Qamar Mohsin Shaikh
-
రక్షాబెహన్
అనురాగబంధం చిరకాలం ఉండేది. రజతోత్సవం అన్నది ఒక జ్ఞాపకమే. మోదీకి ఇరవై ఐదేళ్లుగా.. మొహ్సిన్ షేక్ రాఖీ కడుతూ వస్తోంది. ఈసారి కుదర్లేదు. రాఖీని, ప్రార్థనల్ని.. పోస్ట్ చేసింది. ప్రధానికి రక్షా బెహన్ ఈ పౌరురాలు. ఖమర్ మొహ్సిన్ షేక్ ఈ ఏడాది ప్రధాని నరేంద్ర మోదీకి రాఖీ కట్టలేకపోయారు! అయితే రాఖీ పౌర్ణమికి మూడు రోజుల ముందే ఈ చెల్లెమ్మ పంపిన రాఖీ ఆ అన్నయ్యకు చేరింది. చేరినట్లుగా ప్రధాని కార్యాలయం నుంచి ఆమెకు తిరుగు జవాబు కూడా వచ్చింది. గత ఇరౖÐð నాలుగేళ్లుగా మోదీకి రాఖీ కడుతున్నారు మొహ్సిన్. ఈ ఏడాది కూడా ఆయన చేతికి స్వయంగా రాఖీ కట్టి ఉంటే అదొక రజతోత్సవ సంబరం అయి ఉండేది. కరోనా కారణంగా సాధ్యం కాలేదు. మొహ్సిన్ గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఉంటారు. మోదీకి ఆమె మొదటిసారి రాఖీ కట్టింది 1996లో. మోదీ అప్పుడు బీజేపీ జాతీయ కార్యదర్శిగా ఢిల్లీలో ఉన్నారు. పార్టీ ఆదేశాలపై బదలీ మీద ఢిల్లీ వచ్చి హర్యానా, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల రాజకీయ వ్యవహారాలను చూస్తున్నారు. ఆ ఏడాది ఆగస్టు 28న వచ్చింది రాఖీ పౌర్ణమి. అహ్మదాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లి ఆయన చేతికి రాఖీ కట్టి వచ్చారు మొహ్సిన్! మోదీకి ఢిల్లీకి, మొహ్సిన్‌కి ఢిల్లీకి పుట్టు పూర్వోత్తరాల అనుబంధం ఏమీ లేదు. మోదీ పుట్టింది గుజరాత్లో. మొహ్సిన్ పుట్టినిల్లు పాకిస్థాన్‌లో. అయితే ఈ అన్నాచెల్లెళ్ల బంధం కలిసింది మాత్రం ఢిల్లీలోనే! మొహ్సిన్‌కి తోడబుట్టిన సోదరులు లేరు. మొహ్సిన్ ఇరవై ఐదేళ్లుగా మోదీకి రాఖీ కడుతున్నప్పటికీ ముప్పై ఐదేళ్లుగా ఆమెకు ఆయన తెలుసు. 1980లలో పాకిస్తాన్ నుంచి ఆమె ఢిల్లీ వచ్చినప్పుడు మోదీ ‘సంభాగ్ ప్రచారక్’గా ఢిల్లీలో ఆరెసెస్ కార్యక్రమాలను నిర్వహిస్తుండేవారు. ఆ సమయంలోనే మొహ్సిన్కు ఆయన పరిచయం అయ్యారు. ‘‘నేను కరాచీ నుంచి వచ్చానని, నా భర్త ఇక్కడి వారేనని తెలిసిన వెంటనే మోదీజీ నన్ను ‘బెహెన్’ అని సంబోధించారు’’ అని శనివారం ఏషియన్ న్యూస్ ఇంటర్నేషనల్ (ఎ.ఎన్.ఐ.) వార్త సంస్థ ప్రతినిధితో మాట్లాడుతూ గుర్తు చేసుకున్నారు మొహ్సిన్. కరాచీ నుంచి ఢిల్లీ వచ్చిన మొహ్సిన్ ఆ తర్వాత అహ్మదాబాద్‌లో స్థిరపడ్డారు. మోదీకి మొహ్సిన్ ఏడో రాఖీ కట్టేనాటికి ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. పందొమ్మిదో రాఖీ కట్టేనాటికి దేశ ప్రధానిగా ఉన్నారు. మోదీ గుజరాత్ ముఖ్యమంత్రి కాకముందు ఓ ఏడాది ఆయనకు రాఖీ కడుతూ.. ‘‘మీరు గుజరాత్ ముఖ్యమంత్రి అవ్వాలని ప్రార్థించాను’’ అని మొహ్సిన్ అన్నారట. ఆ మాటకు మోదీజీ నవ్వి ఊరుకున్నారని, ఆయన ముఖ్యమంత్రి అయ్యాక వచ్చిన తొలి రాఖీ పౌర్ణమికి రక్షాబంధన్ కట్టేందుకు వెళ్లినప్పడు ఆ సంగతిని ఆయనకు గుర్తు చేశానని మొహ్సిన్ ఎ.