సాయంత్రం నుంచి రైళ్లు నడిపే యత్నం
విశాఖపట్నం: హుదూద్ తుపాన్ నేపథ్యంలో రైల్వే ట్రాక్ పునరుద్దరణకే మొదటి ప్రాధాన్యమిస్తామని దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులు మంగళవారం వెల్లడించారు. ఈ రోజు సాయంత్రం విశాపట్నం నుంచి వివిధ ప్రాంతాలకు రైళ్లను నడిపేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు.
అందులోభాగంగా జిల్లాలోని ఎలమంచిలి వద్ద రైల్వే ట్రాక్కు సంబంధించిన మరమ్మతు పనులు చురుగ్గా సాగుతున్నాయని వివరించారు. అలాగే రైల్వే ట్రాక్ను పూర్తిగా తనిఖీ చేస్తున్నట్లు చెప్పారు. అలాగే కాకినాడ నుంచి హైదరాబాద్, రాజమండ్రి నుంచి తిరుపతికి ప్రత్యేక రైళ్లు నడుపుతున్నటు తెలిపారు.