ఉద్యోగుల వేతనాలే విప్రో నష్టాలకు కారణమా?
ఉద్యోగుల వేతనాలే విప్రో నష్టాలకు కారణమా?
Published Fri, Oct 21 2016 5:49 PM | Last Updated on Mon, Sep 4 2017 5:54 PM
ముంబై: దేశంలోనే మూడో అతి పెద్ద ఐటీ సేవల సంస్థ విప్రో లిమిటెడ్ క్యూ2లో అంచనాలను దాటి నికర ఆదాయం ఆర్జించినా.. నికర లాభాలు మాత్రం గత సంవత్సరం ఇదే క్వార్టర్ కంటే తగ్గాయి. నికర ఆదాయంలో గత సంవత్సరం కంటే 0.9 శాతం వృధ్ధితో రూ. 2070 కోట్లు ఆర్జించింది. గత ఏడాది ఇదే కాలంలో ఈ లాభం రూ.2052 కోట్లుగా ఉంది. కన్సాలిడేటెడ్ ఆదాయం 1.5 శాతం వృద్ధితో రూ.13,697.6 కోట్ల నుంచి క్యూ2లో రూ 13,896.8 కోట్లకు పెరిగింది. అలాగే రూ.13,109 కోట్లతో పోలిస్తే తాజా క్వార్టర్‌లో ఐటీ సర్వీసుల ఆదాయాన్ని (ఐటీ ఉత్పత్తుల వ్యాపారం సహా) రూ. 13,136 కోట్లుగా నమోదు చేసింది. డాలర్ రెవెన్యూ 1916.3 మిలియన్ డాలర్లుగా రిపోర్ట్ చేసింది. అయితే నికర లాభాల్లో 7.6 క్షీణతను నమోదుచేసిన సంస్థ రూ. 2,070 కోట్లకు పరిమితమైంది. గత ఏడాది ఇదే త్రైమాసికానికి నికర లాభాలు రూ. 2,241 కోట్లు. ఈ క్వార్టర్‌లో రూ.1,972 కోట్ల నికర లాభాలు వస్తాయని విశ్లేషకులు అంచనా వేశారు.
ఉద్యోగుల వేతనాల వల్లే..
ఎనలిస్టుల అంచనాలను అధిగమించినా... ఉద్యోగుల అధిక వేతనాల కారణంగా తక్కువ లాభాలను నమోదు చేసిందని మార్కెట్ వర్గాల అంచనా. కాగా విప్రో మొదటి త్రైమాసికం ఫలితాలు చాలా పేలవంగా ప్రకటించింది. ఏప్రిల్ -జూన్ మొదటి త్రైమాసికంలో స్వల్పంగా 1.23 శాతం వృద్ధితో కంపెనీ ఏకీకృత నికర లాభం రూ.1,349.9 కోట్లను ఆర్జించింది.
Advertisement
Advertisement