questions to government
-
ఊరేగింపుగా ఎందుకు తీసుకెళ్లారు ?
న్యూఢిల్లీ: గ్యాంగ్‌స్టర్ అతీక్ అహ్మద్, అతని సోదరుడు అష్రాఫ్ కస్టడీలో ఉండగా పోలీసుల కళ్లెదుటే హత్యకు గురైన ఘటనపై సుప్రీంకోర్టు శుక్రవారం ప్రశ్నల వర్షం కురిపించింది. దీనిపై దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా పోలీసులు, యూపీ సర్కారుకు పలు ప్రశ్నలు సంధించింది. ‘ అతీక్‌ను ఆస్పత్రికి తీసుకొస్తారని నిందితులకు ముందే ఎలా తెలుసు ? మేం కూడా టీవీలో చూశాం. ఆస్పత్రి గేటు నుంచి వారిని లోపలికి అంబులెన్స్‌లో ఎందుకు తీసుకెళ్లలేదు. మీడియా సమక్షంలో వారిని ఎందుకు ఊరేగింపుగా నడిపిస్తూ తీసుకెళ్లారు?. అతీక్ పోలీసు కస్టడీలో ఉండగా మీడియా చూస్తుండగా షూటర్లు హత్యకు ఎలా తెగించగలిగారు?’ అని యూపీ సర్కార్ తరఫున హాజరైన సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహత్గీని జస్టిస్ ఎస్.రవీంద్ర భట్, జస్టిస్ దీపాంకర్ దత్తాల ధర్మాసనం ప్రశ్నించింది. దర్యాప్తు పురోగతిపై నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. విద్వేష ప్రసంగాలపై కేసులు నమోదుచేయండి న్యూఢిల్లీ: దేశంలో మత సామరస్యానికి తీవ్ర భంగం వాటిల్లేలా విద్వేష ప్రసంగాలు చేసే వారిపై సుమోటో కేసులు నమోదుచేయాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలను సుప్రీంకోర్టు శుక్రవారం ఆదేశించింది. లేదంటే కోర్టు ధిక్కార చర్య తప్పదని డీజీపీలను హెచ్చరించింది. -
పిల్లలు.. పిడుగుల్లాంటి ప్రశ్నలు
కంటోన్మెంట్: పిల్లలే కానీ, పిడుగుల్లాంటి ప్రశ్నలు సంధించారు! తమ తరఫున పార్లమెంట్లో ప్రస్తావించిన ప్రశ్నలేంటో సూటిగా స్పష్టంగా వెల్లడించారు. విద్యార్థులుగా వారు ప్రత్యక్షంగా ఎదుర్కొనే సమస్యలతో పాటు, ప్రభుత్వ విధానాలతో తమ తల్లిదండ్రులు ఎదుర్కొంటున్న సమస్యల్నే ప్రధానంగా ప్రస్తావించారు. ‘‘మీ ప్రశ్న నేను అడుగుతా’’ పేరిట మల్కాజ్గిరి ఎంపీ మల్లారెడ్డి చేపట్టిన వినూత్న కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ‘‘మంచి ప్రశ్న అడగండి పార్లమెంట్ సందర్శనకు నాతో రండి’’ అంటూ మల్లారెడ్డి తన నియోజకవర్గ పరిధిలోని విద్యార్థులకు ప్రత్యేక ఆఫర్ ప్రకటించారు. ఈ మేరకు ఉత్తమ ప్రశ్నలు అడిగిన నలుగురు విద్యార్థులను వారి తల్లిదండ్రులతో సహా తన సొంత ఖర్చులతో పార్లమెంట్‌కు తీసుకెళ్తానని గతంలో ప్రకటించారు. తాజాగా ఈ కార్యక్రమానికి వచ్చిన స్పందనను చూసి ఏకంగా 37 మంది విద్యార్థులను వారి తల్లిదండ్రులతో సహా పార్లమెంట్ సందర్శనకు తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఇప్పటి వరకూ 36వేల మంది విద్యార్థులు స్పందించారని, వీరిలో సందర్భానుచితంగా, ఉత్తమంగా ప్రశ్నలు సంధించిన 37 మందిని ఎంపిక చేసినట్లు తెలిపారు. ప్రస్తుత శీతాకాల సమావేశాలు ముగిసేలోపు, జనవరి మొదటి వారంలో తొలివిడతలో కనీసం 20 మంది విద్యార్థులతో కూడిన బృందాన్ని ఢిల్లీకి తీసుకెళ్లడంతో పాటు, వారు సూచించిన ప్రశ్నల్ని పార్లమెంట్లో ప్రస్తావిస్తానని వెల్లడించారు. ఈ మేరకు ఆదివారం బోయిన్‌పల్లిలోని తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. 337 ప్రశ్నలడిగా... తాను ఎంపీగా ఎన్నికైన మూడున్నరేళ్ల కాలంలో ఇప్పటివరకు పార్లమెంట్లో 337 ప్రశ్నలు అడిగినట్లు ఎంపీ మల్లారెడ్డి వెల్లడించారు. వాటిలో మెజారిటీ సమస్యలు మల్కాజ్గిరి పార్లమెంటు స్థానం పరిధిలోని క్షేత్రస్థాయి సమస్యలే ఉన్నాయని తెలిపారు. తన పార్లమెంట్ సమావేశాల హాజరు 81 శాతం (రాష్ట్ర సగటు కంటే 11 శాతం అధికం) ఉందన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం తన ఎంపీ లాడ్స్ నుంచి రూ.23 కోట్లు వెచ్చించానని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కలుపుకుని పోతూ మల్కాజ్‌గిరిలో వేలాది కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. ప్రశ్నలు/ సూచనలివే... ‘మీ ప్రశ్న నేను అడుగుతా’ కార్యక్రమంలో భాగంగా 37 మంది విద్యార్థులు పంపిన ప్రశ్నలను ఎంపిక చేశారు. వీటిలో కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు ⇔ బడిపిల్లలు పుస్తకాల బ్యాగు భారం అధికమవుతోంది, ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం తీసుకోబోయే కఠిన నిర్ణయాలేంటి? ⇔ దేశంలో ఒకటే పన్ను విధానంలో భాగంగా జీఎస్టీ మాదిరిగానే ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలన్నింటిని ఒకేతాటిపైకి తీసుకురావాలి. ఫిన్లాండ్ తరహా విద్యావిధానం ప్రవేశపెట్టేలా చూడాలి. ⇔ పాఠశాలల్లో క్రీడల ప్రాధాన్యం పెంచాలి, లైబ్రరీలను ఆధునీకరించేలా చూడండి. ⇔ నానాటికీ పెరుగుతున్న ధరల నియంత్రణకు చేపట్టేల చర్యలేవీ? ⇔ ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఆలోచనల్ని ప్రజలకు చేరువ చేయడానికి స్థానికంగా ప్రతి వార్డు కార్యాలయంలో అధికారిని అందుబాటులో ఉంచేలా చూడాలి ⇔ వస్తుసేవా పన్ను, జీఎస్టీని ఆసరా చేసుకుని కొందరు దుకాణదారులు సాధారణ ధరల కంటే ఎక్కువ వసూలు చేస్తున్నారు, వీరినెలా కట్టడి చేస్తారు? ⇔ పెట్రోల్, డీజిల్‌పై కేంద్ర, రాష్ట్ర పన్నుల శాతం అధికంగా ఉంది, దీన్ని జీఎస్టీ పరిధిలోకి తీసుకురావచ్చు కదా? ⇔ అగ్రవర్ణాల్లో నిరుపేదలకు రిజర్వేషన్లు కల్పించే అవకాశముందా? ⇔ ఆధార్– ఓటర్‌కార్డు అనుసంధానం చేసి, బోగస్ ఓట్లను ఎందుకు తొలగించడం లేదు? విద్య, వైద్య ఖర్చులకు ఆధార్‌ను అనుసంధానిచాలి. -
ఈ ప్రశ్నలకు బదులేది?
ఎవరెన్ని ఆటంకాలు కలిగించినా.. ఎవరు అడ్డుకోవాలని చూసినా.. పట్టిసీమ ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తిచేసి తీరుతామని ఏపీ అసెంబ్లీలో సీఎం చంద్రబాబు నాయుడు గొంతు పెద్దది చేసి మరీ చెప్పారు. కానీ అందులో ఏమాత్రం చిత్తశుద్ధి లేకుండా గుడ్డిగా ముందుకెళ్తూ.. విపక్షం నిర్మాణాత్మకంగా చెబుతున్న అభ్యంతరాలనూ తోసిపుచ్చుతున్నారు. మరి ప్రభుత్వ పెద్దలు ఈ ప్రశ్నలకు ఏం సమాధానం ఇస్తారో చెప్పాలి. పట్టిసీమ ప్రాజెక్టులో కాంట్రాక్టర్లను పరిమితం చేయడానికి కావాలని నిబంధనలు తయారుచేయలేదా? ప్రాజెక్టు పని ఏడాదిలోనే పూర్తిచేయాలని టెండర్ డాక్యుమెంట్లలో స్పష్టంగా ఉంది. కానీ బోనస్ అంశం మీద మాత్రం ఏమీ చెప్పలేదు. టెండరు డాక్యుమెంట్ ప్రకారం ఏడాదిలోపే పని పూర్తిచేయాలన్నప్పుడు అందులో లేని బోనస్ ప్రకటించాల్సిన అవసరం ఏముంది? టెండర్లను కేవలం 5 శాతం ఎక్సెస్ వరకు మాత్రమే అనుమతిస్తారు. కానీ 21.9 శాతం ఎక్సెస్‌కు కాంట్రాక్టర్లు కోట్ చేశారు. దాంతో మిగిలిన 16.9 శాతం మొత్తాన్ని టెండరు బోనస్ రూపంలో కాంట్రాక్టరుకు కట్టబెడుతున్నారు. ఇదంతా పెద్ద స్కాం. పట్టిసీమ ప్రాజెక్టునుంచి ఎత్తిపోసే నీటిని ఎక్కడ నిల్వచేస్తారు? ప్రకాశం బ్యారేజి సామర్థ్యం 3 టీఎంసీలు మాత్రమే. అప్పుడు పట్టిసీమ నుంచి లిఫ్ట్ చేసే 80 టీఎంసీల నీటిని ఎక్కడ నిల్వచేస్తారు? నిల్వ సమస్య పరిష్కారం కోసమే అసలు పోలవరం ప్రాజెక్టును ఉద్దేశించారు కదా? గోదావరి నదీ జలాల వివాదం ట్రిబ్యునల్‌లోని రెండో అధ్యాయంలో పోలవరం ప్రాజెక్టు కింద ఈ అంశాలున్నాయి... క్లాజ్ 7ఇ: పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర జలసంఘం అనుమతి క్లియర్ చేసిన రోజు నుంచి మహారాష్ట్ర, కర్ణాటకలు 35 టీఎంసీల నీటిని ఉపయోగించుకునే స్వేచ్ఛ ఉంటుంది. అందులో వాస్తవంగా ఎంత నీటిని మళ్లిస్తున్నారనే అంశంతో సంబంధం లేదు. క్లాజ్ 7ఎఫ్: ప్రతిపాదిత పోలవరం ప్రాజెక్టు నుంచి గోదావరి జలాలను కృష్ణానదిలోకి మళ్లించడం వల్ల ఆ మొత్తం 80 టీఎంసీలు దాటితే, ఆ దాటిన మొత్తాన్ని కూడా మూడు రాష్ట్రాలు ఒకే నిష్పత్తిలో పంచుకోవాలి అందువల్ల, పట్టిసీమ ప్రాజెక్టు కారణంగా మనం మహారాష్ట్ర, కర్ణాటకలకు మరింత ఎక్కువ నీరు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. రాయలసీమకు నీరు ఇస్తామని ప్రభుత్వం చెబుతోంది. కానీ మరి దాన్ని జీవోలో ఎందుకు ప్రస్తావించలేదు? ఒకవేళ ప్రభుత్వం రాయలసీమకు నీరు ఇవ్వాలనుకున్నా.. పోతిరెడ్డిపాడు దిగువన రిజర్వాయర్లు, కెనాల్ వ్యవస్థ పూర్తి చేయకుండా ఎలా ఇస్తారు? పోతిరెడ్డిపాడును పూర్తిచేయడానికి రూ. 2600 కోట్లు అవసరం అవుతాయి. మీ బడ్జెట్ కేటాయింపులు మాత్రం కేవలం రూ. 169 కోట్లే. మరో రూ. 1100 కోట్లు అవసరం అవుతాయి. ఇక హంద్రీ-నీవా ప్రాజెక్టుకు మీరు కేవలం రూ. 200 కోట్లే కేటాయించారు. మరి అలాంటప్పుడు రాయలసీమకు మీరు ఎలా నీళ్లు ఎలా ఇవ్వగలరు? ప్రజలను మోసగించడానికి మరో రుణమాఫీ పథకంలాగే దీన్నీ తయారుచేస్తారా?