Raghava Reddy Konda
-
వైఎస్సార్ సీపీ జిల్లా ఇన్‌చార్జీగా రాఘవరెడ్డి
నిజామాబాద్ : జిల్లాలో పార్టీ బలోపేతంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దృష్టి సారించింది. ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు సోమవారం జిల్లా ఇన్చార్జీల నియామకం చేపట్టారు. నిజామాబాద్ జిల్లా ఇన్‌చార్జీగా కొండా రాఘవరెడ్డిని నియమించినట్లు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డా.గట్టు శ్రీకాంత్‌రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన రాఘవరెడ్డి పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు. అలాగే వైఎస్సార్ సీపీ నిజామాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ కో–ఆర్డినేటర్లగా నాయుడు ప్రకాష్‌ను నియమించినట్లు గట్టు శ్రీకాంత్‌రెడ్డి ప్రకటించారు. -
హరీశ్ రాజీనామా చేయాలి
♦ మంత్రిగా ఉండి బెదిరింపులా..: వైఎస్సార్సీపీ ♦ ఏపీ ప్రయోజనాల కోసం జగన్ దీక్ష చేస్తున్నారు ♦ వీలైతే ఆయన అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పండి ♦ అంతేగానీ దబాయింపులకు దిగడమేమిటని ప్రశ్న ♦ వైఎస్సార్సీపీ కార్యాలయాలపై దాడులను ఖండించిన ♦ నల్లా సూర్యప్రకాశ్, కొండా రాఘవరెడ్డి సాక్షి, హైదరాబాద్: ప్రాజెక్టులు, నీటి వినియోగంపై తమ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి సంధించిన ప్రశ్నలకు రాష్ట్ర ప్రభుత్వం, మంత్రి హరీశ్‌రావు సమాధానం చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కమిటీ డిమాండ్ చేసింది. జగన్ లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా... మానుకోట చేస్తా అంటూ హరీశ్‌రావు బెదిరింపులకు దిగడమేమిటని నిలదీసింది. మంత్రి హోదాలో ఉండి శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా హెచ్చరికలు చేస్తున్న హరీశ్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. మంగళవారం హైదరాబాద్‌లోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లా సూర్యప్రకాశ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండా రాఘవరెడ్డి విలేకరులతో మాట్లాడారు. వైఎస్సార్ హయాంలో ప్రారంభించిన ప్రాజెక్టులపై శ్వేతపత్రం విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వైఎస్ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వాలు, గత రెండేళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టుల కోసం ఎంత బడ్జెట్ విడుదల చేశాయో ప్రకటించాలన్నారు. మహబూబ్‌నగర్‌లో పార్టీ కార్యాలయంపై దాడిని, హైదరాబాద్‌లో పలు చోట్ల వైఎస్సార్సీపీ జెండా గద్దెలను ధ్వంసం చేయడాన్ని ఖండించారు. ఈ ఘటనలకు బాధ్యులైన వారి పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాచరికం అనుకుంటున్నారా?: నల్లా ‘సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావులు రాష్ట్రంలో రాచరిక వ్యవస్థ కొనసాగుతున్నదని అనుకుంటున్నారా? తామేమైనా అభినవ నిజాం నవాబు అనుకుంటున్నారా..’ అని నల్లా సూర్యప్రకాశ్ ప్రశ్నించారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసి మంత్రి అయిన హరీశ్‌రావు రాజకీయ విలువలకు తిలోదకాలిచ్చి మానుకోట పునరావృతమవుతుందంటూ హెచ్చరికలు చేయడం... రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమేనని మండిపడ్డారు. హరీశ్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తమ ప్రాంత ప్రయోజనాల పరిరక్షణకు జగన్ దీక్ష చేస్తుంటే.. ఆయన లేవనెత్తుతున్న ప్రశ్నలకు జవాబు చెప్పకుండా రెచ్చగొట్టే ప్రకటనలు చేయడమేమిటని నిలదీశారు. మహబూబ్‌నగర్‌లో వైఎస్సార్సీపీ కార్యాలయంపై దాడి, జెండా గద్దెల కూల్చివేతను ఖండించారు. వైఎస్ చేపట్టిన ప్రాజెక్టులపై శ్వేతపత్రం ఇవ్వాలి: రాఘవరెడ్డి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో చేపట్టిన ప్రాజెక్టులపై శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కొండా రాఘవరెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణలో వైఎస్ ప్రారంభించిన 36 ప్రాజెక్టుల్లో ఆరు పూర్తికాగా, 9 నిర్మాణదశలో ఉన్నాయని.. 21 ప్రాజెక్టులు పాక్షికంగా పూర్తయ్యాయన్నారు. ఇప్పుడు రూ.10వేల కోట్లు కేటాయిస్తే వాటన్నింటినీ పూర్తి చేసి ఏకంగా 49 లక్షల ఎకరాలకు అదనంగా సాగునీరు ఇవ్వొచ్చన్నారు. కానీ అవి పూర్తయితే వైఎస్‌కు పేరు వస్తుందన్న ఉద్దేశంతోనే పక్కన పెట్టారని ఆరోపించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టుల వల్ల ఏపీకి నష్టం జరుగుతుందని జగన్ దీక్ష చేస్తున్నారని... ఆయన లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానమివ్వకుండా మానుకోట పునరావృతం అవుతుందంటూ హరీశ్ హెచ్చరికలు చేయడం సరికాదని పేర్కొన్నారు. వీలైతే జగన్ ప్రశ్నలకు సమాధానాలివ్వాలని.. అలాగాకుండా ఏవేవో మాట్లాడడం సమంజసం కాదన్నారు. పచ్చకామెర్ల రోగులకు లోకమంతా పచ్చగా కనిపిస్తుందన్నట్లుగా టీఆర్ఎస్ నాయకులు ప్రవర్తిస్తున్నారని రాఘవరెడ్డి విమర్శించారు. ఏ ఎన్నికలు వచ్చినా మొత్తం మంత్రులు, ఎమ్మెల్యేలు దిగిపోయి, డబ్బు వెదజల్లి గెలిచే ప్రయత్నం చేస్తున్నారని ఒక ప్రశ్నకు సమాధానంగా వ్యాఖ్యానించారు. సోమవారం జేఏసీ పేరిట కొందరు హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంపై దాడికి ప్రయత్నించడాన్ని ఖండించారు. తెలంగాణ ప్రయోజనాలకు భంగం కలిగితే.. తాము ముందుండి అఖిలపక్షంతో కలసి ప్రభుత్వానికి అండగా నిలుస్తామని చెప్పారు. -
అటకెక్కిన సంక్షేమ పథకాలు
వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి సాక్షిప్రతినిధి, ఖమ్మం: దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి కాంగ్రెస్ పాలనలో ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్, పింఛన్లు, రేషన్, 108, 104, ఇంది రమ్మ ఇళ్ల పథకాలను ఈ ప్రభుత్వం అటకెక్కించిందని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతి నిధి కొండా రాఘవరెడ్డి విమర్శించారు. ఖమ్మంలోని ప్రెస్‌క్లబ్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కమీషన్లు దండుకోవడానికే సీఎం కేసీఆర్ ప్రాజెక్టులకు రీ డిజైన్ చేయిస్తున్నారని, రాష్ర్టంలో ఈ రెండేళ్లలో ఒక్క ప్రాజెక్టునైనా పూర్తిచేసి సాగునీటిని అందించారా? అని ప్రశ్నించారు. మాటల గారడీ చేస్తూ.. పూటకోమాట చెబుతున్న కేసీఆర్ పాలనకు కాలం చెల్లే రోజులు దగ్గర పడ్డాయన్నారు. ఒక్క సంక్షేమ పథకం కూడా క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదని, ఇప్పటికే ప్రజల్లో దీనిపై నిరసనలు వ్యక్తం అవుతున్నాయన్నారు. ఇప్పుడు కొత్త జిల్లాలంటూ మళ్లీ ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. ముందుగా జలయజ్ఞంలో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని డిమాం డ్ చేశారు. మంత్రి తుమ్మల ఏనాడూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదని, తుమ్మలను పాలేరు ఎన్నికలో పోటీలోకి దించడాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారన్నారు. వైఎస్సార్ సీపీ, టీడీపీ మద్దతునిచ్చిన కాంగ్రెస్ అభ్యర్థి రాంరెడ్డి సుచరితారెడ్డి విజయం ఖాయమన్నారు. -
