railwayline
-
మంత్రాలయం రైల్వేలైన్‌కు రీసర్వే
ఎంపీ బుట్టా రేణుక అభ్యర్థనను అంగీకరించిన రైల్వే అధికారులు కర్నూలు (ఓల్డ్‌సిటీ): కర్నూలు నుంచి మంత్రాలయం రైల్వేలైన్ పనులకు రీసర్వే చేపట్టాలంటూ ఎంపీ బుట్టా రేణుక చేసిన అభ్యర్థనపై రైల్వే శాఖ అధికారులు స్పందించారు. బుధవారం ఎంపీ దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్) జనరల్ మేనేజర్ వినోద్కుమార్యాదవ్ను సికింద్రాబాద్‌లోని ఆయన కార్యాలయంలో కలిశారు. కర్నూలు–మంత్రాలయం రైల్వేలైన్ రీసర్వే పనులు త్వరలో ప్రారంభించనున్నట్లు జీఎం.. ఎంపీకి హామీ ఇచ్చారు. అలాగే డోన్ పట్టణంలోని 150, 166 రైల్వే గేట్లను ప్రజల సౌకర్యార్థం యథావిధిగా కొనసాగించాలనే అభ్యర్థనపై జీఎం సానుకూలంగా స్పందించారు. భవిష్యత్తులో ఇబ్బంది కలగకుండా ఉండేందుకు కూడా చర్యలు చేపట్టనున్నట్లు హామీ ఇచ్చారు. ఎంపీ అభ్యర్థన మేరకు బెంగుళూరు–యశ్వంత్‌పుర రైలును మద్దికెర రైల్వే స్టేషన్లో ఆపే సదుపాయం కల్పించనున్నట్లు జీఎం ప్రకటించారు. ఈ మేరకు బుధవారం ఎంపీ కార్యాలయం నుంచి ఒక పత్రికా ప్రకటన వెలువడింది. -
ఎంపీ కృషి తోనే మంత్రాలయం రైల్వే లైన్ రీసర్వే
– వైఎస్ఆర్సీపీ కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త హఫీజ్ ఖాన్ కర్నూలు(ఓల్డ్‌సిటీ): మంత్రాలయం-కర్నూలు రైల్వే లైన్ రీసర్వేకు కేంద్ర ప్రభుత్వం అంగీకారం కర్నూలు ఎంపీ బుట్టా రేణుక కృషి వల్లే సాధ్యమైందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త హఫీజ్‌ఖాన్ అన్నారు. శనివారం సాయంత్రం ఆయన స్థానిక రాయల్ ఫంక్షన్ హాల్లోని ఆ పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాష్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తెర్నేకల్ సురేందర్‌రెడ్డితో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎమ్మిగనూరు ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి రైల్వే లైన్ రీసర్వే ముఖ్యమంత్రి కృషి వల్లే జరిగిందన్నట్లు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. 2015 అసెంబ్లీ సమావేశాల్లో తాను మాట్లాడిన అంశాన్ని తీర్మానం చేసి పార్లమెంట్‌కు పంపారనేది సత్య దూరమన్నారు. 2010లో సర్వే చేసినప్పుడు ఫిజిబిలిటీ లేదనే నివేదిక కేంద్రానికి అందిందన్నారు. అయితే మంత్రాలయం రూట్లో ట్రాఫిక్ పెరగడంతో పాటు భక్తుల సంఖ్య అధికంగా ఉన్న నేపథ్యంలో రైల్వే లైన్ వేయాలని కర్నూలు పార్లమెంటు సభ్యురాలు బుట్టా రేణుక 2014 నుంచి ప్రయత్నాలు ప్రారంభించారని తెలిపారు. ఎన్నోసార్లు ప్రభుత్వానికి, మంత్రుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు ప్రధానికీ విన్నవించారన్నారు. త్వరలో రూ.280 కోట్లతో రైల్వే కోచ్ రిపేరీ ఫ్యాక్టరీ కూడా ప్రారంభం కానుందన్నారు. మనకు రావాల్సిన వాటా ఎందుకు అడగరు.. తుంగభద్ర నుంచి మనకు రావాల్సిన నీటి వాటాను ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి గానీ, టీడీపీ నాయకులు గానీ బళ్లారికి పోయి ఎందుకు అడగడం లేదని మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాశ్‌రెడ్డి ప్రశ్నించారు. అలాంటప్పుడు మంత్రాలయం-కర్నూలు రైల్వే లైన్ రీసర్వే తామే చేయించామని చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. జిల్లా ప్రజలపై ప్రేమ ఉంటే కర్ణాటక ప్రభుత్వంతో ఎందుకు సంప్రదింపులు జరుపలేకపోయారో సమాధానం చెప్పాలన్నారు. విలేకరుల సమావేశంలో పార్టీ పార్టీ రాష్ట్ర నాయకులు ఎస్.ఎ.రహ్మాన్, సి.హెచ్.మద్దయ్య తదితరులు పాల్గొన్నారు. -
23న నంద్యాల–ఎర్రగుంట్ల రైల్వేలైన్ ప్రారంభం
నంద్యాల: నంద్యాల–ఎర్రగుంట్ల రైల్వే లైన్‌ను ఈనెల 23వ తేదీ కేంద్ర రైల్వే మంత్రి సురేష్‌ప్రభు విజయవాడ నుంచి రిమోట్‌తో ప్రారంభించడానికి ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు రైల్వే శాఖ ఉన్నతాధికారులు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. మంత్రి సురేష్ ప్రభు విజయవాడ రైల్వే భవన్‌కు చేరుకొని మధ్యాహ్నం 3 గంటల నుంచి 3.45 గంటల మధ్యన నంద్యాల–ఎర్రగుంట్ల నూతన రైల్వే లైన్‌ను రిమోట్‌తో ప్రారంభిస్తారు. తర్వాత ఈ రైలు మార్గంపై తిరిగే నంద్యాల–కడప డెమో రైలును ప్రారంభిస్తారు. రైల్వే మంత్రి పర్యటన ఖరారు కావడంతో రైల్వే స్టేషన్లో ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. చెన్నైలోని ఇంట్రాగెల్ కోచ్‌ఫ్యాక్టరీలో తయారైన నూతన డెమో రైలు నంద్యాలకు చేరుకుంది. ఇందులో 8 బోగీలు ఉన్నాయి. ఒక్కో బోగీలో 80 మంది చొప్పున దాదాపు 600 మంది కూర్చుకొనే అవకాశం ఉంది. ఈ రైలును మంత్రి సురేష్‌ప్రభు ప్రారంభిస్తారు. తర్వాత 24 నుంచి నిర్ణీత షెడ్యూల్ ప్రకారం ప్రతి రోజూ నంద్యాల–కడప మధ్య నాలుగు ప్యాసింజర్ రైలు తిరుగుతాయి. మంత్రి సురేష్‌ప్రభు రిమోట్‌తో నంద్యాల–ఎర్రగుంట్ల రైల్వే లైన్‌ను ప్రారంభించడానికి స్థానిక రైల్వే స్టేషన్లో ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. -
రైల్వేలైన్ శంకుస్థాపనతో టీఆర్ఎస్ సంబరాలు
కరీంనగర్‌సిటీ : కొత్తపల్లి–మనోహరాబాద్ రైల్వేలైన్ నిర్మాణానికి ఆదివారం ప్రధాని నరేంద్రమోదీ శంకుస్థాపన చేయడంతో జిల్లా కేంద్రంలో టీఆర్ఎస్ నాయకులు సంబరాలు చేసుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, ఎంపీ వినోద్‌కుమార్ రెండేళ్లుగా కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రాష్ట్ర భాగస్వామ్యంతో లైన్ నిర్మాణానికి పచ్చ జెండా ఊపారన్నారు. పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎడ్ల అశోక్ ఆధ్వర్యంలో తెలంగాణచౌక్‌లో టపాసులు పేల్చారు. టీఆర్ఎస్వై జిల్లా అధ్యక్షుడు కట్ల సతీశ్, మైనార్టీ జిల్లా అధ్యక్షుడు అక్బర్‌హుస్సేన్, ఎంపీపీ వాసాల రమేశ్, కార్పొరేటర్లు వై.సునీల్‌రావు, బోనాల శ్రీకాంత్, నాయకులు బోనాల రాజేశం, కన్న కృష్ణ, జక్కుల నాగరాజు, మైఖేల్ శ్రీనివాస్, దండబోయిన రాము, పెండ్యాల మహేశ్, జక్కం నర్సయ్య పాల్గొన్నారు.