Radical
-
మూడు చక్రాల వింత వాహనం: ఇలాంటిది మీరెప్పుడూ చూసుండరు (ఫోటోలు)
-
మలేరియాకు ర్యాడికల్ చికిత్స!
మళ్లీ మళ్లీ జ్వరం వస్తుండటం ఎందుకంటే... మలేరియా అనేది ప్రోటోజోవా అనే విభాగానికి చెందిన ఏకకణ జీవి అయిన ‘ప్లాస్మోడియమ్’ కారణంగా వస్తుంది. మళ్లీ ఇందులోనూ కొన్ని రకాలు ఉంటాయి. ఉదాహరణకు ప్లాస్మోడియమ్ వైవాక్స్, ప్లాస్మోడియమ్ ఓవ్యూల్. మిగతా రకాలు ఎలా ఉన్నా... ఇవి మాత్రం చికిత్స తర్వాత... మందులకు దొరికి నశించిపోకుండా ఉండేందుకు వెళ్లి కాలేయంలో దాక్కుంటాయి. ఒకవేళ ఇవి అక్కడ దాక్కుని ఉంటే... చికిత్స తర్వాత కొన్ని రోజులకూ లేదా కొన్ని నెలలకు సైతం మళ్లీ మళ్లీ జ్వరం తిరగబెడుతూ ఉంటుందన్నమాట. అందుకే దాన్ని పూర్తిగా తొలగించేలా చేయడానికే ఈ ‘ర్యాడికల్ చికిత్స’ అవసరమన్నమాట. మలేరియా వచ్చినప్పుడు కొంతమంది ప్రాథమికంగా చికిత్స తీసుకుని తగ్గగానే దాని గురించి మరచిపోతారు. నిజానికి మలేరియా తగ్గాక కూడా ఆ జ్వరానికి ‘ర్యాడికల్ ట్రీట్మెంట్’ అనే చికిత్స తీసుకోవాలి. అంటే శరీరంలోని మలేరియల్ ఇన్ఫెక్షన్ను పూర్తి స్థాయిలో తీసివేయడమన్నమాట. సాధారణంగా మలేరియా జ్వరం తగ్గిన రెండు వారాల పాటు ఈ చికిత్సను కొనసాగించాల్సి ఉంటుంది. లేకపోతే మలేరియా జ్వరం మళ్లీ రావచ్చు. మరప్పుడు ఏం చేయాలి? మలేరియా వచ్చాక అది ప్లాస్మోడియమ్ వైవాక్స్, ప్లాస్మోడియమ్ ఓవ్యూల్ రకానికి చెందిందా కాదా అని తెలుసుకోవడం కోసం ‘బ్లడ్ స్మియర్’ను మైక్రోస్కోప్ కింద పరీక్షించాల్సి ఉంటుంది. బాధితుడికి ప్లాస్మోడియమ్ వైవాక్స్ ఉందని తెలిశాక, వాస్తవానికి అతడికి ‘ప్రైమాక్విన్’ అనే మందును 14 రోజుల పాటు ఇవ్వాలి. అయితే వాళ్లలో ‘జీ6పీడీ’లోపం ఉంటే అలాంటివాళ్లకు ప్రైమాక్విన్ మందు ఇవ్వకూడదు. ఆ లోపం ఉందా లేదా అని తెలుసుకునేందుకు ‘జీ6పీడీ’ అనే పరీక్ష నిర్వహించి, లోపం లేనివాళ్లకు మాత్రమే ప్రైమాక్విన్ మందు ఇవ్వాల్సి ఉంటుంది. అలా మందును నిర్ణీత కాలంపాటు బాధితుడికి ఇచ్చి... అతడిలోనుంచి మలేరియాను సమూలంగా తొలగిపోయేలా చేయాలి. దీన్నే ‘ర్యాడికల్ ట్రీట్మెంట్’ అంటారు. డాక్టర్ జి. నవోదయ సీనియర్ ఫిజీషియన్, జనరల్ మెడిసిన్ -
ఉగ్రవాదం పై ఉక్కుపాదం
-
భవిష్యం బుధవారం(10-12-2014)
మేషం: పనుల్లో ఆటంకాలు. వ్యయప్రయాసలు. ఆరోగ్య సమస్యలు. బంధువులతో మాటపట్టింపులు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి,వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. వృషభం: చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. విందువినోదాలు. విద్య, ఉద్యోగావకాశాలు. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం. మిథునం: మిత్రులతో వివాదాలు. ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. ఆధ్యాత్మిక చింతన. అనారోగ్యం. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు పెరుగుతాయి. దూరప్రయాణాలు. కర్కాటకం: శ్రమ ఫలిస్తుంది. నూతన విద్యావకాశాలు. స్థిరాస్తి వివాదాల పరిష్కారం. ఇంటిలో శుభకార్యాలు. ఆర్థికాభివృద్ధి. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. సింహం: వ్యవహారాలు ముందుకు సాగవు. ఆర్థిక ఇబ్బందులు. రుణాలు చేస్తారు. అనుకోని ప్రయాణాలు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపార, ఉద్యోగాలలో మార్పులు. ధనవ్యయం. కన్య: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. ఆస్తిలాభం. ఉద్యోగయత్నాలు కలిసివస్తాయి. వ్యాపార,ఉద్యోగాలలో అనుకూలత. తుల: నూతన ఉద్యోగయోగం. పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయం. శుభవార్తలు. ఆర్థిక ప్రగతి. భూములు, వాహనాలు కొంటారు. వ్యాపార, ఉద్యోగాలలో పురోగతి. వృశ్చికం: బంధువులు, మిత్రులతో మాటపట్టింపులు. ధనవ్యయం. శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. ఆస్తి వివాదాలు. వ్యాపార, ఉద్యోగాలలో మార్పులు ఉండవచ్చు. నిరుద్యోగులకు నిరుత్సాహం. ధనుస్సు: ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక ఇబ్బందులు. ప్రయాణాలలో మార్పులు. మిత్రులతో విభేదాలు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. మకరం: కొత్త పనులకు శ్రీకారం. శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. విద్యార్థులకు అంచనాలు నిజమవుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం. కుంభం: పాతమిత్రుల కలయిక. విందువినోదాలు. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు వస్తాయి. భూములు, వాహనాలు కొంటారు. వ్యాపార, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. మీనం: పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. బంధువులతో వివాదాలు. అనారోగ్యం. ఆకస్మిక ప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. - సింహంభట్ల సుబ్బారావు -
ఉమన్ విత్ నో మనీ..!
