quli qutub shah
-
సిటీ@431 ఏళ్లు.. హైదరాబాద్‌లో తొలి కట్టడం ఏంటో తెలుసా!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ ఒకనాడు కుగ్రామం.. నేడు మహానగరం. 1591 అక్టోబర్ 9న పునాదిరాయి పడ్డ ఈ గడ్డ ఇప్పుడు విశ్వనగరంగా రూపాంతరం చెందింది. ‘హే దేవుడా..! చేపలతో సరస్సును నింపినట్టుగా, నా నగరాన్ని ప్రజలతో నింపు’.. అని ప్రార్థించిన నగర నిర్మాత మహ్మద్ కులీ కుతుబ్‌షా కలలు దాదాపుగా ఫలించాయి. కోటి మందికిపైగా ఉన్న మహానగరంగా ఖ్యాతికెక్కింది. చదువు పూర్తి చేసిన యువత.. ఉద్యోగ అన్వేషణలో వచ్చిన నిరుద్యోగి.. పొట్టచేత పట్టుకొని ఎవరొచ్చినా ప్రేమతో అక్కున చేర్చుకునే భాగ్యనగరిగా వర్ధిల్లుతోంది. సామాన్యులకు అనువైన నగరంగా విరాజిల్లుతోంది. శాస్త్ర, సాంకేతిక, వైజ్ఞానిక రంగాలకు ఆలవాలంగా నిలుస్తోంది. మూసీ, ఈసీ తెహజీబ్‌గా భిన్నసంస్కృతుల సమ్మిళితంగా ప్రసిద్ధికెక్కింది. మినీ భారత్‌గా పేరు పొందింది. ఒకసారి ఈ నేలపై అడుగుపెట్టిన వారెవరైనా, హైదరాబాద్‌పై మనసు పారేసుకోకుండా ఉండలేరనేది నిర్వివాదాంశం. 1591 వరకు చంచలం (చిన్న గ్రామం)గా ఉన్న ఈ ఊరు మహ్మద్ కులీ కుతుబ్‌షా ఆలోచనలు.. ఇరానీ ఆర్కిటెక్ట్ మీర్ మోమిన్ సృజన కారణంగా హైదరాబాద్‌గా అవతరించింది. తొలి కట్టడం పురానాపూల్.. హైదరాబాద్ నగరంగా ఆవిర్భవించకముందే, ఈ నేలపై నిర్మితమైన తొలి కట్టడం పురానాపూల్ వంతెన. ఇది 1578లో దీన్ని నిర్మించారు. దక్షిణ భారతంలో తొలి వారధి కూడా ఇదే. భాగ్యనగర నిర్మాణం మాత్రం చార్మినార్ స్మారక చిహ్నంతో ప్రారంభమైందని.. మహ్మద్ కులీ చేతుల మీదుగా 1591 అక్టోబర్ 9న పునాది పడిందనడానికి కొన్ని చారిత్రక ఆధారాలున్నాయని దక్కన్ హెరిటెజ్ నిర్వాహకుడు సఫీవుల్లా చెప్పారు. అందుకు ఆనాటి ఒక ఫర్మానాలో పొందుపరిచిన విషయాలే రుజువులని ఆయన గుర్తు చేశారు. ఇస్లామియా హిజ్రీ కేలండర్ వెయ్యి ఏళ్లు పూర్తయిన వేళ ఖగోళ శాస్త్ర నిపుణులు అక్టోబరు తొమ్మిదిగా నగర అవతరణను లెక్కించినట్లు ఆయన చెబుతున్నారు. ఈ తేదీపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్న చరిత్ర అధ్యయనకారులూ లేకపోలేదు. నయా పోకడలతో వర్షాకాలంలో పాత నీరు పోయి కొత్త నీరు వచ్చి చేరినట్లు.. విశ్వస్థాయికి ఎదుగుతున్న భాగ్యనగరంలో పాతవి కనుమరుగవుతూ.. నయా పోకడలు, కొత్త పంథాలు జోష్ నింపుతున్నాయి. ఏళ్ల తరబడి అలవాటుగా మారిన కొన్ని సంస్కృతులకు దూరం కావాల్సి రావడం బాధనిపించినా.. అనివార్యంగా కొత్తవాటి వైపు మారక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయి. నాటి సంస్కృతిని ప్రతిబింబించేలా నిర్మించిన పురాతన కట్టడాలు.. శిథిలం పేరుతో నేలకూల్చక తప్పడం లేదు.హైదరాబాద్ అంటే ఒకప్పుడు మూసీ అవతల కేంద్రంగా పాతబస్తీ ఉండేది. మూసీ ఇవతల కొత్త నగరం విస్తరించి దినదినాభివృద్ధి చెందుతోంది. జయహో భాగ్యనగరం. చదవండి: కోచింగ్ పూర్తాయె.. కొలువు రాదాయె! -
400 సంవత్సరాల చరిత్ర.. కులీకుత్‌బ్‌షా, భాగమతి ప్రేమకు చిహ్నం..
