
ఎయిర్‌ఫోర్స్ రాడార్ కేంద్రానికి భూమి అప్పగింత
పొదలకూరు: శ్రీపొట్టి శ్రీరామలు నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలోని మరుపూరు వద్ద భారత వైమానిక దళానికి 63.6 ఎకరాల భూమిని రెవెన్యూ అధికారులు బుధవారం అప్పగించారు. స్థానిక రెవెన్యూ కార్యాలయంలో తహశీల్దారు వి.కృష్ణారావు చెన్నై వైమానిక స్థావరం వింగ్ కమాండర్ మణికి స్వాధీన పత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా మణి మాట్లాడుతూ... శత్రుదేశాల నుంచి ముప్పును పసిగట్టేందుకు మరుపూరు వద్ద రాడార్‌కు సిగ్నల్స్ బాగా అందుతుండటంతో నిఘా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు.