Purnachandra Rao
-
సచివాలయాల సేవలు అమోఘం!
ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు చూడాలన్న రాష్ట్ర ప్రభుత్వం, దాని అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆశయం మేరకు ఇప్పటి వరకు దేశంలోనే ఎక్కడా లేని విధంగా గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ ఆవిర్భవించింది. ఏ మాత్రం అవినీతికీ, వివక్షకూ తావు ఇవ్వకుండా పరిపాలన ప్రజలకు చేరువ కావాలన్న ప్రధాన ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ఈ సచివాలయ వ్యవస్థకు నాలుగేళ్ల క్రితం శ్రీకారం చుట్టారు. అద్భుతమైన ఫలితాలిస్తున్న ఈ వ్యవస్థను అధ్యయనం చేయడం కోసం అనేక రాష్ట్ర ప్రభుత్వాలు తమ తమ పరిశీలనా బృందాలను పంపించటం గమనార్హం. కాగా రాష్ట్రంలో ఉన్న మొత్తం 15004 గ్రామ, వార్డు సచివాలయాల్లో దాదాపు 35 ప్రభుత్వ శాఖలకు సంబంధించి సుమారు 500 సేవలు అందుబాటులోకి వచ్చాయి. పింఛన్, రేషన్ కార్డులు, ఇంటి పట్టాలు, సివిల్ పనులకు సంబంధించిన పనులు, వైద్యం, ఆరోగ్యం, రెవిన్యూ సమస్యలు, భూముల సర్వే, శిశు సంక్షేమం, డెయిరీ, పౌల్ట్రీ వంటి అనేక అంశాలకు సంబంధించిన సేవలు ఇందులో ఉన్నాయి. ఈ సేవల కోసం ప్రజలు గ్రామ సచివాలయాల్లో అర్జీ పెట్టుకున్న 72 గంటల్లోనే సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వం నిర్దేశించింది. సదాశయంతో నెలకొల్పిన ఈ గ్రామ, వార్డు సచివాలయాలు వలంటీర్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకూ; ప్రజాసమ స్యలు ప్రభుత్వానికీ తెలియజేసి ప్రజలకూ– ప్రభుత్వానికీ మధ్య వారధిగా ఈ వలంటీర్లు వ్యవహరిస్తున్నారు. అర్హత ఉన్నవారెవరైనా ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందని సందర్భంలో వలంటీర్ ద్వారా ప్రయత్నించి çపొందవచ్చు. వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ప్రకటించిన ‘నవరత్నాలు’ పథకం కింద లబ్ధిదారుల ఎంపికలో ఈ సచివాలయాల పాత్ర అనన్యం. ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్ బాధ్యత తీసుకునే విధంగా ఈ గ్రామ, వార్డు సచివా లయ వ్యవస్థ రూపొందించబడింది. సమస్త ప్రభుత్వ సేవలూ, పథకాలను వలంటీర్ల ద్వారా సచివాలయ వ్యవస్థ ప్రజల గడప ముందుకు తీసుకువెళ్లడం దేశాన్ని విస్మయానికి గురిచేస్తోంది. మహమ్మారి కరోనా సమయంలో వలంటీర్లు చేసిన సేవలను ఎవరూ మరచి పోలేరు. వీరి సేవలు గుర్తించిన ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాలకు సంబంధించి కొత్తగా చట్టం తీసుకొస్తూ ఆర్డినెన్స్ జారీ చేసింది. దీని ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా గ్రామాలు, పట్టణాల్లో ఇప్పటికే అమలులో ఉన్న ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం, ఆంధ్రప్రదేశ్ మున్సి పాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్ చట్టం తరహా లోనే సచివాలయ వ్యవస్థకు కూడా చట్టం రానుంది. రాజ్యాంగంలోని 11, 12 షెడ్యూళ్లలో పేర్కొన్న ప్రకారం ప్రజలు కేంద్రంగా ప్రభుత్వ సేవలు, ఇతర సదుపాయాలను అందించేందుకు ఈ చట్టం ద్వారా గ్రామ, వార్డు సచివాలయాల పేరుతో కొత్త వ్యవస్థకు శ్రీకారం చుడుతున్నట్టు ఆర్డినెన్స్ పేర్కొంటోంది. ఈ ఆర్డినెన్స్‌తో గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా అందజేసే ప్రభుత్వ సేవలు, గ్రామ, వార్డు సచివాలయ శాఖ ద్వారా జారీచేసే ఉత్త ర్వులు శాసనాధికారంతో కూడినవయ్యాయి. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల నియా మకానికి చట్టబద్ధత లభించింది. 2019 అక్టోబర్ 2న గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ అమలులోకి వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి రెండు వేల జనాభాకు, అలాగే పట్టణ ప్రాంతాల్లో ప్రతి 4 వేల జనాభాకు ఒక సచివాలయం చొప్పున ఏర్పాటయ్యాయి. అయితే ఈ వ్యవస్థపై కొందరు అనవసర విమర్శలు చేయడం శోచనీయం. చలాది పూర్ణచంద్రరావు వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ మొబైల్: 94915 45699 -
ఏసీబీ అడిషనల్ ఎస్పీ అశోక్‌కుమార్‌పై వేటు
-
పురుషోత్తం రెడ్డి కేసులో కీలక పరిణామం
సాక్షి, హైదరాబాద్: హెచ్ఎండీఏ ప్లానింగ్ విభాగం మాజీ డైరెక్టర్ పురుషోత్తం రెడ్డి అక్రమ ఆస్తుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. పురుషోత్తం రెడ్డికి సహకరించారన్న కారణంగా ఏసీబీ అడిషనల్ ఎస్పీ అశోక్‌కుమార్‌పై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు ఏసీబీ డీజీ పూర్ణచంద్రరావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. బిల్డింగ్ సూపర్ వైజర్ చేరిన పురుషోత్తం రెడ్డి అనంతర కాలంలో హెచ్ఎండీఏ ప్లానింగ్ డైరెక్టర్‌గా పనిచేశాడు. అయితే ఆయన భారీ అవినీతికి పాల్పడుతున్నాడని 2009 నుంచే ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో రూ.వందల కోట్లు అవినీతి సొమ్ము కూడబెట్టుకున్నారన్న ఆరోపణలతో ఈ ఫిబ్రవరిలో ఏకకాలంలో ఏసీబీ అధికారులు పురుషోత్తం ఇల్లు, బంధువుల ఇళ్లలో సోదాలు జరిపారు. దీంతో తొలుత పురుషోత్తం పరారు కాగా, అతని బినామీలు యాదవరెడ్డి, నిషాంత్‌రెడ్డిలను పోలీసులు అరెస్ట్ చేసి చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఈ క్రమంలో పురుషోత్తంరెడ్డి ఫిబ్రవరి 16న ఏసీబీ కోర్టులో లొంగిపోగా చంచల్ గూడ జైలుకు తరలించిన విషయం తెలిసిందే. పూర్తిస్థాయిలో అధికారులు విచారణ చేపట్టగా హెచ్ఎండీఏ అధికారి పురుషోత్తం రెడ్డి అక్రమాలు, అవినీతికి ఏసీబీ అడిషనల్ ఎస్పీ అశోక్‌కుమార్ సహకరించారని తేలింది. కాగా, ఈ కేసులో ఏసీబీ రూ.50 కోట్లకుపైగా బినామీ పెట్టుబడులను గుర్తించింది. నాలుగు కమర్షియల్ కాంపెక్సులు, వ్యవసాయ భూమికి సంబంధించి రూ.20 కోట్ల మేర ఆస్తి పత్రాలను స్వాధీనం చేసుకుంది. పురుషోత్తం అల్లుడు చేపట్టిన విల్లాల నిర్మాణానికి సంబంధించి రూ.30 కోట్ల పెట్టుబడి పెట్టినట్లు ఆధారాలు సేకరించారు. కూతురికి ఇచ్చిన ఆభరణాలు, గిఫ్ట్‌గా ఇచ్చిన ఆస్తుల విలువ మరో రూ.10 కోట్ల వరకు ఉంటుందని ఏసీబీ అధికారులు తెలిపారు. -
మ్యాచ్ కోసం వచ్చి మృత్యువాత
మృతులు ఏపీకి చెందినవారు చివ్వెంల: ఏపీకి చెందిన ముగ్గురు యువ కులు ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ చూసేందుకు వచ్చి మృత్యువాత పడ్డారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం జి.తిర్మలగిరి శివారులో సోమవారం జరి గింది. ప్రకాశం జిల్లా అద్దంకి మండలం సింగరాయపాలెం గ్రామ ఎంపీటీసీ సభ్యుడు శ్యామల శ్రీకాంత్ (26), తన బంధువులు పాత గుంటూరుకు చెందిన తొర్రపాయి కోటేష్(24), తెనాలికి చెం దిన మైలా పూర్ణచందర్రావు (21), మరో స్నేహితుడు పాత గుంటూరుకు చెందిన దాదిసాయి భార్గవ్‌లు కలసి హైదరాబాద్‌లో ఐపీఎల్ మ్యాచ్ చూసేం దుకు వెళ్లారు. ఆదివారం రాత్రి తిరుగు ప్రయాణమయ్యారు. జి.తిర్మలగిరి గ్రామ శివారులో వీరు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. దీంతో శ్రీకాంత్, కోటేష్, పూర్ణచందర్ రావు అక్కడికక్కడే మృతి చెందారు. -
