question papers leak
-
పారదర్శకతే సరైన మార్గం
-
పారదర్శకతే సరైన మార్గం
యాదృచ్ఛికమే కావొచ్చుగానీ... జాతీయ స్థాయి పోటీ పరీక్షల ప్రశ్నపత్రాలు వరసపెట్టి లీక్ అవుతున్న తరుణంలోనే ట్రెయినీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేడ్కర్ ఎంపిక వ్యవహారం బద్దలై యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ)పై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శిగా పనిచేసి నాలుగేళ్ల క్రితం రిటైరైన ప్రీతి సుదాన్కు సంస్థ సారథ్యం అప్పగించారు. ఆమె యూపీఎస్సీని చక్కదిద్దుతారన్న నమ్మకం అందరిలోవుంది.సాధారణంగా ప్రశ్నపత్రాల లీక్ ఉదంతాలు చోటుచేసుకున్నప్పుడల్లా యూపీఎస్సీని అందరూ ఉదాహరణగా చూపేవారు. దాన్ని చూసి నేర్చుకోవాలని హితవు పలికేవారు. అలాగని యూసీఎస్సీపై అడపా దడపా ఆరోపణలు లేకపోలేదు. ముఖ్యంగా అంగవైకల్యం ఉన్నట్టు చూపటం, తప్పుడు ఆదాయ ధ్రువీకరణ పత్రాలు దాఖలుచేయటం వంటి మార్గాల్లో అనర్హులు సివిల్ సర్వీసులకు ఎంపికవు తున్నారన్న ఆరోపణలు అధికం. ఫలితాల ప్రకటనలో ఎడతెగని జాప్యం సరేసరి. అయితే వీటికిసంతృప్తికరమైన సంజాయిషీలు రాలేదు. పరీక్ష నిర్వహణ మాటెలావున్నా ధ్రువీకరణ పత్రాల తనిఖీకి ఆ సంస్థ పకడ్బందీ విధానాలు పాటించడం లేదన్న విమర్శలున్నాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏదో క్రమంలో పొరపాట్లు చోటుచేసుకునే ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది. వెనువెంటనే ఆరా తీసి సరిదిద్దుకుంటే అవి పునరావృతమయ్యే అవకాశాలు ఉండవు. విమర్శలు, ఆరోపణలు వచ్చిన ప్రతిసారీ తక్షణం స్పందించే లక్షణం ఉండాలంటే జవాబుదారీతనం, పారదర్శకత తప్పని సరి. అవి లోపించాయన్నదే యూపీఎస్సీపై ప్రధాన ఫిర్యాదు. ఒకపక్క అభ్యర్థులకు నైతిక విలువల గురించి ప్రశ్నపత్రం ఇస్తూ అలాంటి విలువలు సంస్థలో కిందినుంచి పైవరకూ ఉండటంపై ప్రత్యేక శ్రద్ధ అవసరమని గుర్తించకపోతే అంతిమంగా న ష్టం కలిగేది సంస్థకే. పూజ గురించిన వివాదాలు సామాజిక మాధ్యమాల్లో బయటికొచ్చాక ఇప్పటికే సర్వీసులో చేరిన కొందరిపై ఆరోపణలు వెల్లు వెత్తాయి. కాళ్లకు సంబంధించి అంగ వైకల్యం ఉన్నట్టు చూపి ఉద్యోగం పొందారంటూ ఒక అధికారి వీడియో బయటికొచ్చింది. అందులో ఆయన నిక్షేపంగా ఉండటమేగాక సైక్లింగ్, రన్నింగ్ చేస్తున్నట్టు కనబడుతోంది. ఆయన నిజంగానే అలాంటి తప్పుడు పత్రంతో చేరారా లేక ఆ అధికారిపై బురద జల్లారా అనేది తెలియదు. తక్షణం స్పందించే విధానం రూపొందించుకుంటే తప్పుడు ఆరోపణలు చేసినవారిపై చర్య తీసుకునే వీలుంటుంది. లేదా సంబంధిత అధికారినుంచి సంజాయిషీ కోరే అవ కాశం ఉంటుంది. రెండూ లేకపోతే ఎవరికి తోచినవిధంగా వారు అనుకునే పరిస్థితి ఏర్పడుతుంది. యూపీఎస్సీ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న మనోజ్ సోనీ రాజీనామా ఉదంతంలో కూడా సక్రమంగా వ్యవహరించలేదు. నిరుడు మే 16న చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన సోనీ అయిదేళ్ల కాల వ్యవధికి చాలా చాలా ముందే ఎందుకు తప్పుకున్నారు? చూసేవారికి స్పష్టంగా పూజ ఎంపిక వ్యవహారం తక్షణ కారణంగా కనబడుతుంది. కానీ ఆ సంస్థ అదేం కాదంటోంది. ‘వ్యక్తిగత కార ణాలే’ అని సంజాయిషీ ఇస్తోంది. అటు కేంద్రం సైతం ఏమీ మాట్లాడదు. దీనివల్ల ప్రజల్లో అనుమా నాలు తలెత్తితే... మొత్తంగా అది సంస్థ ప్రతిష్ఠను దెబ్బతీయదా? అభ్యర్థులు తాము బాగా రాసినా అక్కడేదో జరిగిందన్న అపోహలుపడే పరిస్థితి తలెత్తదా? అసలు ఇలాంటివి జరుగుతున్నాయన్న నమ్మకాలు బలపడితే అభ్యర్థులు ఆత్మవిశ్వాసంతో పరీక్షలకూ, ఆ తర్వాత ఇంటర్వ్యూలకూ హాజరు కాగలరా? నూతన సారథి ఈ అంశాలపై ఆలోచన చేయాలి. పూజ ఉదంతంలో కోల్పోయిన విశ్వసనీయతను పెంపొందించుకోవటానికి ఏమేం చర్యలు అవసరమన ్న పరిశీలన చేయాలి. అభ్యర్థుల మదింపు విషయంలో అనుసరించే విధానాల గురించి... ముఖ్యంగా వారి జవాబుపత్రాల దిద్దుబాటుకూ, ఆ తర్వాత జరిగే ఇంటర్వ్యూలో అభ్యర్థులిచ్చే జవాబుల ద్వారా వారి శక్తియుక్తు లనూ, సామర్థ్యాన్ని నిర్ధారించే పద్ధతులకూ ఎలాంటి ప్రమాణాలు పాటిస్తారో తెలపాలి. చదువుల్లో, సమస్యలను విశ్లేషించే సామర్థ్యంలో మెరికల్లా ఉండటం, సమాజంలో అపరిష్కృతంగా మిగిలిపోతున్న అంశాల విషయంలో ఏదో ఒకటి చేయాలన్న తపన, తాపత్రయంఉండటం, నాయకత్వ లక్షణాలు ప్రదర్శించటం సివిల్ సర్వీసుల అభ్యర్థులకు అవసరమని చాలా మంది చెబుతారు. నిజానికి ఈ సర్వీసుల్లో పనిచేసేవారి జీతభత్యాలకు అనేక రెట్లు అధికంగా సాఫ్ట్వేర్ రంగంలో లేదా వ్యాపారాల్లో మునిగితేలేవారు సంపాదిస్తారు. అందుకే ఎంతో అంకిత భావం ఉండేవారు మాత్రమే ఇటువైపు వస్తారు. కానీ అలాంటివారికి యూపీఎస్సీ ధోరణి నిరాశ కలిగించదా? నీతిగా, నిజాయితీగా పాలించటం చేతకాని పాలకుల ఏలుబడిలో పనిచేయాల్సి వచ్చి నప్పుడు సర్వీసులో కొత్తగా చేరిన యువ అధికారులు ఎంతో నిరాశా నిస్పృహలకు లోనవుతున్నారు. అసలు యూపీఎస్సీయే నిర్లక్ష్యం లోనికో, నిర్లిప్తత లోనికో జారుకుంటే ఎవరిని నిందించాలి? పూజా ఖేడ్కర్‌కు సంబంధించి ఇంకా దోష నిర్ధారణ జరగలేదు. ప్రస్తుతం ఆమె కేవలం నిందితురాలు మాత్రమే. పునః శిక్షణకు రావాలన్న సూచనను బేఖాతరు చేయటంతో ఇప్పటికే యూపీఎస్సీ ఆమె ఎంపికను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. మరోపక్క పోలీసులూ, యూపీఎస్సీ నియమించిన కమిటీ ఆమె సమర్పించిన ధ్రువీకరణ పత్రాలపై ఆరా తీస్తున్నారు. ఆమె ముందస్తు బెయిల్ దరఖాస్తును న్యాయస్థానం తిరస్కరించింది. ఈ పరిణామంతో ఆమె దుబాయ్‌కి పరారీ అయ్యారన్న కథనాలు కూడా మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఈ ఉదంతంలోనైనా జరిగిందేమిటో వివరిస్తే, ఇది పునరావృతం కాకుండా తీసుకున్న చర్యలేమిటో చెబితే యూపీఎస్సీపై విశ్వసనీయత పెరుగుతుంది. దాని ప్రతిష్ఠ నిలబడుతుంది. -
ఐదేళ్లు... 65 పేపర్ల లీకులు
సాక్షి, అమరావతి : దేశంలో ప్రశ్నపత్రాల లీకులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటికే నీట్ ప్రశ్నపత్రాల లీకేజీపై దేశవ్యాప్తంగా ఆందోళనలు.. దానిపై సీబీఐ దర్యాప్తునకు కేంద్రం ఆదేశించిన నేపథ్యంలో ఇప్పుడు ప్రశ్నపత్రాల లీకేజీ అంశాలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. కోసం నిర్వహించే పోటీ పరీక్షలు.. వైద్య, ఇంజినీరింగ్ తదితర కోర్సుల్లో చేరేందుకు ప్రవేశపరీక్షలు, వార్షిక పరీక్షల ప్రశ్నపత్రాలు లీకుకావడం అంతకంతకూ పెరుగుతోంది. ప్రధానంగా 2019 నుంచి 2024 వరకు ప్రశ్నపత్రాలు లీకులు అమాంతంగా పెరిగాయి. ఈ ఐదేళ్లలో దేశవ్యాప్తంగా 19 రాష్ట్రాల్లో ఏకంగా 65 రకాల పరీక్షల ప్రశ్నపత్రాలు లీకుకావడం గమనార్హం. గత ఐదేళ్లలో దేశవ్యాప్తంగా ప్రశ్నపత్రాల లీకుల వివరాలివీ..» 2019–24 మధ్య దేశంలో పోటీ పరీక్షలు, ప్రవేశ పరీక్షలు, వార్షిక పరీక్షలకు సంబంధించి 65 ప్రశ్నపత్రాలు లీకయ్యాయి. వాటిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వాటిలో సైన్యంలో నియామకాల కోసం నిర్వహించిన ఆర్మీ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్–2021, ఉపాధ్యాయుల నియామకం కోసం నిర్వహించిన సెంట్రల్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటీఈటీ)–2023, నీట్–యూజీ–2021, జాయింట్ ఎంటన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్స్–2021 ప్రధానమైవి. » ప్రశ్నపత్రాలు లీకైన వాటిలో 45 పరీక్షలు ఉద్యోగాల నియామకాలకు సంబంధించిన పోటీ పరీక్షల ప్రశ్నాపత్రాలు 45 ఉన్నాయి. మొత్తం మూడు లక్షల ఉద్యోగాల భర్తీకోసం ఆ పరీక్షలు నిర్వహించారు. వాటిలో రాజస్థాన్, ఉత్తరప్రదేశ్‌లలో టీచర్ల నియామక పోటీ పరీక్షలు, అసోం, రాజస్థాన్, కర్ణాటక, జమ్మూ–కశ్మీర్‌లలో పోలీసు నియామక పరీక్షలు, ఉత్తరాఖండ్ అటవీ శాఖలో ఉద్యోగాల భర్తీ పరీక్ష, తెలంగాణ, గుజరాత్, రాజస్థాన్‌లలో జూనియర్ ఇంజినీర్ పోస్టుల భర్తీ పరీక్షలు మొదలైనవి ఉన్నాయి.» ఇక ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశాలకు కోసం నిర్వహించిన 17 ప్రవేశ పరీక్షల ప్రశ్నపత్రాలూ లీకయ్యాయి. » మొత్తం మీద గత ఐదేళ్లలో ఇలా 65 రకాల ప్రశ్నపత్రాలు లీక్ కాగా.. వాటిలో 27 పరీక్షలను రద్దుచేయడంగానీ వాయిదా వేయడంగానీ చేశారు. » అలాగే, గత ఐదేళ్లలో 19 రాష్ట్రాల్లో ప్రశ్నపత్రాలు లీకయ్యాయి. మొదటి రెండు స్థానాల్లో ఉత్తరప్రదేశ్, బిహార్ ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లో ఎనిమిది ప్రశ్నపత్రాలు, బిహార్‌లో ఆరు లీకయ్యాయి. గుజరాత్, మధ్యప్రదేశ్‌లలో నాలుగు చొప్పున.. హరియాణా, కర్ణాటక, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లలో మూడేసి ప్రశ్నాపత్రాలు.. తెలంగాణ, ఢిల్లీ, మణిపుర్‌లలో రెండేసి ప్రశ్నపత్రాలు లీక్ కాగా.. జమ్మూ–కశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్‌లలో ఒక్కో ప్రశ్నపత్రం లీకైంది. శభాష్ ఏపీవైఎస్సార్‌సీపీ ప్రభుత్వ ఘనత ఇదీ..2019–24 మధ్య కాలంలో పోటీ పరీక్షల నిర్వహణ దేశవ్యాప్తంగా విఫలమైనప్పటికీ ఏపీకు మాత్రం ఆ మరక అంటలేదు. గత ఐదేళ్లలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఉద్యోగ నియామకాల కోసం నిర్వహించిన పోటీ పరీక్షలు, ఉన్నత విద్యా సంస్థల్లో చేరేందుకు నిర్వహించిన ప్రవేశపరీక్షలను పకడ్బందీగా నిర్వహించింది. ఏకంగా ఒకేసారి 1.50 లక్షల మంది గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల నియామక పరీక్ష, 6,500 మంది పోలీసుల నియామక పరీక్ష, గ్రూప్–1, గ్రూప్–2 తదితర ప్రవేశ పరీక్షలను వైఎస్సార్సీపీ ప్రభుత్వం సమర్థవంతంగా నిర్వహించింది. -
చొరబడితే చేసేదేంటి?
సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీక్ తర్వాత విద్యాశాఖలో కలవరం మొదలైంది. లక్షలాది మంది విద్యార్థుల భవితవ్యంతో ముడివడి ఉన్న ఇంటర్ బోర్డు, ఉన్నత విద్యా మండలి, పాఠశాల విద్యలో సాంకేతిక భద్రత ఏ మేరకు ఉందనే దానిపై ఉన్నతాధికారులు దృష్టి సారించారు. వాస్తవానికి విద్యా వ్యవస్థలో పరీక్షల దగ్గర్నుంచీ, పాలనపరమైన విధానాలన్నీ ఆన్లైన్లోనే జరుగుతున్నాయి. ప్రతి సందర్భంలో ఏదో ఒక సమస్య తలెత్తుతున్నా, దాన్ని అధిగమిస్తూ ముందుకెళ్లడమే తప్ప ఇప్పటివరకు అందుకు మూల కారణాలను అన్వేషిం చిన దాఖలాల్లేవు. పలు కీలకమైన సందర్భాల్లో సర్వర్లు మొరాయించడమో, ఇతర సాంకేతిక పరమైన సమస్యలు రావడమో జరుగుతోంది. ఇలాంటి సందర్భాల్లో బయట వ్యక్తులతో మరమ్మతులు చేయిస్తున్నారు కానీ సొంత సంస్థల్లో నిష్ణాతులైన సాంకేతిక నిపుణుల నియామకంపై దృష్టి పెట్టడం లేదు. ఈ పరిస్థితి భవిష్యత్‌లో తమకూ ఇబ్బంది కలిగించవచ్చనే చర్చ విద్యాశాఖలో జరుగుతోంది. ఈ నేపథ్యంలో గతంలో ఎదురైన సవాళ్ళపై అంతర్గత సమీక్ష చేపట్టారు. పాఠశాల విద్యలో పలుమార్లు సమస్యలు.. రాష్ట్రంలో దాదాపు 60 లక్షల మంది ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్నారు. టెన్త్ పరీక్షలు రాసే వాళ్లు ఏటా దాదాపు 5 లక్షల మంది వరకు ఉంటారు. టీచర్లు 1.05 లక్షల మంది పని చేస్తున్నారు. ప్రశ్నపత్రాలు, ఉపాధ్యాయుల సర్వీస్ రికార్డులన్నీ ఈ ఫైలింగ్ ద్వారానే భద్రపరుస్తారు. ఇంత ముఖ్యమైన శాఖలో హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్ నిర్వహణ ప్రైవేటు వ్యక్తులే ఎక్కువగా చూస్తుంటారు. శాశ్వత ఐటీ నిపుణులంటూ ఎవరూ లేరు. చిన్నచిన్న సమస్యలను కాస్తోకూస్తో కంప్యూటర్, సాఫ్ట్వేర్ పరిజ్ఞానం ఉన్న విద్యాశాఖ సిబ్బందే పరిష్కరిస్తుంటారు. గోప్యంగా ఉండాల్సిన ఫైళ్ళు, ప్రశ్నపత్రాలకు సంబంధించిన కీలక పాస్వర్డ్స్ అన్నీ ముఖ్యుల పర్యవేక్షణలో ఉంటాయి. అయితే ఫైర్‌వాల్స్, రక్షణ వ్యవస్థ మాత్రం వీళ్ళలో చాలామందికి తెలియదు. గత ఏడాది టెట్ నిర్వహించినప్పుడు అనేక తప్పులు దొర్లాయి. 317 జీవోతో జరిగిన బదిలీల సమయంలోనూ రకరకాల తప్పులు బయటకొచ్చాయి. వీటిని సరిచేయడానికి కొన్ని నెలలు పట్టింది. కీలక సమాచారం భద్రతకు వాడే ఫైర్‌వాల్స్, సాఫ్ట్వేర్ అప్డేట్ చేసే వ్యక్తుల సమగ్ర సమాచారం కూడా అధికారుల వద్ద లేదు. ఈ నేపథ్యంలో కీలకమైన పాస్వర్డ్స్ బయటకెళ్తే సమస్యలు తప్పవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఉన్నత విద్యలోనూ డొల్లే.. దేశ, విదేశాల్లో మన రాష్ట్ర విశ్వవిద్యాలయాల పేరుతో నకిలీ సరి్టఫికెట్లు వెలుగు చూస్తున్నాయి. హైదరాబాద్‌లో ఇలాంటివి ముద్రించే గ్యాంగ్‌లను పట్టుకున్నారు. అయినా ఇవి ఆగడం లేదు. ఏకంగా వర్సిటీల వెబ్‌సైట్లలోకే హ్యాకర్స్ ప్రవేశించే ప్రయత్నం జరిగిందనే వార్తలూ వచ్చాయి. కాగా నకిలీ సర్టఫికెట్ల అదుపునకు పోలీసులు, ఉన్నత విద్యా మండలి ప్రత్యేక వెబ్‌సైట్‌ను రూపొందించాయి. విద్యార్థులకు సంబంధించిన కొన్నేళ్ళ సరి్టఫికెట్లను ఈ వెబ్సైట్లో నిక్షిప్తం చేస్తున్నారు. అయితే ఈ వెబ్సైట్ ప్రారంభం సందర్భంగా అప్పటి డీజీపీ మహేందర్ రెడ్డి.. ఇలాంటి వెబ్సైట్లకు బ్లాక్‌చైన్ టెక్నాలజీతో భద్రత ఉండాలని సూచించారు. ఉన్నత విద్యా మండలిలో కేవలం ఒకే ఒక వ్యక్తి, అదీ అరకొర సాంకేతిక పరిజ్ఞానం ఉన్న వ్యక్తి మాత్రమే ఈ వెబ్‌సైట్‌ను నిర్వహిస్తున్నారు. కానీ ఇప్పటికీ కీలక సమాచారం, గోప్యంగా ఉండాల్సిన పాస్ట్‌వర్డ్స్ భద్రతకు మండలిలో గానీ, విశ్వవిద్యాలయాల్లో గానీ సరైన వ్యవస్థ లేదని అధికారులే అంటున్నారు. -
పెన్‌డ్రైవ్‌లో పలు పేపర్లు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాల లీకేజీ కేసు దర్యాప్తులో కీలకాంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ వ్యవçహారంలో కీలక సూత్రధారిగా ఉన్న కమిషన్ కార్యదర్శి మాజీ వ్యక్తిగత సహాయకుడు పులిదిండి ప్రవీణ్‌కుమార్ పెన్‌డ్రైవ్‌లో అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్, గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ పోస్టులకు సంబంధించిన పరీక్షల పేపర్లు ఉన్నట్లు ఫోరెన్సిక్ నిపుణులు గుర్తించారు. మరోపక్క ఈ కేసు దర్యాప్తు కోసం ఏర్పాటైన సిట్ తన పనిలో నిమగ్నమైంది. యూజర్ ఐడీ, పాస్వర్డ్ తస్కరించి.. తన ‘సన్నిహితురాలు’లవడ్యావత్ రేణుక కోరడంతో క్వశ్చన్ పేపర్ల లీక్‌కు ప్రవీణ్‌కుమార్ తెగించాడు. నెట్వర్క్ అడ్మిన్ రాజశేఖర్ సహాయంతో రంగంలోకి దిగాడు. పేపర్లన్నీ కమిషన్ కాన్ఫిడెన్షియల్ సెక్షన్‌లోని కంప్యూటర్లో ఉంటాయి. యూజర్ ఐడీ, పాస్వర్డ్ కస్టోడియన్ శంకరలక్ష్మి వద్ద ఉన్నాయి. వీటిని ఆమె తాను నిత్యం వినియోగించే నోట్ పుస్తకం ఆఖరు పేజీలో రాసి పెట్టుకున్నారు. గత నెల ఆఖరి వారంలో ఆమె కార్యదర్శి పేషీకి వచ్చినప్పుడు దృష్టి మళ్లించడం ద్వారా వాటిని నమోదు చేసుకున్నాడు. టీఎస్పీఎస్సీలోని అన్ని కంప్యూటర్లు ల్యాన్ నెట్‌వర్క్‌తో కనెక్ట్ అయి ఉంటాయి. ఈ విషయం తెలిసిన రాజశేఖర్.. ప్రవీణ్ కంప్యూటర్ నుంచే శంకరలక్ష్మి యూజర్ ఐడీ, పాస్వర్డ్ ఉపయోగించి లాగిన్ అయ్యేలా సహకరించాడు. క్షణాల్లో పని కానిచ్చేయాలని భావించిన ప్రవీణ్ క్వశ్చన్ పేపర్లకు సంబంధించిన ఫోల్డర్ మొత్తం తన పెన్‌డ్రైవ్‌లోకి కాపీ చేసుకున్నాడు. ఫోన్ల విశ్లేషణతోనే పూర్తి స్పష్టత ప్రాథమిక దర్యాప్తు నేపథ్యంలో పోలీసులు ఏఈ పరీక్ష పత్రం మాత్రమే లీక్ అయిందని, ప్రవీణ్ ఫోల్డర్లో ఉన్న మిగిలిన ప్రశ్న పత్రాలు బయటకు రాలేదని తేల్చారు. దీన్ని సాంకేతికంగా నిర్థారించుకోవాలని నిర్ణయించారు. దీనికోసమే నిందితులతో పాటు అనుమానితుల నుంచి స్వాధీనం చేసుకున్న 16 ఫోన్లు, ల్యాప్టాప్స్, పెన్‌డ్రైవ్స్‌లను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపారు. వాటిలో ఏఏ క్వశ్చన్ పేపర్ల షేరింగ్ జరిగింది? ఎవరి నుంచి ఎవరికి వెళ్లాయి? వేటిని కాపీ చేశారు? అంశాలను తేల్చనున్నారు. యువతుల వ్యవహారం పరిగణనలోకి.. ఈ కేసు దర్యాప్తు చేపట్టిన సిట్ బృందం బుధవారం కమిషనర్ సీవీ ఆనంద్‌తో సమావేశమైంది. ప్రాథమికంగా ఈ కేసును సీసీఎస్‌లో రీ–రిజిస్టర్ చేశారు. అదనపు సీపీ ఏఆర్ శ్రీనివాస్ కమిషన్ కార్యాలయానికి వెళ్లి కాన్ఫిడెన్షియల్ సెక్షన్‌తో పాటు ప్రశ్న పత్రాలు భద్రపరిచే విధానం తదితరాలను పరిశీలించారు. కస్టోడియన్ శంకరలక్ష్మి వాంగ్మూలం నమోదు చేశారు. ప్రవీణ్‌తో సన్నిహితంగా ఉన్న 46 మంది మహిళలు, యువతుల వ్యవహారాన్నీ పోలీసులు పరిగణనలోకి తీసుకున్నారు. వీరి వ్యవహారాల్లోనూ ఏవైనా లీకేజీలు, ఇతరత్రా కోణాలు ఉన్నాయా? అనేది తేల్చనున్నారు. అవసరమైన వారిని పిలిచి విచారించాలని నిర్ణయించారు. రెండో ప్రయత్నంలో విషయం లీక్.. ఈ ఫోల్డర్లో అప్పటికే జరిగిపోయిన, జరగాల్సిన పరీక్షలకు సంబంధించిన క్వశ్చన్ పేపర్లు ఉండటాన్ని గుర్తించిన ప్రవీణ్ పెన్డ్రైవ్కు లాక్ సెట్ చేశాడు. గత నెల ఆఖరి వారంలోనే రేణుక కోరిన పరీక్ష పత్రం అందజేశాడు. టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ పరీక్ష (ఈ నెల 12న జరగాల్సిన పరీక్ష), ఇంకా తేదీలు ఖరారు కాని అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్, గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ పోస్టుల పేపర్లను అదును చూసుకుని విక్రయించాలని భావించాడు. ఏఈ పేపర్‌ను రేణుక తదితరులు నీలేష్ , గోపాల్‌లకు రూ.10 లక్షల చొప్పున విక్రయించారు. టౌన్ ప్లానింగ్ పరీక్ష పత్రం విషయాన్నీ రేణుక వీరికి చెప్పింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఉంటే తనకు తెలపాలని కోరింది. ఇలా ఈ పరీక్ష రాసే అభ్యర్థుల కోసం వెతుకుతుండగానే విషయం బయట పడింది. -
పరీక్షల పంచాయితీ
సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం రోజురోజుకు ముదురుతోంది. పలు పరీక్షలకు సంబంధించిన పేపర్లు లీకై ఉంటాయనే అనుమానాల నేపథ్యంలో.. కమిషన్ నిర్వహించిన అన్ని పరీక్షలను రద్దు చేయాలని అభ్యర్థులు, నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. కొన్ని రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు ఏకంగా కమిషన్ చైర్మన్ రాజీనామా చేయాలంటూ ఒత్తిడి పెంచుతున్నాయి. ఈ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలనే డిమాండ్ ఊపందుకుంటోంది. తాజా పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందోనన్న ఉత్కంఠ నెలకొంది. ఇప్పటివరకు ఏడు పరీక్షలు రాష్ట్రంలో నూతన జోనల్ విధానం అమల్లోకి వచ్చి న తర్వాత టీఎస్పీఎస్సీ వివిధ ప్రభుత్వ శాఖల్లో 17 వేల ఉద్యోగాల భర్తీకి 26 ప్రకటనలు జారీ చేసింది. ఇందులో ఇప్పటివరకు ఏడు పరీక్షలు నిర్వహించింది. గతేడాది ఏప్రిల్ నుంచి ప్రకటనలు వెలువడుతుండగా, వాటికి సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ, పరీక్షా కేంద్రాల ఎంపిక, వాటి నిర్వహణ తదితరాలపై దృష్టి