాసనం ఏర్పాటు చేయాలని కోరుతూ కేసును ప్రధాన న్యాయమూర్తికి సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం సిఫార్సు చేసింది. ఈ కేసులో ఫిబ్రవరి 8న వెలువరించిన తీర్పుపై బుధవారం ముగ్గురు సభ్యుల ధర్మాసనం స్టే విధించడంతో వివాదం నేపథ్యంలో ఈ అంశాన్ని సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రాకు రిఫర్ చేస్తూ న్యాయమూర్తులు జస్టిస్ అరుణ్‌మిశ్రా, జస్టిస్ అమితవ రాయ్‌తో కూడిన ధర్మాసనం నిర్ణయం తీసుకుంది. ఈ అంశాన్ని సీజేఐకి సిఫార్సు చేయడమే సరైన నిర్ణయమని, బుధవారం నాటి ఉత్తర్వుల నేపథ్యంలో ఈ అంశంపై విచారణను కొనసాగించాలా? లేదా? అనే విషయాన్ని ఆయనే తేలుస్తారని ధర్మాసనం స్పష్టం చేసింది. నిర్దేశిత ఐదేళ్ల కాలంలో పరిహారం చెల్లించనట్లయితే దాని పేరు చెప్పి భూ సేకరణను రద్దు చేయడం చెల్లదని ఫిబ్రవరి 8న జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం తీర్పు వెలువరించింది. పుణే మున్సిపల్ కార్పొరేషన్ కేసులో 2014లో మరో త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును రద్దు చేసింది. అయితే దీనిపై జస్టిస్ మదన్ బి లోకూర్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం బుధవారం స్పందిస్తూ.. న్యాయ వ్యవస్థ అన్ని అంశాలపై ఒకేలా వ్యవహరించాలని పేర్కొంది. ఈనెల 8న వెలువరించిన తీర్పును పరిశీలించినట్లైతే.. న్యాయ వ్యవస్థ క్రమశిక్షణలో వ్యత్యాసం కనిపిస్తోందని, అభిప్రాయభేదాలు ఉన్నందున ఈ అంశాన్ని విస్తృత ధర్మాసనానికి అప్పగించాలని, అలాగే హైకోర్టులు ఈ అంశంపై దాఖలైన కేసులను విచారించొద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులపై జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం గురువారం స్పందిస్తూ.. అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే తీర్పు వెలువరించామని, తీర్పు పూర్తిగా చదవకుండానే దాడికి దిగుతారని, ముందు తీర్పు కాపీని చదివి ఆ తర్వాత మాట్లాడాలని స్పష్టం చేసింది. ఈ అంశాన్ని ఎవరు విచారించాలనేది సీజేఐ నిర్ణయిస్తారని పేర్కొంది. -
అక్బరుద్దీన్‌కు నో ఎంట్రీ
ఏఐఎంఐఎం కీక నేత, చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీకి పుణె పోలీసులు షాక్ ఇచ్చారు. పుణె మున్సిపల్ కార్పొరేషన్(పీఎంసీ) ఉప ఎన్నిక ప్రచారంలో అక్బర్ పాల్గొనేందుకు అనుమతించమని పుణె పోలీస్ కమిషనర్ శనివారం తేల్చిచెప్పారు. శాంతి భద్రతల సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందునే అక్బర్‌ను పుణెలోకి అనుమతించడంలేదని కమిషనర్ పేర్కొన్నారు. ఇప్పటికే మహారాష్ట్రలో రెండు ఎమ్మెల్యే స్థానాలను కైవసం చేసుకున్న ఎంఐఎం.. స్థానిక సంస్థలపైనా పట్టు సాధించాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే పీఎంసీలోని కోడ్వా వార్డులో తమ అభ్యర్థిని పోటీకి నిలిపింది. ఇక్కడ వచ్చే వారం పోలింగ్ జరగనుంది. ఈ వార్డులో 55 శాతం ఓట్లు ముస్లింలవే కావడం విశేషం. కాగా, అక్బరుద్దీన్ ఆదివారంనాడు కోడ్వాలో ప్రచారం చేయాల్సి ఉంది. పోలీసులు అనుమతి నిరాకరించడంతో ఆయన పర్యటన డైలమాలో పడినట్లయింది. బీహార్ ఎన్నికల ప్రచారంలోనూ పాల్గొన్న అక్బరుద్దీన్ ప్రధాని మోదీని ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, కేసు నమోదు కావటం తెలిసిందే. -
‘పాషణ్’ ఇక పరిశుభ్రం
పుణే: నగర శివారులోని పాషణ్ సరస్సుతోపాటు పరిసర ప్రాంతాల్లో పుష్పజాతుల పరిరక్షణపై పుణే మున్సిపల్ కార్పొరేషన్ దృష్టి సారించింది. ఇందులోభాగంగా ఈ సరస్సులో పెరిగిన గుర్రపుడెక్క, తామర మొక్కల తొలగింపు పనులను ఆదివారం చేపట్టింది. ఈ విషయాన్ని పీఎంసీ పర్యావరణ విభాగం అధికారి మంగేష్ దిఘే వెల్లడించారు. నెల రోజుల్లోగా ఈ పనులను పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. గుర్రపుడెక్కను తొలగిస్తున్నామన్నారు. ఈ పనుల్లో దాదాపు 20 మంది కార్మికులు పాలుపంచుకుంటున్నారన్నారు. ఇందుకు ఉద్యానవనం, ఆరోగ్య విభాగం, ఘన వ్యర్థాల నిర్వహణ విభాగం, జవహర్లాల్ నెహ్రూ జాతీయ పట్టణ పునర్ నిర్మాణ పథకం (జేఎన్ఎన్యూఆర్ఎం) అధికారులు కూడా తమవంతు సహకారం అందిస్తున్నారన్నారు. ఈ సర స్సులోకి కాలుష్యాలు వచ్చిచేరకుండా చేసేందుకుగాను దీని పరిసర ప్రాంతాల్లో త్వరలో జనజాగృతి కార్యక్రమాలను నిర్వహించనున్నామన్నారు. ఈ పనులు పూర్తయితే ఈ సరస్సు పరిశుభ్రంగా మారుతుందన్నారు. ఇందువల్ల పుష్పజాతుల పరిరక్షణ జరుగుతుందన్నారు. అంతేకాకుండా ఈ సరస్సు అత్యంత సుందరంగా మారుతుందన్నారు. తత ్ఫలితంగా దీని పరిసర ప్రాంతాలకు ప్రాధాన్యం మరింత పెరుగుతుందన్నారు. కాగా ఈ సర స్సుకు వందల సంఖ్యలో దేశీయ పక్షులతోపాటు వలస పక్షులు కూడా వస్తుంటాయన్నారు. 200 నుంచి దాదాపు ఐదువేల వరకూ విదేశీ పక్షులు ఇక్కడికి వచ్చి వాలుతుంటాయన్నారు. అయితే ప్రస్తుతం కేవలం స్వల్పసంఖ్యలోనే వస్తున్నాయన్నారు. మరోవైపు పక్షుల రాక తగ్గుముఖం పట్టడానికి మానవ జోక్యం పెరిగిపోవడమేనని పక్షి ప్రేమికులు, నిపుణులు చెబుతున్నారు. గత కొద్దిసంవత్సరాలుగా ఇక్కడ మానవ జోక్యం విపరీతంగా పెరిగిపోయిందంటున్నారు. ఈ సరస్సులో తామర, గుర్రపుడెక్క విపరీతంగా పెరిగిందని, ఇది కాలుష్యానికి సంకేతమని వారంతా విచారం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఘనవ్యర్థాల నిర్వహణ విభాగం ఈ సరస్సు పరిసరాలను శుభ్రం చేయడంపై ప్రధానంగా దృష్టి సారించింది. ఇందులోభాగంగానే ఈ పనులు మొదలయ్యాయి. ఇందులో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలను కూడా తొలగించనున్నారు. ఈ విషయాన్ని పీఎంసీ ఘనవ్యర్థాల నిర్వహణ విభాగం ప్రధాన అధికారి సురేశ్ జగతాప్ వెల్లడించారు. -
చెత్త తొలగింపు సమస్య పరిష్కారంపైనే దృష్టి