ఏసీబీ డీజీగా పూర్ణ చంద్రరావు
హైదరాబాద్ః అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ జనరల్‌గా అదనపు డీజీపీ పూర్ణచందర్రావు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. రిక్రూట్‌మెంట్‌బోర్డు చైర్మన్‌గా ఉన్న పూర్ణచందర్రావు రెండు రోజుల క్రితం జరిగిన ఐపీఎస్‌ల బదిలీల్లో భాగంగా ఆయన ఏసీబీకి డీజీగా నియమితులయ్యారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆనవాయితీ ప్రకారం ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావును కలిసి పుష్పగుచ్చం అందజేశారు. -
నియామకాల్లో ఎలాంటి అవకతవకలు జరగలేదు
-
9 నుంచి నుంచి ఆన్లైన్లో ఎస్ఐ హాల్‌టికెట్లు
సాక్షి, హైదరాబాద్: సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (ఎస్ఐ) ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లు శనివారం నుంచి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వెబ్సైట్లో అందుబాటులోకి రానున్నాయి. అభ్యర్థులు ఈ నెల 9 ఉదయం 8.30 గంటల నుంచి 15 అర్ధరాత్రి వరకు డౌన్లోడ్ చేసుకోవచ్చని రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ పూర్ణచందర్రావు తెలిపారు. సివిల్, ఏఆర్, టీఎస్ఎస్పీ, టెక్నికల్ విభాగాల్లోని 539 పోస్టులకు ఈ నెల 17న పరీక్ష నిర్వహించేందుకు రిక్రూట్‌మెంట్‌బోర్డు ఏర్పాట్లు పూర్తిచేసింది. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు సివిల్, ఏఆర్, టీఎస్ఎస్పీ అభ్యర్థులకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు టెక్నికల్ కమ్యూనికేషన్ విభాగం అభ్యర్థులకు పరీక్ష నిర్వహించనుంది. అభ్యర్థులు బోర్డు వెబ్సైట్లోకి వెళ్లి రిజిస్ట్రేషన్, మొబైల్, ఎస్ఎస్సీ హాల్‌టికెట్ నంబర్లను పొందుపరిస్తే హాల్‌టికెట్ వస్తుంది. 040-23150362, 040-23150462 నంబర్లలో support@tslprb.in లో సంప్రదించి అనుమానాలు నివృత్తి చేసుకోవచ్చు. -
ఇల్లు స్వాధీనం చేయాలని సీఐ బెదిరిస్తున్నాడు
గుంటూరు : ఇల్లు ఖాళీ చేసి వడ్డీకిచ్చిన వారికి అప్పగించాలని తాలుకా ఎస్హెచ్ఓ బెదిరిస్తున్నాడని ఓ మహిళ అర్బన్ ఎస్పీని ఆశ్రయించింది. ప్రభుత్వం అందించిన స్థలంలో ఇల్లు కట్టుకొని 13 ఏళ్ల నుంచి ఉంటున్నానని చెప్పింది. కరెంటు, ఇంటి పన్నులూ చెల్లిస్తున్నానని పేర్కొంది. వేళంగి నగర్‌కు చెందిన ఉదగిరి నగదర్ వద్ద 2013లో 50 వేలు వడ్డీకి తీసుకున్నానని తెలిపింది. చెక్కులు, స్టాంపు ఖాళీ పేపర్లు తీసుకున్నాడంది. అప్పకు సంబంధించి ఇల్లు స్వాధీనం చేయాలని తనపై దాడి చేసాడని వాపోయింది. ఫోన్లో ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో డీఎస్పీ కూడా వచ్చి విచారించారంది. ఐజీకి కూడా ఫిర్యాదు చేశానంది. గత వారం ఎస్పీకి ఫిర్యాదు చేయగా రూరల్ సీఐ పూర్ణచంద్రరావు వద్దకు పంపించారని తెలిపింది. ఇల్లు నగదర్‌కు స్వాధీనం చేయాలని సీఐ బెదిరిస్తున్నారని వాపోయింది. కోర్టు నుంచి ఆదేశాలందాయని సీఐ చెబుతున్నారేగానీ అవి తనకు చూపడం లేదని విలపించింది. 29 ఫిర్యాదుల స్వీకరణ జిల్లా రూరల్ కార్యాలయంలో సోమవారం డీఎస్పీలు డి.సుధాకర్ ,సూర్యనారాయణ రెడ్డి గ్రీవెన్స్ నిర్వహించారు. 29 మంది నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. పలువురి సమస్యలపై వెంటనే స్పందించి ఫోన్లో ఎస్హెచ్ఓలకు తగిన ఆదేశాలిచ్చారు. కొందరి ఫిర్యాదులను పరిశీలించాల్సిందిగా లిఖిత పూర్వకంగా ఆదేశాలు అప్పటికప్పుడే పంపించారు. -
