rachamallu prasad reddy
-
మరోమారు ఎమ్మెల్యే రాచమల్లు దాతృత్వం
ప్రొద్దుటూరు : ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి మరోమారు తన దాతృత్వాన్ని చాటుకున్నారు. పట్టణంలోని నిరుపేద ఎస్సీ విద్యార్థిని వాత్సల్యశ్రీ రష్యాలో ఎంబీబీఎస్ చదివేందుకు అయ్యే ఖర్చు రూ.50లక్షలు తానే వెచ్చిస్తానని ఎమ్మెల్యే తెలిపారు. ఇందుకు సంబంధించి విద్యార్థినికి పాస్ పోర్టు, వీసాను తెప్పించానన్నారు. మున్సిపల్ కార్యాలయంలో ఎమ్మెల్యే రాచమల్లు బుధవారం మీడియాతో మాట్లాడుతూ పట్నం వాత్సల్యశ్రీకి ఎంబీబీఎస్ చదవాలనే కోరిక ఎప్పటి నుంచో ఉందన్నారు. విద్యార్థిని కరాటేలో కూడా రాణించిందన్నారు. తన కుటుంబ ఆర్థిక పరిస్థితిని తనకు వివరించడంతో రూ.2లక్షలు వెచ్చించి కోచింగ్ ఇప్పించానన్నారు. రష్యా ఏషియన్ మెడికల్ ఇన్స్టిట్యూట్లో ఎంబీబీఎస్ సీటు రావడంతో తనను కలిసిందన్నారు. తాను ఏమాత్రం ఆలోచించకుండా ఆరేళ్లు చదవడానికి అయ్యే ఖర్చు రూ.50లక్షలను భరిస్తానని తెలిపారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు తనకు కొత్త కాదని, ఎంతో మంది విద్యార్థులు ఉన్నత చదువులు చదివేందుకు తాను సాయం చేశానన్నారు. ఎవరికై నా చదువే రాజమార్గమని చెప్పారు. ఇందు కోసమే వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేసిందన్నారు. మన బడి నాడు–నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వం విద్యాభివృద్ధికి కృషి చేస్తోందని చెప్పారు. విద్యావంతుల కుటుంబంలో జన్మించిన తాను పేదరికంతో కొన్ని రోజులు ఇబ్బంది పడ్డానని, కేవలం విద్య కారణంగానే తన కుటుంబం మళ్లీ యధాస్థితికి వచ్చిందన్నారు. మనుషుల మధ్య అసమానతలు తొలగాలంటే విద్య ద్వారానే సాధ్యమని తెలిపారు. విద్యతోనే నాగరికత అలవడుతుందన్నారు. అనంతరం పట్నం వాత్సల్యశ్రీ మాట్లాడుతూ గాడ్ ఫాదర్ లాంటి ఎమ్మెల్యే రాచమల్లుతోనే డాక్టర్ వాత్యల్సశ్రీ అవుతానని అన్నారు. తన తండ్రి శ్రీనివాస్ ఎల్ఐసీ ఏజెంట్‌గా ఉంటూ గుండెపోటుతో మరణించాడని, ఆర్థిక పరిస్థితులు సరిగా లేకపోవడంతో ఎమ్మెల్యే రాచమల్లు గురించి తెలుసుకుని సంప్రదించానన్నారు. పెద్ద మనసుతో స్పందించిన ఆయన తన చదువుకు సహకారం అందిస్తున్నారన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ భీమునిపల్లి లక్ష్మీదేవి, విద్యార్థి తల్లి సునీత పాల్గొన్నారు. -
కడప జడ్పీ సమావేశంలో తీవ్ర ఉద్రిక్తత
సాక్షి, వైఎస్సార్‌జిల్లా : కడప జిల్లా పరిషత్ సమావేశం ఉద్రిక్తంగా మారింది. సమావేశానికి సంబంధం లేని ఆప్కో ఛైర్మన్ హాజరు కావడం పట్ల వైస్సార్సీపీ ఎమ్మెల్యేలు రాచమల్లు ప్రసాద్ రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, కోరుముట్ల శ్రీనివాసులు ఆగ్రహం వ్యక్త చేశారు. వేదికపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. రైతులను ఆదుకోవాలంటూ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ప్లకార్డులతో వేదిక వద్ద నిరసనకు దిగారు. కరువుపై సమాధానం చెప్పాలంటూ మంత్రులు సోమిరెడ్డి, ఆది నారాయణ రెడ్డిలను నిలదీశారు. నెలరోజుల క్రితం పంటలను పరిశీలించిన మంత్రి ఏమి చర్యలు తీసుకున్నారని శ్రీకాంత్‌రెడ్డి ప్రశ్నించారు. కాగా చర్చను అడ్డుకుంటున్నారని సోమిరెడ్డి ఎదురుదాడికి దిగారు. దీంతో టీడీపీ, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు, ఇరు వర్గాల వారికీ నచ్చజెప్పి ఉద్రిక్తతను తగ్గించే ప్రయత్నం చేశారు. -