పెట్టిన టీఎస్పీఎస్సీ... వివిధ ప్రభుత్వ శాఖల్లో గ్రూప్–1 ఉద్యోగాల భర్తీకి సంబంధించి గతేడాది అక్టోబర్ 16న ప్రిలిమినరీ పరీక్షలను నిర్వహించింది. ఆ తర్వాత ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెన్టివ్ మెడిసిన్ విభాగంలో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ (ఎఫ్ఎస్ఓ) ఉద్యోగాల అర్హత పరీక్షలను గతేడాది నవంబర్ 7వ తేదీన నిర్వహించింది. రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలోని ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్, చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్ (సీడీపీఓ), అసిస్టెంట్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్(ఏసీడీపీఓ), వేర్‌హౌసింగ్ కార్పొరేషన్లో మేనేజర్ ఉద్యోగాలకు సంబంధించిన అర్హత పరీక్షను ఈ ఏడాది జనవరి మూడో తేదీన నిర్వహించగా.. ఇదే శాఖలో ఎక్స్టెన్షన్ ఆఫీసర్ (గ్రేడ్–2 సూపర్వైజర్) ఉద్యోగాల అర్హత పరీక్ష ఈ ఏడాది జనవరి 8వ తేదీన నిర్వహించారు. అలాగే ఇంజనీరింగ్ శాఖల్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉద్యోగాలకు సంబంధించిన అర్హత పరీక్ష జనవరి 22న, ఆర్థిక శాఖకు సంబంధించిన డివిజినల్ అకౌంట్స్ ఆఫీసర్ (డీఏఓ) అర్హత పరీక్ష ఫిబ్రవరి 26న, వివిధ ఇంజనీరింగ్ శాఖల్లో అసిస్టెంట్ ఇంజనీర్, మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్, టెక్నికల్ ఆఫీసర్, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించిన అర్హత పరీక్ష మార్చి 5వ తేదీన నిర్వహించారు. ఇక ఈనెల 12న జరగాల్సిన టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ పరీక్ష రద్దు కాగా, ఈనెల 15, 16 తేదీల్లో జరగాల్సిన వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పరీక్షలు కూడా రద్దయ్యాయి. గ్రూప్–1 ప్రిలిమ్స్ లీక్‌పై అనుమానాలు నూతన జోనల్ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత విడుదల చేసిన ఉద్యోగ ప్రకటనల్లో తొలుత నిర్వహించిన అర్హత పరీక్ష గ్రూప్–1 ప్రిలిమ్స్. కాగా ఈ పరీక్షకు లీక్ కేసులో నిందితుడు ప్రవీణ్‌కుమార్ కూడా హాజరై ఏకంగా 103 మార్కులు తెచ్చుకోవడంతో పేపర్ లీక్‌పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పైగా ప్రవీణ్ టీఎస్పీఎస్సీ కాన్ఫిడెన్షియల్ సెక్షన్ కంప్యూటర్ నుంచి ఓ ఫోల్డర్ మొత్తం కాపీ చేశాడని, అందులో వివిధ పరీక్షల పేపర్లు ఉన్నాయనే సమాచారం అనుమానాలకు బలం చేకూరుస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పటివరకు నిర్వహించిన ఏడు పరీక్షలు రద్దు చేయాలనే డిమాండ్ పెరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు, నిరుద్యోగులు.. టీఎస్పీఎస్సీ, రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ధర్నాలు, దీక్షలు చేపడుతున్నారు. మరోవైపు ప్రతిపక్ష పార్టీలు.. టీఎస్పీఎస్సీ చైర్మన్ రాజీనామా చేయాలని, కమిషన్ కార్యదర్శిని తక్షణమే బదిలీ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. -
పేపర్ లీక్ ఘటన.. అప్రమత్తమైన తెలంగాణ సర్కార్, ఏ బోర్డు ఎంత భద్రం!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ)లో కంప్యూటర్ల నుంచి ప్రశ్నపత్రాల తస్కరణ వ్యవహారంతో రాష్ట్ర సర్కారు అప్రమత్తమైంది. ఈ వ్యవహారం ప్రభుత్వానికి మచ్చగా మారుతుందేమోనన్న ఉద్దేశంతో ముందు జాగ్రత్తగా వాస్తవ పరిస్థితుల విశ్లేషణకు ఉపక్రమించింది. వివిధ ప్రభుత్వ శాఖల్లో 80 వేలకు పైగా ఉద్యోగ ఖాళీల భర్తీని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం.. ఆ మేరకు నియామక సంస్థలకు బాధ్యతలు అప్పగించింది. రాష్ట్రంలో నాలుగు నియామక సంస్థలున్నాయి. టీఎస్పీఎస్సీ, తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (టీఎస్ఎల్పీఆర్బీ), తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ రిక్రూట్మెంట్ బోర్డు (టీఆర్‌ఈఐఆర్‌బీ), తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు (టీఎంఎచ్‌ఎస్‌ఆర్‌బీ)ల ద్వారా ఉద్యోగ నియామకాలు కొనసాగుతున్నాయి. తాజా పరిణామాల నేపథ్యంలో వాటి పనితీరును సమీక్షించాలని, ఏ బోర్డు..ఎంత భద్రమో క్షుణ్ణంగా పరిశీలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా మంగళవారం నియామక సంస్థల చైర్మన్లు, సంబంధిత ఉన్నతాధికారులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించనుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధ్యక్షతన సమావేశం జరగనుంది. మానవ వనరులపై నిఘా...? ప్రస్తుతం చాలా ఉద్యోగ ప్రకటనలకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ పూర్తికాగా, కొన్నింటికి ప్రాథమిక పరీక్షలు నిర్వహించడంతో తదుపరి దశకు చేరుకున్నాయి. నియామక సంస్థల్లో మానవ వనరులు, సాంకేతిక పరిజ్ఞానం, గోప్యత అనేవి అత్యంత కీలకం. ఆయా అంశాల్లో ఎలాంటి పొరపాట్లు జరిగినా నియామక సంస్థల ప్రతిష్ట దెబ్బతినడంతో పాటు, ఎన్నో ఆశలతో, కఠోర దీక్షతో సన్నద్ధమైన అభ్యర్థులకు అన్యాయం జరుగుతుంది. తాజాగా టీఎస్పీఎస్సీ ఉద్యోగులే కంప్యూటర్లు హ్యాక్ చేయడంతో పాటు ప్రశ్నపత్రాన్ని బయటకు లీక్ చేశారనే అభియోగాలున్నాయి. ఈ నేపథ్యంలో మిగతా బోర్డుల్లో మానవ వనరుల పరిస్థితి, సాంకేతిక పరిజ్ఞానం తీరును సమీక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉపక్రమించింది. బోర్డుల వారీగా ఉద్యోగులు, వారి అర్హతలు, బాధ్యతలు, అధికారాలపై పూర్తిస్థాయి నివేదికలు తెప్పించుకోవాలని నిర్ణయించింది. ప్రస్తుతం టీఎస్పీఎస్సీలో శాశ్వత ప్రాతిపదికన పనిచేసే ఉద్యోగుల సంఖ్య తక్కువగా ఉండటంతో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను నియమించుకున్నట్లు తెలుస్తోంది. ఇతర బోర్డుల పరిస్థితిని కూడా సమీక్షించి, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తగిన సూచనలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు నియామక సంస్థలు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎక్కడ్నుంచి తీసుకుంటున్నాయి? బయటి నుంచి ఈ మేరకు సహకారం తీసుకుంటున్నాయనే కోణంలో ప్రభుత్వం పరిశీలించనుంది. -
