racial attack
-
ట్రంప్లాంటోళ్లను చాలామందినే చూశా: కమలా హారిస్
తమ జాతీయతను ప్రశ్నిస్తూ మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు డెమోక్రాటిక్ అభ్యర్ధి కమలా హారిస్ కౌంటర్ ఇచ్చారు. ట్రంప్ ఎలాంటి వాడో తనకు ఎప్పుడో తెలుసని, ఆయన మళ్లీ పాత పాటే పాడుతున్నారంటూ ధీటుగా బదులిచ్చారు.తన కెరీర్లో ట్రంప్ లాంటి వారెంతో మంది నేరస్థులతో వ్యవహరించినట్లు కమలా హారిస్ తెలిపారు. వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్నికవకముందు గతంలో అటార్నీ జనరల్, డిస్ట్రిక్ట్ అటర్నీ, కోర్టు ప్రాసిక్యూటర్‌గా ఉన్న సమయంలో ఇలాంటివెన్నో ఎదుర్కొన్నట్లు పేర్కొన్నారు.‘ట్రంప్ మళ్లీ తన పాతకాలపు విభజన సిద్ధాంతం, అగౌరవపర్చే ప్రవర్తననే ప్రదర్శిస్తున్నారు. అందుకే ఇలాంటివారు కాకుండా అమెరికా ప్రజలకు ఉత్తమ నాయకులు రావాలి. మన వైవిధ్యాలు మనల్ని విడదీయకూడదు. ఐకమత్యంగా ఉంచాలి. అదే మన బలం. వాస్తవాలను చెప్పాల్సి వచ్చినప్పుడు శత్రుత్వం, కోపంతో స్పందించేవారు మనకు వద్దు. వాస్తవాలను అంగీకరించి వాటిని ధైర్యంగా చెప్పే నాయకులు కావాలి’ అని వ్యాఖ్యానించారు.Throughout my career, I’ve taken on perpetrators of all kinds, and let me tell you: I know Donald Trump’s type. pic.twitter.com/EP9e8ClVKE— Kamala Harris (@KamalaHarris) August 1, 2024 కాగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ తరఫున పోటీలో దిగుతున్న ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌పై జాతీపరమైన గుర్తింపుపై మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలుచేశారు. ఆమె భారతీయురాలా?.. లేక నల్లజాతీయురాలా?’అంటూ ప్రశ్నించారు. ఆమె ఎల్లప్పుడూ భారతీయ వారసత్వానికి చెందినవారే. ఇన్నాళ్లూ దాన్నే ప్రచారం చేస్తూ వచ్చారని విమర్శించారు.ఆమె నల్లజాతీయురాలని కొన్నేళ్ల క్రితం వరకు తనకు తెలియదని, ఇప్పుడు ఆమె ఉన్నట్టుండి నల్లజాతీయురాలిగా మారిపోయారు. ఇంతకీ ఆమె భారతీయురాలా? నల్లజాతీయురాలా?’’ అని ట్రంప్ ప్రశ్నించారు. ఈ విమర్శలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి.కాగా కమలా హారిస్ భారత సంతతికి చెందినవారన్న విషయం తెలిసిందే. ఆమె తల్లి భారతీయురాలు, తండ్రి జమైకన్. ఇద్దరూ యునైటెడ్ స్టేట్స్కు వలస వచ్చారు. అయతే కమలా నల్లజాతి, ఆసియా వారసత్వం రెండింటినీ కలిగి ఉన్న తొలి అమెరికన్ ఉపాధ్యక్షురాలు. ఈ ఏడాది నవంబర్‌లో జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాటిక్ పార్టీ తరపున పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో హారిస్ గెలిస్తే దేశానికి తొలి మహిళా అధ్యక్షురాలు కానున్నారు.. -
పోలీసుల అతి.. ఆగని ప్రజాగ్రహం.. రణరంగాన్ని తలపిస్తున్న ఫ్రాన్స్
ఫ్రాన్స్ రణరంగాన్ని తలపిస్తోంది. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించాడన్న ఆరోపణలపై పోలీసులు 17 ఏళ్ల యువకుడ్ని కాల్చి చంపడాన్ని నిరసిస్తూ పౌరులు పెను విధ్వంసమే సృష్టి స్తున్నారు. మైనార్టీలపై ఫ్రాన్స్ పోలీసుల అకృత్యాలు ఇదేమీ కొత్త కాదు. గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి. అమెరికాలో జాత్యహంకారంతో జార్జ్ ఫ్లాయిడ్ అనే నల్లజాతీయుడి హత్యపై కూడా అప్పట్లో ఫ్రాన్స్ నిరసనలతో దద్దరిల్లింది. గతంలో ఫ్రాన్స్‌లో పోలీసుల అతిపై పలుమార్లు