pune warriors
-
LSG VS PBKS: ఆ ఒక్కడే తప్పించుకున్నాడు.. అప్పుడు భువీ..!
ఐపీఎల్-2023లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో నిన్న (ఏప్రిల్ 28) జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిన విషయం విధితమే. ఒక్కరు కూడా సెంచరీ చేయకపోయినా లక్నో బ్యాటర్లు ఐపీఎల్ చరిత్రలో రెండో అత్యధిక స్కోర్ (257) నమోదు చేశారు. కైల్ మేయర్స్ (54), ఆయూష్ బదోని (43), స్టోయినిస్ (72), పూరన్ (45) విధ్వంసం ధాటికి పంజాబ్ బౌలర్లు బెంబేలెత్తిపోయారు. అయితే లక్నో బ్యాటర్ల బారి నుంచి ఒక్క పంజాబ్ బౌలర్ మాత్రం తప్పించుకున్నాడు. అతడే రాహుల్ చాహర్.ఈ మ్యాచ్‌లో పంజాబ్ కెప్టెన్ ఏడుగురు బౌలర్లతో బౌలింగ్ చేయించగా, రాహుల్ చాహర్ ఒక్కడే పొదుపుగా బౌలింగ్ చేశాడు. తన కోటా 4 ఓవర్లను అద్భుతంగా బౌల్ చేసిన చాహర్.. 29 పరుగులు మాత్రమే ఇచ్చి, శివాలెత్తి ఉన్న లక్నో బ్యాటర్లను కట్టడి చేశారు. మరోవైపు మిగతా పంజాబ్ బౌలర్లు లక్నో బ్యాటర్ల ఊచకోతను విలవిలలాడిపోయారు. గుర్నూర్ సింగ్ బ్రార్ 3 ఓవర్లలో 42 పరుగులు, అర్షదీప్ సింగ్.. తన ఐపీఎల్ కెరీర్లో అత్యంత చెత్త గణాంకాలు (4-0-54-1), రబాడ 4 ఓవర్లలో 52 పరుగులు, సికందర్ రజా ఒక ఓవర్లో 17, సామ్ కర్రన్ 3 ఓవర్లలో 38, లివింగ్‌స్టోన్ ఒక ఓవర్లో 19 పరుగులు సమర్పించుకున్నారు. ఛేదనలో పంజాబ్ ఆటగాళ్ల ధాటికి లక్నో బౌలర్లు సైతం భారీగా పరుగులు సమర్పించుకున్నప్పటికీ.. యశ్ ఠాకూర్ (4/37), నవీన్ ఉల్ హాక్ (3/30) క్రమం తప్పకుండా వికెట్లు తీసి ప్రత్యర్ధి ఓటమిని ఖరారు చేశారు. రవి బిష్ణోయ్ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నప్పటికీ, 2 కీలక వికెట్లు (అథర్వ టైడే (66), లివింగ్‌స్టోన్ (23)) తీశాడు. అప్పట్లో భువీ కూడా ఇంతే.. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోర్ (ఆర్సీబీ- 263) నమోదైన మ్యాచ్‌లోనూ ఇదే తరహాలో ఓ బౌలర్ ఆర్సీబీ బౌలర్ల బారి నుంచి తప్పించుకున్నాడు. నాటి మ్యాచ్‌లో పూణే బౌలర్లంతా విచ్చలవిడిగా పరుగులు సమర్పించుకుంటే.. ఒక్క భువనేశ్వర్ కుమార్ మాత్రం తాండవం చేస్తుండిన ఆర్సీబీ బ్యాటర్లను, ముఖ్యంగా అప్పటికే ఊగిపోతున్న క్రిస్ గేల్‌ను కట్టడి చేశాడు. ఆ మ్యాచ్‌లో భువీ 4 ఓవర్లు వేసి కేవలం 23 పరుగులు మాత్రమే ఇవ్వగా.. మిగతా బౌలర్లంతా 12 నుంచి 29 ఎకానమీ మధ్యలో పరుగులు సమర్పించుకున్నారు. -
మరోసారి ‘సూపర్ కింగ్స్’