రోడ్డుప్రమాదంలో గాయపడ్డ వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే
కడప: ప్రొద్దుటూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డికి తృటిలో ప్రమాదం తప్పింది. వైఎస్సార్ జిల్లా పులివెందుల సమీపంలో నామాలగుండు వద్ద శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో రాచమల్లు ప్రసాదరెడ్డి సహా ఆయన కుటుంబసభ్యులు గాయపడ్డారు. ప్రసాదరెడ్డి కుటుంబ సమేతంగా కారులో పులివెందుల మీదుగా బెంగుళూరుకు వెళుతుండగా ఎదురుగా వస్తున్న లారీ ఢీకొంది. ఈ సంఘటనలో శాసనసభ్యుడు, ఆయన కుటుంబసభ్యులు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పులివెందుల పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. క్షతగాత్రులను పులివెందుల ఆస్పత్రికి తరలించారు. -
చెప్పుతో కొట్టుకొని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే నిరసన!
టీడీపీ దౌర్జన్యంపై తీవ్ర ఆగ్రహం.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా ఆయన ఓ ప్రజాప్రతినిధి.. ఎమ్మెల్యే. పట్టపగలు ప్రజాస్యామ్యాన్ని ఖూనీ చేస్తుంటే తట్టుకోలేకపోయారు. అధికార పార్టీ నేతలు, అధికారులు అంతా కలిసి వ్యవస్థను నాశనం చేస్తుంటే.. తీవ్ర ఆగ్రహానికి, ఆవేదనకు గురయ్యారు. ఈ దుర్మార్గాన్ని ఆపేందుకు శాయశక్తులా ప్రయత్నించారు. అధికారుల తీరుపై మండిపడ్డారు. ఈ దుర్మార్గాన్ని ఖండిస్తూ తనను తాను చెప్పుతో కొట్టుకొని నిరసన తెలిపారు. ఆయనే ప్రొద్దుటూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్‌రెడ్డి. ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నికను వాయిదా వేయడానికి మరోసారి టీడీపీ డ్రామా ఆడటం, అధికారులు అందుకు వత్తాసు పలుకడంతో ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతల దౌర్జన్యానికి అధికారులు లొంగిపోవడాన్ని తప్పుబట్టారు. పోలీసులు, అధికారుల తీరును తప్పుబడుతూ.. తనను తాను చెప్పుతో కొట్టుకొని నిరసన తెలిపారు. ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నికలో ప్రభుత్వ కుటిల ప్రయత్నాలను తీవ్రంగా ఎండగట్టిన ఆయన.. ఈ ఎన్నిక నిర్వహించకుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. టీడీపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని ఆయన మండిపడ్డారు. చైర్మన్ పదవికి కావాల్సిన మెజారిటీ వైఎస్ఆర్సీపీకి ఉన్నా కావాలనే ఎన్నికను టీడీపీ వాయిదా వేయించిందని ఆరోపించారు. టీడీపీ నేతల కుట్రలకు అధికారులు మద్దతు పలుకడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. గెలిచే దమ్ములేకే టీడీపీ రౌడీయిజానికి దిగిందని మండిపడ్డారు. తమకు 26మంది కౌన్సిలర్ల బలముందని తెలిపారు. ‘అసలు మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా? అధికారులు ప్రభుత్వానికి తొత్తులుగా మారారు.. ఇవాళ ప్రజాస్వామ్యాన్ని మానభంగం చేశారు’ అని ఆయన మండిపడ్డారు. -
ప్రొద్దుటూరులో ఉద్రిక్తత
-
ప్రొద్దుటూరులో ఉద్రిక్తత
ప్రొద్దుటూరు: వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో ఉద్రిక్తత చోటుచేసుకుంది. తాగునీటి సమస్యలపై సోమవారం ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్‌రెడ్డి జలదీక్ష చేపట్టనున్న నేపథ్యంలో ఏర్పాటుచేసిన దీక్షా శిబిరాన్ని మున్సిపల్ అధికారులు తొలగించారు. ఈ విషయమై అధికారులను ప్రశ్నించిన రాచమల్లు ప్రాసాద్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో పోలీసుల తీరును నిరసిస్తూ.. వైఎస్ఆర్ సీపీ నేతలు పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించారు. సమస్యలపై గొంతెత్తకుండా అడ్డుకుంటున్నారని వైఎస్ఆర్ సీపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. -
'ప్రభుత్వం మా చేతులు కట్టేస్తోంది'
హైదరాబాద్: నియోజక వర్గ శాసన సభ సభ్యులకు కెటాయించాల్సిన నిధులను స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ పేరుతో టీడీపీ కార్యకర్తలకు కెటాయించడం పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన ఆయన.. నియోజక వర్గ ప్రజలకు సేవ చేయాలని ఉన్నా ప్రభుత్వం ఇలాంటి చర్యలతో తమ చేతులు కట్టేస్తోందన్నారు. గతంలో దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో నియోజక వర్గ శాసన సభ్యలకు నిధులు కెటాయించిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇప్పుడు శాసన సభ సభ్యులకు నిధులు కెటాయించం అని ప్రభుత్వం మొండిగా చెబుతుండటం సిగ్గుచేటన్నారు. ప్రజలకు సేవ చేసేందుకు నిధులు కెటాయించనప్పుడు తనకు ప్రభుత్వం గౌరవ వేతనం ఇవ్వడం ఎందుకని ప్రసాద్ రెడ్డి ప్రశ్నించారు. నియోజక వర్గ శాసన సభ సభ్యులకు నిధులు కెటాయించకుండా అధికార పార్టీ నేతలు అగ్రగామి రాష్ట్రం పేరుతో నోటికొచ్చిన కూతలు కూస్తున్నారని ఆయన మండిపడ్డారు. -
'టీడీపీలో చేరాల్సి వస్తే ప్రాణాలైనా త్యజిస్తా'
కడప: అధికార టీడీపీ నాయకుల కుయుక్తులు, కుతంత్రాలకు వైఎస్సార్ సీపీ ప్రజాప్రతినిధులు ఎవరూ లొంగరని వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు. టీడీపీలో చేరాల్సివస్తే ప్రాణాలైనా త్యజిస్తానని ఘాటుగా స్పందించారు. కడపలో మంగళవారం జెడ్పీ సర్వ సభ్య సమావేశంలో టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ చేసిన వ్యాఖ్యలకు రాచమల్లు ప్రసాద్‌రెడ్డి దీటుగా సమాధానమిచ్చారు. తన రాజకీయ జీవితంలో ఏనాడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని వ్యతిరేకించలేదని, చంద్రబాబును పొగడలేదని తెలిపారు. టీడీపీ అంటేనే అసహ్యం వేస్తోందన్నారు. రాజంపేట వైఎస్సార్ సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి మాట్లాడుతూ.. అధికార పార్టీ నేతల మెప్పు పొందడానికి అధికారులు ప్రొటోకాల్ ఉల్లంఘనకు పాల్పడరాదన్నారు. అలా చేస్తే లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. రాయచోటి నియోజకవర్గంలోని లక్కిరెడ్డిపల్లెలో ఇటీవల అధికారికంగా ఆస్పత్రి భవనాన్ని ప్రారంభించామని, ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, జెడ్పీ చైర్మన్, ఎమ్మెల్యేతో పాటు ఎంపీగా తాను పాల్గొన్నానని తెలిపారు. స్థానిక అధికారులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారని చెప్పారు. అయితే అధికార పార్టీ నేతల జోక్యంతో కొందరు ఆ శిలాఫలకాన్ని పగులగొట్టడమే గాక, తమపై తప్పుడు కేసులు పెట్టించారని మిథున్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. -
'అధికారంలో ఉన్నాం... తలచుకుంటే ఏమైనా చేస్తాం'
కడప: మా ప్రభుత్వం అధికారంలో ఉంది... మేము తలుచుకుంటే మిమ్మల్ని ఏమైనా చేస్తానంటూ టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ వైఎస్ఆర్ సీపీ నేతలను బెదిరించారు. శనివారం కడపలో జరిగిన జెడ్పీ సమావేశంలో ఉద్రిక్తత నెలకొంది. తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిన ఎంపీ సీఎం రమేష్ జెడ్పీ సమావేశానికి ఎలా వస్తారంటూ వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే రాచమళ్లు ప్రసాద్ రెడ్డి ఉన్నతాధికారులను ప్రశ్నించారు. జడ్పీ సమావేశంలో ఉండటానికి సీఎం రమేష్ అనర్హుడంటూ మినిట్స్‌లో రూల్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే రూలింగ్ చేయడానికి జెడ్పీ చైర్మన్‌కు అధికారం లేదని జిల్లా కలెక్టర్... సీఎం రమేష్‌ను వెనకేసుకు వచ్చారు. దీంతో వైఎస్ఆర్ జడ్పీటీసీ సభ్యులు జెడ్పీ పోడియం ముందు బైఠాయించి నిరసన తెలిపారు. ఆ క్రమంలో సీఎం రమేష్ ఆగ్రహంతో ఊగిపోతూ పై విధంగా స్పందించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన నేపథ్యంలో పలువురు తెలంగాణకు చెందిన రాజ్యసభ సభ్యులు ఏపీకి... అలాగే ఏపీకి చెందిన పలువురు ఎంపీలు తెలంగాణకు ఎంపికయ్యారు. సీఎం రమేష్ తెలంగాణకు కేటాయించారు. దీంతో తెలంగాణకు చెందిన ఎంపీ ఆంధ్రప్రదేశ్ జెడ్పీ సమావేశానికి ఎలా హజరవుతారని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు ప్రశ్నించారు. -
'టీడీపీలో చేరే కంటే శ్మశానంలో చేరడం మేలు'
కడప : ఆంధ్రప్రదేశ్‌లో అధికార టీడీపీ పార్టీలో చేరే కంటే శ్మశానంలో చేరడం మేలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్‌రెడ్డి అన్నారు. వైఎస్ఆర్ పార్టీ ప్రజా ప్రతినిధులు టీడీపీలో చేరుతున్నారంటూ పచ్చ పత్రికలు, టీడీపీతో కలసి మైండ్ గేమ్ ఆడుతున్నాయని ఆరోపించారు. గురువారం కడపలో రాచమల్లు ప్రసాద్‌రెడ్డి విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబంపై తమ పార్టీ ఎమ్మెల్యేలందరికి అత్యంత అభిమానం, విశ్వాసం ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. తాము ఎవరూ పార్టీని వీడేది లేదని రాచమల్లు ప్రసాద్‌రెడ్డి తెలిపారు.