ఎన్.ఐ. ప్రతినిధికి చెప్పారు. ఈ ఏడాది కూడా మోదీని నేరుగా కలిసి రాఖీ కట్టాలని అనుకున్న మొహ్సిన్కు ఆ అవకాశం లేకుండా పోయింది. రాఖీతో పాటు ఆయన గురించి తను చేసిన ప్రార్థనలను కూడా ఒక కాగితంలో రాసి పంపారు. ఆయురారోగ్యాలతో మోదీజీ చిరకాలం వర్థిల్లాలని, ప్రపంచానికే గర్వకారణమైన దేశ నాయకుడిగా... వచ్చే ఐదేళ్లల్లో మోదీజీ గుర్తింపు పొందాలని తను ప్రార్థించినట్లు మొహ్సిన్ ఆ కాగితంలో రాశారు. -
అన్నయ్య తప్ప ఎవరూ ఈ సాహసం చేయలేరు..
న్యూఢిల్లీ : ముస్లిం మహిళా హక్కులను కాపాడేందుకై ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక చొరవ చూపారని ఆయన ‘రాఖీ చెల్లెలు’ ఖమర్ మోహిసిన్ షేక్ అన్నారు. ట్రిపుల్ తలాక్ విషయంలో తన అన్నయ్య మోదీ తప్ప మరెవరూ ఇలాంటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకోలేరని ప్రశంసించారు. గురువారం రక్షా బంధన్ సందర్భంగా నరేంద్ర మోదీకి రాఖీ కట్టేందుకు ఆమె ప్రధాని అధికారిక నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా ఖమర్ మాట్లాడుతూ...‘ ప్రతీ యేడు అన్నయ్యకు రాఖీ కట్టే అవకాశం వచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉంది. రానున్న ఐదేళ్లలో ఆయన ప్రపంచం గుర్తించే మరెన్నో గొప్ప, సానుకూల నిర్ణయాలు తీసుకోవాలని కోరుకుంటున్నా. తక్షణ ముమ్మారు తలాక్ గురించి ఖురాన్, ఇస్లాంలో ప్రత్యేకంగా ప్రస్తావించలేదు. ట్రిపుల్ తలాక్ విషయంలో మోదీ సర్కారు తీసుకున్న నిర్ణయం హర్షించదగినది’ అని పేర్కొన్నారు. కాగా పాకిస్తాన్ జాతీయురాలైన ఖమర్ పెళ్లి తర్వాత భారత్‌కు వచ్చేశారు. ఈ క్రమంలో నరేంద్ర మోదీ ఆరెస్సెస్ కార్యకర్తగా ఉన్ననాటి నుంచి ఆయనకు ఖమర్ రాఖీ కడుతున్నారు. గత 20 ఏళ్లుగా ఈ ఆనవాయితీ క్రమం తప్పకుండా కొనసాగిస్తున్నారు. ఇక ఈరోజు కూడా ఆమె తన అన్నయ్యకు రాఖీ కట్టేందుకు వెళ్లారు. అదే విధంగా తన భర్త వేసిన పెయింట్‌ను ప్రధాని మోదీకి బహుమతిగా ఇచ్చారు. -
ఆమెకు మోదీ 'నరేంద్ర భాయ్'