తీవ్ర ప్రజాగ్రహం పెల్లుబిక్కింది. వాటి వివరాలు.. నేహల్ ఎం.. అల్జీరియా సంతతికి చెందిన నేహల్‌కు 17 సంవత్సరాలు. మంగళవారం అతను కారు డ్రైవ్ చేసుకుంటూ వెళుతూ ఉంటే ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద పోలీసులు ఆ కారు ఆపడానికి ప్రయత్నించారు. అయితే నేహల్ కారు ఆపకుండా తమ మీదకి దూసుకురావడంతో అతనిపై కాల్పులు జరపాల్సి వచి్చందని, దీంతో అందరి ప్రాణాలు కాపాడడానికే అతనిపై కాల్పులు జరిపామన్నది పోలీసుల వాదన. ఆ కాల్పుల్లో నేహల్ మృతి చెందడంతో సామాన్యుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. పోలీసుల తీరుని నిరసిస్తూ పలు ప్రాంతాల్లో ఉద్రిక్తతలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసుల వాదనకు పూర్తిగా విరుద్ధంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో కనిపిస్తోంది. ఆ యువకుడిపై పోలీసులు ఉద్దేశపూర్వకంగా కాల్పులు జరిపినట్టుగా తెలుస్తోంది. దీంతో వేలాది మంది యువతీయువకులు రోడ్లపైకి వచ్చి నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ ఆస్తులకు నిప్పు పెడుతున్నారు. దేశం ఒక అగ్ని గుండంగా మారింది. మైకేల్ జెస్లెర్.. 2020 నవంబర్‌లో నల్లజాతీయుడైన మ్యూజిక్ ప్రొడ్యూసర్ మైకేల్ జెస్లర్పై పోలీసులు తమ కర్కశత్వం ప్రదర్శించారు. పారిస్‌లో ఉన్న జెస్లర్ని ఒక కేసులో అరెస్ట్ చేయడానికి నలుగురు పోలీసులు వెళితే అతను ప్రతిఘటించాడన్న సాకుతో వారు తమ దాషీ్టకం ప్రదర్శించారు. జెస్లర్ను గొడ్డును బాదినట్టు బాదారు. ఈ వీడియో బయటకి రావడంతో ప్రజలు పెద్ద ఎత్తున రోడ్డెక్కి నిరసనలకు దిగారు. దీంతో ప్రభుత్వం ఆ నలుగుర్ని సస్పెండ్ చేసింది. ఈ ఘటనతో ఫ్రాన్స్‌లోని వ్యవస్థల్లో జాతి వివక్షపై మరోసారి విస్తృతంగా చర్చ జరిగింది. జార్జ్ ఫ్లాయిడ్ 2020 జూన్‌లో అమెరికాలో నల్లజాతీయుడైన జార్జ్ ఫ్లాయిడ్‌ను తెల్ల తోలు అహంకారంతో ఒక పోలీసు అధికారి నేలపై పడేసి తన మోకాలితో అతని గొంతుపై ఎనిమిది నిమిషాల సేపు నొక్కి ఉంచి హత్య చేయడంపై నిరసనలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా పోలీసులు నల్లజాతి వారిని, అరబ్బులని లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తున్నారని సామాజిక కార్యకర్తలు ఆరోపణలు గుప్పించారు. ఫ్లాయిడ్ మృతిపై అమెరికాను మించి ఫ్రాన్స్‌లో నిరసనలు మిన్నంటాయి. ఈ నిరసనలకు తలొగ్గిన ప్రభుత్వం నిందితుల్ని అరెస్ట్ చేసినప్పడు వారి మెడపై చెయ్యి వెయ్యడాన్ని నిషేధించింది. యెల్లో వెస్ట్స్ ఉద్యమం 2018లో ఫ్రాన్స్ ప్రభుత్వం చమురుపై పన్ను విధించడానికి సన్నాహాలు చేస్తోందనే వార్తలపై ప్రజాందోళనలు భగ్గుమన్నాయి. ప్రతిపాదిత పన్నుని నిరసిస్తూ వేలాది మంది రోడ్లపైకి వచ్చారు. ఈ నిరసనల్ని అణగదొక్కడానికి పోలీసులు మరింత హింసకు పాల్పడ్డారు. రబ్బర్ బుల్లెట్లు, బాష్పవాయువు ప్రయోగం, గ్రనేడ్స్ కూడా వాడడంతో క్షతగాత్రులైన వేలాదిమంది శాశ్వతంగా మంచానికే పరిమితమైపోయారు. అడమా ట్రయోర్.. 