
టీచర్లకు ‘పరీక్'
గుంటూరు ఎడ్యుకేషన్
ప్రభుత్వ పాఠశాలల్లో త్రైమాసిక పరీక్షల నిర్వహణకు అవసరమైన ప్రశ్నపత్రాలు ఇంకా సిద్ధం కాలేదు. సర్వశిక్షా అభియూన్ అధికారుల నిర్లక్ష్యమే ఇందుకు కారణం. ప్రశ్నపత్రాలను దసరా సెలవుల్లో ఉపాధ్యాయులతో తయూరుచేరుుంచి అక్టోబర్ 8 నుంచి 17వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం జిల్లా విద్యాశాఖ అధికారులను ఆదేశించింది. సెలవుల్లో కూడా బాధ్యతలు అప్పగించటంపై ఉపాధ్యాయులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
{పశ్నపత్రాల ముద్రణ, పంపిణీ బాధ్యతలను జిల్లా కామన్ ఎగ్జామినేషన్ బోర్డు నుంచి తప్పించి సర్వశిక్షా అభియాన్‌కు అప్పగించడంతో ఈ పరిస్థితి తలెత్తింది.
గతేడాది వరకు ప్రభుత్వ, ఎయిడెడ్, గుర్తింపు పొందిన ప్రైవేటు పాఠశాలల్లో 6,7,8 తరగతుల విద్యార్థులకు జిల్లా కామన్ ఎగ్జామినేషన్ బోర్డు, ఒకటి నుంచి 5వ తరగతుల విద్యార్థులకు సర్వ శిక్షా అభియాన్.. త్రైమాసిక, అర్ధ సంవత్సర పరీక్షల ప్రశ్నపత్రాలను పంపిణీ చేసేవి. జాతీయ విద్యాహక్కు చట్టం అమల్లోకి రావటంతో ఒకటి నుంచి 8వ తరగతి వరకూ ప్రాథమిక విద్యగా మారింది. దీంతో ఈ తరగతుల వారందరికీ ప్రశ్నపత్రాలను అందించాల్సిన బాధ్యత ఎస్‌ఎస్‌ఏపై పడింది.
ఆలస్యంగా స్పందించిన ఎస్‌ఎస్‌ఏ అధికారులు ప్రశ్నపత్రాల రూపకల్పన బాధ్యతలను స్కూల్ కాంప్లెక్స్‌లకు అప్పగించారు. ఈ మేరకు పశ్నపత్రాలను ముద్రించి, పరీక్షలు నిర్వహించుకోవాలని జిల్లాలోని 292 స్కూల్ కాంప్లెక్స్‌లకు ఆదేశాలు జారీ చేశారు.
= ప్రభుత్వ, జెడ్పీ, ఎయిడెడ్, మున్సిపల్, గుర్తింపు పొందిన పాఠశాలలకు స్కూల్ కాంప్లెక్స్‌లు ప్రశ్నపత్రాలను ముద్రించాల్సి ఉండగా ప్రైవేటు పాఠశాలల్లోని 6,7,8 తరగతుల విద్యార్థులకు మాత్రం జిల్లా కామన్ ఎగ్జామినేషన్ బోర్డు ప్రశ్నపత్రాలను సిద్ధం చేసింది.
= ఎస్‌ఎస్‌ఏ అధికారులు సకాలంలో స్పందించని కారణంగా పండుగ సెలవుల్లో ప్రశ్నపత్రాల రూపకల్పన బాధ్యత తమపై పడిందని ఉపాధ్యాయులు విమర్శిస్తున్నారు.
ఇబ్బందికరమే..
పండుగ సెలవుల్లో ఉపాధ్యాయులందరినీ సమావేశపరచటం, వారితో ప్రశ్నపత్రాలను తయారు చేరుుంచటం ఇబ్బందికరమే. అరుునా తప్పదు కనుక సబ్జెక్టులవారీగా ప్రశ్నపత్రాలను రూపొందించే బాధ్యతను ఆయూ ఉపాధ్యాయులకు అప్పగిస్తున్నాం.
- కె. రేణుక, ప్రధానోపాధ్యాయిని, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, గుంటూరు