quarterly tests
-
కలెక్టర్లకు త్రైమాసిక పరీక్షలు!
సాక్షి, అమరావతి: పరీక్షలు రాసిన విద్యార్థులు ఫలితాల కోసం ఎదురు చూస్తున్న మాదిరిగానే ప్రతి మూడు నెలలకోమారు అధికారులు కూడా పనితీరును, ఫలితాలను సమీక్షించుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు. సీఎం నివాస సముదాయంలో కొత్తగా నిర్మించిన గ్రీవెన్స్ హాలులో గురువారం ప్రారంభమైన కలెక్టర్ల కాన్ఫరెన్సులో సీఎం ప్రసంగించారు. ఐక్యరాజ్య సమితి నిర్దేశించిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించేలా కలెక్టర్లు కృషి చేయాలని సీఎం ఆదేశించారు. అటవీ సంపదను మార్కెటింగ్ చేయడం ద్వారా వృద్ధి సాధించే దిశగా ప్రణాళికలు రూపొందించాలని అటవీశాఖ ముఖ్య కార్యదర్శి అనంతరామును ఆదేశించారు. అవసరమైతే సస్పెండ్ చేయండి... కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులను సకాలంలో ఖర్చు చేయలేకపోవడం, వినియోగ పత్రాలు సమర్పించకపోవడం పట్ల ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘పురపాలక, పట్టణాభివృద్ధి శాఖకు వచ్చిన కేంద్ర నిధులను 15 నెలలైనా ఖర్చు చేయకపోవడం దారుణం. అవసరమైతే బాధ్యులను సస్పెండ్ చేయండి. ఎవరి కోసమో రాష్ట్రం నష్టపోతుంటే చూస్తూ ఉంటున్నారా?..’ అని కొందరు విభాగాధిపతులను ఉద్దేశించి సీఎం తీవ్ర స్వరంతో వ్యాఖ్యానించారు. కేంద్రనిధులు పొందేందుకు ప్రణాళికా బద్ధంగా కృషి చేయాలని, ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాష్‌తో సమన్వయం చేసుకోవా లని సూచించారు. నిధుల వినియోగ పత్రాలు పెండింగ్‌లో పెట్టవద్దన్నారు. మూడంచెల వ్యవస్థ రావాలి: సీఎం రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ వ్యవస్థ వల్ల ఎలాంటి ప్రయోజనం కనిపించడం లేదని సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. మూడంచెల వ్యవస్థను తెచ్చేందుకు చొరవ చూపాలని నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్‌కుమార్‌ను కోరారు. -
త్రైమాసిక పరీక్షలు మరోసారి వాయిదా?
శ్రీకాకుళం: జిల్లాలో త్రైమాసిక పరీక్షలు మరోసారి వాయిదా పడే అవకాసం కనిపిస్తోంది. అక్టోబర్ 2 నుంచి 20 వరకు జరగనున్న ‘జన్మభూమి-మన ఊరు’ కార్యక్రమంలో ఉపాధ్యాయులను భాగస్వామ్యులను చేసిన నేపథ్యంలో ప్రభుత్వం పరీక్షలను వాయిదా వేయాలని యోచిస్తోంది. దసరా సెలవులు ముందే పరీక్షలు జరగాల్సి ఉంది. అయితే, 1 నుంచి 8వ తరగతి వరకు ఆర్వీఎం పరీక్ష పత్రాలను ముద్రించాల్సి ఉంటుంది. ఆ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు స్కూల్ కాంప్లెక్స్ ఉపాధ్యాయులకు ముద్రణా బాధ్యతలను అప్పగించారు. నూతనంగా ప్రవేశపెట్టిన సమ్మెటివ్ విధానం ప్రకారం ప్రశ్న పత్రంతో పాటు జవాబులు రాసేందుకు బుక్లెట్ తరహాలో ప్రశ్నపత్రాలను తయారు చేయాల్సి ఉంటుంది. ఒక్కో తరగతికి ఆరు ప్రశ్నపత్రాలను తయారు చేసేందుకు రెండున్నర రూపాయలను మాత్రమే మంజూరు చేయడంతో స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు ప్రశ్నపత్రాలు తయారు చేయలేక చేతులెత్తేశారు. ఎన్నో రకాలుగా ప్రయత్నించినా వారు ముందుకు రాకపోగా ఉపాధ్యాయ సంఘాలు సైతం ఆందోళనకు సిద్ధమయ్యాయి. ఇలాంటి తర్జనభర్జనల నేపథ్యంలో పరీక్షలను దసరా సెలవుల తరువాతకు మార్పు చేసి ఈ నెల 9 నుంచి పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. స్కూల్‌కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులకు బదులుగా ఆర్వీఎం అధికారులే రంగంలోకి దిగి ఓ ప్రింటర్‌ను బ్రతిమలాడి రెండున్నర రూపాయలకే ప్రశ్నపత్రాన్ని ముద్రిస్తున్నారు. తరగతి వారీగా చూస్తే 1వ తరగతికి తొమ్మిది పేజీలు, రెండో తరగతికి 10 పేజీలు, 3, 4, 5 తరగతులకు 16 పేజీలు, 6వ తరగతికి 36 పేజీలు, 7కు 38 పేజీలు, 8కు 42 పేజీలు ఆరు సబ్జెక్టులకుగానూ అందించాల్సి ఉంటుంది. వీటికి 4.48 రూపాయలు ఖర్చు అవుతుందని లెక్కకట్టి రాష్ట్ర అధికారులకు నివేదించినా వారు రెండున్నర రూపాయలకు మించి ఇచ్చేది లేదని చెప్పడంతో జిల్లా అధికారులు ఓ ముద్రణాలయ యజమానిని ఆ మేరకే ఒప్పించగలిగారు. అయితే ఆ యజమాని ఎటువంటి కాగితాన్ని వినియోగిస్తారా అన్నదే ప్రస్తుతం అందరినీ తొలిచేస్తున్న ప్రశ్న. ఇదిలా ఉంటే 9,10 తరగతుల ప్రశ్నపత్రాల ముద్రణ విషయం ఈ సారి ఎలాగోలా గట్టెక్కినా అర్ధసంవత్సరం పరీక్షలు వచ్చేసరికి దీనిలో కూడా గందరగోళం నెలకొని ఉంది. ఈ ప్రశ్నపత్రాలను విద్యాశాఖ కామన్ ఎగ్జామినేషన్ బోర్డు ద్వారా ముద్రింపజేస్తోంది. ఇటీవల ఈ బోర్డును రాష్ట్ర ప్రభుత్వం ఎత్తివేస్తున్నట్టు ఉత్తర్వులు పంపించడంతో అర్ధసంవత్సర పరీక్షల పేపర్లను ముద్రించే అవకాశం లేదు. అటువంటప్పుడు 1 నుంచి 8 తరగతులకు ఇచ్చిన రేట్లనే 9,10 తరగతుల వారికి కూడా మంజూరు చేస్తే ప్రశ్నపత్రాలు ముద్రించేవారే కరువవుతారు. ఇలా నిధులు మంజూరు చేయడం కంటే రాష్ట్ర స్థాయిలోనే ముద్రించి ప్రశ్నపత్రాలను పంపిస్తే బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. లేనిపక్షంలో టెండర్ విధానం ద్వారా ముద్రణా బాధ్యతలను అప్పగించేందుకు ప్రభుత్వమే రేట్లను నిర్ధేశించి అనుమతివ్వాలని ఉపాధ్యాయులు, అధికారులు అంటున్నారు. ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాలి మరి. -
టీచర్లకు ‘పరీక్'
గుంటూరు ఎడ్యుకేషన్ ప్రభుత్వ పాఠశాలల్లో త్రైమాసిక పరీక్షల నిర్వహణకు అవసరమైన ప్రశ్నపత్రాలు ఇంకా సిద్ధం కాలేదు. సర్వశిక్షా అభియూన్ అధికారుల నిర్లక్ష్యమే ఇందుకు కారణం. ప్రశ్నపత్రాలను దసరా సెలవుల్లో ఉపాధ్యాయులతో తయూరుచేరుుంచి అక్టోబర్ 8 నుంచి 17వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం జిల్లా విద్యాశాఖ అధికారులను ఆదేశించింది. సెలవుల్లో కూడా బాధ్యతలు అప్పగించటంపై ఉపాధ్యాయులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. {పశ్నపత్రాల ముద్రణ, పంపిణీ బాధ్యతలను జిల్లా కామన్ ఎగ్జామినేషన్ బోర్డు నుంచి తప్పించి సర్వశిక్షా అభియాన్‌కు అప్పగించడంతో ఈ పరిస్థితి తలెత్తింది. గతేడాది వరకు ప్రభుత్వ, ఎయిడెడ్, గుర్తింపు పొందిన ప్రైవేటు పాఠశాలల్లో 6,7,8 తరగతుల విద్యార్థులకు జిల్లా కామన్ ఎగ్జామినేషన్ బోర్డు, ఒకటి నుంచి 5వ తరగతుల విద్యార్థులకు సర్వ శిక్షా అభియాన్.. త్రైమాసిక, అర్ధ సంవత్సర పరీక్షల ప్రశ్నపత్రాలను పంపిణీ చేసేవి. జాతీయ విద్యాహక్కు చట్టం అమల్లోకి రావటంతో ఒకటి నుంచి 8వ తరగతి వరకూ ప్రాథమిక విద్యగా మారింది. దీంతో ఈ తరగతుల వారందరికీ ప్రశ్నపత్రాలను అందించాల్సిన బాధ్యత ఎస్ఎస్ఏపై పడింది. ఆలస్యంగా స్పందించిన ఎస్ఎస్ఏ అధికారులు ప్రశ్నపత్రాల రూపకల్పన బాధ్యతలను స్కూల్ కాంప్లెక్స్‌లకు అప్పగించారు. ఈ మేరకు పశ్నపత్రాలను ముద్రించి, పరీక్షలు నిర్వహించుకోవాలని జిల్లాలోని 292 స్కూల్ కాంప్లెక్స్‌లకు ఆదేశాలు జారీ చేశారు. = ప్రభుత్వ, జెడ్పీ, ఎయిడెడ్, మున్సిపల్, గుర్తింపు పొందిన పాఠశాలలకు స్కూల్ కాంప్లెక్స్‌లు ప్రశ్నపత్రాలను ముద్రించాల్సి ఉండగా ప్రైవేటు పాఠశాలల్లోని 6,7,8 తరగతుల విద్యార్థులకు మాత్రం జిల్లా కామన్ ఎగ్జామినేషన్ బోర్డు ప్రశ్నపత్రాలను సిద్ధం చేసింది. = ఎస్ఎస్ఏ అధికారులు సకాలంలో స్పందించని కారణంగా పండుగ సెలవుల్లో ప్రశ్నపత్రాల రూపకల్పన బాధ్యత తమపై పడిందని ఉపాధ్యాయులు విమర్శిస్తున్నారు. ఇబ్బందికరమే.. పండుగ సెలవుల్లో ఉపాధ్యాయులందరినీ సమావేశపరచటం, వారితో ప్రశ్నపత్రాలను తయారు చేరుుంచటం ఇబ్బందికరమే. అరుునా తప్పదు కనుక సబ్జెక్టులవారీగా ప్రశ్నపత్రాలను రూపొందించే బాధ్యతను ఆయూ ఉపాధ్యాయులకు అప్పగిస్తున్నాం. - కె. రేణుక, ప్రధానోపాధ్యాయిని, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, గుంటూరు