ఏసీబీ డీజీగా పూర్ణ చంద్రరావు
హైదరాబాద్ః అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ జనరల్‌గా అదనపు డీజీపీ పూర్ణచందర్‌రావు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. రిక్రూట్‌మెంట్‌బోర్డు చైర్మన్‌గా ఉన్న పూర్ణచందర్‌రావు రెండు రోజుల క్రితం జరిగిన ఐపీఎస్‌ల బదిలీల్లో భాగంగా ఆయన ఏసీబీకి డీజీగా నియమితులయ్యారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆనవాయితీ ప్రకారం ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావును కలిసి పుష్పగుచ్చం అందజేశారు.