పుణే: నానాటికీ తలనొప్పిగా పరిణమిస్తున్న చెత్త తొలగింపు సమస్య పరిష్కారంపై పుణే మున్సిపల్ కార్పొరేషన్ (పీఎంసీ) దృష్టి సారించింది. ఇందుకోసం అంతర్జాతీయ సంస్థలను రంగంలోకి దింపాలని నిర్ణయించింది. ఇందులోభాగంగా ఆసక్తి వ్యక్తీకరణ (ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంటరెస్ట్)ను జారీచేసింది. ఈ విషయాన్ని పీఎంసీ అదనపు కమిషనర్ రాజేంద్ర జగ్తాప్ వెల్లడించారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. ‘చెత్త తొలగింపు కోసం అనేక దేశాలు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నాయి. అటువంటి నైపుణ్యాన్ని ఇక్కడ కూడా వినియోగించుకోవాలని నిర్ణయించాం’ అని అన్నారు. అనేక పత్రికల్లో ఆసక్తి వ్యక్తీకరణ (ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంటరెస్ట్)కు సంబంధించిన ప్రకటనలను జారీచేశాం. కాంట్రాక్టు దక్కించుకునే సంస్థ 30 ఏళ్లపాటు చెత్త తొలగింపు, నిర్వహణ బాధ్యతలను నిర్వహించాల్సి ఉంటుంది. సదరు సంస్థ ఇక్కడ కొన్ని ప్లాంట్లను నెలకొల్పాల్సి ఉంటుంది. కనీసం 15 ప్లాంట్లను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఒక్కొక్క ప్లాంట్‌లో 100 నుంచి 250 టన్నుల చెత్తను ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా 500 టన్నుల చెత్తను ప్రాసెస్ చేసే సామర్థ్యం కలిగిన మరో భారీ ప్రాజెక్టును కూడా నిర్మించాల్సి ఉంటుంది. ఆసక్తి వ్యక్తీకరణపై స్పందన కోసం ఆయా అంతర్జాతీయ సంస్థలకు నెల రోజుల వ్యవధి ఇచ్చాం’ అని అన్నారు. ఇండోనేసియా, థాయ్‌లాండ్, జపాన్ తదితర దేశాలకు సంబంధించిన అధికారులతో పీఎంసీ సంప్రదింపులు జరుపుతోందన్నారు. ఈ మూడు దేశాలు చెత్త తొలగింపు శాస్త్రీయ ప్రక్రియను వినియోగిస్తున్నాయన్నారు. ఈ దేశాలకు ఆసక్తి వ్యక్తీకరణ (ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంటరెస్ట్) ప్రతులను పంపుతామన్నారు. స్థలకొరత సమస్య పుణే మున్సిపల్ కార్పొరేషన్ (పీఎంసీ) అధికారుల సమాచారం ప్రకారం నగరంలో ప్రతిరోజూ 1,600 మెట్రిక్ టన్నుల చెత్త తయారవుతుంది. స్థలాభావ సమస్య కారణంగా ఈ వ్యర్థాలను ఎక్కడ పారబోయాలనే అంశం పీఎంసీకి పెనుసవాలుగా మారింది. ప్రస్తుతం నగర శివారులోని ఫుర్సుంగి, ఉరులి గ్రామాల్లోగల ప్రాసెసింగ్ ప్లాంట్‌కు చెత్తను తరలిస్తున్నారు. పీఎంసీ ఇటీవల రాంటెక్డి ప్రాంతంలో మరో ప్లాంట్‌ను నిర్మించింది. అయితే ఇవి తమ సామర్థ్యం మేర పనిచేయకపోవడం భారీ డంపింగ్‌కు దారితీస్తోంది. డంపింగ్‌కు వ్యతిరేకంగా ఆందోళన చెత్త నుంచి వెలువడుతున్న దుర్వాసనను భరించలేక ఫుర్సుంగి, ఉరులి గ్రామాలకు చెందిన ప్రజలు ఇటీవల పీఎంసీ ఎదుట భారీస్థాయిలో ఆందోళన చేశారు. పీఎంసీకి వ్యతిరేకంగా నినదించారు. అంతటితో ఆగకుండా చెత్త లారీలు తమ గ్రామాల్లోకి రాకుండా అడ్డుకున్నారు. ఈ పరిణామాలు నగరంలో చెత్త భారీఎత్తున పేరుకుపోయేందుకు దారితీసింది. 15 శాతం ప్లాస్టిక్ వ్యర్థాలే డంపింగ్ కేంద్రాలకు వస్తున్న వ్యర్థాల్లో ప్లాస్టిక్ సామగ్రి అధికంగా ఉంది. ఇది దాదాపు 15 శాతంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో ప్లాస్టిక్ వ్యర్థాల తొలగింపునకు అత్యాధునిక ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు అత్యవసరంగా మారింది. మరోవైపు 50 మైక్రాన్ల కంటే తక్కువ మందం కలిగిన ప్లాస్టిక్ వస్తువుల వినియోగంపై పీఎంసీ నిషేధం విధించింది. ఉత్పత్తిదారులకు జరిమానా కూడా విధించింది. -
పెరుగుతున్న ప్లాస్టిక్ వ్యర్థాలు
పింప్రి, న్యూస్‌లైన్: పుణే నగరంలో ప్లాస్టిక్ వ్యర్థాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. ఈ కారణంగా స్థానికులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. నగరంలో పెరుగుతున్న చెత్తలో ప్లాస్టిక్ సమస్య అధికమవుతుండడంతో దీనిని నియంత్రించడానికి తగు చర్యలు తీసుకోవాలంటూ పుణే మున్సిపల్ కార్పొరేషన్ (పీఎంసీ) కమిషనర్ వికాస్ దేశ్‌ముఖ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. 50 మైక్రాన్ల కంటే తక్కువ మందం గల ప్లాస్టిక్ క్యారీ బ్యాగులను 28, మార్చి 2014 తరువాత వినియోగించే వారిని కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. ప్లాస్టిక్ కవరు వినియోగిస్తూ మొట్టమొదటిసారిగా పట్టుబడ్డ వారికి రూ. 5 వేలు, రెండోసారి పట్టుబడితే రూ. 10 వేల జరిమానా విధిస్తారు. నగరంలో ప్లాస్టిక్ బ్యాగులను కూరగాయలు, పండ్లు, విక్రయదారులతోపాటు తోపుడు బండ్లపై వ్యాపారాలు చేసేవారు ఎక్కువగా వినియోగదారులకు చేరవేస్తున్నారు. నగరంలో ప్రతి రోజూ జమ అయ్యే చెత్తలో 100 టన్నులకు పైగా ప్లాస్టిక్ వ్యర్థాలే ఉంటున్నాయి. దీనితో నగరంలో వాతావరణ కాలుష్యం నానాటికీ పెరిగిపోతోంది. ప్లాస్టిక్‌ను వర్గీకరించే విషయంలో సమస్యలు అధికమవుతుండడంతో దీనిని నియంత్రించాలని నిర్ణయించారు. 50 మైక్రాన్ల కంటే ఎక్కువ మందం కలిగిన ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్‌లను రూ. 15 లకు అమ్మాలని, థర్మాకోల్ గ్లాసులు, ప్లేట్లను నిషేధించాలంటూ ఇటీవల కార్పొరేషన్ సర్వ సభ్య సమావేశంలో తీర్మానించిన సంగతి విదితమే. విలీనంపై 18న నిర్ణయం చకాన్ సహా మొత్తం 20 గ్రామాల విలీనం విషయమై ఈ నెల 18వ తేదీన పింప్రి-చించ్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్ (పీసీఎంసీ) ఓ నిర్ణయం తీసుకోనుంది. పీసీఎంసీ పరిధిలోని గ్రామాలను కచ్చితంగా విలీనం చేయాల్సిందేనా లేకపోతే ఆ అవసరమేమీ లేదా అనే అంశంపై ఓ నివేదిక సమర్పించాలంటూ గత ఏడాది ఆగస్టులో పింప్రి-చించ్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్ (పీసీఎంసీ)ని రాష్ర్ట ప్రభుత్వం ఆదేశించిన సంగతి విదితమే. చ కాన్ను కొత్త మున్సిపల్ కౌన్సిల్‌గా మార్చేకంటే విలీనమే ఉత్తమమని అప్పట్లో ప్రభుత్వం సూచించింది. ఇందుకు స్పందించిన పీసీఎంసీ..సిటీ ఇంప్రూవ్మెంట్ కమిటీ ఈ ప్రతిపాదనపై చర్చించి, దానిని సర్వసభ్య సమావేశానికి నివేదిస్తుందంటూ జవాబిచ్చింది. అయితే హింజేవాడి, మాన్ తదితర గ్రామాలు అప్పట్లో ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించాయి. ప్రత్యేక మున్సిపల్ కౌన్సిల్ కావాలని డిమాండ్ చేశాయి. ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుంటాం ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకున్న తర్వాతే ఓ నిర్ణయానికొస్తామని ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ ప్రకటించారు. తాతవాడే తదితర గ్రామాల విలీనాన్ని అక్కడి ప్రజలు, నాయకులు 1997లో తీవ్రంగా వ్యతిరేకించారన్నారు. అందువల్లనే నిర్ణయం తీసుకోలేకపోయామన్నారు. అయితే ఇప్పుడు వారిలో కొంతమార్పు వచ్చిందన్నారు. 2009లో ఈ మార్పు స్పష్టంగా కనిపించిందన్నారు. కాగా పీసీఎంసీకి చెందిన అనేకమంది కార్పొరేటర్లు సైతం ఈ ప్రతిపాదనను వ్యతిరేకించిన విషయం విదితమే. -
విద్యకు పెద్ద పీట
పుణే: వచ్చే ఆర్థిక సంవత్సరానికిగాను నగర పాలక సంస్థ (పీఎంసీ) పాఠశాల బోర్డు కోసం రూ. 305 కోట్ల వార్షిక బడ్జెట్‌ను స్థాయీ సమితి ఎదుట ప్రవేశపెట్టింది. నగరపాలక సంస్థకు చెందిన పాఠశాల బోర్డుకు రూ. 300 కోట్లకంటే ఎక్కువ అధిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి. ఈ విషయమై స్థాయీ సమితి అధ్యక్షుడు విశాల్ తాంబే మాట్లాడుతూ ‘పాఠశాల బోర్డు రూ. 329 కోట్ల బడ్జెట్‌ను రూపొందించి దానిని పీఎంసీకి సమర్పించింది. అయితే పరిపాలనా విభాగం దానిలో కొన్ని సవరణలు చేసి రూ. 279 కోట్ల బడ్జెట్ ప్రతిపాదనను స్థాయీసమితి ముందుంచింది. ఏదిఏమైనప్పటికీ రూ. 305 కోట్ల మేర నిధులను కేటాయించాలని మేం నిర్ణయించాం. ఆమోదం కోసం దీనిని సర్వసభ్య సమావేశం ముందుంచాం’ అని అన్నారు. ఉద్యోగులకు రుణాలు పీఎంసీ సిబ్బంది సొంత ఇళ్లను నిర్మించుకోవడంతోపాటు వాహనాలు, కంప్యూటర్లను కొనుగోలు చేసేందుకు రుణ పథకం అందుబాటులోకి తీసుకురావాలని స్థాయీ సమితి ప్రతిపాదించిందని విశాల్ తాంబే తెలిపారు. రూ. ఆరు వేల గౌరవ వేతనం అందుకుంటున్న శిశు పాఠశాలకు చెందిన అధ్యాపకులకు మరో రూ. 1,000 మేర పెంచాలనే ప్రతిపాదన కూడా పరిశీలనలో ఉందన్నారు. ఇక పాఠశాల అధ్యాపకులు, ప్రధానోపాధ్యాయులకు కూడా వేతనాలను పెంచనున్నామన్నారు. విద్యార్థులకు ఉపకార వేతనం కూడా పెంచనున్నామన్నారు.ప్రత్యేక శిక్షణా కేంద్రం ఏర్పాటుకు కోటి రూపాయలు కేటాయించామన్నారు. స్థానిక ప్రభాత్ రోడ్డులోని సన్‌డ్యూ అపార్ట్మెంట్లో ఇది ప్రారంభమవుతుందన్నారు. పాఠశాలల నిర్వహణ సజావుగా సాగేందుకుగాను కార్పొరేట్ సంస్థల మద్దతు కోరాలని బోర్డు ప్రతిపాదించిందని, ఇందులోభాగంగా ఇప్పటికే కొన్ని సంస్థలను సంప్రదించిందని, అందుకు ఆయా సంస్థలు ముందుకొచ్చాయని వివరించారు. ఐఎంపీని అనుకరించండి బస్సు శీఘ్ర రవాణా వ్యవస్థను అమలు చేసే సమయంలో సమీకృత సంచార ప్రణాళిక (ఐఎంపీ)ని అనుకరించాలని నేషనల్ సొసైటీ ఫర్ క్లీన్ సిటీ (ఎన్‌ఎస్‌సీసీ) నగరపాలక సంస్థను కోరింది. ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ సంస్థ ప్రతినిధులు ఇటీవల పీఎంసీతో సమావేశమైన సందర్భంగా నగర్ రోడ్డు, అలంది మార్గాల్లో బీఆర్టీఎస్ మౌలిక సదుపాయాల కల్పన పనుల పురోగతిపై ఓ ప్రజెంటేషన్ ఇచ్చిన నేపథ్యంలో ఎన్‌ఎస్‌సీసీ ఈ మేరకు పీఎంసీ కమిషనర్‌కు ఓ లేఖ రాసింది. -
నీటిబొట్టు.. ఒడిసి పట్టు!
పుణే : నగరంలో నీటి సమస్యను పరిష్కరించేందుకు పుణే మున్సిపల్ కార్పొరేషన్ (పీఎంసీ) ప్రణాళికను సిద్ధం చేస్తోంది. మురుగునీటిని శుద్ధిచేసి తిరిగి వినియోగించుకోవాలని యోచిస్తోంది. ‘సాధారణంగా మన వాడుక నీటిలో 69 శాతం గ్రే వాటర్, 31 శాతం బ్లాక్ వాటర్ ఉంటాయి. బ్లాక్ వాటర్ నుంచి మురుగు నీరును వేరుచేసి శుద్ధి చేయగలిగితే శుద్ధి చేసేందుకు అయ్యే వ్యయాన్ని కొంతమేర తగ్గించుకోవచ్చు’ అని పీఎంసీ కార్పొరేటర్లు, అధికారులు అంటున్నారు. నగరంలోని 67వ వార్డు (సహకర్‌నగర్) కార్పొరేటర్ అబా బాగుల్ మాట్లాడుతూ ప్రాజెక్టు ఏర్పాటుకు గల ఆవశ్యకతను కార్పొరేషన్ అధికారులు ప్రజలకు వివరించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ‘వంటగదిలో, షవర్లు, వాషింగ్ మిషన్ల వాడకం ద్వారా మురుగు నీరు వస్తుంది. నివాస గృహాల్లో వినియోగం వల్ల విడుదలైన నీటిలో 50 -80 శాతం వ్యవసాయానికి, మరుగుదొడ్లు, ఇతర అవసరాలకు ఉపయోగపడుతుంది’ అని నిపుణులు చెబుతున్నారు. ‘మరుగుదొడ్లలో మురుగు నీరును తిరిగి వినియోగించుకునేందుకు అదనపు పైపులు, పంపులు, నిల్వ ట్యాంకు, శుద్ధి కేంద్రం ఏర్పాటుచేయాల్సి ఉంటుంది. ఇది కొంచెం ఖర్చుతో కూడుకున్న పని..’ అని వారు చెప్పారు. ‘మురుగు నీరు పునర్వినియోగ కేంద్రం ఏర్పాటుకు పీఎంసీ చాలా ఉత్సాహంగా ఉంది. ఒకసారి 67వ వార్డులో దీన్ని ఏర్పాటుచేసిన తర్వాత, నగరంలోని మిగిలిన వార్డుల్లో కూడా ఇటువంటి ప్లాంట్లు ఏర్పాటుకు స్థానికులు ముందుకు వస్తారనే నమ్మకం ఉంది..’ అని కార్పొరేటర్ బాగుల్ చెప్పారు. నీటి పునర్వినియోగ కేంద్రాల ఏర్పాటు వల్ల నగరంలో నీటి సమస్య కొంతవరకు తీరవచ్చన్నారు. ముఖ్యంగా వేసవిలో నీటిఎద్దడిని ఎదుర్కొనేందుకు ఇదే సరైన మార్గమన్నారు. మొక్కల పెంపకం, కార్లు కడగడానికి తదితర పనులకు మంచినీటికి బదులు ఈ నీటిని వాడుకోవచ్చన్నారు. ఇదిలా ఉండగా నగరంలో పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా నీటిసమస్యను ఎదుర్కొనేందుకు మురుగు నీరు పునర్వినియోగాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పీఎంసీ అధికారులు చెబుతున్నారు. జల శుద్ధీకరణ కేంద్రానికి నిధులు పుణే: రూ. 12 కోట్ల విలువైన వద్గావ్ జల శుద్ధీకరణ ప్రాజెక్టు నిర్మాణానికి పుణే మున్సిపల్ కార్పొరేషన్‌లోని స్థాయీ సమితి రూ. 11 కోట్లు మంజూరు చేసింది. 125 ఎంఎల్డీ నీటిని శుద్ధిచేయగల సామర్థ్యం గల ఈ ప్లాంట్‌ను జవహర్లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రెన్యువల్ మిషన్ సాయంతో కార్పొరేషన్ నిర్మించనుంది. -
అభివృద్ధి ప్రణాళికకు ఆమోదం
పుణే: నగరం ఇక అభివృద్ధి దిశగా పరుగులు తీయనుంది. రానున్న మూడు దశాబ్దాల కాలానికి సంబంధించి రూపొందించిన నగర అభివృద్ధి ప్రణాళిక (సీడీపీ)కు పుణే మున్సిపల్ కార్పొరేషన్ (పీఎంసీ) ఆమోదం తె లిపింది. ఈ ప్రణాళిక అమలుకు అయ్యే మొత్తాన్ని జవహర్లాల్ నెహ్రూ పట్టణ పునరాభివృద్ధి పథకం (జేఎన్ఎన్యూఆర్ఎం) కింద కేంద్ర ప్రభుత ్వం అందజేస్తుంది. ఈ ప్రణాళికకు బుధవారం జరిగిన సమావేశంలో సభ్యులు తమ ఆమోదముద్ర వేశారు. కాగా జవహర్లాల్ నెహ్రూ పట్టణ పునరాభివృద్ధి పథకం కింద ఎంపికైన నగరాలకు కేంద్ర ప్రభుత్వం రెండో విడత కింద నిధులను అందజేయనుంది. ఈ విషయమై పీఎంసీ ఇంజనీర్ ప్రశాంత్ వాఘ్మారే బుధవారం మీడియాతో మాట్లాడుతూ జేఎన్ఎన్యూఆర్ఎం మార్గదర్శకాలకు లోబడి సీడీపీని రూపొందించామన్నారు. కాగా అనేక అధ్యయనాల అనంతరం పీఎంసీ నగర అభివృద్ధి ప్రణాళికను రూపొం దించింది. అంతేకాకుండా అనేకమంది నిపుణుల సలహాలు, సూచనలను స్వీకరించింది. దీంతోపాటు నగరవాసుల అభిప్రాయాలను కూడా సేకరించింది. ఆ తర్వాతే ఈ ప్రణాళికకు తుదిరూపు ఇచ్చింది. ఈ విషయమై పీఎంసీ కమిషనర్ మహేష్ పాఠక్ మాట్లాడుతూ పెద్ద పెద్ద ప్రాజెక్టులను సమర్థంగా చేపట్టేందుకు నగర అభివృద్ధి ప్రణాళిక (సీడీపీ) దోహదం చేస్తుందన్నారు. కాగా రూ. 88.443 కోట్లతో సంబంధిత అధికారులు ఈ ప్రణాళికను రూపొందించారు. -
ఇకపై పుణేలో రెండు పూటలా నీటి సరఫరా
పింప్రి, న్యూస్‌లైన్: పుణే నగర ప్రజలకు శుభవార్త. ఇకపై రెండుపూటలా నీటిని సరఫరా చేయాలని పుణే మున్సిపల్ కార్పొరేషన్ (పీఎంసీ) నిర్ణయిచింది. ఇందుకు కారణం ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నగరానికి నీటిని అందించే రిజర్వాయర్లు నిండిపోవడమే. కొరత సమస్య కారణంగా పీఎంసీ ప్రస్తుతం నగర వాసులకు రోజుకు ఒక్కసారి మాత్రమే నీటిని సరఫరా చేస్తోంది. అయితే ఇటీవల కురిసిన భారీ వర్షాలు కొరత సమస్యను అధిగమించేవిధంగా చేశాయి. ఆగస్టు, సెప్టెంబర్లలో రెండు నెలలపాటు ఉదయం, సాయంత్రం మంచి నీటిని సరఫరా చేయాలని నిర్ణయించామని, ఆ తర్వాత అక్టోబర్‌లో జరిగే నీటి పారుదల విభాగం సమావేశంలో ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకుంటామని పీఎంసీ ఇంజనీర్ ప్రశాంత్ వాఘ్మారే తెలిపారు. కాగా కత్రజ్, జాంబుల్వాడి, ధనకావాడి, అప్పర్ ఇందిరానగర్, భారతీ విద్యాపీఠ్, కన్హే, ఆంబేగావ్ పఠార్, బాలాజీ నగర్ తదితర ప్రాంతాల్లో రోజుకొకసారి మాత్రమే నీటి సరఫరా జరుగుతోంది. దీంతో ఈ ప్రాంతాలకు రెండు పూటలా నీటిని సరఫరా చేసేందుకు సంబంధిత అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఎనిమిదిన నీటి సరఫరా బంద్ రావేత్లోని నీటి సరఫరా కేంద్రంలో విద్యుద్దీకరణ పనులు చేపడుతుండడంతో వాఘోళి పరిసర ప్రాంతాలకు గురువారం నీటి సరఫరా నిలిపివేయనున్నారు. అయితే శుక్రవారం తక్కువ ఒత్తిడితో నీటి సరఫరా చేస్తామని నీటి సరఫరా విభాగం ఇంజనీరు ఒకరు వెల్లడించారు. క్రమబద్ధీకరణ దిశగా... తన పరిధిలోని అక్రమ నల్లాలను క్రమబద్ధీకరించే దిశగా పింప్రి-చించ్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్ (పీసీఎంసీ) అడుగులు వేస్తోంది. ఇందుకు సంబంధించి ఓ ప్రణాళికను రూపొందించింది. నగరంలో దాదాపు పదివేల అక్రమ కనెక్షన్లు ఉన్నట్టు అధికారుల అధ్యయనంలో తేలింది. వాస్తవానికి అక్రమ కనెక్షన్లను క్రమబద్ధీకరించాలని ఈ ఏడాది ఏప్రిల్‌లోనే పీసీఎంసీ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఆమ్నెస్టీ అనే ఓ పథకాన్ని ప్రవేశపెట్టింది. అయితే ఈ పథకానికి నగరవాసులనుంచి ఆశించినమేర స్పందన రాలేదు. కేవలం 900 మంది మాత్రమే తమ కనెక్షన్లను క్రమబద్ధీకరించుకున్నారు. క్రమబద్ధీకరణ ఫీజును రెట్టింపు చేయడంతో అనేకమంది వెనక్కితగ్గారు. ఇదిలాఉండగా పీసీఎంసీకి 80 కోట్ల మేర నీటిబకాయిలు రావాల్సి ఉంది. వీటిని వసూలు చేసుకునేందుకు కార్పొరేషన్ సన్నద్ధమవుతోంది. ఈ విషయమై పీసీఎంసీ కార్యనిర్వాహక ఇంజనీర్ ప్రవీణ్ లడ్కత్ మాట్లాడుతూ బకాయిదారులకు మరో అవకాశమిస్తామన్నారు. ఇక అక్రమ కనెక్షన్ల క్రమబద్ధీకరణ కోసం గతంలో ప్రవేశపెట్టిన ఆమ్నెస్టీ పథకంలో ప్రస్తుతం కొన్నిమార్పులుచేర్పులు చేశామన్నారు. అక్రమ కనెక్షన్లు ఉన్నవారు అక్టోబర్, 30వ తేదీలోగా క్రమబద్ధీకరించుకోవాలన్నారు. ఆలోగా కొత్త కనెక్షన్లను అమర్చుకోవాలన్నారు. రాబడి పెంపునకు చర్యలు రాబడి పెంపుదిశగా పీసీఎంసీ అడుగులు వేస్తోంది. స్థానిక సంస్థల పన్ను (ఎల్బీటీ) అమల్లోకి వచ్చిన తర్వాత దాదాపు రూ. 150 కోట్ల మేర నష్టపోయిన కార్పొరేషన్ ఆస్తి పన్ను, నీటి పన్ను, భవన నిర్మాణ అనుమతుల విభాగాల రాబడి పెంచేందుకు అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నామని పీసీఎంసీ కమిషనర్ శ్రీకర్ పరదేశి చెప్పారు. ఇప్పటిదాకా పన్ను చెల్లించని భవనాలను గుర్తించి, వాటి యజమానుల వద్ద వార్షిక పన్ను వసూలు చేస్తామన్నారు. ఇటువంటివి రెండు లక్షల భవనాలు ఉండొచ్చని తాము అంచనా వేస్తున్నామన్నారు. వీరందరి వద్ద పన్ను వసూలు చేస్తామన్నారు. తద్వారా రాబడి లోటును పూడుస్తామన్నారు. 2013-14 తొలిత్రైమాసికంలో ఎల్బీటీ కింద రూ. 221.78 కోట్లు వసూలయ్యాయన్నారు. అయితే గత ఆర్థిక సంవత్సరంలో అప్పట్లో అమలులో ఉన్న ఆక్ట్రాయ్ కింద రూ. 293 కోట్లు వసూలయ్యాయని ఆయన వివరించారు.