2016 జూలైలో 24 ఏళ్ల వయసున్న అడమా ట్రయోర్ అనే యువకుడు పోలీసు కస్టడీలో మరణించడంతో ఫ్రాన్స్‌లో ఘర్షణలు చెలరేగాయి. ఉత్తర పారిస్‌లోని బీమాంట్ పోలీసుల అదుపులో ఉండగా అడమా ప్రాణాలు కోల్పోయాడు. అతని మృతి గల కారణాలపై వైద్యులు భిన్న నివేదికలు సమరి్పంచడం, అనారోగ్యంతో అడమా మరణించాడని పోలీసులు చెప్పడంతో ప్రజలు రోడ్డెక్కారు. జస్టిస్ ఫర్ అడమా అంటూ పోస్టర్లు ప్రదర్శిస్తూ వేలాది మంది రోడ్లపైకి రావడంతో ఉద్రిక్తతలకి దారితీసింది. పారిస్ ఊచకోత.. 2005 నవంబర్‌లో పోలీసులను తప్పించుకుంటూ వెళ్లిన ఇద్దరు ముస్లిం అబ్బాయిలు జయ్యద్ బెన్నా, బౌనా టరయోర్ విద్యుద్ఘాతంతో మరణించడంపై కూడా ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమించారు. ఇద్దరు మైనార్టీలపై పోలీసులు దొంగలన్న ముద్ర వేసి వారి మరణానికి కారకులయ్యారన్న ఆగ్రహంతో ఆందోళనలకు దిగారు. ఈ ఆందోళనల్లో 10 వేల ప్రభుత్వ వాహనాలను తగులబెట్టారు. 233 ప్రభుత్వ కార్యాలయాలను ధ్వంసం చేశారు. పోలీసులు 4 వేల మందిని పైగా అదుపులోనికి తీసుకున్నారు. ఈ సమయంలో అల్లర్లను అదుపు చేయడానికి ఎమర్జెన్సీ ప్రకటించాల్సి వచి్చంది. ఫ్రాన్స్‌లో పోలీసుల హింస దశాబ్దాల క్రితం నుంచే ఉంది. వలస పాలకులకు వ్యతిరేకంగా ఉద్యమించిన అల్జీరియన్లపై పోలీసుల అకృత్యాలు ఫ్రాన్స్ చరిత్రపై ఒక మాయని మచ్చగా మిగిలిపోతాయి. అరబ్బులు, ముస్లింలపై పోలీసులు ఎంత కర్కశంగా వ్యవహరిస్తారో తెలపడానికి ఇదే నిలువెత్తు ఉదాహరణ. పోలీసు కాల్పుల్లో 200 మంది ప్రాణాలు కోల్పోయారు. పెరిగిపోతున్న పోలీసు హింస ► ఫ్రాన్స్‌లో పోలీసుల హింస రోజురోజుకి పెరిగిపోతోంది. గత అయిదేళ్లలో ఈ అకృత్యాలు 20% పెరిగినట్టు స్వచ్ఛంద సంస్థల నివేదికలు చెబుతున్నాయి. పోలీసులకుండే అధికారాలను పెంచుతూ 2017లో చట్టాలను సవరించారు. పోలీసుల కన్నుగప్పి పారిపోయే వారి వాహనాలపై కాల్పులు జరపవచ్చునని కొత్త చట్టాల్లో చేర్చారు. 2021లో వాహనాలపై పోలీసుల కాల్పుల ఘటనలు 157 జరగగా, 2022లో 138 జరిగాయి. ఇక గత ఏడాది పోలీసు కాల్పుల్లో 13 మంది అమాయకులు మరణించారు. దేశంలో శాంతి భద్రతల్ని కాపాడాల్సిన పోలీసులే చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని వ్యవహరిస్తూ ఉండడంతో ప్రజల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. -
విద్యార్థిపై జాత్యహంకార దాడి.. పక్కాగా ప్లాన్ చేసి, సీట్లో ఆల్కహాల్ పోసి నిప్పు
మెక్సికో: స్థానిక భాష మాట్లాడినందుకు 14 ఏళ్ల విద్యార్థికి తరగతి గదిలోనే నిప్పంటించారు తోటి విద్యార్థులు. ఈ దారుణ ఘటన మెక్సికో క్వెరెటరో రాష్ట్రంలో జూన్‌లో జరిగింది. తీవ్ర గాయాలపాలైన అతడ్ని ఆస్పత్రికి తరలించగా.. చాలా రోజుల చికిత్స అనంతరం ఈ వారమే డిశ్ఛార్జి అయ్యాడు. జాతి వివక్ష వల్లే తన కుమారుడిపై దాడి జరిగిందని తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ ఘటనకు బాధ్యులైన ఇద్దరు విద్యార్థులు సహా పాఠశాల సిబ్బందిపై ఫిర్యాదు చేశారు. దాడి జరిగిన ఈ విద్యార్థి పేరు జువాన్ జమొరానో. క్వెరెటరోలోని హైస్కూళ్లో చదవుతున్నాడు. అయితే ఇతను మెక్సికో సంప్రదాయ తెగ అయిన ఒటోమి కుటుంబం నుంచి వచ్చాడు. ఈ విషయం తెలిసి తోటి విద్యార్థులు అతడ్ని వివక్షపూరితంగా చూస్తున్నారు. ఓ రోజు ఇద్దరు విద్యార్థులు జువాన్ కూర్చొనే సీట్లో ఆల్కహాల్ పోశారు. అది చూసుకోకుండా అతను అలానే కూర్చుకున్నాడు. ప్యాంట్ తడిచాక విషయాన్ని గమినించి వెంటనే పైకి లేచాడు. ఆ సమయంలో ఇద్దరు విద్యార్థుల్లో ఒకరు జూవన్కు నిప్పంటించారు. దీంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. టీచర్ కూడా వేధిస్తోంది పాఠాలు చెప్పే టీచర్ కూడా తమ బిడ్డను వేధించిందని ఆవేదన వ్యక్తం చేశారు జువాన్ తల్లిదండ్రులు. ఒటోమి