ఐపీఎల్ తొలిసారి ఎనిమిదినుంచి పది జట్లకు పెరిగింది. కొత్తగా పుణే వారియర్స్, కొచ్చి టస్కర్స్ కేరళ జట్లు వచ్చి చేరాయి. అయితే గత మూడు సీజన్ల ఫార్మాట్‌లాగే ప్రతీ జట్టు మరో జట్టుతో ఇంటా, బయట రెండేసి చొప్పున ఆడితే మ్యాచ్‌ల సంఖ్య ఏకంగా 94కు పెరిగే అవకాశం ఉండటంతో ఫార్మాట్లో కొన్ని మార్పులు చేశారు. పది టీమ్‌లను రెండు గ్రూప్‌లుగా విభజించి తమ గ్రూప్‌లోని నాలుగు జట్లతో రెండేసి మ్యాచ్‌లు, మరో గ్రూప్‌లోని ఒక జట్టుతో రెండు మ్యాచ్‌లు, మిగిలిన నాలుగు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతూ ఒక్కో టీమ్ గరిష్ట మ్యాచ్‌లు 14కు మించకుండా జాగ్రత్త పడ్డారు. అయితే ఈ షెడ్యూల్ చాలా కంగాళీగా మారిపోవడంతో అభిమానులు కూడా చాలా మ్యాచ్‌ల సమయంలో గందరగోళానికి గురయ్యారు. తొలిసారి నేరుగా సెమీ ఫైనల్, ఫైనల్ అర్హత కాకుండా ప్రస్తుతం ఉన్న తరహాలో ‘ప్లే ఆఫ్’ పద్ధతిని ప్రవేశపెట్టడం విశేషం. ఎన్ని మార్పులు జరిగినా ధోని టీమ్ జోరును మాత్రం ప్రత్యర్థులు అడ్డుకోలేకపోయారు. ఫలితంగా చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా రెండో సారి విజేతగా నిలవగా, మూడేళ్లలో రెండో సారి ఫైనల్ చేరిన బెంగళూరు మళ్లీ రన్నరప్‌గానే సంతృప్తి పడింది. మళ్లీ వేలం... తొలి మూడు సీజన్లు ముగియడంతో పాటు కొత్త జట్లు రావడంతో ఈ సారి మళ్లీ పూర్తి స్థాయి వేలం నిర్వహించడంతో పలు జట్లలో ఆటగాళ్లు మారిపోయారు. చెన్నై (ధోని, రైనా, విజయ్, మోర్కెల్), ఢిల్లీ (సెహ్వాగ్), ముంబై (సచిన్, హర్భజన్, పొలార్డ్, మలింగ), రాజస్థాన్ (వార్న్, వాట్సన్), బెంగళూరు (కోహ్లి)లను మాత్రమే కొనసాగించగా...కోల్‌కతా, పంజాబ్, హైదరాబాద్ మొత్తం ఆటగాళ్లను విడుదల చేశాయి. ఈ వేలంలోనే ముంబైకి వచ్చిన రోహిత్ శర్మ, బెంగళూరు ఎంచుకున్న ఏబీ డివిలియర్స్ మాత్రమే మార్పు లేకుండా ఇప్పటికీ అదే జట్లలో కొనసాగుతున్నారు. ముందుగా వేలంలో అమ్ముడుపోని క్రిస్ గేల్... డర్క్ నేన్స్ గాయం కారణంగా చివరి నిమిషంలో ఆర్సీబీ వద్దకు వచ్చి ఆ జట్టు రాత మార్చడం విశేషం. ఆ తర్వాత అతడి ఎన్నో సుడి గాలి ఇన్నింగ్స్‌లకు ఐపీఎల్ వేదికగా నిలిచింది. సౌరవ్ గంగూలీని కూడా ఎవరు తీసుకోకపోగా, నెహ్రా గాయంతో చివరకు పుణే టీమ్‌లో అవకాశం లభించింది. ఫైనల్ ఫలితం... చెన్నై వేదికగా జరిగిన ఫైనల్లో సూపర్ కింగ్స్ 58 పరుగుల భారీ తేడాతో బెంగళూరును చిత్తుగా ఓడించింది. ముందుగా ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ మురళీ విజయ్ (95), మైక్ హస్సీ (63) బ్యాటింగ్‌తో చెన్నై 5 వికెట్లకు 205 పరుగులు చేసింది. అనంతరం బెంగళూరు 8 వికెట్లకు 147 పరుగులే చేయగలిగింది. టోర్నీలో భీకర ఫామ్‌తో టాప్ స్కోరర్‌గా నిలిచిన క్రిస్ గేల్‌ను అశ్విన్ తొలి ఓవర్లోనే ఔట్ చేయడంతో ఆర్సీబీ కోలుకోలేకపోయింది. ప్లేయర్ ఆఫ్ ద సిరీస్: క్రిస్ గేల్ అత్యధిక పరుగులు (ఆరెంజ్ క్యాప్): క్రిస్ గేల్ (బెంగళూరు – 608) అత్యధిక వికెట్లు (పర్పుల్ క్యాప్): లసిత్ మలింగ (ముంబై – 28) 6 సెంచరీలు... టోర్నీలో గేల్ 2 సెంచరీలు బాదగా... సచిన్, పాల్ వాల్తాటి, సెహ్వాగ్, గిల్‌క్రిస్ట్ ఒక్కో సెంచరీ కొట్టారు. టోర్నీలో అమిత్ మిశ్రా (దక్కన్ చార్జర్స్) ఏకైక హ్యాట్రిక్ నమోదు చేశాడు. దాదాపుగా వాళ్లే... గత ఏడాది విజేతగా నిలిచినా, వేలం కారణంగా చెన్నై జట్టులో కూడా పలు మార్పులు జరిగాయి. ప్రధాన ఆటగాళ్లు మినహా మరికొందరు వచ్చి చేరారు. టోర్నీలో ఆడిన 17 మందిలో ధోని, సాహా, బద్రీనాథ్, హస్సీ, రైనా, విజయ్, మోర్కెల్, డ్వేన్ బ్రేవో, సూరజ్ రణ్దీవ్, అశ్విన్, జోగీందర్ శర్మ, స్టయిరిస్, బొలింజర్, సౌతీ, కులశేఖర ఉండగా... అనిరుధ శ్రీకాంత్, షాదాబ్ జకాతి మాత్రమే ఎప్పుడూ జాతీయ జట్టుకు ఎంపిక కాలేదు. ఒకే ఓవర్లో 37... కొచ్చి బౌలర్ ప్రశాంత్ పరమేశ్వరన్ వేసిన ఓవర్లో క్రిస్ గేల్ వరుసగా 6, 6 (నోబాల్), 4, 4, 6, 6, 4 బాదడం విశేషం. 4 సిక్సర్లు, 3 ఫోర్లు కలిపి గేల్ 36 పరుగులు బాదగా, మొత్తం 37 పరుగులు వచ్చాయి. -
పుణేను పరుగెత్తిస్తాడా?
► ధోనిపై ఫ్రాంచైజీ ‘కోట్లాది’ ఆశలు ► ఐపీఎల్లో విజయమే లక్ష్యం ► బ్రాండింగ్‌కూ అతని అవసరం ► గతంలో అన్ని ఆటల్లో పుణే వైఫల్యం ఐపీఎల్లో సహారా పుణే వారియర్స్ జట్టు మూడేళ్లు ఆడింది. రెండు సార్లు చివరినుంచి రెండో స్థానంతో సరిపెట్టుకుంటే ఒక సారి అట్టడుగున నిలిచింది. ఒక్కసారి కూడా నాకౌట్ దశకు చేరలేకపోయిన ఆ జట్టు ఇప్పుడు పూర్తిగా రద్దయిపోయింది. ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్‌లో పుణే పిస్టన్స్ ఒక సీజన్లో ఆడి సెమీస్ వరకు రాగలిగింది. వచ్చే జనవరిలో జరగబోయే ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్‌లో ఆ జట్టు పేరే లేదు. ఇండియన్ సూపర్ లీగ్ ఫుట్‌బాల్‌లో పుణే ఎఫ్‌సీ తొలి సీజన్లో ఎనిమిది జట్లలో పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో నిలిచింది. 