Punia
-
ఆస్ట్రేలియాతో రెండో టీ20.. 8 వికెట్ల తేడాతో భారత్ ఓటమి
ఆ్రస్టేలియాలో పర్యటిస్తున్న భారత మహిళల ‘ఎ’ జట్టు వరుసగా రెండో టి20లో పరాజయం పాలైంది. శుక్రవారం జరిగిన రెండో మ్యాచ్‌లో ఆ్రస్టేలియా ‘ఎ’ జట్టు 8 వికెట్ల తేడాతో భారత ‘ఎ’ జట్టుపై గెలిచింది. మొదట భారత్ ‘ఎ’ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. ప్రియా పూనియా (29) టాప్ స్కోరర్ కాగా.. కెప్టెన్ మిన్ను మణి (17 నాటౌట్) ఫర్వాలేదనిపించింది. ఆ్రస్టేలియా బౌలర్లలో గ్రేస్ పర్సన్స్ 4, నికోలా మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం ఆ్రస్టేలియా ‘ఎ’ జట్టు 18.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 133 పరుగులు చేసి గెలిచింది. తహిలా విల్సన్ (53 నాటౌట్), కెప్టెన్ తహిలా మెక్‌గ్రాత్ (47 నాటౌట్) రాణించారు. ఈ పర్యటనలో భాగంగా భారత మహిళల ‘ఎ’ జట్టు మూడు టి20, మూడు వన్డేలు, ఏకైక అనధికారిక టెస్టు ఆడనుంది. -
మన బజరంగ్... ప్రపంచ నంబర్‌వన్
భారత స్టార్ రెజ్లర్ బజరంగ్ పూనియా మరో అరుదైన ఘనత సాధించాడు. ఇటీవలే ప్రపంచ సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో రెండు పతకాలు నెగ్గిన తొలి భారతీయ రెజ్లర్‌గా గుర్తింపు పొందిన అతను తాజాగా యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ ర్యాంకింగ్స్ 65 కేజీల విభాగంలో ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌ను అధిరోహించాడు. గతంలో ఏ భారతీయ రెజ్లర్ కూడా నంబర్‌వన్ ర్యాంక్ సాధించలేదు. హరియాణాకు చెందిన 24 ఏళ్ల బజరంగ్ 96 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో ఉన్నాడు. తోబియర్ (క్యూబా–66 పాయింట్లు) రెండో ర్యాంక్‌లో... చకయెవ్ (రష్యా–62 పాయింట్లు) మూడో ర్యాంక్‌లో ఉన్నారు. -
రోహిత్ వేముల దళితుడే: పునియా
న్యూఢిల్లీ : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో ఆత్మహత్య చేసుకున్న పీహెచ్డీ విద్యార్థి రోహిత్ వేముల దళితుడేనని జాతీయ ఎస్పీ కమిషన్ ఛైర్మన్ పీఎల్ పునియా అన్నారు. రోహిత్ ఆత్మహత్య నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ ఇచ్చిన నివేదికలో అవాస్తవాలు, కల్పితాలున్నాయని ఆయన గురువారమిక్కడ అన్నారు. రోహిత్ ఆత్మహత్య చేసుకునేందుకు దారితీసిన పరిస్థితులు, అందుకు బాధ్యులైనవారిపై తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక ఇవ్వాల్సిన కమిషన్... అతడిది ఏ కులం అనే దానిపై నివేదిక ఇవ్వడం దురదృష్టకరమన్నారు. రోహిత్ దళితుడేనని గుంటూరు కలెక్టర్, తహసీల్దార్ నిర్థారించారని, అలాగే నేషనల్ ఎస్సీ కమిషన్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసిందన్న విషయాన్ని పునియా ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఏకసభ్య కమిషన్ వాస్తవాలను వెలికి తీయాల్సిన అవసరం ఉందన్నారు. కాగా గత ఏడాది సెంట్రల్ వర్సిటీ విద్యార్థి రోహిత్ సహా నలుగురు దళిత పరిశోధక విద్యార్థులను యూనివర్సిటీ యాజమాన్యం బహిష్కరించిన విషయం తెలిసిందే. యూనివర్సిటీలో దళిత విద్యార్థుల పట్ల తీవ్రమైన వివక్ష కొనసాగుతోందని, ఈ కారణంగానే వేముల రోహిత్ ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు సూసైడ్ నోట్ లో సైతం పేర్కొనడం యావత్ దేశాన్ని కదిలించింది. వెల్లువెత్తిన ప్రజా ఉద్యమం యూనివర్సిటీలో దళిత విద్యార్థులు ఎదుర్కొంటున్న వివక్షపైనా, రోహిత్ ఆత్మహత్యపైనా విచారణ చేపట్టాలని డిమాండ్ చేసింది. దీంతో కేంద్ర ప్రభుత్వం అలహాబాద్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి రూపన్వాల్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ ను వేసింది. ఆ కమిషన్ రోహిత్ దళితుడు కాదని నిర్ధారించడంతో పాటు సెంట్రల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ పొదిలి అప్పారావు నిర్దోషి అంటూ పేర్కొంది. -
'దిగ్భ్రాంతి.. మొత్తం సమాజానికే సిగ్గు చేటు'
న్యూఢిల్లీ: బులంద్ షహర్ లో తల్లి కూతుళ్లపై జరిగిన సామూహిక లైంగిక దాడి ఘటన దిగ్భ్రాంతికి గురిచేసిందని, అందరూ సిగ్గుపడాల్సిన విషయం అని జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ పీఎల్ పునియా అన్నారు. ఈ ఘటనపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలియజేయాలంటూ పునియా, కేంద్రమంత్రి అనుప్రియా పటేల్ ప్రశ్నించారు. 'బులంద్ షహర్ లో జరిగిన ఈ ఘటన దిగ్భ్రాంతికరమైనది. మొత్తం సమాజానికి సిగ్గు చేటు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ ఘటనకు కొందరు పోలీసు అధికారులను బాధ్యులను చేస్తూ వారిని సస్పెండ్ చేసి చేతులు దులిపేసుకుంది. అంతకుమించి ఏమీ జరగలేదు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ఉండాలంటే ఏదో ఒక కొత్త పరిష్కార మార్గం తీసుకురావాలి. పోలీసులు అవినీతికి పాల్పడి లంఛాలు తీసుకుంటున్నారు కానీ విధులు నిర్వర్తించడం లేదు. ఉత్తరప్రదేశ్ లో ఇలాంటివి ప్రతి రోజు జరుగుతున్నాయి. అఖిలేశ్ ఈ ఘటనకు బాధ్యత తీసుకోవాల్సిందే' అని పునియా అన్నారు. ఇక అనుప్రియ మాట్లాడుతూ 'ముఖ్యమంత్రి అఖిలేశ్ ఈ ఘటనకు నైతిక బాధ్యత వహించాలి. ఒక మహిళగా ఒక సంఘటనపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నిస్తాను. అయితే, ఇలాంటి ఘటనలు ఎందుకు జరుగుతున్నాయనేది ప్రధాన ఆందోళన. రాష్ట్ర ప్రభుత్వం మహిళ రక్షణ తప్పకుండా చూడాలి. 2017 సంవత్సరం జరిగిన ఎన్నికల్లో సమాజ్ వాది పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెప్తారు' అని అన్నారు.