railway track resumed
-
యుద్ధప్రాతిపదికన ట్రాక్‌ల పునరుద్ధరణ
సాక్షి, పెద్దపల్లి/రామగుండం: ధ్వంసమైన మూడు ట్రాక్‌లను యుద్ధప్రాతిపదికన పునరుద్ధరిస్తున్నారు. ఐరన్ కాయల్స్ లోడ్‌తో వెళుతున్న 44 వ్యాగన్లు ఉన్న గూడ్సు రైలు మంగళవారం రాత్రి రామగుండం–రాఘవాపూర్ రైల్వేస్టేషన్ల మధ్య కన్నాల గేట్ వద్ద పట్టాలు తప్పిన విషయం తెలిసిందే. బుధవారం రాత్రి వరకు ఒక ట్రాక్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేలా పనులు వేగంగా కొనసాగిస్తున్నారు. వందలాదిమంది కూలీలు, భారీయంత్రాలను వినియోగించి పట్టాలపై పడిపోయిన వ్యాగన్లను తొలగించారు. దక్షిణమధ్య రైల్వే జీఎం అరుణ్‌కుమార్ జైన్ క్షేత్రస్థాయిలో పనులను పర్యవేక్షిస్తున్నారు. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, ఎంపీ గడ్డం వంశీకృష్ణ ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. 39 రైళ్లు రద్దు.. 61 రైళ్లు దారిమళ్లింపు కాజీపేట–బల్హార్షా మీదుగా నడిచే 39 రైళ్లను పూర్తిగా, 7 రైళ్లను పాక్షికంగా రద్దు చేసిన అధికారులు.. 61 రైళ్లను దారిమళ్లించారు. మరో 7 రైళ్లను రీషెడ్యూల్ చేశారు. దీంతో ప్రయాణికులు గమ్యస్థానాలు చేరుకునేందుకు ఎలాంటి సౌక ర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వివిధ స్టేషన్లలోని ప్రయాణికులు సమీప ఆర్టీసీ బస్టాండ్లకు చేరుకోవడంతో బస్సులు కిక్కిరిసిపోయాయి. రామగుండం మీదుగా దేశవ్యాప్తంగా నిత్యం ప్ర యాణించేవారు వేల సంఖ్యలో ఉంటారు. టికెట్ రిజర్వేషన్ చేయించుకున్న వారు రైళ్ల రద్దుతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ప్రయాణికులకు సేవలు అందించడం, సమాచారం తెలియజేయడానికి రామగుండం రైల్వేస్టేషన్లో అధికారులు హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేశారు.ప్రమాదాన్ని గుర్తించలేదా? ఇటీవల ట్రాక్‌ల సామర్థ్యం పెంచారు. దీంతో గూడ్సు రైలు ప్రమాదానికి వేగం కారణం కాదని రైల్వే అధికారులు భావిస్తున్నారు. ఉష్ణోగ్రతలు 3 డిగ్రీల సెల్సియస్ కన్నా తక్కు వ ఉంటే పట్టాలు సంకోచ, వ్యాకోచాలకు లోనవుతాయని, ప్రమాద సమయంలో ఉష్ణో గ్రతలు ఆ స్థాయిలో లేవని వారు అంచనా వేస్తున్నారు. రైలు ఇంజిన్ నుంచి తొమ్మిదో నంబరు వ్యాగన్ పట్టాలు తప్పడంతో ఈ ఘటన చోటుచేసుకుందని అంటున్నారు. ప్రమాదాన్ని పసిగట్టని లోకోపైలెట్ వేగం తగ్గించకుండా ముందుకు వెళ్లడంతో పట్టాలు తప్పిన 11 వ్యాగన్లు సుమారు కిలోమీటరు పొడవున అలాగే వెళ్లిపోయాయా? దీంతోనే భారీ నష్టం వాటిల్లిందా? లేదా మరేదైనా కుట్ర ఉందా? అనే కోణంలో డివిజినల్ సేఫ్టీ కమిటీతో పాటు రైల్వే ఇంటెలిజెన్స్ అధికారులు విచారణ జరుపుతున్నారు.