భాష మాట్లాడితే తోటి విద్యార్థులు జువాన్‌తో గొడవపడేవారని, అతడ్ని వేధించేవారని తెలిపారు. అందుకే స్కూళ్లో ఆ భాష మాట్లాడాలంటేనే అతను భయంతో వణికిపోయేవాడని వివరించారు. అధ్యక్షుడి రియాక్షన్ మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యుల్ లోపెజ్ కూడా ఈ ఘటనపై స్పందించారు. అవసరమైతే ఈ కేసును దేశ అటార్నీ జరనల్ కార్యాలయం తమ చేతుల్లోకి తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ఒటోమి భాష మాట్లాడటమే జువాన్ చేసిన నేరమా అని, జాతివివక్షను అంతం చేయడం అందరి బాధ్యత అని లోపెజ్ అధికార ప్రతినిధి ట్వీట్ చేశారు. 12.6కోట్ల జనాభా ఉన్న మెక్సికోలో జాతి వివక్ష దాడులు సాధారణం అయిపోయాయి. ఈ దేశంలో దాదాపు 2.3 కోట్ల మంది సంప్రదాయ తెగలకు చెందినవారున్నారు. వీరిలో 73లక్షల మంది స్థానిక భాషే మాట్లాడుతారు. దాదాపు 40 శాతం మంది సంప్రదాయ తెగలు తమను వివక్షతో చూస్తున్నారని ఫిర్యాదు చేశారంటే అక్కడి పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. చదవండి: ప్రధాని నివాసం వద్ద వేల మంది నిరసనకారులు.. ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం -
శ్రీనివాస్ కూచిభొట్ల హత్య కేసులో కొత్త ట్విస్ట్
వాషింగ్టన్ : అమెరికాలో దారుణంగా హత్యకు గురైన ఇండియన్ టెకీ కూచిభొట్ల శ్రీనివాస్ హత్యకేసులో మరో పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కుంటున్న ఆడం పూరింటన్ తాను నిరాపరాధినంటూ ఓ పిటిషన్ దాఖలు చేశాడు. అయితే ఫెడరల్ ప్రాసెక్యూటర్ మాత్రం పురింటన్ కావాలనే శ్రీనివాస్, అలోక్ మదాసానిలను లక్ష్యంగా చేసుకునే దాడికి పాల్పడ్డాడని తెలిపారు. 24 ఏళ్ల అమెరికన్ ఇయాన్ గ్రిల్లాట్ కూడా ఘటనలో తీవ్ర గాయాలపాలయ్యాడని చెప్పారు. ఈ మేరకు శుక్రవారం తొలివాదనలు జరగగా.. తదుపరి విచారణను వచ్చే ఏడాది మే నెలకు వాయిదా వేశారు. సాక్ష్యాలు బలంగా ఉండటంతో అతనికి శిక్ష పడటం ఖాయంగానే కనిపిస్తోంది. అమెరికా నేవీ మాజీ ఉద్యోగి ఆడమ్ పురింటన్ (51) కన్సాస్ సిటీ బార్లో కూచిబొట్ల శ్రీనివాస్ ను కాల్చి చంపటంతోపాటు మరో ఇద్దరినీ తీవ్రంగా గాయపరిచాడు. జాత్యాంహకార దాడి, మారణాయుధాలు కలిగి ఉండటం అనే అభియోగాలు పురింట్‌న్‌పై నమోదు అయ్యాయి. ఈ ఫిబ్రవరిలో జరిగిన ఈ కాల్పుల ఘటనను జాతి వివక్ష దాడిగా విచారణ చేపట్టినట్లు అమెరికా న్యాయశాఖ ప్రకటించింది కూడా. గన్‌తో కాల్పులు జరిపే ముందు మీ దేశానికి వెళ్లిపోవాలంటూ పురింటన్ అరుపులు పెట్టినట్లు సాక్ష్యులు తెలిపారు. అభియోగాలు రుజువై దోషిగా తేలితే పురింటన్‌కు ఉరిశిక్ష లేదా జీవితఖైదు పడే అవకాశం ఉంది. -
‘మీరు వెదుకుతున్న హంతకుణ్ని నేనే’
న్యూయార్క్: అమెరికాలో జాత్యహంకారం బుసలు కొడుతూనే ఉంది. మన్ హటన్ లో సోమవారం జరిగిన విద్వేష దాడిలో 66 ఏళ్ల నల్ల జాతీయుడు తిమోతి కాగ్ మాన్ ప్రాణాలు కోల్పోయాడు. జాత్యహంకారంతోనే తిమోతిని హత్య చేసినట్టు శ్వేతజాతీయుడు జేమ్స్ హారిస్ జాక్సన్ అంగీకరించాడు. బుధవారం ఉదయం టైమ్ స్క్వేర్ వద్ద హఠాత్తుగా అతడు ప్రత్యక్ష మయ్యాడు. ‘మీరు వెదుకుతున్న వ్యక్తిని నేనే. తిమోతి మరణానికి నేనే కారణం. తన జేబులో కత్తులు ఉన్నాయ’ని హల్ చల్ చేశాడు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. మేరీల్యాండ్ లోని బాల్టిమోర్ లో నివసిస్తున్న 28 ఏళ్ల జాక్సన్ హారిస్ నల్లజాతీయుల పట్ల గత