నేడు చేవెళ్లలో..వైఎస్సార్సీపీ సమావేశం
చేవెళ్ల: ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలుచేయలేక టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతూ కాలయాపన చేస్తోందని వైఎస్సార్ సీపీ కేంద్ర కమిటీ సభ్యులు కొండా రాఘవరెడ్డి అన్నారు. చేవెళ్లలో ఆదివారం జరుగనున్న వైఎస్సార్ సీపీ జిల్లా విస్తృతస్థాయి సమావేశం ఏర్పాట్లను ఆయన శనివారం పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందని చెప్పారు. వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు.. అడిగిన ప్రతి ఒక్కరికీ పింఛన్లు పంపిణీ చేశారని పేర్కొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం అర్హుల పేరిట గ్రామానికి 100 నుంచి 200 పింఛన్లు తొలగించిందని ఆరోపించారు. సర్వేల పేరుతో కాలయాపన చేయడమే తప్ప ఆచరణలో ప్రజలకు ఈ ఆరునెలల కాలంలో ప్రభుత్వం చేసిందేమీ లేదని పేర్కొన్నారు. తెల్లరేషన్‌కార్డులను ఏరివేసే పనిలో కూడా అధికార యంత్రాంగం నిమగ్నమైందని, సుమారుగా 30శాతం వరకు ఆ కార్డులను ప్రభుత్వం తొలగిస్తోందని ప్రజలే చెబుతున్నారని స్పష్టంచేశారు. ప్రజాసమస్యలపై పోరాటం కోసమే తెలంగాణలోని ప్రతి జిల్లాలో వైఎస్సార్ సీపీ సమావేశాలు నిర్వహిస్తున్నదని వివరించారు. తెలంగాణలో మొదట చేవెళ్లలో వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ విస్తృత సమావేశాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. చేవెళ్ల సభకు పార్టీ శ్రేణులు, వైఎస్సార్ అభిమానులు పెద్దఎత్తున తరలిరావాలని కొండా రాఘవరెడ్డి కోరారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు మహిపాల్‌రెడ్డి, అమృతాసాగర్, పి.నాగిరెడ్డి, ఎం.రాజయ్య, పుష్పలత, ఎండీ ఖాజాపాష, జగన్, కంజర్ల శివయ్య, మోహన్‌కుమార్, శ్రీకాంత్, సంతోష్, తదితరులు పాల్గొన్నారు. ఏర్పాట్ల పరిశీలన... చేవెళ్లలో ఆదివారం నిర్వహిస్తున్న జిల్లా విస్తృతస్థాయి సమావేశానికి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. కేంద్ర కమిటీ నాయకులు కొండా రాఘవరెడ్డి ఆధ్వర్యంలో నాయకులు మహిపాల్‌రెడ్డి, నాగిరెడ్డి, అమృతాసాగర్, ఎం.రాజయ్య తదితరులు ఏర్పాట్లను పరిశీలించారు. హైదరాబాద్ నగరం నుంచి మొయినాబాద్ మీదుగా చేవెళ్లవరకు దారిపొడవునా భారీ ఫ్లెక్సీలు, కటౌట్లు, బ్యానర్లు, పోస్టర్లను ఏర్పాటుచేస్తున్నారు. తెలంగాణ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు ఉదయం 9 గంటలకు నాంపల్లి దర్గాలో ప్రార్థనలు చేసి బయలుదేరుతారు. మార్గమధ్యంలో బండ్లగూడ వద ్దగల ఆర్మీమైసమ్మ దేవాలయం, చిలుకూరు బాలాజీ దేవాలయంలో పూజలు, మొయినాబాద్ చర్చిలో ప్రార్థనలు చేసి చేవెళ్లకు చేరుకొని సమావేశంలో పాల్గొంటారు. -
తెలంగాణలో వైఎస్సార్ కాంగ్రెస్‌ను బలోపేతం చేస్తాం
వికారాబాద్: తెలంగాణలోని 10 జిల్లాలకు సంబంధించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ఈ నెల 9న చేవెళ్లలో నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర నాయకులు కొండా రాఘవరెడ్డి పేర్కొన్నారు. గురువారం స్థానిక అతిథి గృహంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లేదని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికీ తెలంగాణలోని ప్రతి గ్రామంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ అభిమానులున్నారని, వైఎస్ఆర్ అడుగుజాడల్లోనే తమ పార్టీ నడుస్తుందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పునరువైభవాన్ని సంతరించుకునే రోజులు వస్తాయని స్పష్టం చేశారు.తెలంగాణ ప్రాంతంలో ఏ రాజకీయ నాయకుడికీ లేనంత ఆదరణ వైఎస్ఆర్కు ఉందని, ఆ మహానేత ఆశయాలను వైఎస్ జగన్మోహ న్‌రెడ్డి సాధిస్తారనే నమ్మకం ప్రజల్లో బలంగా ఉన్నట్లు చెప్పారు. రాష్ట్రంలో జనవరి నెలలో వైఎస్ఆర్ తనయురాలు, పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల పర్యటించనున్నట్లు చెప్పారు. తెలంగాణలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పునర్వైభవం సాధించే రోజులు త్వరలోనే వస్తాయన్నారు. 9న చేవెళ్లలో నిర్వహించే సమావేశానికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతున్నట్లు చెప్పారు. ఉదయం 11 గంటలకు నిర్వహించే ఈ సమావేశానికి పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో హాజరు కావాలని కోరారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమ పథకాలను తుంగలో తొక్కిందన్నారు. అర్హులను కూడా అనర్హులుగా ప్రకటించి సంక్షేమ పథకాలకు దూరం చేస్తోందని ఆరోపించారు. ప్రజల పక్షాన పోరాడం చేయడానికి తమ పార్టీ అన్ని వేళలా ముందుంటుందన్నారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు నాగరాజు, గోవర్ధన్‌రెడ్డి, మురళీధర్‌రెడ్డి, శంకర్, రమేష్, ఎన్నెపల్లి గోపాల్, బెనర్జీ, రాంరెడ్డి, రాఘవరెడ్డి, చారి తదితరులు పాల్గొన్నారు. -
9న ‘చలో చేవెళ్ల’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని వైఎస్సార్ సీపీ జిల్లా విస్తృత స్థాయి సమావేశాలు ఈ నెల 9వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు కొండా రాఘవరెడ్డి వెల్లడించారు. మంగళవారం హైదరాబాద్‌లోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ రంగారెడ్డి జిల్లా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ‘చలో చేవెళ్ల’ వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం కొండా రాఘవరెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో వైఎస్సార్ సీపీ జిల్లా సమావేశాలను చేవెళ్ల నుంచి ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. దివంగత నేత వైఎస్సార్ ఏ కార్యక్రమం చేపట్టినా నాంపల్లి దర్గాలో ప్రార్థన చేసిన అనంతరం రాజేందనగర్ ఆరే మైసమ్మ గూడిలో పూజలు, చిలుకూరి బాలాజీ ఆలయంలో 11 ప్రదక్షిణలు, మెయినాబాద్ చర్చిలో ప్రార్థనలుచేసి చేవెళ్లలో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టేవారన్నారు. ఆయన బాటలోనే తెలంగాణ వైఎస్సార్ సీపీ కూడా పయణిస్తుందన్నారు. జిల్లా విస్తృత సమావేశం 9వ తేదీ ఉదయం 11.30కు చేవెళ్లలోని కేజీఆర్ ఫంక్షన్హాల్లో ప్రారంభమవుతుందని చెప్పారు. అటు తర్వాత తెలంగాణ రాష్ట్రంలోని మిగితా జిల్లాల సమావేశాలు నిర్ణీత తేదీల్లో కొనసాగుతాయన్నారు. వైఎస్సార్ సీపీ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమావేశాలను ప్రారంభిస్తారన్నారు. మొదట చేవెళ్లలో వైఎస్ విగ్రహానికి పూల మాల వేసి పార్టీ జెండాను ఎగురవేస్తారని, అనంతరం కేజీఆర్ ఫంక్షన్ హాల్ వరకు ర్యాలీ నిర్వహిస్తామని చెప్పారు. వైఎస్సార్ అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కార్పొరేటర్ సురేష్‌రెడ్డి, పార్టీ నాయకులు ఏనుగు మహిపాల్ రెడ్డి, ముస్తాఫా అహ్మద్, సూర్యనారాయణరెడ్డి, అమృతాసాగర్, కుసుమ కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వారసుల పోరు!
రాష్ట్ర రాజకీయాల్లో చేవెళ్ల పార్లమెంటు స్థానానికి ప్రత్యేకత ఉంది. ఒకవైపు ఆధునిక నగరం.. మరోవైపు గ్రామీణ ప్రాంతం. పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లోని మూడింట్లో నగర వాతావరణం ప్రతిబింబిస్తుండగా.. మరో నాలుగింట్లో పల్లె సంస్కృతి సాక్షాత్కరిస్తుంది. విభిన్న జీవనశైలులు, ఆలోచన ధోరణులు, అవసరాలు కలిగిన ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపుతారో విశ్లేషకుల అంచనాలకు కూడా అందడంలేదు. రాజకీయ చరిత్ర తక్కువే అయినా.. చేవెళ్లకు అరుదైన ఘనత దక్కింది. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2009లో చేవెళ్ల లోక్‌సభ స్థానం ఏర్పడింది. ఎన్నికలు జరిగిన తొలిసారే కేంద్ర కేబినెట్లో చోటు దక్కించుకుంది. తొలి ఎన్నికలో కేంద్ర మంత్రి సూదిని జైపాల్‌రెడ్డి విజయం సాధించారు. ఈసారి ఆయన సొంత జిల్లా పాలమూరులో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గం బలాబలాలు: అనుకూలం - కుటుంబానికి క్షేత్రస్థాయిలో పరిచయాలు - ప్రధాన ప్రత్యర్థి టీడీపీ బలహీనపడడం - తెలంగాణ ఇచ్చామనే సానుభూతి - బలమైన సామాజిక వర్గం అండ ప్రతికూలం - కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు - ప్రత్యర్థులు బలంగా ఉండడం - పట్టణ ప్రాంత ఓటర్లలో ప్రతికూలత - అవినీతి ఆరోపణలు - సొంత పార్టీలోనే వైరివర్గం అనుకూలం - పార్టీ సంప్రదాయ ఓటింగ్, తండ్రి దేవేందర్‌గౌడ్‌కు ఉన్న విస్తృత పరిచయాలు - కాంగ్రెస్‌పై ప్రజా వ్యతిరేకత - బీసీ ఓటర్లు అధికసంఖ్యలో ఉండడం - పటణాల్లో బలంగా ఉన్న బీజేపీతో జతకట్టడం ప్రతికూలం - కీలక నేతలంతా పార్టీని వీడడం - తమకు పట్టున్న ప్రాంతాల్లో టీఆర్ఎస్ బలోపేతం కావడం - బీజేపీ పొత్తుతో మైనార్టీ ఓటర్లకు దూరం - తెలంగాణ వ్యతిరేక ముద్ర అనుకూలం - జిల్లాలో కొండా కుటుంబానికున్న ప్రాధాన్యం - తెలంగాణ సెంటిమెంటు - ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీలో చేరడం - ఆర్థికంగా సంపన్నుడు కావడం ప్రతికూలం - సంస్థాగతంగా పార్టీ నిర్మాణం లేకపోవడం - కేవలం తెలంగాణ సానుభూతినే నమ్ముకోవడం - రాజకీయాలలో అనుభవలేమి - సీమాంధ్ర ఓటర్లు అధికంగా ఉండడం - తెలుగుపై పట్టులేకపోవడం, భావ వ్యక్తీకరణలో తడబాటు నే.. గెలిస్తే పట్లోళ కార్తీక్‌రెడ్డి(కాంగ్రెస్) - గ్రామీణ పట్టణ ప్రాంతాలకు వేర్వేరు మేనిఫెస్టోలు అమలు చేస్తా - మౌలిక వసతుల నిర్వహణపై ప్రత్యేక దృష్టి చేవెళ్ల-ప్రాణహిత ప్రాజెక్టు పూర్తికి కృషి - మారుమూల ప్రాంతాలను శివార్లకు ధీటుగా అభివృద్ధి చేస్తా తూళ్ల వీరేందర్‌గౌడ్ (టీడీపీ) - హైదరాబాద్‌లో ఉన్న జిల్లా కేంద్రాన్ని తరలిస్తా - వికారాబాద్ కేంద్రంగా కొత్త జిల్లాను ఏర్పాటు చేస్తా - హైటెక్ సిటీ తరహాలో ఇతర ప్రాంతాల్లోను సాఫ్ట్వేర్ సంస్థలను రప్పిస్తా - ప్రతి నియోజకవర్గంలో డిగ్రీ, మెడికల్, ఇంజినీరింగ్ కాలేజీలు ఏర్పాటు చేస్తా. కొండా విశ్వేశ్వర్ రెడి(టీఆర్ఎస్) - సాగునీరు-తాగునీరుకు మొదటి ప్రాధాన్యం - గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలు - రైతులకు గిట్టుబాటు ధరలు, పంటల బీమా, సబ్సిడీపై ఎరువులు అందేలా చొరవ చూపుతా - ప్రాంతీయ అసమానతలపై దృష్టి సారిస్తా - జిల్లా అభివృద్ధికి అడ్డుగోడగా ఉన్న జీవో నెం 111 ఎత్తి వేసేందుకు కృషిచేస్తా. కొండా రాఘవరెడ్డి (వైఎస్సార్ సిపి) అనుకూలం - జిల్లాకు సుపరిచితుడు కావడం - వైఎస్ చేపట్టిన సంక్షేమ పథకాలు - మైనార్టీల మద్దతు - తెలంగాణేతరుల అండదండలు - ఓటర్లను ఆకట్టుకోవడంలో దిట్ట ప్రతికూలం - ప్రత్యర్థులు ఆర్థికంగా స్థితిమంతులు కావడం - జిల్లా బీడు భూములను సస్యశ్యామలం చేసే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలు, చేవెళ్ల- ప్రాణహిత ప్రాజెక్టులకు పెద్ద పీట వేస్తా - చేవెళ్ల, వికారాబాద్, తాండూరుకు మంజీరా.. రాజేంద్రనగర్, మహేశ్వరానికి కృష్ణాజలాలు అందేలా చర్యలు తీసుకుంటా - బీజాపూర్-హైదరాబాద్ రహదారి విస్తరణకు కృషి చేస్తా - మారుమూల నియోజకవర్గాల అభివృద్ధికి ఎంపీ ల్యాడ్స్‌ను వినియోగిస్తా - ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కరిస్తా నియోజకవర్గం ఏర్పడింది : 2009 ప్రస్తుత ఎంపీ : సూదిని జైపాల్‌రెడ్డి (కాంగ్రెస్) ప్రస్తుత రిజర్వేషన్ : జనరల్ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే అసెంబ్లీ స్థానాలు: చేవెళ్ల(ఎస్సీ), తాండూరు, పరిగి, వికారాబాద్ (ఎస్సీ), రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, మహేశ్వరం నియోజకవర్గ ప్రత్యేకతలు: దక్కన్ పీఠభూమిలోనే అత్యంత ఎత్తయిన ప్రాంతం. ఉద్యాన పంటలు, నాపరాతి పరిశ్రమలు, ప్రపంచంలో అరుదైన సుద్దగనులకు ప్రసిద్ధి. చిలుకూరు బాలాజీ దేవాలయం, అనంతగిరి కొండలు, హైటెక్‌సిటీ, శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం. ప్రధాన అభ్యర్థులు వీరే పట్లోళ కార్తీక్‌రెడ్డి (కాంగ్రెస్) కొండా రాఘవరెడ్డి (వైఎస్సార్సీపీ) తూళ్ల వీరేందర్‌గౌడ్ (టీడీపీ) కొండా విశ్వేశ్వర్‌రెడ్డి (టీఆర్ఎస్) మొత్తం ఓటర్లు : 20,56,731 పురుషులు 10,83,080 మహిళలు 9,73,104 ఇతరులు 547 డోకూరి వెంకటేశ్వర్ రెడ్డి: ఈ సారి లోక్‌సభ బరిలో నిలిచినవారంతా కొత్తవారే. తొలిసారి ఎన్నికల బరిలోకి దిగిన ప్రధాన పార్టీల అభ్యర్థులు నలుగురు రాజకీయ వారసులే. మాజీ హోంమంత్రులు సబితా ఇంద్రారెడ్డి, దేవేందర్‌గౌడ్ తనయులు కార్తీక్‌రెడ్డి(కాంగ్రెస్), వీరేందర్‌గౌడ్(టీడీపీ), మాజీ ఉప ముఖ్యమంత్రి కేవీ రంగారెడ్డి కుటుంబీకులు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి(టీఆర్ఎస్), కొండా రాఘవరెడ్డి(వైఎస్సార్సీపీ)ఈ ఎన్నికల్లో తలపడుతున్నారు. అంతుచిక్కని అంతరంగం గత ఎన్నికల్లో ద్విముఖ పోటీ జరగ్గా .. ఈసారి మాత్రం చతుర్ముఖ పోటీ నెలకొంది. యువనేతల రాజకీయ ప్రవేశంతో టీడీపీ, కాంగ్రెస్‌లు నువ్వా నేనా! అన్నట్లు ప్రచారపర్వాన్ని కొనసాగిస్తుండగా, బడా వ్యాపార వేత్తను బరిలోకి దింపిన టీఆర్ఎస్ విజయం తమదేనని విశ్వసిస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చాపకిందనీరులా ఓటర్లను ప్రసన్నం చేసుకుంటూ ప్రధా న పార్టీలకు ముచ్చెమటలు పట్టిస్తోంది. ‘తెలంగాణ ఇచ్చింది.. తెచ్చింది తామే’నని కాంగ్రెస్ అభ్యర్థి కార్తీక్‌రెడ్డి ప్రజల్లోకి వెళుతున్నారు. టీడీపీ, బీజేపీతో జతక ట్టినందువల్ల మైనార్టీలు తమవైపు మొగ్గుచూపుతారని ఆశిస్తున్నారు. వలసలతో టీడీపీ నీరసం.. టీడీపీ మాత్రం పట్టణ ఓటర్లపై నమ్మకం పెట్టుకుంది. గ్రామీణ ప్రాంతాల్లో టీఆర్ఎస్ బలపడడం, తమ పార్టీలోని కీలక నేతలు కారెక్కిన నేపథ్యంలో ఆ పార్టీ ఇక్కడ బలహీనపడింది. గ్రామీణ సెగ్మెంట్ల కంటే అత్యధిక ఓట్లు ఉన్న శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, మేహశ్వరం పట్టణాలపై దృష్టి పెడుతోంది. తన తండ్రి దేవేందర్‌గౌడ్‌కు జిల్లా ప్రజలతో ఉన్న సంబంధాలు కలిసివస్తాయని, గ్రామీణ నియోజకవర్గాల్లోనూ ఈ ప్రభావం ఉంటుందని వీరేందర్‌గౌడ్ విశ్వసిస్తున్నారు. బీజేపీతో పొత్తు, మోడీ హవా తమకు లాభిస్తాయని అంచనా వేస్తున్నారు. 2009లో ఇక్కడ బిజేపీకి లక్ష 30వేలు ఓట్లు వచ్చాయి. ఈసారి ఆ ఓట్లు తమ ఖాతాలో పడతాయని ఆశిస్తున్నారు. పేదల ‘కొండ’త అండ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొండా రాఘవరెడ్డి ప్రచారంలో ముందున్నారు. మైనార్టీల సంక్షేమం, జిల్లా అభివృద్ధి వైఎస్ హయాంలోనే జరిగిందనే అంశా న్ని ప్రచారాస్త్రంగా మలుచుకొని ప్రజాక్షేత్రంలోకి వెళ్లా రు. ప్రతి పేద కుటుంబం వైఎస్ హయాంలో లబ్ధి పొందిందని, వారి ఆశీర్వచనాలే ‘కొండ’ంత అండ అని రాఘవరెడ్డి విశ్వసిస్తున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో సీమాంధ్ర ఓటర్లకు భద్రతకు భరోసా కల్పించేది తమ పార్టీయేనని ఆయన చెబుతున్నారు. మూడు నియోజకవర్గాల్లో ప్రభావశీలంగా ఉన్న మైనార్టీ ఓటర్లు తమకు మద్దతుగా నిలుస్తారని వైఎస్సార్ సీపీ అంచనా వేస్తోంది. ఇది కాంగ్రెస్ పార్టీని కలవరపరుస్తోంది. గులాబీ జోరు.. ఒకప్పుడు నామమాత్రంగా ఉన్న టీఆర్ఎస్..ప్రస్తుతం బలీయంగా తయారైంది. బడా వ్యాపారవేత్త, జస్టిస్ మాధవరెడ్డి కుమారుడు విశ్వేశ్వర్‌రెడ్డిని బరిలోకి దించడం ద్వారా ప్రత్యర్థి పార్టీలను కలవరపెడుతుంది. నాలుగు నెలల ముందే ప్రచారంలోకి దిగిన విశ్వేశ్వర్... టీడీపీ కీలక నేతలైన హరీశ్వర్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, రత్నం తదితరులను గులాబీ గూటికి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించి ఆ పార్టీ నడ్డి విరిచారు. దీంతో గ్రామీణ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ పట్టుసాధించింది. గెలుపోటముల మీద ప్రభావం చూపే శివారు నియోజకవర్గాల్లో మాత్రం ఆ పార్టీకి ఆశించిన స్థాయిలో ఆదరణ లభించ డంలేదు. పోల్ పదనిసలు...రెండంచుల ‘కత్తి’ కత్తికి రెండు వైపులా పదునున్నట్లుగా ఈయనకు మాత్రం రెండు పార్టీల నుంచి బీ ఫారమ్‌లు దక్కాయి. టీఆర్ఎల్డీ ప్రకటించిన జాబితాలో కత్తి వెంకటస్వామిగౌడ్ పేరును ప్రకటించారు. తీరా అదే సమయానికి ఆయనను వరంగల్ జిల్లా నర్సంపేట కాంగ్రెస్ అభ్యర్ధిగా ఆ పార్టీ ప్రకటించడంతో అందరూ నోరెళ్లబెట్టారు. టీజేఏసీలో, తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన కత్తి వెంకటస్వామిగౌడ్ ఒక దశలో టీఆర్ఎస్ నుంచి వరంగల్ తూర్పు టికెట్ ఆశిస్తున్నట్లు వినిపించింది. కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాలో ముందు నర్సంపేట నుంచి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు దొంతి మాధవరెడ్డికి స్థానం కల్పించారు. రాత్రికి రాత్రే మారిన సమీకరణల్లో దొంతిని తప్పించి కత్తి వెంకటస్వామిగౌడ్కు కాంగ్రెస్ అభ్యర్థిగా అవకాశం కల్పించారు. ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగానే బరిలో ఉన్నారు. -న్యూస్‌లైన్,వరంగల్ ఇక్కడా.. అక్కడా కపిలవాయి...! తెలంగాణ రాష్ట్రీయ లోక్‌దళ్ (టీఆర్ఎల్డీ) తరపున మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్‌కుమార్ రెండు చోట్లా పోటీ చేస్తున్నారు. వరంగల్ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి, నల్గొండ జిల్లా భువనగిరి పార్లమెంట్ స్థానంలోనూ అభ్యర్థిగా ఉన్నారు. ఇప్పటి వరకు భువనగిరి పార్లమెంట్ స్థానంలోని నియోజకవర్గాలపైనే గురి పెట్టారు. నల్గొండ, వరంగల్ జిల్లాల్లోని సెగ్మెంట్లలో ప్రచారం చేశారు. వరంగల్ పశ్చిమ అసెంబ్లీ స్థానంలో ఆయన తరఫున పార్టీ నేతలు ప్రచారం చేస్తున్నారు. ఈ రెండు చోట్లా దిలీప్ కుమార్‌కు ఒకే గుర్తు కేటాయించడం విశేషం. పార్టీకి ఇక్కడ గుర్తు లేకపోవడంతో స్వతంత్రుల తరహాలోనే గుర్తును కేటాయించారు. భువనగిరి ఎంపీ స్థానంలో, వరంగల్ పశ్చిమ అసెంబ్లీ సెగ్మెంట్లో ఆయన బోరింగ్ గుర్తును కేటాయించారు. -న్యూస్‌లైన్,హన్మకొండ చీపురుకట్టలకు భలే గిరాకీ వేసవి కాలంలో రంజన్లకు, వానాకాలంలో గొడుగులకు, చలికాలంలో స్వెటర్లకు గిరాకీ దొరికినట్లే ప్రస్తుత ఎన్నికల సీజన్లో చీపురు కట్టలకు గిరాకీ దొరుకుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థుల గుర్తు చీపురుకట్ట కావడంతో రోడ్డు వెంట కనిపిస్తోన్న చీపురు కట్టలన్నీ అమ్ముడుబోతున్నాయి. ఏలూరు ప్రాంతం నుంచి చీపురు కట్టలు తెచ్చి విక్రయిస్తున్నారు. ఎన్నికల పుణ్యమా అని ఎప్పుడూ లేని విధంగా కట్టలకు డిమాండ్ పెరిగింది. దీంతో విక్రయదారులు ఆనందిస్తున్నారు. -న్యూస్‌లైన్, పెద్దపల్లి దేవుడా... నీదే భారం! ఒకవైపు ప్రచారానికి గడువు సమీపిస్తుండడంతో అభ్యర్థుల్లో టెన్షన్ పెరిగి దేవుడినే నమ్ముకున్నారు. ప్రచార పర్వంలో ఏ గ్రామానికి వెళ్ళినా ముందుగా ఆ గ్రామ దేవతను దర్శించుకోవడం..ముఖ్యమైన ప్రార్థనా స్థలాలుంటే అక్కడ ప్రత్యేక పూజలు చేయడం జరుగుతోంది. అందులో భాగంగానే వర్నీ మండలం మోస్రాలో గల రామాలయాన్ని ప్రముఖ నాయకులు దర్శించుకుంటున్నారు. నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి మధు యాష్కీ, పీసీసీ మాజీ చీఫ్ డి.శ్రీనివాస్, మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి, బాన్సువాడ టీఆర్ఎస్ అభ్యర్థి పోచారం, కాసుల బాల్‌రాజ్‌తో పాటు జహీరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షట్కార్ దర్శించుకొన్నారు. అలాగే నామినేషన్ మొదలు, ప్రచారం వరకూ ముహూర్తాలపై ఆధారపడుతుండడంతో సిద్ధాంతులు కూడా బిజీగా ఉన్నారు. -న్యూస్‌లైన్, బాన్సువాడ జన తెలంగాణ...వైఎస్ పథకాలు కొనసాగాలి వైఎస్ హయాంలో కొనసాగిన కార్యక్రమాలను తెలంగాణ రాష్ట్రంలోనూ అమలు చేయాలి. గ్రామాల్లో ఆర్ఎంపీల సేవలను వినియోగించుకోవాలి. వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేయకుండా రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి. అమరవీరుల కుటుంబాలకు ఉద్యోగాలివ్వాలి. ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిని నిర్మూలించాలి. అందరికీ బీమా సౌకర్యం కల్పించాలి. -హెచ్.పి. లకో్ష్మజీ, బెక్కంగూడెం, మహబూబ్‌నగర్ జిల్లా సరికొత్త ప్రణాళికలతో ముందుకెళ్లాలి కొత్త రాష్ట్రం అభివృద్ధి సాధించాలంటే సరికొత్త ప్రణాళికలను రూపొందించాలి. ప్రతి జిల్లాకు ఒక కమిటీ ఏర్పాటు చేసి స్థానిక అవసరాలను గుర్తించాలి. వాటిని నెరవేర్చడానికి చర్యలు తీసుకోవాలి. వివిధ కారణాలవల్ల తెలంగాణ ప్రాంత విద్యార్థులు విద్యాపరంగా ఆశించిన ప్రతిభను కనబర్చడంలేదన్న అభిప్రాయం ఉంది. దేశంలోని మిగతా ప్రాంతాల వారితో పోటీపడే స్థాయిలో విద్యరంగాన్ని తీర్చిదిద్దాలి. తెలంగాణ కోసం ప్రాణత్యాగాలు చేసిన వారి కుటుంబాలకు న్యాయం చేయాలి. - కె. వెంకటరాజయ్య