షెడ్యూల్ ప్రకారమే ‘పది’ పరీక్షలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మే 9 వరకు జరుగుతాయని ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ దేవానందరెడ్డి శనివారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. కాబట్టి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళన చెందవద్దన్నారు. పబ్లిక్ పరీక్షల ప్రశ్నపత్రాలను ఫొటోలు తీసి బయటకు పంపేవారిపైన, వాటిని షేర్ చేసేవారిపైన కేసులు నమోదు చేయడంతోపాటు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రశ్నపత్రాలు వాట్సాప్‌లో లేదా ఇతర మార్గాల్లో ఎవరికైనా వస్తే పోలీసులకు లేదా అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. జిల్లా, మండల విద్యాశాఖాధికారులు కూడా ప్రశ్నపత్రాలు షేర్ చేస్తున్నవారి నంబర్లను పోలీసులకు తెలియజేయాలన్నారు. మీడియా కూడా ఇందుకు సహకరించాలని కోరారు. పరీక్ష కేంద్రంలో డ్యూటీలో ఉన్నవారు కాకుండా ఎవరైనా ప్రైవేటు వ్యక్తులు ఉంటే చీఫ్ సూపరింటెండెంట్లదే బాధ్యత అని స్పష్టం చేశారు. ఇప్పటికే తెలుగు, హిందీ, ఇంగ్లిష్ పరీక్షలు పూర్తయ్యాయన్నారు. ఇంకా మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్, బయోలాజికల్ సైన్స్, సోషల్ స్టడీస్ పరీక్షలను నిర్వహించాల్సి ఉందన్నారు. రంజాన్‌ను ఏ తేదీన జరుపుకుంటున్నప్పటికీ మిగిలిన పరీక్షల తేదీల్లో ఎలాంటి మార్పులు ఉండవన్నారు. ప్రశ్నపత్రాలను పరీక్ష కేంద్రానికి దగ్గరగా ఉన్న పోలీస్ స్టేషన్లో భద్రపరుస్తున్నామని తెలిపారు. పరీక్ష సమయానికి కేవలం గంట ముందు మాత్రమే పోలీస్ స్టేషన్ నుంచి పకడ్బందీగా పరీక్ష కేంద్రాలకు చేరుస్తున్నామని పేర్కొన్నారు. పరీక్షల చట్టం ప్రకారం కేసులు.. పరీక్ష ప్రారంభమయ్యాక కొందరు తమ స్వార్థప్రయోజనాల కోసం పరీక్ష కేంద్రాల్లో పనిచేసే ఒకరిద్దరు సిబ్బందితో కుమ్మక్కై ప్రశ్నపత్రాలను ఫోన్‌తో ఫొటో తీసి వాట్సాప్ ద్వారా పంపుతున్నారన్నారు. చీఫ్ సూపరింటెండెంట్ ఫోన్‌ను తప్ప మిగిలినవారి ఫోన్లను లోపలికి అనుమతించకూడదని నిబంధనలు ఉన్నా ఇలా చేస్తున్నారని చెప్పారు. ప్రశ్నపత్రాలను షేర్ చేసేవారిపై పరీక్షల చట్టం 25/97 ప్రకారం కేసులు నమోదు చేశామని తెలిపారు. నంద్యాల జిల్లాలో నలుగురు ఉద్యోగులను సస్పెండ్ చేయగా 12 మందిని పోలీసులు అరెస్టు చేశారన్నారు. అలాగే చిత్తూరు జిల్లాలో ఇద్దరిని సస్పెండ్ చేయడంతోపాటు ఏడుగురిని, సత్యసాయి జిల్లాలో ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులను అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. టీడీపీకి పరీక్షలపై మాట్లాడే నైతిక హక్కు లేదు: మంత్రి బొత్స పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తున్నామని విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. గత మూడు రోజులుగా జరుగుతున్న పరీక్షలపై అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉంటున్నారన్నారు. పేపర్ల లీకేజీ, కాపీయింగ్ జరగకుండా గట్టి చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. ఈ మేరకు మంత్రి బొత్స శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. అక్రమాలకు పాల్పడేందుకు ప్రయత్నించిన వారిని ఇప్పటికే అరెస్టు చేశామన్నారు. చిత్తూరులో టీడీపీ మాజీ మంత్రి నారాయణకు చెందిన విద్యా సంస్థల సిబ్బందితో సహా మాల్ ప్రాక్టీసుకు ప్రయత్నించిన ఏడుగురిని అరెస్టు చేశామని తెలిపారు. నంద్యాలలో కూడా పలువురు ఉపాధ్యాయులను అదుపులోకి తీసుకున్నామని గుర్తు చేశారు. ప్రశ్నపత్రాలు బయట మార్కెట్లో విచ్చలవిడిగా దొరుకుతున్నాయంటూ జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రశ్నపత్రాలు లీకవుతున్నాయని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు చేసిన ఆరోపణలపై స్పందిస్తూ.. పరీక్షల్లో అక్రమాలకు పాల్పడేందుకు యత్నిస్తూ దొరికిపోయిన టీడీపీ నేతకు చెందిన నారాయణ, తదితర విద్యా సంస్థల గురించి ఆయన ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. టీడీపీకి చెందినవారు అక్రమాలకు పాల్పడుతుంటే చోద్యం చూస్తూ.. ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు అచ్చెన్నాయుడుకు ఉందా? అని నిలదీశారు. -
పేపర్ లీక్ వదంతులు నమ్మొద్దు
సాక్షి, అమరావతి: పదో తరగతి పబ్లిక్ పరీక్షల ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయని వస్తున్న వదంతులను నమ్మొద్దని, భయపడొద్దని పాఠశాల విద్యా శాఖ కమిషనర్ ఎస్.సురేష్ కుమార్ సూచించారు. ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయంటూ కొన్ని వాట్సాప్ గ్రూపులు, సోషల్ మీడియా, టీవీ చానళ్లలో వస్తున్న వదంతులు అసత్యమన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రుల్లో గందరగోళం, భయాందోళనలను రేకెత్తించడానికి కొందరు ఇటువంటివి సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు గురువారం సురేష్ కుమార్ సర్క్యులర్ విడుదల చేశారు. పదో తరగతి పరీక్షలను ప్రశాంతంగా నిర్వహిస్తున్నామని.. ఇప్పటివరకు లీకేజీకి సంబంధించి ఎలాంటి కేసులు నమోదు కాలేదని తెలిపారు. పరీక్ష కేంద్రాల్లోకి ఎవరూ మొబైల్ ఫోన్లు తీసుకెళ్లకుండా నిషేధించామన్నారు. అంతేకాకుండా పరీక్షల విధులతో సంబంధం లేని ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బందిని పరీక్ష కేంద్రంలోకి అనుమతించడం లేదని చెప్పారు. వీటిలో ఏదైనా ఉల్లంఘన జరిగితే వారిపై క్రమశిక్షణా చర్యలు తప్పవన్నారు. ప్రశ్నపత్రాలను, సమాధాన పత్రాలను సురక్షితంగా భద్రపరుస్తున్నామన్నారు. ఏప్రిల్ 27న కర్నూలులో పరీక్షలు ప్రారంభమయ్యాక ప్రశ్నపత్రాన్ని సర్క్యులేట్ చేసిన ఘటనలో తక్షణమే చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఈ దుశ్చర్యకు కారణమైన వ్యక్తులను అరెస్టు చేశామన్నారు. మీడియా కూడా వదంతులను ప్రసారం చేయొద్దని విన్నవించారు. -
Abdullapurmet: పాలిటెక్నిక్ క్వశ్చన్ పేపర్స్ లీక్
-
పరీక్షకు ముందే ప్రశ్నాపత్రాలు లీక్
