
విమానం అదృశ్యం కలకలం..
కైరో: ఈజిప్టు ఎయిర్ లైన్స్ కు చెందిన ఓ విమానం అదృశ్యమవడం కలకలం సృష్టించింది. రాడార్ నుంచి సంకేతాలు రాకపోవడంతో ఈ విషయం బయటపడింది. ఈజిప్టు ఏయిర్ తమ ట్విట్టర్ ఖాతాలో ఈ విషయాన్ని అధికారికంగా ట్వీట్ చేసింది. ఫాన్స్ రాజధాని పారిస్ నుంచి ఈజిప్టులోని కైరో పట్టణానికి బుధవారం రాత్రి దాదాపు 11 గంటల ప్రాంతంలో బయలుదేరింది. గురువారం ఉదయం 3 గంటలకు కైరోకు చేరుకోవాలి. కానీ విమానం గురించి ఎలాంటి సమాచారం లేదని, విమానం గమ్యస్థానం చేరలేదని ఎయిర్ లైన్స్ అధికారులు తెలిపారు.
59 మంది ప్రయాణికులు, 10 మంది సిబ్బదితో పారిస్ లో నిన్న రాత్రి బయలుదేరిన విమానం ఇప్పటివరకూ గమ్యస్థానాన్ని చేరుకోలేదని సమాచారం అందింది. దాదాపు 2:45 గంటలకు రాడార్ సంకేతాలు అందాయని, మరో 15 నిమిషాల్లో విమాన్యం ల్యాండ్ అవుతుందనగా చివరిసారిగా రాడార్ సిగ్నల్స్ తమకు అందినట్లు ఈజిప్టు ఎయిర్ లైన్స్ వెల్లడించింది. గమ్యస్థానం కేవలం 80 మైళ్ల దూరంలో ఉండగా విమానం సమాచారం నిలిచిపోయింది. ఇప్పటివరకూ ఎలాంటి సమాచారం అందలేదు.
An informed source at EGYPTAIR stated that Flight no MS804,which departed Paris at 23:09 (CEST),heading to Cairo has disappeared from radar.
— EGYPTAIR (@EGYPTAIR) 19 May 2016