హైదరాబాద్: నియోజక వర్గ శాసన సభ సభ్యులకు కెటాయించాల్సిన నిధులను స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ పేరుతో టీడీపీ కార్యకర్తలకు కెటాయించడం పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన ఆయన.. నియోజక వర్గ ప్రజలకు సేవ చేయాలని ఉన్నా ప్రభుత్వం ఇలాంటి చర్యలతో తమ చేతులు కట్టేస్తోందన్నారు. గతంలో దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో నియోజక వర్గ శాసన సభ్యలకు నిధులు కెటాయించిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇప్పుడు శాసన సభ సభ్యులకు నిధులు కెటాయించం అని ప్రభుత్వం మొండిగా చెబుతుండటం సిగ్గుచేటన్నారు.
ప్రజలకు సేవ చేసేందుకు నిధులు కెటాయించనప్పుడు తనకు ప్రభుత్వం గౌరవ వేతనం ఇవ్వడం ఎందుకని ప్రసాద్ రెడ్డి ప్రశ్నించారు. నియోజక వర్గ శాసన సభ సభ్యులకు నిధులు కెటాయించకుండా అధికార పార్టీ నేతలు అగ్రగామి రాష్ట్రం పేరుతో నోటికొచ్చిన కూతలు కూస్తున్నారని ఆయన మండిపడ్డారు.
'ప్రభుత్వం మా చేతులు కట్టేస్తోంది'
Published Wed, Mar 30 2016 10:37 AM | Last Updated on Fri, Aug 10 2018 9:42 PM
Advertisement
Advertisement