దిక్కుతోచడం లేదు మా సొంతూరు వెళ్లేందుకు సంతోషంగా రైలెక్కిన. పెద్దపల్లి నుంచి కరీంనగర్, నిజామాబాద్, నాగపూర్ మీదుగా తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌ను నడిపిస్తే గమ్యస్థానం చేరుకునేవాడిని. రైళ్ల గురించి అడిగితే అధికారులు సమాధానం చెప్పడం లేదు. ఎలా వెళ్లాలో అర్థం కావడం లేదు. – ప్రధాన్, ప్రయాణికుడు, ఝాన్సీ, ఉత్తరప్రదేశ్ 12 గంటల ప్రయాణమైంది దాణాపూర్ ఎక్స్‌ప్రెస్‌లో నాగ్‌పూర్ వెళ్లాలి. స్టేషన్‌కు వచ్చాక రైళ్ల రద్దు విషయం తెలిసింది. రిజర్వేషన్ ప్రయాణికులకు రైల్వేశాఖ సెల్‌నంబర్లు ఇస్తే బాగుంటుంది. బస్సులో నాగ్‌పూర్ వెళ్తున్న. రూ.500 ఖర్చుతో ఆరు గంటల్లో మా ఊరు చేరుకునేవాడిని. రైళ్ల రద్దుతో రూ.2వేల ఖర్చు, 12 గంటల సమయం పడుతుంది. – సత్యం, ప్రయాణికుడు, నాగ్‌పూర్, మహారాష్ట్ర -
ఆ ట్రాక్‌లు సిద్ధం
భువనేశ్వర్: ఒడిశాలో మూడు రైళ్ల ఘోర రైలు ప్రమాదంతో ఛిన్నాభిన్నమైన రైల్వే ట్రాక్‌లను శరవేగంగా పునరుద్ధరిస్తున్నారు. రెండు ప్రధాన ట్రాక్‌లను ఇప్పటికే సిద్ధం చేశారు. వాటిపై తొలుత ఆదివారం రాత్రి వైజాగ్–రూర్కెలా గూడ్సు, అనంతరం సోమవారం ఉదయం వందేభారత్ ప్రయాణించాయి. మూడు రోజులుగా ఘటనా స్థలి వద్దే ఉండి పనులను పర్యవేక్షిస్తున్న రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ చేతులూపి రైళ్లను స్వాగతించారు. కోరమండల్, హౌరా ఎక్స్‌ప్రెస్‌లు, మరో గూడ్స్ రైలు శుక్రవారం రాత్రి ఒడిశాలోని బహనగా బజార్ స్టేషన్ సమీపంలో ఘోర ప్రమాదానికి గురైన మహా విషాదం 275 మందిని బలి తీసుకోవడం తెలిసిందే. దేశాన్ని కలచివేసిన ఈ ప్రమాదంపై రైల్వే శాఖ ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ విచారణ ముమ్మరంగా సాగుతోంది. భువనేశ్వర్ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న కోరమండల్ రైలు డ్రైవర్, అసిస్టెంట్ల స్టేట్మెంట్ను రైల్వే సేఫ్టీ కమిషనర్ (సీఆర్ఎస్) సోమవారం నమోదు చేశారు. డ్రైవర్ కోలుకుని ఐసీయూ నుంచి వార్డుకు మారగా అసిస్టెంట్ తలకు సర్జరీ జరగాల్సి ఉందని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో రైలు డ్రైవర్ల తప్పిదమేమీ లేదని రైల్వే శాఖ ఇప్పటికే ప్రకటించడం, మొత్తం ఉదంతంపై సీబీఐ విచారణకు సిఫార్సు చేయడం తెలిసిందే. 