
రష్యా విమానానికి తప్పిన ప్రమాదం
ఈజిప్టు నుంచి రష్యా వెళ్తున్న విమానం ఒకటి కాసేపు గల్లంతు కావడంతో ఒక్కసారిగా అంతటా ఆందోళన నెలకొంది. అయితే కాసేపటి తర్వాత అది సురక్షితంగా ఈజిప్టు ఆకాశమార్గాన్ని దాటి వెళ్లిందని ఈజిప్షియన్ అధికారులు చెప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
విమానంలో అందులో దాదాపు 212 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు. రష్యాకు చెందిన ఈ విమానం ఈజిప్టులోని సినాయ్ ద్వీపకల్పం మీదుగా వెళ్తుండగా ఈజిప్టుకు చెందిన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ పరిధిలోకి ఈ విమానం సిగ్నల్స్ కాసేపు అందలేదు. దాంతో విమానం గల్లంతైనట్లే అందరూ భావించారు. అయితే కాసేపటి తర్వాత మళ్లీ విమానం సురక్షితమేనని ఈజిప్షియన్ అధికారుల నుంచి సమాచారం వచ్చింది.