స్ఫూర్తి ఒక్కసారిగా ప్రపంచ ‘ఆర్థిక వ్యవస్థ’ కుప్పకూలితే... అసలు ద్రవ్యమానం అనే దానికి చెల్లుబడి లేకుండా పోతే.. ఏదీ కొనే పరిస్థితి, అమ్మే పరిస్థితి లేకపోతే... అప్పుడు మనిషి ఎలా బతుకుతాడు, కొనడం, అమ్మడం అనే ప్రక్రియ లేకపోతే మనిషి జీవితం ఎలా ఉంటుంది? అనే సందేహం వచ్చింది 30 ఏళ్ల గ్రేటా టౌబర్ట్కు. అయితే గొప్ప ఆర్థికవేత్తలతో సహా అనేక మంది ఆమెకు వచ్చిన సందేహానికి సమాధానాన్ని చెప్పలేక నీళ్లు నమిలారు. దాంతో తనే సొంతంగా ఆ అంశం గురించి అధ్యయనం చేయాలనుకొంది గ్రేటా. డబ్బు లేకపోతే... అనేది తన సందేహం కాబట్టి... తను దేన్నీ డబ్బుతో ‘కొనకూడదు’ అని నిర్ణయించుకొంది. అంటే ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకొనే వరకూ అవి నిత్యావసరాలు అయినా... అత్యవసరాలు అయినా... దేనినీ కొనకూడదు! వీలైతే తయారు చేసుకోవడం, లేకపోతే సెలైంట్‌గా ఉండటం. ఈ ప్లాన్ ప్రకారం బతకాలని ప్రణాళిక రచించుకొంది. అందుకు తగ్గట్టుగా సెకండ్ హ్యాండ్ బట్టలమ్మే ఒక షాప్‌ను సందర్శించి, వాళ్లకు తను తయారు చేసిన కాంపోస్టు ఎరువును ఇచ్చి బట్టలు తెచ్చుకొంది. అలాగే టూత్ పేస్ట్‌ల దగ్గర నుంచి ఫేస్‌క్రీమ్‌ల వరకూ అన్నింటినీ అందుబాటులో ఉన్న వాటితోనూ, వస్తుమార్పిడి ద్వారా కొనుక్కోదగిన వాటితోనూ సమకూర్చుకుంది. ఈ విధంగా ఏడాది పాటు గడిపేసిందామె. డబ్బు అనేది ఖర్చు చేయకుండా ఆమె కొనసాగించిన జీవనశైలిని, పైసా ఖర్చు చేయకుండానే తూర్పు జర్మనీలోని తన ఊరి నుంచి 1,700 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి బార్సిలోనా చేరుకొన్న విధానం గురించి పూర్తి వివరాలను గ్రంథస్థం చేసింది.‘అపోకలిప్స్ జెట్జ్’ పేరుతో ఆ పుస్తకాన్ని విడుదల చేసింది. ఇదిగాక ఏడాది పాటు అందరికీ భిన్నంగా గడపడం ద్వారా సాధించింది ఏమిటి? అని ప్రశ్నిస్తే.. ‘‘ఎన్నో పాఠాలు’’ అని చెబుతుందామె. ఈ ప్రయాణంలో తన మదిలో జరిగిన చింతనతో ఆహార వృథాపై ఆందోళన తలెత్తిందని ఆమె చెబుతోంది. ఆర్థికమాంద్యంతో అల్లాడుతున్న దేశాలు కూడా ఇంకా ఆహార వృథాను అరికట్టడం లేదని, ప్రపంచానికి ఇదే పెనుప్రమాదం అవుతుందని అభిప్రాయపడింది. ఆమె చెప్పిన మరో విషయం ఏమిటంటే.. ప్రస్తుతం సమాజంలో డబ్బు ఖర్చు పెట్టకుండా బతకడం అనేది చాలా కష్టమైన పని, అలా ‘రాడికల్’గా బతకడం ఎక్కువ కాలం సాధ్యమయ్యే పని కాదు... వృథా ఖర్చు, ఆ ఖర్చు ద్వారా వనరులను వృథా చేయకుండా మాత్రం జీవితాంతం బతకగలనని విశ్వాసం వ్యక్తం చేసింది!