Radar signals
-
తప్పిన ఘోర ప్రమాదం! ఆలస్యంగా వెలుగులోకి..
బెంగళూరు: బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. రెండు ఇండిగో విమానాలు గాల్లో ఉండగా.. కాస్తలో ఒకదాంతో మరొకటి ఢీ కొట్టే ప్రమాదం తప్పింది. జనవరి 7వ తేదీనే ఈ ఘటన జరిగిందని ఏవియేషన్ రెగ్యులేటర్ డీజీసీఏ సీనియర్ అధికారులు బుధవారం వెల్లడించారు. ఇండిగో విమానం 6ఈ455 (బెంగళూరు నుండి కోల్‌కతా), 6ఈ246 (బెంగళూరు నుండి భువనేశ్వర్) ఉదయం పూట వెళ్తున్న సమయంలో సుమారు 5 నిమిషాల వ్యవధిలో కెంపగౌడ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ రెండు విమానాలు గాల్లో అత్యంత దగ్గరా సమీపిస్తుండగా రాడార్లు హెచ్చరించాయి. దీంతో రెండు విమానాల పైలట్లు వెంటనే అప్రమత్తమై దూరంగా మళ్లించండంతో ఢీకొట్టే ముప్పు తప్పిందని తెలిపారు. ఘటన జరిగినప్పుడు రెండు విమానాలు 3,000 అడుగుల ఎత్తులో ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. బెంగళూరు-కోల్‌కతా విమానంలో 176 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది. బెంగళూరు-భువనేశ్వర్ విమానంలో 238 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది మొత్తం 426 మంది ప్రయాణికులు ఉన్నారని అధికారులు వెల్లడించారు. రెండు విమానాలు గాల్లో ప్రమాదకరంగా అత్యంత సమీపంగా కదులుతున్న సమయంలో అప్రోచ్ రాడార్ కంట్రోలర్ లోకేంద్ర సింగ్ గమనించి.. వెంటనే రెండు విమానాలకు సిగ్నల్ ద్వారా హెచ్చరికలు పంపారు. దీంతో రెండు విమానాలు గాల్లో ఢీకొనకుండా నివారించారని డీజీసీఏ ప్రాథమిక నివేదికలో పేర్కొంది. అయితే ఈ విషయాన్ని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎక్కడా నివేదించలేదని తెలిపారు. దీనిపై డీజీసీఏ చీఫ్ అరుణ్ కుమార్ స్పందిస్తూ.. ఈ ఘటనపై ఏవియేషన్ రెగ్యులేటరీ అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తోందని పేర్కొన్నారు. దీనికి కారణమైనవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. రెండు విమానాలు బెంగళూరు విమానాశ్రయం టేకాఫ్ సమయంలో నిబంధనలు ఉల్లంఘించినట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అధికారులు పేర్కొన్నారు. -
అలారంతో పిల్లల్ని కాపాడుకోవచ్చు!
టొరంటో : షాపింగ్‌కు వెళ్లేటప్పుడు పిల్లలు, ఇతర పెంపుడు జంతువులను కార్లలో తీసుకెళ్లడం ఇటీవల సర్వసాధారణమైపోయింది. అయితే లోపలికి వెళ్లి తొందరగానే వచ్చేస్తాంలే అనే ఆలోచనతో చిన్నారులను, పెంపుడు జంతువులను కొంతమంది కార్లలోనే వదిలివెళుతుంటారు. ఈ క్రమంలో ఒక్కోసారి కార్లు ఆటోమెటిక్ లాక్ అయి ఊపిరి ఆడక ప్రాణాలు పోయే పరిస్థితికి దారి తీస్తుంది. ఇటువంటి ప్రమాదాల బారి నుంచి వారిని రక్షించడానికి టొరంటోకి చెందిన కొందరు శాస్త్రవేత్తలు ఒక కొత్త సెన్సార్‌ను కనుగొన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(ఏఐ- కృత్రిమ మేథ)తో రూపొందిన పరికరానికి రాడార్‌ను జోడించినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. కాగా ఎంతో ప్రయోజనకరమైన ఈ పరికరం మూడు సెంటీమీటర్ డయామీటర్ ప్రేమ్‌గా అరచేతిలో ఇమిడిపోయేంతగా ఉంటుంది. దీనిని వాహన వెనుక అద్దం(రియర్ వ్యూ మిర్రర్) లేదా పైకప్పుకు అతికించవచ్చు. ఇది ఎలా పనిచేస్తుందంటే.. ఎప్పుడైనా వాహనాల్లో పిల్లలు, పెంపుడు జంతువులు చిక్కుకుపోతే.. రాడార్ సిగ్నల్స్.. వారిని తాకి పరావర్తనం చెందినపుడు.. ఏఐ సిస్టమ్ ద్వారా సంకేతాలు ఏర్పడి అలారం మోగుతుంది. కాగా దీనిని 2020 చివరినాటికి అందుబాటులోకి తీసుకురానున్నట్లు శాస్తవేత్తలు తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌కు రాడార్ టెక్నాలజీని జోడించి రూపొందించిన పరికరం ద్వారా వాహనాల్లో చిక్కుకున్న పిల్లల్ని, పెంపుడు జంతువులను కచ్చితంగా కాపాడవచ్చని కెనెడాలోని యూనివర్సిటీ ఆఫ్ వాటర్లూకి చెందిన పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. -