10మంది సభ్యులతో కూడిన బృందం సోమవారం ఘటనా స్థలిని సందర్శించింది. ఇప్పటిదాకా 170 మృతదేహాలను గుర్తించారు. ఒడిశా ప్రభుత్వం వాటిని ఉచితంగా స్వస్థలాలకు తరలిస్తోంది. ప్రమాదంలో మరణించిన, కాళ్లూ చేతులూ పోగొట్టుకున్న పశ్చిమబెంగాల్ వాసుల కుటుంబంలో ఒకరికి ప్రభుత్వోద్యోగం ఇస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. మృతుల సంఖ్య తాజాగా 278కి పెరిగింది. ఒడిశాలో పట్టాలు తప్పిన గూడ్సు ఒడిశాలో సోమవారం మరో రైలు పట్టాలు తప్పింది. బారాఘర్ వద్ద ఓ ప్రైవేట్ కంపెనీకి చెందిన నారో గేజ్ లైన్లో లైమ్లైన్ లోడుతో వెళ్తున్న గూడ్స్ తాలూకు ఐదు బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో ఎవరికీ ప్రాణాపాయం లేదని అధికారులు తెలిపారు. డుంగ్రీ లైమ్‌స్టోర్ గనులకు, బారాఘర్ ఏసీసీ సిమెంట్ ప్లాంట్‌కు మధ్య ఉన్న ఈ లైనుతో రైల్వేకు సంబంధం లేదు. చార్లెస్ సంతాపం ప్రమాదంపై బ్రిటన్ రాజు చార్లెస్–3 సంతాపం తెలిపారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు ఈ మేరకు ఆయన సందేశం పంపారు. ఈ దారుణం తనను, రాణిని తీవ్ర షాక్‌కు గురి చేసిందన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగా ఢ సానుభూతి తెలిపారు. 1980ల్లో తన ఒడిశా పర్యటన తనకెన్నో తీపి గుర్తులు అందించింద ని గుర్తు చేసుకున్నారు. భారత్‌కు తన హృదయ ంలో ప్రత్యేక స్థానముందని చార్లెస్ తెలిపారు. మోదీకి ఖర్గే లేఖాస్త్రం రైల్వేలను ప్రాథమిక స్థాయి నుంచి బలోపేతం చేయకుండా కేవలం పైపై మెరుగులు దిద్దుతూ వార్తల్లో నిలవడంపైనే ప్రధాని మోదీ దృష్టి పెట్టారంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మండిపడ్డారు. ప్రమాదానికి అసలు కారణాలను బయట పెట్టాలంటూ మోదీకి లేఖ రాశారు. ‘‘నేరాలను దర్యాప్తు చేసే సీబీఐ రైలు ప్రమాదం విషయంలో ఏం చేస్తుంది? సాంకేతిక, వ్యవస్థాగత, రాజకీయ వైఫల్యాలను సీబీఐ నిగ్గుదేల్చగలదా?’’ అని ప్రశ్నించారు. ప్రమాద మార్గంలో ట్రాక్ పునరుద్ధరణ తర్వాత వెళ్తున్న రైళ్లు . శిథిలాలు కన్పించకుండా కట్టిన తెరలు -
సాయంత్రం నుంచి రైళ్లు నడిపే యత్నం
విశాఖపట్నం: హుదూద్ తుపాన్ నేపథ్యంలో రైల్వే ట్రాక్ పునరుద్దరణకే మొదటి ప్రాధాన్యమిస్తామని దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులు మంగళవారం వెల్లడించారు. ఈ రోజు సాయంత్రం విశాపట్నం నుంచి వివిధ ప్రాంతాలకు రైళ్లను నడిపేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. అందులోభాగంగా జిల్లాలోని ఎలమంచిలి వద్ద రైల్వే ట్రాక్‌కు సంబంధించిన మరమ్మతు పనులు చురుగ్గా సాగుతున్నాయని వివరించారు. అలాగే రైల్వే ట్రాక్‌ను పూర్తిగా తనిఖీ చేస్తున్నట్లు చెప్పారు. అలాగే కాకినాడ నుంచి హైదరాబాద్, రాజమండ్రి నుంచి తిరుపతికి ప్రత్యేక రైళ్లు నడుపుతున్నటు తెలిపారు.