2015లో మరింత దిగజారి ఏడో స్థానంతో సరిపెట్టుకుంది. సూపర్ సక్సెస్‌గా నిలిచిన ప్రొ కబడ్డీ లీగ్‌లో పుణేరి పల్టన్ వరుసగా రెండేళ్లు చివరి స్థానంతోనే ముగించింది. 28 మ్యాచ్‌లలో ఆ జట్టు గెలిచినవి 4 మాత్రమే. కారణమేదైనా లీగ్ స్పోర్ట్స్‌లో ఈ మరాఠా నగరం ప్రదర్శన ఏ మాత్రం ఆకట్టుకునేలా లేదు. ఆట ఏదైనా ఆ జట్టు ఇప్పటి వరకు టైటిల్ కాదు కదా... కనీసం ఫైనల్‌కు కూడా చేరలేదు. సొంతగడ్డపై అత్యంత విఫలమైన జట్టు తమదే అంటూ అక్కడి సగటు క్రీడాభిమాని కూడా ఆవేదనగా చెప్పుకున్నాడు. ఇప్పుడు మళ్లీ కొత్త కొత్తగా పుణే ఐపీఎల్‌లోకి అడుగు పెడుతోంది. గతంలోని పాత జట్టుతో పోలిస్తే నాయకుడిగా ధోని రూపంలో జట్టు బలం రెట్టింపు అయిందనడంలో సందేహం లేదు. సర్వ కాల సర్వావస్థల్లో కెప్టెన్‌గా అద్భుత రికార్డు ఉన్న ధోని వచ్చే రెండేళ్లు పుణే రాత మార్చి విజయం వైపు నడిపిస్తాడా! తనతో పాటు ఆ జట్టు స్థాయి పెంచగలడా! మొత్తానికి ఫ్రాంచైజీ మాత్రం అతనిపై ఎన్నో అంచనాలు, ఆశలు పెట్టుకుంది. ఆటతో పాటు అతని మార్కెటింగ్ సత్తాను కూడా పూర్తిగా ఉపయోగించుకోవాలని భావిస్తోంది. అందుకే ధోనినే నమ్ముకొని భారీ పెట్టుబడితో లీగ్‌కు సిద్ధమైంది. సాక్షి క్రీడా విభాగం ఐపీఎల్లో ధోని విలువ ప్రత్యేకం. బ్యాట్స్‌మన్‌గా ఎన్నో చిరస్మరణీయ ఇన్నింగ్స్,‘ఫినిషింగ్ టచ్’ లతో అభిమానులను అలరించాడు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు కెప్టెన్‌గా రెండు ఐపీఎల్ టైటిల్స్, రెండు చాంపియన్స్ లీగ్ ట్రోఫీలు అందించాడు. అందరికంటే ఎక్కువగా 129 మ్యాచ్‌లలో కెప్టెన్‌గా వ్యవహరించిన ధోని సారథ్యంలో జట్టు 78 మ్యాచ్ లు నెగ్గింది. వ్యూహ ప్రతివ్యూహాల్లో అతని ముందు ఇతర కెప్టెన్లు బలాదూర్. జట్టు మారినా ఈ ఘనత అంతా ధోనికి తోడుగా వచ్చేదే. ఇదంతా చెన్నైనుంచి తమకు ‘బదిలీ’ అవుతుందని పుణే గట్టిగా నమ్ముతోంది.ఇప్పుడు కొత్త జట్టును కూడా తన సామర్థ్యంతో బాగా నడిపించగల స్థాయి ధోనిది. కాబట్టి ఐపీఎల్‌కు సంబంధించినంత వరకు వచ్చే రెండు సీజన్లలో పుణే కీలక జట్టుగా మారనుంది. పూర్తిగా వాడుకుంటారు ఐపీఎల్లో అడుగు పెట్టడం అంటే పూర్తిగా వాణిజ్యపరమైన లాభానికి గ్యారంటీ ఏమీ లేదు. ‘గోయెంకా గ్రూప్ పుణే జట్టును కొనుక్కోగానే అదే సంస్థకు చెందిన సీఈఎస్ఈ లిమిటెడ్‌కు చెందిన షేర్ల విలువ పడిపోవడం చూస్తే ఐపీఎల్ ఒక రకమైన బిజినెస్ రిస్క్ అని చెప్పవచ్చు’ అని నిపుణులు వ్యాఖ్యానించడం దీనికి ఉదాహరణ. అయితే క్రికెట్ ప్రపంచంలో అడుగు పెట్టాలనే ఆసక్తితో పాటు తమ బిజినెస్ గ్రూప్‌లను సాధ్యమైనంతగా ప్రమోట్ చేసుకోవాలని ఫ్రాంచైజీ కోరుకుంటుంది. అందుకే రెండేళ్ల స్వల్ప వ్యవధి అయినా ఆ జట్టు కనీసం రూ. 100 కోట్లు ప్రాథమికంగా ఖర్చు చేసేందుకు సిద్ధమైంది. దాదాపు రూ. 12 వేల కోట్ల విలువ గల ఈ గ్రూప్‌నకు అది పెద్ద మొత్తం కాకపోవచ్చు గానీ నష్టాలను సాధ్యమైనంత తగ్గించేందుకు పుణే ఇప్పుడు ధోని బ్రాండ్‌ను వాడుకునేందుకు సిద్ధమైంది. ‘బీసీసీఐనుంచి కూడా డబ్బు రాదు కాబట్టి ఫ్రాంచైజీ సొంత ప్రత్యామ్నాయాలు చూసుకోవాలి. వేలంలో ఉన్న ఇతర ఆటగాళ్లతో పోలిస్తే ధోని విలువ కనీసం రెండు రెట్లు ఎక్కువ ఉం టుంది. వాణిజ్యపరంగా ముందు వరుసలో నిలిచే పేరు కాబట్టి బ్రాండింగ్, స్పాన్సర్‌షిప్‌లు అతనితోనే కొత్త జట్టు వద్దకూ వస్తాయి’ అని పీఎంజీ సంస్థ సీఓఓ మెల్రాయ్ డిసౌజా విశ్లేషించారు. ఫ్యాన్స్ కూడా అటు వైపే వ్యాపార వర్గాలే కాదు... ఇప్పటి వరకు చెన్నై సూపర్ కింగ్స్‌కు మద్దతుగా నిలిచిన ఫ్యాన్స్ కూడా పుణే వైపే మరలుతారని ఫ్రాంచైజీ ఆశిస్తోంది. వారి దృష్టిలో రజినీకాంత్ స్థాయి ఉన్న మహి... సీఎస్కే జట్టులాగే తమ టీమ్ స్థాయి కూడా పెంచాలని గోయెంకా గ్రూప్ కోరుకుంటోంది. బరిలో చెన్నై కూడా ఉంటూ మరో జట్టుగా పుణే వస్తే సమస్య వచ్చేదేమో గానీ ఇప్పుడు ఆ టీమ్ లేదు కాబట్టి ఫ్యాన్స్, బిజినెస్ విషయంలో గందరగోళం లేదు. ‘ధోనికి ఇచ్చే డబ్బు విలువ చూస్తే చాలా ఎక్కువగా కనిపిస్తోంది. కానీ ధోని ధోనియే. బ్రాండ్ వల్లే కాదు అతనికి ఉన్న పాపులారిటీ, నాయకత్వ పటిమ, జట్టు విజయావకాశాలు పెంచుతుంది కాబట్టి అతనిపై ఎంత పెట్టుబడి పెట్టినా అది రాబట్టగల శక్తి ధోనికే ఉంది’ అని పుణే ఫ్రాంచైజీకి చెందిన ప్రతినిధి ఒకరు వెల్లడించారు. అయితే తాము కేవలం వ్యాపార కోణంలోనే చూడటం లేదని, ఐపీఎల్లో పుణే జట్టు ముద్ర కూడా కనిపించాలని, ధోని టైటిల్ గెలిపించాలని కూడా కోరుకుంటున్నట్లు ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మరి ‘కెప్టెన్ కూల్’ పుణే అభిమానులను ఈ సారైనా సంతోషపరుస్తాడా! -
హైదరాబాద్ విజయం
సాక్షి, హైదరాబాద్: చాంపియన్స్ టెన్నిస్ లీగ్ (సీటీఎల్)లో చెన్నై వారియర్స్‌పై హైదరాబాద్ ఏసెస్ ఆధిపత్యం కొనసాగింది. చెన్నైలో జరిగిన తొలి దశ మ్యాచ్‌లో ఆ జట్టును చిత్తు చేసిన ఏసెస్ రెండో మ్యాచ్‌లోనూ సత్తా చాటింది. సోమవారం ఇక్కడి ఎల్బీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఏసెస్ 5-3, 5-2, 5-4, 5-4, 5-6 (25-19 గేమ్‌ల)తో చెన్నైని చిత్తు చేసింది. ఆదివారం నాగ్‌పూర్ ఆరెంజర్స్ చేతిలో పరాజయం పాలైన ఏసెస్ ఆటగాళ్లు ఈ మ్యాచ్‌లో చెలరేగారు. ముందుగా లెజెండ్స్ మ్యాచ్‌లో థామస్ జొహన్సన్ 5-3తో రైనర్ షట్లర్‌ను ఓడించి జట్టుకు ఆధిక్యం అందించాడు. మహిళల సింగిల్స్‌లో మార్టినా హింగిస్ 5-2 తో హీతర్ వాట్సన్‌ను చిత్తు చేసి ఆధిక్యాన్ని మరింత పెంచింది. ఆ తర్వాత మిక్స్డ్ డబుల్స్‌లోనూ హైదరాబాద్ జోడి కార్లోవిచ్-హింగిస్ 5-4తో చెన్నై జంట వెర్డాస్కో-వాట్సన్‌ను ఓడించింది. పురుషుల డబుల్స్‌లో ఏసెస్ ద్వయం కార్లోవిచ్-జీవన్ 5-4తో వెర్డాస్కో-విష్ణువర్ధన్‌లపై గెలవగా... చివరి మ్యాచ్ పురుషుల సింగిల్స్‌లో మాత్రం వారియర్స్ ప్లేయర్ వెర్డాస్కో 6-5తో కార్లోవిచ్‌ను ఓడించి ప్రత్యర్థి ఏకపక్ష విజయాన్ని అడ్డుకున్నాడు. శుక్రవారం నాగ్‌పూర్‌లో జరిగే తమ చివరి లీగ్ మ్యాచ్‌లో ఏసెస్, ఆరెంజర్స్‌తో రెండోసారి తలపడుతుంది. -
లాంఛనం ముగిసింది
చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో పుణే వారియర్స్ కథ ముగిసింది. ఈ ఫ్రాంచైజీని రద్దు చేస్తున్నట్టు బీసీసీఐ ప్రకటించింది. శనివారం చెన్నైలో జరిగిన బోర్డు వర్కింగ్ కమిటీ సమావేశంలో ఏకగ్రీవంగా ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. లీగ్‌లో కొనసాగాలంటే బ్యాంకు పూచీకత్తు సొమ్మును జమ చేయాల్సిందిగా బోర్డు పలుమార్లు గుర్తు చేసినా సహారా స్పందించకపోవడంతో వారి జట్టును తప్పించేందుకే నిర్ణయించారు. ఈ సమావేశానికి ఐపీఎల్ పాలక మండలి సభ్యులు కూడా హాజరయ్యారు. ఓవరాల్‌గా ఐపీఎల్ నుంచి బయటకు వెళ్లిన మూడో జట్టుగా పుణే పేరు తెచ్చుకుంది. గతంలో వివిధ కారణాల రీత్యా కొచ్చి టస్కర్స్, డెక్కన్ చార్జర్స్‌పై కూడా వేటు పడింది. దీంతో ఇక ఐపీఎల్లో ఎనిమిది జట్లే మిగిలాయి. రాబోయే సీజన్‌కు సిద్ధం కావాలంటే పుణే జట్టుపై ఏదో ఒక నిర్ణయానికి రావాల్సి ఉందని బోర్డు అభిప్రాయపడింది. ‘2014 సీజన్లో పుణే ఫ్రాంచైజీ బరిలో ఉండాలంటే రూ.170.2 కోట్ల బ్యాంకు పూచీకత్తు సొమ్మును గత మార్చిలోనే జమ చేయాల్సి ఉంది. ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు ఇప్పటికి ఐదు సార్లు ఈ విషయమై వారికి గుర్తు చేశాం. అయినా స్పందన లేదు. అందుకే బోర్డు వారి బ్యాంకు పూచీకత్తును సొమ్ము చేసుకుంది’ అని బీసీసీఐ కార్యదర్శి సంజయ్ పటేల్ పేర్కొన్నారు. విభేదాలు మొదలయ్యాయిలా... ఫ్రాంచైజీ ఫీజు చెల్లించని కారణంగా ఐపీఎల్ ఆరో సీజన్ కోసం సహారా బ్యాంకు పూచీకత్తును బోర్డు సొమ్ము చేసుకోవడంతో ఇరువురి మధ్య విభేదాలు నెలకొన్నాయి. అప్పుడే ఐపీఎల్ నుంచి తాము తప్పుకుంటున్నట్టు సహారా ప్రకటించింది. అయితే బోర్డుకు మాత్రం అధికారికంగా చెప్పలేదు. మరోవైపు మ్యాచ్‌ల సంఖ్య తగ్గించడంతో తమకు ఆర్థికంగా నష్టం చేకూరుతుంది కాబట్టి ఫ్రాంచైజీ ఫీజు తగ్గించాలని సహారా వాదించింది. ఈ సమస్యను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవాలని ఇరు వర్గాలు భావించినా ఫలితం లేకపోయింది. ఐపీఎల్ చరిత్రలోనే పుణే వారియర్స్ అత్యంత ఖరీదైన (రూ.1702 కోట్లు) జట్టుగా ఉండడంతో... ఈ నిర్ణయంతో అటు బీసీసీఐకి కూడా ఆర్థికంగా నష్టం కలుగనుంది. బోర్డు నమ్మకద్రోహం చేసింది న్యూఢిల్లీ: ఐపీఎల్ నుంచి తమ జట్టును తీసేయడంతో సహారా గ్రూప్ బీసీసీఐపై ధ్వజమెత్తింది. బోర్డు నమ్మక ద్రోహానికి పాల్పడడమే కాకుండా ఎప్పుడూ తమ బాధ్యతలను సక్రమంగా నెరవేర్చలేదని ఆరోపించింది. -
పుణె వారియర్స్‌పై బీసీసీఐ వేటు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో మరో వికెట్ పడింది. కోచి టస్కర్స్, డెక్కన్ చార్జర్స్ బాటలో పుణె వారియర్స్ కథ ముగిసింది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) పుణెతో ఒప్పందాన్ని రద్దు చేసింది. బ్యాంక్ పూచికత్తును సమర్పించని కారణంగా పుణెపై వేటు వేసింది. శనివారం సమావేశమైన బీసీసీఐ వర్కింగ్ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు కూడా సమావేశంలో పాల్గొన్నారు. బోర్డు 30 రోజుల ఉద్వాసన నోటీసును పుణెకు జారీ చేసింది. కాగా బోర్డుతో విబేధాల కారణంగా ఐపీఎల్ నుంచి తప్పుకోనున్నట్టు పుణె యాజమాన్యం ఇదివరకే ప్రకటించింది. ఐపీఎల్లో ప్రస్తుతం ఎనిమిది జట్లే మిగిలాయి. 2010 సీజన్లో సహారా గ్రూపు భారీ మొత్తానికి జట్టును కొనుగోలు చేసింది. ఒప్పందం ప్రకారం 18 మ్యాచ్‌లకు బదులు 16 మ్యాచ్‌లే ఆడిస్తుండటంతో ఫీజు తగ్గించాలని డిమాండ్ చేసింది. ఫ్రాంచైజీ ఫీజు చెల్లించని కారణంగా పుణె ఇచ్చిన బ్యాంక్ గ్యారెంటీని బోర్డు సొమ్ము చేసుకుంది. అనంతరం ఐపీఎల్ నుంచి వైదొలగనున్నట్టు పుణె యాజమాన్యం ప్రకటించినా బోర్డుకు ఈ విషయాన్ని తెలియజేయలేదు. వచ్చే సీజన్లో పుణె ఆడాలంటే 170.2 కోట్ల రూపాయల బ్యాంక్ గ్యారెంటీని సమకూర్చాలని బోర్డు తెలియజేసింది. పుణె యాజమాన్యం స్పందించకపోవడంతో వేటు వేయాలని బీసీసీఐ తాజాగా నిర్ణయించింది.