పదేళ్లేగా విద్వేషం పెంచుకున్నాడని పోలీసులు తెలిపారు. నల్లజాతీయులను చంపాలన్న ఉద్దేశంతో మార్చి 17న బస్సెక్కి న్యూయార్క్ కు వచ్చాడని వెల్లడించారు. తిమోతిపై వెనుక నుంచి కత్తితో దాడి చేసి పలుమార్లు పొడిచాడని తెలిపారు. తీవ్ర గాయాలపాలైన తిమోతి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలాడని, ఇది కచ్చితంగా జాత్యహంకార దాడి అని పోలీసులు పేర్కొన్నారు. ఘటనా స్థలం నుంచి జాక్సన్ పారిపోయిన దృశ్యాలు సీసీ టీవీలో రికార్డు కావడంతో పోలీసుల ఎదుట అతడు లొంగిపోవాడు. -
ఎయిర్‌లైన్స్ ఉద్యోగినిపై విద్వేషపు దాడి
మసాచూసెట్స్: అమెరికాలో మరోమారు జాతి విద్వేషం బుసలు కొట్టింది. విదేశాలకు యాత్రకు వెళ్లిన ఓ వ్యక్తి తిరిగి వస్తూ అమెరికాలోని జాన్ ఎఫ్ కెన్నడీ విమానాశ్రయంలో డెల్టా ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ ముస్లిం ఉద్యోగినిపై చేయి చేసుకున్నాడు. దీంతో రంగంలోకి దిగిన ఎయిర్‌పోర్టు అధికారులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. రోబిన్ రోడ్స్(57) ఈ ఏడాది జనవరిలో అరుబా దేశానికి యాత్ర కోసం వెళ్లాడు. మసాచూసెట్స్ వెళ్లడానికి కనెక్టింగ్ విమాన సమాచారం కోసం డెల్టా ఎయిర్‌లైన్స్ ఉద్యోగులు ఉండే క్యాబిన్‌కు వెళ్లాడు. ఎయిర్‌లైన్స్ క్యాబిన్లో ముస్లిం ఉద్యోగిని ఉండటం చూసి ఉద్రేకం తెచ్చుకున్న రోడ్స్ నువ్వు నిద్రపోతున్నావా? లేదా నమాజ్ చేస్తున్నావా?. ఏం చేస్తున్నావ్? అంటూ గద్దించాడు. ఆ తర్వాత ఉద్యోగిని క్యాబిన్లోకి ప్రవేశించేందుకు అడ్డుగా ఉన్న తలుపును బద్దలు కొట్టాడు. రోడ్స్ ప్రవర్తనతో షాక్ గురైన ఉద్యోగిని భయంతో తాను ఏం తప్పు చేశానని ప్రశ్నించింది. ఇందుకు స్పందించిన రోడ్స్ తప్పేం లేకపోయిన వదలనని వ్యాఖ్యానించాడు. దీంతో ఉద్యోగిని అక్కడి నుంచి తప్పించుకోవాలని ప్రయత్నించగా రోడ్స్ అడ్డుకున్నాడు. ఘటనను మొత్తం చూస్తున్న ఓ వ్యక్తి రోడ్స్ దృష్టిని మరలించగా ఉద్యోగిని వెంటనే బయటకు పరుగెత్తింది. తేరుకున్న రోడ్స్ ఉద్యోగినిని వెంబడించి ఆమెను మోకాళ్లపై కూర్చొబెట్టి ఇస్లాం మత ప్రార్ధనలను ఉద్దేశించి మాట్లాడాడు. అక్కడితో ఆగని రోడ్స్ ఇస్లాం, ఐసిస్ అంటూ పెద్దగా అరుస్తూ ప్రస్తుతం ఇక్కడ ట్రంప్ ఉన్నాడంటూ నినాదాలు చేశాడు. ముస్లింలను ట్రంప్ వెళ్లగొడతారని వ్యాఖ్యానించాడు. కాగా, రోడ్స్‌ను అరెస్టు చేసి పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. 50 వేల డాలర్ల పూచీకత్తుతో కోర్టు అతన్ని బెయిల్‌పై విడుదల చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో రోడ్స్‌కు నాలుగేళ్లపాటు జైలు శిక్ష పడే అవకాశం ఉన్నట్లు తెలిపారు. -
ట్రంప్ నోరు విప్పాలి
శ్రీనివాస్ కూచిభొట్ల హత్యపై హిల్లరీ డిమాండ్ ♦ ట్రంప్ మౌనం విద్వేషపూరిత నేరాలకు ఆజ్యం: న్యూయార్క్ టైమ్స్ ♦ కోర్టు విచారణకు హాజరైన హంతకుడు ప్యూరింటన్ ♦ నేరం రుజువైతే 50 ఏళ్ల జైలు శిక్ష వాషింగ్టన్ : జాత్యాహంకార దాడిలో హత్యకు గురైన శ్రీనివాస్ ఉదంతంపై అమెరికా మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ స్పందించారు. అమెరికాలో కొనసాగుతున్న విద్వేషపూరిత నేరాలపై అధ్యక్షుడు ట్రంప్ నోరు విప్పాలని డిమాండ్ చేశారు. ‘బెదిరింపులు, విద్వేషపూరిత నేరాలు పెరిగాయి. ఈ విషయం ట్రంప్‌కు మనం చెప్పాల్సిన అవసరం లేదు. ట్రంప్ నోరు విప్పాలి’ అని ఆమె ట్వీట్ చేశారు. శ్రీనివాస్ హత్యపై ట్రంప్ ఇంతవరకూ స్పందించలేదు. అయితే శ్రీనివాస్ హత్యపై వైట్‌హౌస్ స్పందించింది. వలసలపై నిషేధాజ్ఞలకు కాన్సస్ కాల్పులకు సంబంధంలేదని వాదించిన సర్కారు... కాల్పుల ఘటన ఆందోళన కలిగించిందని తెలిపింది. ఆ మేరకు వైట్‌హౌస్ మీడియా కార్యదర్శి సీన్ స్పైసర్ మీడియాతో మాట్లాడుతూ... కాన్సస్ నుంచి అందుతున్న ప్రాథమిక వివరాలు ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. విద్వేషాల్ని అణచకుండా ఆజ్యం పోస్తున్నారు: న్యూయార్క్ టైమ్స్ భారతీయ ఇంజనీరు హత్యపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మౌనం వహించి... అమెరికాలో విద్వేషపూరిత నేరాలకు ఆజ్యం పోశారని ప్రముఖ వార్తాపత్రిక న్యూయార్క్ టైమ్స్ అభిప్రాయపడింది. ‘అధ్యక్షుడు ట్రంప్, అతని యంత్రాంగం చాలా మంది వలసదారులు, విదేశీ పర్యాటకుల్ని దేశం నుంచి పంపేందుకు ప్రయత్నించడం ఒక్కటే కాదు... వారిని నేరస్తులుగా, ఉగ్రవాదులుగా, అక్రమంగా నివసిస్తున్నవారిగా ముద్ర వేస్తోంది. విద్వేషాన్ని అణచివేయకుండా... అధ్యక్షుడు ఆజ్యం పోస్తున్నారు. కాన్సస్ కాల్పులకు సంబంధించి కనీసం ఏమీ మాట్లాడలేదు. విద్వేషపూరిత నేరం జరిగితే నేరస్తుడి మానసిక స్థితి సరిగాలేదని సులువుగా చెప్పేస్తున్నారు. ఒకవేళ ఇలాంటి నేరాలు ముస్లింలు గానీ, సరైన పత్రాలు లేకుండా నివసిస్తున్నవారు చేస్తే... తాను చెప్పినట్లే జరుగుతుందని ట్రంప్ తప్పకుండా అంటారు’ అని న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. ట్రంప్ ఎలాంటి చర్యలు తీసుకోకపోతే... విద్వేష పూరిత నేరాలు చేసేందుకు నేరస్తులకు అధికారమిచ్చినట్లు అవుతుందని తన వ్యాసంలో తప్పుపట్టింది. ‘ట్రంప్ అమెరికా’లో విద్వేష పూరిత నేరాలు, పక్షపాతంతో కూడిన సంఘటనలు ఎక్కువవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. మీతో ఉండనివ్వండి: బార్టెండర్తో ప్యూరింటన్ శ్రీనివాస్ హత్య తర్వాత రెస్టారెంట్లో తలదాచుకున్న ప్యూరింటన్ ... బార్టెండర్ సామ్‌తో ఏం మాట్లాడింది వెలుగులోకి వచ్చింది. ‘నేను మీతో ఉండవచ్చా అని ప్యూరింటన్ నన్ను అడిగాడు. ఏంచేశాడో చెప్పలేదు. నేను అతన్ని అడుగుతూనే ఉన్నాను. మాతో ఉండనిస్తేనే ఏం జరిగిందో∙చెపుతానన్నాడు. చివరికి ఒలేతేలో ఇద్దరు ఇరానియన్లను చంపానన్నాడు’ అని సామ్ పోలీసులకు ఫోన్ లో వెల్లడించింది. సాక్ష్యాధారాల సేకరణ కోసం రంగంలోకి ఎఫ్‌బీఐ అమెరికాలోని కాన్సస్‌లో శ్రీనివాస్ కూచిభొట్లను హత్య చేసి, మరో ఇద్దరిని గాయపరిచిన కేసులో నిందితుడు ఆడమ్ ప్యూరింటన్ ర్చారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిందితుడ్ని జాన్సన్ కౌంటీ డిస్ట్రిక్ట్ కోర్టు జడ్జి సోమవారం విచారించారు. ప్యూరింటన్ పై ఒక ఫస్ట్–డిగ్రీ మర్డర్(హత్య), రెండు ఫస్ట్ డిగ్రీ మర్డర్ అటెంప్ట్(హత్యాయత్నం) కేసులు నమోదైన సంగతి తెలిసిందే. జాన్సన్ కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీ వెల్లడించిన వివరాల ప్రకారం... నేరం రుజువైతే ప్యూరింటన్ కు గరిష్టంగా 50 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశముంది. మరోవైపు, సాక్ష్యాధారాల సేకరణలో స్థానిక పోలీసులకు ఎఫ్‌బీఐ సాయమందిస్తోంది. ఈ హత్యను జాత్యహంకార నేరంగా ఎఫ్‌బీఐ రుజువు చేస్తే ఫెడరల్ అభియోగాల మేరకు ప్యూరింటన్ కు మరణశిక్ష విధించే అవకాశముంది. ప్రస్తుతం అతను జాన్సన్ కౌంటీ జైలులో రిమాండ్‌లో ఉన్నాడు. తెలుగులో మాట్లాడొద్దు: ‘టాటా’ హైదరాబాద్: అమెరికాలో నివసించే తెలుగు ప్రజలు బహిరంగ స్థలాల్లో తెలుగులో మాట్లాడ వద్దని తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (టాటా) సూచించింది. ‘మాతృభాషలో మాట్లాడడాన్ని మనం ఎంతో ఇష్టపడ తాం. కొన్నిసార్లు తప్పుగా అర్థం చేసుకు నే అవకాశముంది. బహి రంగ ప్రదేశాల్లో ఇంగ్లిషులో మాట్లాడండి’ అని ఫేస్బుక్ పేజీలో కోరింది. బహిరంగ ప్రదేశాల్లో ఇతరులతో వాగ్వాదం పెట్టుకోవద్దని సూచించింది. జనసంచారం లేని ప్రాంతాల్నిలక్ష్యంగా చేసుకుంటున్నారని, తప్పనిసరైతే అలాంటి ప్రదేశాలకు ఒంటరిగా వెళ్లవద్దని సూచించింది. -
అమెరికాలో భారతీయుని ఇంటిపై దాడి
పీటన్ : అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జాతివిద్వేష వ్యాఖ్యల నేపథ్యంలో ప్రవాస భారతీయుడు కూచిభొట్ల శ్రీనివాస్ హత్య ఘటన మరువకముందే మరో భారతీయుడి ఇంటిపై దాడి చేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. దక్షిణ కొలరాడోలో జరిగిన ఈ దాడిపై ఎఫ్‌బీఐ దర్యాప్తు మొదలుపెట్టింది. పీటన్ నగరంలోని ఓ భారతీయుడి ఇంటిపై దాడి చేసిన గుర్తుతెలియని వ్యక్తులు అక్కడ దాదాపు 50కి పైగా జాతివిద్వేష పోస్టర్లు అతికించడంతో పాటు, గోడల మీద కోడిగుడ్లు కొట్టారు. గోడలపై కుక్క మలాన్ని పూశారు. తలుపు మీద, కిటికీల మీద, కారు అద్దాల మీద పోస్టర్లు అతికించారు. పోస్టర్లపై ‘గోధుమ వర్ణం వారు, లేదా ఇండియన్లు ఇక్కడ ఉండొద్దు’ అనే రాతలు రాశారు. అయితే.. ఈ దాడికి గురైన భారతీయుడు మాత్రం తన పేరు బయటపెట్టడానికి ఇష్టపడలేదు. అంతేకాదు.. ఎవరో ఒకరిద్దరు మాత్రమే అలా ఉన్నారు తప్ప అమెరికన్లంతా అలాంటివాళ్లు కారని, తన ఇంటి చుట్టుపక్కల వాళ్లంతా తనకు సాయంగా వచ్చి, ఇంటి గోడలను శుభ్రం చేశారని చెప్పారు. కానీ మళ్లీ తన ఇంటిపై ఇలాంటి దాడి జరుగుతుందోమోనన్న ఆందోళన వ్యక్తం చేశారు. గుర్తుతెలియని వ్యక్తులు గుంపుగా వచ్చి దాడి చేసి ఉంటారని ఎఫ్‌బీఐ భావిస్తోంది. అమెరికాలో జాతివిద్వేషంపై మరిన్ని కథనాలు చూడండి... అమెరికాలో జాతి విద్వేష కాల్పులు విద్వేషపు తూటా! మనం అమెరికాకు చెందిన వాళ్లమేనా? భారతీయుల రక్షణకు కట్టుబడి ఉండాలి కాల్పులపై శ్వేతసౌదం ఏం చెబుతుందో? నా భర్త మరణానికి సమాధానం చెప్పాలి ‘తరిమేయండి.. లేదా తలలో బుల్లెట్లు దించండి’ -
మామీద పడి తినొద్దు.. మీ దేశానికి పొండి!
-
మామీద పడి తినొద్దు.. మీ దేశానికి పొండి!
జాతి విద్వేష వ్యాఖ్యలతో కొందరు అమెరికన్ పౌరులు విదేశీయులను తీవ్రంగా అవమానిస్తున్నారు. దీనికి సంబంధించిన ఘటనలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. తాజాగా డల్లస్ కౌంటీ పరిధిలోని ఇర్వింగ్ నగరంలో గల వాల్‌మార్ట్ దుకాణంలో జరిగిన ఓ ఘటన తాలూకు వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా వ్యాపిస్తోంది. తాము కష్టపడి పనిచేసి పన్నులు కడుతుంటే విదేశీయులు తమ మీద పడి బతికేస్తున్నారని, ''మీ సొంత దేశానికి వెళ్లిపోండి'' అని అతగాడు అన్నాడు. వాల్‌మార్ట్ దుకాణంలో పనిచేసే ఆదెలా అనే మహిళ ఎల్ సాల్వెడార్ నుంచి 20 ఏళ్ల క్రితమే వచ్చారు, ఆమెకు అమెరికా పౌరసత్వం కూడా ఉంది. వాల్‌మార్ట్ దుకాణానికి వచ్చిన శ్వేత జాతీయుడు ఆమెతో దురుసుగా మాట్లాడటమే కాక, తనకు సాయం చేయడానికి తెల్లజాతివారే కావాలని అడిగాడు. విషయం ఏమిటంటే.. వాల్ మార్ట్ స్టోర్‌కు వచ్చిన ఆ శ్వేతజాతి కస్టమర్, తన కళ్లద్దాలతో ప్యాకెట్ల మీద ఉన్నవి సరిగా కనిపించడం లేదని చెప్పాడు. దాంతో ఆదెలా ఆయనకు ఒక వైద్యుడిని కలవాల్సిందిగా సూచించారు. అయితే ఆమె సాయం తీసుకోవడానికి నిరాకరించిన అతడు.. తనకు తెల్లవాళ్లే కావాలని చెప్పాడు. దాంతో ఆదెలా మీరు జాతి విద్వేష వ్యాఖ్యలు చేస్తున్నారని అతడికి చెప్పడమే కాక, సూపర్వైజర్కు కూడా తెలియజేసినా, ఆయన కాన్ఫరెన్స్ కాల్లో బిజీగా ఉండటంతో పట్టించుకోలేదు. అంతలో అక్కడే ఎలక్ట్రిక్ వీల్‌చెయిర్‌లో ఉన్న ఓ నల్లజాతి మహిళ గురించి కూడా ఆ శ్వేతజాతీయుడు దారుణమైన వ్యాఖ్యలు చేశాడు. ''ఆమెను చూడండి, ఆమె ఆస్పత్రి బిల్లులు ఎవరు చెల్లిస్తున్నారు, నేనే.. అవును, నేను ఆమె బిల్లులు చెల్లిస్తున్నాను. ఆమె విదేశీయురాలు. ఇక్కడికి వచ్చింది. అనారోగ్యం పాలై బాగా లావెక్కింది. అందువల్ల ఆమె ఏమీ చేయలేదు, పని కూడా చేయలేదు. కానీ నేను ఆమె బిల్లులు చెల్లించాల్సి వస్తోంది. నేనేమైనా లావుగా ఉన్నానా? నేను రోజూ పనికి వెళ్లి, పన్నులు చెల్లిస్తున్నాను. ఆ పన్నులతోనే ఆమెకు చికిత్స జరుగుతోంది'' అన్నాడు. అయితే, తాను కూడా ఉద్యోగం చేసి, పన్నులు చెల్లిస్తున్నానని ఆదెలా అతడికి సమాధానం ఇచ్చారు. కానీ అతడు అక్కడితో ఆగలేదు. ''తెల్లవాళ్లు కష్టపడి పనిచేస్తుంటే విదేశీయులంతా మామీద పడి బతికేస్తున్నారు. అవును. నేను నీకు నిజం చెబుతున్నాను. మీరు ఇక్కడి నుంచి వెళ్లడానికి రాలేదు, ఇక్కడే ఉండిపోతారని నాకు తెలుసు. కానీ మీరు మీ సొంత దేశాలకు వెళ్లిపోయి అక్కడ మీ దేశాలను బాగు చేసుకోండి'' అని వ్యాఖ్యానించాడు. ఆ తర్వాత సూపర్వైజర్ రావడంతో అతడు అక్కడినుంచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత సూపర్వైజర్కు ఆదెలా అతడి సంభాషణ మొత్తాన్ని రికార్డు చేసిన వీడియో చూపించారు. తనకు ఏం చేయాలో తెలియలేదని, ఏడవాలో వద్దో కూడా అర్థం కాలేదని అన్నారు. ఆ శ్వేతజాతీయుడు ఎక్కడున్నాడో వెతికి పట్టుకోవాలని వాల్‌మార్ట్‌లో పనిచేసే ఇద్దరు ఉద్యోగులకు సూపర్వైజర్ చెప్పారు గానీ, అతడు అప్పటికే వెళ్లిపోయాడు. ఇలాంట జాతివివక్షను తాను ఇంతవరకు ఎప్పుడూ ఎదుర్కోలేదని ఆదెలా వాపోయారు. అమెరికాలో జాతివిద్వేషంపై మరిన్ని కథనాలు చూడండి... అమెరికాలో భారతీయులపై మళ్లీ దాడి అమెరికాలో జాతి విద్వేష కాల్పులు విద్వేషపు తూటా! మనం అమెరికాకు చెందిన వాళ్లమేనా? భారతీయుల రక్షణకు కట్టుబడి ఉండాలి కాల్పులపై శ్వేతసౌదం ఏం చెబుతుందో? నా భర్త మరణానికి సమాధానం చెప్పాలి ‘తరిమేయండి.. లేదా తలలో బుల్లెట్లు దించండి’ -
బ్రిటన్‌లో సిక్కు యువకుడిపై జాత్యహంకార దాడి
బ్రిటన్ లో జాత్యహంకారం మరోసారి పేట్రేగింది. బర్మింగ్‌హోమ్‌లోని బోర్డ్ స్ట్రీట్‌లో ఒంటరిగా తనదారిన తాను వెళుతోన్న ఓ సిక్కు యువకుణ్ని కొందరు దుండగులు అటకాయించి తీవ్రంగా గాయపరిచిన ఘటన స్థానిక సిక్కులను తీవ్ర కలవరపాటుకు గురిచేసింది. 'డైలీ సిఖ్ అప్డేట్స్' అనే ఫేస్బుక్ సైట్లో ఉంచిన దాడి తాలుకూ వీడియోల ఆధారంగా బ్రిటన్ పోలీసులు సుమోటోగా కేసు నమోదుచేశారు. ఆదివారం రాత్రి జరిగినట్లుగా భావిస్తున్న ఈ దుశ్చర్యను జాత్యహంకార దాడిగానే భావిస్తున్నామని, అయితే బాధితుడు ఎవరనేది తెలియరాలేదని, ఫిర్యాదు చేసేందుకు ముందుకొస్తే అన్నివిధాలా రక్షణ కల్పిస్తామని మంగళవారం బర్మింగ్ హోమ్ పోలీసులు తెలిపారు.