Q2 Profit Fall
-
డోమినోస్ పిజ్జా కంపెనీ లాభం తగ్గింది..
న్యూఢిల్లీ: ఫాస్ట్ ఫుడ్ చైన్ దిగ్గజం జూబిలెంట్ ఫుడ్‌వర్క్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25) రెండో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. జులై–సెప్టెంబర్(క్యూ2)లో కన్సాలిడేటెడ్ నికర లాభం రూ. 67 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 97 కోట్లకుపైగా ఆర్జించింది.డోమినోస్ పిజ్జా, డంకిన్ స్టోర్ల కంపెనీ మొత్తం అమ్మకాలు మాత్రం రూ. 1,955 కోట్లకు ఎగశాయి. గత క్యూ2లో రూ. 1,369 కోట్ల టర్నోవర్ సాధించింది. మొత్తం వ్యయాలు సైతం రూ. 1,290 కోట్ల నుంచి రూ. 1,896 కోట్లకు పెరిగాయి. అయితే ఫలితాలు పోల్చి చూడతగదని కంపెనీ పేర్కొంది. సొంత అనుబంధ సంస్థ జూబిలెంట్ ఫుడ్ నెదర్లాండ్స్ బీవీ.. 2024 మార్చికల్లా డీపీ యూరేషియా ఎన్వీలో మెజారిటీ వాటాను కొనుగోలు చేయడాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించింది.ఈ కాలంలో 139 స్టోర్లను కొత్తగా జత చేసుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. దేశీ ఆదాయం 8 శాతం పుంజుకుని రూ. 1,467 కోట్లను తాకింది. అంతర్జాతీయ అమ్మకాలు దాదాపు రూ. 461 కోట్లకు చేరాయి. ఫలితాల నేపథ్యంలో జూబిలెంట్ ఫుడ్ షేరు బీఎస్ఈలో 1 శాతం నీరసించి రూ. 602 వద్ద ముగిసింది. -
ఫ్రెషర్లకు ‘కాగ్నిజంట్’ 20,000 ఉద్యోగాలు
న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం కాగ్నిజంట్ నికర లాభం ఈ మార్చి క్వార్టర్లో 17 శాతం తగ్గింది. గత ఏడాది మార్చి క్వార్టర్లో 44 కోట్ల డాలర్లుగా ఉన్న నికర లాభం ఈ ఏడాది మార్చి క్వార్టర్లో 37 కోట్ల డాలర్లకు తగ్గిందని కాగ్నిజంట్ తెలిపింది. ఆదాయం 3 శాతం వృద్ధితో 420 కోట్ల డాలర్లకు పెరిగిందని కంపెనీ సీఈఓ బ్రియాన్ హంఫ్రీస్ వెల్లడించారు. కరోనా వైరస్ కల్లోలం నేపథ్యంలో ఈ ఏడాది డిమాండ్ పరంగా సమస్యలు ఉండొచ్చని అంచనాలున్నాయన్నారు. అందుకే గతంలో వెలువరించిన ఈ ఏడాది ఆదాయ అంచనాలను వెనక్కి తీసుకుంటున్నామని వివరించారు. విభిన్నమైన సేవలందించడం, పటిష్టమైన బ్యాలన్స్ షీట్, లిక్విడిటీల దన్నుతో కరోనా కల్లోలాన్ని ఎదుర్కొనగలమన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు. మార్చి క్వార్టర్లో భారీ డీల్స్ సాధించామని బ్రియన్ వివరించారు. ఫ్రెషర్లకు 20,000 ఉద్యోగాలు ఇవ్వనున్నామని చెప్పారు. వ్యయాల నియంత్రణపై దృష్టి పెట్టినట్లు పేర్కొన్నారు. ఈ కంపెనీ జనవరి–డిసెంబర్ కాలాన్ని ఆర్థిక సంవత్సరంగా పాటిస్తోంది. -
ఉద్యోగుల వేతనాలే విప్రో నష్టాలకు కారణమా?
ముంబై: దేశంలోనే మూడో అతి పెద్ద ఐటీ సేవల సంస్థ విప్రో లిమిటెడ్ క్యూ2లో అంచనాలను దాటి నికర ఆదాయం ఆర్జించినా.. నికర లాభాలు మాత్రం గత సంవత్సరం ఇదే క్వార్టర్ కంటే తగ్గాయి. నికర ఆదాయంలో గత సంవత్సరం కంటే 0.9 శాతం వృధ్ధితో రూ. 2070 కోట్లు ఆర్జించింది. గత ఏడాది ఇదే కాలంలో ఈ లాభం రూ.2052 కోట్లుగా ఉంది. కన్సాలిడేటెడ్ ఆదాయం 1.5 శాతం వృద్ధితో రూ.13,697.6 కోట్ల నుంచి క్యూ2లో రూ 13,896.8 కోట్లకు పెరిగింది. అలాగే రూ.13,109 కోట్లతో పోలిస్తే తాజా క్వార్టర్లో ఐటీ సర్వీసుల ఆదాయాన్ని (ఐటీ ఉత్పత్తుల వ్యాపారం సహా) రూ. 13,136 కోట్లుగా నమోదు చేసింది. డాలర్ రెవెన్యూ 1916.3 మిలియన్ డాలర్లుగా రిపోర్ట్ చేసింది. అయితే నికర లాభాల్లో 7.6 క్షీణతను నమోదుచేసిన సంస్థ రూ. 2,070 కోట్లకు పరిమితమైంది. గత ఏడాది ఇదే త్రైమాసికానికి నికర లాభాలు రూ. 2,241 కోట్లు. ఈ క్వార్టర్లో రూ.1,972 కోట్ల నికర లాభాలు వస్తాయని విశ్లేషకులు అంచనా వేశారు. ఉద్యోగుల వేతనాల వల్లే.. ఎనలిస్టుల అంచనాలను అధిగమించినా... ఉద్యోగుల అధిక వేతనాల కారణంగా తక్కువ లాభాలను నమోదు చేసిందని మార్కెట్ వర్గాల అంచనా. కాగా విప్రో మొదటి త్రైమాసికం ఫలితాలు చాలా పేలవంగా ప్రకటించింది. ఏప్రిల్ -జూన్ మొదటి త్రైమాసికంలో స్వల్పంగా 1.23 శాతం వృద్ధితో కంపెనీ ఏకీకృత నికర లాభం రూ.1,349.9 కోట్లను ఆర్జించింది.