రష్యాలో కూలిన విమానం,71 మంది మృతి
-
గాల్లోనే పేలిపోయిన విమానం.. 71 మంది దుర్మరణం!
మాస్కో: రష్యాలో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. మాస్కోలోని డొమొడెడొవో విమానాశ్రయం నుంచి ఉరల్ పర్వతశ్రేణుల్లోని ఓర్క్స్ పట్టణానికి ఆదివారం బయలుదేరిన ఆంటొనోవ్ ఏఎన్–148 జెట్ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూప్పకూలిపోయింది. దీంతో ఈ విమానంలో ప్రయాణిస్తున్న 71 మంది దుర్మరణం చెందారు. మృతుల్లో ఆరుగురు సిబ్బందితో పాటు 65 మంది ప్రయాణికులు ఉన్నట్లు రష్యా అత్యవసర విభాగం తెలిపింది. సరతోవ్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఈ విమానం మాస్కోకు 80 కి.మీ ఆగ్నేయాన ఉన్న రామెన్స్కీ జిల్లాలోని అర్గునోవో గ్రామం సమీపంలో కూప్పకూలిపోయిందని వెల్లడించింది. ఈ ప్రాంతంలో ఏఎన్–148 విమాన శకలాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయని పేర్కొంది. తీవ్రంగా మంచు కురుస్తుండటంతో దాదాపు 150 మంది సహాయక సిబ్బంది కాలినడకన ప్రమాదస్థలికి చేరుకుంటున్నారు. మరోవైపు విమానం గాల్లోనే కాలిపోతూ కుప్పకూలిపోవడాన్ని తాము చూసినట్లు పలువురు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రమాదస్థలితో పాటు మంచులో చెల్లాచెదురుగా పడిపోయి ఉన్న విమాన శకలాల వీడియోను రష్యా ప్రభుత్వ టీవీ ప్రసారం చేసింది. అయితే విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో పైలట్ అత్యవసర ల్యాండింగ్‌కు ఏటీసీ అనుమతి కోరారని ఓ రష్యన్ వెబ్సైట్ తెలిపింది. టేకాఫ్ తీసుకున్న కొద్దిసేపటికే..సరతోవ్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఆంటొనోవ్ ఏఎన్–148 టేకాఫ్ తీసుకున్న నాలుగు నిమిషాలకే విమానంతో రేడియో సంబంధాలు తెగిపోయాయని రష్యా ఏటీసీ అధికారులు తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం 2.21 గంటలకు బయలుదేరిన విమానం వెయ్యి మీటర్ల ఎత్తుకు చేరుకోగానే రామెన్స్కీ జిల్లా ప్రాంతంలో రాడార్ నుంచి అదృశ్యమైందన్నారు. ఏడాది క్రితం ఈ విమానాన్ని మరో సంస్థ నుంచి సరతోవ్ కొనుగోలు చేసిందన్నారు. విమానంలోని ఓ ఇంజిన్ పేలిపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నామన్నారు. ప్రమాదం ప్రతికూల వాతావరణం కారణంగా జరిగిందా? లేక మానవ తప్పిదమా? అన్న అంశాలను పరిశీలిస్తామని రష్యా రవాణా మంత్రి మాగ్జిమ్ సొకొలొవ్ తెలిపారు. ఈ ప్రమాదంపై రష్యా విచారణ కమిటీ క్రిమినల్ విచారణను చేపట్టిందన్నారు. అర్గునోవో గ్రామం సమీపంలో విమాన శకలాలతో పాటు కొన్ని మృతదేహాలను గుర్తించినట్లు వెల్లడించారు. ఈ విమాన ప్రమాదంలో చనిపోయినవారిలో 60 మంది తమ ప్రాంతానికి చెందినవారేనని ఓరెన్‌బర్గ్ గవర్నర్ ఆవేదన వ్యక్తంచేశారు. మరోవైపు మృతుల కుటుంబ సభ్యులు, స్నేహితులకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంతాపం తెలిపారు. కాలం చెల్లిన విమానాలను వినియోగిస్తుండటంతో రష్యాలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
విమానం అదృశ్యం కలకలం..
కైరో: ఈజిప్టు ఎయిర్ లైన్స్ కు చెందిన ఓ విమానం అదృశ్యమవడం కలకలం సృష్టించింది. రాడార్ నుంచి సంకేతాలు రాకపోవడంతో ఈ విషయం బయటపడింది. ఈజిప్టు ఏయిర్ తమ ట్విట్టర్ ఖాతాలో ఈ విషయాన్ని అధికారికంగా ట్వీట్ చేసింది. ఫాన్స్ రాజధాని పారిస్ నుంచి ఈజిప్టులోని కైరో పట్టణానికి బుధవారం రాత్రి దాదాపు 11 గంటల ప్రాంతంలో బయలుదేరింది. గురువారం ఉదయం 3 గంటలకు కైరోకు చేరుకోవాలి. కానీ విమానం గురించి ఎలాంటి సమాచారం లేదని, విమానం గమ్యస్థానం చేరలేదని ఎయిర్ లైన్స్ అధికారులు తెలిపారు. 59 మంది ప్రయాణికులు, 10 మంది సిబ్బదితో పారిస్ లో నిన్న రాత్రి బయలుదేరిన విమానం ఇప్పటివరకూ గమ్యస్థానాన్ని చేరుకోలేదని సమాచారం అందింది. దాదాపు 2:45 గంటలకు రాడార్ సంకేతాలు అందాయని, మరో 15 నిమిషాల్లో విమాన్యం ల్యాండ్ అవుతుందనగా చివరిసారిగా రాడార్ సిగ్నల్స్ తమకు అందినట్లు ఈజిప్టు ఎయిర్ లైన్స్ వెల్లడించింది. గమ్యస్థానం కేవలం 80 మైళ్ల దూరంలో ఉండగా విమానం సమాచారం నిలిచిపోయింది. ఇప్పటివరకూ ఎలాంటి సమాచారం అందలేదు. An informed source at EGYPTAIR stated that Flight no MS804,which departed Paris at 23:09 (CEST),heading to Cairo has disappeared from radar. — EGYPTAIR (@EGYPTAIR) 19 May 2016 -
ఎయిర్‌ఫోర్స్ రాడార్ కేంద్రానికి భూమి అప్పగింత
పొదలకూరు: శ్రీపొట్టి శ్రీరామలు నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలోని మరుపూరు వద్ద భారత వైమానిక దళానికి 63.6 ఎకరాల భూమిని రెవెన్యూ అధికారులు బుధవారం అప్పగించారు. స్థానిక రెవెన్యూ కార్యాలయంలో తహశీల్దారు వి.కృష్ణారావు చెన్నై వైమానిక స్థావరం వింగ్ కమాండర్ మణికి స్వాధీన పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మణి మాట్లాడుతూ... శత్రుదేశాల నుంచి ముప్పును పసిగట్టేందుకు మరుపూరు వద్ద రాడార్‌కు సిగ్నల్స్ బాగా అందుతుండటంతో నిఘా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు.