Railway platforms
-
ఇక నుంచి ఇవి ప్లాట్‌ఫాంపై అమ్మబడును
న్యూఢిల్లీ: కరోనా వైపరీత్యం వల్ల ముఖానికి మాస్కు, చేతికి గ్లవుజులు, బ్యాగులో శానిటైజర్ తప్పనిసరిగా మారిన విషయం తెలిసిందే. పొరపాటున అవి లేకుండా బయటకు వస్తే అందుకు మూల్యం చెల్లించుకోక తప్పదు. దీనిని నివారించేందుకు రైల్వే శాఖ కొత్త నిర్ణయం తీసుకుంది. రైల్వే ప్లాట్‌ఫామ్స్‌పై ఉండే స్టాల్స్‌లో కరోనా వ్యాప్తి నివారణా వస్తువులను అమ్మాలని నిర్ణయించింది. దీంతో రైల్వే స్టేషన్లలో ఉండే దుకాణదారులు పుస్తకాలు, మందులు, తినుబండారాలతోపాటు ఇక నుంచి కోవిడ్‌ను అడ్డుకునే అత్యవసరాలను కూడా అమ్మనున్నారు. ప్రయాణికులు మాస్కులు వంటివి ఇంట్లోనే మర్చిపోయినప్పుడు స్టేషన్లో కొనుక్కొని జాగ్రత్తలు పడే వీలుంటుందని తెలిపింది. (బ్రేక్‌డౌన్ కాదు.. లాక్డౌన్ !) రైళ్లలో ప్రయాణికుల భద్రత దృష్ట్యా, కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది. అయితే ఎమ్మార్పీ ధరకు మాత్రమే వాటిని అమ్మాల్సి ఉంటుందని, ఒక్క పైసా కూడా అధికంగా వసూలు చేసేందుకు వీలు లేదని దుకాణదారులను హెచ్చరించింది. ఇక వీటితోపాటు బెడ్‌రోల్ కిట్ కూడా అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపింది. ఇందులో ఒక దిండు, దిండు కవర్, దుప్పటి, ఫేస్ టవల్ ఉంటాయి. ఇవన్నీ కూడా తప్పనిసరిగా నాణ్యతతో ఉండాలని రైల్వే శాఖ స్పష్టం చేసింది. కాగా ఏసీ బోగీల్లో ప్రయాణించే వారికి భారతీయ రైల్వే శాఖ సాధారణంగా దుప్పట్లు, కర్టన్లు వంటివి ఏర్పాటు చేస్తుంది. కానీ వైరస్ కారణంగా ఆ సౌకర్యాన్ని ఎత్తివేసిన విషయం తెలిసిందే. (వలస కష్టం కాటేసింది పసివాడిని వీడేసింది) -
బిస్వాల్ చిత్రం.. రైల్వే స్టేషన్లకు జీవం!
భారతీయులకు, రైళ్లకు విడదీయరాని అనుబంధం ఉంది. మన చరిత్రలోనూ, పుస్తకాల్లోనూ, సినిమాల్లోనూ ఇవి భాగం. ఒకచోటు నుంచి మరో చోటుకి రోజూ లక్షల మందిని సురక్షితంగా చేర్చేవి రైళ్లే. వీటిలో ప్రయాణం కంటే సదుపాయంగా మరే ప్రయాణమూ ఉండదంటే అతిశయోక్తి కాదు. అందుకే, భారతీయ చిత్రాల్లో రైళ్లకు ప్రముఖ స్థానం కల్పించారు. పదుల సంఖ్యలో సినిమాలు రైలు నేపథ్యంలోనే తెరకెక్కాయి. హిట్లు కూడా కొట్టాయి. షారుఖ్, కాజోల్లపై చిత్రించిన ప్రఖ్యాత ‘దిల్వాలే..’ స్లోమోషన్ సీన్ దీనికి నిదర్శనం. నేటికీ ఆ సీన్‌కు దాసోహమంటారు సినీ అభిమానులు. సినిమాల తర్వాత అంతటి స్థాయిలో రైల్వేకు పేరు తీసుకొచ్చింది మాత్రం బిజయ్ బిస్వాలే అంటారు నాగ్‌పూర్ డివిజన్లో అతనితో కలిసి పనిచేసినవారు. రైల్వేలో చీఫ్ టికెట్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న బిస్వాల్.. తన వృత్తిని ఎంతగా ప్రేమించారో ఆయన గీసిన చిత్రాలను చూసి చెప్పొచ్చు. నిజంగా పెయింటింగేనా.. అనిపించేంత సహజంగా ఉంటాయి ఆ చిత్రాలు. చల్లగా కురుస్తున్న చిరుజల్లుల్లో ట్రైన్ కోసం పరుగుపెట్టే సాధారణ ప్రజానీకాన్ని బిస్వాల్ కుంచె చిత్రిస్తుంటే చూసి తరించాల్సిందే. రైల్వే ప్లాట్‌ఫామ్‌లు, అక్కడి వాతావరణం ఆయన బుర్రలో ఎంతగా ముద్రించుకుపోయిందో తెలుపుతాయా చిత్రాలు. ప్రత్యేకించి ఎవరివద్దా శిష్యరికం చేయని బిస్వాల్.. చిన్ననాటి నుంచే చిత్రలేఖనం వైపు ఆకర్షితుడయ్యాడు. అలా ఓ వైపు చిత్రాలు గీస్తూనే మరోవైపు రైల్వేలో ఉద్యోగం సంపాదించాడు. కానీ, ఏనాడూ చిత్రలేఖనాన్ని సీరియస్‌గా తీసుకోలేదు. అలాగని దాన్ని వృత్తిగా ఎంచుకోవాల్సిన అవసరమూ ఆయనకు రాలేదు. కానీ, 2011 నుంచి మాత్రం చిత్రలేఖనంపై ఆయన అభిప్రాయం మారిపోయింది. రోజూ సాధన చేయడం మొదలు పెట్టాడు. ఆ కళపై ఎంతటి పట్టు సాధించాడంటే.. అతడి పెయింటింగ్‌లను చూసి మన కళ్లను మనమే నమ్మలేనంత స్థాయికి ఎదిగాడు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా తిరిగి తన చిత్రరాజాలను ప్రదర్శిస్తున్నాడు. వీటిని చూశాక మాత్రం ఆయనకు రైల్వేలపై ఎంత ప్రేమో అనిపించకమానదు. ముఖ్యంగా, బహిరంగంగా ఉండే రైల్వే స్టేషన్లను గీయడంలో ఆయనను మించినవారు లేరు. ప్లాట్‌ఫామ్ పరిసరాలను అత్యంత సహజంగా తీసుకువస్తారాయన. ప్రస్తుతం ఆయన కోరిక షిమ్లా లాంటి ప్రాంతాల్లో పర్యటించాలనీ, అక్కడి చిన్న చిన్న స్టేషన్లను చిత్రించాలనీ..! అది నెరవేరాలని కోరుకుందాం..!! -
ఎన్నో ఏళ్ల తర్వాత కన్నవారిని కలుసుకున్న చిన్నారులు
ఉద్వేగం..ఉద్విగ్నం కన్నీటి పర్యంతమైన తల్లిదండ్రులు, పిల్లలు జువైనల్ హోంలో పలువురిని తల్లిదండ్రులకు అప్పగించిన అధికారులు సైదాబాద్: చెడు వ్యసనాలకు బానిసై ఇంటినుంచి పారిపోయి వచ్చిన వారు కొందరు...తల్లిదండ్రులు పనికి పంపిస్తున్నారని మరికొందరు..ఇంట్లో కొడుతున్నారని ఇంకొందరు.. ఇలా పలు కారణాలతో తల్లిదండ్రులకు దూరమై రైల్వే ఫ్లాట్‌ఫాంలపై జీవించి, చివరకు జువైనల్ హోంకు వచ్చిన బాలలు పలువురు బుధవారం తల్లిదండ్రుల చెంతకు చేరారు. ఎన్నో ఏళ్ల తరువాత పిల్లలను కలుసుకున్న తల్లిదండ్రులు ఉద్వేగానికిలోనై బోరున ఏడ్చేశారు. పిల్లలు సైతం ఏడుస్తూ తల్లిదండ్రులను చుట్టేశారు. ఈ భావోద్వేగ సంఘటనలు చూసి అధికారులు సైతం కన్నీటి పర్యంతమయ్యారు. సైదాబాద్‌లోని బాలల సదనంలో సాథీ, ఆశ్రీత స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో బుధవారం చిన్నారులను తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. ఈ సందర్భంగా సదనం నుంచి బయటకు వెళ్తున్న బాలలందరికీ ప్రముఖ వ్యాపారవేత్త శశికాంత్ అగర్వాల్ కొత్త దుస్తులు అందించారు. చెడుదారి పట్టిన తమను మార్చి, విద్యాబుద్ధులు చెప్పించిన బాలల సదనం అధికారుల మేలు ఎప్పటికీ మర్చి పోలేమని కొంతమంది చిన్నారులు రోదిస్తూ చెప్పారు. అనంతరం జరిగిన సమావేశంలో జువైనల్‌హోం డెరైక్టర్ వి. భాస్కరాచారి మాట్లాడుతూ మొత్తం 32 మంది బాలలను తల్లిదండ్రుల వద్దకు పంపేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. కార్యక్రమంలో రైల్వే అధికారి శ్రీనివాస్, చైల్డ్వెల్ఫేర్ కమిటీ మెంబర్ శ్యామలాదేవి, డిప్యూటీ డెరైక్టర్ కుమారస్వామి, డిప్యూటీ సూపరింటెండెంట్ అనిల్‌కుమార్, డాక్టర్ శ్రీనివాస్, అశ్రీత సంస్థ డెరైక్టర్ నాగరాజు, సాథీ సంస్థ నిర్వాహకులు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. పోలీస్ అవుతా: శివ మాది ఈసీఐఎల్ నాగారం. చిన్నప్పుడు మా మవయ్య కొట్టాడని ఇంట్లోంచి పారిపోయి రైల్వేస్టేషన్ చేరుకున్నాను. ఒక రోజు రైల్వే స్టేషన్లో షార్ట్‌సర్క్యూట్‌తో పెద్ద గాయం అయింది. దీంతో పోలీసులు సైదాబాద్ బాలల సదనంలో చేర్పించారు. ఇక్కడ ఎన్నో విషయాలు నేర్చుకున్నా. ఆరేళ్ల తర్వాత కన్నవారిని కలుసుకున్నందుకు సంతోషంగా ఉంది. నేను బాగా చదువకుని పోలీస్ అవుతా. -
ఉద్వేగం..ఉద్విగ్నం!
ఎన్నో ఏళ్ల తరువాత కన్నవారిని కలుసుకున్న చిన్నారులు కన్నీటి పర్యంతమైన తల్లిదండ్రులు, పిల్లలు జువైనల్ హోంలో పలువుర్ని తల్లిదండ్రులకు అప్పగించిన అధికారులు సైదాబాద్: చెడు వ్యసనాలకు బానిసై ఇంటినుంచి పారిపోయి వచ్చిన వారు కొందరు...తల్లిదండ్రులు పనికి పంపిస్తున్నారని మరికొందరు..ఇంట్లో కొడుతున్నారని ఇంకొందరు.. ఇలా పలు కారణాలతో తల్లిదండ్రులకు దూరమై రైల్వే ఫ్లాట్‌ఫాంలపై జీవించి, చివరకు జువైనల్ హోంకు వచ్చిన బాలలు పలువురు బుధవారం తల్లిదండ్రుల చెంతకు చేరారు. ఎన్నో ఏళ్ల తరువాత పిల్లలను కలుసుకున్న తల్లిదండ్రులు ఉద్వేగానికిలోనై బోరున ఏడ్చేశారు. పిల్లలు సైతం ఏడుస్తూ తల్లిదండ్రులను చుట్టేశారు. ఈ భావోద్వేగ సంఘటనలు చూసి అధికారులు సైతం కన్నీటి పర్యంతమయ్యారు. సైదాబాద్‌లోని బాలల సదనంలో సాథీ, ఆశ్రీత స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో బుధవారం చిన్నారులను తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. ఈ సందర్భంగా సదనం నుంచి బయటకు వెళ్తున్న బాలలందరికీ ప్రముఖ వ్యాపారవేత్త శశికాంత్ అగర్వాల్ కొత్త దుస్తులు అందించారు. చెడుదారి పట్టిన తమను మార్చి, విద్యాబుద్ధులు చెప్పించిన బాలల సదనం అధికారుల మేలు ఎప్పటికీ మర్చి పోలేమని కొంతమంది చిన్నారులు రోదిస్తూ చెప్పారు. అనంతరం జరిగిన సమావేశంలో జువైనల్‌హోం డెరైక్టర్ వి. భాస్కరాచారి మాట్లాడుతూ మొత్తం 32 మంది బాలలను తల్లిదండ్రుల వద్దకు పంపేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. కార్యక్రమంలో రైల్వే అధికారి శ్రీనివాస్, చైల్డ్వెల్ఫేర్ కమిటీ మెంబర్ శ్యామలాదేవి, డిప్యూటీ డెరైక్టర్ కుమారస్వామి, డిప్యూటీ సూపరింటెండెంట్ అనిల్‌కుమార్, డాక్టర్ శ్రీనివాస్, అశ్రీత సంస్థ డెరైక్టర్ నాగరాజు, సాథీ సంస్థ నిర్వాహకులు శ్రీనివాస్ పాల్గొన్నారు. పోలీస్ అవుతా మాది ఈసీఐఎల్ నాగారం. చిన్నప్పుడు మా మవయ్య కొట్టాడని ఇంట్లోంచి పారిపోయి రైల్వేస్టేషన్ చేరుకున్నాను. ఒక రోజు రైల్వే స్టేషన్లో షార్ట్‌సర్క్యూట్‌తో పెద్ద గాయం అయింది. దీంతో పోలీసులు సైదాబాద్ బాలల సదనంలో చేర్పించారు. ఇక్కడ ఎన్నో విషయాలు నేర్చుకున్నా. ఆరేళ్ల తర్వాత కన్నవారిని కలుసుకున్నందుకు సంతోషంగా ఉంది. నేను బాగా చదువకుని పోలీస్ అవుతా. -శివ