గుంటూరు మార్కెట్లో అధికారుల తనిఖీలు
గుంటూరు : గుంటూరు నగరంలోని పండ్ల మార్కెట్లో ఆహర కల్తీ నియంత్రణ అధికారులు శనివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మార్కెట్లో పండ్లను రసాయనాల ద్వారా పండిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో అధికారులు, సిబ్బంది ముకుమ్మడిగా దాడి చేసి తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలకు అసిస్టెంట్ కంట్రోలర్ పూర్ణచందరరావు ఆధ్వర్యంలో సాగుతున్నాయి. -
ఎన్ని సర్వీసులైనా నడుపుతాం:ఆర్టీసి ఎండి
హైదరాబాద్: సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికులకు ఇబ్బంది కలుగకుండా ఎన్ని అదనపు బస్ సర్వీసులైనా నడుపుతామని ఆర్టీసీ ఎండీ పూర్ణ చంద్రరావు చెప్పారు. నిన్నటి వరకు 9, 251 అదనపు బస్సులు నడిపినట్లు తెలిపారు. ఈరోజు మరో 526 బస్సులు నడుపుతున్నామని చెప్పారు. రేపు 249 అదనపు సర్వీసులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 320 ప్రైవేట్ బస్సులు సీజ్ అయిన నేపథ్యంలో తాము అదనపు బస్సులు నడుతున్నట్లు చెప్పారు. గత 3 రోజులుగా 12 లక్షల మంది ప్రయాణికులను వారి గమ్య స్థానాలకు చేర్చినట్లు తెలిపారు. -
ఘనంగా గణనాథుని రథోత్సవం
కాణిపాకం, న్యూస్‌లైన్: స్వయంభువు కాణిపాక వరసిద్ధి వినాయకుని బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం స్వామివారి రథో త్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఉదయం సర్వాలంకార భూషితుడైన సిద్ధిబుద్ధి సమేత వినాయక స్వామివారి ఉత్సవమూర్తులను ఆలయ అన్వేటి మండపంలో విశేష సమర్పణ చేశారు. అనంతరం ఉత్సవమూర్తులను మంగళవాయిద్యాల మధ్య ఆలయం నుంచి ఉరేగింపుగా తీసుకువచ్చి సర్వాంగ సుందరంగా అలంకరించిన రథంపై అధిష్టింపచేశారు. ఉభయదారుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మధ్యాహ్నం 3గంటలకు రథోత్సవాన్ని ప్రారంభించారు. ముందు భాగంలో అశ్వాలు, ఒంటెలు, వృషభాలు, సర్వసైన్యాధిపతులు నడవగా స్వామివారు రథంపై ఊరేగుతూ కాణిపాకం పురవీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు రథంపై బొరుగు లు, మిరియాలు, చిల్లరనాణేలు చల్లి మొక్కులు తీ ర్చుకున్నారు. రథోత్సవాన్ని తిలకించేందుకు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి సైతం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా స్వల్ప తొక్కిసలాట చోటుచేసుకుంది. రథోత్సవానికి దేవస్థానం వారు, కాకర్లవారిపల్లెకు చెందిన ఎతిరాజులునాయుడు కుమార్తె మీనాకుమారి, కాణిపాకంకు చెందిన చంద్రశేఖర్ రెడ్డి కుమారుడు హరిప్రసాద్ రెడ్డి, పూర్ణచంద్రారెడ్డి ఉభయదారులుగా వ్యవహరించారు. రథోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు, పలు విచిత్ర వేషధారణలు, కీలు గుర్రాలు, జానపద నృత్యాలు భక్తులను ఆకట్టుకున్నాయి. పూతలపట్టు ఎమ్మెల్యే రవి, ఈవో పూర్ణచంద్రరావు, ఆలయ ఏఈవోలు ఎన్ఆర్.కృష్ణారెడ్డి, ఎస్వీ.కృష్ణారెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షించారు.