సాక్షి, జియాగూడ: ప్రపంచంలోనే ఏకైక ప్రేమికుల వారధిగా పురానాపూల్ వంతెన ప్రేమకు సాక్షిగా నిలిచింది. ఇక్కడి నుంచే భాగ్యనగర నిర్మాణానికి పునాది పడింది. ఎన్నో విశేషాలతో నిర్మించిన ఈ చారిత్రక వారధి నిర్లక్ష్యానికి గురవుతోది. కట్టడానికి ఎలాంటి భద్రత లేదు. ప్రేమికుల వారధిగా గుర్తింపు పొందిన ఈ వారిదిపై ప్రభుత్వం 2000 సంవత్సరంలో ప్రేమికుల దినోత్సవాన్ని నిర్వహించింది. ప్రభుత్వం దీనిని పర్యాటక ప్రాంతంగా గుర్తించాలని పలువురు కోరుతున్నారు. కులీకుత్‌బ్‌షా, భాగమతి ప్రేమకు చిహ్నం.. గోల్కొండ యువరాజు మహ్మద్ కులీకుత్‌బ్‌షా పరవళ్లు తొక్కుతున్న మూసీనది అవతలి ఒడ్డన్న నివసించే భాగమతి ప్రేమలో పడ్డాడు. తండ్రి సుల్తాన్ ఇబ్రహీం కులీ కుత్బ్షా వీరి ప్రేమను గుర్తించి వీరి ప్రేమకు చిహ్నంగా పురానాపూల్‌ను ప్యారానాపూల్‌గా నామకరణం చేసి నిర్మించాడు. వీరి ప్రేమకు సాక్షిగా వంతెన, భాగ్యనగరం అంచెలంచెలుగా వెలిసింది. చారిత్రాత్మకమైన వంతెన.... పురానాపూల్ వంతెన కుతుబ్‌షాహీలు నిర్మించిన అద్భుత నిర్మాణాల్లో ఒకటి. అంతేకాదు హైదరాబాద్ నగరంలో నిర్మించిన మొదటి వంతెన కూడా ఇదే. ఈ వంతెన నిర్మాణం క్రీ.శ.1578లో ఇబ్రహీం కులీకుత్‌బ్‌షా నిర్మించారు. గోల్కొండ కోట నుంచి కార్వాన్ మీదుగా పాతబస్తీకి వెళ్లేందుకు ఈ వంతెనను నిర్మించారు. విదేశీయులు సందర్శన.. ఆసఫ్‌జాహీల కాలంలో హైదరాబాద్‌ను సందర్శించిన ఫ్రెంచి బాటసారి టావెర్నియర్ వంతెన నిర్మాణ శైలిని చూసి ముగ్దుడయ్యాడు. దీనిని ప్యారిస్‌లోని ఫౌంట్ న్యూప్‌తో పోల్చాడు. ఎన్నో విశేషాలతో కూడిన ఈ వంతెనను ప్రభుత్వం గుర్తించడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర టూరీజం శాఖ కిషన్‌రెడ్డి, తెలంగాణ టూరీజం మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్, తెలంగాణ టూరీజం డెవలప్మెంట్ ఛైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా వంత్తెనను సందర్శించాలని పలువురు కోరుతున్నారు. సమస్యలెన్నో.. 400 ఏళ్ల నాటి ఈ నిర్మాణం నేటికీ చెక్కు చెదరలేదు. రెండు మూడు సార్లు భారీ వరదలకు కొంతమేరకు దెబ్బతిన్నప్పటికీ నిజాం పాలకులు మరమ్మతులు చేపట్టారు. ప్రస్తుతం వంతెనపై కూరగాయల మార్కెట్ కొనసాగుతోంది. పలు చోట్ల వంతెన ప్రహరీ కూడా కూలిపోయింది. వంతెన పైనే వ్యాపారులు షెడ్లు వేసుకునేందుకు ఇనుప పైపులు పాతుతున్నారు. దీంతో వంతెనకు ప్రమాదం ఏర్పడుతోంది. అలాగే వంతెన దిగువన మూసీ మురుగునీరు నిలిచి ఉండడంతో వంతెన బీటలు వారుతోంది. వంతెనపై కూరగాయల మార్కెట్ -
ఖిల్లా.. సుబహానల్లా!
రాజుల కాలంలో నిర్మించిన కోటలు నాటి పాలనకు సజీవ సాక్ష్యాలు. ఆ కట్టడాలు అప్పటి పరిస్థితులకు అద్దం పడతాయి. నిర్మాణం, శిల్ప కళతో పాటు శత్రుదుర్భేద్యంగా నిర్మించడంలో పాలకులు వైవిధ్యం కనబరిచేవారు. అలా సరిగ్గా 500 ఏళ్ల క్రితం గోల్కొండ కోట నిర్మించారు. కాకతీయులు, బహుమనీలు, కుతుబ్ షాహీలు, మొగలులు, ఆసీప్ జాహీలు పాలించిన అద్భుతమైన కోట ఇది. ఈ కోట నిర్మాణానికి 500 ఏళ్లవుతున్న సందర్భంగా ‘సాక్షి’ప్రత్యేక కథనం... – సాక్షి, హైదరాబాద్ మట్టి కోట నిర్మాణం... క్రీ.శ. 1083 నుంచి 1323 వరకూ కోట కాకతీయుల పాలనలో ఉంది. గోల్కొండ అసలు పేరు గొల్ల కొండ. ఇక్కడ ఓ గొర్రెల కాపరికి మంగళవారం అనే కొండపై దేవతావిగ్రహం కనపడింది. ఈ విషయాన్ని కాకతీయ రాజులకు తెలుపగా వారు ఆ విగ్రహం చుట్టూ 1143లో మట్టి కోటని నిర్మించారు. కాలక్రమంలో గొల్లకొండ గోల్కొండగా మారింది. తర్వాత కాలంలో ఈ కోట అనేక రాజులు మారి 1518 సంవత్సరంలో కులీ కుతుబ్ షాహీల పాలనలోకి వచ్చింది. కుతుబ్ షాహీ రాజుల కాలంలోనే మట్టి కోట స్థానంలో ఇప్పుడున్న రాళ్ల కోటను కట్టించారు. 1689లో మొఘలులు దండయాత్ర చేసి కోటను స్వాధీనం చేసుకున్నారు. మట్టి కోట స్థానే రాళ్ల కోట... బహుమనీ సుల్తాన్ల రాజ్యం పతనమయ్యాక కుతుబ్ షాహీ పాలన వచ్చింది. సుల్తాన్ అలీ కుతుబ్ షా గోల్కొండకు పాలకుడిగా ప్రకటించుకున్నాడు. ఈయన గోల్కొండ కోటను రాళ్లతో నిర్మించాలని భావించాడు. అప్పుడే యుద్ధాల్లో కొత్తగా ఫిరంగి వినియోగిస్తున్నారు. దీనికి మట్టి కోట తట్టుకోలేదని, రాళ్ల కోట నిర్మించాడు. దేశంలోని ఇతర కోటలను వేరే ప్రదేశం నుంచి తెచ్చిన రాళ్లతో నిర్మించగా, గోల్కొండకు మాత్రం అదే గుట్ట అంటే నల్లకొండ రాతినే వినియోగించారని చరిత్రకారులు చెబుతారు. పద్మవ్యూహాన్ని తలపించే మెట్లు... 120 మీటర్ల ఎత్తున్న నల్లరాతి కొండపై గోల్కొండ కోటను నిర్మించారు. శత్రువుల నుంచి రక్షణ కోసం చుట్టూ ఎత్తైన గోడను నిర్మించారు. ఇది 87 అర్ధ చంద్రకార బురుజులతో 10 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఈ కోటకు నాలుగు ప్రధాన సింహ ద్వారాలు ఉన్నాయి. రాజ దర్బారుకు చేరాలంటే మూడు మార్గాలున్నాయి. మొదటిది నేరుగా రాజదర్బారుకు వెళితే... రెండో దారిలో సైనికుల నివాసాలు కనిపిస్తాయి. ఇక్కడి మెట్లు ఓ పద్మవ్యూహాన్ని తలపిస్తాయి. శత్రువులు ప్రవేశించినా చివరికి సైనిక స్థావరాల్లోకి వెళ్లేలా వీటిని నిర్మించడం వారి ప్రతిభకు తార్కాణంగా చెప్పొచ్చు. ఈ కోటకు ఉన్న ప్రధాన ద్వారాలను ఇనుముతో నిర్మించారు. వీటి ఎత్తు సుమారు 24 అడుగులు. పర్షియా, ఇస్లామిక్ నిర్మాణ శైలిలో కోటను నిర్మించారు. కోటలోనికి చేరుకోవడానికి 380 రాతిమెట్లున్నాయి. ఇవేగాక మరెన్నో ప్రత్యేకతలు ఈ కోట సొంతం. ధ్వని.. ప్రతి ధ్వని విధానం.. గోల్కొండ నిర్మాణం పర్షియన్ ఆర్కిటెక్చర్ ఓ అద్భుతం. 