న్యూఢిల్లీ: ఆమె పాకిస్థాన్‌కు చెందిన మహిళ. పెళ్లి అయిన తర్వాత భారత్‌కు వచ్చి ఇక్కడే ఉంటున్న ఆమె గత 22 ఏళ్లుగా ఇక్కడే రాఖీ ఉత్సవం జరుపుకుంటోంది. కచ్చితంగా ఓ వ్యక్తికి ఆమె రాఖీ కడుతుంటుంది. కానీ, ఈ సంవత్సరం మాత్రం అలా జరుగుతుందో లేదో అని కాస్త ఆందోళన పడింది. అయితే, ఆమె ఆందోళనను తలగిందులు చేస్తూ ఆ వ్యక్తి నుంచి రాఖీ కట్టేందుకు ఆహ్వానం అందింది. దీంతో ఆమె మనసులోని ఆందోళన స్థానంలో ఆనందం వెళ్లి విరిసింది. ఇంతకీ ఆమెతో రాఖీ కట్టించుకుంటున్న వ్యక్తి ఎవరో కాదు.. మన ప్రధాని నరేంద్రమోదీ. అవునూ, ఖమర్ మోసిన్ షేక్ అనే మహిళ గత 22 ఏళ్లుగా నేటి ప్రధాని మోదీకి రాఖీ కడుతున్నారంట. మోదీ రాష్ట్రీయ స్వయం సేవక్(ఆరెస్సెస్) కార్యకర్తగా ఉన్నప్పటి నుంచి ఆమె మోదీకి రాఖీ కడుతున్నారంట. అయితే, ప్రస్తుతం ఎన్నికల హడావుడితోపాటు విదేశీ పర్యటనలు, ప్రధాని హోదాలో మరింత బిజీ అవడంతో ఈసారి అవకాశం ఉంటుందో ఉండదో అని భావించిన ఆమెకు సరిగ్గా రెండు రోజుల కిందటే ఆహ్వానం అందిందట. ఈ సందర్భంగా ఆమె ఏం చెప్పిందో ఆమె మాటల్లోనే పరిశీలిస్తే.. 'నేను 22 నుంచి 23 ఏళ్లుగా నరేంద్ర భాయ్‌కి రాఖీ కడుతున్నాను. కానీ, ఈసారి మరింత ఉత్సాహంతో ఉన్నాను. నేను తొలిసారి రాఖీ కట్టినప్పుడు భాయ్ ఆరెస్సెస్ కార్యకర్తగా ఉన్నారు. ఆయన కఠిన శ్రమ, దూరదృష్టికారణంగా ప్రధాని అయ్యారు. ఈ ఏడాది మాత్రం నాకు ఆయన నుంచి ఫోన్ వస్తుందని ఊహించలేదు. కానీ, ఇంత బిజీలో ఉండి కూడా రెండు రోజుల కిందటే నాకు ఆయన నుంచి ఫోన్ వచ్చింది. దీంతో నాకు అమితానందంగా ఉంది. ప్రస్తుతం నేను రక్షాబంధన్ ఏర్పాట్లలో ఉన్నాను' అంటూ ఆమె చెప్పారు. -
మోదీకి రాఖీ: 22 ఏళ్లుగా పాక్ మహిళ!
న్యూఢిల్లీ: అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ఉండే అనుబంధానికి ప్రతీకగా రక్షాబంధన్ జరుపుకుంటారన్న విషయం తెలిసిందే. అయితే భారత ప్రధాని నరేంద్ర మోదీకి రాఖీ కట్టేందుకు తాను ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు పాక్ మహిళ కమర్ మోహ్సిన్ షేక్ తెలిపారు. గత రెండు దశాబ్దాలకు పైగా మోదీకి రాఖీ కడుతన్నట్లు చెప్పిన కమర్ మరో ఆసక్తికర అంశాన్ని వెల్లడించారు. 'నేను తొలిసారిగా నరేంద్ర మోదీ గారికి రాఖీ కట్టినప్పుడు ఆయన ఓ సాధారణ కార్యకర్తగా ఉన్నారు. కానీ నిరంతరం కృషి, పట్టుదలతో అంచెలంచెలుగా ఓ వ్యక్తి ఎదిగితే ఎలా ఉంటారో చెప్పడానికి మోదీనే నిదర్శనంగా చెప్పవచ్చునని' పాక్ మహిళ కొనియాడారు. 'గత 22, 23 ఏళ్లుగా నరేంద్ర మోదీకి రాఖీ కడుతున్నాను. ప్రస్తుతం భారత ప్రధానిగా ఉన్న ఆయన ఎన్నో కార్యక్రమాల్లో బిజీగా ఉంటారని భావించాను. కానీ ఎంతో ప్రేమతో ఆయన రెండు రోజుల కిందట రక్షా బంధనం గురించి నాకు ఫోన్ కాల్ చేశారు. నా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మరోసారి మోదీకి రాఖీ కట్టబోతున్నానని' కమర్ మోహ్సిన్ వివరించారు.