సాక్షి, బెంగళూరు: కర్ణాటక రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (కేఎస్‌పీఎస్సీ) పరిధిలోని ఎఫ్‌డీఏ ఉద్యోగాల పరీక్షా ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో ఇప్పటివరకు 14 మందిని బెంగళూరు సీసీబీ పోలీసులు అరెస్టు చేశారు. మొత్తం 36 పేజీల ప్రశ్నాపత్రాలను సీజ్ చేశారు. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా ఎఫ్‌డీఏ పరీక్ష జరగాల్సి ఉండగా, లీకేజీ వల్ల శనివారం రాత్రి రద్దు చేశారు. క్వశ్చన్ పేపర్లో 100 ప్రశ్నలు ఉంటాయి. మొత్తం 36 పేజీల ప్రశ్నాపత్రం లీక్ అయింది. నిందితుల వద్ద క్వశ్చన్ పేపర్ ముందు, వెనుక పేజీ మినహాయించి మిగిలిన అన్ని పేజీలు లభించాయి. జ్ఞానభారతి పోలీసు స్టేషన్ పరిధిలోని ఉల్లాళలో ఉన్న అపార్టుమెంటులో శనివారం సీసీబీ అధికారులు సోదాలు జరిపి ప్రధాన నిందితుడు చంద్రు, రాచప్ప అనే ఇద్దరిని అరెస్టు చేశారు. వీరిని విచారించగా మరో 12 మంది గురించి చెప్పగా వారినీ అరెస్టు చేశారు. రూ.35 లక్షలు, 4 కార్లు సీజ్..: మొత్తం ఈ 14 మంది నిందితుల వద్ద నుంచి రూ 35 లక్షల నగదు, నాలుగు కార్లు, వారి వద్ద ఉన్న జీకే, కన్నడ క్వశ్చన్‌పేపర్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులకు ఆ ప్రశ్నాపత్రిక ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరెవరు ఈ లీకేజీ స్కామ్‌లో ఉన్నారనే విషయంపై పోలీసులు విచారణ చేపడుతున్నట్లు సీసీబీ పోలీసు కమిషనర్ సందీప్ పాటిల్ తెలిపారు. కేపీఎస్సీ కార్యాలయంలోని ఇద్దరు సిబ్బందిపై సీసీబీకి అనుమానంగా ఉంది. అనుమానితుల మొబైల్ ఫోన్లు స్విచ్ఛాప్ అయి ఉండడంతో అనుమానం మరింత బలపడుతోంది. ఈ ఘటనపై హోం మంత్రి బసవరాజు బొమ్మాయి స్పందిస్తూ ఈ కేసును చాలా సీరియస్‌గా తీసుకున్నట్లు, ఘటన వెనుక ఎంతటివారున్నా.. ఉపేక్షించేది లేదని తెలిపారు. -
ప్రశ్న పత్రాలు బయటకొచ్చే ఛాన్సే లేదు
సాక్షి, అమరావతి : గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించిన పరీక్షలకు సంబంధించి ప్రశ్న పత్రాలు బయటకి రావడానికి అవకాశమే లేదని పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. ఈ పరీక్షలను అత్యంత పకడ్బందీగా, ప్రతిష్టాత్మకంగా నిర్వహించామని తెలిపారు. అయితే ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీయడానికి కొంతమంది చేస్తున్న లీకు అంటూ ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాల ఎంపిక కోసం పరీక్షలను పూర్తి పారదర్శకంగా నిర్వహించినట్టు శుక్రవారం ఒక ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. లీకు ఆరోపణలు వాస్తవం కాదన్నారు. పరీక్షల నిర్వహణను అన్ని మీడియాల ప్రతినిధులు కూడా ప్రశంసించిన విషయాన్ని మంత్రి పెద్దిరెడ్డి గుర్తు చేశారు. -
టెట్ పరీక్షపై స్పందించిన గంటా
సాక్షి, అమరావతి: టెట్ వ్యాయామ పరీక్షపై సామాజిక ప్రసార మాద్యమాల్లో వస్తున్న వార్తలపై మంత్రి గంటా శ్రీనివాస రావు స్పందించారు. టెట్ పరీక్ష పేపర్ లీకులపై వస్తున్న వార్తలను నమ్మకండని, అవన్నీ అవాస్తవాలని తెలిపారు. యధావిధిగా ప్రభుత్వం నిర్ణయించిన విధంగానే ఈ నెల 19వ తేదీన టెట్ వ్యాయామ ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఉంటుందని స్పష్టం చేశారు. ఆన్లైన్లో పరీక్షా పశ్నా పత్రం లీకులకు అవకాశమే లేదని గంటా పేర్కొన్నారు. అన్లైన్ సెంటర్లోనూ పరీక్షకు ముందు నిర్ణీత సమయంలో మాత్రమే ప్రశ్నాపత్రం అందుబాటులోకి వస్తుందని గుర్తుచేశారు. దీనిపై అభ్యర్థులు ఎలాంటి అపోహలకు గురికావొద్దని, ఎలాంటి లోపాలు లేకుండా పరీక్ష పటిష్టంగా నిర్వహిస్తామని తెలిపారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్లో సెక్రటరీకి డిప్యూటేషన్‌పై సహాయకుడిగా పనిచేస్తున్న వ్యాయామ ఉపాధ్యాయుడు తేళ్ల వంశీకృష్ణను సస్పెండ్ చేయాలని గంటా పాఠశాల విద్యా కమీషనర్‌కు ఆదేశాలు జారీ చేశారు. వంశీకృష్ణ అర్హత లేకపోయినా టెట్ వ్యాయమ పరీక్షకు దరఖాస్తు చేశారు. అదేవిధంగా ఏపీ ప్రభుత్వ ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా ఆయన అభ్యర్థులకు ఓ కోచింగ్ సెంటర్లో శిక్షణ ఇస్తున్నారు. ఈ క్రమంలో తమ కోచింగ్ సెంటర్లోని అభ్యర్థులను గట్టెక్కించేందుకు టెట్‌కు దరఖాస్తు చేశారు. ఈ ఆరోపణల నేపథ్యంలో వంశీకృష్ణను సస్పెండ్ చేస్తూ మంత్రి ఆదేశాలు జారీ చేశారు. -
డీలర్ల పరీక్ష ప్రశ్నాపత్రం లీక్?
కడప సెవెన్‌రోడ్స్: కడప రెవెన్యూ డివిజన్ పరిధిలోని ప్రభుత్వ చౌకదుకాణాల భర్తీ కోసం శుక్రవారం కడపలో నిర్వహించిన రాత పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రం లీక్ అయిం దంటున్న అంశం తీవ్ర కలకలం రేపుతోంది. రేషన్ షాపులను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కట్టబెట్టడం కోసం అధికారులే ఈ నిర్వాకానికి పాల్పడ్డారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా ఎఫ్ పీ షాపుల భర్తీని అడ్డుకునేందుకు కొందరు చేస్తున్న పన్నాగమే తప్ప.. ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని అధికారులు అంటున్నారు. గతంలో రాత పరీక్షకు 60, ఇంటర్వ్యూకు 40 మార్కులు ఉండేవి. రాత పరీక్షలో అంతంత మాత్రం మార్కులు వచ్చినా ఇంట ర్వ్యూలో అధిక మార్కులు వేసి తమకు కావా ల్సిన వ్యక్తులకు ఎఫ్ పీ షాపులు కట్టబెడుతున్నారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈ సారి రాత పరీక్షలకు 80, ఇంటర్వ్యూకు 20 మార్కులు కేటాయించారు. ఇందువల్ల నిజమైన ప్రతిభావంతులకే ఎఫ్పీ షాపులు వస్తాయని భావించారు. కాగా ఈసారి ఏకంగా ప్రశ్నాపత్రాన్నే లీక్ చేసి అస్మదీయులకు షాపులు కట్టబెడుతున్నారనే ఆరోపణలు వచ్చాయి. కడప రెవెన్యూ డివిజన్లో 275 ఎఫ్పీ షాపుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారు. కాగా 49 షాపులకు దరఖాస్తులే రాలేదు. ఇక రాత పరీక్ష కోసం 864 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, 725 మంది హాజరయ్యారు. రాత పరీక్షల్లో ఎంపికైన అభ్యర్థులకు జీఓ ఎంఎస్ నంబర్: 4 ప్రకారం 1:5 నిష్పత్తిలో సోమవారం ఆర్డీఓ కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రశ్నాపత్రం లీకైంýదంటూ ఆరోపణలు రావడం కలకలం రేపుతోంది. పరీక్షలను రద్దు చేయాలి: టీడీపీ నేతల డిమాండ్ చౌక దుకాణాల భర్తీకోసం