500 ఏళ్ల క్రితమే ఉపయోగించిన ఇంజనీరింగ్ విధానం ఆశ్చర్యపరుస్తుంది. కోటలోకి శత్రువులు ప్రవేశించినప్పుడు పైవారికి సమాచారం చేరవేసేందుకు ధ్వని.. ప్రతి ధ్వని.. అనే విధానాన్ని వినియోగించారు. కోట కింద భాగంలో చప్పట్లు కొడితే కిలోమీటరు దూరంలో లోపల ఉండే బాలాహిసార్ వద్ద ఆ శబ్దం వినిపిస్తుంది. కోట ప్రధాన ద్వారం కనిపించకుండా ముందు కర్టెన్ వాల్ నిర్మించారు. కోటలో ఊట బావులు, వర్షపు నీటి నిల్వ బావులు ఏర్పాటుచేశారు. వీటిలోకి 5 కిలో మీటర్ల దూరంలో ఉన్న దుర్గం చెరువు నుంచి నీళ్లు వచ్చేవి. దీని కోసం మట్టి పైపులు, ఇనుప చక్రాలు వాడేవారు. 67 ఏళ్ల వరకు నిర్మాణం.. ఏదైన కట్టడాన్ని కింది నుంచి పైకి కడతారు. కానీ గోల్కొండను పైనుంచి కిందికి కడుతూ వచ్చినట్లు చారిత్రక పుస్తకాల ద్వారా తెలుస్తోంది. 1518, సుల్తాన్ కులీ కుతుబ్ షా కాలంలో కోట నిర్మాణం ప్రారంభించగా, 1585 మహ్మద్ కులీ కుతుబ్ షా కాలం వరకు నిర్మాణం జరిగింది. అంటే దాదాపు 67 ఏళ్లపాటు ఐదుగురు పాలకుల హయాంలో నిర్మాణం కొనసాగింది. -
కులీకుతూబ్ షా ఆత్మహత్య చేసుకోవాలా?
హైదరాబాద్: కనీవినీ ఎరుగని రీతిలో హైదరాబాద్ ను అభివృద్ధి చేస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పారు. భాగ్యనగరాన్ని మురికివాడలు లేని నగరంగా తీర్చిదిద్దుతామన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు తీగల కృష్ణారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ బుధవారం సాయంత్రం టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మీర్ పేటలో ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్ మాట్లాడుతూ... హైదరాబాద్ నివసించే ఆంధ్రులు కూడా తమ బిడ్డలేనని అన్నారు. అర్హులందరికీ రేషన్ కార్డులు, ఇళ్లు ఇస్తామన్నారు. మాట్లాడితే హైదరాబాద్ ను తానే అభివృద్ధి చేశానని చంద్రబాబు డప్పు కొట్టుకుంటారని.. అలాయితే కులీకుతూబ్ షా ఏంచేయాలి, ఆత్మహత్య చేసుకోవాలా అని వ్యంగ్యంగా అన్నారు. వర్షం పడితే సీఎం క్యాంపు ఆఫీసు, గవర్నర్ కార్యాలయం, సచివాలయం ముందు మోకాళ్ల లోతు నీళ్లు నిలబడుతున్నాయని తెలిపారు. చంద్రబాబు చేసిన అభివృద్ధి ఇదేనా అని కేసీఆర్ సూటిగా ప్రశ్నించారు. తాము రుణమాఫీ అమలు చేసి చూపించామని, చంద్రబాబు ఇంకా మీనమేషాలు లెక్కిస్తున్నారని ఎద్దేవా చేశారు. కరెంట్ కష్టాలు ఉంటాయని తాను ముందే చెప్పానని గుర్తు చేశారు. మూడేళ్ల తర్వాత 24 గంటలు విద్యుత్ ఇస్తామని కేసీఆర్ హామీయిచ్చారు.