శుక్రవారం నిర్వహించిన రాత పరీక్షలను రద్దు చేయాలని తెలుగుదేశం పార్టీ నాయకులు వీణా అజయ్‌కుమార్, కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ విశ్వనాథరెడ్డి డిమాండ్ చేశారు. శనివారం సాయంత్రం స్థానిక బాలాజీ కాంప్లెక్స్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. రాత పరీక్షలకు ముందుగానే పేపర్ లీక్ అయిందని ఆరోపించారు. అందులో భాగంగా శుక్రవారం జరిగిన పరీక్షల్లో అభ్యర్థులకు ప్రశ్నాపత్రంలోనే జవాబులను టైప్ చేసి పంపించడం జరిగిందన్నారు. పరీక్ష ప్రారంభమైన అరగంటకే ప్రశ్నాపత్రం బయటికి రావడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. ఈ పరీక్షలను రద్దు చేసి అదే అభ్యర్థులకు మళ్లీ పరీక్షలు నిర్వహించాలని కోరారు. ప్రశ్నాపత్రం లీకేజీకి కారకులైన అధికారులపై కఠిన చర్యలు చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో జనార్దన్, బ్రహ్మ, శ్రీను పాల్గొన్నారు. ప్రశ్నాపత్రం కాదు.. కీ: ఆర్డీఓ ఈ అంశంపై ఆర్డీఓ దేవేందర్‌రెడ్డిని వివరణ కోరగా.. అది ప్రశ్నాపత్రం కాదని.. కీ అని తెలిపారు. కొన్నేళ్లుగా ఖాళీగా ఉన్న ఎఫ్పీ షాపుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన ప్రతిసారి కొందరు వ్యక్తులు ఏదో ఒక విధంగా అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆయన చెప్పారు. ఈసారి కూడా హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చారని పేర్కొన్నారు. అయితే తాము కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయడంతో.. కోర్టు తమకు అనుకూలంగా తీర్పు వెలువరించిందన్నారు. దీంతో షాపుల భర్తీ ప్రక్రియకు లైన్ క్లియర్ కావడంతో కొందరు జీర్ణించుకోలేక పోయారన్నారు. ప్రశ్నాపత్రాన్ని పౌరసరఫరాల అధికారులు రూపొందించి తొమ్మిది సీల్డ్ కవర్లలో పరీక్షకు అరగంట ముందు తమకు పంపారని తెలిపారు. అందరి సమక్షంలో తొమ్మిది సీల్డ్ కవర్లను తెరిచి ప్రశ్నాపత్రాలను అభ్యర్థులకు పంపిణీ చేశామన్నారు. అన్నీ పారదర్శకంగా ఉండేందుకు వీడియో కూడా తీయించామన్నారు. ఈ విషయంలో అవకతవకలు జరిగే అవకాశమే లేదని స్పష్టం చేశారు. అర్హులైన అభ్యర్థులకు సోమవారం ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నామని ఆయన వివరించారు. -
డిగ్రీ ప్రశ్నాపత్రం లీక్
కోవెలకుంట్ల: కోవెలకుంట్లలో మంగళవారం డిగ్రీ పరీక్షల ప్రశ్నాపత్రం లీకైంది. అక్టోబర్ 24వ తేదీ నుంచి డి గ్రీ మూడవ సెమిస్టర్ పరీక్షలు మొదలయ్యాయి. పట్టణంలో మూడు కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. మంగళవారం ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు కమ్యూనికేషన్ స్కిల్స్‌అండ్ సాఫ్ట్‌స్కిల్స్ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు సంబంధించి ప్రశ్నా పత్రం ముందుగానే లీకైంది. దీంతో కొందరు విద్యార్థులు జవాబులను చేతిలో రాసుకుని స్థానిక వెంకటేశ్వర డిగ్రీ కళాశాల పరీక్షా కేంద్రానికి హాజరయ్యారు. అబ్జర్వర్ నాగేంద్ర గమనించి పరీక్ష రాస్తున్న ఇద్దరు విద్యార్థులను డీబార్ చేశారు. పరీక్ష కేంద్ర పరిసరాల్లో ప్రశ్నలకు సంబంధించిన జవాబుల పత్రం సైతం లభ్యమైంది. దీంతో సీఎస్ఎస్ పేపర్ లీకైనట్లు భావించి రాయలసీమ యూనివర్సిటీ అధికారులకు సమాచారం అందించారు. పట్టుబడిన విద్యార్థుల నుంచి రాతపూర్వక స్టేట్మెంట్ రికార్డు చేశారు. ఈ సందర్భంగా అబ్జర్వర్ మాట్లాడుతూ విద్యార్థుల చేతిలో సీఎస్ఎస్ పరీక్షకు సంబంధించి జవాబులు ఉండటంతో ఆ విద్యార్థుల నుంచి సేకరించిన ఆధారాలను యూనివర్సిటీ అధికారులకు చేరవేశామన్నారు. ప్రశ్నాపత్రం ఎక్కడ లీకైందన్న విషయం విచారణలో తేలాల్సి ఉంది. -
ఇంటర్ పేపర్ లీక్..భారత్‌పైన ఆరోపణలు
కరాచీ: పాకిస్థాన్‌లో ఏ సంఘటన జరిగినా భారత్ వైపే వేలెత్తి చూపటం పరిపాటిగా మారింది. ఇందుకు తాజాగా మరో ఉదంతం వచ్చి చేరింది. సింధ్ ప్రావిన్సులో ప్రస్తుతం జరుగుతున్న ఇంటర్ పరీక్షల్లో ప్రశ్నాపత్రం లీకయింది. అయితే, ఇందుకు పాక్ అధికారులు ఇండియాను తప్పుపడుతున్నారు. ఇండియన్ సిమ్ కార్డుల ద్వారానే ఇంటర్ పరీక్ష ప్రశ్నలు సోషల్ మీడియాలో వచ్చాయని ఆరోపిస్తున్నారు. ఫిజిక్స్ ప్రశ్నపత్రం పరీక్ష ప్రారంభానికి నలబై నిమిషాల ముందే సోషల్ మీడియాలో అందరికీ చేరిపోయింది. ఇందుకు కారణం ఇండియన్ ఫోన్ సిమ్ కార్డులే కారణమని సింధ్ ప్రావిన్సు విద్యాశాఖ మంత్రి జామ్ మెహ్తాబ్ దేహార్ తేల్చారు. దీనిపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించామన్నారు. భారత్‌తో ప్రస్తుతం సంబంధాలు దిగజారిన నేపథ్యంలో ఇటువంటి సంఘటన జరగటంపై ఆందోళన వ్యక్తం చేశారు. రెండు దేశాల సరిహద్దుల్లోని థార్పర్కార్ జిల్లాలో ఇండియా సిమ్ కార్డులను ఉపయోగిస్తుంటారని అక్కడి అధికారులే ఒప్పుకుంటున్నారు. దీనిపై దర్యాప్తులేవీ అక్కర్లేదని చెబుతున్నారు. ఇలా ఉండగా ఇప్పటి వరకు ఇక్కడ ఇంటర్‌కు సంబంధించి ఐదు సబ్జెక్టుల ప్రశ్నాపత్రాలు వాట్సాప్‌లో లీకయ్యాయని తెలుస్తోంది. సింధ్ ప్రావిన్సులో పరీక్షల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బహిరంగంగానే కాపీయింగ్ జరుగుతోందని ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై ఇటీవల మీడియాలోనూ పలు కథనాలు వచ్చాయి. -
లక్ష ఇస్తే చాలు లీకేజీకి రెడీ
- ఇదీ ఎంసెట్ కేసులో ప్రధాన నిందితుడి వ్యవహారం - ఇప్పటికి పది ఎంట్రన్స్ పరీక్ష పత్రాలు లీక్ చేశాడు: సీఐడీ అదనపు డీజీపీ సాక్షి, హైదరాబాద్: రూ.లక్ష ఇస్తే చాలు ఏ రాష్ట్రంలోని ఎంతటి ప్రతిష్టాత్మకమైన ప్రవేశపరీక్ష ప్రశ్నపత్రాన్ని అయినా అతను లీక్ చేసేస్తాడు. ఇలా ఇప్పటికి వివిధ రాష్ట్రాలకు చెందిన పది ప్రవేశ పరీక్షల ప్రశ్నపత్రాలను శివబహదూర్సింగ్ అలియాస్ ఎస్బీసింగ్ లీక్ చేసినట్టు సీఐడీ విచారణలో తేలింది. ఎంసెట్ ప్రశ్నపత్రం కేసులో కీలక నిందితుడిగా ఉన్న ఎస్బీసింగ్ విచారణలో పలు ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి. లీకేజీ కుట్ర మొత్తం మృతిచెందిన కమలేశ్కుమార్దని, అతడి ఆదేశాల మేరకే తాను ప్రింటింగ్ ప్రెస్‌లో పనిచేసే రావత్నుంచి రూ.లక్ష ఇచ్చి రెండు సెట్ల పత్రాలను బయటకు తెచ్చానని సీఐడీ విచారణలో ఎస్బీసింగ్ ఒప్పుకున్నట్టు ఆ వర్గాలు తెలిపాయి. అయితే కమలేశ్‌కుమార్ డీల్ ప్రకారం ప్రశ్నపత్రాలు తెస్తే తనకు కూడా రూ.లక్ష ఇచ్చాడని అంత వరకే తన పాత్ర ఉందని చెప్పినట్టు తెలిసింది. పన్నెండేళ్లుగా ఇదే వృత్తి... ప్రశ్నపత్రాలు లీక్ చేయడంలో ఎస్బీసింగ్ సిద్ధహస్తుడని, 2005 నుంచి ఇదే వృత్తిలో ఉన్నాడని సీఐడీ అదనపు డీజీపీ గోవింద్‌సింగ్ బుధవారం పత్రికా ప్రకటనలో తెలిపారు. ఉత్తర్‌ప్రదేశ్ జాన్పూర్ జిల్లా మొజ్రా గ్రామానికి చెందిన ఎస్బీసింగ్, అతడికి సహకరించిన మరో వ్యక్తి అనూప్‌కుమార్ సింగ్‌ను అరెస్ట్ చేసినట్టు ఆయన వెల్లడించారు. ఎంసెట్ ప్రశ్నపత్రం కేసులో ఎస్బీసింగ్ ప్రధాన నిందితుడని పేర్కొన్నారు. అన్ని రాష్ట్రాల పరీక్షల్లోనూ... ఉత్తర్‌ప్రదేశ్‌లో రైల్వే గ్రూప్–డీ ప్రశ్నపత్రాలు, అలహాబాద్ రైల్వే డ్రైవర్ల ప్రశ్నపత్రం, పంజాబ్‌లో టెట్ ఎగ్జామ్, జమ్మూకశ్మీర్‌లో ఉపాధ్యాయ పరీక్షలు, కోల్ ఇండియా, వర్దాన్ మెడికల్ కాలేజ్ ప్రవేశ పరీక్ష, చండీఘర్ టీచర్ ఎగ్జామినేషన్, కల్కత్తా టెట్ ఎగ్జామ్, డీఎంఆర్సీ పరీక్ష ప్రశ్నపత్రం, చివరగా ఎంసెట్ ప్రశ్నపత్రం లీక్.. ఇవన్నీ ఎస్బీసింగ్ చేసినట్టు తమ విచారణలో ఒప్పుకున్నాడని సీఐడీ తెలిపింది. -
8, 9 తరగతుల సమ్మేటివ్–3 ప్రశ్నపత్రాల లీక్
అనంతపురం ఎడ్యుకేషన్ : జిల్లాలో వార్షిక పరీక్షల ప్రశ్నపత్రాల లీక్ విద్యాశాఖకు ముచ్చెమటలు పట్టిస్తోంది. ఇప్పటికే మడకశిరలో పదో తరగతి తెలుగు పేపర్–1 ప్రశ్నపత్రం లీక్ కావడం, కదిరిలో నారాయణ పాఠశాలలో హిందీ పరీక్ష జవాబులు సిద్ధం చేస్తూ మీడియాకు అడ్డంగా దొరికిపోయారు. ఈ రెండు ఘటనలపై అధికారులు విచారణకు ఆదేశించారు. ఈ ఘటనల నుంచి నుంచి ఇంకా తేరుకోకనే 8,9 తరగతుల సమ్మెటివ్–3 (వార్షిక) పరీక్షల ప్రశ్నపత్రాలు లీక్ వ్యహారం బయట పడింది. సమ్మెటివ్–3 పరీక్షల్లోనూ ప్రశ్నపత్రాలు రెండు రోజుల ముందే విద్యార్థుల చేతుల్లో కనిపిస్తున్నాయి. స్వయంగా విద్యాశాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్ (ఆర్జేడీ) ప్రతాప్‌రెడ్డి జిల్లాలో మకాం వేసి పరీక్షల నిర్వహణను పరిశీలిస్తున్న సమయంలో ఇలా ప్రశ్నపత్రాల వ్యవహారం వెలుగుచూడటం చర్చనీయాంశమైంది. రహస్యం లేని పరీక్షలు తొలిసారి నిరంతర సమగ్ర మూల్యాంకం (సీసీఈ) విధానం అమలవుతుండటంతో అటు విద్యార్థులతో పాటు ఇటు ఉపాధ్యాయుల్లోనూ ఆందోళన నెలకొంది. ఈ పరిస్థితుల్లో ప్రశ్నపత్రాలు ఇలా బహిరంగంగా దొరుకుతుండడంతో ఆయా యాజమాన్యాలు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు తలలు పట్టుకుంటున్నారు. విద్యాశాఖ ఉదాసీనతో వ్యవహరించడం వల్లే ప్రశ్నపత్రాలు లీకులు జరుగుతున్నాయనీ, ఒకరిద్దరిపై గట్టి చర్యలు తీసుకుంటే అందరికీ భయం ఉంటుందంటున్నారు. -
ఉరుకులు..పరుగులు!
సాక్షి ఎఫెక్ట్ – ప్రశ్నపత్రాల లీకేజీపై విస్త్రత తనిఖీలు చేసిన అధికారులు అనంతపురం ఎడ్యుకేషన్ : పదో తరగతి ప్రీ ఫైనల్ పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం వెనుక ఉన్న సూత్రదారులను గుర్తించేందుకు విద్యాశాఖ అధికారులు లోతుగా విచారిస్తున్నారు. గురువారం ‘సాక్షి’లో ప్రచురితమైన ‘ప్రశ్నపత్రాల లీకేజీ’ కథనం విద్యాశాఖలో కలకలం రేపింది. అధికారులను ఉరుకులు..పరుగులు పెట్టించింది. జిల్లా విద్యాశాఖ అధికారి పగడాల లక్ష్మీనారాయణ తీవ్రంగా స్పందించారు. ఆయనతో పాటు డెప్యూటీ డీఈఓలను విచారణకు ఆదేశించారు. బృందాలుగా విడిపోయి పలు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలను తనిఖీలు చేశారు. ప్రశ్నపత్రాలు బండిళ్లను పరిశీలించారు. డీఈఓ పాతూరు నంబర్–1 ఉన్నత పాఠశాలను పరిశీలించారు. ప్రశ్నపత్రాల బండిళ్లను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ లీకేజీ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్నామన్నారు. ప్రత్యేక బృందాలతోనూ విచారణ చేయిస్తామన్నారు. ప్రశ్నపత్రాలు ఎలా వెళ్లాయి? ఎవరి హస్తం ఉందనే దానిని త్వరలో బయట పెడతామన్నారు. అసలు దోషులను గుర్తించి కఠినచర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. -
విచారణ గాలికి..
– అంగడిలో ప్రశ్నపత్రాలు – రోడ్లపై విద్యార్థుల చక్కర్లు – అడ్డదారి తొక్కుతున్న యాజమాన్యం – రిజిస్టర్లు పాటించని ప్రైవేట్ పాఠశాలలు హిందూపురం అర్బన్ : సమ్మెటివ్ అసెస్మెంట్–1 పరీక్షలు విద్యావిధానాన్నే అపహస్యంగా చేసేలా నిర్వహించారు. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలల్లో 6వ నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు రాష్ట్ర వ్యాప్తంగా తొలిసారిగా జరిగిన ఉమ్మడి పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రాలు ముందుగానే జిరాక్స్ కేంద్రాల్లో ప్రత్యక్షమయ్యాయి. ‘ప్రశ్నపత్రాలు అమ్మబడును’ శీర్షికతో 28వ తేదీన సాక్షి దినపత్రికలో ప్రచురితమైంది. తర్వాత 29న తిరిగి ఇంగ్లిష్ పేపర్ లీక్ అయింది. దీనికి స్పందించిన డీఈఓ డివిజన్ విద్యాధికారులచే అన్ని పాఠశాలల్లో తనిఖీలు నిర్వహించారు. హెచ్చరికలకే పరిమితం ప్రశ్నపత్రాలు పరీక్షల కంటే ముందుగా బహిర్గతమైనా అధికారులు తాపీగా పరీక్షలు కొనసాగించారు. బయటకు వచ్చిన ప్రశ్నపత్రాలు ఏ పాఠశాల నుంచి వచ్చాయని అంతు తేల్చాల్సిన అధికారులు హెచ్చరికలకే పరిమితమయ్యాయి. పరీక్షలకు హాజరైన విద్యార్థుల సంఖ్య, మిగిలిపోయిన ప్రశ్నపత్రాల వివరాలు రిజిస్టరులో నమోదు చేయాల్సి ఉన్నా అధికారులు అవేవీ పట్టించుకోలేదు. విద్యార్థుల్లోని నిజమైన ప్రతిభను వెలికి Sతీసేందుకు కషి చేస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. కానీ పరీక్షలు నిర్వహించడంలో నిబంధనలన్నీ గాలికొదిలేసింది. చదువులు మానేసి రోడ్లపైకి.. సమ్మేటివ్ అసెస్మెంట్ పరీక్షలు జరిగిన వారం రోజుల పాటు సాయంత్రం పూట విద్యార్థులు ఒక్కటే హడావుడి చేస్తున్నారు. ఫలానా చోట విద్యార్థికి ప్రశ్నపత్రం అందిందని తెలిసిన వెంటనే పరుగులు పెడుతున్నారు. ప్రశ్నపత్రాలను జిరాక్స్ చేసుకుని అందరూ పంచుకుంటున్నారు. ప్రైవేట్ పాఠశాలలకు మార్కుల కోసం నల్లబోర్డులపై రాతలు రాసి.. పుస్తకాల్లో గుర్తులు పెట్టి మరీ పరీక్షలు రాయించారు.